Himachal Pradesh Assembly Election 2022
-
వీడిన ఉత్కంఠ.. హిమాచల్ సీఎం ఎవరో తేల్చేసిన అధిష్టానం
హిమాచల్‌లో ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీలో సందడి నెలకొంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారనే చర్చ జోరుగా సాగింది. సీఎం పదవి కోసం చాలా మంది ప్రయత్నాలు చేయడంతో ఒకరిని ఎంపిక చేయడం పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. తాజాగా హిమాచల్‌లో ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారాన్ని పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానించిన సంగతి తెలిసిందే. దీంతో హిమాచల్ సీఎంగా సీనియర్ నాయకుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పదవిని ఆశిస్తున్న ఇతర నేతలతో చర్చించిన తర్వాత ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. కొత్తగా ఎన్నికైన సీఎం డిసెంబర్ 11 ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై సుఖ్వీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. హైకమాండ్ నిర్ణయం గురించి తనకు తెలియదని అన్నారు. సాయంత్రం జరిగే కాంగ్రెస్ లెజిస్టేచర్ పార్టీ సమావేశానికి వెళుతున్నానని చెప్పారు. కాగా గురువారం వెల్లడైన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. బీజేపీకి 25 స్థానాలు దక్కించుకోగా.. స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. చదవండి: ఆ ట్వీట్ గురించి కాదు..తృణమాల్ నేత బీజేపీపై ఫైర్ -
ఇంతకీ.. గెలిచింది ఎవరు!
మూడు రాష్ట్రాలు. మూడు ఎన్నికలు. మూడు పార్టీలు. మూడు విభిన్న తీర్పులు. మూడు ముక్కల్లో తాజాగా ముగిసిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సారాంశమిదే. దేశం మొత్తాన్నీ తనవైపు తిప్పుకునే సమ్మోహన శక్తి ఏ పార్టీకీ లేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి గానీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు గానీ, బీజేపీకి పోటీగా ఎదగాలని కలలుగంటున్న ఆప్‌కు గానీ అవి ఊహించుకుంటున్నంత బలం లేదని తేలిపోయింది. ఈ మూడు పార్టీలు ఎక్కడ గెలవాలన్నా ఇంకేదో వాటికి అసంకల్పితంగా సహాయపడుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓ పార్టీగా నెగ్గలేదు. మోదీ ప్రధానిగా ఉండటం వల్ల మాత్రమే రికార్డు విజయాన్ని సాధించగలిగింది. ప్రధాని గుజరాతీ కావడం వల్లే ఆ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను ఆసాంతం పక్కకు నెట్టేసి బీజేపీని అక్కున చేర్చుకున్నారు. ఇక హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా అది సొంత చరిష్మాతో అసలే కాదు. పాలక పక్షమైన బీజేపీపై గూడుకట్టుకుని ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్‌కు ఓటేయడం ద్వారా జనం బహిర్గతం చేశారు. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓటర్లు ఇలాగే స్పందించడంతో ఎంసీడీపై 15 ఏళ్ల బీజేపీ పెత్తనానికి తెర పడింది. అక్కడ కాంగ్రెస్ కన్నా ఆప్ మెరుగని ఓటర్లు భావించడంతో ఎంసీడీ కేజ్రీవాల్ పార్టీ వశమైంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ గెలిచిన పార్టీలకు సొంత బలానికి మించి అదనపు బలం వ్యతిరేక ఓటు ద్వారానో, ప్రాంతీయాభిమానం రూపేణో సమకూరింది. ఆ లెక్కన వాటివి అసంపూర్ణ విజయాలు మాత్రమే! గెలవలేదు, గెలిచామనిపించాయి!! మోదీ మ్యాజిక్‌ను నమ్ముకుని 2024లో ఏకంగా 400 ఎంపీ స్థానాలు కొల్లగొడతామని కలలుగంటున్న బీజేపీ పైకి ఏం చెబుతున్నా ఈ మూడు ఎన్నికల్లో సదరు మ్యాజిక్ ఒకే రాష్ట్రానికి, అదీ ఆయన స్వరాష్ట్రానికి మాత్రమే పరిమితమైందన్న వాస్తవం మింగుడుపడటం లేదు. తన మ్యాజిక్కూ పరిమితులున్నాయని మోదీకి కూడా ఈసరికే అర్థమై ఉంటుంది. కలెగూరగంప లాంటి తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎవరి పరిమితులేమిటో చూద్దాం... మోదీ.. తగ్గుతున్న మేజిక్ గుజరాత్‌ను సుదీర్ఘకాలం పాలించిన ముఖ్యమంత్రి. ప్రస్తుతం దేశాన్నేలుతున్న ప్రధాని. ప్రపంచం దృష్టిలో విశ్వగురు. అత్యధిక ప్రజాదరణ ఉన్న నేత. బీజేపీకి పెద్ద దిక్కు. ఒకరకంగా పారీ్టకి ప్రస్తుతతం అన్నీ ఆయనే! ఎంతగా అంటే... బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ అనేంతగా!! వరుసగా రెండోసారి ప్రధాని పదవి చేపట్టాక మోదీ ద్విగుణీకృత ఆకర్షణ శక్తితో వెలిగిపోయినా ఆ శక్తి రాను రానూ సన్నగిల్లుతున్నట్టు కన్పిస్తోంది. తాజా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అది కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. ఒకవిధంగా మోదీ గ్రాఫ్ తగ్గడం నోట్ల రద్దు నిర్ణయంతోనే మొదలైంది. తర్వాత బడా కార్పొరేట్ దిగ్గజాల భారీ రుణాలను గుండుగుత్తగా మాఫీ చేయడం మొదలుకుని ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ దాకా ఆయన గ్రాఫ్ పడిపోతూనే ఉంది. మెజారిటీ లేని రాష్ట్రాల్లో బేరసారాలతో రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ వశం చేయడం సాధారణ పౌరులకు కూడా మింగుడుపడని అంశం. ఎంసీడీలోనూ, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుని ఉంటే మోదీ గాలికి తిరుగులేదని బహుశా నిరూపితమయ్యేదేమో. కానీ జరిగింది మరొకటి. గుజరాత్‌లోనూ ఎన్నడూ లేనంతటి మెజారిటీ సాధించడం కచి్చతంగా మోదీకి ప్లస్ పాయింటే. అయితే అది మోదీ స్వరాష్ట్రం కావడం వల్లే ఆ ఘనత సాధ్యమైంది. ఆయన్ను తమ రాష్ట్ర ముద్దుబిడ్డగా గుజరాత్ ఓటర్లు భావించబట్టే ఆ స్థాయిలో అందలమెక్కించారు. మోదీ కాక మరో రాష్ట్ర నేత ఎవరైనా ప్రధానిగా ఉన్నట్టయితే గుజరాత్ ఫలితం మరోలా ఉండేదేమో! ఊహాజనితమే అయినా ఇది చర్చనీయాంశమే! గుజరాత్లో గెలిచింది నిస్సందేహంగా మోదీ మాత్రమే. బీజేపీ కేవలం ఆయన వెంట నడిచింది. అంతే! అదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు మోదీ కూడా ఓడారన్నది కాదనలేని వాస్తవం! బీజేపీ.. మోదీపైనే భారం కేంద్రంలో అధికారంలో ఉన్న పారీ్టగా అన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగరేయాలని ఉవి్వళ్లూరుతున్న బీజేపీకి హిమాచల్ ఓటమి మింగుడుపడనిదే. ఈ ఫలితంతో బీజేపీ అధికారం 16 రాష్ట్రాలకే పరిమితమైంది. వీటిలో సొంతంగా 10 రాష్ట్రాల్లో, సంకీర్ణంతో మిగతా ఆరుచోట్ల అధికారంలో ఉంది. డబుల్ ఇంజన్ (కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం) నినాదంతో దేశాన్ని హోరెత్తిస్తున్న బీజేపీకి హిమాచల్‌లో ఒక ఇంజన్ పట్టాలు తప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అక్కడ కేవలం ఒక శాతం ఓటు తేడాతోనే ఓడామని మోదీ సరిపుచ్చుకునే ప్రయత్నం చేసినా ఓటమి ఓటమే కదా! పైగా హిమాచల్‌లో కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం కూడా చేయకపోయినా విజయం ఆ పార్టీనే వరించడం బీజేపీపై అక్కడి ప్రజలకున్న వ్యతిరేకతకు అద్దం పడుతుంది. స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన అగి్నపథ్, వన్ ర్యాంక్–వన్ పెన్షన్ పథకం వంటివాటిపై బీజేపీ దృష్టి పెట్టకపోవడం, కేవలం మోదీ మ్యాజిక్ మీదే మితిమీరిన నమ్మకం పెట్టుకోవడం ఓటమికి దారితీశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరిగిన ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు అసెంబ్లీ సీట్లలో మాత్రమే నెగ్గింది. ఆ పార్టీ ప్రాభవం తగ్గుతోందంనేందుకు ఇదీ సూచికే. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి లోక్‌సభ, కతౌలీ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడటం గమనార్హం. మెయిన్‌పురితో సమాజ్‌వాదీ అభ్యరి్థ, పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఏకంగా 2.88 లక్షల ఓట్ల మెజారిటీ సాధించడం మరో విశేషం. 2024 లోక్‌సభ ఎన్నికల్లోగా బీజేపీ సంస్థాగతంగా మరింత పట్టు సాధించకుంటే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా తయారవడం ఖాయం. లేదంటే మోదీనే నమ్ముకుని గుజరాత్ వంటి విజయాల కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. కాంగ్రెస్... అదే అయోమయం ఈ పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హిమాచల్‌లో గట్టెక్కినా అది సొంతం బలంతో కాదని కాంగ్రెస్‌కూ తెలుసు. గుజరాత్లో, ఢిల్లీ కార్పొరేషన్లో పార్టీ కనీస స్థాయి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఆప్ దెబ్బకు గుజరాత్లో ముక్కోణపు పోరులో పూర్తిగా మునిగింది. కోలుకునే పరిస్థితి సుదూరంలోనూ కని్పంచడం లేదు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒరిగిందేమీ లేదు. గుజరాత్‌పైనే దృష్టి పెట్టిన కాంగ్రెస్, హిమాచల్‌లో సరైన ప్రచారం కూడా చేయలేదు. ప్రియాంకా గాంధీ అదపాదడపా పర్యటనలతో మమ అనిపించారు. రాహుల్ ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయినా బీజేపీ వైఫల్యానికి తోడు, ఆప్ ప్రభావం చూపలేకపోవడంతో కాంగ్రెస్‌ను విజయం తనంతతానుగా వరించింది. కష్టించి సాధించినది కాదు. ఆప్... అప్పుడే కాదు! బీజేపీకి కంచుకోట అయిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను బద్దలు కొట్టి 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెర దించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా చతికిలపడింది. భారీ పథకాలు, తాయిలాలతో అట్టహాసంగా రాష్ట్ర ఎన్నికల బరిలో దిగిన ఆప్.. ‘పహలే ఆప్’ అంటూ ఏమాత్రం పోటీనివ్వకుండా బీజేపీకి దారిచి్చంది! పైగా కాంగ్రెస్ ఓట్లను భారీగా చీల్చి బీజేపీకి రికార్డు సంఖ్యలో స్థానాలు కట్టబెట్టింది. గుజరాత్లో సాధించిన ఓట్ల శాతం సాయంతో జాతీయ పార్టీ గుర్తింపు దక్కనుండటమే ఆప్‌కు ఏకైక ఊరట. బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనంటూ పదేపదే చీపురు ఝళిపిస్తున్న ఆప్ నిజంగా ఆ స్థాయికి చేరాలంటే మరింత సమయం తప్పదని ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి. ఇక హిమాచల్ ఎన్నికల్లోనైతే ఆప్ సోదీలో కూడా లేకుండానే పోయింది. ఓడినా అనుభవం దక్కిందని తృప్తి పడటమే ఆ పారీ్టకి చివరికి మిగిలింది! - ఎస్.రాజమహేంద్రారెడ్డి -
Himachal Pradesh: సీఎం పీఠం మా నేతకే...
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ ఈ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీ కేంద్ర పరిశీలకులుగా చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హరియాణా మాజీ సీఎం భూపీందర్‌సింగ్ హుడా వచ్చారు. హిమాచల్‌లో తదుపరి ముఖ్యమంత్రి రేసులో ప్రతిభా సింగ్, ముకేశ్‌సింగ్ అగ్నిహోత్రి, సుఖ్వీందర్ సింగ్ సుఖు ముందంజలో ఉన్నారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు వారు తమ మద్దతుదారులతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు కేంద్ర పరిశీలకులు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు గడువు కోరారు. ఇదీ చదవండి: హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్‌పై విమర్శల వెల్లువ -
ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయహోదాతో వచ్చే మార్పులేంటి ?
హిమాచల్‌ప్రదేశ్‌లో ఖాతా తెరవలేకపోయింది. గుజరాత్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆప్ కలలు కంది. కానీ ఆ కలలన్నీ కల్లలైపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఊడవలేకపోయిన చీపురు మూలకూర్చుండిపోయింది. గుజరాత్ ఫలితాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా రావడంతో ఆ పార్టీకి కాస్త బలం వచ్చినట్టయింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన పంజాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎరగవేయడంతో గుజరాత్లో కూడా ఆ పార్టీ ప్రబల శక్తిగా ఎదుగుతుందని అందరూ భావించారు. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా తన ఉనికిని చాటుతుందని అనుకున్నారు. కానీ రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఆప్‌కి జాతీయ పార్టీ హోదా దక్కడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రెండేళ్ల ముందు నుంచి రాష్ట్రంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ గుజరాత్‌పై దృష్టి పెట్టడం, సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ సత్తా చాటడంతో తొలిసారిగా రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. అయితే మొదట్నుంచి ఆప్ కాంగ్రెస్‌నే విమర్శిస్తూ ఆ పార్టీ ఓటు బ్యాంకునే లక్ష్యంగా చేసుకోవడంతో నామమాత్రంగానే మిగిలిపోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఆమ్ మొదట్లో విస్తృతంగా తిరిగినప్పటికీ అవినీతి ఆరోపణల కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్‌తో ఆప్ ఆశలు వదిలేసుకుంది. గుజరాత్లో వివిధ మీడియా సంస్థల పోల్స్ కూడా ఆప్‌కి 20 శాతం వరకు ఓట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీకి సొంత గడ్డ మీదనున్న క్రేజ్ ముందు కేజ్రివాల్ నిలబడలేకపోయారు. చదవండి: (ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం) జాతీయ పార్టీ హోదా ‘‘గుజరాత్ ప్రజలు మాకు జాతీయ పార్టీ హోదా కట్టబెట్టారు. ఇప్పటివరకు దేశంలో కొన్ని పార్టీలకు మాత్రమే ఆ హోదా ఉంది. నిజంగా ఇది మాకో అద్భుతమైన విజయం’’.. గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అరవింద్ కేజ్రివాల్ పంపిన సందేశమిది. జాతీయ పార్టీకి హోదా రావడానికున్న షరతుల్లో ఒకటైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలో 6శాతం ఓట్లు, కనీసం రెండు సీట్లలో గెలిచి ఉండాలి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న ఆప్ గోవాలో 6శాతం ఓట్లు, 2 సీట్లను సాధించింది. ఇప్పుడు గుజరాత్లో అయిదు సీట్లను గెలుచుకొని, 13శాతం ఓట్లతో జాతీయ పార్టీ హోదాని దక్కించుకుంది. దేశంలో ఉన్న జాతీయ పార్టీలివే.. మన దేశంలో ఇప్పటివరకు ఎనిమిది మాత్రమే జాతీయ పార్టీలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీకి మాత్రమే ఈ గుర్తింపు ఉంది. ఆప్‌ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తిస్తే తొమ్మిదో జాతీయ పారీ్టగా అవతరిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ జాతీయ హోదాతో వచ్చే మార్పులేంటి ? ►పార్టీకి జాతీయ హోదా వస్తే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే ఎన్నికల గుర్తు లభిస్తుంది ►సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆకాశవాణి, దూరదర్శన్‌లో బ్రాడ్కాస్ట్, టెలికాస్ట్ బాండ్స్ లభిస్తాయి ►40 మంది స్టార్ క్యాంపైనర్లు ప్రచారంలో పాల్గొనచ్చు. వారికయ్యే ఖర్చులు అభ్యర్థులకుండే ఖర్చుల పరిమితి నుంచి మినహాయిస్తారు. ►పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి రాష్ట్రాల్లో ప్రభుత్వ జాగాలు లభిస్తాయి. ►అభ్యర్థులు నామినేషన్ వేసినప్పుడు ఒకరే ప్రొపోజర్ ఉంటే సరిపోతుంది. -
హిమాచల్‌లో ఆ అంశాలే బీజేపీ కొంపముంచాయ్
అభ్యర్థుల్ని కాదు. నన్ను చూసి ఓటెయ్యండి అంటూ ప్రధాని మోదీ చేసిన ప్రచారం, బీజేపీ జపించిన అభివృద్ధి మంత్రం, డబుల్ ఇంజిన్ సర్కార్ వ్యూహం, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్‌కున్న వ్యక్తిగత ఇమేజ్ ఇవేవీ హిమాచల్ ప్రదేశ్‌లో కమలదళాన్ని కాపాడలేకపోయాయి. స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో అధికార బీజేపీ చూపిన అలసత్వమే ఆ పార్టీ కొంపముంచింది. సరిగ్గా వాటినే కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ఎక్కడికక్కడ మోదీకి కౌంటర్లు ఇవ్వడం కాంగ్రెస్‌కి కలిసొచ్చింది. కాంగ్రెస్ తన ప్రచారంలో పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం, యాపిల్ రైతు సమస్యలు వంటివి లేవనెత్తుతూ వాటికి పరిష్కారాలను కూడా చూపించింది. రాష్ట్రంలో 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారు. వారంతా పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఆందోళనలు చేస్తూ ఉంటే బీజేపీ చూసీ చూడనట్టు వ్యవహరించడం ఆ పార్టీని గట్టి దెబ్బ తీసింది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పునరుద్ధరణపైనే తొలి సంతకం పెడతానని హామీ ఇవ్వడంతో ఉద్యోగులంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు. ఎగువ హిమాచల్ ప్రదేశ్‌లో అత్యంత కీలకమైన యాపిల్ లాబీ బీజేపీపై అసంతృప్తిగా ఉంది. యాపిల్ పళ్లను నిల్వ చేసే కారా్టన్లపై జీఎస్టీ పెంపు, అదానీ గ్రూప్‌కి తక్కువ ధరకే యాపిల్స్‌ను అమ్ముకోవాల్సి రావడం వంటివి ప్రభుత్వ వ్యతిరేకతని పెంచాయి. చదవండి: (బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు) కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకం కూడా మంచుకొండల్లో మంటల్ని రాజేయడం బీజేపీకి మైనస్‌గా మారింది. ఇండియన్ ఆర్మీలో హిమాచల్‌కు చెందిన 1.15 లక్షల మంది సేవలు అందిస్తూ ఉంటే మరో 1.30 లక్షల మంది రిటైర్డ్ అధికారులున్నారు. కాంట్రాక్ట్ పద్ధతుల్లో సైన్యంలో నియామకాలను తీవ్రంగా వ్యతిరేకించిన వీరంతా, ఈ పథకం రద్దుకు ప్రయత్నిస్తామన్న కాంగ్రెస్ వైపు తిరిగిపోయారు. నిరుద్యోగం, అధిక ధరలు కూడా ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను దెబ్బ తీశాయి. బీజేపీకి రెబెల్స్ గండి బీజేపీ పరాజయానికి రెబెల్ అభ్యర్థులు, పార్టీలోని అంతర్గత పోరు కూడా కారణమే. దాదాపుగా 12 స్థానాల్లో బీజేపీ అసమ్మతి నేతలు పోటీలోకి దిగి బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టారు. విజయం సాధించిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ రెబెల్సే. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమాల్ మధ్య వర్గపోరు కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్‌లో అంతర్మథనం.. పక్కలో బల్లెంలా మారుతున్న ఆప్
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు భరించలేని చేదును, కాస్త తీపిని రుచి చూపాయి. గుజరాత్లో బీజేపీ దెబ్బకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతటి ఘోర పరాజయాన్ని చవిచూడ్సాలి వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌లో గెలిచినా దాన్ని కాంగ్రెస్ ఘనత అనేకంటే బీజేపీ స్వయంకృతమనే చెప్పాలి. ఆ లెక్కన తాజా ఫలితాలు రెండూ కాంగ్రెస్‌కు ప్రమాద ఘంటికలే. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా ఒక్కో రాష్ట్రానికీ విస్తరిస్తూ పక్కలో బల్లెంలా మారుతున్న వైనం హస్తం పార్టీని మరింతగా కలవరపెట్టేదే. కాంగ్రెస్ ఇంతకాలం ప్రధానంగా బీజేపీతోనే తలపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పలు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాపాడుకోవడానికి ముందుగా ఆప్‌తోనే కాంగ్రెస్ తలపడాల్సిన పరిస్థితి తలెత్తే సూచనలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి. ఇది మూలిగే నక్కపై తాటిపండు చందమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు. గుజరాత్‌లోనూ అదే జరిగింది. ఆప్ గెలిచింది ఐదు స్థానాలే అయినా ప్రధానంగా కాంగ్రెస్‌నే దెబ్బ తీసింది. ఆప్ సాధించిన 13 శాతం ఓట్లు కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు గండి పెడుతూ సాధించినవే. ‘‘రానున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆప్ ముప్పు కాంగ్రెస్‌ను వెంటాడటం ఖాయం. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అది మరింత పెరుగుతుంది’’ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: (బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు) -
ఆప్ ఘోర పరాజయం.. సీఎం అభ్యర్థికీ తప్పని ఓటమి
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. బీజేపీ, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్న ఆప్ ఓటర్లను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లు మొండిచేయి చూపారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా గుజరాత్ ఎన్నికల బరిలో దిగిన ఆప్ అత్యంత దారుణంగా చతికిల పడింది. అన్ని స్థానాల్లో బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేక పోయింది. ఖాతా తెరవని ఆప్ 182 స్థానాల్లో కేవలం 4 చోట్లా మాత్రమే గెలుపొందింది. 12 శాతం ఓట్లను సాధించి మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ తుడిచిపెట్టుకుపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. గుజరాత్లో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పార్టీ కీలక నేతలంతా భారీగా ప్రచారం చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. బీజేపీ దూకుడు ముందు ఆప్ వ్యూహాలేవీ ఫలించలేదు. సీఎం అభ్యర్థి ఓటమి దీనికి తోడు గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదన్ గడ్వీకి కూడా ఓటమి తప్పలేదు. ఖంభాలియా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి అయర్ ములుభాయ్ హర్దాస్‌భాయ్ బేరాపై 19,000 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. ఇసుదాన్ గాధ్వి 53,583 ఓట్లు రాగా, బేరాకు 71,345 ఓట్లు వచ్చాయి. అంతేగాక గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా కూడా ఓటమి పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి వినోద్ మోరాదియా విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో ఆప్ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. కాంగ్రెస్ ఓట్లకు గండి అయితే గుజరాత్లో ఓట్లను చీల్చడంలో మాత్రం గట్టి పాత్ర పోషించింది. కాంగ్రెస్ ఓట్లకు ఆప్ గండి కొట్టింది. గత ఎన్నికల్లో 41 శాతం ఓటింగ్ సాధించిన కాంగ్రెస్ ఈ సారి 27 శాతానికి పడిపోయింది. ఒకవేళ ఆప్ పోటీలో లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా బీజేపీకి గట్టిపోటి ఇచ్చి ఇంకొన్ని స్థానాలను గెలుచుకునేదేమో! మొత్తానికి ఈ ఏడాది పంజాబ్ అసెంబ్లీ గెలుపుతో ఊపు మీదున్న ఆప్‌కు గుజరాత్ ఎన్నికలు భారీ షాక్‌నిచ్చాయి. అసలు హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ పోటీలో ఉందా అనే స్థితికి చేరింది. -
ఒక శాతం కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం: సీఎం జైరాం ఠాకూర్
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీనిపై సీఎం జైరాం ఠాకూర్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ కేవలం 1% కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయిందని తెలిపారు. అంతేగాక రాష్ట్ర చరిత్రలో కాంగ్రెస్ అతి తక్కువ ఓట్ షేర్‌తో విజయం సాధించిందని పేర్కొన్నారు. అయితే తాను ఎన్నికల ఫలితాలను గౌరవిస్తానని తెలిపారు. కాంగ్రెస్ త్వరలో తమ ముఖ్యమంత్రిని ఎన్నుకోని, రాష్ట్రం కోసం పనిచేయడం ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు హిమాచల్‌లో బీజేపీ ఓటమిపై ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీపై ఉన్న అభిమానానికి, పార్టీకి అందించిన మద్దతుకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు, రాబోయే కాలంలో ప్రజల సమస్యలను లేవనెత్తేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. చదవండి: Mainpuri Bypoll Result: ములాయం కోడలు డింపుల్ యాదవ్ బంపర్ విక్టరీ.. ఎన్ని లక్షల మెజార్టీ అంటే.. -
గుజరాత్ లో రికార్డులు బద్దలు కొట్టిన బీజేపీ
-
Himachal Election Results: కాంగ్రెస్ ఘన విజయం.. సీఎం రాజీనామా
షిమ్లా: గుజరాత్ ఎన్నికల్లో భారీ ప్రభంజనం సృష్టించిన బీజేపీ.. హిమాచల్ ప్రదేశ్‌లో పరాజయాన్ని చవిచూసింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించి ఏ పార్టీతో పొత్తు లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక ఆప్.. కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు పంపినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానని తెలిపారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. కాగా మండీ జిల్లాలోని సిరాజ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై జైరాం ఠాకూర్ గెలుపొందారు. కాంగ్రెస్ విజయ కేతనం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 68 సీట్లకు గానూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ఫిగర్ 35ను దాటేసింది. ఇప్పటికే 37 స్థానాల్లో స్పష్టమైన విజయం సాధించింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 23 స్థానాల్లో గెలుపొందగా.. 3 చోట్ల ముందంజలో ఉంది. ఇతరులు మూడు సీట్లను గెలుచుకున్నారు. చదవండి: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్.. ప్రమాణం ఎప్పుడంటే? -
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఆప్‌కు ఎదురుదెబ్బ.. స్పందించిన కేజ్రీవాల్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పోరాడిన కేజ్రీవాల్ పార్టీ బోల్తా కొట్టింది. రెండు రాష్ట్రాల్లోనూ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. సోమవారం సాయంత్రం విడుదలైన పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆప్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. గుజరాత్ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరిగిందని అంతా భావించారు. అధికార బీజేపీ పార్టీకి గట్టి పోటి ఇస్తుందని అనుకున్నారు. అందుకు తగ్గట్లే మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పార్టీ భారీ ప్రచారం నిర్వహించింది. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. అంచనాలను తలకిందులు చేస్తూ ఆప్‌ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. కేవలం అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్యే పోటీ జరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అంతేగాక హిమాచల్‌లోనూ ఆప్ కనీసం ఖాతా తెరవడం కష్టమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 182 సీట్లు ఉన్న గుజరాత్లో ఆప్ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కనీసం రెండో స్థానంలో కూడా నిలువలేకపోయింది. గుజరాత్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలిచింది. అయితే ఎగ్జిట్ పోల్స్‌ను ఆప్ నేతలు ఖండిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువవుతుందని.. వాస్తవానికి దాదాపు 100 సీట్లకు దగ్గరగా గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే హిమాచల్‌లో కాంగ్రెస్‌కు మద్దతిస్తారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు కేజ్రీవాల్. తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గుజరాత్ ఎన్నికల రిజల్ట్స్ తమకు సానుకూలంగా రానున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్లో ఓ కొత్త పార్టీ 15 నుంచి 20 శాతం ఓట్లు రావడం, అది కూడా బీజేపీ కంచుకోటగా ఉన్న గుజరాత్లో చాలా పెద్ద విషయమని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి ఉంటామని తెలిపారు. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆప్ విజయ కేతనం ఎగురవేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. 250 సీట్లున్న ఢిల్లీ కార్పొరేషన్లో ఆప్ 150 సీట్లకు పైగానే గెల్చుకునే అవకాశం ఉన్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో 15 ఏళ్ల తర్వాత ఎంసీడీ పీఠాన్ని బీజేపీ ఆప్‌కు అప్పగించబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 100 లోపు సీట్లకే పరిమితమవుతున్నట్లు తేలిపోయింది. చదవండి: ‘పని’కొచ్చే విద్య కావాలి! ఒక సబ్జెక్ట్‌లో బీటెక్.. సాఫ్ట్వేర్ జాబ్‌లో చేరిపోవడం! -
వడ్డీ రేట్లవైపు మార్కెట్ చూపు
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లను ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ తీసుకోనున్న పరపతి నిర్ణయాలు ప్రభావం చూపనున్నాయి. గత కొన్ని నెలలుగా ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల పెంపును బలపరుస్తోంది. ధరల అదుపునకే తొలి ప్రాధాన్యమిస్తూ కీలక రేటు రెపోను పెంచుతూ వస్తోంది. గత పాలసీ సమీక్షలో చేపట్టిన 0.5 శాతం పెంపుతో ప్రస్తుతం వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 5.9 శాతానికి చేరింది. తిరిగి ఈ నెల 5–7 మధ్య ఎంపీసీ పరపతి సమీక్షను నిర్వహించనుంది. ద్రవ్యోల్బణ కట్టడికి మరోసారి 0.25–0.35 శాతం స్థాయిలో రెపోను పెంచే వీలున్నట్లు అత్యధిక శాతం మంది బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఫలితాలపై కన్ను కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటి(5)తో పూర్తికానుంది. వీటితోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు 8న వెలువడనున్నాయి. 7న ఆర్బీఐ నిర్ణయాలు, 8న ఎన్నికల ఫలితాలు మార్కెట్ల దిశను నిర్ధారించవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు దీపక్ జసానీ పేర్కొంటున్నారు. ఇవికాకుండా విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సైతం సెంటిమెంటుపై ప్రభావం చూపగలవని భావిస్తున్నారు. పెట్టుబడులు కీలకం రష్యా– ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో కొద్ది రోజులుగా ప్రపంచస్థాయిలో ధరలు అదుపు తప్పుతున్న సంగతి తెలిసిందే. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు తదితర కఠిన పరపతి విధానాలను అమలు చేస్తున్నాయి. దీంతో డాలరు బలపడుతుంటే దేశీ కరెన్సీ నేలచూపులు చూస్తోంది. అయితే ఇకపై ఫెడ్ వడ్డీ పెంపు వేగం మందగించవచ్చన్న అంచనాలతో ట్రెజరీ ఈల్డ్స్, డాలరు కొంతమేర వెనకడుగు వేస్తున్నాయి. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్లకు కీలకంకానున్నాయి. ఇటీవల ఎఫ్‌పీఐలు అమ్మకాలను వీడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో దేశీ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను సాధిస్తున్న విషయం విదితమే. రికార్డుల వారం గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో పరుగు తీశాయి. సెన్సెక్స్ నికరంగా 575 పాయింట్లు బలపడి 62,869 వద్ద, నిఫ్టీ 183 పాయింట్లు పుంజుకుని 18,696 వద్ద స్థిరపడ్డాయి. గురువారం(1న) సెన్సెక్స్ 63,583, నిఫ్టీ 18,888 పాయింట్లను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాలను సాధించాయి. కాగా.. సమీప కాలంలో దేశీ మార్కెట్లకు ఆర్బీఐ, ఫెడ్ నిర్ణయాలు మార్గనిర్దేశం చేయనున్నట్లు శామ్కో సెక్యూరిటీస్ నిపుణులు అపూర్వ షేత్, కొటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు అమోల్ అథవాలే, జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. -
Times Now Sumit 2022: ఉమ్మడి పౌరస్మృతికి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) తీసుకొచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. అయితే, అన్ని రకాల ప్రజాస్వామిర ప్రక్రియలను అనురించడంతోపాటు సంప్రదింపుల తర్వాతే తీసుకొస్తామని తేల్చిచెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కులతత్వం, వారసత్వం, బుజ్జగింపు వంటి జాడ్యాల నుంచి దేశ రాజకీయాలకు విముక్తి కలిగించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం పుట్టుక, కులం, ఇతరులను బుజ్జగించే తత్వం ఆధారంగా ఎన్నికల్లో నెగ్గే రోజులు పోయాయని స్పష్టం చేశారు. మతం ఆధారంగా చట్టాలా? బీజేపీ భారతీయ జనసంఘ్‌గా ఉన్నప్పటి నుంచే ఉమ్మడి పౌరస్మృతిపై దేశ ప్రజలకు హామీ ఇచ్చిందని అమిత్ షా గుర్తుచేశారు. బీజేపీ మాత్రమే కాదు రాజ్యాంగ సభ కూడా సరైన సమయంలో యూసీసీని తీసుకురావాలని పార్లమెంట్‌కు, రాష్ట్రాలకు సూచించిందని వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు అనేవి మతం ఆధారంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లేదా రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించిన ఒకే ఒక ఉమ్మడి చట్టం ఉండాలని చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో బీజేపీ తప్ప ఇతర పార్టీలేవీ ఉమ్మడి పౌరస్మృతి పట్ల అనుకూలంగా లేవని అమిత్ షా పేర్కొన్నారు. దానిపై కనీసం మాట్లాడడం లేదన్నారు. మాట్లాడే ధైర్యం లేకపోతే వ్యతిరేకించవద్దని హితవు పలికారు. ‘మీరు అమలు చేస్తే మేము మీ వెంటనే ఉంటాం’ అని కూడా ప్రతిపక్షాలు చెప్పడం లేదని ఆక్షేపించారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఆరోగ్యకరమైన, బహిరంగ చర్చ జరగాలని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అంటే.. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) గురించి భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించారు. ఈ పౌరస్మృతిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాల శాసన సభలకు కూడా ఉంది. ప్రస్తుతం గోవాలో యూసీసీ అమలవుతోంది. యూసీసీకి మరో అర్థం.. ఒకే దేశం, ఒకే చట్టం. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమానంగా వర్తించే ఒకే చట్టమే ఉమ్మడి పౌరస్మృతి. భారత్‌లో వేర్వేరు మతస్తులకు, జాతులకు వారి మతగ్రంథాలు, అందులోని బోధనల ఆధారంగా వేర్వేరు వ్యక్తిగత(పర్సనల్) చట్టాలు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు ఓ వర్గం పురుషులు ఒక్కరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. అందుకు వారి ‘పర్సనల్ లా’ అనుమతిస్తుంది. మరో మతంలో అలాంటి వివాహాలకు అనుమతి లేదు. ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో కొన్ని దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా వామపక్షాలు, ఇస్లామిక్ సంస్థలు, కొన్ని జాతులు, తెగలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
ప్రశాంతంగా ముగిసిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్
-
హిమాచల్‌లో పోలింగ్.. దృష్టి మాత్రం ‘కాంగ్రా’పైనే
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా పోలింగ్ జరుగుతోన్నా.. అందరి చూపు మాత్రం ఒక్క జిల్లాలో ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయన్నదానిపైనే ఉంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకమని ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితమయింది. అక్కడ పాగా వేస్తే అధికారం దాదాపు ఖరారైనట్టే. మూడు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. అందుకే ఈసారి పార్టీలు అదే రిపీట్ అవుతుందా..? అని వేచి చూస్తున్నాయి. ఈ జిల్లా చుట్టే బీజేపీ డబుల్ డ్రీమ్స్, కాంగ్రెస్ అగ్నిపథ్ స్కీమ్ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాంగ్రా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అత్యధిక సీట్లున్న జిల్లా కాంగ్రా. 15మంది ఎమ్మెల్యేలు శాసనసభకు నేతృత్వం వహిస్తున్నారు. 1993 నుంచీ కాంగ్రా జిల్లాలో అధిక సీట్లు గెల్చుకుంటున్న పార్టీయే రాష్ట్రంలో పగ్గాలు చేపడుతోంది. 15 సీట్లలో కనీసం 9 వచ్చినవారు హిమాచల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 11 సీట్లు గెల్చుకుంది. అగ్నిపథ్ బీజేపీకి అగ్ని పరీక్ష కాంగ్రా జిల్లాలో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువ. ఓబీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఏదో ఒకపార్టీ వైపు సూటిగా నిలవటం ఈ జిల్లా ప్రత్యేకత. ప్రధాని మోదీపై రాష్ట్రంలో ఆదరణ ఉన్నా.. స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా పెరిగిన ధరలు కమలదళాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కనిపిస్తోంది. సైన్యంలో ప్రవేశాలకు కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కూడా హిమాచల్ ఎన్నికల్లో ప్రధానాంశం అవుతోంది. కాంగ్రాతోపాటు పక్కనున్న హమీర్పుర్, ఉనా, మండి జిల్లాల నుంచి వేల సంఖ్యలో యువత సైన్యంలో చేరుతుంటారు. ఈ నాలుగు జిల్లాలు కలిపి మొత్తం 35 అసెంబ్లీ సీట్లున్నాయి. అగ్నిపథ్ స్కీమ్‌తో సైన్యంలో ప్రవేశం తగ్గిపోతుందనే ఆందోళన హిమాచల్ వాసులకు ఉంది. విపక్షాలకిది బలమైన అస్త్రంగా మారింది. పక్కలో తిరుగుబాటు బళ్లెం కాంగ్రాలోని 15 స్థానాలకు 91 మంది పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలకూ ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థులు సమస్యగా తయారయ్యారు. ఫతేపుర్, ధర్మశాల, ఇందోరా, కాంగ్రా, దెహ్రా స్థానాల్లో బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పిగా మారారు. పార్టీ అధ్యకుడు నడ్డా, అధిష్ఠానం ఎంతగా నచ్చజెప్పినా రెబెల్స్ వెనక్కి తగ్గలేదు. మొత్తానికి 1993 నుంచీ ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీకి అధిక సీట్లు ఇస్తూ వస్తోంది కాంగ్రా జిల్లా. అలాగే రాష్ట్రంలో అధికారం మారుతూ వస్తోంది. మరి ఈసారి కాంగ్రా ఎటువైపు మొగ్గుతుందో అని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్ పోలింగ్: ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా.. -
ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో స్పెషల్! ఎందుకంటే..
సిమ్లా: కాంగ్రెస్-బీజేపీలకు చెరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తున్న హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు.. ఈసారి ఎవరికి పట్టం కడతారనే చర్చ జోరుందుకుంది. శనివారం హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ నేపథ్యంలో.. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో.. ప్రధాని మోదీ, అమిత్ షా సహా కీలక నేతలంతా ఓటేయాలంటూ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ వేళ.. ఓ బూత్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. కేవలం 52 మంది ఓటర్ల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారక్కడ. అందుకు ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. తషిగ్యాంగ్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్ కేంద్రం. అందుకే ఎన్నికల సంఘం అక్కడ ప్రత్యేక దృష్టి సారించింది. లాహౌల్ & స్పితి పరిధిలోని తషిగ్యాంగ్‌లో దాదాపు 15, 256 ఫీట్ల ఎత్తులో ఉండే ఇక్కడ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. వృద్ధులకు, దివ్యాంగుల కోసం మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారిక్కడ. వందకు వంద శాతం ఓటింగ్ నమోదు చేయాలని భావిస్తున్నారు ఇక్కడ. Tashigang (Lahaul&Spiti ), has world’s highest polling station at 15,256 ft & 52 registered voters, is set to retain its record of 100% voter turnout in the Nov 12 assembly election. It has been made Model Polling station to make voting easy for senior citizens & disabled voters. pic.twitter.com/SJcw86Z3lL — CEO Himachal (@hpelection) November 12, 2022 ఇక హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 55 లక్షల ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,884 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. మొత్తం 412 మంది అభ్యర్థులు.. 68 నిజయోకవర్గాల్లో పోటీ పడుతున్నారు. ఒకవైపు తిరిగి అధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ, మరోవైపు మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీలో హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఇక ఈ మధ్యలో ఆప్ వచ్చి చేరింది. డిసెంబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. -
Himachal Elections 2022: హిమాచల్‌లో ముగిసిన పోలింగ్
Upadates హిమాచల్‌లో ముగిసిన పోలింగ్ - హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదు. ధర్మశాల, సిమ్లాలో ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎం, వీవీప్యాట్స్‌కు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8వ తేదీన వెలువడుతాయి. Voting in Himachal Pradesh Assembly elections concludes. EVMs and VVPATs being sealed and secured at polling booths in Dharamshala and Shimla Counting of votes on December 8 pic.twitter.com/PF2wWWhgtD — ANI (@ANI) November 12, 2022 02:00PM 1 గంట వరకు 37.19 శాతం ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు 37.19 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లకు ప్రియాంక సూచన.. హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధి, భవిష్యత్తు కోసం విచక్షణతో ఓటు వేయాలని సూచించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. మీ గురించి, మీ రాష్ట్ర పరిస్థితి గురించి మీకే పూర్తిగా తెలుసునని, పరిస్థితులను గమనించి బంగారు భవిష్యత్తు కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 11:45AM 11 గంటల వరకు 17.98 శాతం ఓటింగ్.. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 17.98 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 40-45 సీట్లు గెలుస్తాం: కాంగ్రెస్ సిమ్లాలోని రాంపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్. అభివృద్ధికి ఓటు వేయాలని సూచించారు. 68 స్థానాల్లో 40-45 సీట్లు గెలుస్తాని దీమా వ్యక్తం చేశారు. సిమ్లాలోని సైనిక్ రెస్ట్ హౌస్ లాంగ్వుడ్ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఆనంద్ శర్మ ఓటేసిన కేంద్ర మంత్రి.. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ థుమాల్, ఆయన కుమారు, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్లు తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.హమిర్పుర్లోని సమిర్పుర్ పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో సీఎం జైరాం ఠాకూర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమకే మళ్లీ అధికారం ఇస్తారని దీమా వ్యక్తం చేశారు అనురాగ్ ఠాకూర్. Former Himachal Pradesh CM Prem Kumar Dhumal, his son & Union Minister Anurag Thakur and their family cast their votes for #HimachalPradeshElections. Visuals from a polling station in Samirpur, Hamirpur. pic.twitter.com/D0vgw0ncxY — ANI (@ANI) November 12, 2022 10:30AM 5.02 శాతం ఓటింగ్ ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.02శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా సిర్మౌర్‌లో 6.26 శాతం, లాహౌల్‌లో అత్యల్పంగా 1.56శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొంది. 9:30AM ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలి: పీఎం మోదీ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన క్రమంలో ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. కొత్తగా ఓటు హక్కు సాధించిన యువ ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. हिमाचल प्रदेश की सभी विधानसभा सीटों के लिए आज मतदान का दिन है। देवभूमि के समस्त मतदाताओं से मेरा निवेदन है कि वे लोकतंत्र के इस उत्सव में पूरे उत्साह के साथ भाग लें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट देने वाले राज्य के सभी युवाओं को मेरी विशेष शुभकामनाएं। — Narendra Modi (@narendramodi) November 12, 2022 ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జైరాం ఠాకూర్ కుటుంబం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఆయన కుటుంబంతో కలిసి వచ్చి సెరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండీలోని పోలింగ్ స్టేషన్ 44లో ఓటు వేశారు. ఈ సందర్భంగా తాము ఎంతో ఉత్సాంగా ఉన్నామని, మండీ ఎప్పుడూ సీఎం జైరాం ఠాకూర్‌కు మద్దతుగా ఉంటుందన్నారు ఆయన కూతురు చంద్రికా ఠాకూర్. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గమనించిన ప్రజలను మళ్లీ ఆ పార్టీకే ఓటు వేస్తారని దీమా వ్యక్తం చేశారు. 8:00AM హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం డబుల్ ఇంజన్ నినాదం, ప్రధాని మోదీ చరిష్మాతో చరిత్ర సృష్టించాలని బీజేపీ.. అధికార వ్యతిరేకత, ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చే దశాబ్దాల సంప్రదాయం కొనసాగుతుందన్న విశ్వాసంతో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. తొలిసారి బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి శనివారం జరిగే ఎన్నికల్లో 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు. సీఎం జైరామ్ ఠాకూర్, దివంగత సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థుల్లో 82 శాతం, కాంగ్రెస్ అభ్యర్థుల్లో 90 శాతం కోటీశ్వరులే! మంచులో నడుస్తూ... మొత్తం 7,884 పోలింగ్ కేంద్రాల్లో 397 కేంద్రాలు మంచుతో నిండి అత్యంత సంక్లిష్టంగా ఉంటాయి. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో కాజాలోని తషిగాంగ్ పోలింగ్ బూత్ దేశంలోనే అత్యంత ఎత్తులో ఉండే పోలింగ్ కేంద్రం. నువ్వా, నేనా? బీజేపీ తరఫున ప్రచారాన్ని ప్రధాని మోదీ తానే ముందుండి నడిపించారు. ఆఖరి నిముషంలో ఓటర్లకు బహిరంగంగా లేఖ రాసి కమలం గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రచార భారమంతా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాపైనే పడింది. గత రెండేళ్లలో తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ హిమాచల్‌లోనైనా గెలిచి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరసగా రెండోసారి గెలిచిన పార్టీగా చరిత్ర సృష్టిస్తుంది. ఈ విజయం వచ్చే ఏడాది హిందీ బెల్ట్‌లో జరిగే అత్యంత కీలకమైన తొమ్మిది రాష్ట్రాల గెలుపు అవకాశాలను పెంచుతుందన్న భావనలో పార్టీ ఉంది. -
Himachal Pradesh: కేజ్రీవాల్ ఎంట్రీతో మారిన సీన్.. చీల్చేదెవరు? గెలిచేదెవరు?
మంచుకొండల్లో ఎన్నికల వేడి రాజుకుంది. కేజ్రీవాల్ ఎంట్రీతో హిల్ స్టేట్‌లో ఎలక్షన్ ఫైట్ రసవత్తరంగా మారింది. ఓట్ల వేటలో హోరాహోరీ తలపడుతున్నాయి మూడు ప్రధాన పార్టీలు. హోరాహోరీ ప్రచారాలు, అగ్రనేతల పర్యటనలు, భారీ హామీలు, అసంతృప్తి సెగలు.. హిమాచల్ ప్రదేశ్‌లో ఎలక్షన్ హీట్ పీక్కు చేరింది. డబుల్ ఇంజిన్ భరోసాతో బీజేపీ, ఆనవాయితీపై ఆశలతో కాంగ్రెస్.. మార్పు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రజల్లోకి వెళుతున్నాయి. పప్పులు ఉడకవిక్కడ.! హిమాచల్ స్వింగ్ స్టేట్. 1985 నుంచి వరుసగా రెండోసారి ఒకే పార్టీకి అధికారం దక్కిన దాఖలాలు లేవు. ఈ సంప్రదాయాన్ని బద్దలుకొట్టి .. 2017 ఫలితాలు రిపీట్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది భారతీయ జనతా పార్టీ. 2021లో హిమాచల్ ప్రదేశ్‌లో ఒక లోక్‌సభ, 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో బీజేపీ గేరు మార్చింది. హిమాలయ రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వరుస పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రియాంక ప్రయత్నాలు ప్రభుత్వ వ్యతిరేకత, 3 దశాబ్దాల ఆనవాయితీని బలంగా నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ. జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బగేల్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను లేవనెత్తుతున్నారు. పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే.. దిగ్గజ నేత వీరభద్రసింగ్ మరణం.. కాంగ్రెస్‌కు పెద్దలోటుగా మారింది. శక్తివంతమైన నేత లేకపోవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయి. పెద్దసంఖ్యలో నేతలు కమలం గూటికి చేరిపోయారు. సీఎం కుర్చీ కోసం పోటీపడుతున్న నేతలు.. కాంగ్రెస్ విజయంపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చీపురు తెచ్చిన త్రిముఖం సంప్రదాయంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు అంటే బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో సమీకరణాలు మారాయి. అనూహ్యంగా సత్యేంద్ర జైన్ జైలుపాలవడంతో.. ఆప్ ప్రచార జోరు తగ్గింది. కేజ్రీవాల్, సిసోడియా, రాఘవ్ చద్దా లాంటి నేతలు గుజరాత్‌పై ఫోకస్ పెట్టారు. 67స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినా.. హిమాచల్‌లో ఆప్ పెద్దగా ప్రభావం చూపే ఛాన్స్ లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కేజ్రీవాల్ పార్టీ చీల్చిన ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయనేదే అసలు సవాల్. హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ ఎవరికి షాక్ ఇస్తుందో తెలియాలంటే.. డిసెంబర్ 8 వరకూ ఆగాల్సిందే. -
‘పాత పింఛను’ హామీ ఎన్నికల స్టంట్ కాదు
సిర్మౌర్: పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ హామీ ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపై ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. తమ హామీ ఎన్నికల స్టంట్ కాదన్నారు. బడా పారిశ్రామిక వేత్తలు తీసుకున్న వేల కోట్ల రుణాలను రద్దు చేయడంపై ముందుగా సమాధానం చెప్పాలని కాషాయ పార్టీని ఆమె ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో చివరిరోజైన గురువారం ప్రియాంక హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వలేదంటూ ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రియాంక కొట్టిపారేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలను అస్థిర పరుస్తున్నదెవరు?అని ఆమె బీజేపీని నిలదీశారు. రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుగ్యోగ యువత ఉండగా ఖాళీగా ఉన్న 63 వేల ప్రభుత్వ ఉద్యోగాలను బీజేపీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు లక్ష ఉద్యోగాలను కల్పించడంతోపాటు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తుందని ప్రియాంకా గాంధీ ప్రకటించారు. బీజేపీ హామీలను నమ్మవద్దని చెప్పారు. ధరల తగ్గింపు గురించి, ఉద్యోగ ఖాళీల గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడటం లేదని వివరించారు. ఇదీ చదవండి: నిర్మలా సీతారామన్‌తో కాంగ్రెస్ కార్యకర్తల సెల్ఫీలు -
హాట్ టాపిక్‌గా నిర్మలా సీతారామన్ సెల్ఫీ
షిమ్లా: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పెషల్ సెల్ఫీ దిగారు. అదీ తన కాన్వాయ్‌ను ఆపి మరి!. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గురువారం(నవంబర్ 10)తో ఎన్నికల ప్రచారం ముగిసిన సంగతి తెలిసిందే. ఆఖరిరోజు కీలక నేతల ప్రచారంతో ఆ రాష్ట్రంలో హడావిడి నెలకొంది. ఈ క్రమంలో.. షిమ్లాలో నిర్వహించిన రోడ్‌షోలో బీజేపీ నేత నిర్మలా సీతారామన్ ఉల్లాసంగా పాల్గొన్నారు. అయితే.. కార్యక్రమం కోసం వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆమెకు తారసపడ్డారు. అప్పటికే వాళ్లంతా ప్రియాంక గాంధీ వాద్రా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను చూసి చేతులు, తమ మెడలోని కండువాలు ఊపారట. అది గమనించిన సీతారామన్ కాన్వాయ్‌ను ఆపించి.. వాళ్ల దగ్గరకు వెళ్లారు. వాళ్లతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడి.. వాళ్ల కోరిక మేరకు సెల్ఫీలు కూడా దిగారు. ఈ విషయాన్ని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ కరణ్ నందా తెలియజేశారు. ఆ కాసేపటికే మాల్ రోడ్లో మధ్యాహ్నాం నిర్వహించిన జన్ సంపర్క్ ప్రచారంలో ప్రియాంక గాంధీ కార్యక్రమానికి ఆ కార్యకర్తలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. సీతారామన్‌తో సెల్ఫీలు దిగడంపై కాంగ్రెస్ గుస్సాగా ఉంది. అలా చేయడంపై కార్యకర్తలను షిమ్లా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్ వివరణ కోరారు. సీతారామన్ మహిళలను తలెత్తుకునేలా చేశారని, అందుకే ఆమెతో సెల్ఫీలు దిగామని ఆ కార్యకర్తల ప్రతినిధి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చర్యపై పార్టీపరమైన చర్యలుంటాయా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
కాంగ్రెస్ పాలన స్కాములమయం
సులాహ్: హిమాచల్‌ప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. విశ్వసనీయత లేని వారి హామీలను ప్రజలను నమ్మరంటూ కాంగ్రెస్ ప్రకటించిన 10 హామీలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన గురువారం కంగ్రా జిల్లా సులాహ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్న కుంభకోణాలు లెక్కకు మిక్కిలి ఉండగా, బీజేపీ హయాంలో 2014 నుంచి ఒక్క స్కాము కూడా కనిపించదని చెప్పారు. 2004–14 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో రూ.12 లక్షల కోట్ల మేర కుంభకోణాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ వంటి పార్టీలిచ్చే ఎన్నికల హామీలను హిమాచల్ ప్రజలు నమ్మరని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం జైరాం ఠాకూర్లు కలిసి హిమాచల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. -
మీరేసే ప్రతి ఓటు నా బలాన్ని పెంచుతుంది
సిమ్లా: బీజేపీని మరోసారి గెలిపించి, చరిత్ర తిరగరాయాలని ప్రధాని మోదీ హిమాచల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కమలం గుర్తుకు వేసే ప్రతి ఓటు తన ధైర్యాన్ని ఇనుమడింపజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ మేరకు ప్రధాని ఫొటో, సంతకంతో కూడిన లేఖను బీజేపీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి అందిస్తున్నాయి. ‘గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా మీరు బీజేపీనే ఆశీర్వదిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. కమలం గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటుతో నా బలం పెరుగుతుంది’ అని హిందీలో రాసిన ఆ లేఖలో ఉంది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సరిహద్దు ప్రాంతాలు సహా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేశాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి గమనం ముందుకు సాగించాలని ఓటర్లను ప్రధాని కోరారు. ఈ సందేశాన్ని వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు అందేలా చేస్తామని బీజేపీ నేత సంజయ్ టాండన్ చెప్పారు. -
ఆ కులాల ఓటే శాసనం
రెండు పార్టీలు, రెండు కుటుంబాలు, రెండు కులాలు.. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు ఈ రెండు కులాలే హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. రాజ్పుట్లు కింగ్‌లుగా అవతరిస్తే, బ్రాహ్మణులు కింగ్మేకర్లుగా తమ సత్తా చాటుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతం, కులం అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. రాజ్పుట్లు, బ్రాహ్మణులు రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన 55 ఏళ్లలో ఐదుగురు ముఖ్యమంత్రులు రాజ్పుట్లైతే, ఒకే ఒక్క బ్రాహ్మిణ్ సీఎంగా శాంతకుమార్ రికార్డు సృష్టించారు. 1993–2017కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరభద్రసింగ్ , బీజేపీకి చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ కుటుంబాలే రాజకీయాల్లో చట్రం తిప్పాయి. వీరు రాజ్పుట్ కుటుంబానికి చెందిన నాయకులే. బీజేపీకి చెందిన బ్రాహ్మణుడైన శాంతకుమార్ రెండు సార్లు రాష్ట్ర సీఎంగా సేవలందించడంతో ప్రధానంగా ఈ రెండు కులాలే రాజకీయాలపై ఆధిక్యత ప్రదర్శించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్పుట్గా ఉంటే, పార్టీలో సంస్థాగత వ్యవహారాలు చూసే వ్యక్తి బ్రాహ్మిణ్‌గా ఉండడం ఇక్కడ రివాజుగా మారింది. 50% జనాభా ఆ రెండు కులాలే రాష్ట జనాభాలో రాజ్పుట్లు 32% ఉంటే, ఆ తర్వాత ఎస్సీలు 25% అధికంగా ఉన్నారు. ఇక బ్రాహ్మణులు 18%తో మూడో స్థానంలో ఉన్నారు. రాజ్పుట్లు, బ్రాహ్మణులు కలిపి జనాభాలో 50% వరకూ ఉండడంతో రాజకీయాలను వారే శాసిస్తున్నారు. రాజ్‌పుట్‌లో ఒక్కోసారి ఒక్కో పార్టీకి అండగా ఉంటూ ఉంటే బ్రాహ్మణులు ఎప్పుడూ బీజేపీవైపే నిలిచారు. ఇక ఎస్సీలలో ప్రజాకర్షణ కలిగిన నాయకుడు లేకపోవడంతో వారు బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఊగిసలాడుతూ ఉంటారని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అయిదుగురు వైఎస్ పర్మార్, ఠాకూర్ రామ్ లాల్, వీరభద్ర సింగ్, ప్రేమ్‌కుమార్ ధుమాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ రాజ్పుట్లు కాగా రెండు సార్లు సీఎంగా చేసిన శాంత కుమార్ ఒక్కరే బ్రాహ్మిణ్‌గా ఉన్నారు. తొలిసారిగా హిమాచల్ బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ దిగువ హిమాచల్ ప్రాంతంలో ఉండే పంజాబీ ఓట్లను కొల్లగొట్టడానికి చూస్తోంది. వీరంతా వ్యాపారంలోనే ఉన్నారు. బీసీ, ఎస్టీలపై బీజేపీ వల రాష్ట్రంలో అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఎదురొడ్డి వరసగా రెండోసారి నెగ్గాలని వ్యూహాలు పన్నుతున్న బీజేపీ ఎస్సీలు, ఓబీసీల ఓట్లు కొల్లగొట్టడానికి వ్యూహాలు పన్నుతోంది. రాష్ట్రంలోని హాతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదాను కల్పించే బిల్లును కూడా ఆమోదించింది. గత 50 ఏళ్లుగా హాతీలు ఎస్టీ హోదాల కోసం డిమాండ్ చేస్తున్నారు. సిర్మార్ గిరి ప్రాంతంలోని హాతీలకు ఎస్టీ హోదాను కల్పిస్తూ సెప్టెంబర్ 14న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 1.6 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రద్దు సమయంలో ఈ ప్రాంతంలోనే దళితులు అత్యధికులు నిరసనలు చేపట్టారు. వారిలో అసంతృప్తిని చల్లార్చడానికి హాతీలకు ఎస్టీ హోదా కల్పిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ సారి బీజేపీ రాజ్‌పుట్‌లకు ఇచ్చే టికెట్లను కాస్త తగ్గించి ఇతర కులాల వైపు మొగ్గు చూపించింది. కాంగ్రెస్ పార్టీ నలుగురు ఓబీసీలకు టికెట్లు ఇస్తే, బీజేపీ ఆరుగురుని నిలబెట్టింది. అందులోనూ ఓబీసీల్లో ప్రాబల్యమున్న ఘిర్త్ వర్గానికి టికెట్లు ఇచ్చింది. ఇక ఎస్టీల నాన్ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా ముగ్గురు ఎస్టీలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రాజ్పుట్లు, బ్రాహ్మణుల్ని నిలబెట్టిన నాలుగు నియోజకవర్గాల్లో ఓబీసీ నాయకులకు టికెట్లు ఇచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొండంత సమస్యలు.. గోరంత హామీలు
హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాలు చిన్నవి. సమస్యలు మాత్రం చాలా పెద్దవి. అధికార బీజేపీకి ఈ సమస్యలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా అయిదేళ్లకొకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న హిమాచల్ ప్రదేశ్ ఓటరు ఈ సారి ఎటువైపు మొగ్గు చూపుతారా అన్న ఆందోళన నెలకొంది. అయిదు అంశాలు ఈ సారి ఎన్నికల్లో అత్యధికంగా ప్రభావాన్ని చూపించబోతున్నాయి. సమస్యలివీ... నిరుద్యోగం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య దారుణంగా ఉంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగం రేటు 7.6% ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో 8.6 నుంచి 9.2 శాతం వరకు ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత 15 లక్షల మంది వరకు ఉంటే, వారిలో 8.77 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లో పేర్లు నమోదు చేసుకున్నారు. యాపిల్ రైతుల దుస్థితి దేశంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక యాపిల్ ఉత్పత్తిలో 26% వాటా హిమాచల్‌దే. గిట్టుబాటు ధర లేక రైతులు నిరసన బాట పట్టారు. సాగు ఖర్చు పెరగడం, వాతావరణ మార్పులు కుంగదీస్తున్నాయి. దీనికి తోడు యాపిల్స్‌ను రవాణ కోసం వాడే కార్టన్లపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచడం రైతుపై మరింత భారాన్ని పెంచింది రోడ్డు కనెక్టివిటీ కొండ ప్రాంతం కావడంతో రాష్ట్రంలో ఏకంగా 39% గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు! ఇవన్నీ అటవీ ప్రాంతంలోని గ్రామాలు కావడంతో రోడ్లు నిర్మించాలంటే సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి. ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేక వీరంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,125 కి.మీ. రోడ్ల పునరుద్ధరణకు బీజేపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. అగ్నిపథ్ త్రివిధ బలగాల్లో కాంట్రాక్ట్ నియామకానికి కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం మంచుకొండల్లో మంటలు రాజేసింది. 70 లక్షల హిమాచల్ జనాభాలో ఏకంగా 10 శాతం పని చేస్తున్న, లేదా రిటైర్డ్ సైనికులే ఉన్నారు. ఎందరో యువకులు సైన్యంలో చేరాలని ఆశతో శిక్షణ పొందుతున్న సమయంలో బీజేపీ తెచ్చిన పథకం వారిని నిరాశలో ముంచింది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా ఎన్నికల్లో అత్యంత ప్రభావిత అంశంగా మారింది. 2004లో నాటి బీజేపీ ప్రభుత్వం దీన్ని నిలిపివేసింది. పాత పెన్షన్ పథకం ప్రకారం ఉద్యోగులు ఆఖరిగా తీసుకున్న జీతంలో 50 శాతం పెన్షన్‌గా ఇస్తారు. కొత్త స్కీమ్‌లో ఉద్యోగుల జీతం నుంచి 10%, ప్రభుత్వ వాటాగా 14% ఇస్తారు. కాంగ్రెస్, ఆప్ పాత పథకం తెస్తామంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంబులెన్స్‌కు దారి.. నిలిచిపోయిన ప్రధాని మోదీ కాన్వాయ్
సాక్షి, న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతోంది. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ, పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో బుధవారం పర్యటించారు. ఈక్రమంలో అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు ఆయన కాన్వాయ్ కొద్దిసేపు నిలిచిపోయింది. అక్కడ ప్రజలు పోగై ప్రధాని మోదీకి చేతులు ఊపుతూ అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంబులెన్స్‌కు లైన్ క్లియర్ చేసిన తర్వాత కాన్వాయ్ తిరిగి కదిలింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ప్రధానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గత నెలలో అహ్మదాబాద్ నుంచి గాంధీ నగర్ వెళ్తుండగా ఓ అంబులెన్స్‌కు ఆయన కాన్వాయ్ దారి ఇచ్చింది. (చదవండి: క్షమించండి అంటూ నితిన్ సంచలన వ్యాఖ్యలు... షాక్‌లో బీజేపీ) కాంగ్రెస్ అభివృద్ధి వ్యతిరేకి హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధిక అసెంబ్లీ స్ధానాలున్న కాంగ్రా జిల్లాలో మోదీ పర్యటించారు. చాంబీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... రాష్ట్రానికి బలమైన, స్థిరమైన డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని అన్నారు. అస్థిరత్వం, అవినీతి, స్కామ్‌ల మయమైన పార్టీలు ఎందుకని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. సుపరిపాలన అందించేవారికి ప్రజలెప్పుడూ పట్టం కడతారని ఆకాక్షించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాకూడా కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్‌ను పట్టించుకోలేదని అన్నారు. వారు అభివృద్ధికి వ్యతిరేకులు అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 12న జరుగనున్నాయి. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. (చదవండి: మోదీతో 25 ఏళ్ల పరిచయం.. అయినా వెనక్కి తగ్గను) -
మోదీతో 25 ఏళ్ల పరిచయం.. అయినా వెనక్కి తగ్గను
సిమ్లా: ప్రధాని స్వయంగా ఫోన్ చేసినా వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు బీజేపీ మాజీ ఎంపీ కృపాల్ పర్మార్. హిమచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫతేపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. గతేడాది జరిగిన ఫతేపూర్ ఉప ఎన్నికలో తనకు అవకాశం ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజా ఎన్నికల్లోనూ మొండిచేయి చూపడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ‘నేను పోటీలో ఉన్నాను. బీజేపీ అధికారిక అభ్యర్థిని కాదు. ఇది నాకు, కాంగ్రెస్ అభ్యర్థికి మధ్య జరుగుతున్న పోటీ’ అని వ్యాఖ్యానించారు. తనకు టికెట్ రాకపోవడానికి పాఠశాలలో తనతో కలిసి చదువుకున్న ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కారణమని పర్మార్ ఆరోపించారు. 15 ఏళ్లుగా తనను నడ్డా అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పినట్టు వెల్లడించారు. పర్మార్‌తో ఫోన్లో మోదీ మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ అయింది. ఈ ఫోన్ కాల్‌ను బీజేపీ, ప్రధాని కార్యాలయం ధ్రువీకరించలేదు. అక్టోబర్ 30న తనకు ప్రధాని మోదీ ఫోన్ చేశారని కృపాల్ పర్మార్ వెల్లడించారు. ‘మోదీతో 25 ఏళ్లుగా పరిచయం ఉంది. హిమచల్‌ప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా ఆయన ఉన్నప్పుడు, నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మేమిద్దరం కలిసి రాష్ట్రమంతా పర్యటించాం. ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మోదీని నేను దేవుడిగా భావిస్తాను. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నానని ఆయనతో చెప్పాను. ఒక్కరోజు ముందుగా ఫోన్ చేసినా పోటీ నుంచి తప్పుకునే వాడినని ఆయనతో చెప్పాన’ని 63 ఏళ్ల పర్మార్ వివరించారు. 68 స్థానాలున్న హిమచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. దాదాపు 30 మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. (క్లిక్: అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం.. హామీల వర్షం కురిపిస్తున్న పార్టీలు) -
కాంగ్రెస్ ఖతం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
సిమ్లా: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఖతం అయిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కంచుకోటల్లా భావించిన రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీని తిరస్కరిస్తున్నారన్నారు. బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని హామిర్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణ, ఒడిశా, యూపీలో కాంగ్రెస్ సాఫ్ అయిపోయిందన్నారు. దేవుళ్లలాంటి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని అందుకే తగిన బుద్ది చెపుతున్నారన్నారు. ఇదిలా ఉంటే, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మహిళా ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. అధికార బీజేపీ మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యేక మేనిఫెస్టో స్త్రీ సంకల్ప పత్ర విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు పెళ్లయ్యే సమయంలో రూ.51 వేల ఆర్థిక సాయం, ప్రాథమిక విద్య అభ్యసించే బాలికలకు ఉచిత సైకిళ్లు, ఉన్నత విద్య అమ్మాయిలకు స్కూటీలు, మహిళా సాధికారత సాధించడానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, ఆశావర్కర్ల జీతం రూ.4,700కి పెంపు వంటి హామీలు గుప్పించింది. చదవండి: (క్షమించండి అంటూ నితిన్ సంచలన వ్యాఖ్యలు... షాక్‌లో బీజేపీ) కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం కింద 1.36 లక్షల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, రాష్ట్రస్థాయిలో గ్రామీణ సువిధ యోజన కింద 3.24 లక్షల గ్యాస్ కనెక్షన్ల పంపిణీతో మహిళలు పొగ ముప్పు నుంచి విముక్తి చెందారని, తొలి స్మోక్ ఫ్రీ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచిందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 18 ఏళ్ల వయసు పైబడిన మహిళలందరికీ హర్ ఘర్ లక్ష్మి నారి సమ్మాన్ నిధి పథకం కింద నెలకి రూ.1500 ఇస్తామని ప్రకటించింది. ‘‘ఉన్నత విద్య అభ్యసించలేని యువతులు కానివ్వండి, సింగిల్ మదర్లు, వితంతువులు ఇలా అవసరం ఉన్న మహిళలందరికీ రూ.1500 బ్యాంకులో పడతాయి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుంది’’ అని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఆశాకుమారి చెప్పారు. అంతకు ముందే ఆప్ తాము అధికారంలోకి వస్తే నెలకి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. -
‘డబుల్ ఇంజన్’కు అగ్నిపరీక్ష
సాధారణంగా ప్రశాంతంగా సాగే హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి మాత్రం అక్షరాలా యుద్ధాన్నే తలపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీ ‘డబుల్ ఇంజన్’ నినాదానికి అగ్నిపరీక్షగా మారాయి. అంతేగాక బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌లోని ముఖ్య నేతల ప్రతిష్టకూ సవాలుగా పరిణమించాయి. మోదీ కరిష్మాతో అధికారం నిలబెట్టుకుంటామని కమలనాథులు ఆశిస్తుండగా ప్రభుత్వ వ్యతిరేకతే గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. 1985 నుంచి రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టని రివాజు ఈసారీ కొనసాగుతుందని ఆశిస్తోంది. మూడో పార్టీగా ఆప్ ఉనికి పోటీని మరింత సంక్లిష్టంగా మార్చేసింది. అన్ని పార్టీలూ హోరాహోరీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ రెండుసార్లే ప్రచారం చేసినా రాష్ట్రమంతా కలియదిరిగారు. రాహుల్‌గాంధీ కూడా భారత్ జోడో యాత్రకు బ్రేకి చ్చి ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉద్యోగుల్లోనూ అసంతృప్తి మోదీ వ్యక్తిగత ఆకర్షణకు తిరుగు లేకపోయినా కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వముంటే డబుల్ ఇంజన్ ప్రగతి సాధ్యమన్న బీజేపీ మాటలను హిమాచల్ జనాలు ఎంతవరకు నమ్ముతున్నారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. దీన్ని రాష్ట్ర ప్రజలు పెద్దగా నమ్మడం లేదని హిమాచల్‌కు చెందిన శశికుమార్ అనే రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడుతున్నారు. ధరల పెరుగుదల మొదలుకుని ఏ సమస్యకూ గత ఐదేళ్లలో పరిష్కారం దొరికింది లేదన్నది వారి ఆరోపణగా ఉంది. దీనికి తోడు పాత పెన్షన్ స్కీం కోసం రెండు లక్షలకు పైగా ప్రభుత్వోద్యోగులు చేస్తున్న డిమాండ్ కూడా బీజేపీకి కాస్త ప్రతికూలమేనంటున్నారు. దీన్ని తనకు అనువుగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రెబెల్స్‌ను కట్టడి చేయడంలో కమలనాథులు విఫలమవుతున్న తీరు విశ్లేషకులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏకంగా 24కు పైగా సీట్లలో వాళ్లు స్వతంత్రులుగా బరిలో దిగుతున్నారు. ఇది కూడా బీజేపీ విజయావకాశాలను బాగా దెబ్బ కొడుతుందన్నది కాంగ్రెస్ ఆశ. తమకు రెబెల్స్ బెడద మరీ అంతగా లేకపోవడం మరింత కలిసొచ్చే అంశమని పార్టీ నమ్ముతోంది. కాకలు తీరిన నాయకుడు వీరభద్రసింగ్ గత ఏడాది మరణించాక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త బలహీనంగానే మారింది. సీఎం పోస్టుకు కనీసం అర డజను మంది పోటీదారులు ఉండటంతో ఇంటి పోరు నానాటికీ పెరిగిపోతోంది. ఆప్ కూడా రంగంలో ఉన్నా ప్రధానంగా రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకే పరిమితమయ్యేలా కన్పిస్తోంది. అయితే గత ఎన్నికల్లో నోటాకు గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఏకంగా 12 స్థానాల్లో నోటాదే మూడో స్థానం! ఈ ఓట్లన్నీ ఈసారి ఆప్ ఖాతాలోకి వెళ్లే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ పోటీ బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం. కింగ్‌మేకర్ కాంగ్రా: కాంగ్రా జిల్లా మరోసారి కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం కన్పిస్తోంది. 1993 నుంచి ఈ జిల్లాలో అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీయే అధికారం చేజిక్కించుకుంటూ వస్తోంది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లలో 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ 10 సీట్లు, 2017 ఎన్నికల్లో బీజేపీ 11 గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ‘‘రెండు పార్టీలకూ ఇక్కడ అటూ ఇటుగా 40 శాతం చొప్పున ఓటు బ్యాంకుంది. 3 నుంచి 5 శాతం ఓట్లరు మాత్రమే ఒక్కోసారి ఒక్కో పార్టీకి ఓటేస్తూ కీలకంగా మారుతున్నారు’’ అని హిమాచల్ వర్సిటీలో పొలిటికల్ ప్రొఫెసర్ హరీశ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. కాంగ్రాలో కులం చాలా ప్రభావం చూపుతుందన్నారాయన. మిగతా రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడా రాజ్‌పుత్‌లదే ప్రాబల్యం. జిల్లా జనాభాలో వారు 34 శాతముంటారు. 32 శాతమున్న ఓబీసీలు, 20 శాతమున్న బ్రాహ్మణులు కూడా ప్రభావం చూపుతారు. గద్దీ తదితర పర్వత ప్రాంతీయులది 14 శాతం వాటా. దాంతో బీజేపీ, కాంగ్రెస్ రెండూ రాజ్‌పుత్, గద్దీ నేతలకు ఎక్కువ టికెట్లిచ్చాయి. బీజేపీ ప్రభుత్వ పనితీరుపై మెజారిటీ ప్రజలు పెదవి విరుస్తుండటం కలవరపెడుతోంది. ధరల పెరుగుదలపై జనంలో ఆగ్రహం ఉంది. అందుకే అభ్యర్థిని కాకుండా తనను చూసి ఓటేయాలని ప్రధాని ప్రచార సభల్లోనూ విజ్ఞప్తి చేస్తున్నారు. స్వతంత్రులే కీలకం? ఈసారి 20కి పైగా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆరుగురు స్వతంత్రులు నెగ్గారు. ఈసారి ఈ సంఖ్య బాగా పెరిగేలా కన్పిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే చివరికి స్వతంత్రులే ప్రభుత్వ ఏర్పాటును శాసించే శక్తిగా అవతరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం విన్పిస్తోంది. ఎన్నికల అంశంగా అగ్నిపథ్ రాష్ట్రంలో సగం అసెంబ్లీ సీట్లున్న కాంగ్రా, హమీర్పూర్, ఉనా, మండీ జిల్లాల్లో అగ్నిపథ్ పథకం పెద్ద ఎన్నికల అంశంగా మారింది. ఎందుకంటే ఈ నాలుగు జిల్లాల్లో ఏకంగా 1.3 లక్షల మంది మాజీ, 40 వేల మంది సర్వీసులో ఉన్న సైనికులున్నారు! అంటే ప్రతి మూడిళ్లకు ఒకరన్నమాట!! ఈ జిల్లాలకు ప్రధాన ఉపాధి వనరు సైన్యమే. ఈ నాలుగు జిల్లాల నుంచి ఏటా కనీసం 4 వేల మంది యువకులు సైన్యంలో చేరుతుంటారు. అగ్నిపథ్ రాకతో రెజిమెంట్‌వారీ భర్తీ విధానం రద్దవడంతో రాష్ట్రం నుంచి నియామకాలు మూడో వంతు తగ్గనున్నాయి. ఇది కచ్చితంగా బీజేపీకి వ్యతిరేకమవుతుందని కాంగ్రాకు చెందిన మేజర్ జనరల్ (రిటైర్డ్) రాణా అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Himachal Pradesh Assembly elections 2022: రెబెల్ సవాల్
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబెల్స్ బెడద అతి పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో నియోజకవర్గాలు చిన్నవి. గెలుపు మార్జిన్లు కూడా తక్కువే. దీంతో ప్రతీ ఓటు కీలకమే. అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీల గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలో రెబెల్స్ ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్‌లు రెబెల్స్‌ను ఎదుర్కోవడానికి తమ సర్వశక్తుల్ని ధారపోయాల్సి వస్తోంది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో చాలా స్థానాల్లో రెబెల్ అభ్యర్థుల్ని బుజ్జగించి నామినేషన్ వెనక్కి తీసుకోవడానికి రెండు పార్టీల అగ్రనాయకత్వం చాలా కృషి చేసింది. మాట వినని కొందరు నాయకుల్ని పార్టీ నుంచి బహిష్కరించింది. అయినప్పటికీ చాలా స్థానాల్లో రెబెల్స్ తమ ప్రతాపాన్ని చూపిస్తామని సవాల్ చేస్తున్నారు. ఇరు పార్టీలకూ డేంజర్‌బెల్స్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు అక్టోబర్ 29న ముగిసిన తర్వాత కాంగ్రెస్‌కు 12 స్థానాల్లోనూ, బీజేపీకి 20 స్థానాల్లోనూ రెబెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. పచ్చడ్, అన్ని, థియోగ్, సులాహ్, చౌపల్, హమీర్పూర్, అర్కి స్థానాల్లో కాంగ్రెస్‌కు రెబెల్స్ ముప్పు పొంచి ఉంటే, బీజేపీకి మండి, బిలాస్పూర్, కాంగ్రా, ధర్మశాల, ఝాండూటా, చంబా, డెహ్రా, కులు, నలగఢ్, ఫతేపూర్, కిన్నూర్, అన్ని , సుందర్‌నగర్, నచన్, ఇండోరాలో రెబెల్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ► అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన గంగూరామ్ ముసాఫిర్ పచ్చడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దయాల్ ప్యారీపై పోటీ పడుతూ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి ► థేగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు రెబెల్ నాయకులు విజయ్ పాల్ ఖాచి, ఇందు వర్మ కంటి అధికారిక అభ్యర్థి కుల్ దీప్ సింగ్ రాథోడ్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ► హమీర్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కి ఆశిష్ శర్మ, బీజేపీకి నరేష్ దార్జి తిరుగుబాటు అభ్యర్థులు గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ► కాంగ్రెస్ పార్టీ దివంగత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సొంత నియోజకవర్గం అర్కిలో ఆయనకు అత్యంత సన్నిహితుడైన రాజేందర్ ఠాకూర్‌కు టిక్కెట్ నిరాకరించడంతో ఆయన రెబెల్‌గా పోటీ పడుతున్నారు. ► బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించిన మాజీ ఎమ్మెల్యే తేజ్వంత్ సింగ్ నేగి (కిన్నూర్), మనోహర్ ధిమన్ (ఇండోరా), కిశోర్ లాల్ (అన్ని), ఎల్ ఠాకూర్ (నలగఢ్), కృపాల్ పర్మార్ (ఫతేపర్) ఇప్పుడు రెబెల్ అభ్యర్థుగా మారి ఎన్నికల్ని హీటెక్కిస్తున్నారు. ► కులులో రాచ కుటుంబానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ సింగ్ కుమారుడు, హితేశ్వర్ సింగ్ రెబెల్ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. 5% ఓట్లు రెబెల్స్కే..! గత కొద్ది ఏళ్లుగా ఎన్నికల ఫలితాల తీరు తెన్నుల్ని పరిశీలిస్తే గెలిచిన పార్టీకి, ఓడిపోయిన పార్టీకి మధ్య 5% ఓటింగ్ తేడా కనిపిస్తుంది. దీనికి రెబెల్స్ ప్రధాన కారణం. పార్టీ గెలుపోటములను తమ గుప్పిట్లోకి తీసుకొని శాసించే స్థాయిలో రెబెల్స్ ఉండే ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కావడం విశేషం. పార్టీ కంటే అభ్యర్థే కీలకం హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలకు గాను చాలా నియోజకవర్గాల్లో వాతావరణం పరిస్థితులు అనుకూలంగా ఉండవు. దీంతో ఈ రాష్ట్రంలోని ఎన్నికల్లో పార్టీల కంటే అభ్యర్థే కీలకంగా ఉంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
117 ఏళ్ల దేశ తొలి ఓటరు ఇక లేరు.. బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 3 రోజులకే..
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నవంబర్ 12న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో భారత్‌కు స్వాతంత్ర్యం అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగి మరణించారు. ఆయన వయసు 106 సంవత్సరాలు. కాగా ఆయన మూడు రోజుల క్రితమే(నవంబర్ 2) హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా 34 సారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలని శ్యాం శరణ్ భావించినా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి నుంచి ఓటు వేసేందుకు అనుమతించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కిన్నౌర్ జిల్లాకు చెందిన శ్యాం శరణ్ నేగి కోసం ఎన్నికల కమిషన్ బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అప్పటికే శ్యామ్ అనారోగ్యంతో బాధపడుతుండగా.. శనివారం ఉదయం తన స్వస్థలమైన కల్పాలో కన్నుమూశారు. వృద్ధుడి అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోందని, గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. శ్యామ్ శరణ్ నేగి జూలై 1, 1917న జన్మించారు. కల్పాలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తరువాత స్వాతంత్ర్య భారతదేశంలో జరిగిన మొదటి ఎన్నికల్లో ఓటు వేసిన తొలి వ్యక్తి శరణ్ నేగి. 1951 అక్టోబర్ 25న ఆయన ఓటేశారు. అయితే మొదటిసారి ఎన్నికల పోలింగ్ 1952లో ఎక్కువ జరిగినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ అయిదు నెలల ముందగానే ఎన్నికలకు వెళ్లింది. హిమాచల్‌లో ఫిబ్రవరి, మార్చిలో వాతావరణం ప్రతికూలంగా ఉండటం, అతిగా మంచు కురిసే ప్రమాదం ఉండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాక శ్యామ్ శరణ్ నేగి హిందీ చిత్రం సనమ్ రేలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు.