lalu prasad
-
మీరు మరీ అంత కంగారు పడకండి సార్ ఆయనేదో మాటవరుసకనుండొచ్చు!
-
ఇందిరా గాంధీ మమ్మల్ని జైల్లోకి నెట్టారు.. కానీ: ఎమర్జెన్సీపై లాలూ యాదవ్
రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎమర్జెన్సీపై శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యయిక స్థితి సమయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను లాలూ గుర్తు చేసుకున్నారు. ఇందిరా గాంధీ అనేకమంది నాయకులను కటకటాల వెనక్కి నెట్టారు.. కానీ, ఎప్పుడూ ఎవరిని హింసించలేదని పేర్కొన్నారు.ఈ మేరకు లాలూ, జర్నలిస్ట్ నలిన్ వర్మ రాసిన "ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975" ఆర్టికల్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇందులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 1975 దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అయినప్పటికీ 2024లోనూ ప్రతిపక్షాలను ప్రభుత్వం గౌరవించడం లేదనే విషయాన్ని మరిచిపోకూడదన్నారు."అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి నేను కన్వీనర్‌గా ఉన్నాను. నేను 15 నెలలకు పైగా భద్రతా చట్టం (మిసా) కింద జైలులో ఉన్నాను. ఈ రోజు ఎమర్జెన్సీ, స్వేచ్ఛ విలువ ఉపన్యాసాలు ఇస్తున్న మోదీ, జేపీ నడ్డా, ఇతర బీజేపీ మంత్రుల గురించి నాకు, నా సహచరులకు తెలియదు. వారి గురించి మేము అసలు వినలేదు.ఇందిరా గాంధీ మనలో చాలా మందిని కటకటాల వెనక్కి నెట్టారు. కానీ ఆమె మమ్మల్ని ఎప్పుడూ దుర్భాషలాడలేదు. ఆమె లేదా మంత్రులు మమ్మల్ని జాతీ వ్యతిరేకులు, దేశభక్తి లేనివారని ఎప్పుడూ పిలవలేదు. మన రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతిని అపవిత్రం చేయడానికి ఆమె ఎప్పుడూ విధ్వంసకారులను అనుమతించలేదు. 1975 మన ప్రజాస్వామ్యానికి మచ్చ. కానీ 2024లోనూ ప్రతిపక్షాలను బీజేపీ గౌరవించడం లేదని విషయాన్ని మరచిపోకూడదు. ”అని లాలూ పేర్కొన్నారు.కాగా జూన్ 25, 1975న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 21 నెలల అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ కాలాన్ని భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలాల్లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే ఎమర్జెన్సీ విధించి జూన్ 26కు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 'ఎమర్జెన్సీ' విధించడాన్ని విమర్శించారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు ఖండించారు. -
లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (బీహార్) గురించి తెలియనివారెవరూ ఉండరు. ఆయన కుమార్తె, సారణ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన రోహిణి ఆచార్య ఇప్పుడు వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నారు. మహాకూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆమె తన అఫిడవిట్లో తనకు రూ.15.82 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే తన భర్తకు రూ.19.86 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయని తెలియజేశారు.వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె వివాహం తర్వాత సింగపూర్ షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడామె భారత్‌కు తిరిగివచ్చారు. ఆమె తన వద్ద రూ.2.99 కోట్ల చరాస్తులు, రూ.12.82 కోట్ల విలువైన స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భర్త దగ్గర రూ.6.92 కోట్ల చరాస్తులు, రూ.12.94 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. అలాగే తన వద్ద రూ.20 లక్షల నగదు, భర్త వద్ద రూ.10 లక్షల నగదు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం ఆమె దగ్గరున్న స్థిరాస్తులలో పట్నాలో రూ.68.62 లక్షల విలువైన వాణిజ్య పరమైన ఆస్తి కూడా ఉంది. రోహిణి ఆచార్య గతంలో తన తండ్రి లాలూ ప్రసాద్‌కు కిడ్నీ దానం చేసి, వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్‌గా ఉంటారు. మే 20న ఐదవ దశ లోక్‌సభ ఎన్నికల్లో సారణ్‌లో ఓటింగ్ జరగనుంది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీపై ఆమె పోటీ చేస్తున్నారు. రోహణి ఆచార్య .. లాలూ ప్రసాద్, రబ్రీ దేవిలకు నాల్గవ సంతానం. గతంలో లాలూ ప్రసాద్ సారణ్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. -
ఎన్నికలయ్యాక రామ్‌లల్లా సన్నిధికి లాలూ
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన తరువాత ఈ నెలలో తొలిసారిగా శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇదిలావుండగా రానున్న ఎన్నికల్లో బీజేపీకి రామాలయ అంశం కలిసివచ్చేదిగా కనిపిస్తోంది. దీంతో ఇతర పార్టీల నేతలు కూడా అయోధ్య రామాలయంవైపు దృష్టి సారిస్తున్నారు. తాజాగా బీహార్‌లోని పాటలీపుత్ర ఎంపీ మిసా భారతి మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు తాను కూడా త్వరలో అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించనున్నానని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నామని, ఎన్నికల అనంతరం రామాలయానికి వెళ్తామన్నారు. కాగా బీహార్ సీఎం నితీష్ కుమార్.. ప్రధాని మోదీ పాదాలను తాకడంపై మిసా భారతి మాట్లాడుతూ అది మన సంస్కృతి అని అన్నారు. -
లాలూ రాజీనామా వార్తలపై స్పందించిన రబ్రీదేవీ
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) జాతీయ అధ్యక్ష పదవి నుంచి లాలూప్రసాద్ యాదవ్ తప్పుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవీ ఖండించారు. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని శుక్రవారం తేల్చిచెప్పారు. లాలూ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారని ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు వెల్లడించారు. లాలూ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్‌ప్రతాప్ యాదవ్ పోటీపడుతున్నట్లు బిహార్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. గుండె, మూత్రపిండాల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూప్రసాద్ యాదవ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. (చదవండి: 'జడ్' కేటగిరి భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ) -
‘నితీష్జీ కూటమిలో చేరండి’
పట్నా : కేంద్ర మంత్రివర్గంలో బెర్తులపై బీజేపీ పట్ల కినుక వహించిన బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను తిరిగి మహాకూటమిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. నితీష్ కుమార్ మహాకూటమి గూటికి చేరాలని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ఆహ్వానించింది. నితీష్ కుమార్‌ను బీజేపీ అవమానిస్తున్న క్రమంలో బీజేపీయేతర శక్తుల పునరేకీకరణకు ఇదే సరైన సమయమని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘ్‌వంశ్ ప్రసాద్ సింగ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం నేపథ్యంలో భాగస్వామ్య పక్షాల నుంచి పార్టీకి ఒకరి చొప్పున మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న కాషాయ పార్టీ నిర్ణయంతో నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరబోదని నితీష్ స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి బిహార్‌లో 17 స్ధానాల్లో పోటీ చేసిన జేడీ(యూ) 16 స్ధానాల్లో గెలుపొందడంతో కేంద్ర క్యాబినెట్లో ఎక్కువ మందికి చోటు దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు ఆశించినా ఆ మేరకు ప్రాధాన్యం దక్కకపోవడంతో నితీష్ కంగుతున్నారు. ఎన్డీయేలో అంతా బాగానే ఉందని వ్యాఖ్యానించిన నితీష్ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాగైనా జరగవచ్చని పేర్కొనడం గమనార్హం. -
లాలూ సోషల్ మీడియా ఖాతాలపై విచారణ : ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ : పశుగ్రాస కేసుల్లో జైలు జీవితం గడుపుతున్నా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నారనే వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణకు ఈసీ ఆదేశించింది. లాలూ ప్రస్తుతం జార్ఖండ్‌లోని రాంచీలో బిర్సా ముందా సెంట్రల్ జైలులో ఉన్నారు. కాగా లాలూ జైలు నుంచే ట్విటర్, ఫేస్బుక్ ఖాతాలను నిర్వహిస్తున్నారా లేక వెలుపలి నుంచి వేరొకరు వీటిని నిర్వహిస్తున్నారా అనేది ఈసీ నిర్ధారిస్తుందని బిహార్ ఎన్నికల ప్రధానాధికారి హెచ్ఆర్ శ్రీనివాస చెప్పారు. లాలూపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఆయనపై చర్యలు చేపట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. లాలూ ప్రసాద్ ట్విటర్ ఖాతాపై ఈసీ దృష్టిసారించిందని పట్నా రిటర్నింగ్ అధికారి సంజయ్ సింగ్ పేర్కొన్నారు. పశుగ్రాస కుంభకోణానికి సంబంధించి మూడు కేసుల్లో బెయిల్‌ను కోరుతూ లాలూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ముందుకు రావడం ఆయనకు ఇబ్బందికరమేనని చెబుతున్నారు. -
రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లకు బెయిల్ మంజూరు
-
రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌లకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ భూ కుంభకోణం కేసులో బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌లకు ఢిల్లీ పటియాలా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు లాలూ ప్రసాద్ యాదవ్‌కు సీబీఐ కోర్టు ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన క్రమంలో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ నేడు కోర్టు ఎదుట హాజరు కాలేకపోయారు. ఐఆర్సీటీసీ స్కామ్‌లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ సహా 13 మంది ఇతరులపై ఈడీ తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. చార్జిషీట్లో ఆర్జేడీ నేత , కేంద్ర మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా, ఆయన భార్య సరళా గుప్తా, సంస్థ లారా ప్రాజెక్ట్స్ పేర్లనూ ప్రస్తావించింది. పూరి, రాంచీల్లో రెండు రైల్వే హోటళ్లను నిబంధనలకు విరుద్ధంగా తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ మాజీ సీఎం లాలూ, ఐఆర్సీటీసీ అధికారులు విజయ్, వినయ్ కొచ్చర్లకు చెందిన సుజాత హోటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కట్టబెట్టారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు ప్రతిగా లాలూ సన్నిహితుడైన పీసీ గుప్తాకు చెందిన డిలైట్ మార్కెటింగ్ కంపెనీకి మార్కెట్ ధర కన్నా తక్కువ ధరలో విలువైన భూమిని బదలాయించారని పేర్కొన్నాయి. వీటిలో వాటాలు దక్కించుకోవడం ద్వారా అతితక్కువ ధరకే విలువైన భూమిని రబ్రీదేవి, ఆమె కుమారుడు తేజస్వి యాదవ్‌లు సొంతం చేసుకున్నారని దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. -
సీబీఐ కోర్టులో లొంగిపోయిన లాలూ
రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసుల్లో దోషిగా తేలడంతో జైలు శిక్ష అనుభవించేందుకు బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం ఎదుట లొంగిపోయారు. మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు వెంటరాగా లాలూ సీబీఐ న్యాయస్ధానానికి చేరుకున్నారు. రాంచీ హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆయన ఈ రోజు సీబీఐ న్యాయస్ధానంలో లొంగిపోయారు. లాలూకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ముంబై) వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు నివేదిస్తారని లాలూ న్యాయవాది ప్రభాత్ కుమార్ వెల్లడించారు. జార్ఖండ్ హైకోర్టు లాలూను త్వరగా ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ముంబైలో మూడు వారాల పాటు వైద్య చికిత్సలు పొందిన లాలూ శనివారం అక్కడినుంచి పట్నా చేరుకున్నారు. లాలూ ప్రాధమిక బెయిల్‌ను పొడిగించేందుకు నిరాకరించిన జార్ఖండ్ హైకోర్టు ఆగస్ట్ 30లోగా సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానంలో లొంగిపోవాలని కోరింది. వైద్యపరమైన కారణాలతో మే 11న లాలూకు ఆరు వారాల ప్రాధమిక బెయిల్‌ను మంజూరు చేసిన హైకోర్టు ఆ తర్వాత పలు సందర్భాల్లో ఆగస్ట్ 27 వరకూ పొడిగించింది. మరోవైపు రాంచీ విమానాశ్రమయంలో పార్టీ అనుచరులతో కలిసి వెలుపలికి వచ్చిన లాలూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తన ఆరోగ్యం బాగాలేదని, తానిప్పుడు మాట్లాడేదేమీ లేదన్నారు. -
లాలూకు పెరోల్
పట్నా : తన కుమారుడు తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదురోజుల పెరోల్ మంజూరైంది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ తన కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు మే 9 నుంచి 13 వరకూ పెరోల్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. రాంచీ ఎస్పీ, జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో లాలూకు పెరోల్ మంజూరైంది. పెరోల్‌పై నిర్ణయం తీసుకునేందుకు జైలు అధికారులు అడ్వకేట్ జనరల్ సలహాను పరిగణనలోకి తీసుకున్నారు. లాలూకు ఇప్పటికే రాంచీకి చెందిన రిమ్స్ ఫిట్నెస్ ధృవీకరణ పత్రం ఇచ్చింది. బుధవారం సాయంత్రం లాలూ రాంచీ నుంచి పట్నాకు బయలుదేరి వెళతారని ఆర్జేడీ నేత భోలా యాదవ్ తెలిపారు. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్, బీహార్ మాజీ సీఎం దుర్గా ప్రసాద్ రాయ్‌ల మనవరాలు ఐశ్వర్యాల వివాహ నిశ్చితార్థం ఏప్రిల్ 18న పట్నాలోని హోటల్ మౌర్యలో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఐశ్వర్యా మెహందీ వేడుక మే 12న కుటంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగనుంది. -
ఐఆర్సీటీసీ కేసులో లాలూపై సీబీఐ చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేట్ కంపెనీకి రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టును కట్టబెట్టడంలో అవినీతికి సంబంధించి మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌పై సీబీఐ సోమవారం చార్జిషీట్ నమోదు చేసింది. కోర్టుకు సమర్పించిన అభియోగపత్రంలో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి సహా 14 మంది పేర్లను ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇటీవల రబ్రీ దేవిని ప్రశ్నించింది. భారత రైల్వేల అనుబంధ ఐఆర్సీటీసీ నిర్వహించే రెండు హోటళ్లను సుజాత హోటల్స్ అనే సంస్థకు లాలూ కట్టబెడుతూ ప్రతిఫలంగా పాట్నాలో బినామి కంపెనీ పేరుతో మూడు ఎకరాల అత్యంత ఖరీదైన ప్లాట్‌ను పొందారని ఆరోపణలున్నాయి. సుజాత హోటల్స్‌కు అనుచిత లబ్ధి కలిగేలా తన పదవిని ఉపయోగించారని లాలూపై ఎఫ్ఐఆర్లో ఆరోపణలను పొందుపరిచారు. రెండు హోటళ్లను క్విడ్ ప్రోకో కింద ఆ సంస్థకు అప్పగించారని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. సుజాత హోటల్స్‌కు టెండర్ దక్కగానే సదరు స్థలం కూడా సరళా గుప్తా నుంచి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌ల చేతుల్లోకి వచ్చిందని ఆరోపించింది. -
లాలూకు ఎయిమ్స్‌లో చికిత్సకు అనుమతి
సాక్షి, పాట్నా : పశుగ్రాస కుంభకోణం కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స కోసం అనుమతి లబించింది. మెడికల్ బోర్డు సిఫార్సుల మేరకు ఆర్జేడీ నేతకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఏ వ్యాధితో బాధపడుతున్నారన్న వివరాలను అధికారులు వెల్లడించలేదు. పశుగ్రాసం కేసులో లాలూకు న్యాయస్ధానం 14 ఏళ్ల జైలు శిక్ష, రూ 60 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. రెండు కేసుల్లో వేర్వేరుగా ఏడేళ్ల జైలు శైక్ష, ఒక్కో కేసులో రూ 30 లక్షల జరిమానా విధిస్తూ సీబీఐ న్యాయమూర్తి శివ్ పాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. లాలూతో సహా 18 మందిని దోషులుగా నిర్ధారించారు. -
