లక్నో: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కీలక నేత ఆజాం ఖాన్‌కు షాక్ ఇచ్చింది కోర్టు. ద్వేషపూరిత ప్రసంగం ఆరోపణల కేసులో దోషిగా తేల్చింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఉత్తర్‌ప్రదేశ్ రామ్‌పుర్ కోర్టు ఆజాం ఖాన్‌కు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. దాంతో పాటు రూ.25వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, అప్పటి ఐఏఎస్ అధికారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఆజాం ఖాన్‌పై కేసు నమోదైంది. తాజాగా విచారణ జరిపిన కోర్టు దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది.
ఓ చీటింగ్ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఈ ఏడాది మే నెలలోనే జైలు నుంచి విడుదలయ్యారు ఆజాం ఖాన్. సుమారు రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. అయితే, మరోమారు ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో దోషిగా తేలటం కీలకంగా మారింది. నేరం రుజువైన తర్వాత రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే.. అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఆజాం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో ఆయన తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆజాం ఖాన్‌పై అవినీత, దోపిడి వంటి 90 రకాల కేసులను నమోదు చేసింది.
ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు!
Comments
Please login to add a commentAdd a comment