Rabri Devi
-
తిరగలి పట్టిన మాజీ సీఎం రబ్రీదేవి
పట్నా: బీహార్‌లో ఆసక్తికర రాజకీయాలు నడుస్తుంటాయి. ముఖ్యంగా ఆర్జేడీ నేత లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తన తల్లి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసిన వారంతా రకరకాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రబ్రీదేవి సాధారణ బీహారీ మహిళగా కనిపిస్తున్నారు. గోధుమలను తిరగలి పడుతూ, వాటిని జల్లెడ పడుతూ, శుభ్రం చేస్తూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తేజస్వి యాదవ్ ‘జీవితాన్ని నడిపించేది తల్లి.. ఆశ, నమ్మకం, ప్రేమలకు ప్రతిబింబం తల్లి’ అని రాశారు.ఈ వీడియోను చూసిన రవి ఆనంద్ అనే యూజర్.. ‘కుటుంబం, అధికారం రెండింటినీ ఎలా నడపవచ్చో ప్రపంచానికి చాటిచెప్పిన తల్లి ఆమె’ అని రాశారు. మరో యూజర్ ‘మీరు బీహార్ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను ఏకకాలంలో చూపించారని’ రాశారు. जीवन का संबल है माँ! जीवन का आस-विश्वास, सार-प्यार, प्रतिमान और आर्शीवचन है माँ! #motherslove #mothers #trending pic.twitter.com/j7fYUwfvOE— Tejashwi Yadav (@yadavtejashwi) September 22, 2024ఇది కూడా చదవండి: ‘అహ్మద్‌కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్‌పై పోలీసులకు ఫిర్యాదు -
అద్వానీది పాకిస్తాన్.. ఇక్కడ సెటిలయ్యారు: మాజీ సీఎం రబ్రీదేవి
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నేత రబ్రీ దేవి బీజేపీని టార్గెట్ చేశారు. ‘ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చారు. పాకిస్తాన్-పాకిస్తాన్ అంటున్నారు. అద్వానీ పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి. అతను భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. దేశంలో ఇండియా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోంది’ అని రబ్రీ వ్యాఖ్యానించారు.పాకిస్తాన్ జిహాదీలు ఇండియా కూటమి నేతలకు మద్దతిస్తున్నారని ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై రబ్రీ ఎదురుదాడి చేశారు. ‘మోదీ ప్రకటనల మాదిరిగా పరిస్థితులు ఉంటే భారత ప్రభుత్వ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి? అంటే ప్రధాని మోదీ విఫలమయ్యారా? దేశంలో మహా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. బీహార్‌లో మహాకూటమి ప్రకంపనలు రేపుతోంది’ అని రబ్రీదేవి వ్యాఖ్యానించారు. కాగా ఎన్డీఏ ప్రభుత్వం మనల్ని లాంతరు యుగానికి తీసుకెళ్లింది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని రబ్రీదేవి కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మిసా భారతి హామీనిచ్చారు.గ్రామాలకు వెళితే కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెడుతున్నారని మిసా భారతి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత పదేళ్లుగా ప్రజలు మోసపోతున్నారు. ద్రవ్యోల్బణం తగ్గలేదు. నిరుద్యోగం పోలేదు అని ఆమె బీజేపీపై మండిపడ్డారు. -
సునీతా కేజ్రీవాల్ ‘నియంతృత్వం’ విమర్శలపై బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలాగే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘సీఎం కేజ్రీవాల్‌ను జైలుకు ఎందుకు పంపారు?. వారికి( బీజేపీ) ఒక్కటే లక్ష్యం ఉంది..లోక్‌సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్లో జైలులోనే ఉంచటం. దేశ ప్రజలు ఇలాంటి నియంతృత్వానికి గట్టి సమాధానం చెబుతారు’ అని సునీతా కేజ్రీవాల్ అన్నారు. సునీతా కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజీపీ కౌంటర్ ఇచ్చింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సునీతా కేజ్రీవాల్‌ను రబ్రీదేవీతో పోల్చారు. ‘రబ్రీదేవి సిద్ధమవుతోంది. గత వారం, పది రోజుల్లో ఇప్పటికే మూడు, నాలుగు సార్లు చెప్పాను. రబ్రీ త్వరలో మనముందుకు వస్తుంది. అంటే నేను అనేది..సునీతా కేజ్రీవాల్ సీఎంగా రాబోతుంది. అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఇద్దరు నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌తో కేబినెట్ చర్చలు జరుపుతున్నారు. ఏ ప్రభుత్వమైనా జైలు నుంచి నడపుతారా? ఇక్కడి ప్రభుత్వంలో మాత్రం ముగ్గురు మంత్రులు జైలులో ఉన్నారు. వారు అక్కడే కేబినెట్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు’ అని హర్దీప్ సింగ్ పూరి ఎద్దేవా చేశారు. ఇక.. అవినీతి కేసులో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ జైలు వెళ్లినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి సీఎం అయిన విషయం తెలిసిందే. -
‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉండటంతో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ సీఎం అవుతారని మీడియా కథనాలు వస్తున్నాయి. జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘అప్పుడు బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అన్నారు. -
ఎమ్మెల్సీలుగా నితీశ్, రబ్డీ దేవి ఏకగ్రీవం
పట్నా: బిహార్ శాసనమండలి సభ్యులుగా సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీ దేవి సహా 10 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్జేడీకి చెందిన రబ్డీ దేవి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కేబినెట్ మంత్రి సంతోష్ సుమన్ కూడా మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. జేడీయూ చీఫ్ కూడా అయిన నితీశ్ కుమార్ గురువారం పార్టీ నాయకులతో శాసనమండలి సెక్రటేరియట్‌కు చేరుకుని ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. -
Land for jobs scam: ప్రత్యేక కోర్టులో రబ్డీదేవికి ఊరట
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బిహార్ మాజీ సీఎం రబ్డీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ప్రత్యేక కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు మధ్యంతర బెయిలిచి్చంది. రెగ్యులర్ బెయిల్ కోసం వీరు పెట్టుకున్న పిటిషన్‌పై స్పందన తెలపాలంటూ ఈడీని ఆదేశిస్తూ స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు సమయంలో నిందితులను అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కస్టడీకి కోరడమెందుకని జడ్జి ఈ సందర్భంగా ఈడీని ప్రశ్నించారు. -
ఈడీ ముందుకు లాలూ కొడుకు
పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ హాజరయ్యారు. పాట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు ఆర్జేడీ కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ ఇంట్లోనూ ఈడీ దాడులు జరిపింది. నిన్న లాలూని 9 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తమ ఆరోపణలు నిజమేనని స్పష్టం చేసింది. అక్రమంగా రైల్వే ఉద్యోగాలు ఇచ్చి లంచాలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ భార్య రబ్రి దేవి గోశాలలో పనిచేసే వ్యక్తి పేరుపై మొదట రైల్వే ఉద్యోగుల నుంచి లంచాలు పుచ్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ ఆస్తుల్ని లాలూ కూతురు హేమా యాదవ్‌కు బదిలీ చేశారని వెల్లడైంది. ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ షెల్ కంపెనీలకు నిధుల్ని బదిలీ చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీల షేర్లు లాలూ కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. అమిత్ కత్యాల్ అనే వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్ కోసం ఈ కంపెనీలను నిర్వహించాడని ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఇదీ చదవండి: Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం? -
రబ్రీ దేవికి ఢిల్లీ కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ కోర్టు బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్‌లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టులో విచారణకు రావాలంటూ స్పెషల్ కోర్టు జడ్జి విశాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన చార్జిషీటులో ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కట్యాల్‌ను సైతం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. -
Land For Job Scam: ఛార్జిషీట్లో రబ్రి దేవి, మిసా భారతి పేర్లు
ఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, ఆమె ఎంపీ కుమార్తె మిసా భారతీతో సహా తదితరుల పేర్లను చార్జిషీట్లో పేర్కొంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అమిత్ కత్యాల్, మరికొందరు వ్యక్తులు, కంపెనీల పేర్లను ఛార్జ్ షీట్లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈరోజు తన మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పిఎమ్‌ఎల్‌ఎ) కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయబడింది. జనవరి 16న విచారణకు కోర్టు జాబితా చేసిందని సమాచారం. ఈ కేసులో కత్యాల్‌ను గత ఏడాది నవంబర్‌లో ఈడీ అరెస్టు చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌ను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న కాలానికి సంబంధించినది ఈ కుంభకోణం. 2004 నుండి 2009 వరకు, భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో అనేక మంది గ్రూప్ "డి" స్థానాల్లో అక్రమంగా నియమించబడ్డారు. బదులుగా ఆ అభ్యర్థులు తమ భూమిని అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు బదిలీ చేశారని ఈడీ ఆరోపించింది. ఇదీ చదవండి: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్? -
Land-for-job case: లాలూ కుటుంబానికి ఊరట
న్యూఢిల్లీ: భూమికి ఉద్యోగం కుంభకోణంలో నిందితులుగా ఉన్న నాటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా భారతి తదితరులకు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఇటీవల మూత్రపిండమార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న లాలూ బుధవారం ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుల ప్రాంగణానికి చేరుకుని జడ్జి ఎదుట హాజరయ్యారు. ఇతర నిందితులూ వెంట వచ్చారు. లాలూ, రబ్రీ దేవి, మీసా భారతి తదితరులకు ప్రతి ఒక్కరికీ చెరో రూ.50,000 విలువైన వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరో పూచీకత్తు సమర్పించాలని సూచిస్తూ అందరికీ బెయిల్ మంజూరుచేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్ ఉత్తర్వులు జారీచేశారు. బెయిల్ కోసం నిందితులు గతంలో పెట్టుకున్న అభ్యర్థనలను కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తోసిపుచ్చలేదు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 29వ తేదీకి వాయిదావేసింది. భారతీయ రైల్వే నియామకాల్లో పేర్కొన్న నిబంధనావళిని తొక్కిపెట్టి తమకు తక్కువ ధరకు భూములు దక్కేలా చేసిన ఉద్యోగార్థులకు వేర్వేరు జోన్లలో తక్కువ స్థాయి ఉద్యోగాలు ఇప్పించారని లాలూ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేసు నమోదుచేసి సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెల్సిందే. -
rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఇవాళ ఒక్కసారిగా అలజడి రేగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం ఒకటి లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన రబ్రీ దేవి ఇంటికి వెళ్లింది. సోమవారం పాట్నాలోని ఆమె నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో ఆమెను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తనయులు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.అయితే.. ఈ కుంభకోణానికి సంబంధించి కేవలం ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకే వెళ్లినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అంతేగానీ తనిఖీలు, సోదాలు నిర్వహించేందుకు కాదని స్పష్టత ఇచ్చాయి. మరోవైపు ముందు తీసుకున్న అపాయింట్మెంట్ ప్రకారమే అధికారులు ఇంటికి వచ్చారని రబ్రీ దేవి అనుచరులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. రాజకీయ ఉద్దేశ్యాలతో దర్యాప్తు సంస్థలను తప్పుడు దోవలో కేంద్రం ప్రతిపక్షాలపై ప్రయోగిస్తోందని ఆరోపిస్తూ.. ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాయి. ఈ లేఖలో రబ్రీ దేవి తనయుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సైతం సంతకం చేశారు. అంతేకాదు.. దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్న నేతల్లో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నారంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. సీబీఐ ప్రకారం.. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం లాలూ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగింది. 2004-09 మధ్య రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా లాలూ కుటుంబం కారుచౌక ధరలను చెల్లించి భూముల్ని కొనుగోలు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మే 2022లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా, హేమలతో పాటు మరికొందరి పేర్లను చేర్చింది. ఆపై ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.మరోవైపు భూములు అప్పజెప్పి.. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 12 మంది పేర్లను సైతం ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చింది. అంతేకాదు గతంలో లాలూకు ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేసిన భోళా యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ కూడా చేసింది. ఇప్పటికే లాలూ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది సీబీఐ. ఇదిలా ఉంటే.. వారం కిందట ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఢిల్లీ కోర్టులో లాలూ, ఇతరులు హాజరయ్యారు కూడా. ఇక బీజేపీ దర్యాప్తు సంస్థల బూచీతో బయటపెట్టాలని యత్నిస్తోందని, లాలూ కుటుంబం అలాంటి వాటికి బెదరదని, గత 30 ఏళ్లుగా ఇలాంటి ఆరోపణలు తాము ఎదుర్కొంటున్నామని రబ్రీ దేవి తాజాగా ఓ ప్రకటన చేశారు కూడా. -
నితీష్ రాముడిగా, మోదీ రావణుడిలా.. కలకలం రేపుతున్న పోస్టర్లు
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాబోయే 2024 ఎన్నికల్లో ఆయన గెలుస్తారని చెప్పేలా ఏర్పాటు చేసిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. పైగా ఆపోస్టర్లు రబ్రీ దేవి నివాసం వద్ద, ఆర్జేడి కార్యాలయం వెలుపల ఏర్పాటు మరింత వివాదానికి దారితీసింది. ఈ మేరకు ఆ పోస్టర్లలో మహాభారత, రామాయణలలో ప్రధానాంశాలతో తమ నాయకుడు నితీష్ కుమార్ ఎలా బీజేపీని ఓడిస్తాడో చూపిస్తున్నట్లుగా తెలియజేసేలా ఏర్పాటు చేశారు. తమ మహాఘట్బంధన్ నాయకుడు నితీష్ కుమార్‌ని కృష్ణుడు, రాముడిలా చూపిస్తూ..ప్రధాని నరేంద్ర మోదీని కంసుడు, రావణుడిలా చూపిస్తూ పోస్టర్లు పెట్టారు. అంతేగాదు రావణుడిని రాముడు ఎలా ఓడించాడో, అలాగే కంసుడిని కృష్ణుడు ఎలా చిత్తుచేశాడో అలా మా నాయకుడు నితీష్ కుమార్ బీజేపీని గద్దే దింపుతాడని అని అర్ధం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లపై ఛప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనమ్ రాయ్ చిత్రంతో పాటు మహాగత్బంధన్ జిందాబాద్ నినాదాలు కూడా ఉన్నాయి. అయితే బీజేపీ ప్రతినిధి నవల్ కిషోర్ యాదవ్ మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి ప్రతిపక్ష నాయకులందరూ నితీష్ కుమార్‌లతో కలిసి ఏకమై వచ్చినా... ప్రధాని మోదీని ఓడించలేరు. ఆయన 2034 వరకు ప్రధానిగా అధికారంలోనే ఉంటారని ధీమాగా చెప్పారు. ఈ పోస్టర్ల విషయమై స్పందించిన ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ..ఆ పోస్టర్లు ఎవరూ ఏర్పాటు చేశారో మాకు తెలియదు. మా కార్యాలయానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినా బీజేపీని గద్దే దింపేందుకు ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని, ఆయన ఐక్య ప్రతిపక్షానికి ముఖంగా ఉంటారు. రైతులు, యువతకు వ్యతిరేకంగా ఉండే పార్టీతో మా నాయకుడు పోరాడుతారు. ప్రతి బిహారీ నితీష్ గెలవాలని కోరుకుంటాడు అని నమ్మకంగా చెప్పారు. బిహార్ విద్యా శాఖ మంత్రి రామ్‌చరిత మానస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి ఇబ్బందులో పడ్డ కొద్దిరోజుల్లో ఈ పోస్టర్ల ఘటన తెరపైకి రావడం గమనార్హం. (చదవండి: ఆ పాటతో రాత్రికి రాత్రే స్టార్ సింగర్‌గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు) -
జాబ్ ఫర్ ల్యాండ్ కేసు.. లాలూ సన్నిహితుడి అరెస్టు
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేక అధికారిగా పనిచేసిన భోళా యాదవ్‌ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. జాబ్ ఫర్ ల్యాండ్ కుంభకోణం కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా పట్నా, దర్భంగాలోని మొత్తం నాలుగు ప్రదేశాల్లో సీబీఐ ముమ్ముర తనిఖీలు నిర్వహించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు(2004-09) రైల్వే శాఖలో ఉద్యోగాలు పొందిన కొందరు లాలూకు, ఆయన కుటుంబసభ్యులకు భూమిని తక్కువ ధరకే విక్రయించడం లేదా గిఫ్ట్‌గా ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ ఈ ఏడాది మేలో కొత్త కేసు నమోదు చేసింది. లాలూ, ఆయన సతీమణి రబ్రీ దేవి, కుమార్తెలు మిషా భారతి, హేమా యాదవ్‌లతో పాటు 12మందిపై అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించి లాలూ నివాసం సహా బిహార్, ఢిల్లీలో మొత్తం 17 చోట్ల సీబీఐ తనిఖీలు నిర్వహించింది. 2021 నుంచి దీనిపై దర్యాప్తు చేస్తోంది. అయితే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందుకే లాలూపై దాడులు చేస్తున్నారని ఆర్జేడీ విమర్శిస్తోంది. ఒకప్పుడు రైల్వే శాఖకు వేల కోట్లు లాభాలు తెచ్చిపెట్టి దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లాలూను.. ఇప్పుడు దేశాన్ని అమ్మేస్తున్న ఓ గ్రూప్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని లాలూ కుమార్తె రోహిణి యావద్ తీవ్ర ఆరోపణలు చేశారు. చదవండి: త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు -
లాలూకు ప్రమాదం.. మెట్లపై నుంచి జారిపడ్డ ఆర్జేడీ చీఫ్
పట్నా: ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గాయపడ్డారు. ఇంట్లో మెట్లు దిగుతుండగా ఆయన కాలుజారి పడిపోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనలో లాలూ భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు పేర్కొన్నాయి. వీపుపై కుడా గాయమైనట్లు చెప్పాయి. 'లాలూ భుజంలో ఫ్రాక్చర్ అయినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. గాయమైన చోట వైద్యులు బ్యాండేజ్ చుట్టారు. కొన్ని మెడిసిన్స్ రాసి వెంటనే ఇంటికి పంపారు’ అని లాలూ కుటుంబంతో సన్నిహత సంబంధాలు ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. రెండు నెలల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటినుంచి ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి నివాసంలోనే ఉంటున్నారు. లోయలో పడ్డ స్కూల్ బస్సు.. 16 మంది మృతి లాలూ ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్యల చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఆదివారం అనుకోకుండా ఇంట్లోనే మెట్లపై నుంచి జారిపడి గాయపడ్డారు. వెంటనే కుటుంసభ్యులు లాలూను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. భుజం, వీపుపై కాస్త నొప్పి తప్ప.. లాలూకు ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. కస్టడీకి ‘అమరావతి’ సూత్రధారి -
పార్టీ కార్యకర్తలను కొట్టిన మాజీ సీఎం భార్య.. వీడియో వైరల్
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ సతీమణ రబ్రీ దేవీ ఆర్జేడీ పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. ఏకంగా కార్యకర్తలపై చేయి చేసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-09 మధ్య కాలంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల్లో లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ తాజాగా ఆరోపణలు చేసింది. ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను లాలూ కుటుంబ సభ్యులు భూములు, ప్రాపర్టీలను ముడుపులుగా తీసుకున్నారని సీబీఐ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే శుక్రవారం లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలతో పాటు మరో 15 మంది ఇళ్లలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా ఆర్జేడీ కార్యకర్తలు సీబీఐ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. లాలూ ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని లాలూ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోందని, అందులో భాగంగానే ఈ కేసులంటూ కార్యకర్తలు ఆరోపించారు. ఈ క్రమంలో రబ్రీదేవి పార్టీ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనల సందర్భంగా లాలూ ఇంటి వద్ద కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. CBI हाय-हाय के नारे लगा रहे थे RJD कार्यकर्ता, गुस्से में आकर Rabri Devi ने जड़ दिया थप्पड़https://t.co/WjldWg4WnR pic.twitter.com/AACFZqGYBj — देवेन्द्र कश्यप (@idevendraji) May 20, 2022 ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీలో కలకలం -
లాలూ రాజీనామా వార్తలపై స్పందించిన రబ్రీదేవీ
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) జాతీయ అధ్యక్ష పదవి నుంచి లాలూప్రసాద్ యాదవ్ తప్పుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ ఖండించారు. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని శుక్రవారం తేల్చిచెప్పారు. లాలూ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు. లాలూ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్‌ప్రతాప్ యాదవ్ పోటీపడుతున్నట్లు బిహార్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. గుండె, మూత్రపిండాల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. (చదవండి: 'జడ్' కేటగిరి భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ) -
మళ్లీ జంగిల్ రాజ్ దిశగా బిహార్?
సాక్షి, న్యూఢిల్లీ: అసలు జంగిల్ రాజ్ అంటే ఏంటి..? బిహార్ వెనకబాటుతనానికి జంగిల్‌రాజ్ కారణమా..? బిహార్‌లో జంగిల్ రాజ్ అంశం మళ్లీ తెరపైకి రావటానికి కారణం ఏంటి..? బిహార్‌లో పరిస్థితులు జంగిల్ రాజ్ దిశగా అడుగులు వేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నేరాలు, అవినీతి, శాంతి భద్రతల సమస్యలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న బిహార్‌లో మళ్లీ అదే అంశం తెరపైకి వస్తోంది. నేరాల విషయంలో ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సాధారణం. అయితే తాజాగా పాలకపక్షంలోని నాయకులే ఇప్పుడు జంగిల్‌రాజ్ గానం వినిపించడం వివాదానికి కారణంగా మారుతోంది. అసలేంటి జంగిల్ రాజ్..? 1990 నుంచి 2005 వరకు బిహార్‌ను లాలూ ప్రసాద్–రబ్రీదేవి పాలించిన కాలాన్ని జంగిల్ రాజ్‌గా రాజకీయవర్గాలు అభివర్ణిస్తుంటాయి. జంగిల్‌రాజ్‌లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, ఇతర సంస్థల మధ్య నేరపూరిత సంబంధాలు ఎక్కువగా ఉండేవి. అంతేగాక చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు అడ్డువచ్చే వారిని బహిరంగంగా బెదిరించడం, హింసాత్మకంగా వ్యవహరించడం ఒక ఫ్యాషన్‌గా కొనసాగేది. ఆ సమయంలో బిహార్ కిడ్నాప్‌లకు అడ్డాగా మారింది. రాష్ట్రంలోని వైద్యులు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలను పట్టపగలే గ్యాంగ్‌లు కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసేవారు. కొన్నిసార్లు డబ్బులు చెల్లించిన తర్వాత కూడా బాధితులను నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. గతంలో చేసిన ఒక సర్వే ప్రకారం 1992 నుండి 2004 వరకు బిహార్‌లో 32,085 కిడ్నాప్ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. లాలూ–రబ్రీ హయాంలో రాజకీయ హత్యలు పెద్ద ఎత్తున జరిగాయి. లాలూ అండతో ఆ సమయంలో సివాన్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన షాబుద్దీన్‌పై అనేక హత్యారోపణలు ఉన్నప్పటికీ, లాలూ ప్రసాద్ కారణంగా పోలీసులు కేసులు పెట్టేందుకు భయపడ్డారు. కిడ్నాప్‌లు, హత్యల నేపథ్యంలో చీకటి పడిన తర్వాత ఇంటి నుంచి బయటి రావాలంటే ప్రజలు వణికిపోయేవారు. బిహార్ పోలీసు గణాంకాల ప్రకారం కేవలం 2001–2005 మధ్య ఐదేళ్ళలో 18,189 హత్యలు జరిగాయంటే 1990 నుంచి 2000 మధ్య కాలంలో జంగిల్ రాజ్‌లో ఎన్ని హత్యలు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదేగాక రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా, వాహనం కొన్నా స్థానిక గూండాలకు ‘రంగ్దారీ పన్ను’తప్పని సరిగా చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే వారిని గూండాలు హత్య చేసేవారు. అసలు లాలూ–రబ్రీదేవి అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జరగని నేరం అంటూ ఏదీ లేదు. అయితే లాలూ కుటుంబం అధికార పీఠానికి దూరమైన తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. ఆర్జేడీని ఎదుర్కొనేందుకు జంగిల్ రాజ్‌ను ఉదహరిస్తూ బీజేపీ, జేడీయూలు ఎన్నికల్లో ప్రజల ముందు నిలబడి విజయం సాధిస్తూ వచ్చారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ జంగిల్ రాజ్ పేరు చర్చనీయాంశంగా మారింది. సీతామర్హి బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ ఇటీవల చేసిన ఒక ప్రకటన రాజకీయవర్గాల్లో దుమారం రేపుతోంది. ప్రస్తుత నితీష్ కుమార్ ప్రభుత్వ హయాంలోనూ తన నియోజకవర్గం సీతామర్హిలో పెరుగుతున్న నేరాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు, 15 ఏళ్ల క్రితం జంగిల్ రాజ్ రాజ్యమేలిన విధంగా, ప్రస్తుతం బిహార్ జంగిల్ రాజ్ దిశగా అడుగులు వేస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరస్తులు పోలీసులకు ఏమాత్రం భయపడట్లేదని, ఈ కారణంగా సీతామార్హిలో రోజులో కనీసం మూడు నేర ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని, నేరాలను అదుపు చేసేందుకు కఠిన చర్యలు తీసుకొనే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని మిథిలేష్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. సాధారణంగా శాంతిభద్రతలను ఒక సమస్యగా ప్రతిపక్షం మారుస్తోంది. అయితే బిహార్‌లో స్వపక్షం నుంచే ఈ ప్రకటనలు రావడం రాజకీయంగా నితీష్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కేవలం మిథిలేష్ కుమార్ మాత్రమే కాకుండా నేరాలతో పాటు శాంతి భద్రతల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ జైస్వాల్ సహా పలువురు నేతలు నితీష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేగాక నేర నియంత్రణ కోసం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అవలంభిస్తున్న విధానాన్ని అనుసరించాలని కోరారు. పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలంటూ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ మిత్రపక్షం, అధికారపార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) నాయకులు మాత్రం బిహార్‌లో జంగిల్ రాజ్ కాదు ఎంతో శాంతియుతంగా న్యాయమైన పాలన జరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. గత 15 ఏళ్ళుగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఏనాడూ రాలేదని నితీష్ మంత్రివర్గ సహచరుడు, జేడీయూ నేత అశోక్ చౌదరి వెల్లడించారు. మొత్తానికి బిహార్ అభివృద్ధికి జంగిల్ రాజ్ ఇమేజ్ ఏదో ఒక రూపంలో కచ్చితంగా అడ్డుపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బడ్జెట్ సమావేశాలు : ఎలుకతో అసెంబ్లీకి
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్ష ఆర్జేడీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో.. శుక్రవారం విపక్ష శాసనసభ్యులు ఎలుకను వెంటపెట్టుకుని సభకు వచ్చారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వం కీలక పత్రాలను మాయం చేస్తోందని, వాటిపై ప్రశ్నిస్తే ఎలుకలను సాకుగా చూపుతున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడిసిన్, లిక్కర్ మాఫియా జరుగుతోందని వాటికి కూడా ఎలుకలనే సాకుగా చూపిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎలుకలను పట్టుకుని వచ్చి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని వివరించారు. -
మేం తీసుకోం.. పబ్లిసిటీ కోసం చిల్లర చేష్టలు
పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్యారాయ్ తండ్రి, ఆర్జేడీ నేత చంద్రికా రాయ్ లాలూ కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెట్టేందుకు ఇంటికి బాంబులు పంపించేరేమో అని వియ్యంకుల తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఐశ్వర్య అత్తింటి నుంచి వచ్చిన వస్తువులను తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. కాగా తనకు విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ క్రమంలో అత్తింటి వారు తనను తీవ్రంగా హింసించి ఇంటి నుంచి గెంటివేశారని ఐశ్వర్యారాయ్ తన అత్త రబ్రీదేవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పెళ్లి సమయంలో తమ కూతురికి ఇచ్చిన ఖరీదైన కానుకలు, వస్తువులు తిరిగి ఇచ్చేయాలంటూ ఐశ్వర్య తల్లి పూర్ణిమా దేవి... వుమన్ హెల్్పలైన్ ద్వారా వియ్యంపురాలు రబ్రీదేవికి నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో లాలూ నివాసం నుంచి రెండు వ్యాన్లు సామాన్లతో గురువారం ఐశ్వర్య పుట్టింటికి చేరుకున్నాయి. అయితే ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ మాత్రం వాటిని అన్లోడ్ చేయనివ్వలేదు. దీంతో రెండు వాహనాలు రాత్రంతా అక్కడే ఉండిపోయాయి.(‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్ లాక్కొన్నారు’) ఈ విషయం గురించి చంద్రికా రాయ్ మాట్లాడుతూ... ‘చట్ట ప్రకారం మెజిస్ట్రేట్, పోలీసుల ముందు ఆ సామాన్లను ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అలా వాళ్లకు వాళ్లే పంపిస్తే వాటిని నేనెందుకు స్వీకరించాలి. మాకు హాని చేసేందుకు అందులో మద్యం బాటిళ్లు, పేలుడు పదార్థాలు పెట్టారేమో అని లాలూ కుటుంబంపై సందేహం వ్యక్తం చేశారు. ఇక చంద్రికా రాయ్ వ్యాఖ్యలపై లాలూ కుమార్తె, ఎంపీ మిసా భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టప్రకారమే తాము సామాన్లను వెనక్కి పంపామని.. అయితే చంద్రికా రాయ్ మాత్రం పబ్లిసిటీ కోసం చిల్లరగా ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో గతేడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అనతికాలంలోనే వీరి కాపురంలో కలతలు చెలరేగడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తండ్రి చంద్రికా రాయ్‌తో ఐశ్వర్యా రాయ్(ఫైల్ ఫొటో) -
‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్ లాక్కొన్నారు’
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీపై కేసు నమోదైంది. రబ్రీదేవీ తనను హింసించారని ఆరోపిస్తూ.. లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనకు విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు విచారణలో భాగంగా తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్య... తేజ్‌కు గంజాయి సేవించే అలవాటు ఉందని, డ్రగ్స్‌కు బానిస అయి తనను వేధించేవాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తేజ్ కుటుంబ సభ్యులు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో భర్తతో సహా తన అత్త రబ్రీదేవి సైతం తనను వేధింపులకు గురిచేశారని ఐశ్వర్యరాయ్ పోలీసులను ఆశ్రయించారు. తేజ్‌ప్రతాప్ విడాకులకు పట్టుబట్టడంతో రబ్రీదేవి తనను తీవ్రంగా కొట్టి బయటకు నెట్టివేశారని పేర్కొన్నారు. మెసేజ్ రావడంతో కిందకు వచ్చాను... ‘నేను నా గదిలో టీవీ చూస్తున్న సమయంలో నా ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. నన్ను, నా కుటుంబ సభ్యులను కించపరుస్తూ తేజ్ మద్దతుదారులు పట్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో పోస్టర్లు అతికించారని తెలిసింది. వెంటనే కిందకు దిగి ఈ విషయం గురించి మా అత్తగారిని నిలదీశాను. నా తల్లిదండ్రుల పరువు తీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాను. వెంటనే తను నన్ను అసభ్యంగా తిట్టడం మొదలుపెట్టారు. నా జుట్టు పట్టుకుని లాగుతూ.. కిందపడేశారు. తల, మోకాళ్లు, పాదాలపై కర్రతో కొట్టారు. బంగ్లా నుంచి గెంటివేసే ముందు చెప్పులు కూడా తొడుక్కోనివ్వలేదు. నా ఫోన్, ఇతర వస్తువులు లాక్కొన్నారు’ అంటూ సర్కులర్ రోడ్డు నివాసం బయట ఏడుస్తూ ఐశ్వర్య విలేకరులతో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలో తన తండ్రి చంద్రికారాయ్ సహా ఇతర కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్యారాయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం రబ్రీ దేవిపై కేసు నమోదు చేశారు. ఇక బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో గతేడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. -
'రేపిస్టులను రక్షించండి, అత్యాచారాలను పెంచండి'
పాట్నా: ఐదేళ్ల మైనర్ బాలికను దర్భాంగాలో ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటనపై బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ మీడియా ముందు మాట్లాడకుండా దాటవేయడాన్ని ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవీ విమర్శించారు. దర్భాంగా అత్యాచార ఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం మహిళల భద్రతపై నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వానికి ఆమె చురకలంటించారు. ట్విటర్ వేదికగా రబ్రీ దేవీ.. 'రేపిస్టులను రక్షించండి, అత్యాచారాలను పెంచండి' అనే రీతిలో నితీష్ కుమార్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. సిగ్గు లేని, పనికి మాలిన ప్రభుత్వం బిహార్‌లో రాజ్యమేలుతోందని విమర్శించారు. అనవసరపు విషయాల్లో తలదూర్చి.. ఏదైనా సమస్య తలెత్తగానే పారిపోయే బలహీన, పిరికి ఉప ముఖ్యమంత్రికి.. దర్భాంగా ఘటనతో మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలీట్లేదని ఎద్దేవా చేశారు. “ये रेपिस्ट बचाओ, रेप बढ़ाओ “वाली नीतीश सरकार है। बेशर्म, नाकारा और धिक्कार। हर मोर्चे पर मैदान छोड़ कर भागने वाला कमजोर असहाय डरपोक उप(चुप)मुख्यमंत्री.. हर वक़्त बात-बेबात बड़बड़ाने वाले के मुँह में शर्म घुस गया। https://t.co/AsDQjO0Loj — Rabri Devi (@RabriDeviRJD) December 7, 2019 వివరాల్లోకి వెళితే.. 5 సంవత్సరాల మైనర్ బాలిక ఆరుబయట ఆడుకుంటుండగా.. ఆమెను అపహరించి అత్యాచారం చేసిన ఘటన సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. దుండగుబు ఆమెను తోటలో తీసుకెళ్లి.. లైంగిక దాడి చేసి అక్కడే వదిలేశాడు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు ఆటో డ్రైవర్‌గా గుర్తించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు విచారణ చేపడుతున్నారు. #WATCH Patna: Bihar Deputy Chief Minister Sushil Modi evades question on Darbhanga minor rape case. pic.twitter.com/Yvjlgxbn6K — ANI (@ANI) December 7, 2019 కాగా దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నామని రబ్రీ దేవీ పేర్కొన్నారు. దిశ కేసులో హైదరాబాద్‌లో జరిగిన ఎన్కౌంటర్ నేరస్థులను కొంతమేర కట్టడి చేస్తుందని అన్నారు. బిహార్‌లో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. -
ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు
పట్నా: నాటకీయ పరిణామాల మధ్య బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్‌ను ఇంటిలోనికి అనుమతించారు. కోడలి నిరసనతో రబ్రీ దేవి దిగివచ్చారు. వివాహమైన కొద్ది నెలలకే తేజ్ ప్రతాప్ విడాకులు కోరుతూ.. కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాక భార్యతో విడాకులు ఇప్పిస్తేనే ఇంటికి వస్తానంటూ.. వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన భర్త డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్యర్య మొదటి సారి అత్తింటివారు తనను వేధిస్తున్నారని ఆరోపించారు. అత్త రబ్రీ దేవి, ఆడపడుచు మీసా భారతి తనకు ఆహారం కూడా పెట్టకుండా వేధించడమే కాక ఇంట్లో నుంచి గెంటేశారని తెలిపారు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాల్సిందిగా అత్తింటి బయట కూర్చుని నిరసన తెలిపారు ఐశ్వర్య. ఆమె తండ్రి చంద్రికా రాయ్ కూడా ఐశ్వర్యతో పాటు కూర్చుని.. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా మరికొందరు కలిసి రబ్రీ దేవి ఇంటి ముందు ధర్నాకు దిగారు. లాలూ, రబ్రీ దేవిలకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దాంతో రంగంలోకి దిగిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే వివాదాన్ని పరిష్కరించడంతో సోమవారం మధ్యాహ్నం ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు. రబ్రీ దేవి, మీసా భారతి తనను వేధిస్తున్నారని.. తిండి కూడా పెట్టడం లేదని ఐశ్వర్య ఆరోపించిన సంగతి తెలిసిందే. మీసా భారతి మూలంగానే తనకు, తన భర్తకు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని ఐశ్వర్య ఆరోపించారు. రబ్రీదేవి సమక్షంలోనే మీసా భారతి తనను ఇంటి నుంచి గెంటేశారని వాపోయిన సంగతి తెలిసిందే. -
తిండి కూడా పెట్టకుండా వేధించారు
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య రాయ్ అత్తింటి వారిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తన అత్త రబ్రీదేవి తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆడపడుచు మిసా భారతి తీవ్రంగా గృహహింసకు పాల్పడ్డారని, తనకు తిండికూడా పెట్టకుండా వేధించడంతోపాటు చివరకు తన సంసార జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త తేజ్ ప్రతాప్, మరిది తేజస్వి ప్రతాప్ యాదవ్ మధ్య విబేధాలు సృష్టించడానికి భారతి ప్రయత్నిస్తున్నారని ఐశ్వర్య పేర్కొన్నారు. రబ్రీ దేవి తన కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఐశ్వర్య తండ్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రిక రాయ్ ఆరోపించారు. దీనపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించిన ఆయన తన కుమార్తెకు అత్తగారి ఇంట్లో అన్ని హక్కులు పొందాలని కోరుకుంటున్నామన్నారు. (ఆదివారం సాయంత్రం వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు) మరోవైపు రాజ్యసభ సభ్యురాలు మిసా భారతి ఐశ్వర్యా రాయ్ ఆరోపణలను ఖండించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉంటున్న తాను ఆమెను ఎలా వేధించగలను అని ప్రశ్నించారు. తానెపుడు ఆమెను సోదరిలా భావించానంటూ ఐశ్యర్య ఆరోపణలు నిరాధారమైనవనీ కొట్టిపారేశారు. తల్లిదండ్రుల ఆదేశాల మేరకే ఇదంతా చేస్తోందనీ, తద్వారా తన ఆరోపణలకు మరింత బలం చేకూరాలని భావిస్తోందన్నారు. కాగా 2018, మే నెలలో అంగరంగ వైభవంగా ఐశ్వర్య, తేజ్ ప్రతాప్ వివాహం జరిగింది. అయితే, కొద్ది నెలలకే వీరిద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. తన భర్త తేజ్ ప్రతాప్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని ఆరోపించిన ఐశ్వర్య గృహ హింస నుంచి తనను కాపాడాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అలాగే గత ఏడాది నవంబర్‌లో తేజ్ ప్రతాప్ విడాకుల కోసం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య, ఆమె తండ్రి చదవండి : కన్నీటితో మెట్టినింటిని వీడిన ఐశ్వర్య.. -
నా ఆయుష్షు కూడా పోసుకుని..
పట్నా : ‘ప్రాణ సమానులు, గౌరవనీయులైన శ్రీ లాలూ ప్రసాద్ గారికి 72వ జన్మదిన శుభాకాంక్షలు. నా ఆయుష్షు కూడా పోసుకుని మీరు కలకాలం వర్ధిల్లాలి’ అని బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి తన భర్త, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లాలూతో కలిసి దిగిన ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా లాలూ ప్రసాద్ యాదవ్ 1948, జూన్ 11న బిహార్‌లో జన్మించారు. 1973లో రబ్రీదేవిని వివాహమాడిన ఆయనకు.. ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని స్థాపించిన లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా, రైల్వే శాఖమంత్రిగా, ఎంపీగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొన్న లాలూ.. ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆర్జేడీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కనీసం ఒక్క స్థానమైనా దక్కించుకోగా.. స్థానిక పార్టీ అయిన ఆర్జేడీ అసలు ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు లాలూ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ క్రమంలో పుట్టిన రోజు సందర్భంగా పలువురు నేతలు బిర్సా ముండా జైలులో లాలూను కలిసినట్లు సమాచారం. प्राणप्रिय आदरणीय श्री @laluprasadrjd जी को 72वें अवतरण दिवस की अनंत बधाईयाँ। आपको हमारी भी उम्र लग जावे। pic.twitter.com/rqwuawj3sx — Rabri Devi (@RabriDeviRJD) June 11, 2019 -
‘మహాకూటమి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయి’
పట్నా : నూతనంగా ఏర్పాడిన కేంద్ర మంత్రి వర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఆయన ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ లీడర్ రబ్రీ దేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయని.. నితీష్ కుమార్ ఎప్పుడైనా కూటమిలో చేరవచ్చని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నితీష్ కుమార్ మహాకూటమిలో చేరతానంటే మాకేం అభ్యంతరం లేదు. మేం ఆయనను స్వాగతిస్తున్నాం’ అన్నారు. ఆర్జేడీ నిర్ణయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు రఘువంశ ప్రసాద్ సింగ్ స్వాగతించారు. అయితే నితీష్ ఎప్పుడు ఎవరి వైపు మారతాడో.. ఎవరికి మద్దతిస్తాడో ఊహించలేం అన్నాడు. గతంలో చాలా సార్లు అతను ఇలానే చేశాడని గుర్తు చేసుకున్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకునే వారికి తాను మద్దతిస్తానని తెలిపాడు. రెండు సంవత్సరాల క్రితం నితీష్ కుమార్ మహాకూటమి నుంచి బయటకు వచ్చి.. ఎన్డీఏతో చేరిన సంగతి తెలిసిందే.