
ఢిల్లీ సీఎం జోస్యం నిజమైంది!
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళుతోంది. దీంతో బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు ఆదివారం నితీష్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఇది చారిత్రాత్మక విజయం అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా ఢిల్లీ వాసులంతా బీహార్‌లో ఉన్న తమ బంధుమిత్రులకు ఫోన్ చేసి నితీష్‌కు ఓటు వేయాలంటూ బిహార్ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ విజ్ఞప్తి కూడా చేశారు.
అలాగే బిహార్ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదని, నితీష్ కుమార్ గెలుపు ఖాయమంటూ జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు శివసేన కూడా బిహార్ ఫలితాలపై స్పందించింది. నితీష్ కుమార్ పొలిటికల్ హీరో అంటూ అభివర్ణించింది. బిహార్ ఓటమికి ప్రధాని మోదీ బాద్యత వహించాలని, నితీష్ గొప్ప విజయాన్ని సాధించారని శివసేన వ్యాఖ్యానించింది.