బరితెగించిన టీడీపీ వర్గీయులు | Sakshi
Sakshi News home page

బరితెగించిన టీడీపీ వర్గీయులు

Published Tue, May 14 2024 9:29 AM

TDP Leaders Overaction In

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు సర్ది చెప్పేందుకు ప్రయతి్నంచినా వారు శాంతించలేదు. మీ అంతు తేలుస్తామంటూ వైఎస్సార్‌సీపీ వర్గీయులను బెదిరించారు. ఇదే సమయంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న అడిషనల్‌ ఎస్పీ హైమావతి, డీఎస్పీ శ్రీధర్, స్పెషల్‌ పార్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. 

👉 రాయచోటి అసెంబ్లీ పరిధిలోని నక్కవాండ్లపల్లి 175 పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్‌సీపీ  నాయకుడు తిరుపాల్‌ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. 
👉 మదనపల్లి బీటీ కళాశాల పోలింగ్‌ బూత్‌లోకి టీడీపీ అభ్యర్థి షాజహాన్‌ బాషా దూసుకుని వచ్చింది. 
👉 లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామపంచాయతీ చౌటుపల్లిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురి ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. 
👉లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం మేడిమాకల గుంతరెడ్డివారిపల్లె  పోలింగ్‌ కేంద్రంలో ఇరుపారీ్టల ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది.   
👉 కేవీపల్లె మండలం జిల్లేల్లమంద పంచాయతీ దేవాండ్లపల్లె పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీ, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. పోలీసులు అక్కడి చేరుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. 
👉లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామం చెంచర్లపల్లె పోలింగ్‌ బూత్‌లో ఇరువురు ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.  
👉 రాయచోటి మండలం చెన్నముక్కపల్లి గ్రామం దూలవారిపల్లి పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ 85లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసుల రాకతో పరిస్థితి ప్రశాంతంగా మారింది. 
👉 రైల్వేకోడూరు మండలం శెట్టిగుంటలో పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 110. 111లో  ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల రంగ ప్రవేశం చేయడంతో సమస్య సద్దుమణిగింది. 
👉మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రైమరీ స్కూల్‌ వద్ద టీడీపీ నాయకులు కండువా, పసుపు చొక్కాలు ధరించి టీడీపీకి ఓటేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. దీనిపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement