
మాంఝీ బోణీ కొట్టారు..
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి భాగస్వామి హెచ్ఏఎం నేత జితన్ రాం మాంఝీ బోణీ కొట్టారు. ఇమాంగంజ్ నియోజకవర్గంలో ఆయన విజయం సాధించారు. 18,278 ఓట్ల మెజార్టీతో మాంఝీ గెలుపొందారు. జేడీయూ అభ్యర్థి ఉదయ్ నారాయణ చౌదరికి 10,198 ఓట్లు రాగా, బీఎస్పీ నుంచి పోటీ చేసిన మధురా పాశ్వాన్ కేవలం 576 ఓట్లు పొందారు. మరోవైపు మఖ్దుంపూర్ నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉన్న మాంఝీ అక్కడ మాత్రం వెనకంజలో ఉన్నారు.