వాట్ ఏ కమ్ బ్యాక్ ఫర్ జేడీయూ.. | What a comeback for JDU,In 1 hour their leads have overtaken ours, says bjp leader Ram Madhav | Sakshi
Sakshi News home page

వాట్ ఏ కమ్ బ్యాక్ ఫర్ జేడీయూ..

Published Sun, Nov 8 2015 10:49 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

వాట్ ఏ కమ్ బ్యాక్ ఫర్ జేడీయూ.. - Sakshi

వాట్ ఏ కమ్ బ్యాక్ ఫర్ జేడీయూ..

న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ స్పందించారు. జేడీయూ మళ్లీ పుంజుకుందంటూ ఆయన ట్విట్ చేశారు. గంటలోనే వారి ఆధిక్యం ఎన్డీయే కూటమిని దాటేసిందని ఆయన అన్నారు. అయితే ప్రజల తీర్పును గౌరవిస్తామని రాంమాధవ్ తెలిపారు.

 

ప్రస్తుతం మహాకూటమి 159, ఎన్డీయే 84, ఇతరులు 10 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. మరోవైపు పట్నాలో మహాకూటమి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ జెండాలతో పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement