
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) జాతీయ అధ్యక్ష పదవి నుంచి లాలూప్రసాద్ యాదవ్ తప్పుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ ఖండించారు. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని శుక్రవారం తేల్చిచెప్పారు. లాలూ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు.
లాలూ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్‌ప్రతాప్ యాదవ్ పోటీపడుతున్నట్లు బిహార్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. గుండె, మూత్రపిండాల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు.
(చదవండి: 'జడ్' కేటగిరి భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ)