హైదరాబాద్ సెగ్మెంట్‌లో 48.48 శాతం
రాష్ట్రంలోనే అత్యల్పం ఇక్కడే..
ఎప్పటి మాదిరిగానే ఓటుపై అనాసక్తి
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ విషయంలో గ్రేటర్ జిల్లాల్లో మార్పు రావడం లేదు. గతంలో మాదిరిగానే హైదరాబాద్ జిల్లాకు అత్యల్ప పోలింగ్ నమోదై చివరి స్థానం దక్కింది. గత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే దాదాపు మూడు శాతం పెరిగినా..రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ మాత్రం ఇక్కడే నమోదైంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 48.48 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంమీద 22,17,094 ఓట్లకు గాను 10,74,827 ఓట్లు పోలయ్యాయి. గోషామహల్ సెగ్మెంట్‌లో 54.72 శాతం, కార్వాన్‌లో 51.23, బహదూర్‌పురాలో 50.07, చాంద్రాయణగుట్టలో 49.15, చారి్మనార్ 48.53, యాకుత్‌పురాలో 43.34, మలక్‌పేటలో 42.76 శాతం పోలయ్యాయి.
సికింద్రాబాద్‌లో 49.04%
సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో 49.04 శాతం పోలింగ్ నమోదైంది. గత లోకసభ ఎన్నికలతో పోలిస్తే ఒక శాతం పోలింగ్ పెరిగినా, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల కంటే ఒక శాతం తగ్గినట్లయింది. సెగ్మెంట్ల వారిగా పరిశీలిస్తే ముషీరాబాద్‌లో 49.09 శాతం, అంబర్‌పేటలో 51.65, ఖైరతాబాద్‌లో 50.28, జూబ్లీహిల్స్‌లో 45.59, సనత్‌నగర్‌లో 49.45, నాంపల్లిలో 46.59, సికింద్రాబాద్‌లో 52.28 శాతం పోలింగ్ నమోదైంది.
చేవెళ్లలో 56.50%
చేవెళ్ల లోక్ సభ పరిధిలో 56.50 శాతం పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే 0.31 పెరిగినా..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే పది శాతం తగ్గింది. మొత్తం మీద 29,38,870 ఓటర్లకు గాను 16,57,107 మంది ఓటేశారు. సెగ్మెంట్ల వారిగా చేవెళ్లలో 71.83 శాతం, వికారాబాద్‌లో 70.44 శాతం, తాండూర్‌లో 67.33 శాతం. పరిగిలో 67.01 శాతం, రాజేంద్రనగర్‌లో 54.12 శాతం, మహేశ్వరంలో 52.71 శాతం, శేరిలింగంపల్లిలో 54.12 శాతం పోలింగ్ నమోదైంది.
మల్కాజిగిరిలో 50.78%
మల్కాజిగిరి పరిధిలో పోలింగ్ 50.78 శాతం నమోదైంది. అసెంబ్లీ వారిగా పోలింగ్ శాతం పరిశీలిస్తే మేడ్చల్‌లో 57.83 శాతం, మల్కాజిగిరిలో 51.97, కుత్బుల్లాపూర్‌లో 50.19, కూకట్‌పల్లిలో 48.48, ఉప్పల్‌లో 48.45, ఎల్బీనగర్‌లో 46.27, కంటోన్మెంట్–సికింద్రాబాద్‌లో 51.61 శాతం పోలింగ్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment