తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహాకూటమి నేతలు నితీష్ కుమార్, లాలుప్రసాద్ యాదవ్ కు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహాకూటమి నేతలు నితీష్ కుమార్, లాలుప్రసాద్ యాదవ్ కు అభినందనలు తెలిపారు. మంచి పాలన అందించినందుకే మరోమారు ప్రజలు నితీష్‌కు పట్టం కట్టారని ఆయన అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నితీష్ కుమార్‌ను అభినందించారు. కాగా బిహార్ ఎన్నికల్లో జేడీయూ కంటే ఆర్జేడీనే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.