లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఈ రోజు ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర పదేశ్‌కు చెందిన ఓ యువ ఓటర్ చేసిన పనికి పోలీసుల చేత అరెస్ట్ అయ్యాడు.
నాలుగో విడత పోలింగ్‌లో యూపీలోని ఫరూఖాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓ యువ ఓటరు ఏకంగా ఎనిమిదిసార్లు ఓటు వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు షేర్ చేయడంతో పోలీసులు స్పందించారు.
BIG EXPOSE 🚨⚡
Akhilesh Yadav has shared this video from Uttar Pradesh in which a boy has voted 8 times for BJP with different slips
Hi @ECISVEEP when are you going to wake up from your sleep?
This is violation of election code, and must go for repolling on this booth. pic.twitter.com/Z06u9xqDor— Amockxi FC (@Amockx2022) May 19, 2024
ఏఆర్‌ఓ ప్రతీత్ త్రిపాఠి ఫిర్యాదు ఆధారంగా నయా గావ్ పోలీస్ స్టేషన్‌లో సదరు యువకుడిపై అరెస్ట్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ యువకుడిని రాజన్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.అతను ఫరూఖాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్‌పుత్‌కు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంపై 8 సార్లు నొక్కి ఓటు వేసిననట్లు వీడియోలో తెలుస్తోంది.
ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్పందించారు. ‘ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను గమనించాం. జిల్లా ఎన్నికల అధికారి చర్యలు తీసుకుంటారు’అని అన్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రంలోని అధికారులను పోల్ ప్యానెల్ సస్పెండ్ చేసింది.
‘ప్రియమైన ఎలక్షన్ కమిషన్, మీరు ఇది చూశారా? ఒక వ్యక్తి 8 సార్లు ఓటు వేశాడు. ఇది స్పందించాల్సి సమయం’ అని కాంగ్రెస్ ‘ఎక్స్’లో పేర్కొంది. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం దినికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
అదేవిధంగా ‘ఈ ఘటనను ఎన్నికల సంఘం తప్పుగా భావిస్తే.. వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే బీజేపీ బూత్ కమిటి నిజమైన లూటీ చేసే కమిటీ అని అర్థమవుతుంది’అని అఖిలేష్ యాదవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment