దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ నెలకొంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు(జూన్ 4) వెలువడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరి చూపు రిజల్ట్స్ పైనే ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.
దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలను కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. రాజకీయ ప్రముఖులు ఎక్కువగా ఇక్కడి స్థానాల నుంచే బరిలో ఉండటం ఇందుకు కారణం. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఎవరూ ఊహించని విధంగా ఇండియా కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కంచుకోటగా మారిన యూపీలో ప్రతిపక్ష కూటమి ముందంజలో కొనసాగుతుంది.
మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమి (సమాజ్‌వాదీ పార్టీ-34, కాంగ్రెస్-7) 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక రాష్ట్రీయ లోక్‌దల్ పార్టీ రెండు స్థానాల్లో, ఏఎస్‌పీకేఆర్ ఒక చోట ఆధి క్యంలోఉంది.
గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 62 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేయగా, బీఎస్పీ 10, ఎస్పీ 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఈసారి బీఎస్పీ ఒంటరీగా పోరాడుతోంది.ఈసారి అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ 17 చోట్ల బరిలోకి దిగింది.
అమేథీలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీ ఈసారి వెనుకంజలో పడింది. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ కేంద్రమంత్రిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రాయబరేలీలోనూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. దాదాపు 60 ఓట్ల ఆధిక్యంలో ఆయన దూసుకుపోతున్నారు.
వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 20 వేల ఓట్లు ఆధిక్యంలో మోదీ కొనసాగుతున్నారు.
కన్నౌజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.
లక్నోలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న ఆయన.. ఎస్పీ నేత సర్వర్ మాలిక్‌పై ఆధిక్యంలో కొనాసగుతున్నారు.
మథురలో పొలిటీషియన్‌గా మారిన నటిహేమమలాలిని మథురలో ముందంజలో ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్ధి ముకేష్ ధన్‌గర్ రెండోస్థానంలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment