లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. యూపీలో కాంగ్రెస్‌తో తమ పొత్తు కొనసాగుతుందని, రాహుల్ గాంధీతో తమకు ఎలాంటి వివాదం లేదని బుధవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో సంబంధాలు తెగిపోతోందన్న ఊహాగానాలను తోసిపుచ్చారు.
అమేథీ, రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'కు గైర్హాజరు కావడంపై ఎదురైన ప్రశ్నకు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. తమ మధ్య అంతా బాగానే ఉందని, ఎలాంటి వివాదం లేదని తెలిపారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ మధ్య పొత్తు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 17-19 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని.. త్వరలోనే దీనిపై ఇరు పార్టీలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.
కాగా సీట్ల పంపకం ఖరారైన తర్వాతే రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటానని ఇటీవల అఖిలేష్ యాదవ్ పేర్కొన్న విషయం తెలిసిందే. మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు 17–19 సీట్లు ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. హత్రాస్‌కు బదులుగా సీతాపూర్ సీటును కాంగ్రెస్‌కు కేటాయించినట్లు సమాచారం.
చదవండి: ఇండియా కూటమిలో చేరికపై కమల్ హాసన్ స్పందన
Comments
Please login to add a commentAdd a comment