samajwadi party
-
సంభాల్ హింస: ఎంపీ సహా 400 మందిపై కేసు
ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మందిపై ఏడు కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సంభాల్ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత జియావుర్ రెహమాన్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ హింసకు పాల్పడటంతోపాటు జనాలను గుంపులుగా సమీకరించి, అశాంతిని రెచ్చగొట్టడం వంటివి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.కాగా సంభాల్ పట్టణంలో మొగల్ కాలానికి చెందిన షాహీ జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో ఆదివారం సర్వే నిర్వహిస్తుండగా హింస చేలరేగింది. గుంపుగా వచ్చిన కొందరు స్థానికులు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. చదవండి: ఘొర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామాపోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. స్పందించిన పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు సైతం గాయాలయ్యాయి.ఈ ఘటనపై అధికార బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్, హింసను కాంగ్రెస్ ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇక సోమవారం సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను బంద్ చేశారు. ప్రజలు గుంపులుగా గుమిగూడటంపై నిషేధం విధించారు.#WATCH | Delhi: On Sambhal stone pelting incident, Samajwadi Party MP Akhilesh Yadav says "Our MP Zia ur Rahman was not even in Sambhal and despite that an FIR was lodged against him...This is a riot done by the government...Right after the order was passed by the Court, police… pic.twitter.com/qwPGtpho1m— ANI (@ANI) November 25, 2024 -
‘అయోధ్య దీపోత్సవ్‌కు ఆహ్వానం అందలేదు’
లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను నిర్వాహకులు ఆహ్వానించలేదని సమాజ్‌వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తెలిపారు. మన పండుగల విషయంలో కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలందారికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేసి ప్రజలను విభజిస్తోంది. నాకు దీపోత్సవ్‌కు పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. ..నేను ఈరోజు అయోధ్యకు వెళ్తున్నా. నాకు నిర్వాహకుల నుంచి దీపోత్సవ్ కార్యక్రమానికి ఎటువంటి పాస్ లేదా ఆహ్వానం రాలేదు’’ అని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం.. ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించనున్న దీపోత్సవ్ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు సరయూ నది ఒడ్డున సుమారు 28 లక్షల దీపాలను వెలిగించటం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
అఖిలేశ్ యాదవ్‌ను యూపీ సర్కారు ఎందుకు అడ్డుకుంది?
UP Politics: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్ఐసీ)కు వెళ్లకుండా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను అడ్డుకోవడంతో యూపీ రాజధాని లక్నోలో తాజాగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా శుక్రవారం జేపీఎన్ఐసీకి వెళ్లాలని అఖిలేశ్ యాదవ్ భావించారు. జయప్రకాశ్ నారాయణ్‌కు నివాళి అర్పించాలని ఆయన అనుకున్నారు. అయితే అఖిలేశ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు.అఖిలేశ్‌ను అడ్డుకునేందుకు జేపీఎన్‌ఐసీని మూసివేశారు. ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అడ్డంగా బారికేడ్లు పెట్టి, భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. రేకులతో మెయిన్ గేటును క్లోజ్ చేశారు. విక్రమాదిత్య మార్గ్‌లోని అఖిలేశ్ యాదవ్ నివాసం సమీపంలోనూ పోలీసు బలగాలను భారీగా మొహరించారు. గతేడాది కూడా జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు అఖిలేశ్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన జేపీఎన్ఐసీ గేట్లను తోసుకుని లోపలికి వెళ్లి జయప్రకాశ్ నారాయణ్‌కు నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే?అఖిలేశ్‌కు అనుమతి నిరాకరించడానికి అధికారులు చెప్పిన కారణాలు వింటే ఆశ్చర్యం కలగకమానదు. జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు అనుమతి లేదంటూ లక్నో డెవలప్మెంట్ అథారిటీ(ఎల్డీఏ) గురువారం అఖిలేశ్‌కు రాసిన లేఖలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. జేపీఎన్ఐసీ ప్రమాదకర ప్రదేశంగా ఎల్డీఏ పేర్కొంది. నిర్మాణపనులు జరుగుతున్నందున ఆ ప్రాంతమంతా నిర్మాణ సామాగ్రితో గందరగోళంగా ఉందని వెల్లడించింది. వర్షాల కారణంగా పురుగూపుట్రా నుంచి ప్రమాదం పొంచివుందని హెచ్చరించింది. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యురిటీ కలిగిన అఖిలేశ్ యాదవ్.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సమయంలో జేపీఎన్ఐసీకి వెళ్లడం సురక్షితం కాదని సూచించింది.సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల ఆందోళనఎల్డీఏ లేఖపై సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అఖిలేశ్‌ను అడ్డుకునే కుట్రలో భాగంగా యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇదంతా చేయింస్తోందని ఆరోపిస్తున్నాయి. శుక్రవారం జేపీఎన్ఐసీ వద్ద సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. కాగా, జేపీఎన్‌ఐసీని సందర్శించేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడంతో యోగీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వలసవాద వ్యూహాలు అనుసరిస్తోందని విమర్శించారు.చదవండి: సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల ఆందోళన.. లక్నోలో ఉద్రిక్తతఅఖిలేశ్పై బీజేపీ ఎదురుదాడిజేపీఎన్ఐసీ అంశాన్ని కావాలనే అఖిలేశ్ యాదవ్ రాజకీయం చేస్తున్నారని బీజేపీ ఎదురుదాడి చేసింది. జయప్రకాశ్ నారాయణ్ ఆదర్శాలను సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడో వదలేసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి భండారీ ఆరోపించారు. జేపీఎన్ఐసీలో నిర్మాణ పనులు జరుగుతున్నందున అక్కడికి ఎవరినీ అధికారులు అనుమతించడం లేదన్నారు. నిజంగా జయప్రకాశ్ నారాయణ్‌పై అంత గౌరవం ఉంటే తన కార్యాలయంలోనే అఖిలేశ్ నివాళి అర్పించాలని సూచించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇండియా బ్లాక్‌లోని పార్టీలు పొలిటికల్ స్టంట్‌కు దిగుతున్నాయని భండారీ ఎద్దేవా చేశారు. -
‘ఎస్పీ’ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత
లక్నో:ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉద్రిక్తత నెలకొంది.నగరంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్(జేపీఎన్ఐసీ) వద్ద సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు. జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్‌కు వెళ్లనివ్వకుండా ప్రభుత్వం తనను అడ్డుకుంటోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్‌యాదవ్ ఆరోపించిన నేపథ్యంలో సమాజ్‌వాదీ కార్యకర్తలు అక్కడ ఆందోళనకు దిగారు.శుక్రవారం(అక్టోబర్11) జయప్రకాష్‌నారాయణ్ జయంతి సందర్భంగా గురువారం రాత్రి అఖిలేష్ యాదవ్ జేపీఎన్‌ఐసీని సందర్శించారు. అక్కడ మెయిన్‌గేట్ వద్ద పోలీసులు రెండు అడ్డుతెరలు ఏర్పాటు చేయడంపై అఖిలేష్ మండిపడ్డారు.ప్రభుత్వం ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో లక్నోలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జేపీఎన్ఐసీకి వెళ్లేదారిలో శుక్రవారం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.సెంటర్ మెయిన్‌గేట్ వద్ద బారికేడ్లు ఉంచారు.సెంటర్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌తో మైత్రి కొనసాగుతుంది: అఖిలేష్ -
‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై అఖిలేశ్‌కు సీఎం యోగి కౌంటర్
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన ‘బుల్డోజర్’ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. బుల్డోజర్ పేరుతో అఖిలేశ్ యాదవ్ బెదిరింపులను బుధవారం యోగి తోసిపుచ్చారు. బుల్డోజర్ను నడపడానికి ధైర్యం, తెలివి దృఢ సంకల్పం అవసరమని అన్నారు. ఎవరుపడితే వాళ్లు నడపలేరని, ముఖ్యంగా బుల్డోజర్ నడిపే శక్తి అఖిలేశ్ యాదవ్‌కు లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని సీఎం యోగి మాట్లాడారు. ‘‘బుల్డోజర్ను నడపడానికి అందరికీ చేతులు సరిపోవు. వాటిని నడపాలంటే.. హృదయం, మనస్సు రెండూ అవసరం. బుల్డోజర్ లాంటి సామర్థ్యం, దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే వాటిని ఆపరేట్ చేయగలరు. అల్లరిమూకల ముందు మాట్లాడేవారు కనీసం బుల్డోజర్ ముందు నిలబడలేరు’’ అని అన్నారు. ఇప్పటిదాకా ‘టిపు’గా ఉన్న అఖిలేశ్ యాదవ్ కొత్తగా సుల్తాన్‌లా మారడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇక.. ‘టిపు’ అనేది అఖిలేశ్ యాదవ్ నిక్ నేమ్‌గా తెలుస్తోంది.#WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath speaks at the distribution of jobs appointment letters, he says, "...Not everyone's hands can fit on a bulldozer...Iske liye dil aur dimaag dodo chahiye. Bulldozer jaise shamta aur pratigya jismein ho wahi bulldozer chala sakta… pic.twitter.com/VpbzY8BQV9— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 4, 2024ఇదిలా ఉండగా.. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ.. తాము 2027లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని బుల్డోజర్లను సీఎం యోగి సొంత నియోజకర్గమైన గోరఖ్‌పూర్‌కు పంపిస్తామని అన్నారు. -
Parliament Session: చినికి చినికి గాలివానగా... జయ వర్సెస్ ధన్‌ఖడ్!
న్యూఢిల్లీ: పేరులో ఏముందంటారు. కానీ పేరు పెను వివాదానికి దారి తీయగలదని, అంతకుమించి రాజకీయ సంక్షోభానికీ కారణం కాగలదని రాజ్యసభ సాక్షిగా రుజువైంది. సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్ పేరు విషయమై శుక్రవారం రాజ్యసభలో రాజుకున్న రగడ నాటకీయ మలుపులు తిరిగి చివరికి రాజకీయ దుమారంగా మారింది. ఏకంగా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించాలంటూ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించుకునే దాకా వెళ్లింది! దాంతో విపక్ష సభ్యులకు, ఆయనకు మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు కీలక మలుపు తిరిగాయి. వేడెక్కిన రాజ్యసభ జయాబచ్చన్ ‘పేరు’ అంశం శుక్రవారం రాజ్యసభను అమాంతం వేడెక్కించింది. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై గత వారం బీజేపీ సభ్యుడు ఘన్‌శ్యాం తివారీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడంతో రగడకు బీజం పడింది. ఇది ముగిసిపోయిన అంశమని ధన్‌ఖడ్ బదులివ్వడంతో విపక్ష ఎంపీలంతా గొడవకు దిగారు. దీనిపై జయ మాట్లాడతాననడంతో ధన్‌ఖడ్ అనుమతించారు. ‘జయా అమితాబ్ బచ్చన్! మాట్లాడండి’ అన్నారు. ఆయన తన పేరును పిలిచిన తీరులో వ్యంగ్యం ధ్వనిస్తోందంటూ జయ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘నేను నటిని. హావభావాలను ఇట్టే అర్థం చేసుకోగలను. మీ మాటతీరు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. మీరు సభాధ్యక్ష స్థానంలో ఉండొచ్చు గాక. కానీ మీరు మా తోటి సభ్యులు మాత్రమే’’ అన్నారు. దాంతో ధన్‌ఖడ్ తీవ్రంగా ఆగ్రహించారు. ‘ఇక చాలు’ అంటూ మధ్యలోనే కలి్పంచుకున్నారు. ‘‘మీకు గొప్ప పేరుండొచ్చు. కానీ నటీనటులు దర్శకుడు చెప్పినట్టు చేయాల్సిందే. సభాధ్యక్ష స్థానం నుంచి నేను చూసేది మీకు కని్పంచకపోవచ్చు. నా మాటతీరునే తప్పుబడతారా? నేనేం చేయాలో మీరు నిర్దేశించలేరు’’ అంటూ ఆక్షేపించారు. ఇందుకు విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ధన్‌ఖడ్ మరింతగా మండిపడ్డారు. ‘‘మీరు సెలబ్రిటీ అయినా, మరెవరైనా సరే! నథింగ్ డూయింగ్. నిబంధనలను అర్థం చేసుకోవాల్సిందే. సభా మర్యాదలు పాటించి తీరాల్సిందే’’ అని బచ్చన్‌కు స్పష్టం చేశారు. విపక్ష ఎంపీలంతా తీవ్ర అభ్యంతరం తెలిపినా, మూకుమ్మడిగా నినాదాలకు దిగినా లెక్కచేయలేదు. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎవరికీ అనుమతివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘పేరు ప్రఖ్యాతులు మీకే ఉంటాయనుకోకండి. మనమంతా ఇక్కడికొచ్చేది మన బాధ్యతలు సరిగా నిర్వర్తించి పేరు సంపాదించేందుకే. పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా నడుచుకోవాలి’’ అంటూ క్లాసు తీసుకున్నారు. ‘‘సీనియర్ సభ్యులైనంత మాత్రాన సభాపతి స్థానాన్ని అవమానించేందుకు సభాపతి మాటతీరుకు ఉద్దేశాలు ఆపాదించేందుకు ఎవరికీ హక్కు లేదు. పరిస్థితిని బట్టి ప్రతిస్పందించాల్సి వచ్చింది. నా సొంత స్క్రిప్టునే అనుసరిస్తాను తప్ప ఎవరో చెప్పినట్టు నడుచుకునే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టారు. విపక్ష సభ్యుల వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లబోవని స్పష్టం చేశారు. జయ పేరుపై రాజ్యసభలో ఆమెకు, ధన్‌ఖడ్‌కు సంవాదం జరగడం వారం రోజుల్లో ఇది మూడోసారి. మేం స్కూలు పిల్లలమా?: జయ ధన్‌ఖడ్ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ప్రకటించారు. దాంతో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు దేశం మొత్తాన్నీ అస్థిరపరిచే ప్రయత్నంలో ఉన్నారని నాకు బాగా తెలుసు. సభలో గందరగోళం సృష్టించడమే మీ ఉద్దేశం. అందుకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోను. మీరంతా మీ బాధ్యతల నుంచి పారిపోతున్నారు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘రాజ్యాంగాన్ని పణంగా పెట్టయినా ఖర్గే తన మాట నెగ్గించుకోవాలనుకుంటున్నారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే’’ అంటూ తప్పుబట్టారు. అనంతరం సోనియాగాంధీ తదితరులతో కలిసి జయాబచ్చన్ సభ నుంచి వాకౌట్ చేశారు. సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘క్రమశిక్షణలో పెట్టేందుకు మేమేమీ స్కూలు పిల్లలం కాదు. ధన్‌ఖడ్ మాటతీరుతో చాలా కలత చెందాను. అధికార పక్ష సభ్యులు నిండు సభలో మా పట్ల అమర్యాదకరమైన మాటలు వాడుతున్నారు’’ అని ఆరోపించారు.87 మంది ఎంపీల సంతకాలుఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ మేరకు నోటీస్‌పై 87 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు సమాచారం. ‘‘నోటీసు ఎప్పుడివ్వాలో త్వరలో నిర్ణయిస్తాం. ఇది తీర్మానం దాకా వెళ్లకపోయినా, చైర్మన్‌గా ధన్‌ఖడ్ అనుసరిస్తున్న ఏకపక్ష పోకడలను దేశ ప్రజల ముందు ఎత్తి చూపడమే మా ఉద్దేశం’’ అని విపక్షాలు స్పష్టం చేశాయి.ముందస్తు నోటీసు తప్పనిసరి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 67(బి) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించాలని కోరుతూ మహాభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. మెజారిటీ సభ్యుల మద్దతు లభిస్తే తీర్మానం నెగ్గి ఆయన పదవీచ్యుతుడవుతారు. అయితే మహాభిశంసన కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామంటూ కనీసం 14 రోజుల ముందస్తు నోటీసివ్వడం తప్పనిసరి. -
‘రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చండి’
ఢిల్లీ: 18వ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం రాష్ట్రపతిని ‘రాజ దండం’తో ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ప్రధని మోదీ పార్లమెంట్‌లోకి స్వాగతం పలికారు. అయితే లోక్‌సభలో రాజ దండాన్ని స్పీకర్ చైర్ పక్కన గోడకు అమర్చటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజదండానికి ఉన్న ప్రముఖ్యత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.‘దేశంలో ప్రజాస్వామ్యంలో కోసం రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఒక చిహ్నం.బీజేపీ గత ప్రభుత్వంలో రాజదండాన్ని స్పీకర్ చైర్‌కు పక్కన గోడకు అమర్చారు. సెంగోల్ అనే తమిళ పదం నుంచి వచ్చింది. సెంగోల్ అర్థం దండం. రాజదండం అంటే రాజు చేతి కర్ర. మనం రాజరిక పాలన నుంచి ఎప్పుడో విముక్తులం అయ్యాము. ప్రస్తుతం ఓటు అర్హత కలిగి ఉన్న స్త్రీ,పరుషులు ఓటువేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. దేశంలో పాలన రాజ్యాంగంతో నడవాలా? లేదా రాజదండంతో నడవాలా?. రాజదండం స్థానంలో రాజ్యాంగాన్ని అమర్చి.. రాజ్యాంగాన్ని రక్షించండి’ అని ఆయన స్పీకర్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారు.సెంగోల్‌పై విపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ‘సమాజ్‌వాదీ పార్టీ గతంలో రామచరిత్‌మానస్‌పై విమర్శలు గుప్పించింది. ఇప్పుడు భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తమిళ సంస్కృతిలో భాగమైన సెంగోల్‌పై విమర్శలు చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ సెంగోల్‌ను అవమానించడాన్ని డీఎంకే పార్టీ సమర్థిస్తుందో? లేదో? స్పష్టం చేయాలి’ అని విపక్షాల విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. -
బీజేపీ రాముడు నన్ను ఆశీర్వదించాడు: సమాజ్‌వాదీ ఎంపీ
యూపీలోని అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ తాజాగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. సమాజ్ వాదీ పార్టీ నేత అయిన ఎంపీ అవధేష్ ప్రసాద్ తాను రాముని దయతో ఎంపీగా ఎన్నికయ్యానని అన్నారు. రాముణ్ణి తీసుకొచ్చింది తామేనని బీజేపీ చెబుతున్నప్పటికీ, రాముని ఆశీస్సులు తనకే అందాయని అవధేష్ అన్నారు.అయోధ్య ఎవరి వారసత్వం కాదని, ఇది శ్రీరాముని జన్మ భూమి అని, తామే నిజమైన రామభక్తులమని అవధేష్ పేర్కొన్నారు. ఇక్కడి ప్రజలు.. అహంకారులను ఓడించారని అన్నారు. నీట్ పరీక్షల గురించి మాట్లాడిన ఆయన బీజేపీ ప్రభుత్వం లీక్‌లు లేకుండా ఏ పరీక్షనూ నిర్వహించలేకపోతున్నదన్నారు.అయోధ్య ఎంపీగా ఎన్నికైన తర్వాత అవధేష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5,54,289 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు 4,99,722 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి సచ్చిదానంద్ పాండే 46,407 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. -
ఉత్తర ప్రదేశ్‌లో ఆశ్చర్యకర ఫలితాలు.. ముందంజలో ఇండియా కూటమి
దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ నెలకొంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు(జూన్ 4) వెలువడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరి చూపు రిజల్ట్స్ పైనే ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలను కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ఇక్కడి స్థానాల నుంచే బరిలో ఉండటం ఇందుకు కారణం. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఉత్తర ప్రదేశ్‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఎవరూ ఊహించని విధంగా ఇండియా కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కంచుకోటగా మారిన యూపీలో ప్రతిపక్ష కూటమి ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమి (సమాజ్‌వాదీ పార్టీ-34, కాంగ్రెస్-7) 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక రాష్ట్రీయ లోక్‌దల్ పార్టీ రెండు స్థానాల్లో, ఏఎస్‌పీకేఆర్ ఒక చోట ఆధి క్యంలోఉంది.గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 62 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేయగా, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఈసారి బీఎస్పీ ఒంటరీగా పోరాడుతోంది.ఈసారి అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 17 చోట్ల బరిలోకి దిగింది.అమేథీలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ ఈసారి వెనుకంజలో పడింది. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ కేంద్రమంత్రిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.రాయబరేలీలోనూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. దాదాపు 60 ఓట్ల ఆధిక్యంలో ఆయన దూసుకుపోతున్నారు.వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 20 వేల ఓట్లు ఆధిక్యంలో మోదీ కొనసాగుతున్నారు.కన్నౌజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. లక్నోలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న ఆయన.. ఎస్పీ నేత సర్వర్ మాలిక్‌పై ఆధిక్యంలో కొనాసగుతున్నారు.మథురలో పొలిటీషియన్‌గా మారిన నటిహేమమలాలిని మథురలో ముందంజలో ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్ధి ముకేష్ ధన్గర్ రెండోస్థానంలో కొనసాగుతున్నారు. -
Narendra Modi: ప్రతిపక్షాలు గెలిస్తే అయోధ్యపైకి బుల్డోజర్లే
బారాబంకీ/ఫతేపూర్/హమీర్పూర్: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తాయని, బాలరాముడు మళ్లీ టెంట్‌లోకి వెళ్లాల్సి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బుల్డోజర్లను ఎక్కడికి పంపించాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని ఆ రెండు పారీ్టలకు సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో దశ పోలింగ్ జరుగుతున్నకొద్దీ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పేకమేడలా కూలిపోతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము హ్యాట్రిక్ సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలో పేదలకు, యువతకు, మహిళలకు, రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ, ఫతేపూర్, హమీర్‌పూర్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జూన్ 4వ తేదీ ఇక ఎంతోదూరంలో లేదని, మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న సంగతి కేవలం మనకే కాదు, మొత్తం ప్రపంచానికి తెలుసని స్పష్టంచేశారు. ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగాల్లోని విశేషాలివీ.. ఎన్నుకోవాల్సిన ఏకైక పార్టీ బీజేపీ ‘‘దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అంకితమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఒకవైపు, దేశంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. మనకు మంచి చేసే ఎంపీలు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి. కేవలం మోదీని దూషిస్తూ ఐదేళ్లు కాలం గడిపే ఎంపీలు మనకు అవసరమా? 100సీసీ ఇంజన్‌తో 1,000 సీసీ వేగం సాధ్యమా? బలమైన ప్రభుత్వమే అత్యంత వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదు. అలాంటి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. నిజంగా దేశ ప్రగతిని కోరుకుంటే మనం ఎన్నుకోవాల్సిన ఎకైక పార్టీ బీజేపీ. అయోధ్య రామమందిరంపై సమాజ్‌వాదీ పార్టీ పెద్దలు అనుచితంగా మాట్లాడారు. రామాలయం విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తిరగదోడాలని కాంగ్రెస్ భావిస్తోంది. వారికి సొంత కుటుంబ ప్రయోజనాలు, రాజకీయ అధికారమే ముఖ్యం. కాంగ్రెస్–సమాజ్‌వాదీ పారీ్టలకు అధికారం అప్పగిస్తే అయోధ్యలో అలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారు. రామ్‌లల్లా మళ్లీ టెంట్‌లోకి పంపిస్తారు. ఆ రెండు పారీ్టలకు ఓటు బ్యాంకు కంటే ఏదీ ఎక్కువ కాదు. రిజర్వేషన్లపై ప్రతిపక్ష నేతలు దారుణంగా మాట్లాడుతున్నారు. మొత్తం రిజర్వేషన్లను ముస్లింలకే ఇవ్వాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి(లాలూ ప్రసాద్ యాదవ్) అన్నారు. అంటే దళితులు, గిరిజనులు, ఓబీసీలకు అన్యాయం చేయాలా? వారు ఉన్నత స్థాయికి చేరుకోవద్దా?’’ అని మోదీ ప్రశ్నించారు. -
‘75 ఏళ్లకు రిటైర్ కానని మోదీ చెప్పలేదు’.. కేజ్రీవాల్ విమర్శలు
లక్నో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వయస్సు, రిటైర్మెంట్పై విమర్శలు సంధించారు. ఇప్పటి వరకు పీఎం మోదీ.. తాను 75 ఏళ్ల వయస్సు దాటాక రిటైర్ కానని, ఎక్కడా స్పష్టం చేయలేని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ఆప్, సమాజ్‌వాదీ పార్టీ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్‌తో పాటు కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడారు.‘ప్రధాని మోదీ తనకు 75 ఏళ్లు దాటాక, తాను పదవీ విరమణ చేయనని.. ఎప్పుడూ స్పష్టం చేయలేదు. 75 ఏళ్ల తర్వాత రిటైర్ కావాలనే నిబంధనను మోదీ ఉల్లంఘించరని దేశం మొత్తం నమ్మకంతో ఎదురుచూస్తోంది’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.‘బీజేపీ అమిత్ షాను ప్రధాని చేయటం కోసం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం.. సీనియర్ నేతలైన శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ రమణ్ సింగ్, వసుంధర రాజే, మనోహర్ లాల్ ఖట్టర్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి వారిని పక్కకు పెట్టింది. దీనికి అడ్డుగా ఉన్న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను కూడా మరో 2-3 నెలల్లో బీజేపీ పక్కకు పెడుతుంది’ అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.ఇక.. ఇటీవల తిహార్ జైల్ నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ఓర్యాలీలో పాల్గొని ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.‘ ఈసారి బీజేపీ గెలిస్తే.. అమిత్ షాను ప్రధానిగా చేయాలని బీజేపీ ప్రణాళిక వేస్తుంది. ఎందుకుంటే 2025 వరకు మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. దీంతో బీజేపీ పార్టీ నిబంధనల ప్రకారం మోదీ.. ఏ పదవీ చేపట్టకుండా రిటైర్ అయిపోతారు. తర్వాత అమిత్ షా పీఎం అవుతారు’అని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ‘నరేంద్ర మోదీ 2029 వరకు అంటే.. పూర్తి ఐదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగుతారు. ఆ తర్వాత కూడా బీజేపీ పార్టీకి ఆయన నాయకత్వం వహిస్తారు. అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మోదీ వయస్సుపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు’ అని అమిత్ షా స్పష్టం చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
లక్నో: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) రెండు రామ ద్రోహులని, వారి డీఎన్ఏలోనే రామ ద్రోహముందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. అయోధ్య రాముడిని దర్శించుకున్నందుకు సొంత పార్టీ నేత రాధికా కేరాను కాంగ్రెస్ అవమానించిందన్నారు.అవమానం భరించలేకే ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేసిందన్నారు. ‘కాంగ్రెస్ నిజస్వరూపం దేశ ప్రజలందిరికీ తెలుసు. ఎన్నికలప్పుడు వాళ్లు చేసేదేది నిజం కాదు. కేవలం ప్రజలను మోసం చేయడానికి వాళ్లు ఏదైనా చేస్తారు.ప్రజలు వాళ్ల నాటకాల పట్ల జాగ్రత్తగా ఉంటారు’అని యోగి వార్తా సంస్థతో అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ రామునికి, సనాతన ధర్మానికి వ్యతిరేకమని, అయోధ్య వెళ్లినందుకే పార్టీ తనను అవమానించిందని ప్రకటించి రాజీనామా చేశారు. -
ఇలా టిక్కెట్ ఇచ్చి... అలా రద్దు చేసి..
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం టిక్కెట్ కేటాయింపులో గందరగోళం నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ మహిళానేత రుచి వీరకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించాలనుకున్న పార్టీ ఆ తరువాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇది జరిగిన కొద్దిసేపటికే మొరాబాద్ నుంచి ఎస్టీ హసన్ పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు మీడియాకు తెలిపాయి. తొలుత పార్టీ ఎస్టీ హసన్‌కు టిక్కెట్ కేటాయించింది. తరువాత ఏవో సమీకరణలతో హసన్‌కు టిక్కెట్‌ను రద్దు చేసి, మహిళా నేత రుచి వీరకు కేటాయించాలనుకుంది. అయితే ఈ నిర్ణయంపై హసన్ అనుచరులు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మొరాబాద్ స్థానాన్ని ఎస్టీ హసన్‌కు కేటాయించింది. మహిళా నేత రుచి వీరను మొరాదాబాద్ నుంచి పోటీ చేయించాలని పార్టీ నేత ఆజం ఖాన్ కోరుకున్నారు. అయితే రుచి బిజ్నోర్ నివాసి. మొరాదాబాద్‌తో ఎలాంటి సంబంధం లేదు. దీంతో పార్టీ ఆమెకు టిక్కెట్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మరోవైపు రాంపూర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ హసన్‌ను పార్టీ కోరింది. అయితే ఇందుకు అతను తిరస్కరించారు. దీంతో పార్టీ ఆయనకు మొరాదాబాద్ టిక్కెట్ కేటాయించింది. కాగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో ఎస్పీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌కు 17 సీట్లు మిగిలాయి. -
ఆరు స్థానాలకు ఎస్పీ అభ్యర్థులు.. ప్రకటించిన అఖిలేష్
లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. సంభాల్ నుంచి ఎస్పీ టికెట్‌పై జియావుర్ రెహమాన్ బుర్క్ పోటీ చేయనుండగా, బాగ్పత్ నుంచి మనోజ్ చౌదరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రాహుల్ అవానా గౌతమ్ బుద్ధ నగర్ నుంచి పోటీ చేస్తారని ఎస్పీ విడుదల చేసిన జాబితా పేర్కొంది. అలాగే భగవత్ శరణ్ గంగ్వార్ పిలిభిత్ నుంచి, రాజీవ్ రాయ్ ఘోసీ నుంచి పోటీ చేయనున్నారు. రాజేంద్ర ఎస్ బింద్ మీర్జాపూర్ నుంచి ఎస్పీ టికెట్‌పై పోటీ చేస్తారని తెలిపింది. మొత్తం ఏడు దశలలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో అన్ని దశల్లోనూ పోలింగ్ జరగనుంది. అభ్యర్థులకు సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటివరకూ ఐదు జాబితాలు ప్రకటించగా ఇది ఆరోది. దీంతో ఎస్పీ ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 47కి చేరింది. భాదోహి సీటును తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి ఇచ్చింది. ‘ఇండియా’ కూటమి మిత్ర పక్షమైన సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లోని 17 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌కు వదిలివేసింది. కాంగ్రెస్ పోటీ చేయనున్న ఈ 17 స్థానాల్లో ఒకప్పుడు ఆ పార్టీ కంచు కోటలుగా భావించే రాయ్‌బరేలీ, అమేథీతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి ఉన్నాయి. -
యూపీలో బీజేపీని ఢీకొట్టే ఎస్పీ అభ్యర్థులు వీళ్లే..
ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (SP) 2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రస్తుతానికి 24 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌తోపాటు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రస్తుత మైన్‌పురి ఎంపీగా ఉన్న డింపుల్ యాదవ్ మరోసారి అదే నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. లక్నో, అంబేద్కర్ నగర్ స్థానాల నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు రవిదాస్ మెహ్రోత్రా, లాల్జీ వర్మలను పార్టీ పోటీకి దింపింది. ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమికి బలమైన పక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో గట్టి పొత్తులో ఉంది. అనేక విడతల సమావేశాల తర్వాత, రెండు పార్టీలు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని కీలక రాష్ట్రాల్లో 2024 లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపకంపై ఒక అంగీకారానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం యూపీలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా మిగిలిన 63 స్థానాలు ఎస్పీ ఖాతాలో ఉన్నాయి. 2019లో 80 సీట్లలో 62 సీట్లను బీజేపీ గెలుచుకుంది. జనరల్ వీకే సింగ్ తన సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సురేష్ బన్సాల్‌పై 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో జనరల్ వీకే సింగ్ కాంగ్రెస్‌కు చెందిన రాజ్ బబ్బర్‌పై 5,67,260 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇది 2008లో నమోదైన సంచలన రికార్డు. ఇప్పటివరకు ఎస్పీ ప్రకటించిన అభ్యర్థులు వీళ్లే.. అభ్యర్థి: లోక్‌సభ స్థానం డింపుల్ యాదవ్: మెయిన్‌పురి కాజల్ నిషాద్: గోరఖ్‌పూర్ రామ్ ప్రసాద్ చౌదరి: బస్తీ లాల్జీ వర్మ: అంబేద్కర్ నగర్ అవధేష్ ప్రసాద్: ఫైజాబాద్ శివశంకర్ సింగ్ పటేల్: బండా రాజా రామ్ పాల్: అక్బర్పూర్ నావల్ కిషోర్ శాక్య: ఫరూఖాబాద్ అన్నూ టాండన్: ఉన్నావ్ ఆనంద్ భదౌరియా: ధౌరహర ఉత్కర్ష్ వర్మ: ఖిరి ధర్మేంద్ర యాదవ్: బదౌన్ దేవేష్ శక్య: ఏటా అక్షయ్ యాదవ్: ఫిరోజాబాద్ రవిదాస్ మెహ్రోత్రా: లక్నో అఫ్జల్ అన్సారీ: ఘాజీపూర్ రాజేష్ కశ్యప్: షాజహాన్‌పూర్ ఉషా వర్మ: హర్దోయ్ ఆర్కే చౌదరి: మోహన్‌లాల్‌గంజ్ ఎస్పీ సింగ్ పటేల్: ప్రతాప్‌గఢ్ రమేష్ గౌతమ్: బహ్రైచ్ శ్రేయ వర్మ: గోండా వీరేంద్ర సింగ్: చందౌలీ రాంపాల్ రాజవంశీ: మిస్రిఖ్ -
Lok Sabha elections 2024: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 17 సీట్లు
లక్నో: విపక్షాల ‘ఇండియా’ కూటమిలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పొత్తు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఓ కొలిక్కి వచ్చింది. చాన్నాళ్లుగా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగి చివరకు బుధవారం తమ సీట్ల పంపకాలపై ప్రకటన చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉండగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు 17 చోట్ల పోటీచేసే అవకాశం ఇచి్చంది. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ పటేల్, ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర చౌదరి, కాంగ్రెస్ యూపీ చీఫ్ అజయ్ రాయ్, ఏఐసీసీ యూపీ వ్యవహారాల ఇన్చార్జ్ అవినాశ్ పాండేల భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ‘మేం 17 చోట్ల పోటీ చేస్తాం. మిగతా 63 స్థానాల్లో ఎస్పీ, ఇతర కూటమి భాగస్వామ్య పారీ్టలు బరిలో నిలుస్తాయి’’ అని కాంగ్రెస్ నేత వినాశ్ పాండే చెప్పారు. ప్రియాంకా గాంధీ చొరవతో కుదిరిన ఒప్పందం యూపీలో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఒక అడుగు ముందుకేసి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో ఫోన్లో మంతనాలు జరిపారని, దీంతో సీట్ల పంపకాల ప్రక్రియ ఒక కొలిక్కి వచి్చందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శ్రవస్థీ నియోజకవర్గంలో తామే పోటీచేస్తామని పట్టుబట్టి ఎస్పీ సాధించింది. కాంగ్రెస్ అదనంగా సీతాపూర్, బారాబంకీల్లో పోటీచేసే అవకాశం సాధించింది. వీటితోపాటు అమేథీ, రాయ్‌బరేలీ, కాన్పూర్ నగర్, వారణాసి, షహరాన్‌పూర్, అమ్రోహా, సిక్రీ, మహారాజ్‌గంజ్, బన్స్‌గావ్, బులంద్òÙహర్, ఘజియాబాద్, మథుర, ప్రయాగ్‌రాజ్, దేవరియా, ఝాన్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీచేయనుంది. మరోవైపు, మధ్యప్రదేశ్‌లో ఖజురహోలో మాత్రమే ఎస్పీ పోటీచేయనుంది. మిగతా 28 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఎస్పీ మద్దతు ఇవ్వనుంది. -
అఖిలేష్‌పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యపై కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య తన కొత్త పార్టీని ఫిబ్రవరి 22న ప్రకటిస్తారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మౌర్య నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. స్వామి ప్రసాద్ మౌర్య ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ, అధినేత అఖిలేష్ యాదవ్‌కు లేఖ రాశారు. పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అఖిలేష్ యాదవ్‌కు రాసిన లేఖలో మౌర్య.. తాను సమాజ్‌వాదీ పార్టీలో చేరినప్పటి నుండి, పార్టీకి మద్దతు కూడగట్టేందుకు నిరంతరం ప్రయత్నించానని పేర్కొన్నారు. అయితే పార్టీ తన కృషిని గుర్తించలేదని ఆరోపించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వందలాది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, గుర్తులు మారిన తర్వాత కూడా పార్టీ మద్దతును పెంచుకోవడంలో విజయం సాధించానన్నారు. ఫలితంగా ఎస్పీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని, ఒకప్పుడు పార్టీలో 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వారి సంఖ్య 110కి చేరిందని పేర్కొన్నారు. తన కృషితో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిన తర్వాత కూడా తనను శాసనమండలికి పంపారని, ఆ వెంటనే తనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారని మౌర్య తెలిపారు. ఇంతటి గౌరవం అందించినందుకు ధన్యవాదాలని మౌర్య పేర్కొన్నారు. -
హిందూయిజంపై ఎస్పీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: హిందూయిజంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఒక మోసం అని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో బీజేపీని వీడి మౌర్య సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 'ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోడీ కూడా హిందూయిజం ఒక మతం కాదని, కేవలం జీవన విధానమని అన్నారు. వారు ఇలాంటి ప్రకటనలు చేస్తే మనోభావాలు దెబ్బతినవు. కానీ నేను చెబితేనే ఆ వ్యాఖ్యలు అశాంతిని కలిగిస్తాయి' అని ఆయన అన్నారు. మౌర్య తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉదహరించారు. "1955లో, సుప్రీం కోర్టు తన తీర్పులో హిందూ మతం కాదు. ఒక జీవన విధానం అని చెప్పింది" అని మౌర్య గుర్తుచేశారు. #WATCH | Delhi: Samajwadi Party leader Swami Prasad Maurya says, "Hindu ek dhokha hai...RSS Chief Mohan Bhagwat has said twice that there is no religion called Hindu but instead, it is a way of living. Prime Minister Modi has also said that there is no Hindu religion...Sentiments… pic.twitter.com/1qnULH1rqt — ANI (@ANI) December 26, 2023 స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన నాటి నుంచి హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. హిందూ మతాన్ని విమర్శిస్తూ గత ఆగష్టులో ఓ వీడియోను షేర్ చేశారు. "హిందూత్వం కేవలం ఒక బూటకం. బ్రాహ్మనిజం మూలాలు చాలా లోతైనవి. అన్ని అసమానతలకు కారణం కూడా బ్రాహ్మణిజమే. హిందూ మతం అనే మతం లేదు. హిందూ మతం కేవలం బూటకం" అని ఆ వీడియోలో ఆయన అన్నారు. రామచరిత్మానస్లోని కొన్ని శ్లోకాలు సామాజిక వివక్షను ప్రోత్సహిస్తున్నాయని మౌర్య గతంలో అన్నారు. ఇదీ చదవండి: Year End 2023: 2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు? -
నాయకునిపై 'షూ' విసిరిన యువకుడు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ సమావేశంలో ఓ వ్యక్తి షూని విసరడం కలకలం రేపింది. కార్యకర్తలను అద్దేశించి మాట్లాడతుండగా స్వామి ప్రసాద్ మౌర్యపై.. ఓ వ్యక్తి షూని విసిరాడు. దీంతో అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు అతన్ని పట్టుకుని చితకబాదారు. నిందితుడు నాయకునిపై షూ విసరడానికి గల కారణాలు తెలియదు. లక్నోలో ఈ రోజు ఎస్పీ సమావేశం నిర్వహించింది. పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా సమావేశానికి వచ్చి ప్రసంగించాల్సి ఉంది. అంతకు ముందు ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇంతలో కార్యకర్తల గుంపు నుంచి ఓ షూ శరవేగంగా మౌర్య వైపు దూసుకొచ్చింది. క్షణాల్లో దాన్నుంచి మౌర్య తప్పించుకున్నారు. అయితే.. షూ విసిరిన వ్యక్తిని పట్టుకున్న ఇతర కార్యకర్తలు అతన్ని చితక్కొట్టారు. VIDEO | A man dressed up as an advocate hurls shoe at Samajwadi Party leader Swami Prasad Maurya in Lucknow. The attacker was later roughed up by Maurya's supporters. More details are awaited. pic.twitter.com/OQCU5G3xVE — Press Trust of India (@PTI_News) August 21, 2023 సమావేశానికి అఖిలేష్ యాదవ్ రాక ముందే ఈ ఘటన జరిగింది. ఇది బీజేపీ నేతల పనేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మౌర్య ప్రధాన ఓబీసీ నాయకుడు. 2022లో బీజేపీ నుంచి బయటకు వచ్చి ఎస్పీలో చేరారు. ఇటీవల రామచరిత మానస్‌పైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: చంద్రయాన్-3పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు -
సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు భారీ ఊరట
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌కు భారీ ఊరట లభించింది. 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఉత్తరప్రదేశ్ కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఉద్దేశించి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గత ఏడాది సమాజ్‌వాదీ నేతను దోషిగా నిర్ధారించిన కింది కోర్టు తీర్పును రాంపూర్ కోర్టు తోసిపుచ్చింది. ఇదే కేసులో ఆజం ఖాన్‌ను దోషిగా తేలుస్తూ 2022 అక్టోబర్ 27న ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు అనంతరం ఆయన్ను ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడంతో.. తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అనంతరం రాంపూర్ సదర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా విజయం సాధించారు. ఖాన్ సన్నిహితుడు, ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజా ఓటమి చెందారు. అయితే తన శిక్షపై వ్యతిరేకంగా ఆజం ఖాన్ రాంపూర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తాజాగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును రాంపూర్ కోర్టు కొట్టివేసింది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన వివిధ తీర్పులను ప్రస్తావిస్తూ.. బుధవారం తుదితీర్పు వెల్లడించింది. కాగా 2019 ఎప్రిల్ 9న అజాం ఖాన్‌పై రాంపూర్‌లోని మిలక్ కోత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ప్రధానమంత్రి మోదీతో సహా ప్రముఖ బీజేపీ నేతలు, ఐఎఎస్ అధికారి ఆంజనేయ కుమార్‌ను ఉద్ధేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీజేపీ నేత, అడ్వకేట్ ఆకాష్ సక్సేనా కేసు నమోదు చేశారు. దీంతో ఆజంపై ఐపీఎస్ సెక్షన్ 153-A, 505-1, 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదయ్యాయి. 2017లో యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సమాజ్ వాదీ నేత అయిన ఆజం ఖాన్‌పై 87 కేసులు నమోదయ్యాయి. వీటిలో అనితీతి, దొంగతనం, భూకబ్జాలతోసహా అనేక నేరారోపణలు ఉన్నాయి. ఇక తాజా తీర్పుతో ఆజంకు ఉపశమనం లభించిప్పటికీ ఆయన శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్దరించడం సాధ్యం కాదు. మొరాదాబాద్ కోర్టు అతన్ని మరొక కేసులో ఈఏడాది ప్రారంభంలో దోషిగా నిర్ధారించింది. చదవండి: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై 19 ప్రతిపక్ష పార్టీల కీలక నిర్ణయం -
సీఎం యోగి Vs అఖిలేష్: యోగి మాస్ వార్నింగ్..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని బహిరంగంగా చంపడంపై సభలో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ సందర్భంగా సీఎం యోగి.. మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే, రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేశ్ పాల్ శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. ఉమేశ్.. తన నివాసంలో ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడిచేసి, కాల్పులు జరపడంతో ఆయన మృతిచెందారు. అయితే, యూపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ దారుణ ఘటనపై యోగి సర్కార్‌పై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని సభలో ఫైర్ అయ్యారు. ఉమేశ్ హత్యలో గ్యాంగ్ వార్ వంటి పరిస్థితి కనిపించదన్నారు. ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్‌కు సీఎం యోగి కౌంటర్ ఇచ్చారు. సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. బాధితుల కుటుంబం ఆరోపించిన అతిక్ అహ్మద్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వ్యక్తి, మాజీ ఎంపీ అని అన్నారు. మీరు (సమాజ్‌వాదీ పార్టీ) నేరస్తులకు మద్దతిస్తున్నారు. వారికి పూలమాలలు వేసి స్వాగతిస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి నాటకాలు ఆడుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాఫియాలో అతిక్ అహ్మాద్ కూడా భాగమే. ఇలాంటి చర్యలను మేము అసలు సహించమని అన్నారు. మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ సమయంలోనే సీఎం యోగి సంచలన ఆరోపణలు చేశారు. అఖిలేష్ యాదవ్ మాఫియాకు గాడ్‌పాధర్ అంటూ ఆయన వైపు వేలు చూపిస్తూ యోగి కామెంట్స్ చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది. దీంతో అఖిలేష్ యాదవ్ సభలో మాట్లాడారు. ‘నేరస్థులు మీ వాళ్లే’ అంటూ ఎదురుదాడికి దిగారు. ‘రామరాజ్యం’లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ‘పట్ట పగలే కాల్పులు జరుగుతున్నాయి. బాంబులు విసురుతున్నారు. సాక్షిని చంపారు. పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? డబుల్ ఇంజన్లు ఎక్కడ ఉన్నాయి? ఇది సినిమా షూటింగా?’ అంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. 2015లో రాజు పాల్ హత్య జరిగింది. అయితే, రాజు పాల్.. అలహబాద్ (పశ్చిమ) నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాగా, విజయం సాధించిన కొద్ది నెలల్లోనే ఈ దారుణం జరిగింది. ఇక, ఎన్నికల్లో మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ సోదరుడు ఖలీద్ అజీంను రాజు పాల్ ఓడించారు. మరోవైపు.. ఈ కేసులో అతిక్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ నిందితులుగా ఉండటం గమనార్హం. Akhilesh yadav chup maarke baith gaya 🤣😹 pic.twitter.com/8Lx4SOuRwb — BALA (@erbmjha) February 25, 2023 -
వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24పై విపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులు నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డాయి. ఇది అంబానీ, అదానీ, గుజరాత్‌కు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే బీజేపీ అవకాశవాద బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. వాళ్ల కోసమే: కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ ఈ బడ్జెట్‌ను 'ప్రో కార్పొరేట్‌గా' అభివర్ణించారు. అంబానీ, అదానీ, గుజరాత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్‌ను రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఆకాంక్షలను ఇది నెరవేర్చిందని ధ్వజమెత్తారు. కానీ సామాన్యుడిని మాత్రం కేంద్రం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్లో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయని .. కానీ గ్రామీణ పేదలు, ఉపాధి హామీ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంచి కీలక అంశాల ప్రస్తావనే లేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ప్రజా వ్యతిరేకం: మమత ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించారని విమర్శించారు. ఆదాయపన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవరికీ మేలు జరగదని అన్నారు. దేశంలో కీలక సమస్యగా మారిన నిరుద్యోగం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మాత్రం మరింత సంపన్నులుగా మారేలా బడ్జెట్ ఉందని ఫైర్ అయ్యారు. సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. సవతి ప్రేమ: కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1.75 లక్షల కోట్లు ఇన్‌కం ట్యాక్స్ కట్టిన ఢిల్లీ నగరానికి బడ్జెట్లో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. కేంద్రం మరోసారి ఢిల్లీపై సవతి ప్రేమను చూపించి తీరని అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ధరల పెరగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం హానికరం అన్నారు. ఆశ లేదు నిరాశే: అఖిలేష్ కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. 10 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న బీజేపీ ఈసారి కూడా ప్రజలకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలుకు ఆశకు బదులు నిరాశే మిగిలిందన్నారు. కేవలం కొందరు ధనికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఎప్పటిలాగే చేశారు: మాయావతి ఎప్పటిలాగే ఈసారి కూడా దేశంలోని 100 కోట్ల మంది పేదల ఆశలపై నీళ్లు జల్లేలా బడ్జెట్ ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బడ్జెట్ రూపొందించే ముందు దేశంలో 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు, రైతులు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా అమృత కాలం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైందన్నారు. కాస్త భిన్నం: మెహబూబా ముఫ్తీ గత 8-9 ఏళ్లతో పోల్చితే ఈసారి బడ్జెట్ కాస్త భిన్నంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాలు, సబ్సీడీలకు కేటాయింపులు లేవని అన్నారు. ధనవంతులు, బడా వ్యాపారవేత్తల కోసమే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
రాజకీయ ప్రత్యర్థి కూతురితో బీజేపీ నేత ప్రేమాయణం..
ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అధికార బీజేపీ పార్టీకి చెందిన నేత.. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నాయకుడి కూతురుతో లవ్ ట్రాక్ నడిపాడు. అంతేకాకుండా ఆమెకు ఇటీవలే పెళ్లి ఖాయం కావడంతో ఇద్దరూ పారిపోయాడు. దీంతో, ఈ ఘటన యూపీలో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బీజేపీ నేత అశిశ్ శుక్లా(47), సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి కూతురు(26)తో ప్రేమ వ్యవహారం నడిపాడు. అయితే, శుక్లాకు అప్పటికే వివాహమై.. 21 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. దీంతో, ఆమె లవ్ ట్రాక్ వివాదాస్పందగా మారింది. మరోవైపు.. పారిపోయిన సదరు యువతికి ఇటీవలే మరో వ్యక్తికి కుటుంబ సభ్యులు పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె.. శుక్లాతో పారిపోవడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై రెండు పార్టీల నేతలు కూడా వాగ్వాదాలకు దిగారు. దీంతో, వీరి లవ్ ట్రాక్ యూపీలో సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. ఆశిశ్ శుక్లా ప్రస్తుతం హర్దోయ్ నగరానికి బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఈ ఘటన అనంతరం.. శుక్లాను పార్టీ నుంచి బహిష్కరించినట్టు హర్దోయ్ జిల్లా మీడియా ఇన్చార్జ్ గంగేశ్ పాఠక్ వెల్లడించారు. -
‘బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే’.. అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు
లఖ్‌నవూ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలన్న కాంగ్రెస్ పిలుపును తోసిపుచ్చారు. జోడో యాత్రకు దూరంగా ఉండిపోయారు. ఈ అంశంపై మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కాంగ్రెస్, బీజేపీల సిద్ధాంతాలు ఒకటేనని పేర్కొన్నారు. ‘మా పార్టీ సిద్ధాంతం భిన్నమైనది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే. మీ ఫోన్‌కు ఆహ్వానం వచ్చి ఉంటే నాకు పంపించండి. వారి యాత్రతో మా మనోభావాలు ఉన్నాయి. నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ’అని పేర్కొన్నారు అఖిలేశ్ యాదవ్. మరోవైపు.. యూపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్న తరుణంగా ఎస్పీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: మమతా బెనర్జీకి తీరని లోటు.. బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి -
యూపీ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. సీఎం యోగి సీటుకు ఎసరు పెట్టిన అఖిలేష్?
ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీటుకే ఎసరు పెట్టారు. దీంతో, యూపీ పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. ఎస్పీ వ్యవస్థాపకుడు, అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన రాంపూర్ ఎంపీ స్థానంలో అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిలేష్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రచారంలో అధికార బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అయితే ఆ ప్రయత్నంలో వారిద్దరూ విఫలమయ్యారని సంచలన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో వారికి అఖిలేష్ యాదవ్ బంపరాఫర్ ఇచ్చారు. వాళ్లకు ఆఫర్ ఇచ్చేందుకు మేం ముందుకొచ్చాం. మా నుంచి 100 మంది ఎమ్మెల్యేలను తీసుకోండి. మేం మీ వెంట ఉంటాం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎం అవ్వండి అని కామెంట్స్ చేశారు. దీంతో, యూపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక, అఖిలేష ఆఫర్‌పై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ ఆఫర్‌ను నేను తిరస్కరిస్తున్నాను. అఖిలేష్ యాదవ్ ఎప్పటికీ సీఎం కాలేదు. అఖిలేష్ ముందుగా.. తన సొంత ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సమాజ్‌వాదీ పార్టీలో గూండాలు ఉన్నందున వారిని మా పార్టీలోకి తీసుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇక, రాంపూర్ ఉప ఎన్నికలకు డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 8వ తేదీన ఎన్నికలు ఫలితాలు విడుదల కానున్నాయి. "SP chief Akhilesh Yadav, you will not be able to become the chief minister, nor will you be able to make anyone (Chief Minister)," Uttar Pradesh Dy CM Keshav Prasad Maurya said. https://t.co/nYKynmoDPM — The New Indian Express (@NewIndianXpress) December 2, 2022