దాణా కుంభకోణం కేసులో లాలూకు మరో షాక్
-
బెయిల్ కోసం జార్ఖండ్ హైకోర్టుకు లాలూ
సాక్షి, రాంచీ : పశుగ్రాస కుంభకోణం కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ బెయిల్ కోసం జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయిస్తారని ఆయన న్యాయవాది తెలిపారు. తీర్పు ప్రతిని చదివిన అనంతరం వచ్చే సోమవారం లోగా తాము హైకోర్టుకు వెళతామని లాలూ న్యాయవాది ప్రభాత్ కుమార్ చెప్పారు. ఇటీవల లాలూ సోదరి మరణించిన నేపథ్యంలో పెరోల్ కోరుతూ న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తారా అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని బదులిచ్చారు. పశుగ్రాస కుంభకోణం కేసుకు సంబంధించి డిసెంబర్ 23న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం దోషిగా నిర్ధారించింది. -
పెరోల్ కోరనున్న లాలూ
పాట్నా : పశుగ్రాస కుంభకోణంలో మూడున్నరేళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ పెరోల్ కోరనున్నారు. ఆదివారం మరణించిన తన సోదరి గంగోత్రి దేవి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన పెరోల్‌పై విడుదలయ్యే అవకాశం ఉంది. రాంచీలోని జైలు అధికారుల ద్వారా గంగోత్రి దేవి మరణించారన్న సమాచారం లాలూకు చేరవేశామని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు. మరోవైపు ఈ రోజు ఆదివారం కావడంతో అవసరమైన లాంఛనాలు పూర్తిచేసి సకాలంలో ఆయన పెరోల్ పొందడం కష్టమని తేజస్వి ఆందోళన వ్యక్తం చేశారు. తమ మేనత్త భౌతిక కాయాన్ని ఆమె స్వగ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. లాలూ కన్నా నాలుగేళ్లు పెద్దయిన గంగోత్రి తమ్ముడి విడుదల కోసం శనివారం రోజంతా ప్రార్థనలు చేశారని లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ తెలిపారు. పశుగ్రాస స్కాం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ పదిలక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. -
లాలూకు మూడున్నరేళ్ల జైలు
-
‘లాలూకు బెయిల్ కష్టమే’
సాక్షి,పాట్నా: పశుగ్రాస కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ దోషిగా తేలిన క్రమంలో ఆయనకు జనవరి 3న శిక్ష ఖరారు కానుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లాలూకు బెయిల్ లభించడం కష్టమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వరుసగా నేరాలకు పాల్పడే వారికి బెయిల్ మంజూరు చేసే విషయంలో హైకోర్టులు ఆచితూచి వ్యవహరిస్తాయని, అందులో రెండవ సారి దోషిగా తేలిన వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉంటాయని పాట్నాహైకోర్టు సీనియర్ న్యాయవాది వైవి గిరి పేర్కొన్నారు. మరోవైపు లాలూపై జార్ఖండ్‌లో ఐదు కేసులు, బీహార్‌లో ఒక కేసు నమోదైందని, జార్ఖండ్‌లో ఐదు కేసులకు గాను రెండు కేసుల్లో ఆయన దోషిగా తేలారని, మిగిలిన కేసులు వివిధ విచారణ దశల్లో ఉన్నాయని సీబీఐ పేర్కొంది. దుంకా ట్రెజరీ నుంచి రూ 3.9 కోట్లు, చైబస ట్రెజరీ నుంచి రూ 36 కోట్లు, దొరాండ ట్రెజరీ నుంచి రూ 184 కోట్లు, భాగల్పూర్ ట్రెజరీ నుంచి రూ 45 కోట్ల విత్‌డ్రాయల్స్‌కు సంబంధించి ఆయా కేసుల్లో విచారణ జరుగుతోందని తెలిపింది.లాలూపై కేసులు విచారణ దశలో ఉన్నందున ఆయనకు తక్షణం బెయిల్ లభించే అవకాశం లేదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. -
లాలు జడ్‌ప్లస్ వెనక్కి
న్యూఢిల్లీ/పట్నా: బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్‌కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) కల్పిస్తున్న జడ్‌ప్లస్ భద్రతను కేంద్రం ఉపసంహరించింది. ఇకపై ఆయనకు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. కేంద్రం తీరుపై లాలు, ఆయన ఇద్దరు కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం, మత సామరస్యం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని ఆపేసేలా కేంద్రం బెదిరించడానికి కుట్ర పన్నుతోందని లాలు ఆరోపించారు. తనకేమైనా అయితే నితీశ్ కుమార్, మోదీ ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలని అన్నారు. దిగజారుడుతనమే: తేజస్వి తన తండ్రిని హతమార్చడానికి కుట్ర జరుగుతోందని, ఆయనకు ఏమైనా అయితే మోదీ తోలు వలుస్తామని లాలు కొడుకు తేజ్ ప్రతాప్ హెచ్చరించారు. కావాలంటే తాను మాట్లాడింది వెళ్లి మోదీకి చెప్పుకోవచ్చని మీడియాతో అన్నారు. తన తండ్రికి భద్రతను కుదించడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు అద్దంపడుతోందని లాలు చిన్న కొడుకు తేజస్వి యాదవ్ అన్నారు. ఆర్జేడీ చేస్తున్న ఆరోపణలపై బిహార్ ఉపముఖ్య మంత్రి సుశీల్ మోదీ స్పందిస్తూ...ప్రజలు లాలుకు భయపడుతుంటే ఆయన దేనికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. -
‘కొడుకుకే కిరీటం’
సాక్షి, పాట్నా: తదుపరి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు తేజస్వి యాదవ్ ఆర్జేడీ సీఎం అభ్యర్థిగా పార్టీని ముందుండి నడిపిస్తారని ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ శుక్రవారం ప్రకటించారు.తేజస్వి నాయకత్వంలో ఆర్జేడీ 2020లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని లాలూ స్పష్టం చేశారు. పార్టీ సీనియర్ నేతలు అబ్ధుల్ బరి సిద్ధిఖి, రఘవంశ్ ప్రసాద్ సింగ్‌లతో భేటీ అనంతరం లాలూ ఈ ప్రకటన చేశారు. తేజస్వి పార్టీకి అందిస్తున్నసేవలను ఈ సందర్భంగా లాలూ ప్రశంసించారు. ఈనెల 9న 28వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తేజస్వి ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు.అయితే తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై పార్టీలో స్పష్టత రాలేదని పార్టీవ ర్గాలు పేర్కొనడం గమనార్హం. అంతకుముందు ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ పుర్వే బీహార్ తదుపరి సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరును ప్రతిపాదించగా, సిద్ధికీ, సింగ్‌లు పుర్వే అభిప్రాయంతో విభేదించడంతో పార్టీలో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. -
పట్నాలో ఆర్జేడీ భారీ సభ
సాక్షి, పట్నా: 'దేశ బచావో-బీజేపీ భాగవో' పేరిట రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆదివారం పట్నాలోని గాంధీ మైదానంలో భారీ సభను నిర్వహిస్తోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సభలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలు పాల్గొంటున్నారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ సభకు గైర్హాజరు అవుతుండటం విపక్షాల్లో ఐక్యతపై అనుమానాలకు తావిస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన బిహార్ మహాకూటమి నుంచి తప్పుకొని.. తిరిగి బీజేపీతో చేతులు కలిపి నితీశ్‌కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సభ జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సభలో జేడీయూ అసమ్మతి నేతలు శరద్ యాదవ్, అలీ అన్వర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. జేడీయూ ఎంపీలైన ఈ ఇద్దరు అసమ్మతి నేతలు లాలూతోపాటు వేదిక పంచుకోనున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డీ రాజా, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు సభలో పాల్గొనున్నారు. లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతి, తనయులు తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. -
‘సిగ్గుండాలి’.. నితీష్‌పై లాలూ తిట్లదండకం
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తిట్టిపోశారు. గతంలో ఎప్పుడూ లేనంత ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ ఓ రాజకీయ ద్రోహి అని అన్నారు. నితీష్ ఓ పాల్తు-రామ్ అంటూ ధ్వజమెత్తారు. నితీష్ అధికారంలో కోసం వెంపర్లాడతాడని ఆరోపించారు. ఇన్నిసార్లు వైఖరులు మార్చుకున్న నేతను తానెప్పుడూ చూడలేదని, తమను అధికారంలో నుంచి తొలగించడానికి అతడు చెప్పిన పలు కారణాలు సహించలేకనే తాను ఇక స్పందించాల్సి వస్తుందని మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ విషయంలో నితీష్ వైఖరిని గమనిస్తే అతను ఎలాంటి వారో తెలిసిపోతుందని అన్నారు. మొన్నటి వరకు మోదీ అంటే చిర్రుబుర్రులాడిన నితీష్ ఇప్పుడు మాత్రం తెగ పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడని మండిపడ్డారు. మోదీని ఓడించడమే తన లక్ష్యం అని చెప్పిన నితీష్ 2019 ఎన్నికల్లో మోదీని ఓడించే నాయకుడే లేడంటూ భజనకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 బిహార్ ఎన్నికల్లో లాలూకు ఓట్లు రావడానికి తాను కూడా ఒక కారణం అంటూ నితీష్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ’నితీష్ నాకోసమే ఓట్లు పొందానని చెప్పాడు. ఇలా చెప్పడానికి నితీష్‌కు సిగ్గుండాలి. నేను అతడికంటే చాలా అనుభవజ్ఞుడిని’ అని రుసరుసలాడారు. తానే తనను ముఖ్యమంత్రిని చేశానని నితీష్ చెప్పాడు.. కానీ, ఆయన బలమెంతో బిహార్ ప్రజలు 2010 ఎన్నికల్లో చూపారు’ అని అన్నారు. ’గతంలో నువ్వు(నితీష్) తీసుకున్న నిర్ణయంపైనే ఉండలేకపోయావ్ ఆ విషయం మరిచిపోయావా. నువ్వు కేవలం రెండుసార్లు ఓడిపోవడం మాత్రమే కాదు.. లోక్ సభ ఎన్నికల్లో కూడా పెద్ద మొత్తంలో దెబ్బతిన్నావు’ అంటూ ఎద్దేవా చేశారు. -
నితీశ్ ఓ అవకాశవాది: లాలూ
స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసమే: రాహుల్ రాంచీ: బిహార్ ముఖ్యమంత్రిగా ఆరోసారి గురువారం ప్రమాణం చేసిన నితీశ్ ఓ అవకాశవాది అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దుయ్యబట్టారు. ఇదంతా బీజేపీ వెన్నుదన్నులతోనే జరిగిందని ఆరోపించారు. బిహార్ తాజా పరిణామాలపై తాము న్యాయపరంగా ముందుకెళ్తామని లాలూ పేర్కొన్నారు. ఒకప్పుడు బీజేపీ వ్యతిరేకిగా నితీశ్ వ్యవహరించడమంతా ఆ రెండు పార్టీలు (జేడీయూ, బీజేపీ) కలిసి ఆడిన డ్రామానేనని అన్నారు. ‘ఆయన ఓ అవకాశవాది. మతవాద శక్తులకు వ్యతిరేకంగా బిహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన తుంగలో తొక్కారు. 2015 ఎన్నికల్లో సొంత బలంపై గెలవలేనని తెలుసుకుని...అల్పసంఖ్యాక, వెనుకబడిన వర్గాల్లో మా పార్టీకి మంచి పట్టుండటంతో నా సాయం కోరారు. మా అవినీతిని గురించి ప్రశ్నించడానికి ఆయనేమైన సీబీఐ డైరెక్టరా లేక పోలీసు శాఖ డైరెక్టరా?’ అని లాలూ ప్రశ్నించారు. ‘రాష్ట్ర శాసనసభలో మాదే అతిపెద్ద పార్టీ. గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ ముందు మమ్మల్ని పిలిచి బలం నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చి ఉండాల్సింది. మేం విఫలమై ఉంటే, జేడీయూను పిలిచి ఉండాల్సింది’ అని లాలూ చెప్పుకొచ్చారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్ ఝా మాట్లాడుతూ గవర్నర్ నిర్ణయంపై తాము కోర్టుకు వెళ్తామన్నారు. మళ్లీ మతవాదులతో కలిశారు: రాహుల్ బిహార్‌లో ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే నితీశ్ మళ్లీ బీజేపీతో చేతులు కలిపారని అన్నారు. గత మూడు నాలుగు నెలల నుంచే కూటమి నుంచి బయటకు వెళ్లేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ‘మతవాద వ్యతిరేక పోరాటంలో నితీశ్ మాతో చేతులు కలిపారు. కానీ ఇప్పుడు ఆయన వ్యక్తిగత స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం...మేం ఉమ్మడిగా ఎవరిపై పోరాటం జరిపామో వారికి చేరువయ్యారు’ అని రాహుల్ పేర్కొన్నారు. నాపై కక్షతోనే ఇలా చేశారు: తేజస్వి బీజేపీ, జేడీయూలు కలిసి తనపై కక్షగట్టి, తనను మంత్రిపదవి నుంచి తప్పించేందుకే ఇదంతా చేశాయని బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, లాలూ కొడుకు తేజస్వి ఆరోపించారు. ‘నా మంచి పనితీరు మా మాజీ మిత్రపక్షాన్ని, బీజేపీని ఆందోళనకు గురిచేసింది. నాపై పన్నిన ఈ కుట్ర వారి క్రూరత్వాన్ని బయటపెట్టింది’ అని తేజస్వీ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. ‘ఏ మచ్చా లేకుండా నేను ప్రభుత్వంలో అడుగుపెట్టాను. బిహార్ ప్రజలకు మంచి భవిష్యత్తునివ్వాలన్న ఆకాంక్షతో వచ్చాను. అవకాశవాద ప్రత్యర్థిగా జేడీయూని గుర్తించడానికే నేను ఇక్కడకు వచ్చానని అర్థమవుతోంది’ అంటూ మరో ట్వీట్ చేశారు. -
'త్వరలో లాలూకు గట్టి సమాధానమిస్తా'
పట్నా: అవకాశవాది, నమ్మక ద్రోహి అంటూ తనపై వ్యాఖ్యలు చేసిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు త్వరలోనే గట్టి సమాధానం చెబుతానని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూకు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తగిన సమయంలో దిమ్మతిరిగిపోయే సమాధానం చెబుతానని చెప్పారు. మరోసారి బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నితీశ్‌కుమార్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. నితీశ్‌కుమార్ నమ్మకద్రోహి, ఆయన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని ఆయన అన్నారు. బీజేపీతో నితీశ్ చేతులు కలుపడం మ్యాచ్ ఫీక్సింగేనని ఆరోపించారు. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొనే తాను బీజేపీతో చేతులు కలిపానని అన్నారు. బిహార్ అభివృద్ధి, న్యాయం తనముందున్న ప్రాధాన్యత అంశాలని నితీశ్ చెప్పారు. బిహార్ ప్రజల యోగక్షేమాలే తనకు తొలి ముఖ్యమైన అంశం అని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ బిహార్ ప్రజలకు సేవ చేస్తానంటూ ఆయన స్పష్టం చేశారు. -
లాలూకు మరో షాక్.. కేసు నమోదు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తాజాగా లాలూపై కేసు నమోదు చేశారు. రైల్వే హోటల్ అలాట్మెంట్లో ఆయన భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు నమోదు చేశారు. మహాకూటమికి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుడ్‌బై చెప్పేసిన గంటలు కూడా గడవక ముందే కేసు నమోదు కావడం గమనార్హం. నితీశ్ కుమార్ బిహార్ రాజకీయాలలో మరోసారి సంచలనం సృష్టించి మహాఘట్బంధన్ను వదిలి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆరోసారి ముఖ్యమంత్రిగా గురువారంనాడు ప్రమాణం చేశారు. అవినీతిని తుదముట్టించేందుకు ఆయన ఎలాంటి నిర్ణయాలైన తీసుకుంటారని పేరుంది. -
మాజీ సీఎంకు బంపర్ ఆఫర్
పట్నా: బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతికి రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ ప్రసాద్ ఊహించని ఆఫర్ ఇచ్చారు. బిహార్ నుంచి ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ‘మాయావతితో చాలా సేపు మాట్లాడాను. వేధింపులు, బీజేపీ విభజన అజెండాకు వ్యతిరేకంగా పోరాడేందుకు బిహార్ నుంచి రాజ్యసభ సీటు ఇస్తామని ఆమెతో చెప్పాన’ని లాలూ ట్విటర్లో వెల్లడించారు. దళితులపై దాడుల అంశంపై రాజ్యసభలో తనకు మాట్లాడే అవకాశం కల్పించనందుకు నిరసనగా మంగళవారం తన ఎంపీ పదవికి మాయావతి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. ఎంపీగా ఆమె పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ముగియనుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీఎస్పీకి కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మళ్లీ ఆమెను రాజ్యసభకు పంపే బలం బీఎస్పీకి లేదు. మాయావతి కోరుకుంటే బిహార్ నుంచి ఆమెను రాజ్యసభకు పంపుతామని లాలూ ప్రసాద్ చెప్పారు. తాము ఆమె వెంట ఉంటామని భరోసాయిచ్చారు. 2019 సాధారణ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేసే చర్యల్లో భాగంగానే లాలూ ఈ ఆఫర్ ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది. అఖిలేశ్ యాదవ్, మాయావతిని కలిపేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 27న పట్నాలో నిర్వహించనున్న ర్యాలీని వీరిద్దరినీ లాలూ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
తేజస్విపై వేటు:.. లాలూ గేమ్‌ప్లాన్ ఇదే!
ఆర్జేడీ మంత్రుల మూకుమ్మడి రాజీనామాలు నితీశ్ సర్కారు పడిపోకుండా బయటినుంచి సపోర్ట్ పట్నా: అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. తన భవిష్యత్తు కార్యాచరణపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తేజస్వి పదవి నుంచి దిగిపోవాల్సిందేనని సీఎం నితీశ్‌కుమార్ ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తనకు తానుగా ఆయన రాజీనామా చేసే అవకాశం లేదని, సీఎం నితీశ్‌కుమార్ వేటు వేసేవరకు వేచి చూడాలని తేజస్వి భావిస్తున్నారని ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. తేజస్విపై వేటు వేసిన మరుక్షణమే నితీశ్ కేబినెట్లోని ఆర్జేడీ మంత్రులు సైతం మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని, అయినా, సంకీర్ణ ప్రభుత్వానికి బయటనుంచి తమ మద్దతును కొనసాగిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. సీబీఐ కేసు నేపథ్యంలో తేజస్వి రాజీనామా చేస్తే.. లాలూ కుటుంబం ఏదో తప్పుచేసిందన్న భావన పార్టీ శ్రేణుల్లోకి వెళుతుందని, ఇది పార్టీ కేడర్‌ను నైతికంగా దెబ్బతీసే అవకాశముందని, అందుకే తేజస్వి రాజీనామా చేయొద్దని లాలూ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయి నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే, పార్టీ గేమ్ ప్లాన్ ప్రకారం.. తేజస్వి నితీశ్ కేబినెట్ నుంచి తొలగించిన మరుక్షణమే.. 11మంది ఆర్జేడీ మంత్రులు సైతం కేబినెట్ నుంచి తప్పుకుంటారని, అయినా, మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వం పడిపోకుండా ఆర్జేడీ బయటి నుంచి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. -
లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు
-
లాలు కూతురికి కష్టాలు.. సీఏ అరెస్టు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ కుమార్తె మీసాభారతికి కష్టాలు ముంచుకొచ్చాయి. ఆమె దగ్గర చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్న రాజేశ్ అగర్వాల్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టుచేసి ఢిల్లీలోని ఒక కోర్టులో ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీలోని బిజ్వసాన్ ప్రాంతంలోని ఒక ఫాంహౌస్ కొనుగోలు చేయడానికి ఒక షెల్ కంపెనీ ద్వారా మీసాభారతి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ గత వారం ఆరోపించారు. ఆ కంపెనీ షేర్ల అమ్మకాలు, కొనుగోళ్ల పేరు మీద మీసాభారతి తన దగ్గర ఉన్న నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నారని ఆయన చెప్పారు. 2002 సంవత్సరంలో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో మిషాలి ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని పెట్టారని, దానికి చిరునామాను కూడా నాటి లాలు అధికార నివాసం అయిన నెం.25, తుగ్లక్‌రోడ్ బంగ్లాను చూపించారని, ఆ తర్వాత 2005-06లో ఆ కంపెనీ మూసేశారని మోదీ తెలిపారు. రూ. 10 ముఖవిలువ గల తన కంపెనీ షేర్లను షాలిని హోల్డింగ్స్ యజమాని వీరేంద్ర జైన్‌కు రూ. 100 చొపఉపన 2008 అక్టోబర్ నెలలో మీసాభారతి అమ్మారు. తద్వారా రూ. 1.20 కోట్లను అక్రమంగా కూడబెట్టారన్నది ప్రధాన ఆరోపణ. 11 నెలల తర్వాత ఆమె మళ్లీ జైన్ నుంచి అవే షేర్లను రూ. 10 చొప్పున కొన్నారని చెప్పిన మోదీ.. దానికి సంబంధించిన పత్రాలను కూడా చూపించారు. 2008-09 సంవత్సరంలో ఆమె ఢిల్లీలో రూ. 1.41 కోట్లతో ఫాంహౌస్ కొన్నారని, దాని ప్రస్తుత విలువ సుమారు రూ. 50 కోట్లు ఉంటుందని వివరించారు. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో రూ. 50 కోట్లు సంపాదించడం ఇంకెవరికైనా సాధ్యమా అని ఆయన అడిగారు. మోదీ ఆరోపణల నేపథ్యంలోనే మీసాభారతి చార్టర్డ్ అకౌంటెంట్ రాజేశ్ అగర్వాల్‌ను పట్టుకున్నారా, మరేవైనా ఇతర ఆధారాలున్నాయా అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. -
నేను జ్యోతిష్యుడిని.. మోదీ పదవి పోతుంది!
తనకు జ్యోతిష్యం తెలుసని, నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే అధికారం కోల్పోతుందని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ చెప్పారు. తనకు సంబంధించిన 22 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారన్న విషయంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో లాలుకు సంబంధం ఉన్న 22 చోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరిపి సోదాలు చేశారంటూ కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ 22 చోట్ల సోదాలు చేశారో తనకు చెప్పాలని, ఆ ప్రాంతాలు ఏంటని ఆయన విలేకరులను ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్భంలోనే ఆయన కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచకుపడ్డారు. తనకు జ్యోతిష్యం బాగా తెలుసని, మోదీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేయబోదని తాను స్పష్టంగా చెప్పగలనని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో లాలు, ఆయన కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమారులు, రాష్ట్ర మంత్రులు అయిన తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్‌లు బలవంతంగా లాక్కున్న భూమిలో ఓ పెద్ద మాల్‌ను నిర్మిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే వాటిని లాలు ఖండించారు. తన కుమారులు ఆ భూమిని కొనుగోలు చేసి డెవలపింగ్‌కు ఇచ్చారని, అందులో 50 శాతం బిల్డర్‌కు, మిగిలింది తనవాళ్లకు వస్తుందని, వాళ్లు బతకాల్సిన అవసరం లేదా అంటూ ఆయన మండిపడ్డారు. -
రిపబ్లిక్ టీవీ: లాలూకు ఆడియో టేపు షాక్
తన చానెల్ రిపబ్లిక్ టీవీని శనివారం ప్రారంభించిన అర్ణబ్ గోస్వామి బాంబు పేల్చారు. రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తీహార్ జైల్లో జీవితఖైదులో అనుభవిస్తున్న షహబుద్దీన్‌తో మాట్లాడుతున్న ఆడియో టేప్‌ను రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. జైలు నుంచి లాలూకు, షహబుద్దీన్ సూచనలు ఇస్తున్నట్లు అందులో ఉంది. లాలూ తనయుడు తేజ్ ప్రతాప్‌యాదవ్‌కు పాట్నాలో ఓ పెట్రోల్ పంపును 2011లో అక్రమంగా కేటాయించారని బీహార్‌కు చెందిన బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఆరోపణలు చేసిన కొద్ది గంటలకే ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడంతో విపక్షాలు లాలూ, అధికార బీజేడీలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. క్లిప్పింగ్‌పై మాట్లాడిన సుశీల్.. లాలూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. క్లిప్పింగ్‌పై మాట్లాడిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆడియో టేపును విన్న దేశం నివ్వెరవపోయిందని అన్నారు. ప్రారంభంతోనే నాయకుల అక్రమాలను బయటపెట్టడం మొదలుపెట్టిన అర్ణబ్‌ను పలువురు నాయకులు ప్రశంసించారు. కాగా, ఆడియో క్లిప్పింగ్‌పై ఆర్జేడీగానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఇంకా స్పందించలేదు. -
లాలూకు బిహార్ సర్కార్ ఝలక్
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం జోక్యం ఉన్న మట్టి కుంభకోణంపై బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణకు ఆదేశించారు. శరవేగంగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతో లాలూకు చెందిన పార్టీ వర్గాలు తీవ్ర అసంతృప్తి లేవనెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. లాలూ విషయంలో ముందు నుంచి కాస్త వైరుద్యంగానే వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత దూరం పెంచే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం తమ ఎదురుదాడి నుంచి తప్పించుకునేందుకే నామమాత్ర దర్యాప్తునకు ఆదేశించారని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై లాలూ, ఆయన కుమారులు వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పట్నా శివారులో లాలూ కుటుంబానికి ఒక పెద్ద ప్లాట్ ఉంది. ఇందులో ఒక పెద్ద వాణిజ్య సముదాయం కడుతున్నారు. దీనిని నిర్మిస్తున్న కంపెనీకి లాలూ కుమారులు డైరెక్టర్లు. పైగా ఒక కొడుకు అటీవీ శాఖ మంత్రికాగా, మరోకరు డిప్యూటీ సీఎం. ఈ సముదాయం నిర్మించేందుకు పునాదిలో పెద్ద మొత్తంలో మట్టితవ్వి తీశారు. ఆ మట్టిని ఎలాంటి టెండర్ పిలవకుండానే ప్రభుత్వానికి చెందిన జూపార్క్‌కు రూ.90లక్షలకు అమ్మేశారు. వాస్తవానికి జూపార్క్‌కు మట్టి అవసరం ఉందని ప్రభుత్వం ద్వారా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కానీ, అలా చేయకుండానే సొంతంగా ఈ పనిచేశారు. ఈ కుంభకోణంపై ప్రతిపక్షాలు భగ్గుమంటుండటంతో తాజాగా దర్యాప్తునకు ఆదేశించారు. సంబధిత మరిన్ని కథనాలకై చదవండి.. కొడుకు పుణ్యమా అని వివాదంలో లాలూ -
‘బీజేపీయేతర పార్టీలు ఏకం కావాలి’
పట్నా: దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్నీ కూటమిగా మారి 2019 లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ముందుకురావాలని రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అధ్యక్షుడు లాలుప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘హిందుత్వ’ఎజెండాతో దూకుడు మీదున్న మోదీని నిలువరించడానికి ఐక్యం కావాలని సూచించారు. మహా కూటమి ఏర్పాటు గురించి బిహార్ సీఎం నితీశ్ కుమార్ తో కూడా చర్చించినట్టు చెప్పారు. -
స్టేజీ కూలి లాలూకు గాయాలు..
-
స్టేజీ కూలి లాలూకు గాయాలు..
పట్నా: స్టేజీ కూలిన ఘటనలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు స్వల్పగాయాలయ్యాయి. పాట్నాలోని దిగాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనప్పుడు శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్టేజిపైకి ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తులు రావడంతో స్టేజీ కూలినట్టు తెలుస్తోంది. హుటాహుటిన లాలూ ప్రసాద్‌ను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం లాలూను ఇంటికి పంపించారు. కొద్ది రోజులు ఆయన్ను విశ్రాంతి తీసుకొవాల్సిందిగా వైద్యులు సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, వెన్ను నొప్పితో బాధపడుతున్నట్టు లాలూ తెలిపారు. -
చెవులు కుట్టించుకో.. గుండు గీయించుకో!
సుశీల్ మోదీ ట్వీట్‌కు లాలూ ఘాటు పంచ్! పట్నా: ట్విట్టర్ వేదికగా ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ మధ్య నిత్యం వ్యంగ్యాస్త్రాలు, మాటల యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా ఈ ఇద్దరు నేతలు మరోసారి దూసుకున్నారు. ట్విట్టర్ వేదికగా పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా తదితరుల సమక్షంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూపై సుశీల్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ’యోగి సీఎం కావడంతో ఆయనను ఎలా తిట్టాలో కూడా తెలియని దిగ్భ్రాంత స్థితిలో లాలూ ఉన్నారు’ అటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు అంతే ఘాటుగా స్పందించిన లాలూ.. ’నువ్వు కూడా చెవులు కుట్టించుకో. గుండు గీయించుకో. దుస్తులు మార్చుకో. ఇది నీకు మేలు చేయవచ్చు. (ప్రమాణస్వీకారానికి) నిన్ను పిలువలేదని మరీ బాధపడిపోకు’ అంటూ చురకలు అంటించారు. నువ్వు కూడా సన్యాసం స్వీకరిస్తే బాగుపడే చాన్సుందని పరోక్షంగా సూచిస్తూ లాలూ పేల్చిన ఈ వ్యంగ్యాస్త్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నది. సుశీల్మోదీకి ఇది అద్భుతమైన పంచ్ అని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఇటీవల లాలూ-మోదీ ట్వీట్ సంవాదం కొనసాగిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ తిరుగులేని విజయాలు సాధించడంతో.. నేరుగా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, 'లాలూ మీ పరిస్థితి ఏమిటి' అంటూ ఓ చిన్న ట్వీట్ చేశారు సుశీల్ మోదీ. దానికి లాలు చాలా షార్ప్‌గానే రియాక్ట్ అయ్యారు. 'నేను బాగానే ఉన్నా. నిన్నే యూపీలోకి అడుగుపెట్టనివ్వలేదు కాబట్టే.. అక్కడ బీజేపీ గెలువగలిగింది’ అంటూ కౌంటర్ ఇచ్చారు. -
లాలుతో పెట్టుకుంటే ఇంతే మరి!
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ బాగా షార్ప్‌గా ఉంటారు. రాజకీయ సెటైర్లు వేయాలంటే ఎవరైనా ఆయన తర్వాతే. అలాంటి లాలుకు షాకివ్వాలని ప్రయత్నించిన బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీకి లాలుయే ఝలక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల్లోను బీజేపీ తిరుగులేని విజయాలు సాధించడంతో.. నేరుగా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, 'ఎలా ఉన్నారు లాలూ' అని ఓ చిన్న ట్వీట్ చేశారు సుశీల్ మోదీ. దానికి లాలు చాలా షార్ప్‌గానే రియాక్ట్ అయ్యారు. 'నేను బాగానే ఉన్నాను. బీజేపీ నిన్ను యూపీలోకి రానివ్వలేదు. అందుకే ఆ పార్టీ అక్కడ గెలిచింది' అని సమాధానం ఇచ్చారు. సుశీల్ మోదీ, లాలుల మధ్య ఇలా సరదా సంభాషణలు, పొలిటికల్ సెటైర్లు కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా వీళ్లిద్దరి మధ్య ఇలాంటివి చాలానే జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సమయం నాటికి సమాజ్‌వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్‌కు, ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్‌కు మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు.. లాలుకు 'మీ కొడుకులతో జాగ్రత్త' అని సుశీల్ మోదీ చెప్పారు. @laluprasadrjd क्या हाल है ? — Sushil Kumar Modi (@SushilModi) 11 March 2017 ठीक बा। देखा ना, बीजेपी ने तुम्हें यूपी में नहीं घुसने दिया तो फायदा हुआ। https://t.co/KBzqOjGdzM — Lalu Prasad Yadav (@laluprasadrjd) 11 March 2017 -
ఆ విషయంలో మోదీ, ట్రంప్ ఒక్కటే..
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనదైన శైలిలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు సంధించారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అహ్మద్ మరణించినందుకు సంతాప సూచకంగా పార్లమెంట్ సమావేశాలను రేపటికి వాయిదా వేయకుండా, బుధవారం సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడాన్ని తప్పుపడుతూ, ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పోల్చారు. ప్రధాని మోదీని ఇండియన్ ట్రంప్‌గా అభివర్ణిస్తూ, ఇద్దరూ సమస్యలను సృషిస్తారని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే ట్రంప్ నియంతృత్వ విధానాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవడాన్ని లాలు ప్రస్తావించారు. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఎంత మొత్తంలో నల్లధనాన్ని వెలికితీశారు? దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపింది? వంటి విషయాలను బడ్జెట్లో ఎందుకు ప్రస్తావించలేదని లాలు ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంట్లో అస్వస్థతకు గురైన ఎంపీ అహ్మద్ బుధవారం మరణించారు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలు మరణిస్తే సభను ఒకరోజు వాయిదా వేస్తారని, మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని కాలరాసిందని లాలు విమర్శించారు. సభను రేపటికి వాయిదా వేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని, మోదీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని లాలు మండిపడ్డారు. -
అఖిలేష్‌కు లాలూ అభినందనలు
-
మిత్రపక్షంపై మొదలైన విమర్శనాస్త్రాలు
నితీశ్‌పై పరోక్షంగా లాలూ విసుర్లు పట్నా: ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ బాహాటంగా మద్దతు పలుకుతుండటంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన అసంతృప్తి వెళ్లగక్కారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలతో జత కట్టడానికి నితీశ్ నిరాకరిస్తుండటంపై లాలూ పరోక్ష విమర్శలు చేశారు. కొందరి వ్యక్తిగత అహం (ఈగో) వల్ల ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. బిహార్‌లో నితీశ్ జేడీయూ, లాలూ ఆర్జేడీ మిత్రపక్షాలుగా సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు అంశం సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలకు తావిస్తోంది. తాజాగా విలేకరులతో మాట్లాడిన లాలూ నేరుగా నితీశ్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. ఆయనపై విమర్శలు గుప్పించారు. నోట్లరద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలపై ప్రతిపక్షాలన్నింటికీ భావసారూప్యత ఉన్నప్పటికీ.. అవి ఒకే వేదికపైకి రావడానికి కొందరి వ్యక్తిగత అహం అడ్డుపడుతున్నదని లాలూ అన్నారు. నోట్లరద్దుకు వ్యతిరేకంగా ధర్నాకు ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము మాత్రం ఆందోళన చేపట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. -
ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ లాలూ
పట్నా: ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో ఎమర్జెన్సీ నాటి రోజులను తలపిస్తున్నాయని ఆయన అన్నారు. 'ప్రధాని మోదీ ఏ విధమైన ప్రజాస్వామ్యాన్ని రూపొందిస్తున్నారు?' అంటూ లాలూ ఈ మేరకు ట్విట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మనోభావాలను విస్మరించరాదని ఆయన అన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితుల తరహాలో కేంద్రం వ్యవహరిస్తోందని లాలూ ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ మాజీ జవాను కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు నిర్భందించటాన్ని లాలూ తప్పుపట్టారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని కేంద్రం టార్గెట్ చేసుకొని వేధింపులకు పాల్పడుతోందన్నారు. ప్రజల చేత ఎన్నకోబడ్డ ముఖ్యమంత్రిని అడ్డుకోవటం రాజ్యాంగాన్ని అతిక్రమించినట్లేనని లాలూ అన్నారు. -
లాలు ఓకే.. నితీష్ నో
పట్నా: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ హాజరవుతున్నారు. కాగా బిహార్‌లో ఆర్జేడీ మిత్రపక్షమైన జేడీ (యూ) నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. యూపీ రాజధాని లక్నోలో ఈ నెల 5న ఎస్పీ 25వ వ్యవస్థాపక దినోత్సవం జరగనుంది. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ జనతా పరివార్ నేతలకు ఆహ్వానం పంపారు. కాగా బిహార్ ప్రజలకు ఛాత్ పండగ చాలా ముఖ్యమైదని, ఈ పండగను వదిలి నితీష్ ఎస్పీ కార్యక్రమానికి వెళ్లరని జేడీయూ నేతలు చెప్పారు. ములాయం కుటుంబంలో విభేదాలున్నాయని, ఈ విషయంలో ఏదో ఒక వర్గం వైపు ఉండాలని కోరుకోవడంలేదని తెలిపారు. కాగా లాలు ఎస్పీ కార్యక్రమానికి వెళ్తున్నారని ఆర్జేడీ నేతలు స్పష్టం చేశారు. ములాయం సింగ్‌కు, లాలుకు బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. -
షహాబుద్దీన్ బెయిల్ రద్దు
-
షహాబుద్దీన్ బెయిల్ రద్దు
ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరుల హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన షహాబుద్దీన్.. 11 ఏళ్ల తర్వాత హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చారు. అయితే ఆయన బయటకు రాగానే ఒక్కసారిగా అనుచరులు హల్చల్ చేశారు. దాంతోపాటు బాధిత కుటుంబాలు కూడా ఆయన బయటకు రావడం వల్ల తమకు ప్రాణాపాయం ఉందని చెప్పాయి. షహాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వం కూడా బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లను శుక్రవారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. షహాబుద్దీన్ బెయిల్‌ను రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అతడిని వెంటనే మళ్లీ జైలుకు తరలిస్తారని ప్రశాంత భూషణ్ తెలిపారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో షహాబుద్దీన్ ఇవాళ మధ్యాహ్నం శివాన్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. కాగా మహ్మద్ షాబుద్దీన్.. బిహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. భయానకమైన నేరచరిత్ర, విజయవంతమైన రాజకీయ ప్రస్థానం.. ఈ రెండూ కలిపితే షాబుద్దీన్. బిహార్‌లో ఆయన పేరు వింటే ప్రత్యర్థులు, అధికార యంత్రాగం హడలిపోతారు. రెండు దశాబ్దాల పాటు నేరాలను, రాజకీయాలను సమాంతరంగా నడిపాడు. సొంత బలగాలను ఏర్పాటు చేసుకుని ఓ దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపాడు. లాలూకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే షహాబుద్దీన్.. ఆయనకే తాను విధేయుడిగా ఉంటాను తప్ప నితీష్ కుమార్‌కు కాదని కూడా చెప్పాడు. చివరకు బెయిల్ రద్దు కావడంతో మాజీ ఎంపీతో పాటు మాజీ సీఎం లాలూకు కూడా ఎదురుదెబ్బ తగిలినట్లయింది. -
'ఆయన ప్రధాని అయితే నాకు ఫుల్ హ్యాపీ'
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు తమ మద్దతు వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఉంటుందని డిప్యూటీ సీఎం ఆర్జేడీ అధినేత తనయుడు తేజస్వీ యాదవ్ అన్నారు. ఆయన ప్రతిపక్షాల తరుపు నుంచి ప్రధాని అభ్యర్థిగా ముందుకొచ్చినా తమకు సంతోషమే అని, తన తండ్రి లాలూ కూడా దీనికి సమ్మతంగా ఉన్నారని ఆయన చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. కానీ, నితీశ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా మారితే అది నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషాన్నిస్తుంది' అని అన్నాడు. ప్రధాని నరేంద్రమోదీకంటే కూడా సీఎం నితీశ్ ప్రధానిగా చాలా సమర్థులు అని, ఆయన నిజంగా ఓ ప్రధాని హోదాకు తగిన అర్హుడని తేజస్వి చెప్పాడు. 2019 ఎన్నికల్లో మాత్రం మరోసారి నరేంద్రమోదీ ప్రధానిగా గెలవలేరు అని జోస్యం చెప్పారు. నితీశ్ కుమార్ తనకు ఓ రాజకీయ గురువు అని గౌరవాన్ని చాటుకున్నాడు. అంతకుముందు లాలు ప్రసాద్ యాదవ్ కూడా రాహుల్ ప్రధాని అభ్యర్థినా కాదా అనే విషయం తనకు తెలియదని, కానీ.. నితీశ్ మాత్రం ప్రధాని పదవి అలంకరించేందుకు తగిన ముడిసరుకుకలవాడని అన్నారు. -
మా వాడికి బెయిలొస్తే.. మీకు నొప్పేంటి?
కరడుగట్టిన నేరస్థుడు మహ్మద షహాబుద్దీన్‌కు బెయిల్ రావడాన్ని ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ సమర్థించుకున్నారు. ఆ బెయిల్ మీద వివాదం అంతా బీజేపీ, మీడియా సృష్టే తప్ప ఇంకేమీ కాదన్నారు. కోర్టులు మాత్రమే ఇలాంటి విషయాలపై నిర్ణయం తీసుకుంటాయని లాలు చెప్పారు. అసలు షహాబుద్దీన్‌కు బెయిల్ వస్తే మీడియాకు నొప్పేంటని అడిగారు. ఈ విషయంలో మీడియా ఎందుకంత ఆసక్తి చూపిస్తోందని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలపై ప్రశ్నించడానికి మీడియా ఎవరని.. ప్రతివాళ్లూ కోర్టు నిర్ణయాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. మీడియా వాళ్లు బీజేపీతో కుమ్మక్కు కావడం వల్లే షహాబుద్దీన్ బెయిల్‌ను ప్రశ్నిస్తున్నారని లాలు చెప్పారు. ఈ బెయిల్‌ను సవాలు చేస్తూ అప్పీలు చేయాలని నితీష్ కుమార్ ప్రభుత్వం భావిస్తున్నా, లాలు మాత్రం షహాబుద్దీన్ను వెనకేసుకువచ్చారు. 11 ఏళ్లపాటు జైల్లోనే ఉన్న అతడికి పట్నా హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గత శనివారం ఉదయం భాగల్పూర్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతడిపై పలు హత్యకేసులతో పాటు దాదాపు 50 క్రిమినల్ కేసులున్నాయి. అతడి బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ నిర్ణయించుకున్నారు. -
ఆ పార్టీ నేతలంతా తాగుబోతులే!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ మరోసారి తనదైన శైలిలో బీజేపీపై విరుచుకుపడ్డారు. బిహార్‌లో బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ సరావుగి సోదరుడు మద్యం తాగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై స్పందిస్తూ బీజేపీలో ఎక్కువమంది నేతలు తాగుబోతులేనని లాలూ విమర్శించారు. బిహార్‌లో నితీశ్ సర్కారు మద్యంపై సంపూర్ణ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సోదరుడు అజయ్ సరావుగి తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సోదరుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని లాలూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మద్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతన్ని చితకొట్టాలని అన్నారు. 'ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే తప్పు లేకపోవచ్చుగానీ, బీజేపీలోని చాలామంది నేతలు తాగుబోతులే' అని లాలూ పేర్కొన్నారు. -
లాలూజీ మాటలకు అర్థాలే వేరులే..!
పట్నా: గంగానది వరద తాకిడికి బిహార్ అతలాకుతలమైంది. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. కొన్ని జిల్లాల్లో ఇళ్లు నీటమునిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. వరద పరిస్థితిని చూసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చలించిపోయారు. అయితే మిత్రపక్షమైన ఆర్జేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ తన కొడుకు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌తో కలసి వరద ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లినపుడు చేసిన వ్యాఖ్యలు వరద బాధితులను ఆయోమయానికి గురిచేశాయి. గంగ మీ ఇళ్లకు రావడం అదృష్టమంటూ వరద బాధితులను ఉద్దేశించి లాలు వ్యాఖ్యానించారు. 'చాలా సందర్భాల్లో మీరే గంగానది దగ్గరకు వెళ్తారు. అలాంటిది గంగ మీ ఇళ్లకు రావడం మీ అదృష్టం. ఇది ఎప్పుడో కానీ జరగదు' అంటూ తన స్టయిల్లో లాలు అన్నారు. లాలు అంతటితో వదిలిపెట్టకుంగా గంగా నది స్వచ్ఛత గురించి సెలవిచ్చారు. 'పవిత్రమైన గంగా జలం ఈ రోజుల్లో ఎక్కడు దొరుకుతోంది? గత దశాబ్దంకాలంగా గంగ మన నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ మనదగ్గరకు వచ్చింది' అని చెప్పారు. పోస్టు ద్వారా గంగజలాన్ని ఇంటికి పంపే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడాన్ని దృష్టిలో ఉంచుకుని లాలు ఇలా వ్యాఖ్యానించారేమో కానీ.. ఆయన మాటలకు మీడియా ప్రతినిధులు, వరద బాధితులు అవాక్కయ్యారు. 1975 వచ్చిన వరదల కంటే ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వరద బాధితులను ఆదుకుంటామని లాలు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నితీష్‌తో మాట్లాడి పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని చెప్పారు. అలాగే బోట్లు కొట్టుకుపోయిన మత్స్య కారులను ఆదుకుంటామని చెప్పారు. -
మోడీ మౌనంలోని ఆంతర్యం ఏమిటి?
పాట్నా: దేశంలో దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడాన్ని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. రెండురోజులుగా దేశంలో దళితులపై దాడులు .జరుగుతున్నా మోదీ స్పందించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని లాలూ ప్రశ్నించారు. మోదీ ప్రోత్సాహంతోనే దేశంలో పేదలు,దళితులపై దాడులు జరుగుతున్నాయని ట్వీట్ చేశారు. లాలూ కుమారుడు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని ముందుగా దళితుల దాడులపై స్పందించాలని ట్వీట్ చేశారు. దానికి రిప్లేగా లాలూ ఈ ట్వీట్ చేశారు. గుజరాత్ లోని ఉనాలో దళితులు ఆవుల చర్మం ఒలిచారని వారిపై కొందరు గోసంరక్షణ కార్యకర్తలు దాడి చేసిస విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు బిహార్ లోని ముజఫర్ పూర్ లో ఇద్దరు దళతులపై దాడులు జరిగాయి. -
'మాజీ సీఎంను రక్షించేందుకు సీఎం ప్రయత్నం'
పట్నా: బిహార్ మత్స్య, పశు సంవర్థక శాఖ కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు మాయమైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఇవి దాణా కుంభకోణానికి సంబంధించినవని ఆరోపణలు వస్తున్నాయి. ఫైళ్లు మాయమైన ఘటనపై పట్నాలోని పాత సచివాలయం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. 1990ల్లో బిహార్ ముఖ్యమంత్రిగా లాలు ప్రసాద్ ఉన్నప్పుడు దాణా కుంభకోణం వెలుగు చూసింది. పశువుల దాణా కుంభకోణంలో 1000 కోట్ల రూపాయల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు కారణంగా లాలూ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. బిహార్ లో ప్రస్తుతం జేడీయూ, ఆర్జేడీ కూటమి అధికారంలో ఉంది. దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్‌ను రక్షించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఫైళ్లు మాయంకావడంలో నితీష్‌కు సంబంధం ఉందని బీజేపీ నాయకుడు నితిన్ నవీన్ ఆరోపించారు. -
‘బీసీ బిల్లు’కు లాలూ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌కు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)అధినేత లాలూ ప్రసాద్ మద్దతు తెలిపారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని చేస్తున్న పోరాటానికి సహకరిస్తానని లాలూప్రసాద్ హామీ ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మీడియాకు తెలిపారు. శుక్రవారం ఇక్కడ లాలూప్రసాద్‌ను కలసి బీసీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకపోవడంతోపాటు ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారడంతో బీసీలు మరింత వెనుకబడిపోతున్నారని వివరించినట్లు చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీసీల పక్షాన పోరాడే బాధ్యత తీసుకోవాలని లాలూను కోరినట్లు తెలిపారు. బిహార్, యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాల చట్టసభలకు బీసీ ప్రజాప్రతినిధులు మెజారిటీ సంఖ్యలో ఎన్నికవుతున్నారని, దక్షిణాది రాష్ట్రాల్లో అది ఎందుకు సాధ్యం కావడం లేదని లాలూ ప్రశ్నించారని చెప్పారు. అనంతరం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యతో బీసీ సంక్షేమ సంఘం నేతలు సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచాలని, కేంద్రస్థాయిలో ఓబీసీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కులగణన వివరాలు వచ్చిన తరువాత రిజర్వేషన్ల పెంపు అంశాన్ని పరిశీలిస్తామని, వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని జస్టిస్ ఈశ్వరయ్య హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య తెలిపారు. -
తండ్రి మాటలకు డిప్యూటీ సీఎం వత్తాసు!
పట్నా: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ వ్యాఖ్యలకు వత్తాసు పలికారు. ఇంతకీ విషయం ఏంటంటే... ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ లలో ఎవరు బెస్ట్ అని మీడియా లాలును ప్రశ్నించింది. ఏమాత్రం తడుముకోకుండా నితీశ్ ఇందుకు సమర్ధుడు అంటూ లాలు బదులిచ్చారు. ఇదే విషయంపై లాలు కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వి స్పందించారు. తన తండ్రి చెప్పిన దాంట్లో తప్పేంలేదని మరిన్ని వివరాలు పేర్కొన్నారు. ప్రధానిగా రాహుల్, నితీశ్ లలో ఎవరు కరెక్ట్ అన్న విషయంపై నితీశ్ పేరును తండ్రి లాలు చెప్పడాన్ని తేజస్వి సమర్ధించారు. బిహార్ సీఎంకు క్లీన్ ఇమేజ్ ఉందని, ఐదు పర్యాయలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని ఈ అనుభవం సరిపోతుందని వివరించారు. మీడియా ప్రశ్నకు సమాధానం దేశ ప్రజానికానికి కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చిస్తామని, ప్రస్తుతం ఈ విషయాన్ని పెద్దది చేసి చూడవద్దని ఇంతటితో వదిలేయాలని సూచించారు. మంగళవారం లాలు ప్రసాద్ తన మద్ధతు నితీష్ కు ఉంటుందని మీడియాతో ముచ్చటించిన విషయం విదితమే. -
మా ఆవిడ వల్లే ఆరెస్సెస్ డ్రెస్ మార్చుకుంది!
పట్నా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఇటీవల డ్రెస్ కోడ్ మార్చుకోవడం తన భార్య, బిహార్ మాజీ సీఎం రబ్రీదేవి ఘనతేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆరెస్సెస్ తాజాగా తన డ్రెస్ కోడ్ ను మార్చిన సంగతి తెలిసిందే. మామూలుగా ధరించే ఖాకీ నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశపెట్టింది. దీని గురించి లాలూ స్పందిస్తూ 'ఆరెస్సెస్ డ్రెస్ మార్చుకునేలా రబ్రీదేవి చేయగలిగారు' అని ట్వీట్ చేశారు. వారిని ప్యాంట్ల నుంచి మళ్లీ నెక్కర్లలోకి మారుస్తామంటూ ఆరెస్సెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. దాదాపు రెండు నెలల కిందట ఆరెస్సెస్ డ్రెస్ కోడ్‌ను తన భార్య తప్పుబట్టిందని, దీంతో ఇబ్బందిగా ఫీలైన ఆరెస్సెస్ నాయకత్వం నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశపెట్టిందని లాలూ తెలిపారు. 'నిక్కర్లు వేసుకొని బహిరంగంగా తిరగడానికి ఆరెస్సెస్ వృద్ధ నేతలు సిగ్గుపడటం లేదా?' అంటూ గత జనవరిలో రబ్రిదేవీ ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలను బిహార్ బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రబ్రిదేవి 19వ శతాబ్దంనాటి పాతకాలపు మహిళలా మాట్లాడుతున్నారని సుశీల్‌మోదీ విమర్శించారు. కాగా, గత ఆదివారం నుంచి డ్రెస్‌కోడ్ మారుస్తున్నట్టు ఆరెస్సెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నాడు వైఎస్ పోరాటంతో రాష్ట్రానికి న్యాయం
రైల్వే బడ్జెట్లో మనకు తీరని అన్యాయం: రఘువీరా సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు లాలూప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉండగా, రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలు వైఎస్ సాధించారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం ఒంటెద్దు పోకడలతో రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. శుక్రవారం ఇందిరభవన్లో పార్టీ నేతలు శైలజానాథ్, తులసిరెడ్డి తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్నింటా మోసం చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలా? రాజకీయాలా? ఏది ముఖ్యమో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. అప్పట్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలందరితో సమావేశమై కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల సాధనకు వైఎస్ కృషి చేశారని, ప్రస్తుతం చంద్రబాబు అలాంటి సంప్రదాయాన్ని పక్కనపెట్టేశారన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం, అసమర్థత వల్లే రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. -
లాలు ప్రసాద్ అల్లుడి కారు చోరీ
ఢిల్లీ శివార్లలో లాలూ ప్రసాద్ అల్లుడు వినీత్ యాదవ్ కి చెందిన కారును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. సంచలనం కలిగించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినీత్ యాదవ్ కు చెందిన టొయోటా ఫార్చూనర్ కారు బుధవారం ఢిల్లీ నుంచి గుర్గావ్ వైపు వెళుతుండగా.. సికందర్పూర్ మెట్రో స్టేషన్ వద్ద సాయుధ దుండగులు.. కారును అడ్డగించి.. డ్రైవర్ ను కారునుంచి బయటికి లాగి.. కారును ఎత్తుకెళ్లారని తెలిపారు. దుండగుల వద్ద అత్యాధునిక తుపాకులు ఉన్నట్లు డ్రైవర్ హరి ప్రకాశ్ పేర్కొన్నాడు. కారును హైజాక్ చేసిన సమయంలో వినీత్ యాదవ్ కారులో లేరని అసిస్టెంట్ కమిషనర్ హవా సింగ్ వివరించారు. కాగా... వినీత్ ఫిర్యాదు మేరకు ఆయుధ చట్టం , కారు చోరీ కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మూత్రానికి బదులు డెట్టాల్ వాడుతున్నాం: లాలు
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డెట్టాల్లాగే మూత్రం కూడా మంచి యాంటీసెప్టిక్ అని ఆయన అన్నారు. పట్నాలో జరిగిన హోమియోపతిక్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మనం సాధించిన ప్రగతి ఏమిటంటే.. చేతులను డెట్టాల్‌తో కడుక్కోవడమేనన్నారు. చిన్నతనంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలితే మూత్రంతో కడిగేవాళ్లమని, అది యాంటీసెప్టిక్‌గా పనిచేసేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం ప్రజలు డెట్టాల్ వాడుతున్నారని, కొందరు దాన్ని చేతులు కడుక్కోడానికి కూడా వాడుతున్నారని ఆయన అన్నారు. మనం సాధించిన అభివృద్ధి ఇదేనని చెప్పారు. కొసమెరుపు: తన పెద్ద కొడుకు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు బదులుగా లాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
'ఆయనకు సూపర్ సీఎం హోదా ఇవ్వండి'
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఓ కార్యక్రమంలో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. పట్నాలో జరిగిన హోమియోపతి సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు లాలు కొడుకు, బిహార్ ఆరోగ్య మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆహ్వానించగా, అతనికి బదులుగా లాలు ప్రత్యక్షమయ్యారు. తద్వారా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష బీజేపీ లక్ష్యంగా చేసుకునేందుకు లాలు ఆస్కారమిచ్చారు. ఈ చర్య ద్వారా ఆరోగ్య శాఖను, బిహార్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో తెలుస్తోందని బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి నంద్ కిశోర్ యాదవ్ ఆరోపణలు సంధించారు. నితీశ్.. లాలుకు అధికారికంగా 'సూపర్ చీఫ్ మినిస్టర్' హోదా ఇవ్వాలని వ్యాఖ్యానించారు. బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలను లాలు తరచూ తనిఖీలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి చేయాల్సిన విధులను లాలు చేపట్టడంపై ప్రతిపక్షలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లాలు ఎమ్మెల్యే లేదా ఎంపీ కూడా కాదని, దాణా కుంభకోణం కేసులో బెయిల్‌పై ఉన్నారని, ఏ హోదాతో అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ప్రశ్నించారు. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నితీశ్ కేబినెట్లో లాలు ఇద్దరు కుమారులకు బెర్తులు దక్కాయి. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి!
న్యూఢిల్లీ: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా నిరసన పెల్లుబుక్కుతోంది. ముంబై, ఢిల్లీ విద్యార్థులు మంగళవారం రోడెక్కి ఆందోళనలు చేశారు. మరోవైపు రాజకీయ నాయకులు ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. విద్యార్థులతో ప్రమాదకరమైన రాజకీయ ఆటలు ఆడవద్దంటూ బీజేపీకి ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. బీజేపీ, ఆరెస్సెస్ కులవాద అజెండానే రోహిత్ ఆత్మహత్యకు దారితీసిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. రోహిత్ విషాదాంతం తనను తీవ్రంగా కలిచివేసిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు జరిపి.. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుమారి సెల్జా డిమాండ్ చేశారు. వారిద్దరిని బర్తరఫ్ చేయడం ద్వారా ప్రధానమంత్రి మోదీ చర్యలు తీసుకోవాలన్నారు. రాహుల్‌గాంధీ తీరు సరికాదు: బీజేపీ 'ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరి వల్లే కాంగ్రెస్ సతమతమవుతోంది. మేం గాయాలను మాన్పేందుకు ప్రయత్నిస్తుంటే.. వాటి నుంచి రాజకీయ మైలెజీకి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది' అని బీజేపీ నేత, కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి పేర్కొన్నారు. -
కాశీకి పోదాము... అంటున్న సీఎం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలుప్రసాద్ ఇద్దరూ కలిసి 'కాశీకి పోదాం' అనుకుంటున్నారట. యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి వారిద్దరూ వెళ్తుండటం విశేషం. మోదీ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించేందుకు లాలుప్రసాద్ ఈనెల 17న వారణాసి వస్తారని ఆర్జేడీ యూపీశాఖ అధ్యక్షుడు రామ్ చంద్ర పుర్వే తెలిపారు. త్వరలోనే లాలు పశ్చిమబెంగాల్ కూడా వెళ్తారని ఆయన చిన్నకొడుకు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ చెప్పారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కూడగట్టడమే ఆయన లక్ష్యమన్నారు. త్వరలోనే బిహార్ సీఎం నితీష్ కుమార్ కూడా వారణాసి వెళ్లి, అక్కడ ర్యాలీ నిర్వహిస్తారని జేడీ(యూ) యూపీ అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ తెలిపారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా జేడీ(యూ) పోటీ చేస్తుందని ఆయన అన్నారు. -
ఆ ఇద్దరి నేతలకు ఏమైంది?
పట్నా:గతేడాది నవంబర్ లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ ల మహా లౌకిక కూటమి అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 243 స్థానాలకు జరిగిన పోరులో మహా కూటమి 178 సీట్లను కైవసం చేసుకుని తిరుగులేని విజయంతో నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. అంతవరకూ బాగానే ఉన్నా ఇప్పుడు ఆ ఇద్దరి నేతల మాటల్లో పూర్తి విరుద్ధమైన ప్రకటనలే ప్రజల్ని ఆలోచనలో పడేస్తున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మింగా పాకిస్తాన్ కు వెళ్లి ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ తో చర్చలు జరపడాన్ని లాలూ తప్పుపట్టారు. మోదీ ప్రధాని కాకముందు ఏమని ప్రకటనలు చేశారో గుర్తుకు లేవా? అంటూ లాలూ ఎద్దేవా చేశారు. అసలు టెర్రరిస్టులు భారత్ లో ని ఎయిర్ బేస్ లోకి రావడానికి కారణం ఎవరు అనేది మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కలిసిన కొన్ని రోజులకే ఆ దేశ ఉగ్రవాద ప్రేరిపిత సంస్థల నుంచి భారత్ లో దాడులు జరగడం మోదీ అసమర్థ వైఖరికి నిదర్శమంటూ ఘాటుగా స్పందించారు. అయితే లాలూ భాగస్వామి అయిన నితీష్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటానికి పాకిస్తాన్ తో చర్చలు ఆహ్వానించదగ్గవే అంటూ నితీష్ మరో పల్లవి అందుకున్నారు. అదో ఉన్నతమైన కార్యక్రమని మోదీని నితీష్ కొనియాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాటానికి మోదీ వేసిన అడుగు ప్రశంసనీయమన్నారు. ఇటీవల భారత్ లో ఉగ్రదాడులు జరిగినా.. త్వరలోనే పరిస్థితుల్లో మార్పు వచ్చి అంతా చక్కపడుతుందని మోదీ పర్యటనను సమర్ధించారు ఆ ఎన్నికల పూర్తయి ఇంకా మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే వారి వైఖరిలో మార్పులు చోటు చేసుకున్నాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆనాటి ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ ప్రచార సారథిగా బాధ్యతలు వేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీపై వీరిద్దరూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ పేరు ఎత్తితేనే అంతెత్తున లేచి పడిన నితీష్- లాలూల ద్వయం ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా విడివిడిగా ప్రకటనలు చేయడం ఆసక్తికరంగా మారింది. అప్పుడు సంయుక్త ప్రకటనలతో మోదీని తూర్పారబట్టిన ఈ రాజకీయ ఉద్ధండుల వైఖరిలో మార్పులు చోటు చేసుకున్నాయా? వారి వారి సొంత ఎజెండాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారా? అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల్ని సైతం కచ్చితంగా ఆలోచనలోపడేస్తుంది. ఒకప్పుడు బీజేపీకి సాన్నిహిత్యంగా ఉన్న జేడీయూ మరోసారి అందుకు సానుకూలంగా వ్యవహరించడానికే ముందస్తు పావులు కదుపుతుందా? అనేది మరో కోణంలో కనిపిస్తుంది. ఒకవేళ నితీష్ మనసులో ఏ ఉద్దేశం లేకపోతే ఆకస్మికంగా మోదీని పొగడ్తలతో ముంచెత్తాల్సిన అవసరం ఏమిటనేది సామాన్యుడి ప్రశ్న. -
ఆస్పత్రిలో మాజీ సీఎం హల్చల్
బిహార్ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజి ఆస్పత్రికి ఉన్నట్టుండి ఓ అనుకోని అతిథి వచ్చారు. ఆయన్ను చూసి పేషెంట్లు ఆశ్చర్యపోగా.. డాక్టర్లు పరుగు పరుగున వచ్చారు. ఆయనే.. ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్. ఆయనకు తెలిసున్నవాళ్లు ఎవరో చికిత్స పొందుతుంటే చూసేందుకు వచ్చారేమోనని అందరూ అనుకున్నారు. కానీ.. తన కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోగ్యశాఖ మంత్రి కావడంతో.. అతడి తరఫున ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు లాలు వచ్చినట్లు కాసేపటికి అందరికీ అర్థమైంది. లాలు నేరుగా రోగుల వద్దకు వెళ్లి, ఆస్పత్రిలో సేవలు ఎలా ఉన్నాయని అడిగారు. పలు వార్డులను తనిఖీ చేశారు. నిజానికి 1997లో గడ్డి స్కాంలో లాలును జ్యుడీషియల్ కస్టడీకి పంపినప్పుడు ఆయన ఇదే ఆస్పత్రిలో చాలా నెలల పాటు ఓ వీఐపీ రూంలో 'పేషెంటు'గా గడిపారు. అయితే, తాను అక్కడకు దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఓ పేషెంటును కలిసేందుకు వెళ్లానని, దారిలో ఈ ఆస్పత్రి కనిపిస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని ఆగానని లాలు ఆ తర్వాత మీడియాతో అన్నారు. ఈ వ్యవహారం సీఎం నితీష్‌కుమార్‌కు తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. లాలు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు.. ప్రధానంగా బీజేపీ విరుచుకుపడే అవకాశం స్పష్టంగా ఉంది. -
మా సీఎం గారికి లెక్చర్లు ఇవ్వక్కర్లేదు
బిహార్ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అధికార కూటమిలోని జేడీ(యూ), ఆర్జేడీ మధ్య విభేదాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రెండు పార్టీలకు చెందిన నాయకులు పరస్పర విమర్శలు సంధించుకుంటున్నారు. బిహార్ ఎన్నికల్లో విజయం సాధించగానే ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్, జేడీ(యూ) నాయకుడు నితీష్ కుమార్ గట్టిగా కౌగిలించుకున్నారు. తన తమ్ముడు రాష్ట్రంలో చూసుకుంటాడని, తాను జాతీయస్థాయికి వెళ్తానని లాలు అప్పట్లో చెప్పారు. కానీ.. బిహార్‌లో శాంతిభద్రతల పరిస్థితి క్రమంగా విషమించడం, వరుసగా ముగ్గురు ఇంజనీర్ల హత్యలు జరగడంతో అక్కడ 'ఆటవిక రాజ్యం' వచ్చిందన్న విమర్శలు మొదలయ్యాయి. దీంతో లాలు ప్రసాద్ కూడా నితీష్ సర్కారు మీద చురకలు వేశారు. శాంతిభద్రతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా డబ్బులివ్వాలని బెదిరిస్తూ ఫోన్ చేస్తే తనను కలవాలని.. వెంటనే చర్యలుండేలా తాను చూస్తానని లాలు చెప్పారు. అంతేకాదు, లాలు పార్టీ ఉపాధ్యక్షుడు రఘువంశప్రసాద్ కూడా దీనిపై స్పందించారు. శాంతి భద్రతల పరిస్థితి మరింత దిగజారకుండా ప్రభుత్వంలో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రి నితీష్ కుమారే చూడాలని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం నితీష్ కుమార్ మౌనంగానే ఉన్నా.. ఆయన పార్టీ వాళ్లు మాత్రం దానిపై కాస్త ఘాటుగానే స్పందించారు. నితీష్‌కుమార్‌కు ఎవరూ లెక్చర్లు ఇవ్వనక్కర్లేదని, ఆయన ట్రాక్ రికార్డు ఎంచక్కా ఉందని జేడీ(యూ) అధికార ప్రతినిధి సంజయ్ కుమార్ సింగ్ అన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు బద్ధ శత్రువులుగా ఉన్న నితీష్.. లాలు ఏడాది క్రితం మళ్లీ కలిశారు. తామిద్దరి ఉమ్మడి శత్రువైన బీజేపీని ఎదుర్కోడానికి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించారు. కానీ ఆ ముచ్చట మూణ్ణాళ్ల కూడా నిలవకముందే పరస్పర విమర్శలు మొదలయ్యాయి. -
'బీహార్‌లో మళ్లీ 'జంగల్ రాజ్ వచ్చేసింది'
న్యూఢిల్లీ: బిహార్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస హత్యల నేపథ్యంలో నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి, ఎల్జేపీ రాంవిలాస్ పాశ్వాన్ ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీయే చెప్పినవిధంగానే బిహార్‌లో మళ్లీ 'జంగల్ రాజ్' (ఆటవిక రాజ్యం) వచ్చేసిందని మండిపడ్డారు. వరుస హత్యలు జరుగుతున్నా నితీశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిష్క్రియగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 'బిహార్‌లో మళ్లీ జంగల్ రాజ్ వచ్చేసింది. నితీశ్-లాలూ జోడీకడితే బిహార్‌లో మళ్లీ ఆటవిక రాజ్యం వస్తుందని మేం ఎన్నికల ప్రచారంలో చెప్పాం. జంగల్‌రాజ్ కాదు 'మంగళ్ రాజ్' (మంగళకరమైన రాజ్యం) వస్తుందంటూ నితీశ్-లాలూ చెప్పారు. ఇది ఆటవిక రాజ్యామా? లేక మంగళకర రాజ్యమా? అన్నది ఇప్పుడు ప్రజలే చెప్పాలి' అని ఆయన మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు. బిహార్‌లో వరుసగా ఇంజినీరింగ్ విద్యార్థుల మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
కూతురికి, భార్యకు రాజ్యసభ సీట్లు!
-
కూతురికి, భార్యకు రాజ్యసభ సీట్లు!
బిహార్ అంటే... అందునా లాలు ప్రసాద్ అంటే కుటుంబ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన ఇద్దరు కొడుకులు రాష్ట్రంలో మంత్రులు. అందులోనూ చిన్నకొడుకు ఉప ముఖ్యమంత్రి కూడా. అయితే, ఇంతకుముందు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తన భార్య, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తన కూతురు మాత్రం రాజకీయ నిరుద్యోగులుగా ఎందుకు ఉండాలి అనుకున్నారేమో గానీ.. వాళ్లిద్దరినీ రాజ్యసభకు పంపాలని లాలు నిర్ణయించేశారు. వచ్చే సంవత్సరం బిహార్ నుంచి రాజ్యసభకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి వీళ్లిద్దరినీ ఎంపిక చేశారు. రబ్రీదేవికి, మీసా భారతికి రాజ్యసభ సీట్లు ఖాయమని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు గెలుచుకోవడంతో ఆర్జేడీ సులభంగా రెండు రాజ్యసభ స్థానాలను పొందుతుంది. ఒక్కో అభ్యర్థికి అసెంబ్లీ నుంచి కేవలం 41 ఓట్లు వస్తే చాలు. అంటే, మిత్రపక్షాలైన జేడీ(యూ) లేదా కాంగ్రెస్ నుంచి ఇద్దరు తమవాళ్లకు ఓట్లేస్తే చాలని లాలు చూస్తున్నారు. జేడీ(యూ)కు చెందిన ఐదుగురు ఎంపీలు 2016 జూలైలో రిటైర్ కానున్నారు. తాను జాతీయస్థాయిలో పనిచేస్తానని, తమ్ముడు నితీష్ బిహార్‌ను చూసుకుంటాడని లాలు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ బంగ్లా కావాలి గానీ.. తాను ఎటూ ఎన్నిక కాలేడు కాబట్టి భార్యను, కూతురిని పంపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. రబ్రీదేవి ఎటూ మాజీ సీఎం కాబట్టి, ఆమెకు పెద్ద బంగ్లానే వస్తుంది. మీసాభారతి మాత్రం రాజకీయ పదవి పొందడం ఇదే తొలిసారి అవుతుంది. అది కూడా నేరుగా రాజ్యసభకు వెళ్లడం విశేషం. 2014 ఎన్నికల్లో ఆమె పాటలీపుత్ర స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేసింది. కానీ, అప్పటివరకు లాలుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన రామ్ కృపాల్ బీజేపీలోకి వెళ్లి, ఆమెను ఓడించారు. కానీ మీసాభారతిని ఎలాగైనా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న లాలు.. ఇప్పుడు అవకాశం రావడంతో పెద్దల సభకు పంపేస్తున్నారు. -
పెద్దోడి కన్నా చిన్నోడే బెటర్!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తనయులు తేజస్వి, తేజ్‌ప్రతాప్ యాదవ్ నితీశ్‌కుమార్ కేబినెట్లో టాప్ రెండు, మూడు స్థానాలను అలంకరించడం.. అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. పెద్దగా అనుభవంలేని వారికి కీలక శాఖలు అప్పగించడంపై విమర్శకులు మండిపడ్డారు. ఇప్పుడు వారు పదవుల్లోకి చేరి నెల గడిచింది. ఈ నెల రోజుల్లో వయస్సులో చిన్నవాడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన తేజస్వి తన పనితీరుతో ఆకట్టుకుంటుండగా.. అన్న తేజ్‌ప్రతాప్ మాత్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవి చేపట్టిన తేజస్వి పరిణతి గల రాజకీయ నాయకుడి ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అప్పగించిన శాఖలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే ప్రయత్నం తేజస్వి చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదే అన్న తేజ్‌ప్రతాప్ విషయానికొస్తే ఆయనకు 'పాస్' మార్కులు ఇవ్వడానికి ఇప్పటికీ పరిశీలకులు వెనుకాముందాడుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా తేజ్‌ప్రతాప్ ఇంకా చురుగ్గా పనిచేయలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన కొంత సిగ్గుపడుతూ, నెర్వస్‌కు గురవుతున్నట్టు కనిపిస్తున్నది. అయితే తేజ్‌ప్రతాప్ కూడా అధికారులతో దృఢంగా వ్యవహరిస్తూ.. శాఖను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. 'తేజస్వి శాంతస్వభావం కనబరుస్తున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన వివిధ రాజకీయ అంశాలపై సమర్థంగా మాట్లాడి.. విమర్శకుల నోళ్లు మూయించారు. లాలూ రాజకీయ వారసుడు తేజస్వినేనని ప్రతిపక్ష నేతలు సైతం ఇప్పుడు అంగీకరిస్తున్నారు' అని ఆర్జేడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనోజ్ యాదవ్ పేర్కొన్నారు. -
మోదీజీ క్షమాపణలు చెప్పండి: లాలు తనయ
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయ మిసా భారతి.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలపై ఫైర్ అయ్యారు. బిహార్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందంటూ తప్పుడు ప్రకటనతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిన మోదీ, బీజేపీ నాయకులు.. 11 కోట్ల మంది బిహార్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 2014-15లో జీఎస్డీపీలో బిహార్ 17.6 శాతం నమోదు చేసిందని, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొన్నట్టు మిసా భారతి చెప్పారు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమిని ఓడించడం కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. బీజేపీ నేతల ఆరోపణలు తప్పని నీతి ఆయోగ్ నివేదిక నిరూపించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో మహాకూటమి పార్టీలు ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ల తరపున స్టార్ క్యాంపెయినర్లలో ఒకరిగా మిసా విస్తృతంగా పర్యటించారు. బిహార్‌లో ఆర్జేడీ మద్దతుతో నితీశ్ కుమార్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
ఫ్యామిలీ ప్యాకేజి మొదలైపోయింది!
బిహార్‌లో ఒకప్పటి బద్ధశత్రువైన జేడీ(యూ)తో చేతులు కలిపిన తర్వాత అధికారం చేపట్టిన ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్.. తన ఫ్యామిలీ ప్యాకేజి ప్రారంభించేశారు. స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేని లాలు.. తన ఇద్దరు కొడుకులకు మంత్రి పదవులు ఇప్పించుకోవడమే కాక, వాళ్లలో తేజస్వి యాదవ్‌ను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన భార్య రబ్రీదేవికి కూడా మరో పదవిని కట్టబెట్టేశారు. బిహార్ శాసన మండలిలో రాష్ట్రీయ జనతాదళ్ పక్ష నేతగా ఆమె పేరును ఖరారు చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తేజస్వి యాదవ్‌కే ఆర్జేడీ శాసన సభా పక్ష నేత పదవి కూడా కట్టబెట్టారు. గతంలో బిహార్ రాష్ట్రంలో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్యాకేజి కింద మొత్తం పదవులలో సింహభాగాన్ని తన కుటుంబ సభ్యులకే కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా మళ్లీ అధికారాన్ని పంచుకోవడమే కాక.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కూడా అవతరించడంతో తమవంతు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ పదవులను లాక్కుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ పదవులలో కూడా తన సొంత మనుషులు (ఫ్యామిలీ) తప్ప బయటివాళ్లు లేకుండా లాలు జాగ్రత్త పడుతున్నారు. -
బలవంతపు కౌగిలింత!
అక్షర తూణీరం లాలూ కేజ్రీవాల్‌ని ఏకపక్షంగా ఆలింగనం చేసుకుని వార్తల్లో కెక్కాడు. కేజ్రీవాల్ ఈ ఘటనలో నాకే పాపం తెలియదన్నాడు. అయినా అమలిన ఆలింగనానికి ఇంత రాద్ధాంతం అవనరమా? సృష్టిలో ఆలింగ నానికి ఒక అర్థం, పరమార్థం కల్పించి, సార్థకం చెందిన ఆద్యుడు మార్కండేయుడు. శివలింగాన్ని గాఠ్ఠిగా కౌగిలించుకుని, మరి వదల్లేదు. దాంతో మార్కండేయుడు మృత్యుంజయుడైనాడు. తదాది ఆలింగనం ఒక సదాచారంగా, సేవగా, మర్యాదగా ప్రబలింది. శృంగారపు కౌగిలింతలు వేరు. నేను మాట్లాడేది అమలిన ఆలింగనాల గురించి- కొందరు అమృతమూర్తులు ప్రేమగా ఆలింగనం చేసుకుని సాంత్వన పరుస్తారు. కొన్ని మత సంప్రదాయాలలో ఇది పరిపాటి. మూడుసార్లు మార్చిమార్చి హత్తుకుని తమ ఆత్మీయతను వ్యక్తపరుస్తారు. కొందరు స్వామీజీలు గాఢంగా ఆలింగనం చేసుకుని, భక్తుడి తల గుండెలకు పొదువుకుని, ‘నీ స్థానం ఇదిరా’ అని భరోసా ఇవ్వడం నాకు తెలుసు. అప్పుడు రుద్రాక్షలు బుగ్గలకు గుచ్చుకోవడం; గంధం, చెమట కలసిన వాసన ముక్కుకి తగలడం తప్పదు. ఆలింగనంలో ఒక రకమైన విద్యుత్ పుడుతుందని పరిశోధనల్లో తేలింది. రెండు శరీరాలు ఆపాదమస్తకం హత్తుకున్నప్పుడు ఆ దేహాల్లో, మెదళ్లలో ఉన్న నెగెటివ్ కరెంట్స్ యావత్తూ ఎర్త్ అయిపోతాయట. కావచ్చు. కొన్ని ఉత్తమజాతి వృక్షాలు మాంచి వయసులో ఉన్న కన్నెపిల్లలు కౌగిలించుకుంటే కానీ పూయవట. వృక్షాలు ప్రాణులే కదా! మనకున్న రకరకాల కౌగిళ్లలో ధృతరాష్ట్ర కౌగిలి ఒక ప్రత్యేకం. ఇది కూడా అప్రస్తుతం. ఎన్నికల తరుణంలో అభ్యర్థులు ఎదురైన వారందరినీ విచక్షణారహితంగా పొదువుకుంటారు. ఉత్తర భారతానికి హత్తుకునే అలవాటు ఎక్కువ అంటారు. బహుశా చలిప్రాంతం వల్ల కావచ్చు. ఆలింగనం అంటే నాకు ఒక ఉదంతం గుర్తుకు రాకుండా ఉండదు. మా ఆఫీసు టైపిస్ట్ విజయ తల మీద ఉన్నట్టుండి బల్లి పడింది. ఆఫీసంతా కలకలం రేగింది. పైగా శిరస్సు ప్రాణగండం అన్నాడు శాస్త్రకారుడు. అసలెట్లా పడింది, కొంచెం పక్కన కూచోవలసింది, నడినెత్తిన పడిందా, చెంపకు జారిందా లాంటి ప్రశ్నలలో ఆ పిల్ల తలప్రాణం తోకకు వచ్చింది. పైగా నిలువెల్లా భయం. ఏం ఫర్వాలేదు, వెళ్లి కంచి బల్లిని తాకివస్తే ఏ దోషమూ లేదని సెక్షనాఫీసరు ధైర్యం చెప్పాడు. విజయకి ఎక్కిళ్లు ఆగడం లేదు. స్ప్రింగ్డోర్లోంచి బయటకొచ్చిన పెద్దాయన, దీనికంత రాద్ధాంతమా? ఎవరైనా కంచిబల్లి తాకొచ్చిన వారిని తాకితే చాలు అనగానే, అందరూ చిత్తరంజన్ వైపు చూపులు తిప్పారు. ఎందుకంటే ఆ కుర్రవాడు చిన్నతనంలో కంచికి వెళ్లొచ్చిన కథనం పలుమార్లు పలువురికి చెప్పి ఉన్నాడు. విజయ దుఃఖభారంతో ఇంటికెళ్లి, మర్నాడు తల్లిగారిని వెంటబెట్టుకు వచ్చింది. మా విజయ చెయ్యి పట్టుకుని ప్రాణదానం చేయమని కోరగా, పాణిగ్రహణానికి చిత్తరంజన్ నిరాకరించాడు. విజయ జాలిగా, ‘లైఫ్ అండ్ డెత్ కొశ్చన్’ అన్నట్టుగా చూసింది. ‘దేహాన్ని పూర్తిగా స్పృశిస్తే తప్ప ఫలితం ఉండదని జాగంటి వారు మొన్ననే రేడియోలో ప్రవచించారు. ఒక ఎండు ఖర్జూరం, ఒక వక్క తెప్పించండి! పూర్తి విరుగుడుకి ఉపాయం ఉందన్నా’డు చిత్తరంజన్. క్షణంలో కోరినవి వచ్చాయి. ఒకరి ఎంగిలి ఒకరు చవి చూస్తే తప్ప బల్లిపాటు దిగదుట- అంటూనే విజయ చేత కొరికించి తను నోట్లో వేసుకున్నాడు. తను వక్క కొరికి ఇచ్చాడు. తర్వాత చాలా సిగ్గుపడుతున్న విజయని చిత్తరంజన్ మెడిసినల్‌గా కౌగిలించుకున్నాడు. రెండేళ్లకు వారిద్దరికీ పెళ్లి అయింది. బల్లిపాటు ఒక ఐడియా మాత్రమేనని కొందరికే తెలుసు. లాలూ కేజ్రీవాల్‌ని ఏకపక్షంగా ఆలింగనం చేసుకుని వార్తల్లోకెక్కాడు. కేజ్రీవాల్ ఈ ఘటనలో నాకే పాపం తెలియదన్నాడు. అయినా అమలిన ఆలింగనానికి, చిన్న అల్లాయ్ బల్లాయ్కి ఇంత రాద్ధాంతం అవనరమా? శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
'లాలూనే లాక్కొని కౌగిలించుకున్నారు'
న్యూఢిల్లీ: 'నితీశ్‌జీ ప్రమాణ స్వీకారోత్సవంలో లాలూ యాదవ్ నాతో కరచాలనం చేశారు. అంతటితో ఆగకుండా నన్ను లాక్కొని ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయంలో నేనుగా ఎలాంటి చొరవ తీసుకోలేదు'- ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివరణ. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకారం వేడుకలో ఆర్జేడీ అధినేత లాలూ-కేజ్రీవాల్ కౌగిలించుకొని కనిపించడం.. టికప్పులో తుపాన్ లాంటి చిన్న దుమారమే రేపింది. దాణా కుంభకోణంలో శిక్షపడిన కళంకిత నేత లాలూను ఎలా కౌగిలించుకుంటారని సొంత పార్టీ ఆప్ నేతలే కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఇతర పార్టీల నేతలూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ మండలి సమావేశంలో ఈ అంశంపై కేజ్రీవాల్ మాట్లాడారు. అవినీతి రికార్డు కలిగిన లాలూకు మేం వ్యతిరేకమని, ఈ విషయంలో ఆయనను ఎప్పుడూ వ్యతిరేకిస్తామని కేజ్రీవాల్ చెప్పారు. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతో ఎట్టిపరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిజానికి తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, పట్నాలో జరిగింది వారసత్వ రాజకీయమేనని, లాలూ ఇద్దరు తనయులు నితీశ్ కేబినెట్లో చోటు సంపాదించారని చెప్పారు. లాలూ చిన్న కొడుకు తేజస్వికి బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. -
'అన్నా హజారే కలలకు నమ్మక ద్రోహం'
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌ను కౌగిలించుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమ్ఆద్మీ అసంతృప్త నేత శాంతి భూషణ్.. కేజ్రీవాల్ చర్యపై మండి పడ్డారు. అన్నా హజారే కలలకు నమ్మకద్రోహం చేసేదిలా కేజ్రీవాల్ చర్య ఉందని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ మాజీ సహచరుడు, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్ ఈ కౌగిలింత చర్యను సిగ్గుమాలిన పనిగా అభివర్ణించాడు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో తమ ఆదర్శాలను వదిలేస్తున్నారని ఆయన విమర్శించాడు. అయితే కేజ్రీవాల్ మద్దతు దారులు మాత్రం వేదిక మీద లాలు ప్రసాదే బలవంతంగా కేజ్రీవాల్‌ను కౌగిలించుకున్నారని ఆరోపించడం విశేషం. అయినా కౌగిలించుకున్నంత మాత్రాన ఇద్దరి అభిప్రాయాలు ఒకటయినట్టు కాదని, దీనిని వేదికపై జరిగిన చిన్న ఘటనగా చూడాలే తప్ప రాద్దాంతం చేయడం తగదంటున్నారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పురుడుపోసుకున్న అమ్ఆద్మీ పార్టీ అనతి కాలంలోనే ఢిల్లీలో అధికారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కుంభకోణాలతో మసకబారిన లాలు ప్రసాద్‌తో అమ్ఆద్మీ అధినేత వ్యవహరించిన తీరుకు నెటిజియన్లు సైతం గరంగా ఉన్నారు. -
లాలూ ఇంట ఛట్ సందడి
-
ఆర్జేడీకి 16.. జేడీయూకు 15..!
పట్నా: బిహార్‌లో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మహాకూటమి ప్రభుత్వంలో ఆర్జేడీకి 16, జేడీయూకు 15, కాంగ్రెస్‌కు 5 చొప్పున మంత్రి పదవులు దక్కే అవకాశముంది. ఈ నెల 20న జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలో మహాకూటమి ప్రభుత్వం కొలువుదీరనున్నట్టు సమాచారం. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. జేడీయూ తరపున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం సమావేశమై నితీశ్‌ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటారు. అనంతరం మహాకూటమిలోని పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు సమావేశమై మహాకూటమి శాసనసభ పక్ష నాయకుడిగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. ఈ రోజు ఆర్జేడీ శాసనసభ పక్ష నాయకుడ్ని ఎన్నుకుంటారు. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఇప్పటికే మంత్రుల జాబితా తయారు చేసినట్టు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో లాలు ప్రసాద్ కుమారులు తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు గెలుపొందారు. వీరికి కేబినెట్ బెర్తులు లభిస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
20న నితీశ్ ప్రమాణం!
దీపావళి, ఛత్ పండుగలు ముగిశాకే కొత్త సర్కారు: జేడీయూ ♦ బిహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై మహాకూటమి పక్షాల అధినాయకత్వాలు చర్చిస్తున్నాయి ♦ లాలూ కుమారుడికి డిప్యూటీ సీఎం పదవిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి భారీ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో.. నితీశ్‌కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 20వ తేదీన మళ్లీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. బుధవారం (11వ తేదీ) దీపావళి పండుగ ఉండగా.. దాని తర్వాత వచ్చే ఛత్ పండుగ ఈ నెల 18వ తేదీ వరకూ కొనసాగుతుంది. ప్రజలు ఈ పండుగల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి.. ఛత్ ముగిసిన తర్వాత నితీశ్ ప్రమాణ స్వీకారం చేస్తారని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు బశిష్ట నారాయణ్‌సింగ్ మంగళవారం పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు. అధికారికంగా తేదీని ప్రకటించనప్పటికీ.. ఈ నెల 20వ తేదీన కొత్త సర్కారు కొలువుతీరే అవకాశముందని ప్రస్తుతం ముగియనున్న నితీశ్ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపై మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల అధినాయకత్వాలు చర్చిస్తున్నాయని.. ఏ పార్టీ నుంచి స్పీకర్‌ను ఎన్నుకోవాలి అనే అంశంతో పాటు.. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ కుమారుడు తేజస్విని ఉప ముఖ్యమంత్రిని చేయాలా అన్న అంశంపైనా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రస్తుత శాసనసభ పదవీ కాలం ఈ నెల 29వ తేదీ వరకూ ఉందని.. కాబట్టి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయటానికి తొందరేమీ లేదని సీఎం నితీశ్ ఆదివారం నాడు పేర్కొన్నారు. మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న నితీశ్.. ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటం విశేషం. ఆయన తొలిసారి 2000 సంవత్సరంలో సీఎంగా ప్రమాణం చేశారు. అయితే కేవలం ఏడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. అనంతరం 2005లో అధికారంలోకి వచ్చిన నితీశ్, మళ్లీ 2010లోనూ సీఎం అయ్యారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతినటంతో సీఎం పదవి నుంచి తప్పుకున్న నితీశ్.. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జితన్రాంమాంఝీని తప్పించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. -
డిప్యూటీ సీఎంగా మీసా భారతి?
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈనెల 20వ తేదీన ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గంలో మూడు పార్టీలు 4:4:2 నిష్పత్తిలో పదవులను పంచుకోవాలని భావిస్తున్నాయి. అయితే, అత్యంత కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవిని మాత్రం తన కూతురు మీసా భారతికి ఇవ్వాలని ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ పట్టుబట్టే అవకాశం ఉంది. నిజానికి ఈ ఎన్నికల్లో లాలు కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ మాత్రమే పోటీచేసే విజయం సాధించారు. మీసాభారతి గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆమెను శాసన మండలికి పంపించి డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలన్నది లాలు ఆశగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండి, తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తన పీఏ భోలా యాదవ్ స్థానాన్ని తన కూతురికి కేటాయిస్తారని చెబుతున్నారు. అలాగే కుమారులిద్దరిలో ఒకరికి తప్పనిసరిగా మంత్రిపదవి తీసుకుంటారని అంచనా. అయితే, ఇద్దరిలో ఎవరికి పదవి ఇవ్వాలన్న విషయమై నిర్ణయం తీసుకోవడం మాత్రం లాలుకు కష్టమే. బిహార్ అసెంబ్లీ స్థానాలను బట్టి చూస్తే గరిష్ఠంగా 36 మంది మంత్రులు కేబినెట్లో ఉండే అవకాశం ఉంది. కానీ అక్కడ ముందు జాగ్రత్తగా 8-10 స్థానాలను ఖాళీగా ఉంచుకుని, తర్వాత విస్తరించుకోవాలన్నది సీఎం నితీష్ కుమార్ వ్యూహంలా కనిపిస్తోంది. ఇక అనూహ్యంగా ఈ ఎన్నికల్లో 27 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అధికారాన్ని పంచుకోవాలనే భావిస్తోంది. ఏడు అంశాల కార్యక్రమాన్ని అమలుచేస్తామని తాము బిహార్ ప్రజలకు మాటిచ్చామని, దాన్ని అమలుచేస్తామని బిహార్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి సీపీ జోషి అన్నారు. ఈ పార్టీ నుంచి ప్రధానంగా అశోక్ కుమార్ చౌదరి, సదానంద సింగ్, అవధేష్ కుమార్ సింగ్, షకీల్ అహ్మద్ ఖాన్, మహ్మద్ జావేద్‌లలో కొందరికి మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. -
నితీశ్, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు
-
‘జనతా’ బ్రదర్స్ జయభేరి
బిహార్ ఎన్నికల్లో ‘మహా’ విజయం 178 స్థానాలు కైవసం.. మూడింట రెండొంతుల మెజారిటీ ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 స్థానాల్లో జయకేతనం కేవలం 58 స్థానాల్లో గెలుపుతో చతికిలపడిన ఎన్డీయే బీజేపీకి 53, ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీకి చెరో రెండు సీట్లు 21 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క సీటు గెల్చుకున్న మాంఝీ పార్టీ మూడోసారి బిహార్ సీఎం పీఠం అధిష్టించనున్న నితీశ్‌కుమార్ బిహార్ ప్రజలు సంచలన తీర్పునిచ్చారు. మోదీ, నితీశ్‌ల హోరాహోరీ పోరులో బాహరీ (బయటివాడు)ని కాదని.. బిహారీకే పట్టం కట్టారు. మోదీ చరిష్మాను పక్కనబెట్టి నితీశ్ ఇమేజ్‌కే ఓటేశారు. ముచ్చటగా మూడోసారి నితీశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. పరిశీలకుల అంచనాలను తలకిందులు చేస్తూ.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహాకూటమికి తిరుగులేని మెజారిటీనిచ్చారు. కూటమి నేతలు సైతం ఊహించని స్థాయిలో మూడింట రెండొంతుల స్పష్టమైన మెజారిటీని వారికి అందించారు. ముఖ్యంగా ‘జనతా’ సోదరులు నితీశ్(జేడీయూ), లాలూ ప్రసాద్(ఆర్జేడీ)లకు ఓట్ల హారతి పట్టారు. పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలకు గానూ జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా కూటమి 178 సీట్లలో విజయబావుటా ఎగురవేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 58 స్థానాలకే పరిమితమైంది. మహాకూటమిలో లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) 80 స్థానాల్లో, జనతాదళ్(యునెటైడ్) 71 సీట్లలో, కాంగ్రెస్ 27 స్థానాల్లో విజయం సాధించాయి. ఆర్జేడీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో, కాంగ్రెస్ 41 స్థానాల్లో పోటీ చేశాయి. ఎన్డీయే తరఫున బీజేపీ అత్యధికంగా 53 సీట్లు గెలుచుకోగా, ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ చెరో రెండు స్థానాల్లో గెలుపొందాయి. మాజీ ముఖ్యమంత్రి జతిన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్ఏఎం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. ఎన్డీయే నుంచి బీజేపీ 159 సీట్లలో పోటీ చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం, పప్పూయాదవ్‌కు చెందిన జనాధికార పార్టీ ఖాతా తెరవలేకపోయాయి. సీపీఐ(ఎంఎల్) 3, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం సాధించారు. నితీశ్‌కుమార్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కూటమి సారధిగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. 2010 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, జేడీయూలు 206 స్థానాల్లో విజయం సాధించాయి. అందులో జేడీయూ 115, బీజేపీ 91 సీట్లు గెలుచుకున్నాయి. నాటి ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన ఆర్జేడీ 22 సీట్లలో, కాంగ్రెస్ కేవలం 4 స్థానాల్లో గెలుపొందాయి. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోర పరాజయం పాలైన జేడీయూ, ఆర్జేడీలు అనూహ్యంగా, అతితక్కువ సమయంలోనే తేరుకోవడం విశేషం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 40 స్థానాలకు గానూ 31 స్థానాలు గెలుచుకుంది. బిహార్ ఫలితాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని విజయానంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు వెల్లడించారు. విభజన శక్తుల కుట్రలను కాదని, అభివృద్ధి ఎజెండాకే బిహార్ ప్రజలు పట్టం కట్టారని నితీశ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రకటించారు. మతవాద బీజేపీ వ్యతిరేక ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తానని లాలూ ప్రసాద్ ప్రకటించారు. ఆ ఇద్దరూ ‘చేతు’లు కలిపితే.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం బిహార్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో కలిసి పోటీచేసిన ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లు 10 సీట్లకు గానూ ఆరింటిలో విజయం సాధించడంతో.. మహా కూటమి ఏర్పాటుకు దారులు పడ్డాయి. బీజేపీని కలసికట్టుగా ఎదుర్కోవడమే మార్గమని భావించిన ఆ మూడు పార్టీలు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కటై మహా కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త పడ్డాయి. మరోవైపు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ల వ్యతిరేక వ్యాఖ్యలు, అసహనంపై దేశవ్యాప్త ప్రచారం, మోదీ ‘డీఎన్ఏ’ కామెంట్ బీజేపీకి ప్రతికూలంగా పరిణమించ గా.. నితీశ్ క్లీన్ ఇమేజ్, లాలూ కుల సమీకరణాలు కూటమి గెలుపునకు బాటలు వేశాయి. మోదీకి మరో ఎదురుదెబ్బ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బిహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీ.. సుడిగాలి పర్యటనల్తో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం సాగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ప్రధాని చేయని రీతిలో దాదాపు 30కి పైగా సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. దాంతో ఈ ఓటమిని మోదీ వ్యక్తిగత పరాజయంగా ప్రత్యర్థులు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ నేతృత్వంలో బీజేపీ విజయం సాధించింది. తరువాత జరిగిన జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో పీడీపీతో కలిసి పోటీ చేసి మెజారిటీ సాధించింది. ఆ తరువాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఘోర పరాజయం పాలయింది. మొత్తం 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 67 స్థానాలు గెల్చుకోగా, బీజేపీ 3 నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందింది. అనంతరం ఈ ఎన్నికలు మోదీకి, బీజేపీకి ఊహించని స్థాయిలో ఘోర పరాజయాన్ని మిగిల్చాయి. ఇది ఏ ఒక్క పార్టీ విజయమో కాదు. ఇది మహాకూటమి సంయుక్తంగా సాధించిన విజయం. మా మధ్య విభేదాలు సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే.. అది విఫలయత్నమే అవుతుంది. కనీసం మరో పది జన్మల పాటు మేం కలిసే ఉంటాం. నరేంద్రమోదీ నేతృత్వంలోని మతతత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాకూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. అందులో భాగంగా దేశమంతా పర్యటిస్తాం. బీజేపీయేతర పార్టీలు ఇందుకు కలసిరావాలి. - లాలూప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ) బీజేపీ చాలా తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది. ప్రజల్లో చీలికలు తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. బిహార్ ప్రజలు చాలా పరిణతితో ఓట్లేశారు. దళితులు, మహిళలు, యువత, మైనారిటీలు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల మద్దతు లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు మాకు అనుకూలంగా ఓటేశారు. వారికి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. వాటిని తీర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తా. - నితీశ్‌కుమార్ (జేడీయూ) బిహార్ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తూ, ఓటమిని అంగీకరిస్తున్నాం. ఘనవిజయం సాధించిన నితీశ్, లాలూలకు అభినందనలు తెలియజేస్తున్నా. - అమిత్ షా (బీజేపీ) బిహార్‌లో మహాకూటమి గెలుపు... విద్వేషంపై ప్రేమ.. విభజనపై ఐక్యత.. అసహనంపై సహనం సాధించిన విజయం.. మోదీ విదేశీ పర్యటనలను పక్కనబెట్టి రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. - రాహుల్ గాంధీ (కాంగ్రెస్) -
నాయకుడొచ్చాడు!
మోదీ వ్యతిరేక పార్టీల నేతలకు ఆశాదీపంగా నితీశ్ పట్నా: బిహార్ ఫలితాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాయా? బీజేపీ జైత్రయాత్రకు ఇక తెరపడినట్టేనా? మోదీ వ్యతిరే కులకు జాతీయస్థాయిలో నితీశ్ కుమార్ తిరుగులేని నాయకుడిగా అవతరించబోతున్నారా? ఈ ప్రశ్నలకు రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇందుకు అనేక అవకాశాలను కల్పించాయని వారు చెబుతున్నారు. అంతేకాదు.. బిహార్‌లో అర్జేడీ అధినేత లాలు ప్రసాద్ కూడా మళ్లీ క్రియాశీలక పాత్ర పోషిస్తారని పేర్కొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. 40 లోక్‌సభ సీట్లలో ఏకంగా 31 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. జేడీయూ, ఆర్జేడీలు బీజేపీ దూకుడు ముందు చతికిలపడ్డాయి. కానీ 16 నెలలు తిరిగేసరికి బీజేపీ పరిస్థితి తారుమారైంది. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంతో సరిపుచ్చుకుంది. తాజా ఫలితాల నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల నాయకులంతా నితీశ్ వెంట నడవొచ్చని భావిస్తున్నారు. దేశమంతా మోదీ మోడల్ అని మాట్లాడుకుంటుంటే.. బిహార్‌కు ‘కుమార్’ మోడల్ అభివృద్ధిని రుచి చూపించారు నితీశ్ కుమార్. అలనాటి మగధ సామ్రాజ్యంలో అపర చాణక్యుడిలా ప్రతికూల పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా వ్యవహరించి.. బీమారు రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంతి పీఠాన్ని అధిరోహించనున్నారు. నితీశ్ రాజకీయ ప్రస్థానం ► పట్నా యూనివర్సిటీనుంచే రాజకీయ జీవితం ఆరంభం. ► ఎన్ఐటీ పట్నాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితీశ్.. బిహార్ విద్యుత్ బోర్డులో ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. ► మొదట్నుంచీ సోషలిస్టు ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నందున.. జయప్రకాశ్ నారాయణ్, రాం మనోహర్ లోహియా, ఎస్ఎన్ సిన్హా, కర్పూరీ ఠాకూర్ల ప్రభావం ఎక్కువ. ► రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి.. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► లాలూతో మొదట్నుంచీ విభేదాలున్నా.. కర్పూరీ ఠాకూర్ మృతి చెందిన తర్వాత విపక్షనేతగా యాదవ్ నియామకానికి మద్దతు తెలిపారు. ► 1989లో బార్త్ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన నితీశ్.. 1991, 96, 98, 99 పార్లమెంటు ఎన్నికల్లోనూ గెలుపొందారు. ► 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా, అతి తక్కువ కాలం రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ► 1999లో బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంలో 300 మంది మృతిచెందటంతో నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేశారు. 2001లో మళ్లీ కేంద్ర రైల్వే మంత్రిగా బాధ్యత తీసుకుని టికెట్ బుకింగ్ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టారు. ► అయితే, 1994లో జనతాదళ్ పార్టీలో విభేదాలతో బయటకు వచ్చిన నితీశ్.. జార్జి ఫెర్నాండేజ్, శరద్ యాదవ్‌లతో కలిసి సమతా పార్టీని స్థాపించారు. 2003లో వివిధ ప్రాంతీయ పార్టీలతో కలిసి జనతాదళ్ యునెటైడ్ పార్టీని ఏర్పాటుచేశారు. ► 2004లో ఢిల్లీ రాజకీయాల నుంచి బిహార్‌పై దృష్టి పెట్టిన నితీశ్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ‘కుమార్’ మోడల్‌తో బిహార్‌ను పునర్నిర్మించారు. ► అయితే.. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఎన్డీఏ ప్రచార సారథిగా మోదీ పేరు ప్రకటించటంతో.. 2013 జూలైలో ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. ► 2014 పార్లమెంటు ఎన్నికల్లో జేడీ(యూ) ఘోర పరాజయానికి బాధ్యతగా సీఎం సీటునుంచి తప్పుకున్న నితీశ్.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో మళ్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఫలితాలేం చెబుతున్నాయి? బిహార్‌లో అన్నీ తానై ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ బహిరంగ సభ నిర్వహించిన జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ విషయంలో ఎన్డీఏ.. మహాకూటమి కంటే చాలా ముందుంది. అయితే సభలు, ర్యాలీలకు వచ్చేవారంతా ఓట్లేయరని ఈ ఫలితాలు తేల్చిచెప్పాయి. బీజేపీ సీఎం అభ్యర్థి లేకుండానే.. ఎన్నికల గోదాలోకి దిగింది. మోదీ చరిష్మానే విజయతీరాలకు చేరుస్తుందని బలంగా నమ్మింది. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టడంతో బీజేపీ నాయకత్వం అంతర్మథనంలో పడింది. 2017లో జరగబోయే యూపీ అసెంబ్లీఎన్నికల్లో బీజేపీ తన ఎత్తుగడను మార్చుకోవాల్సిన సంకేతాన్నిచ్చాయి. -
నితీశ్, లాలుకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన నితీశ్‌కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ ను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. వైఎస్ జగన్ ట్విట్టర్లో నితీశ్, లాలుకు అభినందనలు తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిగా జత నితీశ్, లాలు అపూర్వ విజయాన్ని సాధించారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ కూటమి 178 స్థానాలతో తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సందర్భంగా నితీశ్, లాలును వైఎస్ జగన్ అభినందించారు. -
బిహార్ ప్రజలు మొత్తం శుభ్రం చేసేశారు: లాలు
యువకులు, రైతులు, పేదలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు ఇవ్వడం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందని, అందుకు అందరికీ కృతజ్ఞతలని ఆర్జేడీ అధినేత, మహాకూటమి కీలక నేత లాలుప్రసాద్ అన్నారు. మహాకూటమి విజయం ఖాయమైన తర్వాత ఆదివారం మధ్యాహ్నం ఆయన ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో ఆయన నితీష్ కుమార్‌తో కలిసి కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశం ప్రారంభం కావడానికి ముందే ఆయన నితీష్ కుమార్‌ను గట్టిగా కౌగలించుకుని అభినందనలు తెలపడంతో పాటు విజయతిలకం కూడా దిద్దారు. ఆ సమయంలో అభిమానులు ఒకటే జయ జయ ధ్వానాలు చేస్తుండటంతో.. పెద్దమాష్టారిలా అందరినీ గట్టిగా గదమాయించి నిశ్శబ్దంగా ఉండాలని తెలిపారు. ఇక ఈ సందర్భంగా లాలు ఏమన్నారంటే.. బిహార్ ముఖ్యమంత్రి మళ్లీ నితీష్ కుమారే మహాకూటమికి మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అందరికీ పేరుపేరునా మా సోదరులిద్దరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం బిహార్ ప్రజలు మొత్తం రాష్ట్రాన్ని శుభ్రం చేసేశారు నితీష్ కుమార్ పాలనలోనే బిహార్ అభివృద్ధి సాధ్యమని చాటిచెప్పారు యువకులు, రైతులు, కార్మికులు, ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుంటాం ఎన్నికల సమయంలోనే మేం ఈ విషయం చెప్పాం దేశం ముక్కలు ముక్కలు కాకుండా కాపాడుతామని కూడా ముందే చెప్పాం నేను దేశవ్యాప్తంగా పర్యటన చేసి ప్రచారం చేస్తాను. మీరు సమర్థించడం వల్లే మేం ఇంత ముందుకు రాగలిగాం నితీష్ కుమార్ కు చాలా అభినందనలు, ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను ప్రజలు మాకు బాగా పెద్ద విజయాన్ని అందించారు బిహార్ ప్రజలు, యువత, పేదలు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ విజయంలో భాగస్వాములే ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్వయంగా అభినందనలు తెలిపారు ఇది చాలా సంతోషకరమైన విషయం