Himachal Pradesh Elections 2022: World Highest Polling Station Tashigang With 52 Voters - Sakshi
Sakshi News home page

Himachal Elections 2022: ఈ పోలింగ్‌ బూత్‌ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా..

Published Sat, Nov 12 2022 11:57 AM | Last Updated on Sat, Nov 12 2022 12:50 PM

HP Election 2022: Tashigang World Highest Polling Station - Sakshi

సిమ్లా: కాంగ్రెస్‌-బీజేపీలకు చెరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తున్న హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు.. ఈసారి ఎవరికి పట్టం కడతారనే చర్చ జోరుందుకుంది. శనివారం హిమాచల్‌ ప్రదేశ్‌ పోలింగ్‌ నేపథ్యంలో.. ఓటింగ్‌ శాతం పెంచేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో.. ప్రధాని మోదీ, అమిత్‌ షా సహా కీలక నేతలంతా ఓటేయాలంటూ ఓటర్‌ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. 

హిమాచల్‌ ప్రదేశ్‌ పోలింగ్‌ వేళ.. ఓ బూత్‌ ఆసక్తికర చర్చకు దారి తీసింది. కేవలం 52 మంది ఓటర్ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారక్కడ. అందుకు ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. తషిగ్యాంగ్‌.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్‌ కేంద్రం. అందుకే ఎన్నికల సంఘం అక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. 

లాహౌల్ & స్పితి పరిధిలోని తషిగ్యాంగ్‌లో దాదాపు 15, 256 ఫీట్ల ఎత్తులో ఉండే ఇక్కడ ప్రత్యేక పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు‌. వృద్ధులకు, దివ్యాంగుల కోసం మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారిక్కడ. వందకు వంద శాతం ఓటింగ్‌ నమోదు చేయాలని భావిస్తున్నారు  ఇక్కడ. 

ఇక హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం 55 లక్షల ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,884 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. మొత్తం 412 మంది అభ్యర్థులు.. 68 నిజయోకవర్గాల్లో పోటీ పడుతున్నారు. 

ఒకవైపు తిరిగి అధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ, మరోవైపు మనుగడ కోసం కాంగ్రెస్‌ పార్టీలో హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఇక ఈ మధ్యలో ఆప్‌ వచ్చి చేరింది. డిసెంబర్‌ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement