లఖ్‌నవూ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలన్న కాంగ్రెస్ పిలుపును తోసిపుచ్చారు. జోడో యాత్రకు దూరంగా ఉండిపోయారు. ఈ అంశంపై మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కాంగ్రెస్, బీజేపీల సిద్ధాంతాలు ఒకటేనని పేర్కొన్నారు.
‘మా పార్టీ సిద్ధాంతం భిన్నమైనది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే. మీ ఫోన్‌కు ఆహ్వానం వచ్చి ఉంటే నాకు పంపించండి. వారి యాత్రతో మా మనోభావాలు ఉన్నాయి. నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ’అని పేర్కొన్నారు అఖిలేశ్ యాదవ్. మరోవైపు.. యూపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌తో పాటు బీఎస్‌పీ అధినేత్రి మాయావతికి కూడా ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్న తరుణంగా ఎస్పీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: మమతా బెనర్జీకి తీరని లోటు.. బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి
Comments
Please login to add a commentAdd a comment