
సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2012లో నిజామాబాద్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సెషన్ కోర్టులో హిందూ సంఘటన్ అధ్యక్షులు, న్యాయవాది కరుణాసాగర్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్బరుద్దీన్ ఇదే తరహాలో రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఒవైసీ బెయిల్ పిటిషన్‌లోని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఇవాళ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో పాటు సీబీసీఐడీ పోలీసులుకు నోటీసులు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment