
యూపీ అసెంబ్లీకి ఎన్నికైన ఎస్పీ నేత ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం ఎన్నికను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది.
లక్నో : ఎస్పీ నేత ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూపీ అసెంబ్లీకి ఆయన ఎన్నికను అలహాబాద్ హైకోర్టు సోమవారం రద్దు చేసింది. యూపీలోని రాంపూర్ జిల్లా సోర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అబ్దుల్లా ఆజం 2017 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ వయసు ధృవీకరణ పత్రాలను సమర్పించాడని పేర్కొంటూ ఆయన ఎన్నికను హైకోర్టు కొట్టివేసింది. 2017లో ఎన్నికలు నిర్వహించిన సమయంలో అబ్దుల్లా వయసు 25 సంవత్సరాల లోపేనని, నకిలీ పత్రాలతో ఆయన ఎన్నికల బరిలో దిగారని కోర్టు పేర్కొంది. ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకైనా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి.