ఆజం ఖాన్‌కు మరో కేసులో రెండేళ్ల జైలు | Azam Khan sentenced to two-year jail term in 2019 hate speech case | Sakshi
Sakshi News home page

ఆజం ఖాన్‌కు మరో కేసులో రెండేళ్ల జైలు

Published Sun, Jul 16 2023 6:08 AM | Last Updated on Sun, Jul 16 2023 6:08 AM

Azam Khan sentenced to two-year jail term in 2019 hate speech case - Sakshi

రాంపూర్‌: 2019 నాటి రెచ్చగొట్టే ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌(74)కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు జడ్జి శోభిత్‌ బన్సల్‌ శనివారం ఈ మేరకు తీర్పు వెలువరించారు.

2019 లోక్‌సభ ఎన్నికల వేళ మిలక్‌ కొత్వాలీ ప్రాంతం ఖటనగరియా గ్రామంలో బహిరంగ సభలో చేసిన విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో, ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటుపడింది. ఆ తీర్పును సెషన్స్‌ కోర్టు కొట్టివేసింది. పలు కేసుల్లో దోషిగా ఉన్న ఆజంఖాన్‌ 27 నెలల పాటు జైలులో ఉన్నారు. 2022 మేలో సుప్రీంకోర్టు ఆజం ఖాన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement