Polling Stations
-
దౌర్జన్యాలు.. దొంగ ఓట్లు
కేవలం ఎనిమిది నెలల్లోనే ప్రజా వ్యతిరేకత.. సూపర్ సిక్స్ హామీలు అమలుకు నోచుకోకపోవడానికి తోడు డీఎస్సీ ప్రకటించక పోవడం, గ్రూప్–2 అభ్యర్థులతో ఆటలాడుకోవడం.. తదితర కారణాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. దీంతో ఎలాగైనా సరే గెలవాలని సర్కారు పెద్దలు బరితెగించారు. వీరి కనుసైగతో పోలింగ్ బూత్‌లలోనే డబ్బులు పంచడం ఒక ఎత్తు అయితే.. బెదిరింపులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, ఏజెంట్లను తరిమేయడం మరో ఎత్తు. ఫలితంగా ఏకపక్ష పోలింగ్, రిగ్గింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదివరకెన్నడూ లేని నయా సంస్కృతి ఇది.సాక్షి, అమరావతి/పిఠాపురం/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, విశాఖపట్నం/గుంటూరు ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని కూటమి పార్టీలు రెచ్చిపోయాయి. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణ–గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని బరితెగించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదివరకెన్నడూ లేని రీతిలో యథేచ్ఛగా ఓటర్లను ప్రలోభపెట్టడానికి యత్నించాయి.ప్రత్యర్థి అభ్యర్థుల ఏజెంట్లను పలు చోట్ల తీవ్రంగా బెదిరించి తరిమేశారు. ఏకపక్షంగా పోలింగ్ జరిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ‘ఓటుకు నోటు’ అంటూ వెదజల్లారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ కళాశాలలోని 96, 97, 98 పోలింగ్ బూత్‌ల పక్కనే టీడీపీ నేతలు తిష్ట వేసి కూర్చున్నారు.ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు డబ్బులు పంచారు. ‘డబ్బులు తీసుకోండి.. కూటమి అభ్యర్థికి ఓటు వేయండి’ అని కోరడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పక్కనే ఉన్న మున్సిపల్ కల్యాణ మండపంలో మండల టీడీపీ అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్.. వచ్చిన ప్రతి ఓటరు వద్ద ఓటరు స్లిప్ తీసుకుని, సరి చూసి మరీ ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారు.ఈ దృశ్యాలు టీవీ చానళ్లలో కూడా ప్రసారం కావడంతో రెవెన్యూ అధికారులు వారికి సమాచారం ఇచ్చి.. అక్కడికి వెళ్లారు. ఆలోపే టీడీపీ నేతలు అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన అంటూ చెప్పుకొస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలోనే ప్రజాస్వామ్యం ఇలా ఖూనీ కావడం చర్చనీయాంశమైంది. పోలింగ్ బూత్‌కు అతి సమీపంలో బహిరంగంగా డబ్బులు పంచినా ఎన్నికల అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించడం దారుణం అని విమర్శలు వెల్లువెత్తాయి. లింగపాలెంలో దొంగ ఓట్లుఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్దకు పసుపు చొక్కాలు వేసుకువచ్చి డబ్బులు పంపిణీ చేశారు. పీడీఎఫ్ ఏజెంట్లపై దాడి చేశారు. చివరి రెండు గంటల్లో దొంగ ఓట్లు వేయించారు. పెదవేగి బూత్ నంబర్ 327లో పీడీఎఫ్ ఏజెంట్ గేదెల శివకుమార్‌పై కూటమి అభ్యర్థులు దాడి చేశారు.లింగపాలెం మండలంలోని శింగగూడెం హైస్కూల్లో ఏర్పాటు చేసిన 277, 278 బూత్‌లలో టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. అక్కడ పీడీఎఫ్ ఏజెంట్ సూర్యకిరణ్‌ను బెదిరించి మొబైల్ లాక్కుని బయటకు గెంటేశారు. హైదరాబాద్, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వివరాలను తీసుకుని చివరి నిమిషంలో ఓట్లు వేశారు. దీంతో మొత్తంగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి 45.29 శాతం పోలింగ్ నమోదు కాగా, సాయంత్రం 4 గంటలకు 69.50 శాతం నమోదైంది. కేవలం 2 గంటల వ్యవధిలో 24.21 శాతం ఓటింగ్ పెరిగిందంటే దొంగ ఓట్ల వల్లేనని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రశ్నించారని దౌర్జన్యం.. దాడులుఓటమి భయంతో బెంబేలెత్తిన అధికార పార్టీ నాయకులు బాపట్ల జిల్లాలో పలుచోట్ల దౌర్జన్యానికి దిగారు. రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. చాలాచోట్ల పీడీఎఫ్ పోలింగ్ ఏజెంట్లను బయటకు లాగే ప్రయత్నం చేశారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు వేశారు. అడ్డుకున్న పీడీఎఫ్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. బాపట్లలోని మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి అధికార పార్టీ నేతలు యథేఛ్చగా దొంగ ఓట్లు వేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో కలిసి పలుమార్లు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఇష్టానుసారం దొంగ ఓట్లు వేశారు. టీడీపీ మహిళా నేత పోలింగ్ కేంద్రంలో మకాంవేసి దొంగ ఓట్ల వ్యవహారాన్ని పర్యవేక్షించారు.సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలీసుల సహకారంతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడి స్థానిక టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడి మిగిలిన ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న ప్రజా నాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్ వారిని అడ్డుకున్నారు. పోలింగ్ సమయం ముగిశాక టీడీపీ వారిని లోపలికి ఎలా అనుమతిస్తారంటూ పోలీసు అధికారులను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావులతోపాటు మరికొందరు కలిసి పీడీఎఫ్ నాయకుడు అనిల్‌కుమార్‌పై దాడి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేదు. భట్టిప్రోలులో పీడీఎఫ్ ఏజెంట్ లింగం శ్రీనుపై టీడీపీ నాయకులు దాడిæచేసి కొట్టారు. కూటమి అభ్యర్థి ఆలపాటికి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను లింగం శ్రీను నిలదీశారు. దీంతో టీడీపీ వారు ఆయనపై దాడి చేశారు. ఆ తర్వాత దౌర్జన్యంగా ఓట్లు వేసుకున్నారు.చుండూరులో కూటమి నేతలు దౌర్జన్యానికి దిగారు. పీడీఎఫ్ ఏజెంట్లను బయటకు లాగి రిగ్గింగు చేసేందుకు పలుమార్లు యత్నించారు. దీనిని పీడీఎఫ్ నేతలు అడ్డుకున్నారు. బాపట్ల, పిట్టలవానిపాలెం, అడవులదీవి, రేపల్లె, వేమూరుతోపాటు పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు పీడీఎఫ్ ఏజెంట్లను బయటకు పంపి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని పీడీఎఫ్ నేతలు ఆరోపించారు.మా ఏజెంట్లను బూత్‌ల నుంచి వెళ్లగొట్టారు: లక్ష్మణరావు కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి భయంతో అక్రమాలకు తెగబడిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. గురువారం పోలింగ్ ముగిసిన అనంతరం గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లాలో అనేక చోట్ల తమ ఏజెంట్లను బయటకు పంపేశారని, వెల్దుర్తిలో పీడీఎఫ్ తరఫున నియమించిన ఏజెంట్‌ను అనుమతించలేదని అన్నారు.దుర్గిలో ఏజెంట్‌ను బయటకు పంపడంతోపాటు బెల్లంకొండ ఏజెంట్‌ను అరెస్టు చేశారని చెప్పారు. ఇలా అనేక చోట్ల అధికార బలంతో తమ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు బూత్‌లలోకి ప్రవేశించి, హడావుడి సృష్టించారని, చీఫ్ ఏజెంట్లు, అభ్యర్థులు మినహా ఎమ్మె ల్యేలకు బూత్‌లలోకి వెళ్లేందుకు ఎటువంటి అధికారం లేద న్నారు. దొంగ ఓట్లు వేసేందుకు ముందుగానే పథకాన్ని సిద్ధం చేసుకున్న అధికార పార్టీ దానిని అమలు పర్చిందని ఆరోపించారు.తెనాలిలోని కోగంటి శివయ్య మున్సిపల్ పాఠశాలతో పాటు అమరావతి, పెదకూరపాడు, పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దొంగ ఓట్లకు తెగబడిందన్నారు. సాధారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదు కావడం సహజమేనని, పూర్తి వివరాలు వచ్చిన తరువాతే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. పల్నాడులోని పలు బూత్‌లలో 90 శాతం పోలింగ్ జరిగినట్లు నమోదైతే, అది కచ్చితంగా దొంగ ఓట్లు వేయించినట్లేనని స్పష్టం చేశారు. పోలైన ఓట్లు, తదితర పూర్తి వివరాలు వచ్చిన తరువాత, రీ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలురాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణ–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు 92.40 శాతంకుపైగా పోలింగ్ నమోదు కాగా, ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలో 63.28 శాతం, కృష్ణ–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 65.58 శాతం పోలింగ్ నమోదైంది.నాలుగు గంటలు దాటిన తర్వాత కూడా లైన్లో ఉన్న వారిని ఓటు హక్కు వినియోగించడానికి అనుమతించడంతో తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం శుక్రవారం అధికారికంగా ప్రకటించనుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీలో అత్యధిక మంది ఉండటంతో ఓటర్లు ముఖ్యంగా కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లు ఓటు వేసే సమయంలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది, ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీలో ఉండటంతో అభ్యర్థులకు ప్రాధాన్యతా నంబర్లు కేటాయించి బ్యాలెట్ పేపర్ మడత పెట్టి బ్యాలెట్ బ్యాక్స్‌లో వేయడానికి అయిదు నుంచి పది నిమిషాల సమయం తీసుకుంది.దీంతో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలో చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కొంత మంది ఓటర్లు తమకు నచ్చిన వ్యక్తి ఎదుట ప్రాధాన్య ఓటు సంఖ్య కాకుండా టిక్కులు పెట్టడంతో చెల్లని ఓట్లు అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.నిరంతర పర్యవేక్షణపోలింగ్ సజావుగా నిర్వహించడానికి 6,287 మంది పోలీస్, 8,515 మంది పోలింగ్ సిబ్బందితో ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయడమే కాకుండా సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పర్యవేక్షించారు. విజయవాడలోని పటమట హైస్కూల్, గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.పోలింగ్ ముగిసిన తర్వాత పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానం బ్యాలెట్ బాక్సులను ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల, కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్స్ బ్యాలెట్ బాక్సులను గుంటూరు ఏసీ కాలేజీ, శ్రీకాకుళం –విజయనగరం – విశాఖ టీచర్ల బ్యాలెట్ బాక్సులను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పోలీస్ సిబ్బందితో నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో 70 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. -
‘స్థానిక’ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశమున్నా, ఎన్నికల పనుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. శనివారం జిల్లాలు, మండల స్థాయిలో పోలింగ్ కేంద్రాలను గుర్తించి దానికి సంబంధించిన జాబితాలను జిల్లా, మండల కేంద్రాల్లో ప్రచురించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ఓటర్ల జాబితాకు సంబంధించిన కసరత్తు సాగుతోంది.ఎన్నికలు వాయిదా పడుతున్నాయనే భావనలో ఉండొద్దని, ఆయా పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే ఉండాలని అధికారులు, సిబ్బందికి పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందికి శిక్షణ తదితరాలన్నీ పూర్తిచేసి, ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా వెంటనే ఎన్నికల విధుల్లో దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు, గూగుల్‌మీట్‌లు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా... ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పీఆర్ శాఖ ద్వారా పోలింగ్ కేంద్రాల జాబితా, ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. పైగా సిబ్బందికి కూడా దీనికి సంబంధించిన శిక్షణను కూడా పూర్తి చేసింది. శనివారం పోలింగ్ స్టేషన్లు ఖరారు కావడంతో టీ–పోల్ యాప్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా 500 నుంచి 700 ఓటర్లను మ్యాపింగ్ చేసి ఆయా కేంద్రాలకు కేటాయించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టులోనూ కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. కోర్టుకు ఆయా విషయాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీఆర్ శాఖ ఆదేశించింది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏవి ముందు నిర్వహించాల్సి వచ్చినా, అందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉండాలని సూచించింది. కులగుణనలో రెండోవిడతలో వివరాల సేక రణ, పరిశీలన, ఆపై కేబినెట్ భేటీలో సమగ్ర నివేదిక ఆమోదం, ఆపై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత కల్పించేలా బిల్లు పెట్టి కేంద్రానికి, పార్లమెంట్‌కు పంపించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మరికొన్ని నెలల సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘సుప్రీం’ బోనులో ఈసీ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భాల్లో తప్ప వినబడని ఎన్నికల సంఘం(ఈసీ) పేరు ఇటీవలి కాలంలో తరచు వార్తల్లోకెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని ప్రచారం వరకూ... ఆ తర్వాత ఎన్నికల్లో పోలైన వోట్ల శాతం, వాటి లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ అన్ని దశల్లోనూ ఈసీపై నిందలు తప్పటం లేదు. తాజాగా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తున్న సందర్భంగా ఈవీఎంల పరిశీలన ప్రక్రియ అమల వుతుండగా వాటి డేటాను తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. నిరుడు ఏప్రిల్‌లో ఈ విషయమై ఇచ్చిన ఆదేశాలను సరిగా అర్థం చేసుకుని, సక్రమంగా పాటిస్తే ఇలా చెప్పించుకోవాల్సిన స్థితి ఈసీకి ఉండేది కాదు. ఈవీఎంలనూ, దానికి అనుసంధానించి వుండే ఇతర యూనిట్లనూ భద్రపరిచే విషయమై సుప్రీంకోర్టు అప్పట్లో కీలక ఆదేశాలిచ్చింది. అవి సరిగా పాటించటం లేదని ఏడీఆర్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల్లో పరాజితులై 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కనుక ఆ ఎన్నికను సవాలు చేసిన సందర్భాల్లో తనిఖీ చేయడానికి అనువుగా ఈవీఎంలతోపాటు, వాటిలో పార్టీల గుర్తులను లోడ్ చేయటానికి ఉపయోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను సైతం 45 రోజులపాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఎన్నికల ఫలితంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటానికి పరాజిత అభ్యర్థులకుండే 45 రోజుల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఇలా ఆదేశించింది. అసెంబ్లీ నియో జకవర్గ పరిధిలోని 5 శాతం ఈవీఎంలు, ఎస్‌ఎల్‌యూలను ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చని సూచించింది. వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించే యంత్రాలు సమకూర్చు కునే ఆలోచన చేయాలని కూడా ఆ సందర్భంగా కోరింది. ఈ ఆదేశాల ఆంతర్యమేమిటో సుస్పష్టం. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడమే కాదు... అలా జరిగినట్టు కనబడాలంటే అంతా పారదర్శకంగా ఉండాలన్నది ధర్మాసనం ఉద్దేశం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అనంతరం ఈవీఎంలూ, వీవీప్యాట్‌లూ, ఎస్ఎల్యూల పరిశీలన విషయంలో ఈసీ కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాలకూ, ఆ నియమ నిబంధనలకూ ఎక్కడా పొంతన లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ 5 శాతం ఈవీఎంలు తనిఖీ చేయాలని ధర్మాసనం ఇచ్చిన ఆదేశానికి ఈసీ వేరే రకమైన భాష్యం చెప్పింది. వినియోగించిన ఈవీఎంలలో ఏ పార్టీకి ఎన్ని వోట్లు లభించాయో చూసి, వీవీ ప్యాట్ స్లిప్‌లు దానికి అనుగుణమైన సంఖ్యలో ఉన్నాయా లేదా అన్నది తేలిస్తే వేరే రకంగా ఉండేది. కానీ ఈసీ చేసిందల్లా ఇతరత్రా గుర్తులతో మళ్లీ నమూనా పోలింగ్ నిర్వహించి ఈవీఎంల డేటాకూ, వీవీప్యాట్ స్లిప్‌ల సంఖ్యకూ మధ్య తేడా లేదని నిరూపిస్తే చాలని భావించింది. అంతేకాదు... ఆ నమూనా పోలింగ్ కోసం ఈవీఎంలలోని డేటాను ఖాళీ చేసింది! ఈవీఎంలు సరిచూడాలని అభ్య ర్థులు కోరటం అంటే తమ సమక్షంలో ఈవీఎంలలో ఉన్న సాఫ్ట్‌వేర్‌నూ, హార్డ్వేర్నూ ఇంజనీర్లు పరిశీలించాలని... వీవీ ప్యాట్ స్లిప్‌ల సంఖ్య ఈవీఎంల డేటాతో సరిపోయిందో లేదో చూడాలని అడగటం. ఈసీ అనుసరించిన ప్రక్రియకూ, అభ్యర్థులు కోరుకునేదానికీ పొంతన ఎక్కడైనా ఉందా? ఈ మాత్రానికే అభ్యర్థులనుంచి ఈవీఎంకు రూ. 40,000 చొప్పున వసూలు చేయటం సిగ్గనిపించ లేదా? చిత్రమేమంటే... ఒక్కో ఈవీఎం తయారీకి ఖర్చయ్యేది కేవలం రూ. 30,000! గత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి 11 మంది అభ్యర్థులు ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్‌ల పరిశీలన కావాలన్నారని, అంతా పూర్తయ్యాక ఎక్కడా తేడా కనబడలేదని ఈసీ తేల్చింది. దేశవ్యాప్తంగా చూస్తే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి అభ్యర్థనలే 83 వరకూ రాగా, అంతా సవ్యంగానే ఉన్నదని నిర్ధారణ అయిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో 45 రోజులలోపు ఈవీఎంల డేటా తొలగించరాదన్న నిబంధనను సైతం ఈసీ ఉల్లంఘించింది. ఒకపక్క ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఇలా చేయటం అనుమానాలను మరింత పెంచుతుందన్న ఇంగితజ్ఞానం దానికి లేకపోయింది.మేమిచ్చిన ఆదేశాలేమిటో, మీరు అనుసరించిన ప్రక్రియేమిటో వివరిస్తూ వచ్చే నెల 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించటం హర్షించదగ్గది. అసలు 45 రోజుల్లోపే డేటాను ఎందుకు తొలగించాల్సివచ్చిందో కూడా ఈసీనుంచి సంజాయిషీ కోరాలి. ఇక పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు మరింత చిత్రంగా ఉన్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్‌లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకూ వోట్లు పెరిగినట్టు ఈసీ తేల్చింది. ఈ పెరిగిన వోట్ల శాతం ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం ఉంది. పోలింగ్ ముగిసిన రాత్రి ఏపీలో 68 శాతం వోట్లు పోలయ్యాయని ప్రకటించగా, తుది ప్రకటనలో అది కాస్తా 81 శాతానికి ఎగబాకింది. ఈవీఎంల చార్జింగ్ పెరగటం మరో కథ! ఈ మార్పుల వెనకున్న మంత్రమేమిటో చెప్తే అందరూ విని తరిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో నిష్ఠగా నిర్వహించాల్సిన క్రతువు. ఒక రాజ్యాంగ సంస్థ అయివుండి, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు భిన్నమైన పోకడలను ప్రదర్శించటం దానికి ఎంతమాత్రమూ గౌరవప్రదం కాదు. ఈసీ తీరు గమనించాక చాలామంది మళ్లీ బ్యాలెట్ పత్రాలకు మళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ బాణీ మారకపోతే చివరకు బ్యాలెట్ పత్రం విధానం కోసం జనం ఎలుగెత్తే రోజులు రావటం ఖాయం. -
AP: టీచర్ MLC ఎన్నికల పోలింగ్
-
ఒక్కో ఈవీఎంలో 1,500 ఓట్లా?... దానికి అంత సామర్థ్యముందా?: సుప్రీంకోర్టు అనుమానాలు
న్యూఢిల్లీ: ఒక్కో పోలింగ్ స్టేషన్లో పోలయ్యే గరిష్ట ఓట్ల సంఖ్యను 1,200 నుంచి 1,500కు పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో హేతుబద్ధతపై సుప్రీంకోర్టు అనుమానాలు లేవనెత్తింది. ‘‘ఒక్క ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) పోలింగ్ గడువులోగా అన్ని ఓట్లను నమోదు చేయగలదా? దానికి అంత సామర్థ్యముందా? 1,500 కంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదయ్యే పోలింగ్ స్టేషన్ల విషయంలో ఏం చేస్తారు? ఒక్కో ఈవీఎం ద్వారా గంటకు సగటున 45కు ఓట్లకు మించి పోల్ కావన్న పిటిషనర్ వాదన నిజమైతే హెచ్చు పోలింగ్ శాతం నమోదయ్యే సందర్భాల్లో ఓటర్ల తాకిడిని తట్టుకోవడం ఎలా సాధ్యం? నిర్దేశిత గడువులోపు అందరూ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తదా?’’ అంటూ ఈసీకి ప్రశ్నలు వేసింది.ఇందుప్రకాశ్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌కుమార్ ధర్మాసనం సోమవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ లేవనెత్తిన పలు అంశాలపై తాము ఆందోళన చెందుతున్నట్టు స్పష్టం చేసింది. ఏ కారణంతోనైనా సరే, ఒక్క ఓటర్ కూడా ఓటింగ్‌కు దూరంగా ఉండే పరిస్థితి రాకూడదని పేర్కొంది. ఈవీఎంల సంఖ్యాపరమైన సామర్థ్యంతో పాటు తాము లేవనెత్తిన సందేహాలన్నింటికీ సమగ్రంగా వివరణ ఇస్తూ ఈసీ మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. 1,200కు తగ్గించాలి: పిటిషనర్ ఒక్కో పోలింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని 1957 నుంచి 2016 దాకా అమల్లో ఉన్న మేరకు 1,200 ఓటర్లకు తగ్గించాలని పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిõÙక్ మను సింఘ్వీ డిమాండ్ చేశారు. ‘‘పోలింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని 1,500 మంది ఓటర్లకు పెంచడం వారిని తీవ్ర అసౌకర్యానికి గురి చేయడమే. దీనివల్ల బూత్‌ల వద్ద రద్దీ పెరిగి ఓటేసేందుకు చాలా సమయం పడుతుంది. అంతసేపు వేచి చూడలేక ఓటర్లు ఓటేయకుండానే వెనుదిరిగే ప్రమాదముంది. ఎందుకంటే సగటున 11 గంటలపాటు పోలింగ్ జరుగుతుంది. ఈవీఎంల ద్వారా ఒక్కో ఓటు వేసేందుకు 60 నుంచి 90 సెకన్ల దాకా పడుతుంది. ఆ లెక్కన రోజంతా కలిపినా ఒక్కో ఈవీఎంలో 490 నుంచి 660 ఓట్ల కంటే పోలయ్యే అవకాశం లేదు’’ అన్నారు.ఈ వాదనను ఈసీ తరఫు న్యాయవాది మణీందర్‌సింగ్ తోసిపుచ్చారు. ‘‘ఈవీఎంల సామర్థ్యంపై అనుమానాలే అవసరం లేదు. ఒక్కో పోలింగ్ స్టేషన్లలో గరిష్టంగా 1,200కు బదులు 1,500 ఓట్లు పోలయ్యే విధానం 2019 నుంచీ అమల్లో ఉంది. పార్టీలన్నింటికీ ముందుగా వివరించాకే ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. పైగా పోలింగ్ నాడు సాధారణంగా ఉదయపు వేళల్లో పెద్దగా రద్దీ ఉండదు. ఓటర్లంతా ఒకేసారి ఓటేసేందుకు వస్తే మధ్యాహ్నం తర్వాత కాస్త క్యూలు పెరుగుతాయేమో. అలాంటివారు పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటేసేందుకు ఈసీ అనుమతిస్తూనే ఉంది.అవసరమైన చోట్ల పోలింగ్ బూత్‌ల సంఖ్యను పెంచడం వంటి చర్యలూ ఉంటాయి’’ అన్నారు. ఈవీఎంలపై ఏదో రకమైన ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, అది ధర్మాసనానికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఓటింగ్ శాతం పెరగాలని, తద్వారా ఎన్నికల ప్రక్రియలో ప్రజలు వీలైనంత ఎక్కువగా పాల్గొనాలని ధర్మాసనం అభిప్రాయపడింది. బ్యాలెట్ పేపర్‌కు బదులు ఈవీఎంలు తేవడంలో ఉద్దేశమూ అదేనని గుర్తు చేసింది. ఇరు వర్గాల వాదనల అనంతరం విచారణను జనవరి 25కు వాయిదా వేసింది. -
Jharkhand Election 2024: ముగిసిన పోలింగ్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. రెండో విడతలో భాగంగా 38 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. -
మహారాష్ట్రలో క్యాష్ ఫర్ ఓట్స్ ఆరోపణలు
-
సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌పై ఎమ్మెల్యే అభ్యర్థి దాడి
జైపూర్ : పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్న సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌పై (ఎస్డీఎం)పై దాడి ఘటన కలకలం రేపుతుంది. పోలింగ్ బూత్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ వ్యక్తి ఎస్‌డీఎంపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.రాజస్థాన్‌లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఆ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ స్టేషన్లో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.ఆ సమయంలో కాంగ్రెస్ బహిష్క్రుత నేత, డియోలీ-యునియారా ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి నరేష్ మీనా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో ఉన్న ఎస్డీఎం అమిత్ చౌదరిపై దాడి చేశారు. ఎస్డీఎం అమిత్ చౌదరి.. తనతో సన్నిహితంగా ఉన్న ఓ పార్టీ అభ్యర్థికి ఓట్లు పడేలా ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ దాడితో అప్రమత్తమైన పోలీసులు నరేష్ మీనాను పోలింగ్ కేంద్రం బయటకు తీసుకువచ్చారు. ఎస్డీఎం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైటాయించారు. రాజస్థాన్‌లోని ఝుంఝును, దౌసా, డియోలి-ఉనియారా, ఖిన్వ్సర్, చౌరాసి, సాలంబెర్, రామ్‌గఢ్ స్థానాలు ఉప ఎన్నిక కొనసాగుతుంది. కాగా,గతేడాది రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 114 స్థానాల్లో, కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించాయి. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపొందారు. मैं देवली उनियारा से नरेश मीणा का समर्थन कर रहा था परंतु आज जिस प्रकार का गंदा रवैया उनके द्वारा देखा गया वह शर्मनाक है।@NareshMeena__ की अभी कोई हैसियत नहीं है कि वह एक एसडीएम के ऊपर हाथ उठाएं, यह लोकतंत्र व भारतीय प्रशासन पर कलंक है। एकतरफ देश की सबसे कठिन परीक्षा देकर आया एक… pic.twitter.com/urAxAjR3BI— Priyanshu Kumar (@priyanshu__63) November 13, 2024 -
అలాస్కాలో అమెరికా చివరి ఓటరు
ఎటు చూసినా మంచు. గడ్డి తప్పించి నిలబడటానికి ఒక్క చెట్టు కూడా పెరగడానికి అనుకూలంగాకాని మైదాన ప్రాంతాలు. ఎవరికీ పట్టని అమెరికా చిట్టచివరి ప్రాంతంగా మిగిలిపోయిన అలాస్కా గురించి మళ్లీ వార్తలు మొదలయ్యాయి. గత 12 సంవత్సరాల ప్రజాస్వామ్య సంప్రదాయానికి మళ్లీ అక్కడి ఓటర్లు సిద్ధమవడమే ఇందుకు కారణం. అమెరికా పశి్చమ దిశలో చిట్టచివరి పోలింగ్ కేంద్రం ఈ టండ్రా ద్వీపంలోనే ఉంది. అడాక్ ద్వీప ప్రజలు గతంలో మెయిల్ ద్వారా ఓటు పంపించే వారు. 2012 అమెరికా ఎన్నికలప్పుడు మేం కూడా అందరిలా స్వయంగా పోలింగ్‌కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటామని ఉత్సాహం చూపారు. దాంతో అమెరికా ప్రభుత్వం ఇక్కడ తొలిసారిగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ప్రధాన ఓటర్ల జాబితాలో ఇక్కడి వాళ్లంతా చేరిపోయారు. ‘‘మా నగర వాసులం చిట్టచివర్లో ఓటేస్తాం. ఓటింగ్ సరళిని బట్టి ఆలోపే దాదాపు విజేత ఎవరో తెల్సేవీలుంది. అయినాసరే చివర్లో ఓటేస్తున్నామన్న ఉత్సాహం మాలో రెట్టిస్తుంది. ఆ రోజు మాకందరికీ ప్రత్యేకమైన రోజు. మేం ఓటేసేటప్పటికి అర్ధరాత్రి దాటి సమయం ఒంటిగంట అవుతుంది’’అని సిటీ మేనేజర్ లేటన్ లాకెట్ చెప్పారు. అమెరికా చిట్టచివరి భూభాగం అలాస్కా ప్రాంతం అగ్రరాజ్యానికి ప్రత్యేకమైనది. గతంలో రష్యా అ«దీనంలో ఉండేది. ఎందుకు పనికిరాని భూభాగంగా భావించి చాన్నాళ్ల క్రితం అమెరికాకు అమ్మేసింది. ఇటీవలికాలంలో ఇక్కడ చమురు నిక్షేపాలు బయటపడటంతో ఈ ప్రాంతమంతా ఇప్పుడు బంగారంతో సమానం. అత్యంత విలువైన సహజవనరులతో అలరారుతోంది. చిట్టచివరి పోలింగ్ కేంద్రాలున్న అడాక్ ద్వీపం నిజానికి అలేటియన్ ద్వీపాల సముదాయంలో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన బేరింగ్ నది ఈ ద్వీపసముదాయాలకు ఉత్తరదిశలో ఉంటుంది. దక్షిణ దిశలో పసిఫిక్ మహాసముద్ర ఉత్తరప్రాంతం ఉంటుంది. అమెరికా ఈ ద్వీపాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో స్థావరంలా ఉపయోగించుకుంది. తర్వాత నేవీ స్థావరంగా అభివృద్ధిచేసింది. ‘‘ఇక్కడ చివరిగా ఓటేసింది నేనే. 2012లో మిట్ రోమ్మీపై బరాక్ ఒబామా బరిలోకి దిగి గెలిచిన విషయం మాకు మరుసటి రోజు ఉదయంగానీ తెలీలేదు’అని 73 ఏళ్ల మేరీ నెల్సన్ చెప్పారు. గతంలో అక్కడ పోలింగ్ సిబ్బందిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం వాషింగ్టన్ రాష్ట్రానికి మారారు. అలాస్కా ఆవల ఉన్న గ్వామ్, మేరియానా ద్వీపాలు, అమెరికన్ సమోవా వంటి ద్వీపాల్లో ప్రజలు ఉన్నా వారిని ఓటర్లుగా గుర్తించట్లేరు. దీంతో చివరి ఓటర్లుగా అలాస్కా ఓటర్లు చరిత్రలో నిలిచిపోయారు. రెండో ప్రపంచయుద్ధ స్థావరం ఎక్కువ రోజులు మంచును చవిచూసే అలాస్కా గతంలో యుద్ధాన్ని చవిచూసింది. రెండో ప్రపంచయుద్దకాలంలో జపాన్ అ«దీనంలోని అటూ ద్వీపాన్ని ఆక్రమించేందుకు అమెరికా తన సేనలను ఇక్కడికి పంపింది. 1942 ఆగస్ట్‌లో సేనలు ఇక్కడికొచ్చి సైనిక శిబిరాల నిర్మాణం మొదలెట్టాయి. దీంతో శత్రుదేశ విమానాలు ఇక్కడ 9 భారీ బాంబులను జారవిడిచాయి. 1943 మేలో 27,000 మంది అమెరికా సైనికులు ఇక్కడికి చేరుకున్నారు. మెషీన్ గన్లమోతలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ప్రాంతంపై మక్కువతో రచయితలు డాషిల్ హామెట్, గోరే విడల్ కొన్నాళ్లు ఇక్కడే ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్డ్, బాక్సింగ్ ఛాంపియన్ జో లెవీస్, పలువురు హాలీవుడ్ తారలు తరచూ ఇక్కడికి వచి్చపోతుంటారు. 33 వృక్షాల జాతీయవనం ! అలాస్కాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు భారీ వృక్షాల ఎదుగుదలకు సరిపడవు. దీంతో ఇక్కడ గడ్డి, చిన్న మొక్కలు తప్పితే వృక్షాలు ఎదగవు. ఇక్కడ చెట్లు పెంచి అడవిని సృష్టించాలని అమెరికా ప్రభుత్వం 1943–45కాలంలో ఒక ప్రయత్నంచేసింది. చివరికి చేసేదిలేక చేతులెత్తేసింది. అప్పటి ప్రయత్నానికి గుర్తుగా 1960లలో అక్కడి 33 చెట్ల ముందు ఒక బోర్డ్ తగిలించింది. ‘‘మీరిప్పుడు అడాక్ జాతీయ వనంలోకి వచ్చి వెళ్తున్నారు’అని దానిపై రాసింది. నేవీ బేస్ ఉన్నంతకాలం 6,000 మందిదాకా జనం ఉండేవారు. తర్వాత ఇక్కడ ఉండలేక చాలా మంది వలసవెళ్లారు. 2020 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 171 మంది ఉంటున్నారు. 2024 అనధికార గణాంకాల ప్రకారం ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నది కేవలం 50 మంది మాత్రమే. కనీసం పది మంది విద్యార్థులయినా వస్తే స్కూలు నడుపుదామని నిర్ణయించుకున్నారు. ఎలాగోలా గత ఏడాది ఆరుగురు విద్యార్థులతో స్కూలు మొదలుపెట్టారు. తీరా గత ఏడాది నవంబర్‌కు వచ్చేసరికి ఐదుగురు మానేశారు. ఇప్పుడు అక్కడ ఒకే విద్యార్థి ఉన్నారని అలేటియన్ రీజియన్ స్కూల్ డిస్ట్రిక్ సూపరింటెండెంట్ మైక్ హన్లీ చెప్పారు. ‘‘జనం వెళ్లిపోతున్నారు. చివరికి ఎవరు మిగులుతారో. ఈసారి చివరి ఓటు ఎవరేస్తారో చూడాలి’అని అడాక్ సిటీ క్లర్క్ జేన్ లికనాఫ్ చెప్పారు. – యాంకరేజ్(అమెరికా) -
డేటా మటాష్.. స్లిప్‌లు ‘బర్న్’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియలో అధికారుల వ్యవహారశైలి తొలి నుంచీ అనుమానాస్పదంగానే ఉంటోంది. కలెక్టరేట్లోని ఎన్నికల సెల్లో ఉండాల్సిన ఈవీఎంలు భద్రపరిచిన బాక్సు తాళం చెవులు మరోచోట ప్రత్యక్షమవడం దాకా ఈ మాయాజాలం కొనసాగుతూనే ఉంది. బ్యాటరీ స్టేటస్‌పై ముసురుకున్న సందేహాలపై చేపట్టిన రీ– వెరిఫికేషన్ ప్రక్రియలో.. కొత్త బ్యాటరీ వినియోగంతో మొదలైన మాక్ పోలింగ్ వ్యవహారం రెండో రోజూ అదే అనుమానాలతో కొనసాగింది. ఫిర్యాదుదారులు కోరినట్లుగా వెరిఫికేషన్ చేయడం సాధ్యం కాదని అధికారులు అసలు సంగతి తేల్చిచెప్పారు. ఈవీఎం డేటా తీసేశామని (ఎరేజ్).... అంతేకాకుండా వీవీ ప్యాట్లలో స్లిప్‌లను ‘‘బర్న్’’ చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇదంతా చేశామని చెప్పడం గమనార్హం. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించగా దీనిపై తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్సార్ సీపీ గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య, విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ జూన్ 10న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఒకవైపు పోటీ చేసిన అభ్యర్థుల నుంచి అనుమానాలు ఉన్నాయని, రీ–వెరిఫికేషన్ చేయాలంటూ వచ్చిన అభ్యర్థనలను పరిష్కరించకుండానే డేటాను తొలగించాలంటూ ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడటం వెల్లువెత్తుతున్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. రీ–వెరిఫికేషన్‌లో పార్టీల గుర్తులు కాకుండా ఇష్టారీతిన గుర్తులను కేటాయించి మాక్ పోలింగ్ నిర్వహించడం మొదలు అంతులేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్నికల కమిషన్ ప్రస్తుత టెక్నికల్ నిబంధనల్లో (ఎస్వోపీ) బ్యాటరీ పవర్ పర్సంటేజీ అంశం లేదని బెల్ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎం పరిశీలనకు అభ్యర్థి అభ్యర్థి బెల్లాన నిరాకరించినందున మంగళవారం పరిశీలన జరగలేదని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.21 రోజుల తరువాత 99 శాతం బ్యాటరీ స్టేటస్..విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోదాం వద్ద రెండో రోజు మంగళవారం కూడా హైడ్రామా కొనసాగింది. ఈవీఎంల సేఫ్ ట్రంక్ బాక్స్ తాళం చెవి కనిపించలేదంటూ సోమవారం మూడు గంటలు ఆలస్యం చేసిన అధికారులు అర్ధరాత్రి వరకూ మాక్ పోలింగ్ కొనసాగించారు. కొత్త బ్యాటరీ ఉపయోగించగా మాక్ పోలింగ్ ముగిసే సమయానికి 80 శాతం స్టేటస్ చూపించింది. అంటే 20 శాతం తగ్గింది. కానీ మే 13వ తేదీ పోలింగ్ రోజున దాదాపు 12 గంటలు ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ మాత్రం 21 రోజుల పాటు భద్రపరచిన తర్వాత కూడా 99 శాతం చూపించడం పలు సందేహాలకు తావిస్తోంది. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, వీవీ ప్యాట్ల లెక్కింపుతో పాటు ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీసీ ఫుటేజీని ఇవ్వాలని కోరుతూ విజయనగరం లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. గజపతినగరం నియోజకవర్గంలో మే 13వ తేదీన దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరిగిందని, దాదాపు 81.06 శాతం ఓటింగ్ నమోదైందని తమ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈవీఎంకు, వీవీ ప్యాట్లకు బ్యాటరీ స్టేటస్ 50 శాతం ఉన్నట్లు సీసీ కెమెరాల్లోనూ రికార్డు అయ్యిందని పేర్కొన్నారు. పోలింగ్ తర్వాత రమారమి 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం తెరచినప్పుడు బ్యాటరీ స్టేటస్ (పవర్) 99 శాతం చూపించడంపై సందేహం వ్యక్తం చేశారు. ఈ దృష్ట్యా గజపతినగరం అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద పోలింగ్ స్టేషన్ నంబర్ 20లో ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని బొత్స అప్పలనర్సయ్య ఎన్నికల కమిషన్‌ను కోరారు. అలాగే విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోమటిపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుంపాం పోలింగ్స్టేషన్ల తాలూకు ఈవీఎంల బ్యాటరీ స్టేటస్ తెలియచేయాలని, వీవీ ప్యాట్లను ఓట్లతో సరిపోల్చి లెక్కించాలని, ఆయా పోలింగ్ స్టేషన్లలో సీసీ ఫుటేజీ ఇవ్వాలని బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికల కమిషన్‌ను కోరారు. అందుకు అవసరమైన రుసుము వారిద్దరూ చెల్లించారు. అయితే దీని పరిశీలనకు నెల్లిమర్ల ఈవీఎం గోదాం వద్దకు వెళ్లగా... ఈసీఐ ప్రస్తుత టెక్నికల్ ఎస్‌వోపీల్లో బ్యాటరీ పవర్ పర్సంటేజీ అంశం లేదని బెల్ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని బెల్లానకు అధికారులు వివరించారు. దీంతో ఆయన రీ–వెరిఫికేషన్‌కు నిరాకరించారు.డేటా అంతా ఖాళీయే...ఫిర్యాదుదారులు కోరినట్లు వెరిఫికేషన్ చేయడానికి వీలుకాదని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం డేటా తీసేశామని (ఎరైజ్), వీవీ ప్యాట్లలో స్లిప్‌లను ‘‘బర్న్’’ చేశామని అధికారులు పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి నిబంధనల మేరకు ఈ డేటాను 45 రోజుల వరకూ భద్రపరచాలి. జూన్ 4వ తేదీన కౌంటింగ్ సమయంలో సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఫిర్యాదుదారులు వెరిఫికేషన్ కోసం జూన్ 10వ తేదీన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వెరిఫికేషన్ రుసుము చలానా ద్వారా చెల్లించారు. ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఆ ఈవీఎంల్లో డేటా, వీవీ ప్యాట్లలో స్లిప్పులను అధికారులు భద్రపరచాలి. కానీ వాటిని ఆగమేఘాలపై ఆనవాళ్లు లేకుండా చెరిపేయడం కొత్త సందేహాలకు తావిస్తోంది. పైగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే డేటా మొత్తం తొలగించినట్లు అధికారులు పేర్కొనడం ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది.బ్యాటరీ స్టేటస్ గుట్టు రట్టు...వెరిఫికేషన్ కోరిన పెదకాద పీఎస్ నంబర్ 20కు సంబంధించిన ఈవీఎంను సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు బయటకు తీసి దానికి సంబంధించిన బ్యాటరీని అధికారులు సీజ్ చేశారు. ఆ బ్యాటరీకి బదులు మరో కొత్త బ్యాటరీతో ఈవీఎం మాక్ పోలింగ్‌ను సోమవారం అర్ధరాత్రి వరకూ కొనసాగించారు. పార్టీ గుర్తులు లోడ్ చేయకుండా మరేవో గుర్తులు లోడ్ చేసి సుమారు 1,400 ఓట్లు మాక్ పోలింగ్ చేశారు. ఇది ముగిసిన తర్వాత బ్యాటరీ స్టేటస్ పరిశీలిస్తే 80 శాతం నమోదు కావడం గమనార్హం. అలాంటప్పుడు పోలింగ్ రోజున ఈవీఎం, వీవీ ప్యాట్లకు వాడిన బ్యాటరీ స్టేటస్ 21 రోజుల పాటు భద్రపరిచిన తర్వాత కౌంటింగ్ రోజున తెరిచేసరికి 99 శాతం ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. అయితే ఈ విషయం తాము తేల్చలేమని అధికారులు పేర్కొన్నారు. కేవలం మాక్ పోలింగ్‌లో బ్యాటరీ స్టేటస్ ఎంత ఉందో మాత్రమే చెబుతామని అధికారులు సమాధానమిచ్చారు. పాత బ్యాటరీ స్టేటస్ గుట్టు ఏమిటో వెల్లడించాలనేదీ తమ డిమాండ్ అని, అంతేకానీ మాక్ పోలింగ్ కాదని ఫిర్యాదుదారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు తమ డిమాండ్‌ను మెయిల్ ద్వారా పంపించారు.ట్యాంపరింగ్ అయినట్లుంది...కౌంటింగ్ రోజు ఈవీఎంల బ్యాటరీ స్టేటస్ 99 శాతం చూపించిందని ఎన్నికల ఏజెంట్లంతా చెప్పారు. దీంతో జూన్ 10వ తేదీనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశా. దాదాపు 12 గంటలకు పైగా పోలింగ్ కొనసాగడమే గాక 21 రోజుల పాటు స్టాండింగ్ మోడ్‌లో ఉన్నా కౌంటింగ్ రోజున తెరిచేసరికి బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎలా ఉందనేది మా ప్రశ్న. కానీ అధికారులు మేము కోరినట్లు కాకుండా కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ చేస్తామన్నారు. దీన్ని మేం వ్యతిరేకించాం. ఆ బ్యాటరీ స్టేటస్ ఇప్పుడు చూసినా 99 శాతం ఎందుకు కనిపిస్తోంది? ఉపయోగించిప్పుడు తగ్గిపోవాలే కానీ పెరగడం ఏమిటన్న ప్రశ్నకు ఎన్నికల కమిషన్ సరైన సమాధానం ఇవ్వలేకపోతోంది. ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ఈసీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని నాకు అనిపిస్తోంది. దీనిపై న్యాయపోరాటం చేయాలని యోచిస్తున్నాం.– బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ, విజయనగరంకౌంటింగ్ రోజే ప్రశ్నించాం..ఈవీఎం బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఉండటాన్ని కౌంటింగ్ రోజే మా పార్టీ ఏజెంట్లు గుర్తించారు. అధికారులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదన్నారు. జూన్ 10వ తేదీనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. పెదకాద పోలింగ్ స్టేషన్లో ఉదయం 7 నుంచి రాత్రి 8:30 గంటల వరకూ దాదాపు 1,400 ఓట్ల పోలింగ్ జరిగింది. ఈ ప్రక్రియలో బ్యాటరీ స్టేటస్ తగ్గాలి కానీ 21 రోజుల తర్వాత కౌంటింగ్ రోజు కూడా 99 శాతం ఉండటం సందేహాలకు తావిస్తోంది. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని అన్ని రాజకీయ పార్టీలూ సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ చేస్తే బ్యాటరీ స్టేటస్ 80 శాతానికి తగ్గింది. దీనిపై సందేహాలను నివత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని, అదనంగా ఈవీఎంలను కొనుగోలు చేశారని.. ఇలా పలు చర్చలు దేశవ్యాప్తంగా సాగుతున్నాయి. వీటన్నింటిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం కూడా స్పందించాలి.– బొత్స అప్పలనర్సయ్య, మాజీ ఎమ్మెల్యే, గజపతినగరంనిలిచిన ఈవీఎం పరిశీలననెల్లిమర్ల ఈవీఎం గోదాంలో ఈవీఎం పరిశీలన ప్రక్రియ నిలిచిపోయినట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రం కంట్రోల్ యూనిట్ బ్యాటరీ పవర్ పర్సంటేజ్‌ను అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అడిగారని, అయితే ఈసీఐ ప్రస్తుత టెక్నికల్ ఎస్‌వోపీలో బ్యాటరీ పర్సంటేజ్ లేదని బెల్ ఇంజనీర్లు, అధికారులు ఆయనకు తెలియజేశారని పేర్కొన్నారు. దీంతో ఆయన నిరాకరించడంతో ఈవీఎం పరిశీలన జరగలేదన్నారు. -
ఈవీఎంలు ఇక్కడ.. తాళాలు ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతుండగా వాటిని నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల యంత్రాంగం మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోదాం వద్ద జరిగిన హైడ్రామానే దీనికి నిదర్శనం. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు.. ఈవీఎంలున్న ట్రంక్ పెట్టె తాళం చెవి మాత్రం దొరకలేదని తాపీగా చెప్పడంతో దాదాపు రెండు మూడు గంటల పాటు గందరగోళం నెలకొంది. అన్నిచోట్లా గాలించి ఎట్టకేలకు తాళం చెవి తెచ్చేవరకు ఈవీఎంల గోదాం వద్ద కలెక్టర్ తన బృందంతో కలసి పడిగాపులు కాయక తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు – వీవీ ప్యాట్లలో ఓట్ల స్లిప్పులను లెక్కించి సరిపోల్చాలని కోరుతూ విజయనగరం లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. గజపతినగరం నియోజకవర్గంలో మే 13వ తేదీన దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరిగిందని, దాదాపు 81.06 శాతం ఓటింగ్ నమోదైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలకు, వీవీ ప్యాట్లకు బ్యాటరీ కనీసం 50 శాతమైనా వినియోగమై ఉంటుందన్నారు. అయితే దాదాపు 21 రోజుల తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం వాటిని తెరిచినప్పుడు బ్యాటరీ స్టేటస్ (పవర్) 99 శాతం చూపించడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అందువల్ల గజపతినగరం అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద పోలింగ్ స్టేషన్ నంబరు 20లో ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని కోరారు.తలుపులు తెరిచారు.. తాళం చెవి మరిచారుపోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈవీఎంలను, వీవీ ప్లాట్లను నెల్లిమర్లలోని గోదాంలో భద్రపరిచారు. నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టరు ప్రతి నెలా వాటిని కచ్చితంగా తనిఖీ చేయాలి. బొత్స అప్పల నర్సయ్య, బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు సోమవారం వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రెండు రోజుల క్రితమే అధికారులకు తెలుసు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల కల్లా జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు ఎన్నికల కమిషన్ నియమించిన బెల్ ఇంజనీర్ల బృందం గోదాం వద్దకు చేరుకుంది. అయితే ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు ఈవీఎంలున్న ట్రంక్ పెట్టె తాళం చెవి మాత్రం మరచిపోయినట్లు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి ఆ తాళాలు కలెక్టరేట్లోని ఎన్నికల సెల్ వద్ద ఉండాలి. అయితే మధ్యాహ్నం కావస్తున్నా తాళం చెవి రాకపోవడంతో పగలగొట్టేందుకు అధికారులు సిద్ధం కాగా ఫిర్యాదుదారుల తరఫున హాజరైన బెల్లాన వంశీ అభ్యంతరం చెప్పారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎట్టకేలకు తాళాలు పట్టుకొచ్చి బాక్స్‌లను తెరిచారు.మాక్ పోలింగ్‌లోనూ చిత్ర విన్యాసాలు..ఫిర్యాదుదారులు పరిశీలించాలని కోరిన పెదకాద పీఎస్ నంబరు 20కి సంబంధించిన ఈవీఎంను బయటకు తీసి బ్యాటరీని సీజ్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆ బ్యాటరీకి బదులు కొత్త బ్యాటరీతో ఈవీఎం మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే పార్టీల గుర్తులు గాకుండా తమకు నచ్చిన గుర్తులు లోడ్ చేసి మాక్ పోలింగ్ ప్రారంభించారు. వీవీ ప్యాట్లను కూడా పెట్టలేదు. సుమారు 1,400 ఓట్లున్న పీఎస్‌కు సంబంధించిన ఈవీఎంను కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్థరాత్రి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ రోజు ఏవిధంగా ప్రక్రియ సాగిందో అదే రీతిలో నిర్వహిస్తేనే పవర్ ఎంత వినియోగమైందో తెలుస్తుందని, అలాకాకుండా మొక్కుబడిగా మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఉపయోగం లేదని బొత్స అప్పల నర్సయ్య, బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఈవీఎం, వీవీ ప్యాట్లకు వినియోగించిన బ్యాటరీ స్టేటస్ కౌంటింగ్ నాటికి ఇంకా 99 శాతం ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. మాక్ పోలింగ్ కోసం వాడిన బ్యాటరీ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు అధికారికంగా నమోదు చేయాలని కలెక్టర్‌ను కోరారు.నేడు కూడా తనిఖీ కొనసాగింపు...విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం కోమటిపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుంపాం పోలింగ్స్టేషన్ల తాలూకు ఈవీఎంలను, వీవీ ప్యాట్లను తనిఖీ చేయాలన్న బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు మంగళవారం ఆ ప్రక్రియ కొనసాగనుంది. -
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!
‘ది హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్ ఆఫ్ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్ ఆఫ్ గాడ్’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్ సీడింగ్ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్ ఆఫ్ గాడ్) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్ లేదా మయన్మార్ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్ సీడింగ్ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్ చేస్తున్నారా? వేలాది పోలింగ్ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్ పదవులు కావు. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వీడియో: మురికి కాల్వలో ఈవీఎంలు, వీవీప్యాట్స్
కోల్కత్తా: తుది దశలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. సౌత్ పరగణా-24లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం, వీవీప్యాట్లను మురికి కాల్వలోకి విసిరేశారు.కాగా, బెంగాల్లో పోలింగ్ సందర్భంగా పరిస్థితులు అదుపు తప్పాయి. సౌత్ పరగణా-24లో ఉన్న కుల్టై వద్ద పోలింగ్ బూత్ 40, 41లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం బూత్‌లో ఉన్న ఈవీఎంలు, వీవీప్యాట్లను మురికి కాల్వలోకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. VIDEO | Lok Sabha Elections 2024: EVM and VVPAT machine were reportedly thrown in water by a mob at booth number 40, 41 in Kultai, South 24 Parganas, #WestBengal. (Source: Third Party)#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/saFiNcG3e4— Press Trust of India (@PTI_News) June 1, 2024ఇక, ఈ ఘటనపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించారు. ఈ సందర్భంగా..‘ఈరోజు ఉదయం 6.40 గంటలకు బేనిమాధవ్‌పూర్ ఎఫ్పీ స్కూల్ సమీపంలోని సెక్టార్ ఆఫీసర్ రిజర్వ్ ఈవీఎంలు, పేపర్లను కాల్వలోకి విసిరేశారు. ఈ క్రమంలో సెక్టార్ ఆఫీసర్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ప్రస్తుతం అక్కడ పోలింగ్ కొనసాగుతోంది’ అంటూ ట్విటర్ వేదికగా తెలిపింది. (1/2)Today morning at 6.40 am Reserve EVMs & papers of Sector Officer near Benimadhavpur FP school, at 129-Kultali AC of 19-Jaynagar (SC) PC has been looted by local mob and 1 CU, 1 BU , 2VVPAT machines have been thrown inside a pond.— CEO West Bengal (@CEOWestBengal) June 1, 2024 -
రేపే చివరి విడత పోలింగ్
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రేపు(శనివారం) చివరి(ఏడో)విడత పోలింగ్ జరగనుంది. ఈమేరకు ఏడో విడత పోలింగ్‌కు కేంద్రం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏడో విడతలో భాగంగా 57 లోక్ సభ స్థానలకు పోలింగ్ జరగనుంది. దీంతోపాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 స్థానాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తారు. రేపు(శనివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 10.06కోట్ల మంది ఓటర్లలో 5.24 కోట్లమంది పురుషులు, 4.82కోట్ల మంది మహిళ ఓటర్లు, 3574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రముఖుల స్థానాలుప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( వారణాసి), బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ (మండి) స్థానాల్లో పోలింగ్ జరగనుంది. వీరితో పాటు పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. -
పసుపు పూసుకున్న పోలీసులు
-
బాబు పై భక్తి చాటుకున్న పోలీసులు
-
ఐదు విడతల్లో భారీగా తగ్గిన పోలింగ్
-
తగ్గిన పోలింగ్ శాతం
-
పగడ్బందీగా ఏర్పాట్లు అల్లర్లు చేస్తే ఇక అంతే
-
పచ్చ ఖాకీల కుట్ర బట్టబయలు
-
ఎమ్మెల్సీ పోలింగ్ 72.37%.. ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న ఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియాల్సి ఉన్నా ఓటర్లు బారులు తీరారు. ఆ సమయంలోగా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన అందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగింది. మొత్తంగా 72..37 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల కౌంటింగ్ జూన్ 5న జరగనుంది. ఈ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉండటంతో బ్యాలెట్ పేపర్‌కూడా భారీగానే ఉంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.గతంలో కంటే తగ్గిన పోలింగ్మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 కొత్త జిల్లాల్లో గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది. 2021 ఎన్నికల్లో 5,05,565 మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా అందులో 3,85,996 మంది (76.35 శాతం) ఓటువేశారు. ఈసారి 4,63,839 మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు. ఈసారి పోలింగ్ 68.65 శాతం నమోదైంది. నల్లగొండ సమీపంలోని దుప్పపల్లి వేర్ హౌజింగ్ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ నల్లగొండకు తరలించే ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి తరువాత కూడా కొనసాగింది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.నార్కట్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి ధర్నాపోలింగ్ సందర్భంగా నార్కట్‌పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసుకున్నామని చెబుతున్న డోకూరి ఫంక్షన్ హాల్ వద్దకు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌గౌడ్ తన అనుచరులతో అక్కడికి వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అశోక్ అనుచరులు వీడియో తీస్తుండగా తోపులాట జరిగింది. దీంతో తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ ముందు« ధర్నాకు దిగారు. కాగా, నకిరేకల్‌లోని జడ్పీ హైస్కూల్లో పోలింగ్ కేంద్రంలో ఓ వికలాంగురాలు తనకు ఓటు వేసేందుకు వీల్ చైర్ అందుబాటులో పెట్టలేదని నిరసన తెలిపారు.ప్రశాంతంగా పోలింగ్ : రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందనపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారన్నారు. ప్రత్యేకించి మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54 శాతం, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. -
MLC ఎన్నికల్లో ఘర్షణ డబ్బులు పంచుతున్న నేతలు
-
కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్
-
ముగిసిన ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
Updatesముగిసిన ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశంమహబూబాబాద్ 2 గంటల వరకు పోలింగ్ శాతంపురుషులు: 10745మహిళలు: 6462మొత్తం: 17207శాతం: 49.26% సూర్యాపేట జిల్లా :ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ 2 గంటల వరకు 52.8 శాతంMale: 17968Female: 9220Total: 27188యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో 2 గంటల వరకు 47.92 శాతం నమోదుపురుషులు:9673మహిళలు: 6659మొత్తం: 16332శాతం: 47.92 జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మధ్యాహ్నం 2:00 గంటల వరకు 49.66% పోలింగ్ నమోదు వరంగల్ జిల్లా వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు పోలింగ్ శాతం 30.18 %జనగామ జిల్లా:జనగామ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 12:00 గంటల వరకు 28.38% పోలింగ్ నమోదుమహబూబాబాద్ జిల్లా:వరంగల్-ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలలో ఉదయం 12:00 గంటల వరకు 28.49 పోలింగ్ శాతం నమోదుహనుమకొండ: ప్రశాంతంగా కొనసాగుతున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్మధ్యాహ్నం 12గంటల వరకు హనుమకొండ జిల్లాలో పోలింగ్ శాతం 32.90యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 27.71 శాతం నమోదు పురుషులు: 5902మహిళలు: 3543 మొత్తం: 9445 నల్లగొండ జిల్లా:జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 పోలింగ్ శాతం నమోదునల్గొండ:సూర్యాపేట జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు పోలింగ్ శాతం 31.27%పురుషులు: 10813మహిళలు: 5290మొత్తం: 16103 నల్గొండ:మిర్యాలగూడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ మంత్రి గుంతకంట్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు.నల్గొండ:తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్నల్లగొండ:నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు గన్ మెన్ కేటాయింపునార్కెట్పల్లి గొడవ నేపథ్యంలో అధికారుల నిర్ణయంవరంగల్:మహబూబాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణపోలీసులకు ఓటు వేయాలని ప్రసన్నం చేసుకుంటున్న పార్టీ నాయకుల మధ్య స్వల్ప ఘర్షణ200 మీటర్ దూరం లో ఉన్నాం మీ కు ఇబ్బంది ఇంటి అని పోలీసుల తో వాగ్వివాదంనల్లగొండ ఎన్జీ కాలేజ్ లో అధికారుల నిర్లక్ష్యంవికలాంగులు ఓటేసేందుకు కనీస సౌకర్యాలు లేని వైనంమేమేం చేయాలి చైర్లు లేకపోతే అంటూ సిబ్బంది సమాధానంఇబ్బందులు పడుతోన్న వికలాంగులు నల్లగొండ నార్కెట్‌పల్లి లో ఓ షెడ్డులో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన స్వతంత్ర అభ్యర్థి అశోక్తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట స్వతంత్ర అభ్యర్థి అశోక్ నిరసనస్టేషన్ ఎదుట బైఠాయించిన అశోక్ సూర్యాపేటలో 11 శాతం పోలింగ్..సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీ ఎన్నికలో పది వరకు గంటల పోలింగ్ శాతం:Male: 4258Female: 1570Total: 5828Percentage: 11.32% నల్లగొండ:నార్కెట్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తతఓపార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ఇరు వర్గాల మధ్య వాగ్వాదంపోలీసులకు ఫిర్యాదు చేసిన అశోక్ నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న) ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ: సూర్యాపేట: గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 459 బూత్‌లో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్:మహబూబాబాద్ లోని 178వ పోలింగ్ బూత్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్: జనగామ ప్రెస్టన్ కళాశాలలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఖమ్మంఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా చర్ల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మందకొడిగా ఓటింగ్ జరుగుతోంది.చర్ల మండలం లో మొత్తం 1122 ఓటర్లు ఉన్నారు.వీరికోసం చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.గ్రాడ్యుయేట్ లు కూడా అర్ధ రాత్రి వరకు రాజకీయ పార్టీల నేతల రాక కోసం ఎదురు చూశారు.కొంతమంది నాయకులు గ్రాడ్యుయేట్ లను కలిసి అన్ని చూసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిమూడు ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు వరంగల్:హన్మకొండ పింగిలి కళాశాల పోలింగ్ బూతులో ఓట్లు వేయడానికి క్యూలో ఉన్న పట్టభద్రులు నల్లగొండ:మిర్యాలగూడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు వరంగల్:పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోందిహనుమకొండ పింగళి కాలేజీ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిసూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైందిఓటు వేయడానికి పట్టభద్రులు తరలి వసున్నారు ఓటు వేయడానికి క్యూలైన్లో నిల్చున్నారు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభం అయిన పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభంవరంగల్- నల్గొండ - ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులువరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారువీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు 296 బ్యాలెట్ బాక్స్ లు అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌నేడు వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్ళిన సిబ్బంది, అధికారులుసోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బరిలో 52 మంది ఉన్నా... ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.605 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో విస్తరించి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం.వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది ఓటర్లునల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుపట్టభద్రులను ఆకట్టుకునే పనిలో మూడు ప్రధానపార్టీల అభ్యర్థుల ప్రచారంఉదయం 6 నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలుఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.ఈరోజు తేదిన ప్రత్యేక సెలవువరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు -
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
కోల్‌కతా: ఆరో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా బెంగాల్‌లోని ఝర్గ్రామ్లో బీజేపీ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గర్బెటాలోని పోలింగ్ బూత్‌లో కొందరు దుండగులు ఓటర్లను బెదిరిస్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి ప్రణత్‌టుడు ఆయన అనుచరులతో పోలింగ్ బూత్‌కు వెళ్లారు.వారు అక్కడికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ఆయనపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ప్రణత్ టుడు, పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రణత్‌ను అక్కడినుంచి సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో బీజేపీ నేత కారు ధ్వంసమైంది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రణత్ సెక్యూరిటీ గార్డు పోలింగ్ బూత్ వెలుపల ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళపై దాడి చేశాడని టీఎంసీ నేతలు కౌంటర్ ఆరోపణలు చేశారు. -
ఢీల్లీలో కొనసాగుతున్న పోలింగ్
-
నేడే 6వ దశ పోలింగ్
-
ఆ వీడియో లీక్ అయింది.. మేము విడుదల చేయలేదు: సీఈవో
సాక్షి, అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సంఘటనకు సంబంధించి మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వీడియో లీక్‌తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆ వీడియో తమ నుంచి బయటకు వెళ్లలేదని గురువారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులకు చెప్పారు. ఆ వీడియో ఎలా బయటకు వెళ్లిందన్న దానిపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలపై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎం ధ్వంసంపై సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్టు మీనా తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో పరామర్శల పేరుతో వెళ్లి రాజకీయాలు చేయవద్దని ఆయన సూచించారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లకు అనుమతిస్తే రేపు వేరే పార్టీ వాళ్లు వెళ్తామంటారని, అందుకే బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లనీయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లువచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమష్టి కృషితో ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టు వివరించారు. అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపు జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఏ రోజు, ఎన్ని గంటలకు ఎన్నిటేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుందో రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను వేర్వేరుగా లెక్కింపుస్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరుగా ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన తరువాతనే ఈవీఎంల వారీగా ఓట్లను లెక్కించాలని సూచించారు. హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లను కౌటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్లో ఎప్పటి కప్పుడు డాటా ఎంట్రీకి సుశిక్షితులై సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. గుర్తింపు కార్డులు లేనివారిని, అనధికార వ్యక్తులను, ఇతరులను ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రం ప్రాంగణాల్లోకి అనుమతికుంచ కుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రత కొనసాగుతున్నదని, స్ట్రాంగ్ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్.హరీంధర ప్రసాద్‌తో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
మిగిలిన రెండు దశలకు కాంగ్రెస్ ప్రచారాస్త్రాలివే?
దేశంలో ఏడు విడతలుగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. ఆరు, ఏడో దశ ఎన్నికలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ రెండు దశల్లోనూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేసిందని సమాచారం. ఢిల్లీ, హర్యానా, హిమాచల్, పంజాబ్ కాంగ్రెస్‌కు చాలా ముఖ్యమైనవి. ఈసారి ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు రాబడుతందని పార్టీ అంచనా వేస్తోంది.ఈ నాలుగు రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగిలిన మూడు స్థానాల్లో పోటీ బీజేపీ, ఇండియా కూటమి మధ్యే నెలకొంది. హర్యానా, హిమాచల్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో మొత్తం 35 సీట్లు ఉన్నాయి. గతంలో వాటిలో 24 సీట్లు బీజేపీకి దక్కగా, రెండు సీట్లు ఎన్డీఏలో భాగమైన అకాలీదళ్‌కు దక్కాయి. కాంగ్రెస్‌కు ఎనిమిది సీట్లు, ఆప్‌కు ఒక సీటు వచ్చాయి. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ మెరుగైన పలితాలు సాధిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఈ రాష్ట్రాల్లో పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.ఢిల్లీలోని ఏడు స్థానాల్లో కాంగ్రెస్, ఆప్‌తో కలిసి పోటీకి దిగింది. దీంతో కాంగ్రెస్, ఆప్ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈసారి చీపురు గుర్తు బటన్‌ను నొక్కి, కేజ్రీవాల్‌కు ఓటు వేస్తానని రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో మోదీ ప్రభుత్వ హ్యాట్రిక్‌ను అడ్డుకునేందుకు ఇరు పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయి.ఈ రెండు దశల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పాటు రైతుల సమస్యలు, అగ్నివీర్ అంశంపై దృష్టి పెడుతున్నదని సమాచారం. హర్యానాలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కురుక్షేత్ర సీటును ఆప్‌కి ఇచ్చింది. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఇక్కడ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా గట్టి పునాదిని ఏర్పర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ జోరుగా ర్యాలీలు నిర్వహిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ రాష్ట్రంలోని మహేంద్రగఢ్, పచ్కుల, సోనిపట్‌లలో మూడు ర్యాలీలు నిర్వహించారు. -
అసలు వీడియో ఈసీ ఎందుకు దాస్తుంది?
-
రికార్డులు బద్దలు కొట్టిన శ్రీనగర్, బారాముల్లా ఓటర్లు
దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకూ ఐదు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఇంకా రెండు దశల పోలింగ్ మిగిలివుంది. ఐదవ దశ ఓటింగ్‌లో జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదయ్యింది.సోమవారం జరిగిన పోలింగ్‌లో బారాముల్లాలో 59 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇది 1984 తర్వాత అత్యధికం. కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారి పీకె పాల్ ఈ వివరాలను తెలిపారు. 1967లో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని, అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు బారాముల్లా లోక్ సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందన్నారు. 1984లో బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా 58.90 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఇది 59శాతంగా ఉంది. ఈ లోక్‌సభ స్థానంలో మొత్తం 17,37,865 మంది ఓటర్లు ఉన్నారు. బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలోని 2,103 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరిగింది. 2019లో ఈ నియోజకవర్గంలో 34.6 శాతం ఓటింగ్ జరగగా, 1989లో అది 5.48 శాతం మాత్రమే ఉంది.దీనికి ముందు నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల్లో శ్రీనగర్‌లో 38.49 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత అత్యధికం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఇవే మొదటి సార్వత్రిక ఎన్నికలు. ఇక్కడి ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు జమ్మూ కశ్మీర్ ఓటర్లకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
బీజేపీకి 8 సార్లు ఓటు! యూపీ యువకుడు అరెస్ట్
లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఈ రోజు ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర పదేశ్‌కు చెందిన ఓ యువ ఓటర్ చేసిన పనికి పోలీసుల చేత అరెస్ట్ అయ్యాడు.నాలుగో విడత పోలింగ్‌లో యూపీలోని ఫరూఖాబాద్ పోలింగ్ కేంద్రంలో ఓ యువ ఓటరు ఏకంగా ఎనిమిదిసార్లు ఓటు వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు షేర్ చేయడంతో పోలీసులు స్పందించారు.BIG EXPOSE 🚨⚡Akhilesh Yadav has shared this video from Uttar Pradesh in which a boy has voted 8 times for BJP with different slips Hi @ECISVEEP when are you going to wake up from your sleep? This is violation of election code, and must go for repolling on this booth. pic.twitter.com/Z06u9xqDor— Amockxi FC (@Amockx2022) May 19, 2024 ఏఆర్ఓ ప్రతీత్ త్రిపాఠి ఫిర్యాదు ఆధారంగా నయా గావ్ పోలీస్ స్టేషన్లో సదరు యువకుడిపై అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ యువకుడిని రాజన్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.అతను ఫరూఖాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్‌పుత్‌కు పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంపై 8 సార్లు నొక్కి ఓటు వేసిననట్లు వీడియోలో తెలుస్తోంది.ఈ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ స్పందించారు. ‘ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను గమనించాం. జిల్లా ఎన్నికల అధికారి చర్యలు తీసుకుంటారు’అని అన్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రంలోని అధికారులను పోల్ ప్యానెల్ సస్పెండ్ చేసింది. ‘ప్రియమైన ఎలక్షన్ కమిషన్, మీరు ఇది చూశారా? ఒక వ్యక్తి 8 సార్లు ఓటు వేశాడు. ఇది స్పందించాల్సి సమయం’ అని కాంగ్రెస్ ‘ఎక్స్’లో పేర్కొంది. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సైతం దినికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అదేవిధంగా ‘ఈ ఘటనను ఎన్నికల సంఘం తప్పుగా భావిస్తే.. వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే బీజేపీ బూత్ కమిటి నిజమైన లూటీ చేసే కమిటీ అని అర్థమవుతుంది’అని అఖిలేష్ యాదవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
ఓట్ల కోసం రిబేట్లు.. ప్రోత్సాహక పథకం షురూ!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ ‘ఓటు వేయండి- డిస్కౌంట్ పొందండి’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఢిల్లీ ఓటర్లు మే 25 న ఓటు వేశాక, కొన్ని మార్కెట్లలో షాపింగ్ చేస్తే వారికి కొంతమేరకు రాయితీ ఇవ్వనున్నారు. అలాగే వివిధ వస్తువులపై ఆఫర్లు అందజేయనున్నారు. ఫలితంగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుంటారని ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ భావిస్తోంది.ఢిల్లీలోని 50కి పైగా చిన్న, పెద్ద మార్కెట్లలోని వ్యాపారులు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభించారు. కశ్మీర్ గేట్, కమలా నగర్, లజ్‌పత్ నగర్, చాందినీ చౌక్, రోహిణి, కరోల్ బాగ్, నెహ్రూ ప్లేస్ తదితర ప్రాంతాల్లోని పలు మార్కెట్లలో ఇటువంటి ఆఫర్లు అందించనున్నారు. ఓటర్లు తమ ఓటువేశాక, వారి వేలిపై పెట్టే సిరా గుర్తును చూపిస్తే ఈ మార్కెట్లలో కొనుగోళ్లపై 15 నుంచి 25 శాతం రాయితీ అందించనున్నారు.ఇటువంటి ఆఫర్ ఆహారపానీయాలపై కూడా ఇవ్వనున్నారు. గత నాలుగు దశల ఓటింగ్ ట్రెండ్లను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ వ్యాపారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రత్యేక తగ్గింపు కేవలం ఢిల్లీ ఓటర్లకు మాత్రమే కాదని, ఐదవ దశలో ఓటు వేసిన సమీప ప్రాంతాల ఓటర్లు కూడా మార్కెట్లలో ఈ తగ్గింపు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ తెలిపింది. -
ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
దేశంలో ఓ వైపు ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు ఎండ వేడిమి జనాలకు చెమటలు పట్టిస్తోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో మోదీ కూలర్‌కు డిమాండ్ ఏర్పడింది.వారణాసిలోకి చెందిన ఎలక్ట్రీషియన్ రాకేష్ గుప్తాకు ‘మోదీ కూలర్’ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. దీంతో అతను వివిధ పరికరాలతో మోదీ కూలర్ తయారుచేసి షాపు ముందు ఉంచాడు. దీనిని చూసిన వినియోగదారులు మోదీ కూలర్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాను రూపొందించిన కూలర్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నదని రాకేష్ గుప్తా తెలిపారు. ఈ కూలర్ కోసం ఎవరైనా ఆర్డర్ ఇస్తే మూడు నాలుగు రోజుల్లో తయారు చేసి, వారికి అందజేస్తున్నానని ఆయన తెలిపారు.వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో చివరి దశలో అంటే జూన్ ఒకటిన పోలిగ్ జరగనుంది. ఈ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధాని మోదీ సహా మొత్తం ఏడుగురు ప్రధాన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ ఎన్నికల బరిలో ఉన్నారు. -
దాడిచేసింది వారు.. మాపై కేసులా?
మాచవరం: వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించామన్న కోపంతో మా ఇళ్లపై దాడులు చేసి... బీభత్సం సృష్టించిన టీడీపీ వర్గీయులను వదిలేసి... బాధితులైన మాపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మాచవరం పోలీస్‌స్టేషన్ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్ రోజున ఓట్లు వేసేందుకు వచ్చిన మమ్ములను అడ్డుకున్నారనీ, ఇదేమని ప్రశ్నించిన వారిపై దూషణకు దిగి, పోలింగ్ అనంతరం మీ సంగతి చూస్తామంటూ బెదిరించారని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ఇతర గ్రామాలకు చెందిన టీడీపీ రౌడీలను కార్లలో తీసుకువచ్చి మా ఇళ్లపై దాడులు చేసి, ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేస్తూ, ఇంట్లో ఉన్న మహిళలను దూషిçస్తూ, భౌతిక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. బైకులు, ఆటోలు, ఇతర వాహనాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారని, భయాందోళనతో మేమంతా పొలాల వెంట పరుగులు తీశామని, మహిళలు గంగమ్మగుడిలో తలదాచుకున్నారని చెప్పారు. అక్కడకు కూడా వెళ్లి గుడి గేటు తాళాలు బిగించి ఇబ్బందులు పెట్టారని, సుమారు నాలుగు గంటల పాటు టీడీపీ గూండాలు గ్రామంలో వీరంగం చేస్తుంటే ఒక్క పోలీస్ అధికారి కూడా గ్రామానికి రాలేదన్నారు. విషయం తెలుసుకున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ బాధితులను పరామర్శించేందుకు గ్రామానికి మరునాడే చేరుకుని మహిళలను ఇళ్ల వద్దకు చేర్చి, విధ్వంసానికి గురైన ఇళ్లను, ఆస్తి నష్టాన్ని పరిశీలిస్తున్న సమయంలో వారిపైనా దాడికి యత్నించారని చెప్పారు. రాళ్లతో దాడిచేసి, కార్లను సైతం పగలగొట్టారని చెప్పారు. ఆ సమయంలో పోలీసులు గాలిలోకి కాల్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తాము భయంతో వేరే ఊళ్లో తలదాచుకుంటే తమపై కేసులు పెట్టడం దారుణమన్నారు.మాపై కేసులు పెట్టడం అన్యాయంగ్రామంలో టీడీపీ వాళ్లు సృష్టించిన బీభత్సానికి భయంతో గ్రామాన్ని విడిచి పొరుగూరిలో బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకున్నాం. భార్యాపిల్లలు ఇంటి వద్ద బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గ్రామంలో వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊళ్లో లేని మాపై పోలీసులు కేసులు పెట్టడం అన్యాయం. – అంబటి వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీకి ఓటేశామనే మాపై కక్షవైఎస్సార్సీపీకి ఓటేశామని మాపై కక్ష పెంచుకున్నారు. బీసీలకు పార్టీలు ఎందుకురా అంటూ పలుసార్లు అవమానించారు. అయినా ఓర్చుకొని పార్టీకోసం నిలబడ్డాం. వారి దాడులతో ఊరు వదిలి వెళ్లి ఐదు రోజులైంది. మాపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు. – మేకల హనుమంతుపోలీసులు రక్షణ కల్పించాలిఎన్నికల రోజు టీడీపీ గూండాలు చేసిన దాడులకు భయపడి పారిపోయాం. భార్యా పిల్లలతో బంధువుల వద్ద తలదాచుకుంటున్నాం. టీడీపీ వాళ్లు దాడులు చేస్తే మాపై కేసులు పెట్టారు. ఇదేమి న్యాయం. గ్రామంలోకి వెళ్లాలంటే భయంగా ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలి. – బొంతా ప్రసాద్ -
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
AP: పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుంది
సాక్షి, అమరావతి: పరిపాలన నచ్చితే ప్రజలు తమ మద్దతు ఓట్ల రూపంలో చూపిస్తారని, అందుకు అనుగుణంగానే పోలింగ్ శాతం పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌కు, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కేసీఆర్‌కు ప్రజలు వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టటాన్ని ఇందుకు నిదర్శనంగా ఉదహరిస్తున్నారు. ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్ కనిపిస్తోందని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం గట్టడం ఖాయమని, అందుకనే పోలింగ్ శాతం పెరిగిందని విశే్లషిçÜ్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతను సూచిస్తోందనే ప్రచారంలో నిజం లేదని సీనియర్ రాజకీయ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చితే నిస్సంకోచంగా మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని పేర్కొంటున్నారు.ఈ మంచి కొనసాగేలా..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 99 శాతం హామీలను అమలు చేయడంతోపాటు పథకాలన్నీ కొనసాగిస్తామని ప్రజల్లో విశ్వాసం కల్పించడంతో పెద్ద ఎత్తున పోలింగ్‌కు తరలి వచ్చారని, ఈ మంచి కొనసాగాలని కోరుకుంటున్నారనేందుకు పోలింగ్ శాతం పెరగడమే రుజువని సీనియర్ రాజకీయవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 2019లో కంటే 2024లో పోలింగ్ శాతం పెరగడం వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చూడాలన్న ఆకాంక్షలకు సంకేతమని పేర్కొంటున్నారు.వైఎస్సార్ పాలనే రుజువు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో 69.8 శాతం పోలింగ్‌తో దివంగత వైఎస్సార్ అధికారం చేపట్టారు. 2004 నుంచి 2009 వరకు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలో 2009 ఎన్నికల్లో 72.7 శాతం పోలింగ్‌తో ప్రజలు మరోసారి వైఎస్సార్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు.విద్య, వైద్య రంగాలలో తొలిసారిగా పెను మార్పులు తెచ్చిన వైఎస్సార్‌కు జేజేలు పలికారు. పోలింగ్ శాతం పెరగడం వల్ల వైఎస్సార్‌కు ప్రజల మద్దతు పెరిగినట్లు స్పష్టంగా కళ్లెదుట కనిపించిన వాస్తవమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2004కు మించి 2009లో పోలింగ్ 2.9 శాతం పెరిగింది.కేసీఆర్‌కు రెండుసార్లు అధికార పగ్గాలు..రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో 2014 ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్ నమోదు కాగా కేసీఆర్ అధికారం చేపట్టారు. కేసీఆర్ పాలన నచ్చడంతో 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్‌తో మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.సానుకూల ప్రచారంతో..ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 79.77 శాతం పోలింగ్‌తో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా దీవించారు. ఐదేళ్ల సీఎం జగన్ పాలన నచ్చడంతో పాటు పథకాలన్నీ కొనసాగాలని ప్రజలు కోరుకోవడంతో ఈదఫా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓట్లు వేశారని, అందుకే పోలింగ్ శాతం 81.86 శాతానికి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మళ్లీ సీఎంగా జగనే ఉండాలని ప్రజలు భావిస్తున్నారనేందుకు గత ఎన్నికల కంటే పోలింగ్ అదనంగా 2.09 శాతం పెరగడం సంకేతమని స్పష్టం చేస్తున్నారు. ఐదేళ్లుగా మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే ఓటుతో ఆశీర్వదించాలని, సైనికులుగా తోడుగా నిలవాలని, పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని సీఎం జగన్ ఎన్నికల్లో సానుకూల ప్రచారం చేయడం ప్రజలకు నచ్చిందని, అందుకే ఓట్ల రూపంలో జేజేలు పలికారని సీనియర్ రాజకీయ నేత ఒకరు వ్యాఖ్యానించారు. -
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ విషయంలో గ్రేటర్ జిల్లాల్లో మార్పు రావడం లేదు. గతంలో మాదిరిగానే హైదరాబాద్ జిల్లాకు అత్యల్ప పోలింగ్ నమోదై చివరి స్థానం దక్కింది. గత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే దాదాపు మూడు శాతం పెరిగినా..రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ మాత్రం ఇక్కడే నమోదైంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 48.48 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంమీద 22,17,094 ఓట్లకు గాను 10,74,827 ఓట్లు పోలయ్యాయి. గోషామహల్ సెగ్మెంట్లో 54.72 శాతం, కార్వాన్లో 51.23, బహదూర్‌పురాలో 50.07, చాంద్రాయణగుట్టలో 49.15, చారి్మనార్ 48.53, యాకుత్‌పురాలో 43.34, మలక్‌పేటలో 42.76 శాతం పోలయ్యాయి. సికింద్రాబాద్‌లో 49.04%సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో 49.04 శాతం పోలింగ్ నమోదైంది. గత లోకసభ ఎన్నికలతో పోలిస్తే ఒక శాతం పోలింగ్ పెరిగినా, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల కంటే ఒక శాతం తగ్గినట్లయింది. సెగ్మెంట్ల వారిగా పరిశీలిస్తే ముషీరాబాద్‌లో 49.09 శాతం, అంబర్‌పేటలో 51.65, ఖైరతాబాద్‌లో 50.28, జూబ్లీహిల్స్‌లో 45.59, సనత్‌నగర్‌లో 49.45, నాంపల్లిలో 46.59, సికింద్రాబాద్‌లో 52.28 శాతం పోలింగ్ నమోదైంది. చేవెళ్లలో 56.50% చేవెళ్ల లోక్ సభ పరిధిలో 56.50 శాతం పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే 0.31 పెరిగినా..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే పది శాతం తగ్గింది. మొత్తం మీద 29,38,870 ఓటర్లకు గాను 16,57,107 మంది ఓటేశారు. సెగ్మెంట్ల వారిగా చేవెళ్లలో 71.83 శాతం, వికారాబాద్‌లో 70.44 శాతం, తాండూర్‌లో 67.33 శాతం. పరిగిలో 67.01 శాతం, రాజేంద్రనగర్‌లో 54.12 శాతం, మహేశ్వరంలో 52.71 శాతం, శేరిలింగంపల్లిలో 54.12 శాతం పోలింగ్ నమోదైంది. మల్కాజిగిరిలో 50.78% మల్కాజిగిరి పరిధిలో పోలింగ్ 50.78 శాతం నమోదైంది. అసెంబ్లీ వారిగా పోలింగ్ శాతం పరిశీలిస్తే మేడ్చల్‌లో 57.83 శాతం, మల్కాజిగిరిలో 51.97, కుత్బుల్లాపూర్‌లో 50.19, కూకట్‌పల్లిలో 48.48, ఉప్పల్‌లో 48.45, ఎల్బీనగర్లో 46.27, కంటోన్మెంట్–సికింద్రాబాద్‌లో 51.61 శాతం పోలింగ్ నమోదైంది. -
మభ్యపెట్టి సైకిల్, కమలానికి ఓట్లేశారు
ద్వారకాతిరుమల : నల్లజర్ల మండలం సుభద్రపాలెం, తెలికిచర్లలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ఇద్దరు ఉద్యోగులు ఓటర్లు వేయమన్న సింబల్‌కు కాకుండా సైకిల్, కమలంపై ఓట్లు వేసి తమ ప్రేమను చాటారు. ఆ ఇద్దరు ఉద్యోగుల్లో ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లికి చెందిన అంగన్వాడీ టీచర్ ఉన్నారు. స్థానికుల కథనం ప్రకారం.. బిరుదుగడ్డ నందెమ్మ అనే దివ్యాంగురాలు సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్లింది.అక్కడ ఓపీఓగా విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ లక్ష్మి సహాయం కోరింది. అయితే ఆ టీచర్ నందెమ్మ చెప్పిన గుర్తుకు కాకుండా కమలం, సైకిల్‌కు ఓటు వేసింది. దీన్ని గుర్తించిన బాధిత నందెమ్మ ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని అధికారులకు, బయట ఉన్న స్థానికులకు తెలిపింది. దీంతో అసలు విషయం బయటపడటంతో అధికారులు ఆమెను బయట కూర్చోబెట్టారు. ఇదిలా ఉంటే సదరు అంగన్వాడీ టీచర్ భర్త టీడీపీలో కీలక పదవిలో ఉన్నాడని, ఆమె కుమార్తెను దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి చింతమనేని ప్రభాకరరావు బంధువుకిచ్చి వివాహం చేసినట్టు చెబుతున్నారు. దీంతో టీడీపీపై ఆమెకున్న ప్రేమను ఇలా ఓట్లు వేసి చూపిందని అంటున్నారు.అదే విధంగా తెలికిచెర్లలోని 166 వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు అక్కడ పీఓగా విధులు నిర్వర్తిస్తున్న జానకి సహాయాన్ని కోరారు. అయితే వారు చెప్పిన సింబల్స్‌కు కాకుండా సైకిల్, కమలం గుర్తులకు ఆమె ఓట్లు వేయడాన్ని ఆ బూత్ ఏజెంట్లు, బాదిత ఓటర్లు గుర్తించారు. ఈ ఘటనపై ఎన్నికల రిటరి్నంగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో జానకి స్ధానంలో సెక్టోరియల్ అధికారిగా వై.సత్యనారాయణను నియమించారు. అలాగే పీఓ జానకిని పోలీసుల సెక్యూరిటితో ఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్ళారు. పీఓ జానకి ఉదయం నుంచి ఇదేవిధంగా ఓట్లు వేసిందని అక్కడివారు చెబుతున్నారు. అయితే ఉన్నతాధికారులు వీరిపై ఏవిధమైన చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది. -
అర్బన్ పోలింగ్ బూత్‌లలో 60 శాతానికి మించని పోలింగ్
-
ఏపీలో భారీగా పోలింగ్.. ఎంత శాతం అంటే?
-
పోలింగ్ వద్ద విధ్వంసం.. జేసీ కుటుంబంపై కేసు
-
2019లో ప్రధాని మోదీకి ఎదురు నిలిచి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. 2014లో తొలిసారిగా నరేంద్ర మోదీ వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి ప్రధాని అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఈ స్థానం నుంచి 25 మంది అభ్యర్థులతో తలపడ్డారు.నాడు ప్రధాని మోదీతో పోటీపడిన 25 మంది అభ్యర్థుల్లో 22 మంది డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఇద్దరు మాత్రమే డిపాజిట్లు కాపాడుకోగలిగారు. నాడు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌కు ఒక లక్షా 95 వేల 159 ఓట్లు రాగా, మొత్తం ఓట్లలో ఇవి 18.40 శాతం. మూడో స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన అజయ్‌రాయ్‌కు 14.38శాతం ఓట్లు వచ్చాయి. గత లోక్ సభ ఎన్నికల్లో అజయ్ రాయ్ ఖాతాలో లక్షా 52 వేల 548 ఓట్లు పడ్డాయి.2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ వారణాసి నుంచి 4 లక్షల 79 వేల 505 ఓట్లతో విజయం సాధించారు. 2014లో తొలిసారిగా వారణాసి స్థానం నుంచి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. నాడు కాంగ్రెస్ తరఫున అజయ్‌రాయ్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి కైలాష్ చౌరాసియా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అజయ్ రాయ్‌కు 75 వేల 614 ఓట్లు రాగా, కైలాష్ చౌరాసియాకు 45 వేల 291 ఓట్లు వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన విజయ్ ప్రకాశ్ జైస్వాల్‌కు 60 వేల 579 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచి రెండు లక్షల, తొమ్మిది వేల 238 ఓట్లు దక్కించుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి నరేంద్ర మోదీకి ఐదు లక్షల ఒక వేయి 22 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 56.37 శాతం. నాడు మోదీ మూడు లక్షల 71 వేల 784 ఓట్ల తేడాతో విజయం సాధించారు.నరేంద్ర మోదీ వారణాసి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రధాని మోదీ గత విజయాలను అధిగమిస్తారని బీజేపీ చెబుతోంది. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. వారణాసి స్థానం నుంచి కాంగ్రెస్ మరోసారి అజయ్ రాయ్‌కు అవకాశం కల్పించగా, ఆయనకు సమాజ్‌వాదీ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. -
బరితెగించిన టీడీపీ వర్గీయులు
అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయతి్నంచినా వారు శాంతించలేదు. మీ అంతు తేలుస్తామంటూ వైఎస్సార్సీపీ వర్గీయులను బెదిరించారు. ఇదే సమయంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ హైమావతి, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. 👉 రాయచోటి అసెంబ్లీ పరిధిలోని నక్కవాండ్లపల్లి 175 పోలింగ్ కేంద్రంలో టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు తిరుపాల్ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. 👉 మదనపల్లి బీటీ కళాశాల పోలింగ్ బూత్‌లోకి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా దూసుకుని వచ్చింది. 👉 లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామపంచాయతీ చౌటుపల్లిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురి ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. 👉లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం మేడిమాకల గుంతరెడ్డివారిపల్లె పోలింగ్ కేంద్రంలో ఇరుపారీ్టల ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. 👉 కేవీపల్లె మండలం జిల్లేల్లమంద పంచాయతీ దేవాండ్లపల్లె పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. పోలీసులు అక్కడి చేరుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. 👉లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామం చెంచర్లపల్లె పోలింగ్ బూత్‌లో ఇరువురు ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. 👉 రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామం దూలవారిపల్లి పోలింగ్ స్టేషన్ నంబర్ 85లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల రాకతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. 👉 రైల్వేకోడూరు మండలం శెట్టిగుంటలో పోలింగ్ బూత్ నంబర్ 110. 111లో ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో సమస్య సద్దుమణిగింది. 👉మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రైమరీ స్కూల్ వద్ద టీడీపీ నాయకులు కండువా, పసుపు చొక్కాలు ధరించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. దీనిపై ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
దేశవ్యాప్తంగా నాలుగో దశ పోలింగ్ పూర్తి
-
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
నల్లజర్ల/మండపేట/ఆవులవారిపాలెం(క్రోసూరు): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలోని పలు పోలింగ్ బూత్‌లలో సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈవీఎంల ద్వారా ఓటు వేయడంపై అవగాహనలేని ఓటర్లకు సహకారం అందించేందుకు వెళ్లి ఓటర్లు చెప్పినవారికి కాకుండా తమకు నచ్చినవారికి ఓట్లు వేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్‌లో దివ్యాంగురాలు బిరుదుగడ్డ నందెమ్మ ఓటు వేసేందుకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ సహాయం కోరారు. తాను చెప్పిన పార్టీకి ఓటు వేయకుండా అంగన్వాడీ టీచర్ సైకిల్, కమలం గుర్తులకు ఓటు వేసినట్లు నందెమ్మ గుర్తించి, బయటకు వచ్చి అధికారులకు తెలియజేశారు. అంగన్వాడీ టీచర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి ఆమెను విధులు నిర్వర్తించకుండా బయట కూర్చోబెట్టారు. ఇదేవిధంగా తెలికిచెర్ల గ్రామంలోని 166వ నంబర్ పోలింగ్ బూత్‌లో పీవోగా విధులు నిర్వర్తిస్తున్న జానకి కూడా పలువురికి సహాయంగా వెళ్లి సైకిల్, కమలం గుర్తులకు ఓట్లు వేశారు. ఈ బూత్‌లో పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు ఓటు వేయడానికి పీవో సహాయం కోరారు. వారు చెప్పినట్లు కాకుండా ఆమె టీడీపీకి, బీజేపీకి ఓట్లు వేసినట్లు ఆ ఓటర్లతోపాటు ఏజెంట్లు గమనించారు. ఈ విషయాన్ని వారు బయటకు వచ్చి స్థానికులకు వివరించడంతో పీవో జానకిని నిలదీశారు. దీంతో తప్పయిపోయిందని ఒప్పుకున్న ఆమె... నాయకులను పక్కకు పిలిచి ‘పోయిన ఓట్లు భర్తీ చేసే విధంగా మీకు ఓట్లు వేయిస్తా’ అని నమ్మబలికారు. వారు ఒప్పుకోకపోవడంతో ప్లేటు ఫిరాయించి తనను ఒత్తిడి చేయడం వల్లే ఆవిధంగా ఒప్పుకున్నానని చెప్పారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఆమె స్థానంలో సెక్టోరియల్ అధికారి వై.సత్యనారాయణను అక్కడ పీవో విధులకు నియమించారు. పీవో జానకిని పోలీసులు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి పీవో జానకి ఇదేవిధంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రిసైడింగ్ అధికారిపై కలెక్టర్‌కు వృద్ధుడు ఫిర్యాదు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని రావులపేట రావులచెరువు గట్టు వద్ద తొమ్మిదో నంబర్ సచివాలయంలో ఉన్న పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారిపై ఓ వృద్ధుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ బూత్‌లో ఓటు వేసేందుకు గోకరకొండ సత్యనారాయణ(70) తన మనవడి సాయంతో వెళ్లారు. ప్రిసైడింగ్ అధికారి పీఎన్‌వీవీ సత్తిబాబు జోక్యం చేసుకుని సత్యనాయణ మనవడిని బయటకు పంపించారు. అనంతరం సత్యనారాయణ వేలితోనే రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై సత్తిబాబు నొక్కించారు. తాను ఫ్యాన్ గుర్తుకు వేయమంటే సైకిల్‌కు ఎందుకు మీట నొక్కించారని సత్యనారాయణ ప్రశ్నించగా, ఆయన్ను బలవంతంగా బయటకు పంపివేశారు. ఈ విషయాన్ని ఆయన తన కుమారుడు గోకరకొండ ప్రసాద్‌కు తెలియజేయగా, రిటర్నింగ్ అధికారి ఎల్లారావుకు, జాయింట్ కలెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.ఫ్యానుకు ఓటు వేయాలని చెబితే సైకిల్‌కు వేసిన ఓపీఓపల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెం పోలింగ్ బూత్‌లో వృద్ధుడు చిన్న అల్లీసా తన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని వోపీవో వెంకటరమణను కోరగా, ఆమె సైకిల్ గుర్తుపై వేశారు. వీవీ ప్యాట్‌లో సైకిల్ గుర్తు చూసిన వృద్ధుడు తీవ్ర ఆగ్రహానికి గురై వోపీవోపై తిరగబడ్డాడు. దాదాపుగా కర్రతో కొట్టేంత పనిచేశాడు. వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి ఆమె చేసిన తప్పిదాన్ని సరిచేయాలని కొద్దిసేపు ఆందోళన చేశారు. ఆర్వోకు, ఏఆర్వోలకు ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం స్పందించలేదు. -
Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్ రైడ్
అవును! పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓటేసి.. తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటే చాలు. ఉచితంగా ఇంటికి తీసుకెళ్లి దింపేస్తారు. ఓహో సూపరని ఆనందిస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మన రాష్ట్రంలో కాదు. దేశ రాజధాని ఢిల్లీలో. అక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ సంస్థలు పాటుపడుతున్నాయి. ర్యాపిడో ఈ ప్రక్రియలో భాగస్వామ్యమైంది. ఓటర్లు ఓటేసిన అనంతరం పోలింగ్ బూత్‌ల నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలి్పంచింది. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బైక్ టాక్సీ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మే 25న ఢిల్లీ లోక్‌సభ పోలింగ్ రోజున జరగనుంది. ఆ రోజు ఓటేసిన అనంతరం ప్రయాణికులు బైక్ బుక్ చేసుకుని ఉచితంగా ప్రయాణించవచ్చు. ఢిల్లీలో 80 లక్షల మంది ర్యాపిడో సబ్స్క్రైబర్లు ఉండగా.. ఆ సంస్థకు ఎనిమిది లక్షల మంది బైక్ డ్రైవర్లు ఉన్నారు. -
పోలింగ్ బూత్ లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించిన సీఎం రమేష్
-
తెలంగాణలో బారులు తీరిన ఓటర్లు (ఫొటోలు)
-
ఏపీలో పోటెత్తిన ఓటర్ (ఫొటోలు)
-
బౌన్సర్లతో పోలింగ్ వద్ద టీడీపీ అభ్యర్థి థామస్ హల్ చల్
-
సరైన భద్రత లేదు..విజయసాయిరెడ్డి అసహనం
-
పిఠాపురంలో జోరుగా పోలింగ్
-
శ్రీనగర్‌లో భారీ బందోబస్తు మధ్య మొదలైన పోలింగ్!
శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ ప్రారంభమయ్యింది. శ్రీనగర్, పుల్వామా, బుద్గాం, గందర్బల్, షోపియాన్ జిల్లాలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 17.47 లక్షల మంది ఓటర్లు నేడు (సోమవారం) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహిళా ఓటర్ల కోసం 20 పింక్ బూత్‌లను ఏర్పాటు చేసి, అక్కడ మహిళా సిబ్బందిని నియమించారు.శ్రీనగర్‌లోని 18 బూత్‌లను వికలాంగుల పర్యవేక్షణలో, 17 బూత్‌లను యువకుల పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించేందుకు 21 గ్రీన్ బూత్‌లను కూడా ఏర్పాటు చేశారు. శ్రీనగర్ పార్లమెంటరీ సీటు పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అన్ని కేంద్రాల నుండి లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కంట్రోల్ రూంతోపాటు సీఈఓ కార్యాలయం నుంచి దీనిని వీక్షించనున్నారు. కొన్ని కేంద్రాల్లో శాటిలైట్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు ఏర్పాటు చేశారు. VIDEO | Jammu and Kashmir: Security heightened at Srinagar’s Lal Chowk ahead of polling.Voting for the fourth phase will be held today in 96 Lok Sabha Constituencies across 10 states and UTs. #LSPolls2024WithPTI #LokSabhaElections2024(Full video available on PTI Videos -… pic.twitter.com/tEjEU7AVlG— Press Trust of India (@PTI_News) May 13, 2024 సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలుచున్న చివరి ఓటరు ఓటు వేసే వరకు పోలింగ్ జరగనుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సంబంధిత బీఎల్ఓ ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికలను సురక్షితంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాలతోపాటు ప్రధాన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
లోక్‌సభ పోరు నేడే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మాత్రం సాయంత్రం 4 గంటలకే ముగించనున్నారు. ఈ మేరకు పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. బరిలో 525 మంది..: లోక్‌సభ ఎన్నికల్లో 1,65,28,366 మంది పురుష ఓటర్లు, 1,67,01,192 మంది మహిళా ఓటర్లు, 2,760 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 3,32,32,318 మంది ఓటేయనున్నారు. 17 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 525 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. ఇందులో 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈవీఎంలతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ముగిశాక ఎన్నికల సిబ్బంది సంబంధిత లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన రిసెప్షన్ సెంటర్‌కు తీసుకెళ్లి ఈవీఎంలను అప్పగిస్తారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. మరోవైపు ఏపీ అసెంబ్లీకి కూడా సోమవారమే ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి 25 ఎంపీ సీట్లకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. గందరగోళ పడకుండా ఓటేయండి..: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో అత్యధికంగా 45 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది బరిలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో 7 లోక్‌సభ స్థానాల పరిధిలో మూడు బ్యాలెట్ యూనిట్లతో, 9 లోక్‌సభ స్థానాల పరిధిలో రెండు బ్యాలెట్ యూనిట్లతో, ఒక లోక్‌సభ స్థానంలో ఒక బ్యాలెట్ యూనిట్‌తో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు గందరగోళానికి గురికాకుండా.. ఈవీఎంలో అభ్యర్థుల క్రమాన్ని పోలింగ్ బూత్‌ల బయట ప్రదర్శనకు పెట్టనున్నట్టు సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. ఇక దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ట్రైసైకిళ్లు, ర్యాంపులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్.. రాష్ట్రంలో మొత్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది. మిగతా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌ట్యాప్‌లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. ఆ డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటరి్నంగ్ అధికారికి అప్పగిస్తారు. గడువు ముగిసే సరికి.. క్యూలో ఉంటే ఓటేయవచ్చు.. పోలింగ్ సమయం ముగిసే సరికి క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. అలా క్యూలో ఉన్నవారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. సమయం ముగిశాక పోలింగ్ కేంద్రానికి చేరుకునేవారికి ఓటేసేందుకు అవకాశం ఉండదు. ఎండ పెరగక ముందే ఉదయమే ఓటేస్తే మంచిదని.. వానలతో ఉష్ణోగ్రతలు కొంత తగ్గడం ఊరట కల్పించే అంశమని అధికారులు చెప్తున్నారు. ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్.. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని ఆదివారం రాత్రే తరలించామని అధికారులు వివరించారు. సోమవారం ఉదయం 5.30 గంటలకే అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా పోలింగ్ ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారులు ప్రారంభించనున్నారు. 10 మంది ఓటర్లకే పోలింగ్ కేంద్రం ఈసారి అత్యల్ప సంఖ్యలో ఓటర్లున్న ప్రాంతాల్లో సైతం పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లోని ఈ ఓటర్లు దూర ప్రాంతాలకు వెళ్లి ఓటేయాల్సిన అవసరం లేకుండా చేసింది. అత్యల్పంగా 10 మంది, 12 మంది, 14 మంది ఓటర్లున్న మూడు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 25మందిలోపు ఓటర్లున్నవి 11, 50 మందిలోపు ఉన్నవి 22, 100 మంది లోపు ఉన్నవి 54 పోలింగ్ కేంద్రాలు ఉండటం గమనార్హం. హోరాహోరీగా పోరు! ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, గట్టిగా పోరాడినా అధికారం పోగొట్టుకున్న బీఆర్ఎస్, కేంద్రంలో రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ.. ఇలా మూడు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. 16 లోక్‌సభ స్థానాల్లో మూడు పార్టీలు హోరాహోరీగా పోరాడనుండగా.. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇస్తున్నారు. గత నెల రోజులుగా మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో.. ఎక్కువ స్థానాల్లో గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. -
పోటెత్తాలి మన ఓటు!
మాన్యవరుల కంటే సామాన్య ప్రజలే చైతన్యవంతులని పలు ఎన్నికల్లో ఇప్పటికే రుజువైంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోయే ఓటింగ్ కోసం ముందువరసల్లో నిలబడబోయేది కూడా సామాన్యులే. అభిప్రాయాలను బహిరంగంగా దండోరా వేసే అలవాటు సామాన్యుల్లో బాగా తక్కువ. సోషల్ మీడియా రావిచెట్టు అరుగు మీద కూర్చొని విశ్లేషణలు చేసే వెసులుబాటు కూడా సామాన్యులకు ఉండదు. ఫేస్బుక్కుల్లో ముఖం చూసుకుని తల దువ్వుకోవడం వారికి చేతకాదు. ఇన్‌స్టాగ్రాముల్లో తమ భావాలను తూకం వేయడం కూడా వారికి రాదు. వాట్సప్ చాట్స్ల్లో డిబేట్ చేసే సామర్థ్యం అసలే ఉండదు. జీవితానుభవాల వల్ల రాయేదో రత్నమేదో గుర్తించగలిగిన నేర్పరితనం మాత్రం సామాన్యులకు ఏర్పడుతుంది. తమకు మంచి చేసే వారెవరో, తమను మాయ చేసే వారెవరో గుర్తించగలిగిన తెలివిడి ఉంటుంది. ఎన్నికల సందర్భంగా ఏర్పాటవుతున్న రాజకీయ తిరునాళ్లను వారు గమనిస్తూనే ఉన్నారు. పులివేషగాళ్ల వీరంగాలను పరికిస్తూనే ఉన్నారు. బూతు కూతలనే బాణాలుగా మార్చుకున్న నాయకమ్మన్యుల నోటికంపును కూడా సామాన్యులు భరించారు. అల్పాచమానాన్ని అమృతంగా, అశుద్ధాన్ని దద్దోజనంగా ప్రచారం చేస్తున్న ఈనాటి రోత పత్రికల రంకు బాగోతాన్ని కూడా వారు మౌనంగా గమనిస్తున్నారు. నూరు గొడ్లనుతిన్న రాబందులు ఒక్కొక్కటిగా వచ్చి వేదికలపై వాలుతుంటే... హరికథలు చెబుతుంటే సామాన్యుడు విని భరించాడు. సామాన్య ప్రజల స్వభావం సాదాసీదాగా ఉంటుంది. సూటిగా సుత్తి లేకుండా ఉండే సందేశాలనే వారు అందుకుంటారు. సందేశం లేని హంగూ ఆర్భాటాలు వారిని కదిలించలేవు. సినిమా వేషగాళ్లు, టీవీ హాస్యగాళ్లు వేసే పిల్లిమొగ్గల వినోదం వారిని ప్రభావితం చేయలేదు. ఈ ప్రచార పర్వంలో ఒకే ఒక సూటి సందేశం జనం మెదళ్లలో బలంగా నాటుకున్నట్లు కనిపించింది. మీ ఇంటికి మంచి జరిగితే ఓటేయండని ఇచ్చిన పిలుపు ప్రభంజనమై వ్యాపించింది. మన ఓటు వల్ల మన కుటుంబాలకు మంచి జరుగుతున్నప్పుడు మన ఓటు మరింత చైతన్యవంతం కావాలి. ఆ మంచిని కొనసాగించుకోవాలి. జనసముద్రం పోటెత్తినట్లుగా ఓటేయాలి. మన ఇల్లూ మన పిల్లలూ బాగుండాలి. మన పాడిపంట వృద్ధి కావాలి. అమ్మల ఆత్మగౌరవం ఇనుమడించాలి. మధ్య దళారీలు, పెత్తందార్లు మన పురోగతికి అడ్డుపడని వ్యవస్థ కొనసాగాలి. మన బతుకులు ఒక్కో మెట్టును అధిరోహించాలి. మన తలరాతలు శుభం పలకాలి. ఈ పరిణామాలకు మనం వేసే ఓటు దోహద పడుతుంటే మనం ఎందుకు బద్ధకించాలి? రండి ఓటేద్దాం, పోలింగ్ సెంటర్‌ను పోటెత్తిద్దాం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం. మంచిని గెలిపిద్దాం....వంచనను తరిమేద్దాం! -
నేడే పోలింగ్.. ప్రజాతీర్పునకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీకి, లోక్‌సభకు పోటీచేస్తున్న 2,841 మంది అభ్యర్థుల భవిష్యత్తు మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అసెంబ్లీకి పోటీచేస్తున్న 2,387 మంది, లోక్‌సభకు పోటీచేస్తున్న 454 మంది భవిష్యత్తును నిర్ణయించడానికి 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ స్టేషన్లలో ఉ.7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండడంతో అధికారులంతా ఆదివారం రాత్రికే ఎక్కడికక్కడ చేరుకున్నారు. కానీ, దానికి రెండు గంటల ముందు అంటే ఉ.5 గంటల నుంచే అధికారులు ఏర్పాట్లు మొదలుపెడతారని.. ఏజెంట్లు ఉ.5.30కల్లా పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటే 90 నిమిషాల పాటు మాక్ పోలింగ్ నిర్వహించి ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదివారం తెలిపారు. సమస్యాత్మకంగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాల్లో మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలకుగాను 31,385 చోట్ల అంటే 75 శాతం కేంద్రాలను లోపలా, బయట పూర్తిస్థాయిలో వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని మీనా చెప్పారు. ఇందుకోసం సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 26 జిల్లాలకు సంబంధించి 26 టీవీ మానిటర్ల ద్వారా ఆయా జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల్లో జరిగే ఓటింగ్ సరళిని పోలింగ్ కేంద్రం లోపల, బయటా కూడా పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. ఇందుకు దాదాపు 150 మంది అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకొకసారి జరిగే ఓట్ల పండుగలో ప్రతిఒక్క ఓటరూ పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని ముఖేష్‌కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని.. అటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లంతా పాల్గొని ప్రజాస్యామ్యవ్యవస్థను పరిరక్షించుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. 83శాతం ఓటింగ్ లక్ష్యంగా.. ఇక గత ఎన్నికల్లో రాష్ట్రంలో 79.84 శాతం ఓటింగ్ నమోదైందని, ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ లక్ష్యంగా విస్తృతస్థాయిలో ఓటర్లను చైతన్యపర్చేలా పలు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించామన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి వయో వృద్ధులు, మహిళలు, యువత, పర్యావరణం పేరుతో మోడల్ పోలింగ్స్టేషన్లను ఏర్పాటుచేసి సుందరంగా అలంకరించారు. అదే విధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస వసతులైన తాగునీరు, వీల్చైర్లు, ర్యాంపులు, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచామని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటుచేయడమే కాకుండా అవసరాన్ని బట్టి వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేయనున్నట్లు మీనా తెలిపారు. 1.60 లక్షల ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం.. రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వీటికి అదనంగా మరో 20 శాతం కొత్త ఈవీఎంలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. నిజానికి.. మొదట్లో ప్రతిపాదించినట్లుగా 46,165 పోలింగ్ కేంద్రాలకు 1.45 లక్షల ఈవీఎంలు సరిపోతాయని, అయితే.. అదనంగా ప్రతిపాదించిన 224 ఆగ్జిలరీ పోలింగ్ కేంద్రాలకు మరో 15 వేల ఈవీఎంలు సమకూర్చుకున్నామన్నారు. మొత్తమ్మీద 46,389 పోలింగ్ కేంద్రాలలో 1.60 లక్షల కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నామని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట భద్రత డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పూర్తి భద్రతా ఏర్పాట్లుచేశామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర పోలీసు బలగాలకు అదనంగా సీఆర్పీఎఫ్, తమిళనాడు, కర్ణాటక పోలీసు బలగాలను మోహరించామన్నారు. వారితోపాటు మాజీ సైనికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన చెప్పారు. పోలింగ్ విధుల కోసం వినియోగిస్తున్న బలగాల వివరాలు.. -
కడపలో పోలింగ్ కి ఏర్పాట్లు
-
AP Assembly Elections 2024: ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పోలింగ్ సామాగ్రి తరలింపు కోసం అధికారులు బిజీ (ఫొటోలు)
-
ఓటు ఎలా వేయాలి ?..ట్రైనింగ్ వీడియో మీకోసం
-
పూర్తయిన ఓటర్ స్లిప్పుల పంపిణీ
-
అనకాపల్లి జిల్లాలో 1529 పోలింగ్ కేంద్రాలు..
-
రాజమండ్రిలో 1577 పోలింగ్ స్టేషన్లు
-
విజయనగరం జిల్లాలో 144 సెక్షన్
-
అన్నమయ్య జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో భారీ బందోబస్తు
-
నెల్లూరు జిల్లాలో 2470 పోలింగ్ కేంద్రాలు
-
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా 1,06,145 మందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసి, మే 13న ఓటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఆయన శనివారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో 197 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఎన్నికల కోసం వినియోగిస్తే ఈ ఎన్నికల్లో 295 కంపెనీలకు చెందిన 26,550 మంది సాయుధుల్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనకుండా పురుషులు, మహిళలు, వృద్ధులు/దివ్యాంగులకు మూడు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులతో నియంత్రించనున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 82 నుంచి 83 శాతం పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారీస్థాయిలో డూప్లికేట్ ఓట్లు, చనిపోయినవారి ఓట్లు తొలగించడంతో పాటు కొత్తగా తొలిసారి ఓటువేస్తున్న వారు పదిలక్షల మందికిపైగా ఉండటంతో పోలింగ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల వరకు ఓటరుకు తప్ప మిగిలిన వారికి ప్రవేశంఉండదని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేయడానికి సహకరించడానికి ఒక సహాయకుడిని ఒకసారి మాత్రమే అనుమతిస్తామన్నారు. 11 గంటల పాటు పోలింగ్ రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో.. ఆరు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్నిచోట్ల ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు అంటే 11 గంటలపాటు ఓటింగ్‌కు అనుమతించనున్నట్లు తెలిపారు. అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నక్సలైట్ల ప్రభావం ఉన్న పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదుగంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగుగంటల వరకు ఓటింగ్‌కు అనుమతించనున్నట్లు వివరించారు. పోలింగ్ సిబ్బంది ఆదివారం సాయంత్రానికే పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని చెప్పారు. సోమవారం ఉదయం ఐదుగంటల నుంచే పోలింగ్‌కు ఏర్పాట్లు చేసి ఏడుగంటలకు ఓటింగ్ ప్రారంభించాలని పేర్కొన్నారు. ఏజెంట్ల సమక్షంలో 90 నిమిషాలు మాక్ పోలింగ్ నిర్వహించి సీల్‌వేసిన అనంతరం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభిస్తామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ముగ్గురు ఏజెంట్లకు అనుమతి ఇస్తామని, కానీ పోలింగ్ స్టేషన్లోకి ఒక ఏజెంటుకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. పోలింగ్ స్టేషన్లోకి సెల్ఫోన్లు, మారణాయుధాలు అనుమతించరని తెలిపారు. సెల్ఫోన్లు తీసుకొస్తే వాటిని బయటే వదిలి లోపలికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.269 కోట్ల విలువైన నగదు, వస్తువులను సీజ్‌చేసినట్లు తెలిపారు. దీన్లో నగదు రూ.71 కోట్లు ఉన్నట్లు ఆయన చెప్పారు. అమల్లోకి 144వ సెక్షన్శనివారం సాయంత్రం ఆరుగంటల నుంచి సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు రాష్ట్రంలో సైలెంట్ పీరియడ్ కొనసాగుతుందని, ఈ సమయంలో రాష్ట్రంలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. అయిదుగురి కంటే ఎక్కువమంది గుమికూడరాదని, ఎటువంటి రాజకీయ ప్రచారాలు, ర్యాలీలు చేయకూడదని స్పష్టం చేశారు. కానీ రాజకీయ పార్టీ లు ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందిన ప్రకటనలు పత్రికల్లో ఇవ్వడానికి అనుమతిస్తామన్నారు. ఇకనుంచి ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ జూన్ 1న చివరిదశ ఎన్నికలు ముగిసేవరకు ప్రచారం చేయకూడదని చెప్పారు -
Lok Sabha Election 2024: అంతా ఓటర్ స్లిప్‌లోనే
తమ భవిష్యత్‌ను నిర్ణయించే పాలకులను ఎన్నుకోవడంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో ప్రజల్లో నిర్లిప్లత కనిపిస్తుంటుంది. చాలామంది చిన్న చిన్న ఇబ్బందుల కారణంగా ఓటేసేందుకు ఆసక్తి చూపించరు. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా 70 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు! పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో ఓటింగ్ మరీ తక్కువగా నమోదవుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు, మరింత మందిని పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటోంది. వీటికి తోడు ఓటరు స్లిప్‌లపై క్యూఆర్ కోడ్లు ముద్రిస్తోంది. పోలింగ్ బూత్ ఎక్కడుంది మొదలుకుని ఓటింగ్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్నీ కోడ్ సాయంతో ఇట్టే తెలుసుకోవచ్చు. స్కాన్ చేస్తే పూర్తి సమాచారం ఓటర్ స్లిప్‌లపై ఉండే క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్ చేస్తే చాలు.. ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో చెబుతుంది. అక్కడికెలా వెళ్లాలో కూడా గూగుల్ మ్యాప్ సాయంతో చూపిస్తుంది. ఇటీవలి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో క్యూఆర్‌తో కూడిన ఓటర్ స్లిప్‌ల కారణంగా ఓటింగ్ బాగా పెరిగినట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికార మనోజ్‌కుమార్ మీనా వెల్లడించారు. బెంగళూరు టీచర్స్ కాలనీ అసెంబ్లీ స్థానంలో 2020లో 66 శాతం నమోదైన పోలింగ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతానికి పెరిగిందన్నారు. ‘‘చాలామంది ఓటర్లకు పోలింగ్ బూత్ ఎక్కడ ఉందో తెలియడం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ భవనాలెక్కడున్నదీ తెలియకపోవడం ఇందుకు ప్రధాన కారణం. క్యూఆర్ కోడ్ దీనికి పరిష్కారం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో 80 శాతానికి పైగా ఓటర్లకు క్యూఆర్ కోడ్ ఆధారిత ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేశాం’’ అని ఆయన వివరించారు. డిజిటల్ ఓటర్ స్లిప్ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ స్లిప్‌లను ‘ఓటర్ హెల్ప్‌లైన్’ యాప్ ద్వారా డిజిటల్‌గా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఎన్నికల సంఘం కలి్పంచడం విశేషం. పోలింగ్ కేంద్రంలో సిబ్బంది డెస్క్ వరకు ఫోన్లను తీసుకెళ్లి ఈ డిజిటల్ ఓటర్ స్లిప్‌ను చూపించేందుకు అనుమతించారు. భవిష్యత్‌లో ఎన్నికలు మరింత డిజిటల్‌గా మారనున్నాయనేందుకు ఇది మరో సంకేతం. ఆకర్షించే ఏర్పాట్లు ఓటర్లను మరింతగా ఆకర్షించేందుకు ఈ విడత చాలా రాష్ట్రాల్లో థీమ్ ఆధారిత పోలింగ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం మహిళా సిబ్బందితో కూడిన కేంద్రాలు, 30 ఏళ్లలోపు వయసున్న అధికారులతో యూత్ పోలింగ్ కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో వారి ఇళ్లను పోలిన పోలింగ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పోలింగ్ కనాకష్టంగా 50 శాతం దాటుతుండటం తెలిసిందే. ఇలా చాలా తక్కువ ఓటింగ్ నమోదవుతున్న ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా ప్రాంతాలకు బృందాలను పంపించి ఓటర్లలో చైతన్యానికి చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సాయం కూడా తీసుకుంటోంది. బూత్ వద్ద చాంతాడంత క్యూలు చూసి అంతసేపు లైన్లో ఉండాలా అని చాలామంది అనుకుంటారు. దీనికి విరుగుడుగా పోలింగ్ బూత్ వద్ద క్యూను ఇంటి నుంచే మొబైల్లో తెలుసుకునేలా యాప్‌లను ఈసీ అభివృద్ధి చేసింది. ఆ బూత్‌ల సమీపంలో వాహనాల పార్కింగ్ వసతులున్నాయా, లేదంటే సమీపంలో ఎక్కడ పార్క్ చేసుకోవచ్చు వంటి సమాచారం కూడా వాటిలో అందుబాటులోకి తెచి్చంది. నడవలేని వృద్ధుల కోసం ఈ యాప్‌ల నుంచి వీల్‌చైర్ కూడా బుక్ చేసుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి అర్హతలు, అఫిడవిట్లో సమాచారం, వారిపై ఏవైనా క్రిమినల్ కేసులు నమోదయ్యాయా? ఆస్తులు, అప్పులు తదితర పూర్తి సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పోలింగ్‌కు సర్వం సన్నద్ధం: ఏపీ సీఈవో
సాక్షి, అమరావతి: ఎల్లుండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరుగుతుందని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకూ.. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 వరకూ, ఆయా నియోజకవర్గాల్లో 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు.సైలెన్స్ పీరియడ్‌లో రాజకీయ ప్రచారం పూర్తిగా నిలిచిపోతుంది. సైలెన్స్ పీరియడ్‌లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సాయంత్రం 6 తర్వాత ప్రచారం కోసం బయటినుంచి వచ్చిన వారు స్వస్థలాలకు వెళ్ళిపోవాలన్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం లోగా ఈవీఎం మెషిన్లు పోలింగ్ కేంద్రాలకు చేరుతాయి. ఉదయం 7 లోపు మాక్ పోలింగ్ పూర్తి చేసి పోలింగ్ ప్రారంభించాలని సీఈవో తెలిపారు.పోలింగ్ స్టేషన్లో ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఉండాలి. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయకూడదు. పోలింగ్ కేంద్రాలోకి ఫోన్లకు అనుమతి లేదు. ఇప్పటివరకూ 269.28 కోట్లు నగదు,మద్యం,ఇతర అభరణాలు సీజ్ చేశాం. సివిల్ పోలీసులు 58,948 మంది విధుల్లో ఉంటారు.ఏపీఎస్పీ, కేంద్ర బలగాలు కలిపి మొత్తం 28,588 మంది విధుల్లో ఉన్నారు. ఎన్సీసీ, ఎన్‌ఎస్‌స్, మాజీ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీసులు 18,609 మంది ఉన్నారు. మొత్తంగా 1,06,145 మంది పోలీసులు,ఇతరులు ఉన్నారు. మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లలో 12,438 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్ చేయకూడదు. 10,30,000 మంది యువ ఓటర్లు ఉన్నారు’’ అని సీఈవో వెల్లడించారు. -
ప్రశాంత పోలింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు
అమరావతి: పోలింగ్ ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. ఆయన గురువారం డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాతో కలిసి వెలగపూడిలోని సచివాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో పోలింగ్‌కు 72 గంటల ముందు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖేశ్‌కుమార్ మీనా మాట్లాడుతూ రానున్న మూడురోజులు అత్యంత కీలకమైనవని చెప్పారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఓటర్లను ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించాలని చెప్పారు. షాడో ఏరియాలో పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన హెలికాప్టర్లను సద్వినియోగం చేసుకుని పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని కోరారు. ఓటర్లందరికీ స్లిప్పులు అందేలా చూడాలన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించాలని చెప్పారు.పోలింగ్ రోజున ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా షామియాలు వేయడంతోపాటు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకుని పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తెలంగాణ సరిహద్దుల్లోని జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ రోజున వాహనాలు, వ్యక్తుల రాకపోకలపై దృష్టి సారించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు డీజీ అతుల్‌సింగ్, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి, అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ, అదనపు ఈసీవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఎన్నికల సంఘం అనేక సౌకర్యాలు కల్పించింది. ఓటరు జాబితా సవరణలో ఏ కారణం చేతనైనా మీ పేరు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఓటరు జాబితా పరిశీలనకు అధికారులు వచ్చినప్పుడు మీరు లేకపోతే మీ పేర్లను తొలగించేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా అబ్సెంట్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఒక జాబితా రూపొందుతుంది. అంతేకాకుండా... ఒకవేళ మీ అడ్రస్ మారి ఉంటే, ఇంకో జాబితా, మరణించిన వారి కోసం కూడా ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేస్తారు.ఈ జాబితాలన్నీ ఓటరు జాబితాతోపాటు ప్రిసైడింగ్ అధికారికి అందుబాటులో ఉంటాయి. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాలి. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్ధారించుకుంటారు.అనంతరం ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దివ్యాంగులకు వాహన సదుపాయం...దివ్యాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం కోసం స్థానిక బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ)ని సంప్రదించాలి. ఆటో ద్వారా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తారు.పోలింగ్ కేంద్రం తెలుసుకోవడం ఇలా... ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు జారీ చేస్తుంది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు. -
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
Lok Sabha Election 2024: పోలింగ్ బూత్ గుర్తింపు...మొబైల్ నంబర్‌తో
పోలింగ్ బూత్ ఎక్కడో తెలియడం లేదా? మన ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉందో మొబైల్ నంబర్ సాయంతో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న లోక్‌సభకు పోలింగ్ జరగనుండటం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓటర్ ఐడీ కార్డు సాయంతో సులువుగా తెలుసుకోవచ్చు. ఓటరు ఐడీలో ఇంగిŠల్ష్ అక్షరాలు, 10 అంకెలతో కూడిన ఎపిక్ ఐడీ పోలింగ్ బూత్‌ను గుర్తించడానికి కీలకమవుతుంది. ఏ కారణంతోనైనా కార్డు అందుబాటులో లేని వారు ఆన్లైన్లోనే ఎపిక్ నంబర్ గురించి తెలుసుకోవచ్చు. ఇలా చేస్తే సరి ఎపిక్ నంబర్ కోసం ఈసీ పోర్టల్ (voters. eci.gov.in)ను సందర్శించాలి. అందులో కుడివైపు కనిపించే సర్వీసెస్ విభాగంలో ‘ఈ–ఎపిక్ డౌన్లోడ్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత వచ్చే పేజీలో సైనప్ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి, కంటిన్యూ చేయాలి. తర్వాత పేరు నమోదు చేసి, పాస్వర్డ్ ఎంపిక చేసుకోవాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంపిక చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పటికే ఖాతా ఉన్న వారు సైనప్ చేయనవసరం లేదు. మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి లాగిన్ అవడం ద్వారా ఈ–ఎపిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఎపిక్ నంబర్ తెలిసిపోతుంది. తర్వాత సైట్ హోం పేజీలో కుడివైపున ఉన్న ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ ఎంపిక చేసుకోవాలి. వచ్చే ప్రత్యేక పేజీలో ఎపిక్ నంబర్ నమోదు చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకుని క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ బటన్ ఓకే చేయాలి. మీ పోలింగ్ బూత్‌తో పాటు పోలింగ్ స్టేషన్ ఆఫీసర్ తదితర వివరాలు కూడా లభిస్తాయి. ఇదే పోర్టల్ నుంచి ఫిర్యాదులు సైతం దాఖలు చేయవచ్చు. ఎపిక్ నంబర్ ఉన్న వారు నేరుగా సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ ఆప్షన్‌కు వెళ్లవచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
14 నియోజకవర్గాల్లో 100 శాతం వీడియో నిఘా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే 13న జరిగే సాధారణ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లున్నట్లు చెప్పారు. వీటిలో 64 శాతానికిపైగా అంటే 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు.అత్యంత సమస్మాత్మకమైనవిగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకదృష్టి సారించినట్లు తెలిపారు. వీటితోపాటు కేంద్ర ఎన్నికల పర్యవేక్షకులు రాష్ట్ర పర్యటనకు తర్వాత ఇచ్చిన సూచనల ప్రకారం అత్యధిక ఫిర్యాదులు అందుతున్న 14 నియోజకవర్గాలు.. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ, ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పలమనేరు, విజయవాడ సెంట్రల్, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లిల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు తనిఖీల్లో రూ.203.80 కోట్ల విలువైన నగదు, వస్తువులు, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టుబడుతున్న మద్యంలో అత్యధికంగా గోవా రాష్ట్రానికి చెందినదని, దీనికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద చల్లదనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశించిందని తెలిపారు. దీనికి అనుగుణంగా షామియానాలు, ఫ్యాన్లు, కూలర్లు, వడదెబ్బ నుంచి తట్టుకోవడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తడి చేతిరుమాళ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. 4.14 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్యరాష్ట్రంలో లోక్‌సభకు 454 మంది, అసెంబ్లీకి 2,387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,14,01,887 మంది ఉన్నట్లు చెప్పారు. ఏప్రిల్ 25తో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిలిపేసిన తర్వాత రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య 2,10,56,137, పురుష ఓటర్ల సంఖ్య 2,02,74,144 ఉన్నట్లు పేర్కొన్నారు. జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల సవరణ జాబితా తర్వాత నుంచి ఏప్రిల్ 25 నాటికి కొత్తగా 5.94 లక్షల ఓటర్లు చేరినట్లు తెలిపారు. ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్‌స్టేషన్ చొప్పున పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా 224 పోలింగ్ స్టేషన్లను జతచేయడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 46,389కి చేరిందని వివరించారు. 15 వేల అదనపు బ్యాలెట్ యూనిట్లు తెప్పించాం కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు భారీగా పోటీపడుతుండటంతో మూడు కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగించాలి్సన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈవీఎంకు అనుసంధానంగా ఉండే ఒక బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థుల పేర్లు పడతాయన్నారు. విశాఖ లోక్‌సభకు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో మూడు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాలని చెప్పారు. పది పార్లమెంటు స్థానాల్లో రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయన్నారు. అసెంబ్లీ విషయానికి వస్తే మంగళగిరి, తిరుపతిల్లో మూడు బ్యాలెట్ యూనిట్లు, 20 చోట్ల రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. దీంతో అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్లు అవసరం కావడంతో కర్ణాటక నుంచి తెప్పించినట్లు తెలిపారు. జనసేన పోటీచేస్తున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రులకు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును 15 చోట్ల రద్దుచేసినట్లు చెప్పారు. పెన్షన్లపై రాజకీయ విమర్శలకు స్పందించంరాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. సాధ్యమైనంతవరకు డీబీటీ విధానంలోనే ఇవ్వమని గత నెలలో ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. కానీ గత నెలలో డీబీటీ విధానంలో ఇవ్వకపోవడం వల్ల ఆ ఆదేశాలను తిరిగి గుర్తుచేస్తూ రాష్ట్రానికి మరోసారి లేఖరాసినట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై తాము స్పందించబోమని ఆయన పేర్కొన్నారు. వీళ్లు ఓటు వేసేశారుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ప్రజలు అప్పుడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్న వారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో పోలింగ్ తేదీ మే 13 కంటే ముందే వీరు ఓటుహక్కు వినియోగించుకున్నారు.రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గురువారం నుంచి హోమ్ ఓటింగ్ పక్రియ మొదలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఆయన గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 2,11,257 మంది, 40 శాతానికిపైగా అంగ వైకల్యం ఉన్న దివ్యాంగులు 5,17,227 కలిపి మొత్తం 7,28,484 మంది హోమ్ ఓటింగ్‌కు అర్హులని చెప్పారు. అయితే వీరిలో 28,591 మంది మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకున్నారన్నారు. హోం ఓటింగ్‌ను ఎంచుకున్న వారిలో 14,577 మంది వృద్ధులు, 14,014 మంది దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. మార్చి 16న ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు అధికారులు హోం ఓటింగ్‌కు అర్హులైన వారి ఇళ్లకు వెళ్లి.. హోం ఓటింగ్ వినియోగించుకోదలచిన వారి నుంచి ఫారం–12డీ సేకరించినట్లు తెలిపారు. హోం ఓటింగ్‌కు అర్హత ఉన్నవారిలో 3 శాతం మంది ఓటర్లు మాత్రమే హోం ఓటింగ్‌ను ఎంచుకోవడం సానుకూల సంకేతమని పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్‌ను ఎంచుకున్న ఓటర్ల ఇంటికే అధికారులు వెళ్లి బ్యాలెట్ పేపర్లను ఇచ్చి ఓట్లు వేయించే ప్రక్రియ కొన్ని జిల్లాల్లో గురువారం ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాల ఎన్నికల అధికారులు వారి పరిస్థితులకు అనుగుణంగా హోం ఓటింగ్ షెడ్యూలు రూపొందించుకుని అమలు చేస్తున్నట్లు చెప్పారు. హోం ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 8వ తేదీకల్లా పూర్తవుతుందని ఆయన తెలిపారు. -
Voting urgent than marriage: ఓటుకు సుముహూర్తం!
మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్ స్టేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతడిని కొందరు అనుసరిస్తున్నారు. అక్కడున్న వారికి అతడు కొత్త పెళ్లి కొడుకు అని తెలుస్తోంది. అయినా కానీ, ఏంటా! అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి ఎవరికైనా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ విషయం అతడికీ తెలుసు. కానీ, పెళ్లితోపాటు, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని భావించడమే ఈ వరుడి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వదార్పుర ప్రాంతంలో కనిపించింది ఈ దృశ్యం. రెండో దశలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. షేర్వాణీ, తలపాగా ధరించిన నవ వరుడు ఆకాశ్‌ను పోలింగ్ స్టేషన్ ముందు ఏఎన్ఐ వార్తా సంస్థ పలకరించింది. అతడు తన ఓటింగ్ కార్డు చూపిస్తూ, ఓటు వేసేందుకు వచి్చనట్టు చెప్పాడు. తల్లితోపాటు, మామయ్య అతడి వెంట ఉన్నాడు.‘‘పెళ్లి వేడుక ముఖ్యమే. మరి ఓటు?. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి’’అని ఆకాశ్ చెప్పడంతో తోటి ఓటర్లు శభాష్ అని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరగా, యూజర్లు ఎవరికి తోచిన తీరులో వారు స్పందిస్తున్నారు. ఓటు విలువను గుర్తు చేసిన ఆకాశ్‌ను అభినందిస్తున్నారు. మరొకరు అయితే.. కాబోయే వధువుఆలోచనల్లో తేలిపోతూ ఓటును విస్మరించేవారేమో! – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాగాలాండ్: ఆరు జిల్లాల్లో జీరో పోలింగ్
కోహిమా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నాగాలాండ్‌లో అరుదైన రికార్డు నమోదైంది. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎంపీ సీటుకు శుక్రవారం(ఏప్రిల్19) పోలింగ్ జరిగింది. అయితే ఈ పోలింగ్‌కు ఆరు జిల్లాల ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ ఆరు జిల్లాల్లో ఉన్న నాలుగు లక్షల ఓటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒంటి గంటవరకు ఓటు వేయడానికి రాకపోవడం గమనార్హం. ఆరు జిల్లాలు కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్‌ను పరిష్కరించనందున ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ద ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్‌పీవో) పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఆరు జిల్లాల్లో ఈఎన్‌పీవో పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆరు జిల్లాలతో కలిపి ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటరీ(ఎఫ్ఎన్టీ) ఏర్పాటు చేయాలని ఈఎన్‌పీవో పోరాడుతోంది. మొత్తం ఆరు గిరిజన సంఘాలు కలిసి ఈఎన్‌పీవోను ఏర్పాటు చేశాయి. ఇదీ చదవండి.. కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ -
తొలిదశ పోలింగ్ షురూ
-
తొలి విడత సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం.. నేడు 102 లోక్‌సభ స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో మొత్తం అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ .. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేడే తొలి దశ పోలింగ్
-
‘మహా’ ఎన్నికల్లో మన ఓటర్లు
కెరమెరి(ఆసిఫాబాద్): ఇటు తెలంగాణ.. అటు మ హారాష్ట్ర సరిహద్దులోని కుమురంభీం జిల్లా ఆసిఫా బాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు వచ్చే కెరమెరి మండలంలోని 15 గ్రామాలకు చెందిన ఓటర్లు శుక్రవారం తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరంతా మహారాష్ట్రలోని చంద్రాపూర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తారు. పరంధోళి, నోకేవాడ, భోలాపటార్, అంతాపూర్ పోలింగ్ కేంద్రాల్లో 2,485మంది ఓటర్లు ఉన్నారు. పరంధోళి పోలింగ్ కేంద్రం(పరంధోళి, తండా, కోటా, శంకర్‌లొద్ది, ముకదంగూడ)లో 1,367 మంది ఓటర్లు ఉండగా.. నోకేవాడ(మహారాష్ట్ర పోలింగ్ కేంద్రం)లో మహరాజ్‌గూడ ఓటర్లు 370, భోలాపటార్(¿ోలాపటార్, గౌరి, లేండిగూడ) 882, అంతాపూర్ పోలింగ్ కేంద్రం(నారాయణగూడ, ఏసాపూర్, పద్మావతి, ఇంద్రానగర్, అంతాపూర్)లో 978మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీ నుంచి సుదీర్ మునగంటీవార్, కాంగ్రెస్ నుంచి ప్రతిభా థానోర్కర్ పోటీలో ఉన్నారు. ఇప్పుడు వేసి ఊరుకుంటారా? ‘వన్ నేషన్..వన్రేషన్’లో భాగంగా ఒక ఓటరు ఒకేవైపు ఓటు వేయాలని ఇటీవల ఆయా గ్రామాల్లో అధికారులు అవగాహన కల్పించారు. అయితే చంద్రాపూర్ ఎంపీ సెగ్మెంట్‌కు శుక్రవారం పోలింగ్ జరుగుతుండగా, మే 13న ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్‌కు పోలింగ్ జరుగుతుంది. అయితే రెండువైపులా ఓటుహక్కు వినియోగించుకుంటామని ఓటర్లు చెబుతున్నారు. -
లోక్‌సభకు ‘రాముని’కి ముందు ‘కృష్ణుడు’.. చివరికి ఏమయ్యింది?
లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాజకీయ నేతలంతా ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ కోవలోనే యూపీలోని మీరట్ నుండి బీజేపీ తరపున టీవీ సీరియల్ రామాయణంలోని రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఎన్నికల బరిలోకి దిగారు. టీవీ రాముడు అరుణ్ గోవిల్‌కు ముందు టీవీ సీరియల్ మహాభారత్‌లో శ్రీ కృష్ణుని పాత్ర పోషించిన నితీష్ భరద్వాజ్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పట్లో నటుడు నితీష్ భరద్వాజ్ భారతీయ జనతా పార్టీలో చురుకైన నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల నుంచి కొద్ది కాలానికే తప్పుకున్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి, విజయం సాధించారు. అయితే 1999 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ స్థానం నుంచి పోటీ చేసి, అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చేతిలో నితీష్ భరద్వాజ్ ఓటమిని చవిచూశారు. నితీష్ భరద్వాజ్ కొంతకాలం పాటు బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. జంషెడ్పూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 18 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఆరు సార్లు గెలుపొందగా, కాంగ్రెస్, జేఎంఎం నాలుగుసార్లు, సీపీఐ, బీఎల్డీ, జనతా పార్టీ, భోజోహరి మహతో ఒక్కోసారి గెలుపొందాయి. ఈ సీటుపై విజయాన్ని నమోదు చేసేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు అనేక ప్రయోగాలు చేస్తూ వస్తోంది. 1996లో నితీష్ భరద్వాజ్.. జనతాదళ్ సీనియర్ నేత, అప్పటి మంత్రి ఇందర్ సింగ్ నామ్‌ధారీపై 95,650 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
ఈ తొమ్మిది లోక్‌సభ సీట్లలో హోరాహోరీ?
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభానికి రోజుల వ్యవధి మాత్రమే ఉంది. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆ పార్టీ చెబుతుండగా, తామేమీ తగ్గేది లేదని ఇండియా కూటమి సవాల్ విసురుతోంది. అయితే దేశంలోని తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్‌కు హోరాహోరీ పోరు జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 1. రాజస్థాన్‌లోని చురు రాజస్థాన్‌లోని చురు నుంచి బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఝఝరియా, కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ కశ్వాన్ పోటీ చేస్తున్నారు. వీరి మధ్య తీవ్ర పోటీ ఏర్పడనున్నదని తెలుస్తోంది. చురు బీజేపీకి కంచుకోటగా పేరొందింది. బీజేపీ అభ్యర్థి దేవేంద్ర పారాలింపిక్స్‌లో రెండుసార్లు బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అయితే 2015 ఉప ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కశ్వాన్ మూడు లక్షల ఓట్లతో విజయం సాధించారు. 2. యూపీలో నగీనా యూపీలోని నగీనా నుంచి బీజేపీ తరపున ఓం కుమార్, ఎస్పీ నుంచి మనోజ్ కుమార్, బీఎస్పీ నుంచి సురేంద్ర పాల్ బరిలో ఉన్నారు. ఈ సీటు కూడా చాలా ఆసక్తికరంగా మారింది. 3. అసోంలోని జోర్హాట్ అసోంలోని జోర్హాట్ నుంచి బీజేపీ అభ్యర్థి తపన్ కుమార్ గొగోయ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ పోటీకి దిగారు. ఈ సీటు తరుణ్ గొగోయ్‌కి కంచుకోటగా గుర్తింపు పొందింది. ఈ సీటు నుంచి ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. 4. కోయంబత్తూరు తమిళనాడులోని కోయంబత్తూరు సీటుకు సంబంధించి డీఎంకే నుంచి గణపతి పి రాజ్‌కుమార్, బీజేపీ నుంచి కే అన్నామలై, ఏఐఏడీఎంకే నుంచి సింగై జీ రామచంద్రన్‌లు పోటీలో ఉన్నారు. ఈ సీటుపై అందరి దృష్టి నిలిచింది. 5. వయనాడ్ వయనాడ్ నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, బీజేపీ నుంచి కే సురేంద్రన్, సీపీఐ నుంచి అన్నీ రాజా పోటీ చేస్తున్నారు. వయనాడ్‌లో 32 శాతం ముస్లింలు, 13 శాతం క్రైస్తవులు ఉన్నారు. ఈ స్థానంలో ముక్కోణపు పోటీ నెలకొంది. 6. పూర్ణియా బీహార్‌లోని పూర్ణియాలో ఆర్జేడీ తరపున బీమా భారతి, జేడీయూ నుంచి సంతోష్ కుమార్ కుష్వాహా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ బీమా భారతి సిట్టింగ్ ఎంపీ సంతోష్ కుమార్‌కు పోటీగా నిలిచారు. కాగా ఈ సీటు నుంచి పప్పు యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఇక్కడ పోటీ మరింత ఉత్కంఠ రేపుతోంది. 7. తిరువనంతపురం తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ తరపున శశిథరూర్, బీజేపీ నుంచి రాజీవ్ చంద్రశేఖరన్, సీపీఐ నుంచి పన్నయన్ రవీంద్రన్ మధ్య పోటీ నెలకొంది. ఈసారి శశి థరూర్‌కు చంద్రశేఖరన్ నుంచి గట్టి పోటీ ఎదురుకానున్నదని చెబుతున్నారు. 8. రాజస్థాన్‌లోని బార్మర్ బార్మర్ నుంచి బీజేపీ అభ్యర్థి కైలాష్ చౌదరి, కాంగ్రెస్ అభ్యర్థి ఉమేద్ రామ్ బెనివాల్, స్వతంత్ర అభ్యర్థి రవీంద్ర సింగ్ భాటి మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. 9. త్రిసూర్‌లో కేరళలోని త్రిసూర్‌లో బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి, కాంగ్రెస్ అభ్యర్థి కే మురళీధరన్, సీపీఐ అభ్యర్థి వీఎస్ సునీల్ మధ్య పోటీ నెలకొంది. 1952 నుంచి ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలు మాత్రమే గెలుస్తూ వచ్చాయి. అయితే ఈ సీటులో బీజేపీకి గట్టి పోటీ ఎదురుకానున్నదని అంచనా. -
చెరిగిపోని సిరాచుక్క
చూపుడువేలిపై సిరా చుక్క. ఓటేశామని చెప్పేందుకు తిరుగులేని గుర్తు. పోలింగ్ బూత్ నుంచి బయటికి రాగానే చూపుడువేలిపై సిరా చుక్కను చూపిస్తూ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాం. ఆ ఇంకు కథ ఆసక్తికరం. ప్రపంచవ్యాప్తంగా.. మన దేశంలో 1962 లోక్‌సభ ఎన్నికల నుంచి సిరా చుక్క వాడకం మొదలైంది. నాటినుంచి నేటిదాకా కర్ణాటక ప్రభుత్వ సంస్థ మైసూర్ పెయింట్సే దీన్ని సరఫరా చేస్తోంది. 30 పై చిలుకు దేశాలకు ఈ ఇంకును ఎగుమతి చేస్తోంది కూడా. ఇదీ ప్రత్యేకత... ► ఓటేసినట్లు రుజువుగా ఓటరు ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. చూపుడు వేలు లేకుంటే ఎడమ చేతిలోని ఇతర వేలిపై వేస్తా రు. ఎడమ చేయే లేకుంటే కుడిచేతి వేళ్లలో దేనికైనా వేస్తారు. రెండు చేతులు లేకుంటే? ఎడమ లేదా కుడి చేయి చివరి భాగాలకు సిరా గుర్తు వేయాలని ఈసీ చెబుతోంది. ► సిరా చుక్కలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది రుద్దిన 40 సెకన్లలోపే ఆరిపోతుంది. చర్మంతో చర్య జరిపి బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దాంతో త్వరగా చెరగదు. ఇంకు గుర్తు సాధారణంగా చర్మంపై మూడు రోజుల దాకా ఉంటుంది. గోరుపై మాత్రం వారాల పాటు ఉంటుంది. ► 5.1 మిల్లీలీటర్ల సీసాలోని ఇంకుతో సుమారు 700 మందికి గుర్తు వేయవచ్చు. ఈ లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 26 లక్షల ఇంకు బాటిళ్లు ఆర్డర్ చేసింది. ► మామూలుగా ఎన్నికల్లోనే వాడే ఈ ఇంకును ఇతరత్రా వాడేందుకు ఒకేసారి ఈసీ అనుమతించింది. అదెప్పుడంటే.. కరోనా వ్యాప్తి సమయంలో. కోవిడ్ బారిన పడి క్వారెంటైన్లో ఉన్నవారిని గుర్తించడానికి పలు రాష్ట్రాలు ఈ ఇంకును ఉపయోగించాయి. – సాక్షి, ఎలక్షన్ డెస్క్ -
Election commission: హౌసింగ్ సొసైటీల్లోనూ పోలింగ్ బూత్‌లు
లక్నో: కేంద్ర రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లోని హౌసింగ్ సొసైటీల్లో సైతం 200కు పైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వివరించారు. ‘యూపీలోని పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం స్వల్పంగా ఉంటోంది. ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతంలో మొదటి స్థానం సంపాదించాలనేదే మా లక్ష్యం’అని ఆయన వివరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో ఓటింగ్ శాతం 59.11 మాత్రమేనన్నారు. ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ప్రతి రెండు కిలోమీటర్ల పరిధిలో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘‘తక్కువ ఓటింగ్ నమోదయ్యే గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల హౌసింగ్ సొసైటీల్లో ఈసారి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తాం. ఇలాంటి మొత్తం 200పైగా బూత్‌లలో ఎక్కువ భాగం నోయిడాలోనే ఉంటాయి. ఆ తర్వాత లక్నో, కాన్పూర్, బరేలీ, మథురలోనూ ఇవి ఉంటాయి. ఈసారి ఓటింగ్ శాతం 60పైగా ఉంటుందన్న నమ్మకముంది’’ అని అన్నారు. -
నేడు బీజేపీ టిఫిన్ బాక్స్ బైఠక్‌లు
సాక్షి, హైదరాబాద్: శనివారం బీజేపీ 44వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ‘టిఫిన్ బాక్స్ బైఠక్’ల నిర్వహణకు పార్టీ సిద్ధమౌతోంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి మొదలు అన్ని స్థాయిల నేతలు, కార్య కర్తలు తమ తమ ఓటున్న సొంత పోలింగ్ బూత్ కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలు, పోలింగ్ బూత్‌ల వద్ద పార్టీ పతాకాలను ఆవిష్కరించనున్నా రు. కాగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలోని పోలింగ్ బూత్ కేంద్రాలకు ఎవరి అల్పాహారం (టిఫిన్) వారు తెచ్చుకుని, అక్కడే తింటూ ఉదయ ం నుంచి మ«ధ్యాహ్నం వరకు భేటీలు నిర్వహించను న్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీపరంగా సన్నద్ధ తపై, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ కేడర్ మధ్య మెరుగైన సమన్వయ సాధన, కార్యాచరణ రూప కల్పనకు ఈ భేటీలు దోహదపడతాయని నేతలు చెబుతున్నారు. మూడు లక్ష్యాల సాధనకు సంకల్పం ఒక్కో పోలింగ్ బూత్‌లోని మూడు, నాలుగు పోలింగ్ స్టేషన్లలో ఆయా సామాజికవర్గాల ఓట్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వారికి సంబంధించి సమాచారం, ఇతర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువత, మహిళలు, రైతులు ఇలా వివిధ వర్గాల ఓటర్లను ఏవిధంగా చేరుకోవాలి, దళిత బస్తీలు, గిరిజన తండాల్లో ఎలాంటి ప్రచారాన్ని నిర్వహించాలన్న దానిపై అభిప్రాయ సేకరణ జరపను న్నారు. ఫిర్ ఏక్‌బార్ నరేంద్ర మోదీ సర్కార్ కోసం 370 సీట్ల సాధన, ప్రతి పోలింగ్ బూత్‌లో అదనంగా 370 ఓట్ల సాధన, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి బూత్‌లో 50 ఓట్ల సాధనకు ఈ సందర్భంగా సంకల్పం తీసుకోనున్నారు. కాచిగూడలో కిషన్‌రెడ్డి.. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ శనివారం ఉదయం అంబర్‌పేట నియోజ కవర్గం కాచిగూడలోని 214 పోలింగ్ స్టేషన్లో కిషన్‌రెడ్డి టిఫిన్ బాక్స్ బైఠక్‌లో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి అభయ్‌పాటిల్ సికింద్రాబాద్ అసెంబ్లీలోని మెట్టుగూడ 33–35 పోలింగ్ స్టేషన్లలో, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నారాయణపేట అసెంబ్లీ కోయిల్‌కొండలోని 23–27 పోలింగ్ స్టేషన్లలో పాల్గొంటారు. ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్‌లోని సాధనా స్కూల్ 174వ పోలింగ్ స్టేషన్లో, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజక వర్గం చిక్కడపల్లిలోని 9వ పోలింగ్స్టేషన్లో, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ మల్కాజిగిరిలోని వినాయక్‌నగర్ 155–157 పోలింగ్స్టేషన్లలో, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ అసెంబ్లీలోని గాజులపేట 192 పోలింగ్ స్టేషన్లో, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి మహేశ్వరం అసెంబ్లీలోని నాదర్గుల్, బడంగ్‌పేట పోలింగ్ స్టేషన్లలో పాల్గొంటారు. -
ఎన్నికల పాఠం
కోనసీమ జిల్లా: వంద శాతం పోలింగ్ కావాలంటే విద్యార్థుల పాత్ర కీలకం. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తే తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారితో ఓటు వేయిస్తారు. అందుకే విద్యార్థి దశ నుంచే సాంఘిక శాస్త్రంలో ‘భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ’ పాఠం ముద్రితమైంది. ఇది ప్రజాస్వామ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఎన్నికల వ్యవస్థ నుంచి ఓటుహక్కు వినియోగం వరకు విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశం రూపొందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అవసరాన్ని గుర్తించి 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించగా, ఆ ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 92 కోట్లకు చేరింది. 6వ తరగతి నుంచి.. విద్యార్థి దశ నుంచే ఓటు హక్కు విలువ, ఎన్నికల విశిష్టతను తెలియజేసేందుకు విద్యార్థులకు పాఠ్యాంశాలను సాంఘికశాస్త్రంలో పొందుపర్చారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాల దశలోనే విద్యార్థులకు పరిచయం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు ఇలా పలు అంశాలను విద్యార్థులకు పరిచయం చేశారు. ► 6వ తరగతిలో ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు, అధిక ఓటర్లు తీసుకునే నిర్ణయం, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిని ఎన్నుకునే విధానం, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే విధానం, నమూనా ఎన్నికల నిర్వహణ గురించి వివరించారు. మెజారిటీ పాలన, ఆర్టికల్ 326, విశ్వజనీన వయోజన ఓటుహక్కు గురించి వివరించారు. ► 7వ తరగతిలో సార్వజనీన వయోజన ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, గణతంత్రం, రాజ్యాంగ రూపకల్పనా చరిత్ర, ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతాయుతమైన పౌరసత్వం, దేశభక్తి, స్వీయ క్రమశిక్షణ, శాసనసభ్యుని ఎన్నిక, రహస్య ఓటింగ్ విధానం తదితర భావనలను విద్యార్థులకు పరిచయం చేశారు. ► 8వ తరగతిలో మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం? పార్లమెంట్ ఎలా ఏర్పడుతుంది? రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు ఎలా ప్రవేశ పెట్టారు? ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం, 2004 సాధారణ ఎన్నికల నుంచి వినియోగించిన విధానం, ఈవీఎంల వినియోగించడం వల్ల 1,50,000 చెట్లను రక్షించుకోగలగడం, బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే 8వేల టన్నుల కాగితం ఉపయోగపడిన అంశం తదితర విషయాలను వివరించారు. ► 9వ తరగతిలో ‘ఎన్నికల రాజకీయాలు’ అనే చాప్టర్లో భారతదేశంలో ఎన్నికలను మదింపు చేయడం, వివిధ నియోజకవర్గాల మధ్య సరిహద్దు రేఖలను నిర్ణయించడం, ఎన్నికల ఫలితాలను ప్రకటించే వరకు ఎన్నికల్లో వివిధ దశలను వివరించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడడంలో ఎన్నికల సంఘం పాత్రను వివరించారు. భారతదేశంలో ఎన్నికల విధానం, రిజర్వ్ నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా, అభ్యర్థులు నామినేషన్ వేసే విధానం, విద్యార్హతలు, పోలింగ్ జరిగే విధానం, ఓట్ల లెక్కింపు తదితర విషయాలను ప్రస్తావించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత గురించి వివరిస్తూనే ఎన్నికలు ప్రకటన చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల సంఘం నిర్వహించే ప్రతి అంశాన్ని పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. ఎన్నికల సంఘం విధులకు సంబంధించి చక్కటి ఫొటోలతో, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా పాఠ్యాంశాల రూపకల్పన చేపట్టారు. -
పోలింగ్ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయండి
ఎన్నికల కమిషన్‌కు ఏపీ మహిళా కమిషన్ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు (గర్భిణులు, బాలింతల) పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఏపీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేయాలని, బాలింతల కోసం ఫీడింగ్ రూమ్ అందుబాటులో ఉంచాలని కోరారు. గర్భిణులకు అత్యవసర పరిస్థితిలో వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చే మహిళలు వడదెబ్బకు గురికాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద షెల్టర్లు ఏర్పాటుచేయాలని, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. దాడులు, లైంగికదాడులు, వేధింపులకు గురైన మహిళలకు తగిన న్యాయం చేసేందుకు, బాధితులను పరామర్శించేందుకు మహిళా కమిషన్ చైర్పర్సన్, సభ్యులకు ఎన్నికల నిబంధనలలో సడలింపు ఇవ్వాలని కోరారు. గిరిజన మహిళలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్‌కు అనుమతివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
15,256 అడుగుల ఎత్తులో 52 మంది ఓటర్లు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ అయిన తాషిగ్యాంగ్ పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పోలింగ్ బూత్‌లో మూడోసారి ఓటింగ్ జరగనుంది. తాషిగ్యాంగ్‌లో పోలింగ్ స్టేషన్‌ను నిర్మించిన తర్వాత 2019లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2021లో తాషిగ్యాంగ్ పోలింగ్ బూత్‌లో లోక్‌సభ ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మూడోసారి. 2024లో ఈ పోలింగ్ స్టేషన్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఈ సంవత్సరం దీన్ని మోడల్ పోలింగ్ స్టేషన్‌గా మార్చింది. ఇక్కడ 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 52 మంది ఓటర్లలో 30 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. ఈ పోలింగ్ స్టేషన్ కాజా సబ్ డివిజన్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రహదారి నుండి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అయితే, ప్రస్తుతం ఇక్కడ అడుగు మందం మేర మంచు కురుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం జూన్ 1న ఇక్కడ ఓటింగ్‌ను ఏర్పాటు చేసింది. తాషిగ్యాంగ్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ముందు గ్రామస్థులు ఓటు వేయడానికి 14,567 అడుగుల ఎత్తులో ఉన్న హిక్కిమ్ గ్రామానికి వెళ్లాల్సి ఉండేది. తాషిగ్యాంగ్ కంటే ముందు, ఇదే భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ 45 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27 మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నారు. 2021లో మండి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు 49 మంది ఓటర్లు ఉండగా వీరిలో 29 మంది పురుషులు, 20 మంది మహిళలు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ 100 శాతం ఓటింగ్ నమోదైంది. -
ఈలేస్తే.. క్లోజ్! .. గంట వ్యవధిలోనే ఘటనాస్థలికి ఫ్లయింగ్ స్క్వాడ్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులో రాజకీయ పార్టీల హోర్డింగులు సోమవారం ఉదయం వరకూ ఉన్నాయి. వీటిని సీ–విజిల్ ద్వారా ఫొటోలు తీసి ఎవరో అప్లోడ్ చేశారు. అంతే.. నిమిషాల వ్యవధిలో అక్కడకు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, యుద్ధ ప్రాతిపదికన హోర్డింగులను తొలగించింది. ఈ యాప్ ఎంత వేగంగా పని చేస్తుందనేందుకు ఈ చర్యలే సాక్ష్యం. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సర్వ సన్నద్ధమయింది. ఇప్పటికే ఓటర్ల జాబితాలు.. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో పార్టీల ప్రలోభాలు, కోడ్ ఉల్లంఘనలపైనా దృష్టి సారించింది. ఉల్లంఘనులపై చర్యలకు ‘సీ విజిల్’ యాప్‌ను సిద్ధం చేసింది. – ప్రత్తిపాడు ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తే చాలు.. సాధారణ ఎన్నికల్లో ఎవరైనా ప్రవర్తనా నియమావళిని (ఎన్నికలకోడ్) ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, డబ్బు, వస్తు సామగ్రి పంపిణీ వంటి వాటికి పాల్పడినా, అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఓటర్లకు కానుకలు అందజేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే నేరుగా ఎన్నికల సంఘానికి చేరిపోతాయి. కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలనూ ఆడియో ద్వారా రికార్డు చేసి అప్లోడ్ చేయవచ్చు. అత్యంత వేగంగా స్పందన సీ విజిల్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా స్పందన ఉంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా సంబంధిత ప్రదేశం నుంచే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన గంటలోపు అక్కడకు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చేరుకుంటుంది. ఘటనపై 90 నిమిషాల్లో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ఎన్నికల కమిషన్ అందుబాటులోనికి తీసుకువచి్చన ఈ యాప్‌ను ఓటర్లు వినియోగించుకోవాలి. – ఎం.పద్మజ, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ప్రత్తిపాడు గంట వ్యవధిలోనే.. ► ఎవరైనా, ఎక్కడి నుంచైనా యాప్‌లో అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారికి వెళుతుంది. ఆయన దీని పరిశీలనకు ఫీల్డ్‌లో ఉన్న టీముకు పంపిస్తారు. ►15 నిమిషాల్లో ఫీల్డ్‌లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుతుంది. ► 30 నిమిషాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ చర్యలు మొదలుపెట్టి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతుంది. ►యాభై నిమిషాల్లో రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదును క్లోజ్ చేస్తారు. ►ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాల్లో ప్రతిస్పందన ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి.. ►యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ఇన్స్టాల్ చేసుకునే సమయంలో రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ► ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలనుకున్న సమయంలో మొబైల్లోని జీపీఎస్ ఆన్‌లో ఉంచాలి. దాని ఆధారంగానే అధికారులు సంబంధిత ప్రాంతానికి నేరుగా చేరుకోగలుగుతారు. ► యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో వచ్చిన ఓటీపీ ద్వారా యాప్ యాక్టివేట్ అవుతుంది. ► ఆ తర్వాత వీడియోలు, ఫొటోలు అప్ లోడ్ చేసి నేరుగా యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపవచ్చు. -
23,090 పోలింగ్ కేంద్రాల్లో నిఘా నేత్రం
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రోజు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ముమ్మరం చేసింది. లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభకు ఏక కాలంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా నిఘా వ్యవస్థ ఏర్పాటునకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలుండగా అందులో 50 శాతం మేర అంటే 23,090 పోలింగ్ కేంద్రాల్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నిర్ణయించింది. ఇందులో భాగంగా 25 లోక్‌సభ నియోజకర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 23,090 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ స్ట్రీమింగ్ (ఆడియో, వీడియో, రికార్డు, వీక్షణ, సీసీటీవీ తదితర సేవలు అందించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. వచ్చే నెల 1వ తేదీలోగా ఆసక్తిగల సంస్థలు బిడ్లు దాఖలు చేయాల్సిందిగా స్పష్టం చేసింది. సాంకేతిక బిడ్‌ను వచ్చే నెల 2న, ఆర్థిక బిడ్‌ను వచ్చే నెల 3న తెరుస్తామని పేర్కొంది. ఎంపికైన బిడ్డర్ రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఏకకాలంలో జరిగే ఎన్నికల పోలింగ్ రోజు ప్రత్యక్ష వెబ్ ప్రసారాన్ని (ఆడియో–వీడియోతో కూడిన)టర్న్‌కీ ప్రాతిపదికన చేపట్టాలి. ఇందుకు అవసరమైన వెబ్ అధారిత వెబ్ స్ట్రీమింగ్ సాఫ్ట్‌వేర్‌తో పాటు సంబంధిత వస్తువులను సరఫరా చేయాల్సి ఉంటుంది. సురక్షిత క్లౌడ్ వాతావరణంలో సెటప్ చేసిన సర్వర్‌లోని ఆడియో–వీడియో స్ట్రీమింగ్ సాఫ్ట్‌వేర్‌తో సర్వర్‌ను ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన స్థలాన్ని తప్ప ఎలాంటి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం అందించదు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజు తగిన సిబ్బందితో సహా లైవ్ వెబ్ స్ట్రీమింగ్ చేయాలి. రికార్డు చేసిన బ్యాకప్‌ను సమర్పించాలి. అలాగే రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో 55 ఇంచుల ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ రోజు ఒక్కో కార్యాలయంలో ఒక్కో సిబ్బంది ఉండాలి. మొత్తం 26 జిల్లాల ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో టీవీ స్క్రీన్స్‌ను అమర్చాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో రెండు టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలి. నిరంతరాయంగా లైవ్ వెబ్ కాస్టింగ్ అందించడానికి అవసరమైన బ్యాటరీ బ్యాకప్ అందించాల్సి ఉంటుంది. -
పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేయండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేయడంతోపాటు వాటిలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను అదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ, కలెక్టర్లు, వివిధ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. పోలింగ్ స్టేషన్లలో శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక శాఖకు చెందిన పాఠశాలలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, ఫర్నిచర్, తాగునీరు, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష తొలుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డితో సమావేశమైన జవహర్‌రెడ్డి అక్రమ మద్యం రవాణాను అరికట్టడం, పటిష్టమైన బందోబస్తు, చెక్ పోస్టుల ఏర్పాట్లు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, విచారణలో ఉన్న కేసులకు సంబంధించి త్వరలో చార్జిïÙట్లు దాఖలు చేయడంపై సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాల వద్ద పటిష్టమై చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు పోలీస్ బలగాలను పెద్దఎత్తున నియమించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. అడిషనల్ సీఈవో హరేందిరప్రసాద్, అడిషనల్ డీజీ బాగ్చి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్, ఎస్ఈబీ డైరెక్టర్ రవిప్రకాష్ పాల్గొన్నారు. -
సింగరేణిలో పోలింగ్ కేంద్రాలు ఖరారు
గోదావరిఖని: సింగరేణిలో ఈనెల 27న నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం వివిధ ప్రాంతాల్లో మొత్తం 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఏరియాలో ఐదు, కొత్తగూడెంలో ఆరు, ఇల్లెందులో మూడు, మణుగూరులో ఏడు, రామగుండం–1లో 11, రామగుండం–2లో ఆరు, రామగుండం–3లో ఆరు, భూపాల్‌పల్లిలో తొమ్మిది, బెల్లంపల్లిలో ఐదు, మందమర్రిలో 11, శ్రీరాంపూర్‌లో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజే రాత్రి ఓట్ల లెక్కింపు చేపడతారు. దీనికోసం కూడా ఎన్నికల లెక్కింపు కేంద్రాలను కార్మిక శాఖ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే..: సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లోని ఓట్లను లెక్కించేందుకు ప్రత్యేకంగా 10 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొ త్తగూడెం ఏరియాలోని ఓట్లను రుద్రంపూర్ ఆర్సీవోఏ క్లబ్, ఇల్లెందు ఏరియా ఓ ట్లను ఇల్లెందు ఏరియా కమ్యూనిటీహాల్, మణుగూరు ఏరియాలో పీవీకాలనీ కమ్యూనిటీహాల్, రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–1,2, 3 ఏరియాల ఓట్లను గో దావరిఖని సెక్టార్–1 కమ్యూనిటీ హాల్, భూపాల్పల్లి ఏరియా ఓట్లను కృష్ణ కాల నీ మినీ ఫంక్షన్‌హాల్, బెల్లంపల్లి ఏరియాలో గోలేటి టౌన్షిప్, సీఈఆర్‌క్లబ్, మందమర్రి ఏరియా ఓట్లను మందమర్రి సీఈఆర్ క్లబ్, శ్రీరాంపూర్ ఏరియాలోని ఓ ట్లను సీసీసీ ఎస్‌సీవోఏ క్లబ్, కార్పొరేట్లో హెడ్డాఫీస్ న్యూకాన్ఫరెన్స్హాల్, కార్పొరేట్ బూత్–5 ఓట్లను సింగరేణి భవన్ మూడో ఫ్లోర్లో లెక్కించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈమేరకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. -
ఇక్కడ నీకేం పని.. కానిస్టేబుల్‌పై సీఐ లాఠీఛార్జ్
హైదరాబాద్: ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాదర్గుల్లోని పోలింగ్ కేంద్రం ఓ సీఐ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై లాఠీ ఝులిపించారు.మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ నాదర్గుల్లోని జిల్లా పరిషత్తు పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరి పోలింగ్ కేంద్రం బయట ఎదురుచూస్తున్నారు. పెట్రోలింగ్ వాహనంలో ఆదిభట్ల ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి అక్కడకు వచ్చారు. ఇన్స్పెక్టర్ను చూసిన కానిస్టేబుల్ సెల్యూట్ చేసేందుకు ప్రయత్నించారు.. అంతలోనే సీఐ 'ఇక్కడ నీకేం పని' అని ప్రశ్నిస్తూ కానిస్టేబుల్‌ను లాఠీతో కొట్టారు. దాంతో కానిస్టేబుల్ అక్కడి నుంచి పరుగులు తీశారు. -
ఈ నగరానికి ఏమైంది?
విశ్వనగరంగా పరుగులు తీస్తున్న హైదరాబాద్‌కు ఏమైంది? ఎన్నికలు ఏవైనా పోలింగ్ శాతం నమోదు గ్రాఫ్ మాత్రం దిగజారుతోంది. కోటీ 20 లక్షలకు పైగా జనాభాలో సగానికి పైగా అక్షరాస్యులే. మేధావులు, విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు, ప్రముఖులే. ఓటుహక్కు వినియోగానికి వచ్చేసరికి మాత్రం వెనుకంజ వేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే అతి తక్కువగా పోలింగ్ నమోదవుతూ వస్తోంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఓటింగ్ సరళి మరోసారి నిరాశపర్చింది. గత నాలుగు పర్యాయాలుగా ఇదే తంతు కొనసాగుతోంది. మొత్తం ఓటర్లలో సగం మంది కూడా పోలింగ్‌లో పాల్గొనడం లేదని తాజా పోలింగ్ శాతం వెల్లడిస్తోంది . రాజధాని నగరం హైదరాబాద్‌లో పోలింగ్ శాతం గతం కంటే తగ్గింది. పోయిన అసెంబ్లీ (2018) ఎన్నికల్లో 50.51 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనగా, ఈసారి పోలింగ్ సమయం ముగిసే రాత్రి 11 గంటల వరకు 46.65 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఇది దాదాపు 5 శాతం తగ్గడం గమనార్హం. మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను గోషామహల్ నియోజకవర్గంలో అత్యధికంగా 45.79 శాతం నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో ఖైరతాబాద్ (45.5శాతం), సనత్‌నగర్ (45.01 శాతం), సికింద్రాబాద్ (45.01 శాతం) ఉన్నాయి. అత్యల్ప పోలింగ్ యాకుత్‌పురాలో 27.87 శాతం నమోదైంది. గతంలో కంటే ఈసారి నగర ఓటర్లు మరింత నిరాసక్తత చూపారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు మాత్రం ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సామాన్యుల్లోనే ఓటు చైతన్యం.. నగరంలోని ఉన్నత వర్గాలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాల్లో ఓటింగ్‌లో తక్కువగా పాల్గొనట్లు కనిపిస్తోంది. పోలింగ్ రోజు సెలవుదినంగా భావిస్తూ చాలామంది ఇంటికే పరిమితమవుతున్నారు. కాగా.. ఎప్పటి మాదిరిగానే బస్తీలు, మురికివాడలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాత్రమే ఓటింగ్‌లో పాలుపంచుకుంటున్నారు. సంపన్నుల కాలనీలు అపార్ట్‌మెంట్ల్లలోని ప్రజలు ఓటింగ్‌కు దూరం పాటించినట్లు పరిస్ధితి కనిపిస్తోంది. విద్యావంతులున్న చోట అత్యల్పంగా పోలింగ్‌శాతం నమోదైంది. కారణాలు అనేకం.. మరోవైపు నగరంతో పాటు స్వస్థలాల్లో ఓటు కలిగిన సుమారు 18 శాతం ఓటర్లు కుటుంబ సమేతంగా సొంతూరిలో ఓటు వేసేందుకు ప్రాధాన్యమిచ్చి వెళ్లిపోవడం పోలింగ్ తగ్గేందుకు మరో కారణమవుతోంది. ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం కారణంగా ఓటరు స్లీప్‌లు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదు. మరోవైపు ఓటర్లు అడ్రస్‌లు కూడా తారుమారై ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాలకు కేటాయించడం కూడా అనాసక్తికి కారణమైందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున నమోదైన బోగస్ ఓటర్లతోపాటు చనిపోయిన ఓటర్లు సైతం తొలగించలేదు. ఈ అంశం కూడా పోలింగ్ తగ్గుదలకు కారణమైంది. మారని పాతబస్తీ ఓటర్లు చారిత్రాత్మక పాతబస్తీ ఓటర్ల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ప్రతిసారి పోలింగ్ శాతం దారుణంగా దిగజారుతోంది. వాస్తవంగా నగరంలోని మిగిలిన చోట్ల పోలింగ్ ఓ ఎత్తయితే పాతబస్తిలో ఓటింగ్ మరో ఎత్తు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనబర్చడంలేదు. గత రెండు పర్యాయాల పోలింగ్ పరిశీలిస్తే మొత్తం ఓటర్లలో సగం మంది కూడా పోలింగ్‌లో పాల్గొనక పోవడం ఇందుకు నిదర్శనం. పాతబస్తీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఫలితాలు ఒకే విధంగా ఉంటాయి. రాజకీయ పార్టీ ఏదైనా కానీ, ప్రచార మాధ్యమాలు, మరేదైనా కానీ.. పాతబస్తీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గెలిచేది ఒకే పార్టీ అన్నది ఘంటాపథంగా చెబుతుంటాయి. ఇదే ఓటింగ్ తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా పోలింగ్ మరింత దిగజారుతోంది. రెండు దశాబ్దాలుగా ఇదే వరస.. నగరంలో గత రెండు దశాబ్దాల మధ్య జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, బల్దియా ఎన్నికల పోలింగ్ శాతం పరిశీలిస్తే నమోదు 50 శాతం మించనట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే 2009లో 58 శాతం, 2014లో 53.. 2018లో 50.86 శాతం పోలింగ్ నమోదైంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే 2009లో 53.86 శాతం, 2014లో 53.27, 2019లో 39.46 శాతం మాత్రమే నమోదైంది. సికింద్రాబాద్ పరిధిలో 2009లో 57 శాతం, 2014లో 53.06, 2019లో 44.99 శాతం నమోదైంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 2009లో 49.21, 2014లో 51.05, 2019లో 49.11 శాతం నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే 2020లో 46.55 శాతం, 2016లో 45.25 శాతం మించలేదు. 2009లో 45.27, 2002 ఎన్నికల్లో పోలింగ్ 41.22 శాతం మించలేదు. ఆద్యంతమూ మందకొడిగానే.. నగరంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గురువారం ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ చివరిదాకా అదే స్ధాయిలో కొనసాగింది. మొదటి 2 గంటల్లో 5 శాతం, ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలో మరో పది శాతం, ఆ తర్వాత మరో రెండు గంటల్లో 12 శాతం నమోదైంది. ఆ తర్వాత ప్రతి రెండు గంటలకు వరసగా పది శాతం చొప్పున ఓటింగ్ పెరుగుతూ వచ్చింది. కూడికలు.. తీసివేతలు లెక్కలు వేస్తున్న అభ్యర్థులు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. గుంభనంగా వ్యవహరించిన ఓటర్లు పోలింగ్ ముగిసేంత దాకా తమ అంతరంగాన్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. పోలింగ్ ముగిశాక సైతం ఓటరు నాడి తెలుసుకోలేక సతమతమవుతున్నారు. నిన్నటి వరకూ ఒక పార్టీకి కచ్చితమని భావించిన నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగే సమయానికి పరిస్థితి తారుమారు కావడంతో కంగు తిన్నారు. ఈ నేపథ్యంలో ఏ బస్తీలో, ఏ కాలనీలో తమకు ఓట్లు తగ్గాయి. ఎందుకు తగ్గాయి ? అనే అంశాలతో పోస్ట్‌మార్టం చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగినా , రెండు మూడు విడతలు ఓటర్లను కలిసినా, ముట్టజెప్పాల్సినవి ముట్టజెప్పినా తమకు ఎందుకు ఓట్లు పడలేదో ఆరా తీస్తున్నారు. మరోవైపు, తాము ఊహించని విధంగా కొన్ని ప్రాంతాల నుంచి తమకు ఎక్కువ ఓట్లు పోల్ కావడంతో తలలు పట్టుకుంటున్నారు. కోర్ సిటీలోని కొన్ని నియోజకవర్గాల్లో అనూహ్యంగా ఊహించని పార్టీలకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని తెలిసి హతాశులయ్యారు. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల 'పోలింగ్ 70.66 శాతం'!
గడప దాటని సిటీ చెంతనే పోలింగ్ కేంద్రం.. అయినా సిటీ ఓటరు గడప దాటలేదు. సెలవును సరదాగా గడిపేశారు. ఓటేసేందుకు కదల్లేదు. క్రితంసారితో పోలిస్తే 5% పోలింగ్ తగ్గింది. పట్నమిలా..హైదరాబాద్ భరత్‌నగర్‌లోని పోలింగ్ కేంద్రం 16 కి.మీ. నడిచొచ్చి.. ఓటేసి వీరంతా ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల పంచాయతీ పరిధిలోని పెనుగోలు ఆదివాసీలు. మూడు గుట్టలు ఎక్కి దిగి, మధ్యలో మూడు వాగులు దాటి 16 కిలోమీటర్లు నడిచి వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ గోడు పట్టించుకోవడం లేదని వారు గోడు వెళ్లబోసుకున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలనుకున్నా.. రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకోవాలనే ఇంతదూరం నడిచి వచ్చామని చెప్పారు. – వాజేడు పల్లె ఇలా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. గురువారం రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 70.66 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చితమైన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ శుక్రవారం ప్రకటిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. రాష్ట్ర శాసనసభకు 2014లో జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం, 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్ నమోదైంది. తాజా పోలింగ్‌లో కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. ఇది మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 3న (ఆదివారం) ఓట్ల లెక్కింపు నిర్వహించి, ఫలితాలను ప్రకటించనున్నారు. అత్యధికంగా జనగామలో.. గురువారం సాయంత్రానికల్లా అత్యధికంగా.. మునుగోడు 91.51, ఆలేరు 90.16, భువనగిరి 89.9 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా యాకూత్‌పురలో 39.69 శాతం, మలక్‌పేట 41, నాంపల్లిలో 42.76, చార్మినార్‌లో 43.26 శాతం పోలింగ్ నమోదైంది. ► జిల్లాల వారీగా పోలింగ్ శాతాలను పరిశీలిస్తే.. అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో 90.03 శాతం, మెదక్‌లో 86.69శాతం జనగామలో 85.74, నల్లగొండలో 85.49శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.65 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతమే ఓట్లు వేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గిపోయినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ►మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 13 వామ పక్ష తీవ్రవాద ప్రభావిత స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా 106 చోట్ల సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ ముగిసే సమ యానికల్లా.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. కొన్నిచోట్ల ఇలా రాత్రి వరకు పో లింగ్ సాగింది. ఈ క్రమంలోనే పోలింగ్ శాతాలపై శుక్రవారం ఉదయమే స్పష్ట త వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. పలుచోట్ల ఆలస్యంగా.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలుకావాలి. అ యితే పలుచోట్ల ఈవీఎంలు, ఓటర్ వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) యంత్రాలు మొరాయించడంతో గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేందాల్లో ఈవీఎంలు మొరాయించాయి? ఎన్నింటిని రిప్లేస్ చేశారన్న అంశంపై సీఈఓ కార్యాలయం ప్రకటన జారీ చేయలేదు. ఉదయమే బారులు తీరిన ఓటర్లు రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీనితో వడివడిగా ఓటింగ్ సాగింది. మధ్యాహ్నం కొంత మందగించినా తర్వాత పుంజుకుంది. ఉదయం 9 గంటల వరకు 7.78 శాతం, 11 గంటల వరకు 20.64 శాతం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి 51.89 శాతం, సాయంత్రం 5 గంటలకు 64.42 శాతం పోలింగ్ నమోదైంది. కడపటి వార్తలు అందేసరికి 70.66 శాతంగా నమోదైంది. రాత్రి వరకు పలుచోట్ల ఓటింగ్ కొనసాగిన నేపథ్యంలో ఆ లెక్క లన్నీ క్రోడీకరించాల్సి ఉంది. దీనితో ఓటింగ్ శాతం పెరగనుందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. తగ్గిన ఓట్ల గల్లంతు ఫిర్యాదులు గత శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతైనట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల్లో లక్షల ఓట్లు తొలగించినట్టు విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఓట్ల గల్లంతుపై ఫిర్యాదులు నామమాత్రంగానే వచ్చాయి. వివరాలు వెల్లడించని ఎన్నికల ప్రధానాధికారి శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) విలేకరుల సమావేశం నిర్వహించి.. వివరాలను వెల్లడించడం ఆనవాయితీ. అంతేకాదు.. పోలింగ్ కొనసాగుతున్న సమయంలోనూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేవారు. అయితే సీఈఓ వికాస్‌రాజ్ గురువారం శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిశాక ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు సీఈఓ కార్యాలయం ప్రజాసంబంధాల విభాగం అధికారులను సంప్రదించారు. పోలింగ్ తీరుపై విలేకరుల సమావేశం నిర్వహించాలని కోరారు. కానీ సీఈఓ వికాస్‌రాజ్ అంగీకరించలేదని అధికారులు బదులిచ్చారు. కేవలం పోలింగ్ శాతంపై ప్రాథమిక అంచనాలు మినహా ఎలాంటి ఎలాంటి సమాచారాన్ని సీఈఓ కార్యాలయం వెల్లడించలేదు. ఈవీఎంల తరలింపుపై ఉద్రిక్తత సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయినగూడెంలో అధికారులు ఎస్కార్ట్ లేకుండా ఈవీఎంలను తరలిస్తున్నారని, ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు. అయితే ఖాళీ ఈవీఎంలను కారులో తరలిస్తున్న సెక్టోరియల్ అధికారిని అడ్డుకుని అద్దాలను ధ్వంసం చేశారు. ఇంటింటికీ ఓటింగ్‌కు భారీ స్పందన: సీఈసీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 80ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు కలిపి 25,400 మంది తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తొలిసారి కల్పించిన ఈ అవకాశాన్ని ఓటర్లు సది్వనియోగం చేసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. బందోబస్తుతో ప్రశాంతం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, అనుక్షణం పర్యవేక్షించడంతో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాల్లో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగి, ఉద్రిక్తత నెలకొన్నా అక్కడి పోలీసు సిబ్బంది వేగంగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. రాష్ట్ర పోలీస్‌శాఖ నుంచి 45వేల మంది పోలీసు సిబ్బంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కర్నాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 23,500 మంది హోంగార్డులు బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. కూంబింగ్, ఏరియా డామినేషన్ సెర్చ్ చేపట్టారు. ఓటెత్తని హైదరాబాద్! సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే తక్కువగా పో లింగ్ నమోదైంది. అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా.. ఎప్పటిలాగే హైదరాబాద్ జనం ఓటు వేసేందుకు తరలివెళ్లలేదు. పోలింగ్ కేంద్రాల్లో ఎంత క్యూ ఉందో, ఎంత సమయంలో ఓటేయవచ్చో ఆన్లైన్లో ముందే తెలుసుకునే సదుపాయం కల్పించినా ఫలితం రాలేదు. చాలా వరకు సెలవురోజుగానే భావించి విశ్రాంతి తీసుకునేందుకు, వినోద కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండటమే దీనికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా ఒకటి కంటే ఎక్కువచోట్లా ఓట్లున్నవారూ ఇక్కడ గణనీయంగా ఉండటం, వారంతా స్వస్థలాలకు తరలడం కూడా పోలింగ్ తగ్గడానికి మరో కారణమని పేర్కొంటున్నాయి. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించిన సమాచారం మేరకు.. జిల్లాలో కడపటి వార్తలు అందేసరికి 46.65 శాతమే పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల (50.51 శాతం)తో పోలిస్తే ఐదు శాతం తగ్గడం గమనార్హం. జిల్లాల్లో ఓటింగ్ తీరు ఇదీ.. ఉమ్మడి ఆదిలాబాద్.. గిరిజన ప్రాంతాల్లో ధాటిగా ఓటింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని మారుమూల, గిరిజన ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్, సిర్పూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి తదితర స్థానాల్లో పలుచోట్ల రాత్రిదాకా ఓటింగ్ జరిగింది. కాగజ్‌నగర్ పట్టణంలోని 90వ పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సిర్పూర్ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీఎస్పీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వారిని అదుపు చేసే క్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రావు, ఎస్సై గంగన్న, కానిస్టేబుల్ రత్నాకర్, మరికొందరికి గాయాలయ్యాయి. ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ప్రవీణ్‌కుమార్ రిటరి్నంగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా వరిపేట, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం కొత్తపల్లిలలో ప్రజలు తమ సమస్యలు తీర్చలేదంటూ నిరసన వ్యక్తం చేయగా.. అధికారులు నచ్చజెప్పడంతో ఓటేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ గ్రామస్తులు.. తమ ఊరిగి రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ ఓటు వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో నిలబడి ఇద్దరు మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం.. గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ ఖమ్మం ఉమ్మడి నియోజకవర్గాల్లో పలుచోట్ల రాత్రి 8వరకు కూడా పోలింగ్ జరిగింది. కొత్తగూడెం రూరల్, ఏన్కూరు, సత్తుపల్లి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదంటూ పోలింగ్‌ను బహిష్కరించారు. అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం ఓట్లు వేశారు. కూసుమంచి, ఎర్రుపాలెం, తల్లాడ, బోనకల్, కొనిజర్ల, తిరుమలాయపాలెం, అశ్వారావుపేట, మణుగూరు, పినపాక మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఖమ్మం రూ రల్ మండలంలోని గోళ్లపాడులో ఏనుగు సీతారాంరెడ్డి(75) ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఉమ్మడి రంగారెడ్డి.. బాగా తగ్గిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్‌శాతం తగ్గింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్‌లో, రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలో, మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లిలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ.. పలుచోట్ల లాఠీచార్జి నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల లాఠీచార్జిలు, చెదురుమదురు ఘటనలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఆలేరు మండలం కొలనుపాకలో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డి గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు. ఈసమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు రాళ్లు రువ్వడంతో మహేందర్‌రెడ్డి కారు అద్దాలు పగిలాయి. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. హుజూర్నగర్లోనూ గులాబీ కండువా వేసుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డిని పోలీసులు ఆపడంతో వాగ్వాదం జరిగింది. నారాయణపురం మండల కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు టెండర్ ఓట్లు వేశారు. ఉమ్మడి కరీంనగర్.. డబ్బుల కోసం నిరసనలతో.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో పెద్దగా అవాంఛనీయ ఘటన లు జరగలేదు. కరీంనగర్ జిల్లాలో రేకుర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ఏజెంట్ వాహనాన్ని బీఆర్ఎస్ నాయకులు అడ్డగించారని పోలీసులకు ఫిర్యా దు అందింది. మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ గులాబీ చొక్కా ధరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చారంటూ మొగిలిపాలెం, గన్నేరువరం గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండ లం గంగారంలో అధికార పార్టీ అభ్యర్థి పంచిన డబ్బులు తమకు అందలేదంటూ కొందరు ఓటర్లు రోడ్డుపై బైఠాయించారు. రాజన్న సిరిసి ల్ల జిల్లా లింగంపేటలో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ బీజేపీ నాయకుడి ఇంటి వద్ద మహిళా గ్రూపు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్.. ప్రశాంతంగా పోలింగ్.. పాలమూరు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం వంకేశ్వరంలో డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, మరికొన్నిచోట్ల బీఆర్ఎస్–బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్.. మందకొడిగా మొదలై.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ మందకొడిగా ప్రారంభమై మధ్యాహ్నానికి పుంజుకుంది. పలుచోట్ల రాత్రిదాకా ఓటర్లు క్యూలలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలుచోట్ల గుమిగూడిన పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డిని నాన్‌లోకల్ అంటూ బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఉమ్మడి వరంగల్.. బీఆర్ఎస్–కాంగ్రెస్ జగడం వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, మరికొన్ని చోట్ల తమ గ్రామాలను అభివృద్ధి చేయలేదంటూ జనం రాకపోవడంతో ఓటింగ్ జరగలేదు. దంతాలపల్లి బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మంగపేటలో బీఆర్ఎస్ నేత మాజీ జెడ్పీటీసీ వైకుంఠం ఓట్లకు డబ్బులిస్తానని మోసం చేశారంటూ పలువురు ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ కేంద్రంలోని ఓ పోలింగ్ స్టేషన్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సతీమణి నీలిమ, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి, కోడలు దివ్యల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. జనగామ మండలం శామీర్‌పేట పోలింగ్ కేంద్రంలో ఎదురుపడిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పరుష పదజాలంతో దూషించుకున్నారు. ఇక్కడా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఉమ్మడి మెదక్.. స్వల్ప ఘర్షణల మధ్య.. మెదక్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మునిపల్లి మండలం పెద్దగోకులారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య, సదాశివపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద, పటాన్చెరులో మూడుచోట్ల బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఎన్నికల విధుల్లో గుండెపోటుతో ఉద్యోగి మృతి పటాన్‌చెరుటౌన్/కైలాస్‌నగర్: ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ సురేందర్ రెడ్డి కథనం ప్రకారం.. కొండాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన నీరడి సుధాకర్ (43) కొండాపూర్‌లో వెటర్నరీ విభాగంలో సహాయకునిగా పని చే స్తున్నారు. బుధవారం పటాన్చెరు మండలం ఇస్నా పూర్ గ్రామం (248) పోలింగ్ బూత్‌లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి గుండెపోటు రావడంతో సీపీఆర్ చేసి ప టాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే చెందినట్లు వెల్లడించారు. ఓటు వేయడానికి వచ్చి మృతి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన చంద్రగిరి రాజన్న (65) ఓటు వేసేందుకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. క్యూలో నిల్చున్న సమయంలో కళ్లు తిరిగి కింద పడ్డాడు. వెంటనే స్థానికులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. -
పోలింగ్ డే హాలీడే.. హైదరాబాద్‌లో పెరగని పోలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, హైదరాబాద్‌లో మాత్రం పోలింగ్ శాతం 32గా ఉంది. సిటీలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇదిలా ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ డేను సెలవు రోజుగానే చదువుకున్న ఓటర్లు చూస్తున్నారు. గతంలానే ఓటేసేందుకు హైదరాబాదీలు ముఖం చాటేశారు. సెలబ్రేటీలు ఉదయాన్నే ఓటు వేసి బాధ్యతను గుర్తు చేసినా, ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటింగ్ శాతం మాత్రం పెరగలేదు. ఇక, మెదక్‌లో అత్యధికంగా 70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మరోవైపు.. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియనుంది. ఇల్లందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజక వర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. ఒకటి, రెండు ప్రాంతాల్లో తప్ప మిగతా అన్నిచోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మిగతా స్థానాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. -
Telangana Elections 2023: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశాం (ఫొటోలు)
-
ఈవీఎంలలో సమస్యలు.. సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎన్నికల అధికారులకు, స్టేట్ ఎన్నికల కమిషన్‌కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, ఈవీఎంల విషయమై సీఈవో వికాస్‌రాజ్.. డీఈవోలతో కోఆర్డీనేట్ అయ్యారు. మరోవైపు.. ఈవీఎంల మొరాయింపుపై సీఈవో వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. ఈ క్రమంలో ఈవీఎంలలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సమయాన్ని పెంచాలని కాంగ్రెస్ నేతలు సీఈవోను కోరారు. ఇదిఆల ఉండగా.. హైదరాబాద్‌లో మందకోడిగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 21 శాతం పోలింగ్ నమోదు.. అత్యధికంగా మెదక్‌లో 51 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా 37 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా, సాయంత్రం పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. -
TS Assembly Elections 2023: ఓటుతో మా బాధ్యత పూర్తి చేశాం
-
Telangana Assembly Elections 2023: మేం ఓటేశాం
-
ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి
-
తెలంగాణ వ్యాప్తంగా మాక్ పోలింగ్ నిర్వహణ
-
Telangana Elections 2023: ప్రారంభమైన తెలంగాణ ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు
-
నేడే తెలంగాణ శాసన సభ ఎన్నికలు.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పొలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణలో నేడు ఓట్ల పండుగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చే రోజు వచ్చేసింది. గురువారం ఉదయం నుంచే పోలింగ్ మొదలుకానుంది. ఈ మేరకు సర్వం సిద్ధం చేసినట్టు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న 13 స్థానాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. మిగతా 106 చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు. మిగతా ప్రక్రియల పూర్తి అనంతరం డిసెంబర్ 5తో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. మూడు కోట్లకుపైగా ఓటర్లు రాష్ట్రంలో 1,63,01,705 మంది మహిళలు, 1,62,98,418 మంది పురుషులు, 2,676 మంది మూడో జెండర్ ఓటర్లు కలిపి మొత్తంగా 3,26,18,205 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో కలిపి 2,067 మంది పురుష అభ్యర్థులు, 222 మంది మహిళా అభ్యర్థులు, మూడో జెండర్ అభ్యర్థి ఒకరు కలిపి మొత్తం 2,290 మంది ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఏ పార్టీల నుంచి ఎంత మంది అభ్యర్థులు? రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీచేస్తోంది. కాంగ్రెస్ 118 సీట్లలో, ఆ పార్టీ పొత్తుతో సీపీఐ ఒకచోట బరిలో ఉన్నాయి. మరో కూటమిలో భాగంగా బీజేపీ 111, జనసేన 8 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 107 చోట్ల, ఎంఐఎం 9 చోట్ల, సీపీఎం 19 చోట్ల, సీపీఐఎల్(న్యూడెమోక్రసీ) ఒకచోట తలపడుతున్నాయి. – ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 41 మంది, ధర్మసమాజ్ పార్టీ నుంచి 101 మంది, జైమహాభారత్ పార్టీ నుంచి 13 మంది, రాష్ట్రీయ సామాన్య ప్రజాపార్టీ నుంచి నలుగురు, ఇతర పార్టీల నుంచి మరో 659 మంది, స్వతంత్రులు 989 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – నియోజకవర్గాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఎల్బీనగర్ నుంచి 48 మంది, గజ్వేల్ నుంచి 44 మంది, కామారెడ్డి, మునుగోడుల నుంచి 39 మంది చొప్పున పోటీపడుతుండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడల్లో ఏడుగురు చొప్పున, బాల్కొండలో 8 మంది బరిలో ఉన్నారు. 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు రాష్ట్రంలో 299 అనుబంధ పోలింగ్ కేంద్రాలు సహా మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయటి పరిసరాలను సైతం వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్‌ట్యాప్‌లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. రికార్డు చేసిన డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తారు. పటిష్టంగా బందోబస్తు పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 45వేల మంది రాష్ట్ర పోలీసులు, మరో 3వేల మంది అటవీ/ఆబ్కారీ సిబ్బంది, 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వచ్చిన 23,500 మంది హోంగార్డులు కూడా బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బ్రెయిలీ లిపిలో 76,532 ఓటరు స్లిప్పులు, 40 వేల ఓటర్ గైడ్స్, 40 వేల డమ్మీ బ్యాలెట్ పేపర్లను ముద్రించి అంధ ఓటర్లకు పంపిణీ చేశారు. శారీరక వికలాంగులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తరలించడానికి ఆటోలను ఏర్పాటు చేయనున్నారు. వారికోసం పోలింగ్ కేంద్రాల వద్ద 21,686 ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచారు. ర్యాంపులను ఏర్పాటు చేశారు. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ నేతృత్వంలో దాదాపు ఏడాది నుంచీ ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ, ఈవీఎంలను సంసిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం/శిక్షణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్లకు సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తిచేసింది. మొత్తం 2,00,433 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అన్నిజిల్లాల్లో పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని సీఈఓ కార్యాలయం బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. వారంతా రాత్రి పోలింగ్ కేంద్రాల్లోనే బస చేస్తారు. ప్రిసైడింగ్ అధికారులు గురువారం ఉదయం 5.30 గంటలకు పోల్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత కంట్రోల్ యూనిట్‌లోని మెమరీ డిలీట్ చేసి, వీవీ ప్యాట్ కంటైనర్ బాక్స్ నుంచి మాక్ ఓటింగ్ స్లిప్పులను తొలగిస్తారు. పోలింగ్ శాతం మళ్లీ పెరగాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లకు గాను 2,05,80,470 (73.2 %) మంది ఓటేశారు. 1,41,56,182 మంది మొత్తం పురుష ఓటర్లకు గాను 1,03,17,064 (72.54%) మంది, 1,39,05,811 మంది మొత్తం మహిళా ఓటర్లకు గాను 1,02,63,214(73.88%) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2691 మంది మూడో జెండర్ ఓటర్లలో కేవలం 192 (8.99%) మంది మాత్రమే ఓటేశారు. 2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కేవలం 69.5శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2018 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతం మరింతగా పెంచేందుకు ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేయాలని ఎన్నికల యంత్రాంగం పిలుపునిచ్చింది. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
-
Telangana Election 2023: తెలంగాణ పోలింగ్.. అంతా సిద్ధం (ఫొటోలు)
-
తెలంగాణ పోలింగ్‌కు వరుణగండం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వరుణగండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. అదే జరిగితే.. వరుణుడి ప్రతాపం నడుమ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల కోసం బుధ, గురువారాలను విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఈసీ సూచనతో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది కార్మికశాఖ. ఇదీ చదవండి: ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె! -
ఎన్నికల విధుల్లో లక్షమంది పోలీస్ సిబ్బంది
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ
-
నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు
-
మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ కు అన్ని ఏర్పాటు చేశాం: కలెక్టర్ రవినాయక్
-
పోల్ మేనేజ్మెంట్పై బీజేపీ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ బూత్ మేనేజ్మెంట్పై బీజేపీ దృష్టిసారించింది. పార్టీ అభ్యర్థులకు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతోంది. బూత్‌స్థాయిలో ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ పర్యవేక్షణకు నియమించిన పన్నా ప్రముఖ్‌ల ద్వారా ఓటర్లంతా కచ్చితంగా ఓటేసేలా చూడాలని పార్టీ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. బూత్ కమిటీల సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడుతున్నారు. పార్టీ వైపు మొగ్గుచూపే ఓటర్లను కచ్చితంగా బూత్‌కు రప్పించేలా చేయడంలో లోటుపాట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని పార్టీ నాయకులు క్యాడర్‌కు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై నాయకులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బుధవారం కూడా టెలికాన్ఫరెన్స్ చేపట్టి పోల్ మేనేజ్మెంట్పై తగిన సూచనలు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 వేల పోలింగ్ బూత్‌లకుగాను 90 శాతం బూత్‌లలో బీజేపీ సంస్థాగతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుంది. జాతీయ నేతల ప్రచారంతో గెలుపుపై ధీమా... రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతలు నిర్వహించిన విస్తృత ప్రచారం బీజేపీ అభ్యర్థుల గెలుపునకు, ఓటింగ్ శాతం పెంచేందుకు దోహదపడుతుందనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మరికొన్ని చోట్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర జిల్లాల్లో కేంద్ర మంత్రుల ప్రచారం ప్రభావం చూపిందనే విశ్వాసాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. -
ఆ వాహనాలకు GPSలు
-
TS: ఎన్నికలకు అంతా రెడీ.. ఏజెన్సీల్లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. నేటితో ప్రచారానికి కూడా తెరపడనుంది. మైకులు మూగబోగనున్నాయి. తెలంగాణలోని 13 స్థానాల్లో సాయంత్రం నాలుగు గంటలకు, 106 స్థానాల్లో సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుంది. ఇక, ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణకు సెంట్రల్ ఫోర్స్ కూడా చేరుకుంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 30న ఎన్నికలు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో లక్ష మంది పోలీసు సిబ్భంది ఉన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా విధుల్లో ఉండనున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఫోర్స్ కూడా తెలంగాణకు చేరుకుంది. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఫోర్స్‌ను కేటాయించారు. ఫుల్ అలర్ట్.. తెలంగాణ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక.. 4,400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనంగా సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల విధుల్లో అస్సాం రైఫిల్స్, బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఇక, ఎన్నికల విధుల్లో 65వేల మంది తెలంగాణ పోలీసులు ఉన్నారు. 18వేల మంది హోంగార్డులు కూడా పనిచేయనున్నారు. ఇప్పటికే ఎన్నికలు బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మూడు కమిషనరేట్లలో భద్రత పెంపు.. మరోవైపు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మూడు కమిషనరేట్స్ పరిధిలో 70 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. పోలింగ్ బూత్ ఫోర్స్, రూట్ మొబైల్, పెట్రోలింగ్ టీమ్స్, బ్లూ కోట్స్‌తో పాటు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులతో క్విక్ రెస్పాన్స్ బృందాలను రెడీ చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 30వేల మందికిపైగా బందోబస్తులో ఉంటారు. అమలులోకి 144 సెక్షన్.. బుధవారం సాయంత్రం నుండి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఐదు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్స్ పరిధిలో వెయ్యి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బుధవారం సాయంత్రం నుంచి డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకుమించి గుమ్మిగూడరాదు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారాలు నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. -
మందుబాబులకు అలర్ట్.. నేటి నుంచే వైన్‌షాప్‌లు బంద్
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్లను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మూసి వేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీ పోలింగ్ ముగిసిన అనంతరం తిరిగి షాపులను తెరుస్తారని అన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, మద్యం నిలువ చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 236 కేసులు నమోదు చేశామన్నారు. తమ ప్రాంతంలో మద్యం విక్రయించినా, డంప్ చేసినా ఫోన్ నంబర్ 8712658750లో ఫిర్యాదు చేయాలని కోరారు. -
మరోసారి గెలుపు మాదే: సచిన్ పైలెట్
జైపూర్: రాజస్థాన్‌లో గెలుపుపై కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమకు మరోసారి అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలను మార్చే ధోరణికి ప్రజలు స్వస్తి పలకాలని చూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం సాధిస్తామని చెప్పారు. అభివృద్ధికి కట్టుబడి ఉండే వారికే ప్రజలు ఓటు వేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. #WATCH | Congress leader Sachin Pilot after casting his vote in Jaipur says, "I hope people will use their right to vote today. I hope the public will make the right decision by looking at our vision for the state for the next 5 years. I think Congress will form the government… pic.twitter.com/c4rxZS50ex — ANI (@ANI) November 25, 2023 రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్ ఓటు హక్కుని వినియోగించుకునే ముందు బాలాజీ దేవాలయంలో పూజలు నిర్వహించారు. రానున్న ఐదేళ్లకు రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజలు సరైన తీర్పును ఇస్తారని భావిస్తున్నట్లు పైలెట్ చెప్పారు. కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. #WATCH | Rajasthan elections | Jaipur: Congress leader Sachin Pilot offered prayer at Balaji temple before casting his vote. pic.twitter.com/14hpsrYaHV — ANI (@ANI) November 25, 2023 రాజస్తాన్ శాసనసభ ఎన్నికలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గురీత్‌సింగ్ కూనార్ మరణించడంతో ఇక్కడ పోలింగ్‌ను వాయిదా వేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇదీ చదవండి: 'చైనా కొత్త వైరస్‌తో జాగ్రత్త' -
Rajasthan election 2023: ఒకే ఒక్క కుటుంబం కోసం పోలింగ్ బూత్
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్ అసెంబ్లీకి నేడు జరగనున్న ఎన్నికల్లో ఒకే ఒక్క కుటుంబం కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న బార్మర్ జిల్లా పార్ గ్రామంలో రాష్ట్రంలోనే అతి చిన్న పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ ఒక కుటుంబంలోని 35 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ గ్రామ ప్రజలు గత ఎన్నికల వరకు ఓటేయడానికి 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఎడారిలో రోడ్లు లేకపోవడంతో ప్రజలు కాలినడకన, ఒంటెలపై పోలింగ్ బూత్‌కు చేరుకొనేవారు. పోలింగ్ కేంద్రం చాలా దూరంగా ఉండటంతో వృద్ధులు, మహిళలు పలుమార్లు ఓటు వేయలేకపోయారు. ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న ఎన్నికల కమిషన్ అధికారులు గ్రామంలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మూడు వేర్వేరు ఇళ్లలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మహిళలు, 18 మంది పురుషులు మొత్తం 35 మంది ఓటేయనున్నారు. కాగా, సిరోహి జిల్లాలోని అబు–పింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో 4,921 అడుగులఎత్తులో ఉన్న షేర్‌గావ్ ఓటర్లు తొలిసారిగా తమ సొంతూళ్లోనే ఓటు వేయనున్నారు. గ్రామంలోని 117 మంది గిరిజనుల ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల సిబ్బంది దట్టమైన అటవీప్రాంతంలో దాదాపు 18 కిలోమీటర్లు నడిచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. -
ఓటర్ల స్లిప్పుల పంపిణీ వేగంగా జరుగుతోంది: వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌కు చకచకా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ మొదలైంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సిద్దమవుతున్నామన్నారు. తాజాగా వికాస్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో పోలింగ్ కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ఫస్ట్ టైం హోం ఓటింగ్ నిర్వహిస్తున్నాం. మొత్తం 3 కోట్ల 26లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 9 లక్షలకు పైగా యంగ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లు 4లక్షలు, ఈవీఎం బ్యాలెట్లు 8 లక్షల 84వేలు ప్రింట్ అయ్యాయి. ఎపిక్ కార్డులు 51 లక్షలు ప్రింట్ అయ్యి దాదాపు పంపిణీ అయ్యింది. ముగ్గురు స్పెషల్ అబ్జర్వర్లు స్టేట్‌కు వచ్చారు. ప్రతీ కౌంటింగ్ సెంటర్‌కు ఒక అబ్జర్వర్ ఉంటారు. మూడు కేటగిరీల్లో హోం ఓటింగ్ జరుగుతోంది. 9300 మంది 80ఏళ్లు పైబడిన వాళ్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2కోట్ల 81లక్షల ఓటర్ స్లిప్‌ల పంపిణీ పూర్తి అయ్యింది. ఎల్లుండి వరకు ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తి అవుతుంది. తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 59వేల బ్యాలెట్ యూనిట్లు వాడుతున్నాం. రేపటి వరకు కమీషనింగ్ పూర్తి అవుతుంది. సీ విజిల్ యాప్ ద్వారా 6,600 ఫిర్యాదులు అందాయి. ఫ్లయింగ్ స్వ్కాడ్ వెహికిల్‌కు జీపీఎస్ ఉంటుంది. ప్రతీ సెగ్మెంట్‌కు మూడు ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటుచేశాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. తెలంగాణలో ఎన్నికల కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయి. అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ శాతం గతంలో తక్కువగా ఉంది. 3లక్షల మంది పోలింగ్ ప్రిపరేషన్లో పాల్గొంటున్నారు. డీఏ గురించి ప్రఫోజల్స్ వచ్చాయి. నిర్ణయం ECI ఇంకా తీసుకోలేదు. 64వేలు స్టేట్ పోలీసులు, 375కేంద్ర కంపెనీల నుంచి బలగాలు ఎన్నికల కోసం ఉన్నాయి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి’ అని తెలిపారు. -
500కు పైగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు.. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పహారా
-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు
-
‘స్మార్ట్’ పోలింగ్ స్టేషన్ ప్రత్యేకతలేమిటంటే?
ఇండోర్: ఓటర్లు క్యూలో నిలబడే అవసరం లేకుండానే ఓటేయొచ్చు.., అక్కడే సిరా గుర్తున్న వేలు చూపుతూ కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కెమెరా ద్వారా సెల్ఫీ తీసుకోవచ్చు..! మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏర్పాటు చేసిన స్మార్ట్ పోలింగ్ బూత్ ప్రత్యేకతలివీ. నంద నగర్ నియోజకవర్గంలోని ‘మా కనకేశ్వరి దేవి’గవర్నమెంట్ కాలేజీ బూత్‌లో ఈ ఏర్పాటును అందుబాటులోకి తెచ్చారు. ‘ఓటర్ల క్యూ పెద్దగా అవసరం లేకుండా చేసేందుకు ఆన్లైన్ టోకెన్ విధానాన్ని తీసుకొచ్చాం. పోలింగ్ బూత్‌కు వచ్చిన వెంటనే ఓటర్లకు టోకెన్లు అందజేశాం. దీంతో, తమ వంతు వచ్చే వరకు వారు పోలింగ్ బూత్ వద్దే కూర్చోవచ్చు’అని రాష్ట్ర ప్రభుత్వ ఇండోర్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్‌కు చెందిన అసిస్టెంట్ ప్లానర్ రుపాల్ చోప్రా పీటీఐకి చెప్పారు. ‘పోలింగ్ స్టేషన్ ఆవరణలోనే ఏఐ ఆధారిత కెమెరాను ఏర్పాటు చేశాం. ఓటేసిన వారు ఆ పాయింట్ వద్ద నిలబడి ఇంక్ గుర్తున్న వేలిని చూపితే చాలు వెంటనే కెమెరా క్లిక్‌మనిపిస్తుంది’అని ఆమె వివరించారు. ‘అక్కడే ఉన్న స్క్రీన్‌పై బార్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. ఓటర్ తన ఫోన్‌తో స్కాన్ చేస్తే ఫొటో వెంటనే మొబైల్‌లోకి వచ్చేస్తుంది. సోషల్ మీడియాలోకి సైతం షేర్ అవుతుంది’అని రుపాలి పేర్కొన్నారు. -
తొలిసారి.. ఇక్కడ పోలింగ్ భారమంతా మహిళలదే
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ రికార్డు నెలకొల్పింది. శుక్రవారం రాయ్‌పూర్ (నార్త్)లో పోలింగ్ ప్రక్రియ ఆసాంతం మహిళా అధికారులు, సిబ్బంది చేతులమీదుగానే నడిచింది. ప్రిసైడింగ్ అధికారి మొదలుకొని పోలింగ్ అధికారి వరకు మొత్తం 201 పోలింగ్ బూత్‌ల్లో మహిళలకు మాత్రమే బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. ‘సంగ్వారీ (ఉమెన్ ఫ్రెండ్లీ) బూత్‌లకు పూర్తిగా మహిళా అధికారులను నియమించాం. 804 మంది మహిళలకు ప్రత్యక్ష బాధ్యతలు అప్పగించాం. మరో 200 మందిని రిజర్వులో ఉంచాం. ఇక్కడ ఐఏఎస్ అధికారి ఆర్.విమలను పరిశీలకురాలిగా నియమించాం. లయిజనింగ్ అధికారి కూడా మహిళే. చాలావరకు బూత్‌ల వద్ద భద్రతకు మహిళా సిబ్బందినే నియమించాం’అని వివరించింది. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి మహిళా ఐఏఎస్ రీనా బాబా సాహెబ్ కంగాలె కావడం విశేషమని ఆ ప్రకటనలో వివరించింది. మహిళా అధికారులే పోలింగ్ నిర్వహించిన రాయ్‌పూర్(నార్త్)నియోజకవర్గంలో స్త్రీ, పురుష నిష్పత్తి కూడా 1010:1000గా ఉండటం మరో విశేషమని పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాతే ఒక నియోజకవర్గంలో పోలింగ్ బాధ్యతలను కేవలం మహిళలకే అప్పగించాలన్న ఆలోచన రూపుదిద్దుకుందని రాయ్‌పూర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సర్వేశ్వర్ నరేంద్ర భూరె తెలిపారు. ఈ మేరకు చేపట్టిన చర్యలు విజయవంతం కావడంతో ఇప్పుడు అందరూ తమను ప్రశంసిస్తున్నారని చెప్పారు. రాయ్‌పూర్ సిటీ(సౌత్) నియోజకవర్గంలోని సగం వరకు బూత్‌ల్లోనూ మహిళా అధికారులనే నియమించినట్లు ఆయన వెల్లడించారు. చదవండి: వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్‌కు వస్తారు -
ఆ ఏడు స్థానాల్లో అదనపు బ్యాలెట్ యూనిట్లు
సాక్షి, హైదరాబాద్, సాక్షి, సిద్దిపేట/గజ్వేల్: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలతో పాటు మరో అయిదు సెగ్మెంట్లలో అభ్యర్ధులు లెక్కకి మించి ఉండటంతో అదనపు బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండగా, బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత గజ్వేల్ నుంచి 44 మంది, కామారెడ్డి నుంచి 39 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఈ రెండు శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు వినియోగించనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)కు మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంలకు మూడు బ్యాలెట్ యూనిట్లు ఒక ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ అనే మూడు ప్రధాన విభాగాలుంటాయి. ఒక బ్యాలెట్ యూనిట్‌పై నోటాతో సహా 16 మంది అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తు, ఫోటో ఉంటాయి. నియోజకవర్గంలో 16 మందికి మించి అభ్యర్థులు పోటీ చేస్తే ఒకటికి మించి బ్యాలెట్ యూనిట్లను వాడాల్సి ఉంటుంది. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17 నుంచి 32లోపు ఉంటే రెండు బ్యాలెట్ యూనిట్లు, 33 నుంచి 48లోపు ఉంటే మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించక తప్పదు. దీంతో గజ్వేల్, కామారెడ్డిలో వినియోగించనున్న ఈవీఎంలకు మూడు చొప్పున బ్యాలెట్ యూనిట్లను అమర్చి పోలింగ్ నిర్వహించనున్నారు. ‘ఎం3’రకం ఈవీఎంల వినియోగం 2013 నుంచి అందుబాటులోకి వచ్చిన ‘ఎం3’రకం ఈవీఎంలను రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. ఒక కంట్రోల్ యూనిట్‌కు వీవీ ప్యాట్‌తో పాటు గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేసి ఒక ఈవీఎంను తయారు చేయవచ్చు. దీంతో ఒకే ఈవీఎం ఆధారంగా గరిష్టంగా 384 అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించవచ్చు. 384 మందికి లోపు అభ్యర్థులు పోటీ చేస్తే ఒకే కంట్రోల్ యూనిట్‌కు అవసరమైన సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను అమర్చనున్నారు. అయితే, అభ్యర్థుల సంఖ్య 384కు మించితే రెండో కంట్రోల్ యూనిట్‌ను వినియోగించక తప్పదు. 2006 నుంచి 2013 వరకు జరిగిన ఎన్నికల్లో ‘ఎం2’రకం ఈవీఎంలను ఎన్నికల సంఘం వినియోగించింది. ఆ తర్వాత నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ‘ఎం3’రకం ఈవీఎంలను వాడుతోంది. ఒక ఈవీఎం గరిష్టంగా 2వేల ఓట్లను నమోదు చేయగల సామరŠాధ్యన్ని కలిగి ఉండనుంది. సాధారణంగా 1500 ఓట్లకు మించి ఒక పోలింగ్ కేంద్రానికి ఓట్లను కేటాయించరు. ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారేమోనని పార్టీల ఆందోళన సోమవారంతో ముగిసిన నామినేషన్ల పరిశీలన అనంతరం గజ్వేల్‌లో 114 మంది బరిలో ఉండగా, బుధవారం 70 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కామారెడ్డిలో నామినేషన్ల పరిశీలన అనంతరం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 19 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు గజ్వేల్ నుంచి మొత్తం 44 మంది, కామారెడ్డి నుంచి మొత్తం 39 మంది పోటీ చేస్తుండగా, రెండు చోట్లలో కూడా మూడు బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ నిర్వహించనుండడంతో ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే ప్రమాదముందని రాజకీయ పార్టీలు ఆందోళనకు గురి అవుతున్నాయి. మరో 5 చోట్ల సైతం... ఎల్బీనగర్లో 38 మంది, శేరిలింగంపల్లిలో 33 మంది అభ్యర్థులు బరిలో మిగలడంతో అక్కడ సైతం 3 బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నారు. ఇబ్రహీంపట్నంలో 28 మంది, మహేశ్వరంలో 27 మంది, రాజేంద్రనగర్‌లో 25 మంది అభ్యర్థులు మిగలడంతో ఈ చోట్లలో రెండు బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ జరపనున్నారు. -
ఛత్తీస్ గఢ్ లో మొదలైన పోలింగ్
-
ఇక అత్యవసర సేవల ఉద్యోగులకూ పోస్టల్ బ్యాలెట్
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ రోజు ఎన్నికల వార్తల సేకరణలో ఉండే జర్నలిస్టులతో పాటు ఎన్నికలతో సంబంధం లేని 12 ఇతర అత్యవసర సేవల రంగాల ఉద్యోగులు సైతం ఇకపై పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల శాసనసభ సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ఈ సదుపాయం కల్పించబోతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 60(సీ) కింద కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సైతం గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యవసర సేవల రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ స్వభావం రీత్యా ఓటు హక్కు ఉన్న ప్రాంతానికి దూరంగా ఉండే ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీరికి సైతం ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వీరికే సదుపాయం.. ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో పనిచేసే సిబ్బంది, సర్విసు ఓటర్లు(సాయుధ బలగాలు), ప్రవాస ఓటర్లకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయం ఉండేది. 40 శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన ఓటర్లకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నట్టు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తాజాగా జర్నలిస్టులతో పాటు ఎన్నికల విధులతో సంబంధం లేని అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు సైతం పోస్టల్ సదుపాయం కలి్పస్తున్నట్టు ప్రకటించింది. నవంబర్ 7లోగా దరఖాస్తు చేసుకోవాలి.. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కానుండగా, నాటి నుంచి 5 రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోరుతూ ..‘ఫారం–12డీ’దరఖాస్తులను స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 7 నాటికి దరఖాస్తులు రిటర్నింగ్ అధికారికి చేరితే ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారు. జర్నలిస్టులతో పాటు ఆయా అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి సంబంధిత విభాగాలు నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నోడల్ అధికారుల వద్ద ఫారం–12డీ అందుబాటులో ఉంచాలని కోరింది. ఈ కింది జాబితాలోని అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించనున్నారు. ♦ ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా ♦ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ♦ ఇండియన్ రైల్వే ♦ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ♦ దూర్దర్శన్ ♦ ఆల్ ఇండియా రేడియో ♦ విద్యుత్ శాఖ ♦ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ♦ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ♦ పౌర సరఫరాల శాఖ ♦ బీఎస్ఎన్ఎల్ ♦ పోలింగ్ రోజు వార్తల సేకరణ కోసం ఎన్నికల సంఘం నుంచి పాస్ పొందిన మీడియా ప్రతినిధులు ♦ అగ్నిమాపక శాఖ -
సాయుధ తెలంగాణకు ఓటు ఆయుధమై..
అది 1952 మార్చి 27... కాలినడకన కొందరు, ఎడ్ల బండ్లపై మరికొందరు సుదూరాన ఉన్న పోలింగ్ బూత్‌లకు ఒకరెనక ఒకరు వెళ్లి తమ ఓటుతో తొట్టతొలి ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకున్న రోజు. సుమారు 224 ఏళ్ల అసఫ్‌జాహీల రాచరికం, ఆపై నాలుగేళ్ల సైనిక పాలన అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో ఓటు వేసేందుకు జనం వస్తారో లేదోనన్న అధికారుల అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి ఎన్నికలోనే జనచైతన్యం ఓటెత్తింది. అప్పటివరకు తుపాకుల నీడలో అభద్రత, భయం నీడలో తలదాచుకున్న వారంతా ఊరూరా కదిలి మొత్తంగా 52,02,214 మంది ఓటు వేయడంతో అధికార యంత్రాంగం సంబురపడింది. నాటి ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మాపూర్‌కు చెందిన జరుపాటి రాములమ్మ (110) తొలి ఓటు వేసి తమకు స్వాతంత్య్రం రావడం నిజమేనని నమ్మినట్టు పేర్కొంది. మిశ్రమ ఫలితాలు... నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్యర్థులు విజయం సాధించగా సత్యాగ్రహ పోరాటాలు జరిగిన హైదరాబాద్, ఔరంగాబాద్, గుల్బర్గా డివిజన్లలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తంగా తెలుగు ప్రజలు ప్రభావం చూపే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు, పీడీఎఫ్ 35 స్థానాల్లో, సోషలిçస్టు పార్టీ 11 చోట్ల, మరో 10 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. బీఆర్ అంబేడ్కర్ ఆధ్వరంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎస్సీఎఫ్) 5 చోట్ల గెలవగా అందులో తెలంగాణలోని ద్విసభ నియోజకవర్గాలైన జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్ స్థానాలను కైవసం చేసుకుంది. అంటే మొత్తంగా తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోని ఓటర్లు 66 స్థానాల్లో కాంగ్రేసేతర అభ్యర్థులను గెలిపించారు. అప్పటి ఓటు.. ఇంకా గుర్తుంది నాకు ఓటు వచ్చే సరికి 40 ఏళ్లు . ఇప్పుడు 110 ఏళ్ల వరకు ఉంటాయనుకుంటా. అప్పుడు ఎండాకాలం. ఊరోళ్లమంతా నడుచుకుంటూ వెళ్లి ఓటు వేసినం. ఇంకా నాకు గుర్తుంది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు తప్పకుండా వేస్తున్న. – జరుపాటి రాములమ్మ, లక్ష్మాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా తొలి సభలో అత్యధికం విద్యావంతులే.. హైదరాబాద్ తొలి శాసనసభకు ఉన్నత విద్యావంతులే అత్యధికంగా ఎన్నికైయ్యారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదివిన మాసూమాబేగం శాలీబండ స్థానం నుంచి ప్రముఖ కవి ముగ్ధూం మోహియొద్దీన్‌ను ఓడించారు. 1927లో ఉస్మానియాలో గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ జీఎస్ మెల్కొటే ముషీరాబాద్ నుంచి విజయం సాధించారు. చాదర్‌ఘాట్ నుంచి జస్టిస్ గోపాలరావు ఎక్బోటే, సోమాజిగూడ నుంచి మెహిది నవాజ్ జంగ్, వనపర్తి నుంచి సురవరం ప్రతాపరెడ్డి, షాద్‌నగర్ నుంచి బూర్గుల రామకృష్ణారావు, వికారాబాద్ నుంచి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, బేగంబజార్ నుంచి కాశీనాథ్ వైద్య గెలుపొందారు. ఓటు వేయకపోవడం చనిపోవడంతో సమానం.. నాకిప్పుడు 103 ఏళ్లు. తొలి ఎన్నికలప్పుడు మా ఊర్లో డప్పు చాటింపు వేసి ఓటు వేసేందుకు పిలుచుకొనిపోయిండ్రు. అప్పటి నుంచి ఓటు తప్పకుండా వేస్తున్న. ఓటు వేయకపోతే చనిపోవడంతో సమానమని నమ్ముత. వచ్చే ఎన్నికల్లోనూ ఓటు వేస్త. – మల్తుం బాలవ్వ, చిట్యాల, కామారెడ్డి అజ్ఞాతం నుంచి చట్ట సభకు.. తొలుత నిజాం, ఆపై భారత సైన్యంపై తుపాకులు ఎక్కుపెట్టిన కమ్యూనిస్టు పార్టీల నాయకులు అనేక మంది అజ్ఞాతం వీడిన అనంతరం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. భువనగిరి అసెంబ్లీ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన రావి నారాయణరెడ్డి జైలు నుంచే నామినేషన్ వేసి స్వయానా తన బావమరిది భూదాన్ రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. గత 70 ఏళ్లలో ఓటు తప్పలేదు.. నాకిప్పుడు 98 ఏళ్లు. రజాకార్ల బాధలు ప్రత్యక్షంగా చూసినం. వారిపై తిరగబడినం. స్వతంత్రం వచ్చినంక తొలి ఎన్నికలో ఓటు వేసేందుకు ఎడ్లబండిలో పోయినం. 1952 ఎన్నికల నుంచి ప్రతిసారీ ఓటు వేస్తూనే ఉన్న... – చల్లారం మధురవ్వ, తిమ్మాయపల్లి, సిద్దిపేట - శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి -
వర్షంలోనూ బారులు తీరిన ఓటర్లు.. మరోవైపు ఓటింగ్ సామాగ్రి ధ్వంసం..
కలకత్తా: పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతోంది. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. 24 దక్షిణ పరగణా జిల్లాల్లో వర్షం పడుతున్నా జనం లెక్కచేయకుండా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. గొడుగుల సహాయంతో క్యూ లైన్లలో నిలబడ్డారు. అటు.. గవర్నర్ సీవీ ఆనంద్ ఓటింగ్‌లో పాల్గొనేందుకు బసుదేబ్‌పూర్ బూత్‌కు వెళుతున్న క్రమంలో సీపీఐఎమ్ అభ్యర్థులు ఆయన్ను అడ్డగించారు. #WATCH | West Bengal #PanchayatElection23 | Voters queue up at a polling station in Basanti of South 24 Parganas district amid rainfall as they await their turn to cast a vote. pic.twitter.com/Iq7xBpbpft — ANI (@ANI) July 8, 2023 బ్యాలెట్ పేపర్లకు నిప్పింటించి.. కాగా.. పలు ప్రాంతాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. కూచ్‌బిహార్ జిల్లాలోని సిటాయ్ ప్రాతంలో ఓ ప్రైమరీ పాఠశాలలో పోలింగ్‌కు ఏర్పాట్లు చేయగా.. దుండగులు పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారు. బ్యాలెట్ పేపర్లకు నిప్పింటించారు. #WATCH | Polling booth at Baravita Primary School in Sitai, Coochbehar vandalised and ballot papers set on fire. Details awaited. Voting for Panchayat elections in West Bengal began at 7 am today. pic.twitter.com/m8ws7rX5uG — ANI (@ANI) July 8, 2023 63,229 సీట్లకు పోలింగ్.. పశ్చిమ బెంగాల్లో 63,229 గ్రామ పంచాయతీ సీట్లకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. 9,730 పంచాయతీ సమితీలకు, 928 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలీంగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. జులై 11న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. ఇదీ చదవండి: అవినీతే కాంగ్రెస్ ఊపిరి -
ఫస్ట్ సెమీఫైనల్ గా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
-
Karnataka assembly elections 2023: ‘జై బజరంగ బలీ’ అంటూ ఓటేయండి
శివాజీనగర/ముల్కీ: ‘కాంగ్రెస్ అవినీతి వ్యవస్థను కూల్చేశానని నాపై పీకలదాకా కోపం పెంచుకున్నారు. నన్ను నిరంతరం అవమానిస్తున్నారు. నన్ను దూషిస్తూ ఓట్లడుగు తున్నారు. ఇలాంటి అవమాన సంస్కృతిని మీరు అంగీకరిస్తారా? పోలింగ్ కేంద్రంలో మీట నొక్కేటపుడు జై బజరంగ బలీ అని నినదించండి. తద్వారా వారికి బుద్ధి చెప్పండి’ అని కర్ణాటక ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్రంలో మూడు బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించారు. ప్రతిచోటా మొదట్లో, చివర్లో జై బజరంగ బలీ అంటూ నినదించారు. బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీపై ప్రధాని మండిపడ్డారు. ‘విభజించు, పాలించు సిద్ధాంతమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ రాజకీయం నడుపుతుంది. ప్రపంచదేశాలు భారత్‌ను ఘనంగా కీర్తిస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం విదేశాల్లో పర్యటిస్తూ దేశ ప్రతిష్టను, సైన్యాన్ని అవమానించేలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశాభివృద్ధికి, శాంతియుత వాతావరణానికి ప్రబల శత్రువు కాంగ్రెస్. ఎన్నికల లబ్ధి కోసం దేశ వ్యతిరేకులతోనూ ఒప్పందం చేసుకుంటోంది’’ అంటూ దుయ్యబట్టారు. ప్రజలే నా రిమోట్‌కంట్రోల్ 140 కోట్ల మంది ప్రజలే తన రిమోట్ కంట్రోల్ అని మోదీ అన్నారు. ‘‘కర్ణాటకను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకోవాలని చూస్తోంది. అలాంటి పార్టీని రాష్ట్రం నుంచి తరిమేయండి’’ అని పిలుపునిచ్చారు. -
Nellore: రామ్మూర్తి నగర్ పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, నెల్లూరు: అధికారం లేకపోయినా టీడీపీ నేతల ఓవరాక్షన్ మాత్రం తగ్గడం లేదు. పోలీసుల పట్ల దురుసు ప్రవర్తనలు కనిపిస్తూనే ఉన్నాయి. నెల్లూరులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అజీజ్ చేసిన ఓవర్ యాక్షన్ పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్మూర్తి నగర్ పోలింగ్ పోలింగ్ బూత్‌లోకి వెళ్తున్న టీడీపీ నేతల్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డు చూపించాలని అడగడంతో అజీజ్ కి చిరెత్తుకొచ్చింది. నానా యాగీ చేసి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు అవేదన వ్యక్తం చేశారు. పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమపై టీడీపీ నేతల జులుం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చదవండి: సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు -
Gujarat Polls: ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూత్.. 8 మంది సిబ్బంది
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ పోలింగ్‌లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం.. కేవలం ఒక్క ఓటర్ కోసం ఏకంగా పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసింది. అందుకోసం సుమారు 8 మంది వరకు పోలింగ్, భద్రతా సిబ్బందిని పంపించింది. ఈ పోలింగ్ బూత్ దట్టమైన గిర్ అడవుల్లో ఉంటుంది. బనేజ్ ప్రాంతంలోని ఉనా నియోజకవర్గానికి తొలి విడతలో పోలింగ్ జరిగింది. అటవీ ప్రాంతంలో నివసించే మహంత్ హరిదాస్జీ ఉదాసిన్ అనే వ్యక్తి కోసం ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. తొలి విడతలో భాగంగా మహంత్ హరిదాస్జీ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది ఎన్నికల కమిషన్. ఉనా అసెంబ్లీలోని బనేజ్ పోలింగ్ కేంద్రానికి 2002 నుంచి శివుని మందిరం వద్ద నివాసమున్న మహంత్ భరత్‌దాస్ అనే వ్యక్తి ఒక్కరే ఓటు వేసేందుకు వచ్చేవారు. అప్పట్లో ఆయన కోసమే ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఆయన మరణించిన తర్వాత పోలింగ్ బూత్‌ను మూసివేయాలనుకున్నారు. కానీ, ఆయన వారసుడిగా మహంత్ హరిదాస్జీ రావడం వల్ల తిరిగి పోలింగ్ బూత్‌ను ప్రారంభించారు. #ECI has set up a polling booth for only one voter, Mahant Haridasji Udasin in Banej (93-Una AC) in the dense jungles of Gir. Glimpses of Haridas Ji casting his vote during 1st phase of #GujaratElections2022.#novotertobeleftbehind #GujaratAssemblyPolls #ECI #EveryVoteMatters pic.twitter.com/FhDDELyRXU — Election Commission of India #SVEEP (@ECISVEEP) December 1, 2022 ఇదీ చదవండి: ప్రశాంతంగా ముగిసిన గుజరాత్ తొలి విడత పోలింగ్ -
ఆ ఊళ్లో ఎన్నికల ప్రచారమే ఉండదు! కానీ..
గుజరాత్లో మొత్తం 186 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1 నుంచి 5 వరకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఒక వారం మాత్రమే సమయం ఉన్నందున గుజరాత్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల ప్రచార ర్యాలీల హోరుతో రసవత్తరమైన ఎన్నికల టెన్షన్‌తో ఉత్కంఠంగా ఉంది. కానీ, ఆ ఊరిలో మాత్రం ఎలాంటి కోలాహలం లేకుండా సాధారణ వాతావరణం కనిపిస్తుంటుంది. గుజరాత్లో రాజ్‌కోట్ జిల్లాలోని రాజ్ సమాధియాల అనే ఒక గ్రామం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఎన్నికలు జరుగుతాయి కానీ అక్కడి రాజకీయ పార్టీల ప్రచార ప్రవేశం మాత్రం పూర్తిగా నిషేధం. అసలు అక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రచారం జరగదు. అయినప్పటికీ అక్కడి గ్రామస్తులంతా ఓటేస్తారు. అదీ కూడా ఒక్కరు కూడా మిస్స్ కాకుండా ఫుల్‌గా ఓట్లు పడతాయి. ఆ గ్రామంలో ఎన్నికల సమయంలో అందరూ అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తుంది అక్కడ గ్రామాభివృద్ధి కమిటీ. పైగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఓటు వేసేందుకు రాకపోతే వారిపై రూ. 51/- జరిమాన కూడా విధిస్తుంది గ్రామాభివృద్ధి కమిటీ. అక్కడ గ్రామ సర్పంచ్‌ని కూడా అందరీ ఏకాభిప్రాయంతోనే ఎన్నుకుంటారు. అంతేగాదు పోలీంగ్‌కు కొన్ని రోజుల ముందు కమిటీ సభ్యులు, గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎవరైనా ఓటు వేయకపోతే కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో ఏ రాజకీయ పార్టీలు ప్రచారం చేయకూడదనే నియమం 1983 నుంచి ఉంది. పైగా ఇక్కడ ఏ పార్టీ కూడా ప్రచారం చేసేందుకు రాదని, ఒకవేళ ప్రచారం చేస్తే తమ భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందని ఆయా రాజకీయ పార్టీలకు కూడా తెలుసుని గ్రామస్తులు చెబుతున్నారు. ఐతే తమ గ్రామంలో వైఫై ఇంటర్నెట్ కనెక్షన్, సీసీటీవీ కెమెరాలు, తాగునీరు అందించే ఆర్ఓ ప్లాంట్ తదితర అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామంలో అభ్యుర్థులను ప్రచారం చేయడానికి అనుమతించరు కాబట్టి గ్రామ ప్రజలంతా తమకు మంచిదని భావించే నాయకుడికే ఏకగ్రీవంగా ఓటు వేస్తారుని ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. ఏ కారణం చేతనైనా ఓటు వేయలేని పక్షంలో ముందుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. (చదవండి: ప్రధాని తప్పు చేస్తే.. చర్యలు తీసుకునే సత్తా ఉన్న సీఈసీ కావాలి: సుప్రీం కోర్టు) -
ప్రశాంతంగా ముగిసిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్
-
ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో స్పెషల్! ఎందుకంటే..
సిమ్లా: కాంగ్రెస్-బీజేపీలకు చెరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తున్న హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు.. ఈసారి ఎవరికి పట్టం కడతారనే చర్చ జోరుందుకుంది. శనివారం హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ నేపథ్యంలో.. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో.. ప్రధాని మోదీ, అమిత్ షా సహా కీలక నేతలంతా ఓటేయాలంటూ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ వేళ.. ఓ బూత్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. కేవలం 52 మంది ఓటర్ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారక్కడ. అందుకు ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. తషిగ్యాంగ్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్ కేంద్రం. అందుకే ఎన్నికల సంఘం అక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. లాహౌల్ & స్పితి పరిధిలోని తషిగ్యాంగ్‌లో దాదాపు 15, 256 ఫీట్ల ఎత్తులో ఉండే ఇక్కడ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. వృద్ధులకు, దివ్యాంగుల కోసం మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారిక్కడ. వందకు వంద శాతం ఓటింగ్ నమోదు చేయాలని భావిస్తున్నారు ఇక్కడ. Tashigang (Lahaul&Spiti ), has world’s highest polling station at 15,256 ft & 52 registered voters, is set to retain its record of 100% voter turnout in the Nov 12 assembly election. It has been made Model Polling station to make voting easy for senior citizens & disabled voters. pic.twitter.com/SJcw86Z3lL — CEO Himachal (@hpelection) November 12, 2022 ఇక హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 55 లక్షల ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,884 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. మొత్తం 412 మంది అభ్యర్థులు.. 68 నిజయోకవర్గాల్లో పోటీ పడుతున్నారు. ఒకవైపు తిరిగి అధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ, మరోవైపు మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీలో హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఇక ఈ మధ్యలో ఆప్ వచ్చి చేరింది. డిసెంబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. -
పాత రికార్డులు బద్దలు.. మునుగోడులో 93.41% పోలింగ్..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే 24 వేల మందికి పైగా ఓటర్లు పెరిగారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం కంటే ఈసారి 2.11 శాతం అదనంగా పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91.30 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఈసారి 93.41 శాతం మంది ఓట్లు వేశారు. నియోజకవర్గంలో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 686 పోస్టల్ ఓట్లు కాగా, 2,25,192 మంది స్వయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, ముంబై నుంచి కూడా.. ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లకు రవాణా సదుపాయం కల్పించాయి. దీంతో హైదరాబాద్, ముంబై, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేశారు. దీంతో పోలింగ్ శాతం పెరిగింది. దివ్యాంగులు, మంచానికి పరిమితమైన 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈసారి పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వడం పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడింది. 686 మంది పోస్టల్‌బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అత్యధికంగా నారాయణపురం మండలం చిత్తన్నబావి గ్రామంలో 98.34 శాతం పోలింగ్ నమోదైంది. దామెర బీమనపల్లిలోని 240 పోలింగ్ కేంద్రంలో అతి తక్కువ పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా చూస్తే అత్యధికంగా నారాయణపురం మండలంలో 93.76 శాతం పోలింగ్ జరిగింది. చౌటుప్పల్ మండలం నేలపట్లలోని 4వ పోలింగ్ స్టేషన్లో, సంస్థాన్ నారాయణపురం మండలం ఐదుదొనెల తండాలో 72వ పోలింగ్ కేంద్రంలో, గుజ్జ, నారాయణపురంలో ఒక పోలింగ్ స్టేషన్, మునుగోడు మండలం గంగోరిగూడెం, కొండూరు పోలింగ్ కేంద్రాల్లోనూ మహిళలు, పురుషుల ఓట్లు సమాన సంఖ్యలో పోలయ్యాయి. 105 పోలింగ్ కేంద్రాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓట్లు వేశారు. చదవండి: ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..? -
పోలింగ్ కేంద్రం నుంచి కేఏ పాల్ పరుగులు ..
-
పోలింగ్ కేంద్రాల నుంచి పరుగులు పెట్టిన కేఏ పాల్.. ఎందుకంటే?
సాక్షి, నల్గొండ జిల్లా: ఉప ఎన్నికల వేళ మునుగోడు పోలింగ్ కేంద్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరుగులు పెడుతూ కనిపించారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించి బయటకు వచ్చిన కేఏ పాల్ ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వచ్చానన్నారు. మునుగోడు ప్రజలు మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ తన విన్యాసాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో కలిసి డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా ముందుకెళ్లారు. రైతు వేషంతో దర్శనమిచ్చారు. సైకిల్ తొక్కుతూ కనిపించారు. తన మాటలు, చేష్టలతో రైతులను నవ్వించారు. పోలింగ్ రోజున కూడా తన దైన శైలిలో పంచ్‌లు వేస్తూ, పరుగులు పెడుతూ నవ్వించారు. -
చండూరు మండల కేంద్రంలో ఉద్రికత్త
-
Munugode Bypoll 2022 : పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు (ఫొటోలు)
-
మునుగోడులో ప్రారంభమైన పోలింగ్
-
మునుగోడు వార్
-
Munugode Bypoll 2022: మునుగోడులో పోలింగ్ శాతం 90 ప్లస్
90శాతానికిపైగా.. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో 92 శాతం ఓటింగ్ నమోదైంది. Time: 6: 01PM • మునుగోడులో పోలింగ్ ముగిసింది. ఇంకా చాలాచోట్ల ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. Time: 5:26PM సాయంత్రం ఐదు గంటల వరకూ 77.55 శాతం పోలింగ్ Time: 4:00PM నల్లగొండ జిల్లా కొరిటికల్‌లో ఉద్రిక్తత టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ నాన్ లోకల్స్ తిరుగుతున్నారని బీజేపీ ఆరోపణ పోలీసులతో బీజేపీ కార్యకర్తల వాగ్వాదం, లాఠీచార్జ్ Time: 3:20PM మధ్యాహ్నం మూడు గంటల వరకు 59.92 శాతం పోలింగ్ Time: 01:20 PM మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదైంది. Time: 12:05 PM ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దు: రాజగోపాల్‌రెడ్డి తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధర్మం వైపే మునుగోడు ప్రజలు నిలుస్తారన్నారు. Time: 11:45 AM ఈసీకి ఫిర్యాదు చేశా.. పాల్వాయి స్రవంతి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఫేక్ న్యూస్‌పై ఈసీకి ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసున్నారని తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారికి నోటీసులు పంపిస్తానని స్రవంతి తెలిపారు. Time: 11:19 AM ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడులో జోరుగా పోలింగ్ సాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. Time: 10:32 AM పోలింగ్ బూత్ వద్ద అపశ్రుతి చండూరు పోలింగ్ బూత్ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. పోలింగ్ సెంటర్ గేట్ వద్ద పైపుల్లో మహిళ కాలు ఇరుక్కుపోయింది. స్థానికులు మహిళను రక్షించారు. Time: 9:42 AM చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికేతర టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బీజేపీ ఆందోళనకు దిగింది. మర్రిగూడలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాన్ లోకల్స్ ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. Time: 9:40 AM 11.2 శాతం పోలింగ్.. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు నిరీక్షిస్తున్నారు. Time: 9:23 AM కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన మునుగోడు పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంస్థాన్ నారాయణపురంలో పోలింగ్‌ను సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు. Time: 9:19 AM టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం మర్రిగూడలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాన్ లోకల్స్ ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. Time: 9:08 AM కొంపల్లిలో ఈవీఎంల మొరాయింపు మునుగోడు మండలం కొంపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు నిరీక్షిస్తున్నారు. రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించామన్నారు. చెకింగ్ పాయింట్స్ వద్ద లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. Time: 9:03 AM ఈవీఎంల వద్ద ఒకరి కంటే ఎక్కువ ఓటర్లు.. వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను ఈసీ పరిశీలిస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల వద్ద ఒకరి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు ఈసీ గమనించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ఈవీఎంల వద్ద ఒక్క ఓటరు మాత్రమే ఉండాలని ఆదేశించారు. Time: 8:57 AM ఓటు హక్కు వినియోగించుకున్న పాల్వాయి స్రవంతి చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. Time: 8:27 AM పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో పోలింగ్ కేంద్రాలను బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నాంపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలని పరిశీలించనున్నారు. Time: 8:19 AM ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారి గూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 8:12 AM మునుగోడు శివాలయంలో రాజగోపాల్‌రెడ్డి పూజలు మునుగోడు శివాలయంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం మునుగోడులోని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. అనంతరం నాంపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలని పరిశీలించనున్నారు. Time: 8:05 AM స్థానికేతరులు గుర్తింపు యాదాద్రి: పుట్టపాకలో స్థానికేతరులను అబ్జర్వర్ గుర్తించారు. నగదు ఇతర సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు. Time: 7:39 AM బారులు తీరిన ఓటర్లు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. Time: 7:21 AM కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు. మనుగోడులో మొత్తం ఓటర్లు 2,41,805 కాగా, పురుషులు 1,21,672.. మహిళలు 1,20,126.. అన్ని బూత్‌లలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. Time: 7:00 AM పోలింగ్ ప్రారంభం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు.మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటున్నాయి. Time: 6:30 AM మాక్ పోలింగ్ ప్రారంభం కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు.మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాంపల్లి మండలం పోలింగ్ బూత్ 294లో ఈవీఎం మొరాయించింది. మిగతా బూత్‌లలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందురోజైన బుధవారం ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. ఇదే చివరి అవకాశమంటూ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు ఇతర అభ్యర్థులు వీలైనంత మేర ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా మద్యం, డబ్బు పంపిణీ అయిందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారం నేపథ్యంలో తమకు ఇస్తానని చెప్పినంత నగదు ఇవ్వలేదంటూ, ఆ మేర ఇప్పించాలంటూ పలుచోట్ల ఓటర్లు ఆందోళనకు దిగడం కూడా కనిపించింది. ఉప ఎన్నిక ప్రక్రియ ఊపందుకున్న నాటి నుంచీ ప్రలోభాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను రుజువు చేస్తూ చాలాచోట్ల నగదు, మద్యం పట్టుబడటం గమనార్హం. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారమే నియోజకవర్గంలో మొత్తం 20 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుబడ్డాయి. రోజంతా అదే ‘రచ్చ’.. మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నెలరోజులుగా నియోజకవర్గంలో హడావుడి నెలకొంది. ఎన్నికల ప్రచారంతోపాటు సభలు, సమావేశాల పేరిట రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. ప్రచారానికి వచ్చేందుకు ఒకరికి ఇంత అంటూ డబ్బులు ముట్టజెప్పడం ఓవైపు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలు ఎరవేయడం మరోవైపు కొనసాగాయి. చికెన్, మటన్‌తోపాటు ఇంటింటికీ మద్యం బాటిళ్లు, కూల్డ్రింకులు, నగదు, పార్టీలు చేసుకునే వారికి అదనంగా లిక్కర్ సరఫరా జరిగాయి. పెద్ద నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు, భారీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశారని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఫలానా పార్టీ ఓటుకు ఇంత ఇస్తుందనే ప్రచారం ముందు నుంచే విపరీతంగా జరిగింది. దీనితో చాలామంది ఓటర్లు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూడటం కనిపించింది. అయితే పోలింగ్‌కు ముందు రోజు రాజకీయ పార్టీలు తమ టార్గెట్ మేరకు నగదు పంపిణీ చేసినట్టు తెలిసింది. ఓటుకు రూ.1,000 నుంచి రూ.6వేల వరకు ముట్టజెప్పారనే ప్రచారం జరుగుతోంది. బయట వారికోసం భారీ ఏర్పాట్లు నియోజకవర్గానికి బయట, ముఖ్యంగా హైదరాబాద్‌లో నివాసమున్న ఓటర్ల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. కొందరు ఓటర్లకు కలిపి ఓ వాహనం ఏర్పాటు చేయడం, దారిఖర్చులతోపాటు ఓటు వేసేందుకు నగదు ఇవ్వడం ద్వారా ఓట్లు సమీకరించుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. స్థానిక నాయకులతోపాటు హైదరాబాద్‌లో నివాసం ఉండే నేతలు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతలు తీసుకున్నారు. రాజకీయ పార్టీలు నగదు, మద్యం, దారి ఖర్చులు, వాహనాల ఖర్చులను అందుకున్న ఓటర్లు పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసే బాధ్యతను కొందరు నాయకులకు అప్పగించాయి. స్థానిక నేతలపై ఒత్తిళ్లు ప్రచారం గడువు ముగిసిన తర్వాత బయటి నుంచి వచ్చిన నాయకులు వెళ్లిపోవడంతో స్థానికంగా ఉన్న నేతలపై ఒత్తిడి పెరిగింది. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు, బడా నేతలు ఉన్నందున తాము అడగలేకపోయామని, ఇప్పుడు ఓటుకింత ఇస్తేనే ఓటేస్తామని కొందరు స్థానిక నేతలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. స్థానిక నేతలు ఈ విషయాన్ని పైకి చేరవేసి.. వారి సూచనల మేరకు వివిధ స్థాయిల్లో నగదు పంచినట్టు సమాచారం. కొన్నిచోట్ల అనుకున్న సమయానికి నగదు రాకపోవడం, ఓటర్ల నుంచి ఒత్తిడి పెరగడం తమకు తలనొప్పిగా మారిందని.. ఎలాగోలా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చిందని కొందరు స్థానిక నేతలు వాపోవడం గమనార్హం. మొత్తమ్మీద ధూంధాంగా సాగిన ఉప ఎన్నికల ప్రచారం ముగియడం, పోలింగ్‌కు సమయం ఆసన్నమవడంతో అంతటా ఆసక్తి నెలకొంది. గురువారం ఉదయం నుంచి మొదలయ్యే ఓటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాజకీయ పార్టీలు, నేతల ప్రలోభాలు ఏ మేరకు ఓటర్లపై ప్రభావం చూపుతాయి, ఎవరిని విజయం వరిస్తుందన్నది ఈ నెల 6న తేలనుంది. ఏర్పాట్లు పూర్తి.. గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బందోబస్తులో 2 వేల మంది.. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటాయి. -
మునుగోడు ఉపఎన్నిక కోసం 298 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు
-
ఆ తర్వాత మునుగోడులో స్థానికేతరులు ఉంటే కఠిన చర్యలు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకేనని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఆరు గంటల తర్వాత స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో ఉండకూదని ఆదేశించారు. నవంబర్ 3న ఉప ఎన్నిక ఓటింగ్ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సీఈఓ. నాన్ లోకల్ వాళ్ళు మునుగోడులో ఎవరు ఉన్నా చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మునుగోడులో అణువణువు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని గుర్తు చేశారు. ‘మంగళవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించాము. ఎవరైనా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్‌కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. రేపు సాయంత్రం 6గంటల వరకు మునుగోడులో ప్రచారం ముగుస్తుంది. ఓటర్లకు ఇప్పటికే కొత్త డిజైన్‌తో కూడిన ఓటర్ ఐడి ఇచ్చాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము. ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ఇప్పటి వరకు 111 బెల్ట్ షాపులను సీజ్ చేశాము. 185 కేసులు నమోదు కాగా.. 6.80కోట్ల నగదు 4500లీటర్ల లిక్కర్ పట్టుకున్నాము. కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి వివరణ కాసేపటి క్రితమే అందింది. దీనిపై ఈసీకి నివేదిక పంపాము. రిటర్నింగ్ అధికారిపై సీఈఓ కార్యాలయం నుండి ఎలాంటి ఒత్తిడి లేదు. ’ అని వెల్లడించారు సీఈఓ వికాస్ రాజ్. మునుగోడు ఉప ఎన్నికల ఓటింగ్ కీలక అంశాలు ► నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► 3366 పోలింగ్ సిబ్బందిని, 15 బలగాల సిబ్బంది మునుగోడులో మోహరిస్తున్నారు. ► ఫ్లైయింగ్ స్కాడ్‌తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నిక నేడే
న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. 4,800 మందికి పైగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటి దాకా పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ బాక్సులను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రాష్ట్ర్రాలకు తరలించడంతో పాటు అన్ని ఏర్పాట్లూ చేసింది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ఎన్డీఏ తరఫున గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లు కూడగట్టుకున్న ముర్ము మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేలా కన్పిస్తున్నారు. మొత్తం 10,86,431 ఓట్లలో ఆమెకు 6.67 లక్షల పై చిలుకు ఓట్లు ఇప్పటికే ఖాయమయ్యాయి. దాంతో సునాయాసంగా విజయం సాధించి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి గిరిజన మహిళగా ముర్ము రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక ప్రతిభా పాటిల్ తర్వాత ఈ అత్యున్నత పదవి చేపట్టనున్న రెండో మహిళ అవుతారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఉంటారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కుండదు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేవు. కాబట్టి క్రాస్ ఓటింగ్‌కు అవకాశముంటుంది. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700కు తగ్గింది. ఇక ఎమ్మెల్యేల ఓటు విలువలో 208తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 176తో జార్ఖండ్, తమిళనాడు రెండోస్థానంలో, 175తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. సిక్కిం ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7గా ఉంది. -
నెల్లూరు ఉప ఎన్నిక.. ముగిసిన ప్రచార పర్వం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. దీంతో నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. 23న జరగనున్న పోలింగ్‌పై అధికారులు దృష్టిపెట్టారు. ఈ మేరకు ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఎన్నికల విధుల్లో 1300 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 279 పోలింగ్ బూత్‌లను అధికారులను ఏర్పాటు చేయనున్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. -
18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన సీఈసీ
చమోలి: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోసారి ఆదర్శంగా నిలిచారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర చమోలీ జిల్లాలో కొండప్రాంతంలోని మారుమూల పోలింగ్ స్టేషన్‌కు ఆదివారం 18 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు. ‘సుదూరంగా ఉండే డుమాక్ గ్రామంలో ఈ పోలింగ్ స్టేషన్ ఉంది. ఎన్నికల సిబ్బందిని ఉత్సాహపరచాలన్నదే నా ఉద్దేశం. ఈ పోలింగ్ స్టేషన్‌కు ఎన్నికల సిబ్బంది పోలింగ్‌కు మూడురోజులు ముందుగానే చేరుకుంటారు’అని సీఈసీ ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం సిబ్బందికి చాలా కష్టసాధ్యమైన విషయమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన పలు సందర్భాల్లో రహదారి సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఆదర్శంగా నిలిచారు.