supporters protest
-
బీజేపీ నేతకు నో టికెట్.. మద్దతుదారుల ఆత్మహత్య యత్నం!
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో బీవీ నాయక్ అనే నేతకు బీజేపీ టికెట్ నిరారించింది. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా మనస్తాపం చెందారు. ఆయన అభిమానులు, మద్దతుదారులు బుధవారం రోడెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శివకుమార్, శివమూర్తి అనే ఇద్దరు బీవీ నాయక్ మద్దతుదారులు నిరసన తెలుపుతూ.. పొట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో మరో మద్దతుదారుడు వెంటనే వారి వద్ద నుంచి పేట్రోల్ క్యాన్‌ను లాక్కున్నాడు. అక్కడితో ఆగకుండా బీవీ నాయక్ అభిమానులు టైర్లతో మెయిన్‌రోడ్డును దిగ్బంధం చేశారు. 2019లో బీవీ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సమీప బీజేపీ అభ్యర్థి రాజా అమరేశ్వర నాయక్ చేతిలో పరాజయం పాలయ్యారు. సుమారు 1,17,716 ఓట్లు తేడాతో ఓడిపోయారు. అనంతరం బీవీ నాయక్ బీజేపీలో చేరారు. మొదటి నుంచి బీవీ నాయక్ తనకు బీజేపీ అధిష్టానం రాయ్‌చూర్ ఎంపీ టికెట్ కేటాయిస్తుందని ఆశించారు. అయితే, మరోసారి రాయ్‌చూర్ పార్లమెంట్ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ రాజా అమరేశ్వర నాయక్‌కు కేటాయించింది బీజేపీ. దీంతో తమ నేతకు బీజేపీ టికెట్ కేటాయించలేదని బీవీ నాయక్ అభిమానులు, మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
Himachal Pradesh: సీఎం పీఠం మా నేతకే...
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం సమావేశమయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడికి కట్టబెడుతూ ఈ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీ కేంద్ర పరిశీలకులుగా చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హరియాణా మాజీ సీఎం భూపీందర్‌సింగ్ హుడా వచ్చారు. హిమాచల్‌లో తదుపరి ముఖ్యమంత్రి రేసులో ప్రతిభా సింగ్, ముకేశ్‌సింగ్ అగ్నిహోత్రి, సుఖ్వీందర్ సింగ్ సుఖు ముందంజలో ఉన్నారు. సీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు వారు తమ మద్దతుదారులతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు కేంద్ర పరిశీలకులు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు గడువు కోరారు. ఇదీ చదవండి: హిమాచల్‌లో బీజేపీ ఓటమి.. అనురాగ్ ఠాకూర్‌పై విమర్శల వెల్లువ -
పాకిస్తాన్లో టెన్షన్.. ఇమ్రాన్ మద్దతుదారుల అరాచకం
దాయాది దేశం పాకిస్తాన్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు బుధవారం రెచ్చిపోయారు. నిరసనల్లో భాగంగా మెట్రో స్టేషన్‌కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల ప్రకారం.. అవిశ్వాస తీర్మానం తర్వాత అధికారం కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త డిమాండ్‌ను లేవనెత్తారు. పాకిస్తాన్లో ఎన్నికలు జరపాలంటూ డిమాండ్ చేస్తూ తన మద్దతుదారులతో కలిసి బుధవారం ఇస్లామాబాద్‌లో శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో ఇమ్రాన్ మద్దతుదారులు విచ్చేశారు. ర్యాలీ నేపథ్యంలో పీటీఐ పార్టీ మద్దతుదారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. وفاقی دارالحکومت کے مرکزی علاقہ بلیو ایریا میں پی ٹی آئی کارکنان نے درختوں اور گرین بیلٹ کو نذر آتش کردیا pic.twitter.com/nznKg6x5ts — Ghazanfar Abbas (@ghazanfarabbass) May 25, 2022 ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి కొందరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రెచ్చిన పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు.. చైనా చౌక్ మెట్రోస్టేషన్‌కు, అక్కడున్న చెట్లకు నిప్పంటించారు. కాగా, నిరసనల్లో పీటీఐ పార్టీకి చెందిన ఫైసల్ అబ్బాస్ చౌదరి బట్టి చౌక్ సమీపంలో వంతెనపై నుండి పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఇక, పోలీసులే అబ్బాస్‌ను వంతెనపై నుంచి తోసేశారని పార్టీ నేత షఫ్కత్ మెహమూద్ ఆరోపించారు. Heaving shelling on families in Liberty Lahore !! #PakistanUnderFascism pic.twitter.com/TU4DUTT8L7 — Musa Virk (@MusaNV18) May 25, 2022 ఇది కూడా చదవండి: అమెరికాలో ఉన్మాది కాల్పులు..:19 చిన్నారులు బలి -
పార్టీ కార్యకర్తలను కొట్టిన మాజీ సీఎం భార్య.. వీడియో వైరల్
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ సతీమణ రబ్రీ దేవీ ఆర్జేడీ పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. ఏకంగా కార్యకర్తలపై చేయి చేసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య కాలంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల్లో లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తాజాగా ఆరోపణలు చేసింది. ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను లాలూ కుటుంబ సభ్యులు భూములు, ప్రాపర్టీలను ముడుపులుగా తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే శుక్రవారం లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలతో పాటు మరో 15 మంది ఇళ్లలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు సీబీఐ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. లాలూ ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని లాలూ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోందని, అందులో భాగంగానే ఈ కేసులంటూ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో రబ్రీదేవి పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనల సందర్భంగా లాలూ ఇంటి వద్ద కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. CBI हाय-हाय के नारे लगा रहे थे RJD कार्यकर्ता, गुस्से में आकर Rabri Devi ने जड़ दिया थप्पड़https://t.co/WjldWg4WnR pic.twitter.com/AACFZqGYBj — देवेन्द्र कश्यप (@idevendraji) May 20, 2022 ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీలో కలకలం -
టీఆర్ఎస్లో చల్లారని అసంతృప్తి జ్వాలలు
-
‘కారు’చిచ్చు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో అసెంబ్లీ టికెట్ల వ్యవహారం రేపిన చిచ్చు ఇంకా చల్లారలేదు. అభ్యర్థులను ప్రకటించి వారం రోజులు కావస్తున్నా, చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి కొనసాగుతోంది. టికెట్ ఆశించి భంగపడినవారు స్వతంత్రంగా బరిలోకి దిగుతామని ప్రకటిస్తున్నారు. అందుకు అనుగుణంగా రంగంలోకి కూడా దిగిపోతున్నారు. టికెట్ ఖరారైన అభ్యర్థుల కంటే వేగంగా ప్రచారం కూడా షురూ చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ అభ్యర్థులను మార్చాల్సిందేనని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రంగంలోకి దిగారు. ఆయా నేతలతో చర్చలు జరిపి, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఓదెలుకు సీఎం నుంచి పిలుపు చెన్నూరు నియోజకవర్గ టికెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు కాకుండా పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంతో గులాబీ పార్టీలో వర్గపోరు మొదలైంది. ఓదెలు శాంతియుత కార్యక్రమాలతో నిరసనలకు దిగారు. మంగళవారం తనకు తానుగా గృహ నిర్బంధం విధించుకున్నారు. దీంతో వెంటనే వచ్చి సీఎం కేసీఆర్‌ను కలవాలని ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారులు ఓదెలుకు ఫోన్ చేసి చెప్పారు. బుధవారం ఉదయమే ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే జైపూర్ మండలం ఇందారంలో బాల్క సుమన్ ప్రచార ప్రారంభ కార్యక్రమంలో ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో ఓదెలు వెంటనే వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తాజా ఘటనతో చెన్నూరు రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ఇక చాలా నియోజకవర్గాల్లోనూ అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ఖానాపూర్ టికెట్‌ను తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు మళ్లీ ఇస్తున్నట్లు ప్రకటించడంతో అక్కడ అభ్యర్థిత్వం ఆశించిన రమేశ్‌రాథోడ్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి, ప్రచారం సైతం ప్రారంభించారు. స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఇవ్వడంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసంతృప్తితో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి తన కుమార్తె కావ్యకు అవకాశం ఇవ్వాలని కడియం కోరారు. అయితే, టీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ రాజయ్యకే టికెట్ ఇవ్వడంతో ఇరు వర్గాల మధ్య మొదలైన వర్గపోరు ఏకంగా వ్యక్తిగత అంశాల వరకు వెళ్లింది. రాజయ్యకు సంబంధించిన ఆడియో సంభాషణ బహిర్గతం వెనుక ప్రత్యర్థి వర్గానికి చెందిన మండల స్థాయి ప్రజాప్రతినిధి ఉన్నాడని రాజయ్య వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలో రాజయ్య బుధవారం కడియం శ్రీహరి దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేశారు. ఎన్నికల్లో గెలిచేలా ఆశీర్వదించాలని కోరారు. అయితే కడియం నుంచి సానుకూలత రాలేదని తెలిసింది. భూపాలపల్లి టికెట్ స్పీకర్ మధుసూదనాచారికి ఇవ్వడంతో అక్కడ అభ్యర్థిత్వం ఆశించిన గండ్ర సత్యనారాయణరావు అసంతృప్తితో ఉన్నారు. ఎలాగైనా పోటీలో ఉంటానని స్పష్టం చేసి ప్రచారం మొదలుపెట్టారు. కేటీఆర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ తనకు టికెట్ ఇస్తానని స్పష్టంగా హామీ ఇచ్చాకే టీఆర్ఎస్లో చేరానని ప్రచారంలో చెబుతున్నారు. వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమేని రమేశ్‌బాబుకు మళ్లీ అవకాశం వచ్చింది. అయితే అక్కడ టికెట్ ఆశించిన కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అసంతృప్తితో ఉన్నారు. రమేశ్‌బాబును మార్చి తుల ఉమకు టికెట్ ఇవ్వాలని వేములవాడ మున్సిపల్ చైర్మన్, ఇటీవల అవిశ్వాసంతో పదవి కోల్పోయిన వేములవాడ ఎంపీపీ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. రామగుండం సెగ్మెంట్లో టీఆర్ఎస్ గ్రూపుల వ్యవహారం అంతు లేకుండా సాగుతోంది. ప్రతి ఎన్నికల్లో ఉన్నట్లుగానే ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అభ్యర్థి అయితే పార్టీ ఓడిపోతుందని, తనకే అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ మరో నేత కోరుకంటి చందర్ కోరుతున్నారు. కచ్చితంగా పోటీలో ఉంటానని చెబుతూ ప్రచారంలోకి దిగారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లో తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో వేనేపల్లి వెంకటేశ్వర్రావు అసంతృప్తితో సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోటీలో ఉంటానని ప్రకటించారు. చేవెళ్ల టికెట్ పంచాయతీ ఏకంగా రాజీనామాలకు దారి తీసింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కె.ఎస్.రత్నం ఈసారీ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్యను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో రత్నం బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ నుంచి వచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి సొంత కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇదే నియోజకవర్గంలో మరో నేత ఈసీ శేఖర్‌గౌడ్ మంచిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. షాద్‌నగర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు మళ్లీ అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ సీనియర్ నేత అందె బాబయ్య, వీర్లపెల్లి శంకర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అసమ్మతి నేతలను కూడగడుతున్నారు. అసంతృప్త నేతలతో మాట్లాడేందుకు మంత్రి సి.లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డిలు ప్రయత్నించినా వారు రాలేదు. సత్తుపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా పిడమర్తి రవి పేరును టీఆర్ఎస్ ప్రకటించింది. గత ఎన్నికల్లోనూ ఇక్కడ పిడమర్తి రవి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన మట్టా దయానంద్ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. టికెట్ ఆశించి భంగపడిన ఆయన తాను బరిలో దిగుతానని ప్రకటించారు. కేటీఆర్ బుజ్జగింపులు... మక్తల్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి టికెట్ లభించింది. అయితే, ఆరుగురు అసంతృప్తి నేతలు తమలో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా పార్టీ గెలుపు కోసం పని చేస్తామని చెప్పారు. వారంతా రామ్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా మండలవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలతో మంత్రి కేటీఆర్ బుధవారం చర్చలు జరిపారు. అభ్యర్థిని మార్చాలని అసంతృప్త నేతలు కోరగా, పార్టీ అభ్యర్థి కోసం కలిసి పని చేయాలని కేటీఆర్ వారికి సూచించారు. కల్వకుర్తిలో టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గోలి శ్రీనివాస్‌రెడ్డి, విజితారెడ్డి, బాలాజీసింగ్‌లతో కేటీఆర్ చర్చలు జరిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ విజయానికి కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. హరీశ్‌రావు మంతనాలు ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లోని పలు నియోజకవర్గాల అసంతృప్త నేతలతో మంత్రి హరీశ్‌రావు చర్చలు జరిపారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా పార్టీ ప్రకటించిన వారి గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని ఆదేశించారు. అంథోల్ అభ్యర్థి క్రాంతికిరణ్ గెలుపు కోసం పని చేయాలని స్థానిక నేతలకు సూచించారు. నర్సాపూర్ అభ్యర్థి మదన్‌రెడ్డి, ఆయన వ్యతిరేక వర్గీయులతో హరీశ్ చర్చలు జరిపారు. నారాయణఖేడ్ అభ్యర్థిగా ప్రకటించిన భూపాల్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారికి సర్దిచెప్పారు. అభ్యర్థిని మార్చడం సాధ్యంకాదని పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో అసంతప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణకు సర్ది చెప్పారు. అలంపూర్ అభ్యర్థిగా అబ్రహంను ప్రకటించడంతో టికెట్ ఆశించిన మాజీ ఎంపీ మందా జగన్నాథం అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరితో హరీశ్‌రావు మాట్లాడి, అబ్రహాం గెలుపు కోసం పని చేయాలని జగన్నాథంకు సూచించారు. గద్వాలలో టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్‌రెడ్డి, టికెట్ ఆశించిన గట్టు తిమ్మప్ప, చంద్రశేఖర్రెడ్డిలతోనూ హరీశ్ మట్లాడారు. అందరూ కలిసి కష్ణమోహన్‌రెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు. -
మేయర్ అరెస్ట్‌కు డిమాండ్.. నవ్వులపాలు
లండన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇతర దేశాల్లోనూ అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. ఇంగ్లాండ్‌లో ఆ సంఖ్యకు కొదవేం లేదు. అయితే తాజాగా లండన్‌లో ట్రంప్ వీరాభిమానులని చెప్పుకొనే కొందరు చేపట్టిన ఓ నిరసన ప్రదర్శన ఘోరంగా విఫలం అయ్యింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న మేయర్ సాధిక్ ఖాన్ అరెస్ట్‌ను డిమాండ్ చేసి నవ్వులపాలయ్యారు. శనివారం సెంట్రల్ లండన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మేయర్ సాధిక్ ప్రసంగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రంప్ మద్ధతుదారులు ఒక్కసారిగా నినాదాలు చేయటం ప్రారంభించారు. ఈయూకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఓ వ్యక్తి అమెరికా జెండాను ప్రదర్శించాడు. నిరసనకు స్పష్టమైన కారణం వెల్లడించనప్పటికీ.. సాధిక్ ఖాన్‌కు మేయర్‌గా కొనసాగే అర్హత లేదని వారంతా సభలో గోల చేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈ పరిణామాలతో మేయర్ ప్రసంగానికి కాసేపు ఆటంకం ఎదురైంది. 10 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బలవంతంగా బయటకు లాక్కెల్లారు. అనంతరం ప్రసంగించిన సాధిక్.. ‘‘మేధావుల మూలంగా స్పీచ్‌కు కాసేపు అంతరాయం కలిగిందని.. అందుకు ప్రజలు క్షమించాలి’’ అని పేర్కొనటంతో అక్కడ ఉన్న ప్రజలు గొల్లుమని నవ్వుకున్నారు. ఆపై తన ప్రసంగాన్ని ఆయన కొనసాగించారు. అర్థం పర్థం లేని డిమాండ్‌తో పరువు తీసుకోవటం తప్పించి వారు సాధించింది ఏం లేదని కార్యక్రమం ముగిశాక కొందరు మీడియాతో వ్యాఖ్యానించారు. పాకిస్తానీ డ్రైవర్ కొడుకైన సాధిక్ ఖాన్ లండన్‌కు మెట్టమెదటి ముస్లిం మేయర్. ముస్లిం దేశాలపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను.. విధిస్తున్న ఆంక్షలను.. నిర్ణయాలను సాధిక్ ఖండిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అభిమానులు ఇలా స్పందించారన్న మాట. -
'మహేశ్వరం నుంచే... ఆందోళన వద్దు'
-
'మహేశ్వరం నుంచే... ఆందోళన వద్దు'
హైదరాబాద్ : కార్యకర్తల అభీష్టం మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం సీటును సీపీఐకి కేటాయించటంపై కార్యకర్తలు గురువారం సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద ఆందోళనకు దిగారు. మహేశ్వరం నుంచే పోటీ చేసే విషయంలో అధిష్టానంతో మాట్లాడతానని సబితా ఈ సందర్భంగా కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో ఓ కార్యకర్త వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు యత్నించగా, ఆ ప్రయత్నాన్ని సహచర కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.