బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ సతీమణ రబ్రీ దేవీ ఆర్జేడీ పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. ఏకంగా కార్యకర్తలపై చేయి చేసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య కాలంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల్లో లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తాజాగా ఆరోపణలు చేసింది. ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను లాలూ కుటుంబ సభ్యులు భూములు, ప్రాపర్టీలను ముడుపులుగా తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే శుక్రవారం లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలతో పాటు మరో 15 మంది ఇళ్లలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు సీబీఐ, బీజేపీ ప్రభుత్వానికి వ‍్యతిరేకంగా నిరసనలు తెలిపారు. లాలూ ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని లాలూ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోందని, అందులో భాగంగానే ఈ కేసులంటూ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో రబ్రీదేవి పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనల సందర్భంగా లాలూ ఇంటి వద్ద కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
CBI हाय-हाय के नारे लगा रहे थे RJD कार्यकर्ता, गुस्से में आकर Rabri Devi ने जड़ दिया थप्पड़https://t.co/WjldWg4WnR pic.twitter.com/AACFZqGYBj
— देवेन्द्र कश्यप (@idevendraji) May 20, 2022
ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదుపై వివాదాస్పద వ్యాఖ‍్యలు.. ఢిల్లీలో కలకలం
Comments
Please login to add a commentAdd a comment