![Congress Trouble After Himachal Win Workers Block Party Leader Car - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/10/congress.jpg.webp?itok=qH51Wf7_)
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ ఈ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీ కేంద్ర పరిశీలకులుగా చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హరియాణా మాజీ సీఎం భూపీందర్‌సింగ్ హుడా వచ్చారు. హిమాచల్‌లో తదుపరి ముఖ్యమంత్రి రేసులో ప్రతిభా సింగ్, ముకేశ్‌సింగ్ అగ్నిహోత్రి, సుఖ్వీందర్ సింగ్ సుఖు ముందంజలో ఉన్నారు.
సీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు వారు తమ మద్దతుదారులతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు కేంద్ర పరిశీలకులు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు గడువు కోరారు.
ఇదీ చదవండి: హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్‌పై విమర్శల వెల్లువ
Comments
Please login to add a commentAdd a comment