Hate speech case
-
ఆజం ఖాన్‌కు మరో కేసులో రెండేళ్ల జైలు
రాంపూర్: 2019 నాటి రెచ్చగొట్టే ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్(74)కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు జడ్జి శోభిత్ బన్సల్ శనివారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ మిలక్ కొత్వాలీ ప్రాంతం ఖటనగరియా గ్రామంలో బహిరంగ సభలో చేసిన విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో, ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటుపడింది. ఆ తీర్పును సెషన్స్ కోర్టు కొట్టివేసింది. పలు కేసుల్లో దోషిగా ఉన్న ఆజంఖాన్ 27 నెలల పాటు జైలులో ఉన్నారు. 2022 మేలో సుప్రీంకోర్టు ఆజం ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
సైకిల్ పార్టీ కీలక నేతకు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఎమ్మెల్యే పదవికి ఎసరు!
లక్నో: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కీలక నేత ఆజాం ఖాన్‌కు షాక్ ఇచ్చింది కోర్టు. ద్వేషపూరిత ప్రసంగం ఆరోపణల కేసులో దోషిగా తేల్చింది. ఈ కేసులో విచారణ చేపట్టిన ఉత్తర్‌ప్రదేశ్ రామ్‌పుర్ కోర్టు ఆజాం ఖాన్‌కు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. దాంతో పాటు రూ.25వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, అప్పటి ఐఏఎస్ అధికారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఆజాం ఖాన్‌పై కేసు నమోదైంది. తాజాగా విచారణ జరిపిన కోర్టు దోషిగా తేల్చుతూ తీర్పు వెలువరించింది. ఓ చీటింగ్ కేసులో సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఈ ఏడాది మే నెలలోనే జైలు నుంచి విడుదలయ్యారు ఆజాం ఖాన్. సుమారు రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. అయితే, మరోమారు ద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో దోషిగా తేలటం కీలకంగా మారింది. నేరం రుజువైన తర్వాత రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే.. అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఆజాం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో ఆయన తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆజాం ఖాన్‌పై అవినీత, దోపిడి వంటి 90 రకాల కేసులను నమోదు చేసింది. ఇదీ చదవండి: ‘అదే మా లక్ష్యం’.. పీఓకేపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు! -
యాంటీ టెర్రర్ యాక్ట్.. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధం!
ఇస్లామాబాద్: పాక్ రాజకీయాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పీటీఐ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(69).. ఉగ్రవాద చట్టంలో బుక్కయ్యారు. దీంతో ఏ క్షణంలోనైనా ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం ఇస్లామాబాద్ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. పోలీసింగ్, న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఆయన వ్యాఖ్యలు ఆ వ్యవస్థలను బెదిరించేవిగా ఉన్నాయని పేర్కొంటూ పాక్ యాంటీ-టెర్రరిజం యాక్ట్ సెక్షన్ -7 ప్రకారం కేసు నమోదు చేశారు ఇస్లామాబాద్ మార్గల్లా పోలీసులు. ఆదివారం పాక్ మంత్రి రానా సనావుల్లా మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం రెచ్చగొట్టేలా ఉందని, ఆయనపై కేసు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని వ్యాఖ్యానించారు. ఆ కొద్దిగంటలకే మాజీ ప్రధానిపై కేసు నమోదు అయ్యింది. ఖాన్ తన ప్రసంగంలో ‘‘అత్యున్నత పోలీసు అధికారులను, గౌరవనీయమైన మహిళా అదనపు సెషన్స్ జడ్జిని, పాక్ ఎన్నికల సంఘాన్ని భయభ్రాంతులకు గురిచేశారని, బెదిరించారని’’ అని మార్గల్లా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పాక్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ.. స్థానిక ఛానెళ్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముందు నుంచి చెప్తున్నప్పటికీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ రెచ్చగొట్టే ప్రసంగాలను, ప్రకటనలను ప్రస్తారం చేస్తున్నాయని మందలించింది. అంతేకాదు.. కావాలంటే ఆలస్యంగా వాటిని ప్రసారం చేసుకోవచ్చని సూచించింది. అధికారంలో నియంతలు ఇదిలా ఉంటే.. తనపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు కావడంపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. తన యూట్యూబ్ ఛానెల్‌ను బ్లాక్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు.. న్యాయవ్యవస్థ సైతం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరోవైపు పీటీఐ సైతం నియంతల రాజ్యమంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌ను అడ్డుకుని తీరతామని పేర్కొంటూ.. నిరసనలకు సిద్ధమైంది. ఇదీ చదవండి: పాక్ గానకోకిల నయ్యారా నూర్ కన్నుమూత -
నాంపల్లి కోర్టులో అక్బరుద్దీన్‌కు ఊరట
-
వివాదాస్పద వ్యాఖ్యల కేసు: అక్బరుద్దీన్‌కు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది. అక్బరుద్దీన్‌పై నమోదు అయిన రెండు కేసులను కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల కిత్రం నిజామాబాద్, నిర్మల్‌లో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్య లు చేశారంటూ అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైంది. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో గతంలో అరెస్టైన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. బుధవారం ఈ మేరకు తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు.. కేసులను కొట్టేస్తూ అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే కేసు కొట్టివేసినంత మాత్రానా సంబురాలు చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో.. పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తిపై పోలీసుల ప్రశ్నల వర్షం
కోల్‌కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు, బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని కోల్‌కతా పోలీసులు ప్రశ్నించారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిథున్ చేసిన ఓ ప్రసంగంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం మిథున్‌ను 45 నిమిషాలపాటు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, 71 ఏళ్ల మిథున్ చక్రవర్తి.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ఆవేశపూరితంగా ప్రసంగించారు. కాగా, బెంగాల్ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ హింసపై మిథున్ ప్రసంగాల ప్రభావం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ‘ఎగిరి తంతే.. శవం శ్మశానంలో పడుతుంది’ అంటూ తన సినిమాలోని డైలాగును ఉపయోగించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఆవేశంగా డైలాగులు చెప్పానే తప్ప.. ఉద్దేశపూర్వక ప్రసంగాలు చేయలేదని మిథున్ కోల్‌కతా కోర్టుకు విన్నపించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును కోరాడు కూడా. అయితే కోర్టు మాత్రం ఆయన్ని వర్చువల్‌గా ప్రశ్నించాలని పోలీసులను ఆదేశించింది. ఇక మరో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేనేం ఉత్త పామును కాను. నల్లత్రాచుని. కాటేస్తే.. నీ ఫొటోకి దండ పడాల్సిందే’ అని అర్థం వచ్చేలా కామెంట్లు చేశాడు. అన్నట్లు.. ఈ డిస్కో డ్యాన్సర్ పుట్టినరోజు ఇవాళే. చదవండి: మిథున్ కొడుకుపై రేప్ కేస్ -
అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2012లో నిజామాబాద్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సెషన్ కోర్టులో హిందూ సంఘటన్ అధ్యక్షులు, న్యాయవాది కరుణాసాగర్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్బరుద్దీన్ ఇదే తరహాలో రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఒవైసీ బెయిల్ పిటిషన్‌లోని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఇవాళ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో పాటు సీబీసీఐడీ పోలీసులుకు నోటీసులు ఇచ్చింది. -
నోరుజారిన చట్టసభ సభ్యులు ఎందరంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఏల్లో 58 మంది తమపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వీరిలో బీజేపీ నుంచే ఎక్కువ మంది ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ పేర్కొంది. పదిమంది సిట్టింగ్ బీజేపీ’ఎంపీలు (లోక్‌సభ), ఏఐయూడీఎఫ్, టీఆర్ఎస్, పీఎంకే, ఏఐఎంఐఎం, శివసేనల నుంచి ఒక్కరేసి ఎంపీపై విద్వేషపూరిత ప్రసంగం చేశారనే అభియోగాలు నమోదైనట్టు ఏడీఆర్ వెల్లడించింది. ఇక పార్టీల వారీగా బీజేపీ నుంచి 27 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఐఎంఐఎంకు చెందిన ఆరుగురు చట్టసభ సభ్యులు, టీఆర్‌ఆఎస్ (6) టీడీపీ (3), శివసేన (3), ఏఐటీసీ (2), ఐఎన్‌సీ (2), ఐఎన్డీ (2), జేడీ (యూ) (2), ఏఐయూడీఎఫ్ (1), బీఎస్పీ (1), డీఎంకే, పీఎంకే, ఎస్పీల నుంచి ఒక్కో సభ్యుడిపై ఈ తరహా కేసులున్నాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. కేంద్ర మంత్రి ఉమాభారతితో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది మంత్రులు తమపై ఇలాంటి కేసులున్నాయని వెల్లడించారని తెలిపింది. ఇక విద్వేషపూరిత ప్రసంగాల కేసులు నమోదయ్యాయని పలు రాష్ట్రాలకు చెందిన 43 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలు వెల్లడించారని పేర్కొంది. వీరిలో బీజేపీ నుంచి అత్యధికంగా 17 మంది ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్, ఏఐఎంఐఎంల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. టీడీపీ నుంచి ముగ్గురు, ఐఎన్‌సీ, ఏఐటీసీ, జేడీ(యూ), శివసేనల నుంచి ముగ్గురేసి ఎమ్మెల్యేలపై విద్వేష ప్రసంగాల కేసులు నమోదయ్యాయి. కాగా డీఎంకే, బీఎస్పీ, ఎస్పీ సహా ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలపైనా ఈ తరహా కేసులు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. సిట్టింగ్ ఎంపీలు, ఎంఎల్ఏలు సమర్పించిన డిక్లరేషన్లను విశ్లేషిస్తూ ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే యూపీలో అత్యధికంగా15 మంది ఎంపీలు, ఎంఎల్ఏలు నోరుజారారు. ఇక తెలంగాణా నుంచి 13 మంది సిట్టింగ్ ఎంఎల్ఏలు, కర్ణాటక నుంచి ఐదుగురు, మహారాష్ట్ర నుంచి ఐదుగురు చట్టసభల సభ్యులు తమపై ఇలాంటి కేసులున్నాయని వెల్లడించారు. ఇక తెలంగాణాలో ఈ తరహా కేసులు 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్నాయని, బిహార్ నుంచి నలుగురు, యూపీ నుంచి 9 మంది, మహారాష్ట్ర నుంచి నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై విద్వేషపూరిత ప్రసంగం చేశారనే కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీ, కర్ణాటక నుంచి ముగ్గురేసి ఎమ్మెల్యేలపై హేట్ స్పీచ్ కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరేసి, గుజరాత్, ఎంపీ, తమిళనాడు, రాజస్ధాన్, జార్ఖండ్‌ల నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేసిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏడీఆర్ పేర్కొంది. -
అమిత్ షాకు క్లీన్చిట్ ఇచ్చేశారు!
ముజఫర్‌నగర్: 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విద్వేష ప్రసంగం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఉత్తరప్రదేశ్ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. ముజఫర్‌నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్‌షా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యూపీ పోలీసులు కాక్రోలి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 'అయితే ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు' అంటూ పోలీసులు బుధవారం తుది నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికపై మేజిస్ట్రేట్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. 2014 ఏప్రిల్ 4న బర్వార్ గ్రామంలో అమిత్ షా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 'ముల్లా' ములాయం ప్రభుత్వం కూలిపోక తప్పదని అన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ ముస్లింలనే ఓటుబ్యాంకుగా చూస్తున్నదని, ఇతర వర్గాలు ఓటేయక్కున్నా పర్వాలేదని ప్రవర్తిస్తున్నదని షా పేర్కొన్నట్టు ఎఫ్ఐఆర్లో పోలీసులు తెలిపారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
మెదక్: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డిని సిద్ధిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన రెండు రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు 2010లో ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసులో కోర్టుకు హాజరుకానందున ఆయనకు నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేసింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఈ నెల 7న కోర్టు విచారించనుంది. -
నన్ను అంతం చేసేందుకు కుట్ర పన్నారు: అక్బరుద్దీన్
నా ప్రత్యర్థులు నన్ను అంతం చేసేందుకు కుట్ర పన్నారని అని మజ్లిస్ ఏ ఇత్తహాదుల్ ముస్లీమీన్(ఎంఐఎం) నాయకుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. అయితే కుట్రలను తట్టుకుని మరింత శక్తివంతుడిగా మారానని అంతేకాకుండా మరింత పాపులారిటీ వచ్చింది అని ఎంఐఎం వ్యవస్థాపక అధ్యక్షుడు సుల్లాన్ సలావుద్దీన్ ఓవైసీ ఐదవ వర్ధంతి సందర్భంగా హైదారబాద్ పాత బస్తీలోని ఖిల్వాత్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో అన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో వివాదస్పద ప్రసంగం కారణంగా అరెస్టైన అక్బరుద్తీన్ మళ్లీ ఓ సభలో కనిపించడం ఇదే తొలిసారి. వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అక్బరుద్దీన్ అదిలాబాద్ జైల్లో 40 రోజులపాటు రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ముస్లీంల కొరకు ఎంఐఎం పోరాటం చేస్తోందని.. పోరాటం చేస్తూనే ఉంటుందని అక్బరుద్దీన్ ఆవేశంగా ప్రసంగించారు. ముస్లీం, ఇతర మైనారిటీల రాజ్యంగ హక్కులను పరిరక్షించేందుకు ఎంఐఎం పోరాటం చేస్తుందన్నారు. సమాజంలో అణిచివేతకు గురవుతున్న ముస్లీం,మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించేందుకు గుజరాత్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో తాను పర్యటిస్తానని అక్బరుద్దీన్ తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. త్వరలోనే ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తానన్నారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో తమ పార్టీ తరపున ఎన్నికల్లో అభ్యర్థులను పోటికి నిలుపనున్నట్టు అక్బరుద్దీన్ వెల్లడించారు. ఇటీవల కర్నాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు విజయం సాధించిన విషయాన్ని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తెలిపారు. రాష్ట్ర విభజనను సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు అంగీకరించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా అంగీకరించబోమని, సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఉమ్మడి రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తామని అక్బరుద్దీన్ హెచ్చరించారు. ఈ సభలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. మహారాష్ట్రలో తనను పర్యటించకుండా నిషేధం విధించడంపై మండిపడ్డారు. తన పర్యటనపై నిషేధం విధించిన కారణంగా అక్బరుద్దీన్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తారన్నారు. మోడీని.. బీజేపీని అడ్డుకుంటాం అంటూ అక్బరుద్దీన్ కార్యకర్తలతో నినాదాలు చేయించారు. ఇటీవల హైదరాబాద్ లో మోడీ 'యస్ వి కెన్', యస్ వి విల్' అంటూ కార్యకర్తలతో నినాదాలు చేయించిన సంగతి తెలిసిందే.