Jitan Ram Manjhi
-
Bihar:మరో ‘కుటుంబ ఆధిపత్యం’.. ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు
గయ: బీహార్ రాజకీయాల్లో లాలూ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబాల తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కుటుంబం తన ఆధిపత్యాన్ని నెలకొల్పింది. బీహార్‌లోని నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక స్థానమైన గయ ఇప్పుడు జితన్ రామ్ మాంఝీ కుటుంబానికి దక్కింది.గయా జిల్లాలోని ఇమామ్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి గతంలో జితన్ రామ్ మాంఝీ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన ఎంపీ అయిన తర్వాత ఈ స్థానం ఖాళీ కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ఆయన కోడలు, బీహార్ ప్రభుత్వ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ భార్య దీపా మాంఝీ విజయం సాధించారు. ఫలితంగా బీహార్ రాజకీయాల్లో జితన్ రామ్ మాంఝీ కుటుంబ పరపతి పెరిగింది. ఇప్పుడు ఆయన కుటుంబంలో ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.జితన్ రామ్ మాంఝీ కేంద్ర మంత్రిగా, ఆయన కుమారుడు సంతోష్ కుమార్ బీహార్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా ఉన్నారు. ఇదే కుటుంబానికి చెందిన జ్యోతి మాంఝీ బారాచట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు దీపా మాంఝీ ఇమామ్‌గంజ్ ఎమ్మెల్యేగా అయ్యారు. జితన్‌రామ్ మాంఝీ 1980లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఘోర పరాజయం పాలవడంతో, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పుడు జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రిగా నియమించారు. ఏడాది తరువాత అతను కూడా రాజీనామా చేశారు.అనంతరం జితన్ రామ్ మాంఝీ 2015లో హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ పార్టీని స్థాపించి ఎన్డిఎలో చేరి ఇమామ్‌గంజ్ నుండి ఎన్నికల్లో పోటీ చేశారు. 2015 నుండి మే 2024 వరకు ఇమామ్‌గంజ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జూన్ 2024లో మొదటిసారిగా ఎంపీ అయ్యారు. గయ నుంచి ఎంపీ అయిన తర్వాత మోదీ కేబినెట్లో కూడా చోటు దక్కించుకుని ఎంఎస్ఎంఈ శాఖను నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: వామదేవుడి వృత్తాంతం -
27 లక్షల మహిళా పారిశ్రామికవేత్తలకు లబ్ధి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సీజీటీఎంఎస్ఈ పథకం కింద మహిళల ఆధ్వర్యంలోని సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు 90 శాతం వరకు మెరుగైన రుణ హామీ కవరేజీ లభిస్తుందని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ తెలిపారు. 27 లక్షల మహిళల ఎంఎస్ఎంఈలకు (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు) దీని కింద ప్రయోజనం దక్కుతుందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి హామీలేని రుణ సాయాన్ని పొందే దిశగా ఇది కీలక నిర్ణయం అవుతుందన్నారు. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) బోర్డ్ ఆమోదానికి ముందు మహిళల ఆధ్వర్యంలోని సంస్థలకు 85 శాతం వరకే రుణ హామీ రక్షణ ఉండేది. దీన్ని 90 శాతానికి పెంచడం వల్ల మరింత మందికి ప్రయోజనం దక్కుతుందని మంత్రి మాంఝీ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సర్కారు 100 రోజుల పాలనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. 5.07 కోట్ల ఎంఎస్ఎంఈలు సంఘటిత వ్యవస్థలోకి చేరాయని, 21 కోట్ల ఉద్యోగాలు ఏర్పడినట్టు వివరించారు. ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద గడిచిన 100 రోజుల్లో 26,426 సూక్ష్మ సంస్థలు ఏర్పాటయ్యాయని, వాటికి రూ.3,148 కోట్ల రుణాలు మంజూరైనట్టు మంత్రి వెల్లడించారు. వీటి రూపంలో 2.11 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం పెరుగుతుందన్నారు. 14 టెక్నాలజీ కేంద్రాలు రూ.2,800 కోట్లతో, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా 14 టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి జితన్ రామ్ మాంఝీ తెలిపారు. నాగ్‌పూర్, పుణె, బొకారోలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘‘వీటిని ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పుతాం. స్థానిక ఎంఎస్ఎంఈలు వీటి ద్వారా తయారీలో అత్యాధునిక సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార సలహా సేవలు పొందొచ్చు. టెక్నాలజీ లభ్యతతో లక్ష ఎంఎస్ఎంఈలు ప్రయోజనం పొందుతాయి. వచ్చే ఐదేళ్ల కాలంలో 3 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తాం’’అని మంత్రి వివరించారు. పీఎం విశ్వకర్మ పథకం మొదలై ఏడాది అయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్ధాలో ఈ నెల 20న ఓ మెగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. -
‘చంపయీ నీవు పులివి.. ఎన్డీయేలోకి స్వాగతం’
ఢిల్లీ: జార్ఖండ్ ముక్తి మోర్చా నేత చంపయీ సోరెన్ బీబీజేలో చేరుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆదివారం పలువులు ఎమ్మెల్యేలు వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్లిన చంపాయీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ చేరిపోతారంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా చంపయీ సోరెన్‌ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘చంపయీ సోరెన్ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి స్వాగతం’’ అని అన్నారు.चंपाई दा आप टाईगर थें,टाईगर हैं और टाईगर ही रहेंगें।NDA परिवार में आपका स्वागत है।जोहार टाईगर…@ChampaiSoren— Jitan Ram Manjhi (@jitanrmanjhi) August 18, 2024బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంపాయీ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ‘ఎక్స్’లో తన ఆవేదనను షేర్ చేశారు. ‘జూలై మొదటివారంలో ముఖ్యమంత్రిగా నేను పాల్గొనాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నాకు మాటమాత్రమైనా చెప్పకుండా పార్టీ నాయకత్వం రద్దు చేసింది. ఎందుకని ఆరా తీయగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉందని, అప్పటిదాకా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?. ఎమ్మెల్యేల సమావేశంలో నన్ను రాజీనామా చేయమన్నారు. నిర్ఘాంతపోయా. అధికారంపై నాకెలాంటి యావ లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేశా. కానీ నా ఆత్మగౌరవం దెబ్బతింది’ అని చెప్పుకొచ్చారు. జీవితాన్ని ధారపోసిన పార్టీలో నా ఉనికే ప్రశ్నార్థకమైంది. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆ రోజే ఎమ్మెల్యేల భేటీలో ప్రకటించా. నా ఈ ప్రయాణంలో అన్ని ప్రత్యామ్నాయాలు తెరిచే ఉంటాయని సోరెన్ అన్నారు. ఇది తన వ్యక్తిగత పోరాటమని, ఇతర జేఎంఎం నాయకులను ఇందులోకి లాగదలచుకోలేదని చెప్పారు. ఎంతో చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీకి నష్టం కలిగించాలనే ఆలోచన తానెప్పుడూ చేయలేదని, కాని అలాంటి పరిస్థితులు కల్పించారని చంపయీ అన్నారు. -
Lord Ram: రాముడిపై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: దేవుడి విషయంలో ఎవరి నమ్మకాలు వారికి.. కొందరు దేవుడు ఉన్నాడని నమ్మితే.. మరికొందరూ లేడని వాదిస్తారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. రాముడి విషయంలో బీహార్ మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అసలు దేవుడే కాదని సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. రాముడు అనే పేరు కేవలం ఓ పాత్ర మాత్రమేనని అన్నారు. ఆ పాత్రను తులసీదాస్, వాల్మీకి తమ తమ రాతల్లో చొప్పించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రామాయణం రచించారని, తులసీదాస్ ఇతర రచనలు చేశారని, అందులో మంచి విషయాలున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగానే తమకు తులసీదాస్, వాల్మీకిపై పూర్తి విశ్వాసం ఉంది కానీ.. రాముడిపై విశ్వాసం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. దేశంలో రెండే కులాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ధనవంతులు, పేదవాళ్లు అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే రామాయణంలో శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తిన్నారని పురాణ కాలం నుంచి వింటున్నాం. అయితే, మేము కొరికిన పండ్లను మీరు(పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి) తినరు, ముట్టుకోరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. #WATCH | Jamui: Ex-Bihar CM Jitan Ram Manjhi says, "Ram wasn't a God. Tulsidas-Valmiki created this character to say what they had to. They created 'kavya' & 'mahakavya' with this character. It states a lot of good things & we revere that. I revere Tulsidas-Valmiki but not Ram.." pic.twitter.com/ayrQvSfdH1 — ANI (@ANI) April 15, 2022 -
The Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సంచలన ఆరోపణలు
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలనాలతో పాటు రాజకీయ పరమైన చర్చలకూ నెలవైంది ఇప్పుడు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, సినిమా కలెక్షన్లు సంగతి పక్కనపెడితే.. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలంతా కశ్మీర్ ఫైల్స్ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక విమర్శలకతీతంగా.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై ప్రశంసలు గుప్పిస్తున్నారంతా. మరోపక్క విపక్షాలు సినిమాపై తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా The Kashmir Files అబద్ధాలు చూపించిందని సెటైర్లు గుప్పించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సైతం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా ఈ అంశంపై వీడియో పోస్ట్‌తో ఓ ట్వీట్ చేశారు. #kashmirifiles this propaganda film … is it healing wounds or sowing seeds of hatred and inflicting wounds #Justasking pic.twitter.com/tYmkekpZzA — Prakash Raj (@prakashraaj) March 18, 2022 ఇదిలా ఉండగా.. ఎన్డీఏ భాగస్వామి నేత ఒకరు కశ్మీర్ ఫైల్స్‌పై సంచలన ఆరోపణలకు దిగారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన Hindustani Awam Morcha వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ సంచలన ఆరోపణలు చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మేకర్లకు ఉగ్రవాద సంబంధిత గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు ఆయన. फिल्म के नाम पर जो माहौल बनाया जा रहा है, उससे हिन्दु-मुस्लिम सहित विभिन्न धर्मों के बीच खाई और बढ़ेगी, जो किसी भी प्रकार से देशहित में नहीं है। — Ashok Gehlot (@ashokgehlot51) March 17, 2022 ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీహార్‌లో ట్యాక్స్ మినహాయింపు ప్రకటించింది ప్రభుత్వం. ఆ మరునాడే జితన్ మాంఝీ విమర్శలు గుప్పించడం విశేషం. ‘‘ఈ మూవీ కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్‌కు తిరిగి రాకుండా వారిలో భయాందోళనలు రేకెత్తించేందుకు ఉగ్రవాద సంస్థల కుట్రగా కనిపిస్తుంద’’ని ట్వీట్ చేశారు మాంఝీ. అంతేకాదు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో సహా కశ్మీర్ ఫైల్స్ చిత్ర యూనిట్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉండొచ్చన్న మాంఝీ.. ఈ విషయంపై సీరియస్‌గా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. “द कश्मीर फाइल्स”आतंकवादियों की एक गहरी साजिश भी हो सकती है,जिसे दिखाकर आतंकी संगठन कश्मीरी ब्राम्हण मे खौफ एवं डर का माहौल बना रहें हैं ताकि डर से कश्मीरी ब्राम्हण पुनः कश्मीर ना जा पाएं। “द कश्मीर फाइल्स”फिल्म यूनिट सदस्यों के आतंकी कनेक्शन की जांच होनी चाहिए। .@AnupamPKher — Jitan Ram Manjhi (@jitanrmanjhi) March 18, 2022 इबादतों और बख्शीश की रात शब-ए-बारात की दिली मुबारकबाद। अल्लाह से दुआ है कि वह हम सभी की गलतियों को माफ कर हमारी अर्जियां कबूल फरमाएं। — Jitan Ram Manjhi (@jitanrmanjhi) March 18, 2022 ఇదిలా ఉండగా.. ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను అందించింది కేంద్రం. కశ్మీర్ ఫైల్స్ విడుదల అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే ఏడు నుంచి ఎనిమిది సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు భద్రత కల్పించనున్నారు. -
బిహార్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా మాంజీ
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీ వ్యవస్థాపకుడు జితన్‌రామ్ మాంజీ ఆ రాష్ట్ర నూతన అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఫగుచౌహాన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 23 లేదా 24న కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉండటంతో అప్పటి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అసెంబ్లీ మెదటి సమావేశాలు నవంబర్ 23 నుంచి ఐదు రోజుల పాటు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తూర్పు బిహార్‌కు చెందిన 76 ఏళ్ల జితన్ రామ్ బిహార్ 23వ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2014 మే20 నుంచి 2015 ఫిబ్రవరి 20 వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జితన్ రామ్.. చంద్రశేఖర్ సింగ్, బిందేశ్వరీ దూబే, సత్యేంద్ర నారాయణ సిన్హా, జగన్నాథ్ మిశ్రా, లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. -
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం!
పట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ అధికార ఎన్డీయే కూటమితో జట్టుకట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 9 స్థానాల్లో పోటీచేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఎన్డీయేలో భాగమైన జేడీయూ కోటా కింద 9 సీట్లు హెచ్‌ఏఎమ్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం విడుదల చేయనున్నట్లు హెచ్ఏఎమ్ అధికార ప్రతినిధి దానిశ్ రిజ్వాన్ తెలిపారు. అయితే తాము జేడీయూ తరఫున ఎన్నికల బరిలో నిలుస్తామే తప్ప ఆ పార్టీలో హెచ్‌ఏఎమ్‌ను విలీనం చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతామన్నారు. (చదవండి: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాయిదాకు సుప్రీంకోర్టు నో) అదే విధంగా ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నితీశ్‌జీ తీసుకుంటున్న చర్యలు తమను ఆకర్షించాయని రిజ్వాన్ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు సీట్ల కేటాయింపు విషయం పెద్ద సమస్యేమీ కాదని, ఎన్డీయేలో భాగస్వామ్యం కావడం ముఖ్యమన్నారు. కాగా ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ కూటమి నుంచి వైదొలిగిన దాదాపు నెల రోజుల తర్వాత జితన్ రామ్ మాంఝీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక 2015లో జేడీయూను వీడిన జితన్ రామ్ సొంతంగా హిందూస్తాన్ అవామ్ మోర్చా పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీ కూటమిలో చేరిన ఆయన ఆగష్టులో మహాఘట్బంధన్కు గుడ్ బై చెప్పారు. మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరుతుండటంతో.. ‘ఘర్ వాపసీ’కి రంగం సిద్ధమైందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. (చదవండి: నితీశే బిహార్ సీఎం అభ్యర్థి) కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ(జనతాదళ్, ఐక్య), ఎల్జేపీ(లోక్‌జనశక్తి పార్టీ)లు ఐక్యంగానే బరిలోకి దిగుతాయని, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే సీఎం అభ్యర్థి అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బిహార్‌లో కూడా ప్రతిపక్షం నిర్వీర్యమైందనీ, తామే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు జితన్ రామ్ మాంఝీతో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన జేడీయూ మాజీ నేత శరద్ యాదవ్‌ను కూడా తిరిగి ఆహ్వానించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
తల్లి, కొడుకు కిస్ చేసుకున్నా తప్పేనా?
న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆజాంఖాన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీతో పాటు మహిళ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ మాత్రం ఆజాంఖాన్‌కు మద్దతుగా నిలిచారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆజంఖాన్‌ను సమర్ధించేలా ఆయన పలు ఊదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. అన్నాచెల్లెలు, తల్లికొడుకులు ముద్దు పెట్టుకున్నా అది లైంగిక సంబంధమేనా అని ప్రశ్నించారు. 2015లో జేడీయూను వీడిన జితన్‌రామ్ స్వంతంగా హిందూస్తాన్ అవామ్ మోర్చా పార్టీని స్థాపించారు. కాగా, లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్ డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రమాదేవి కూడా ఆజంఖాన్‌ను క్షమించే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు మహిళా ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే, మిమి చక్రవర్తి, అనుప్రియా పటేల్‌లు ఆజంఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ మాత్రం ఆజంఖాన్‌కు మద్దతుగా నిలిచారు. అయితే రమాదేవి తనకు సోదరిలాంటివారనీ, తప్పుగా మాట్లాడుంటే రాజీనామా చేసేందుకైనా సిద్ధమేనని ఆజంఖాన్ స్పష్టం చేశారు. -
మోదీ సభ బిగ్ ప్లాప్: మాజీ సీఎం
పట్నా: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బిహార్‌లో చేపట్టిన సంకల్ప ర్యాలీని బిగ్ ప్లాప్‌గా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ వర్ణించారు. జేడీయూ చీఫ్, సీఎం నితీష్ కుమార్, మోదీ కలిసి 2019 సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని స్థానిక గాంధీ మైదాన్‌లో పూరించిన విషయం తెలిసిందే. ఈ సభ కోసం ప్రధాని, సీఎం కలిసి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగపరిచారని మాంఝీ ఆరోపించారు. ఇద్దరూ కలిసి ఎంత కష్టపడ్డా సభ మాత్రం ఘోరంగా విఫలమైందని, వారనుకున్నంత విజయం సాధించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో వారి ఓటమికి ఇదే సంకేతమని మాంఝీ పేర్కొన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులను నితీష్ ఇంతవరకు పరామర్శించలేదని, రాజకీయ సభలకు మాత్రం ఆయనకు సమయం దొరుకుతుందని విమర్శించారు. కాగా సంకల్ప ర్యాలీపై మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోడ్డు పక్కన ఉన్న పాన్ షాప్ దగ్గర కూడా ఆ మాత్రం జనాలు ఉంటారని సెటైర్లు వేశారు. కాగా నితీష్, మోదీ, పాశ్వాన్ కలిసి సభలో పాల్గొన్న విషయం తెలిసిందే. -
బీజేపీ కూటమికి మాజీ సీఎం ఝలక్
పట్నా : హిందుస్తాన్ ఆవామ్ మోర్చా(సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ బీజేపీ కూటమి నుంచి వైదొలిగారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమిలో ఆయన చేరబోతున్నారు. బిహాన్ ప్రతిపక్షనేత, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ బుధవారం ఉదయం పట్నాలోని మాంఝీ నివాసానికి వచ్చి కాసేపు మంతనాలు జరిపారు. అనంతరం ఇరువురూ కలిసి మీడియాతో మాట్లాడారు. మహాకూటమిలోకి మాంఝీ చేరికపై నేటి సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఉప ఎన్నికలో పోటీ కోసమే! : నాడు సీఎం పదవిని కాపాడుకునేందుకు సొంత పార్టీ జేడీయూను ధిక్కరించి బీజేపీతో జతకట్టిన మాంఝీ.. తర్వాతి కాలంలో సొంతగా పార్టీ స్థాపించి ఎన్నికల్లో దెబ్బతిన్నారు. రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యే పరిస్థితుల్లో.. తన కుమారుడు ప్రవీణ్ మాంఝీని నాయకుడిగా నిలబెట్టాలని జీతన్ రామ్ భావిస్తున్నారు. జెహానాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలో ఎన్డీఏ తరఫున తన కుమారుడిని బరిలోకి దించాలని ప్రయత్నించారు. కానీ ఆ స్థానంలో జేడీయూ తన అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసింది. దీంతో మనస్తాపం చెందిన మాంఝీ.. ఏకంగా ఎన్డీఏ నుంచి బయటికొచ్చేశారు. మాఝీ దూత ఒకరు ఇటీవలే రాంచీ జైలులో ఉన్న లాలూలును కలుసుకున్నారని, జెహానాబాద్ టికెట్‌పై హామీ లభించిన పిదపే కూటమిలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మహాకూటమిలోకి మాంఝీ రాకను స్వాగతిస్తూ ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ప్రకటనలిచ్చాయి. ‘ఆయన మాకు సంరక్షకుడిలాంటివారు. కూటమి వారిని సముచిత గౌరవిస్తుంది’ అని తేజస్వీ పేర్కొనగా, ‘ఆలస్యమైనా మాంఝీ మంచి నిర్ణయం తీసుకున్నార’ని బిహార్ కాంగ్రెస్ ఇన్చార్జి అధ్యక్షుడు కౌషబ్ ఖాద్రీ అన్నారు. -
మాజీ సీఎం మనవడి అరెస్ట్
పాట్నా: మద్యం బాటిల్స్ కలిగి ఉన్నాడన్న కారణంతో మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ మనవడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కత్వారా సమీపంలోని దోభీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్పీ అవకాశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ మనవడు విక్కీ కుమార్ మాంఝీ మద్యం బాటిల్స్ ను కారులో తీసుకెళ్తున్నాడు. ఇది గమనించిన పోలీసులు సీఎం మనవడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న 12 బీర్ బాటిల్స్, మరికొన్ని బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 30 ఏళ్ల విక్కీ మాంఝీ.. జీతన రామ్ మాంఝీ కూతురి కుమారుడు. విక్కీతో పాటు కారులో ఉన్న అతడి ఫ్రెండ్ రవి కుమార్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి గయ సెంట్రలో జైలుకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. గత అక్టోబర్ 2న రాష్ట్రంలో నితీశ్ కుమార్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఎక్సైజ్ చట్టం ప్రకారం విక్కీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ చట్టం ప్రకారం బిహార్ లో పూర్తి మద్యపాన నిషేధం విధించారు. మాజీ సీఎం మాంఝీ మాట్లాడుతూ.. తన మనవడు ఏ తప్పిదం చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే అతడ్ని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులు కావాలనే రాజకీయం చేస్తున్నారని, ఒకవేళ తన మనవడు విక్కీ మాంఝీ ఏదైనా తప్పిదానికి పాల్పడినట్లయితే.. చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చునని చెప్పారు. వాస్తవాన్ని వక్రీకరించి చూపిస్తున్నారని మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ పునరుద్ఘాటించారు. -
బీహార్ మాజీ సీఎం మనవడు అరెస్ట్
-
'వారి జీవితమంతా కూల్చివేతలే'
పట్నా: బిహార్ లో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ మండిపడ్డారు. జితన్ రామ్ మాంఝీ, రాంవిలాస్ పాశ్వాన్ రాజకీయ జీవితమంతా ప్రభుత్వాల కూల్చివేతలకే కేటాయించారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకోకుండా వీరిద్దరూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని దుయ్యబట్టారు. తమ రాజకీయ జీవితం పునరుద్ధరణకు ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని, బిహార్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో బలవంతంగా రాష్ట్రపతి పాలన విధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జేడీ(యూ)-ఆర్జేడీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, బిహార్ లో రాష్ట్రపతి పాలన విధించాలని మాంఝీ, పాశ్వాన్ అంతకుముందు డిమాండ్ చేశారు. -
'రిజర్వేషన్‌ను వదులుకుంటున్నా.. ఇక జనరల్‌గానే '
పాట్నా: తాను రాజకీయాల్లో పోటీచేసేందుకు రిజర్వేషన్ ఉపయోగించుకోనని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామీ మోర్చా(హెచ్ఏఎం) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ రిజర్వేషన్ ఆధారంగా ఎన్నికల్లో పోటీచేయబోమని, జనరల్ స్థానాల నుంచే పోటీ చేస్తామని చెప్పారు. 'రిజర్వేషన్ లబ్ధిని పొందకూడదని మేం నిర్ణయించుకున్నాం. మాలో ఎవరు బలహీనమైనవారు ఉన్నారో వారే దానిని పొందడానికి అర్హులు అని మాంఝీ చెప్పాడు. మాంఝీ మహాదళిత్ కులానికి చెందిన వ్యక్తి. ఆయన ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో రిజర్వేషన్ సీటు నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనే స్వయగా రిజర్వేషన్ అనేది నిజంగా అభివృద్ధి చెందని వారికి దక్కాల్సినదని, అందుకే తాను రిజర్వేషన్ నుంచి పక్కకు జరిగి జనరల్ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పాడు. బలహీన వర్గాల్లో ఉన్నతులుగా మారినవారు తమ ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో తమ రిజర్వేషన్లను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఓ ఆరెస్సెస్ నేత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
'ఆ హంతకులతో మాంఝీకి సంబంధాలు'!
పాట్నా: హంతకులతో బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ సంబంధాలు పెట్టుకున్నాడని జేడీయూ ఆరోపించింది. ఇద్దరు ఇంజినీర్లను హత్య చేసిన రౌడీ షీటర్ల కుటుంబందో మాంఝీ సంబంధాలు నెరిపాడని, ఈ విషయంలో తెరవెనుక ఆయన నేరస్తులను ప్రోత్సహిస్తారని స్పష్టం చేస్తోందని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఆరోపించారు. గత ఏడాది డిసెంబర్ 26న ఇద్దరు ఇంజినీర్లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యను బహేరీ బ్లాక్ అనే సంస్థకు చీఫ్ మున్నీ దేవీ, ఆమె భర్త సంజయ్ లాల్ దేవోనే చేయించారని ఆరోపణలు వినిపించాయి. పైగా మున్నీ దేవీ ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్న గ్యాంగ్ స్టర్ సంతోష్ ఝా సోదరి కూడా. హత్య కేసును విచారించిన పోలీసులు ఆ ఆరోపణలే నిజం అన్నట్లుగా తాజాగా నేడు(ఆదివారం) మున్నీ దేవీని, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తాము అనుకున్నట్లే జరిగిందని, నేడు అరెస్టు అయిన ఆ ఇద్దరు దంపతులు కూడా హిందూస్థానీ అవామీ లీగ్ మోర్చా(లౌకిక), బీజేపీ కూటమి ద్వారా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించారని, వారు టికెట్ ఆశించారని, వారి ప్రచార పోస్టర్లలో కూడా పెద్దపెద్ద ఫొటోలతో కనిపించారని మండిపడ్డారు. దీని ప్రకారం మాంఝీ తెర వెనుక నేరస్తులను ప్రోత్సహిస్తారనే విషయం తేటతెల్లం అవుతుందని నీరజ్ కుమార్ అన్నారు. -
మాజీ సీఎం కుమార్తెపై కేసు
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంజీ కుమార్తె సునైనా దేవిపై కేసు నమోదైంది. గయ జిల్లాలో సునైనా దేవి కోడలు సోని అనుమానాస్పద మృతికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. సునైనాతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులపై సోని తండ్రి రామ్‌దేవ్ మాంజి కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. వరకట్నం కోసం సునైనా దేవి కుటుంబ సభ్యులు తన కుమార్తెను హత్య చేశారని రామ్‌దేవ్ మంజి ఆరోపించారు. తమకు చెప్పకుండా తన కుమార్తెకు అంత్యక్రియలు చేశారని చెప్పారు. 2008లో సునైనా కొడుకు విక్కీతో తన కుమార్తె వివాహం జరిగిందని తెలిపారు. -
'ఆరెస్సెస్, అమిత్ షా వల్లే ఓడాం'
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే దారుణ పరాభవానికి కారణం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షానేనని మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థానీ అవామీ మోర్చా (హెచ్ఏఎం) అధ్యక్షుడు జీతన్‌రామ్ మాంఝీ నిందించారు. 'దళితులు, ఓబీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాపై సమీక్ష జరుపాలన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఎన్డీయే విజయావకాశాలను దెబ్బతీశాయి. ఆయన వ్యాఖ్యలను ప్రధానాంశంగా చేసుకొని మహాకూటమి ప్రచారం జరిపింది' అని మాంఝీ పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ ఓడిపోతే పాకిస్థాన్‌లో టపాసులు పేలుతాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపాయని, ఈ వ్యాఖ్యలు మహాకూటమికే లబ్ధి చేకూర్చాయని ఆయన చెప్పారు. ఎన్డీయే కూటమిలో భాగంగా 20 స్థానాల్లో పోటీచేసిన హెచ్ఏఎం కేవలం ఒక్క స్థానంలోనే గెలిచింది. -
బీజేపీని ముంచిన మిత్రపక్షాలు
మిత్ర పక్షాల బలాన్ని అతిగా అంచనా వేసిన బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంది. 159 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 53 స్థానాల్లో నెగ్గగా.. మిత్రపక్షాలు 84 స్థానాల్లో పోటీ చేసి ఐదే స్థానాల్లో నెగ్గాయి. ఎల్జేపీకి బీజేపీ 40 సీట్లు ఇవ్వగా ఆ పార్టీ కేవలం 2 సీట్లు గెల్చుకుంది. మాజీ సీఎం జితన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్తానీ అవామ్ మోర్చాకు 21 సీట్లు కేటాయించగా.. ఒక్క స్థానంలోనే(మాంఝీ ఒక్కరే నెగ్గారు) గెలిచింది. ఇక కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎస్పీ 23 సీట్లలో పోటీ చేసి రెండింట్లోనే గెలిచింది. -
మాంఝీ బోణీ కొట్టారు..
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి భాగస్వామి హెచ్ఏఎం నేత జితన్ రాం మాంఝీ బోణీ కొట్టారు. ఇమాంగంజ్ నియోజకవర్గంలో ఆయన విజయం సాధించారు. 18,278 ఓట్ల మెజార్టీతో మాంఝీ గెలుపొందారు. జేడీయూ అభ్యర్థి ఉదయ్ నారాయణ చౌదరికి 10,198 ఓట్లు రాగా, బీఎస్పీ నుంచి పోటీ చేసిన మధురా పాశ్వాన్ కేవలం 576 ఓట్లు పొందారు. మరోవైపు మఖ్దుంపూర్ నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉన్న మాంఝీ అక్కడ మాత్రం వెనకంజలో ఉన్నారు. -
మోదీపై లాలు సంచలన వ్యాఖ్యలు
పట్నా: బిహార్ మొత్తం దసరా పండుగ మూడ్‌లో ఉన్నప్పటికీ, ఆయా పార్టీల నేతలు తమ రాజకీయ ప్రత్యర్ధులపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. తాజాగా ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీని రాజకీయ రావణుడంటూ లాలు విమర్శించారు. 'విజయదశమి నాడు రావణుడు నాశనం అయినట్లు, బిహార్ ప్రజలు రాజకీయ రావణుడైన మోదీని నాశనం చేయాలి' అని పిలుపునిచ్చారు. మత రాజకీయాలను నామరూపాలు లేకుండా చేయాలన్నది తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు. లాలూ వ్యాఖ్యలపై ఎన్డీఏ నేతలు కూడా అదే రీతిలో స్పందించారు. 'జంగల్ రాజా'ను ప్రజలే ఓడిస్తారంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ అన్నారు. రావణ దహనం చేసి జేడీయూ చీఫ్ నితీశ్, లాలులను నాశనం చేసినట్లుగా ప్రజలు భావిస్తారని కేంద్ర మంత్రి రామకృపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. తనను విభీషణుడిగా సంబోధించిన నితీష్ కుమారే అసలైన రావణుడని మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ అన్నారు. -
ఓటు ముందు.. తర్వాత మందు: మాజీ సీఎం
ఎన్నికల్లో మద్యం ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. నాయకులు తమ అనుచరులకు బాటిళ్లకు బాటిళ్ల మద్యం పోయిస్తూనే ఉంటారు. అయితే, ఈ మద్యం మత్తులో పడి ఎక్కడ అసలు పోలింగుకే రాకుండా ఆగిపోతారోననే భయం కూడా సదరు నాయకులకు ఉంటుంది. సరిగ్గా ఇలాంటి భయమే బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి కలిగినట్లుంది. అందుకే తన అనుచరులకు 'ఓటు ముందు.. తర్వాత మందు' (పెహలే మత్దాన్, ఫిర్ మద్యపాన్) అనే సూత్రాన్ని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించిన తర్వాత హిందూస్థానీ ఆవామీ మోర్చా అనే కొత్త పార్టీ పెట్టుకుని, ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్న మాంఝీ.. తన వర్గంలోని ఓటర్లెవరూ పోలింగ్ రోజున ఓటు వేయకుండా మద్యం ముట్టుకోవద్దని కోరారు. తన ప్రత్యర్థులు పేదలకు విపరీతంగా డబ్బు, మద్యం పంచుతున్నారని ముషాహర్ వర్గానికి చెందిన మాంఝీ ఆరోపిస్తున్నారు. గయ జిల్లాలో నక్సల్ ప్రభావిత ప్రాంతమైన ఇమామ్‌గంజ్‌లో జేడీయూ నేత, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరితో ఆయన పార్టీ అభ్యర్థి తలపడుతున్నారు. ఇక్కడి ప్రత్యర్థులు మందు సీసాలు పంచుతున్నారని, కానీ వాటిని ఓటు వేసేవరకు ముట్టుకోవద్దని తాను తనవాళ్లకు చెబుతున్నానని మాంఝీ చెబుతున్నారు. ఇన్నాళ్లుగా తనకు పెట్టని కోటలా ఉన్న మఖ్దుంపూర్ నియోజకవర్గం నుంచి మాంఝీ పోటీ చేస్తున్నారు. మహాదళితులకు పంచుతున్న మద్యం బాగా విషపూరితం అయి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యాన్ని పరీక్ష చేయిస్తామని, ఒకవేళ అది కల్తీ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. -
వేడెక్కుతున్న బిహార్ రాజకీయాలు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. తొలి దశలో 49 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వేగంగా మారుతున్న పరిణామాలతో బిహార్ రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. బిజేపీ కూటమి, దళిత నాయకులకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దళిత సీనియర్ నేత నరేంద్రసింగ్ కుమారుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే సుస్మిత్ సింగ్‌కు సీటు నిరాకరించడంతో కూటమిలో వివాదాలకు తెర లేచినట్లైంది. పలు స్థానాల్లో బీజేపీ కూటమి విజయ అవకాశాలను దళిత నేతలు దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారాలతో కూటమికి, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, ఎల్జేపీ నేత రామ్‌విలాస్ పాశ్వాన్ లకు మధ్య దూరం పెరిగిపోయింది. దళిత నేతలను శాంతింపజేయడంలో మాంఝీ పూర్తిగా విఫలమయ్యాడని తెలుస్తోంది. విజయాన్ని కైవసం చేసుకోవడానికి ప్రత్యర్ధి పార్టీలతో చేతులు కలపడానికి సైతం ఇరు వర్గాల నేతలు వెనకాడటం లేదని తెలుస్తోంది. -
రెండు చోట్ల పోటీ చేస్తున్న మాంఝీ
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందూస్తాన్ అవామీ మోర్చా (హెచ్ఏఎమ్) అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఇమామ్‌గంజ్, మఖ్దమ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో నిలవనున్నట్టు హెచ్ఏఎమ్ ప్రతినిధి డానిష్ రిజ్వాన్ తెలిపారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో ఎన్డీయే భాగస్వామిగా మాంఝీ పార్టీ 20 చోట్ల పోటీ చేస్తోంది. తొలి విడతలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. బిహార్‌లో ఎన్డీయే పక్షాలు బీజేపీ 160, లోక్ జనశక్తి పార్టీ 40, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 23 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మాంఝీ పార్టీకి 20 స్థానాలు కేటాయించారు. అక్టోబర్ 12 నుంచి ఐదు విడతల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. -
'సీఎంను ఓడించడమే నా లక్ష్యం'
పట్నా: బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఓడించడమే తమ లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ అవామ్ మోర్చా(హమ్) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ వ్యాఖ్యానించారు. మరోసారి తాను గెలుపొంది సీఎం అయితే.. బిహార్‌ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్నారు. బీజేపీ సెక్యూలర్ పార్టీ కాదన్న మహాకూటమి వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. 1990 దశకంలో బీజేపీ మద్దతుతోనే లాలూ గద్దెనెక్కిన సమయంలో ఆ పార్టీ సెక్యూలర్ అయినప్పుడు.. ఇప్పుడు ఏ అర్హతతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏపై విమర్శలు చేస్తారంటూ మాంఝీ మండిపడ్డారు. హమ్ పార్టీ... ఎన్డీఏ మిత్రపక్షంగా ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మహాకూటమిగా ఉన్న కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీలను దెబ్బతీసి నితీష్‌ను ఓడించడమే తన ముందున్న లక్ష్యమని మాంఝీ అన్నారు. తన నుంచి అధికారం చేజిక్కించుకోగానే నితీష్ తన నిర్ణయాలను రద్దుచేసి, వాటినే తన సొంత నిర్ణయాలు, విధానాలుగా ప్రకటించుకున్నారంటూ మాంఝీ నిప్పులు చెరిగారు. బీజేపీ మిత్ర కూటమి 243 స్థానాలకు గానూ 180 సీట్లను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. హిందుస్తానీ అవామ్ మోర్చా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న 20 స్థానాల్లోనూ గెలుపొందుతామని ధీమా వ్యక్తంచేశారు. 2014, మే నెలలో మాంఝీ సీఎం అయిన విషయం విదితమే. ఆ తర్వాత మాంఝీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నితీష్ తన మద్ధతు ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌తో చేతులు కలిసి బిహార్ సీఎంగా నితీష్ మళ్లీ గద్దెనెక్కారు. -
మాజీ సీఎం కారుకు ప్రమాదం
న్యూఢిల్లీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంటి వద్ద మాంఝీ కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాంఝీకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చిందుకు సోమవారం అమిత్ షా ఇంటికి మాంఝీ వెళ్లారు. ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఆయన ఇంటి నుంచి బయటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
‘సీట్ల’పై అసంతృప్తి లేదు: మాంఝీ
160 సీట్లలో పోటీకి బీజేపీ యోచన! న్యూఢిల్లీ: బిహార్ శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి బీజేపీ కేటాయించిన సీట్ల సంఖ్యపై తనకు అసంతృప్తి లేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తాన్ అవామ్ మోర్చా(హెచ్ఏఎం) అధినేత జితిన్ రాం మాంఝీ ఆదివారం తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాల్లో భాగంగా మాంఝీ పార్టీకి సుమారు 15 సీట్లు ఇస్తామని బీజేపీ శనివారం ప్రతిపాదించింది. అలాగే.. మాంఝీకి మద్దతుగా ఉన్న ఐదుగురు ప్రస్తుత శాసనసభ్యులు బీజేపీ టికెట్లపై పోటీ చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనపై మాంఝీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న బీజేపీ నేతల బృందం శనివారం సమావేశమై చర్చించింది. ఆదివారం ఢిల్లీలో మాంఝీని కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, ధర్మేంద్రప్రధాన్ తదితరులు కలిసి మాట్లాడారు. 20 సీట్లు తీసుకోవడానికి మాంఝీ ఒప్పుకున్నట్లు తెలిసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 160 సీట్లలో తాను పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. పోలీసుల అదుపులో మాంఝీ తనయుడు జితిన్‌రామ్ మాంఝీ కుమారుడు ప్రవీణ్‌కుమార్ తన కారులో రూ. 4.65 లక్షల నగదుతో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. గయ -జెహానాబాద్ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు.. పట్నా నుంచి గయకు వెళుతున్న ప్రవీణ్ కారును తనిఖీ చేశారని.. ఆయన తన వద్ద ఉన్న నగదుకు సంబంధించిన సరైన వివరాలు చెప్పకపోవటంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వివరించారు. అయితే.. తాను పట్నాలో నిర్మిస్తున్న తన ఇంటి కోసం ఈ డబ్బును తన సోదరుల వద్ద నుంచి తీసుకెళుతున్నట్లు ప్రవీణ్ విలేకరులతో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 19 నుంచి బిహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలను ఏడాది పొడుగునా నిర్వహిస్తున్న కాంగ్రెస్.. అందులో భాగంగా 19వ తేదీన ‘సమత - సామరస్యత’ పేరుతో పశ్చిమ చంపారన్ జిల్లాలోని రామ్‌నగర్‌లో బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తోంది. మహాత్మా గాంధీ 1917లో ఇక్కడి నుంచే నీలిమందు రైతుల కోసం తొలి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. మజ్లిస్ పోటీ బీజేపీకి లాభం: కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలన్న మజ్లిస్ పార్టీ నిర్ణయం బీజేపీ విస్తరణకు ఉపయోగపడుతుంది కానీ మజ్లిస్ పార్టీకి కాదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. -
పోలీసుల అదుపులో మాజీ సీఎం కుమారుడు
జెహ్నాబాద్: బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ కుమారుడు ప్రవీణ్ భారీ నగదుతో పట్టుబడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ పోలీసులు జెహ్నాబాద్ ఏయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా అతని నుంచి దాదాపు రూ. 4.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ శాసనసభకు అక్టోబర్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్ దగ్గర దొరికిన డబ్బుకు సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తన ఇంటి నిర్మాణపనుల కోసం కుటుంబసభ్యుల నుంచి ఆ డబ్బు తీసుకెళుతున్నానని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఆదివారం సాయంత్రం సొంత పూచి కత్తు పై ప్రవీణ్ ను విడుదల చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న డబ్బును మాత్రం తిరిగి ఇవ్వలేదు. జితన్ రాం మంఝీ జెహ్నాబాద్ జిల్లాలోని మక్దుంపుర్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహించారు. జెడీ(యూ) పార్టీ తరఫున శాసన సభకు 6 సార్లు ఎన్నికయ్యారు. మాంజీ ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేసిన అనంతరం జేడీ(యూ) నుంచి బయటకు వచ్చి హిందుస్థానీ అవమ్ మోర్చా పార్టీ(హెచ్ఎమ్)ని స్థాపించారు. ప్రస్తుతం బిహార్‌కు జరగనున్న శాసన సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో మంఝీ దగ్గరయ్యారు. -
ఎమ్మెల్యే పదవి వదులుకున్న మాజీ సీఎం
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎమ్మెల్యే పదవిని మాంఝీ వదులుకున్నారని ఆయన సన్నిహిత సహాయకుడు దనిశ్ రిజ్వాన్ తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి రామ్ ముఖియాను కలిసి రాజీనామా లేఖ సమర్పించారని వెల్లడించారు. వెంటనే తన రాజీనామా ఆమోదించాలని మాంఝీ కోరినట్టు చెప్పారు. జహానాబాద్ జిల్లాలోని జహనాబాద్ జిల్లాలో మగ్దంపూర్ అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 70 ఏళ్ల మాంఝీ 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోవైపు తాను స్థాపించిన హిందూస్తానీ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎం) పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా మాంఝీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో జేడీ(యూ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు హెచ్ఏఎం జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. హెచ్ఏఎం ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో చేరింది. -
ఎన్నికల్లో 'మాంఝీ' హిట్టవుతుందా?
దేశవ్యాప్తంగా శుక్రవారం విడుదలవుతున్న బాలీవుడ్ బయోపిక్ 'మాంఝీ: ది మౌంటేన్ మేన్' బిహార్ అసెంబ్లీ ఎన్నికల అంశమైంది. సోమవారం ఈ చిత్రం ప్రివ్యూను చూసిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చిత్రంపై వినోదపన్నును రద్దుచేశారు. చిత్ర కథకు స్ఫూర్తినిచ్చిన గెహ్లార్ గ్రామానికి చెందిన దశరథ్ మాంఝీ పేరిట పట్నాలో 'దశరథ్ మాంఝీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ది లేబర్ రిసోర్సెస్' అనే సంస్థను కూడా ఏర్పాటుచేశారు. చిత్రానికి దర్శకత్వం వహించిన కేతన్ మెహతాతోపాటు అందులో నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే, ఇతర నటీనటులను ప్రశంసించారు. వారు నటించలేదని, పాత్రల్లో నిజంగా జీవించారని పొగిడారు. ఇదో గొప్ప చిత్రమని, రాష్ట్ర ప్రజలందరికీ నిజంగా స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు. గయ జిల్లాలోని గెహ్లార్ గ్రామానికి రోడ్డు సౌకర్యం కోసం 22 ఏళ్లపాటు అకుంఠిత దీక్షతో అడ్డుగా ఉన్న కొండను తవ్వి రోడ్డు వేసిన దశరథ్ మాంఝీ నిజ జీవితం గురించి ప్రస్తావించారు. మాంఝీని గతంలో తాను కలుసుకున్న సందర్భాలను గుర్తుచేశారు. మాంఝీ చిత్రానికి వినోద పన్ను రాయతీని కల్పించాలంటూ నితీష్ కుమార్‌కు స్వయంగా లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థాన్ అవమ్ మోర్చా వ్యవస్థాపక నాయకుడు జితన్ రామ్ మాంఝీ ఇప్పుడు ఇదో రాజకీయ జిమ్మిక్కని వ్యాఖ్యానించారు. నిజ జీవితంలో దశరథ్ మాంఝీ కుటుంబానికిగానీ, ఆయన గ్రామం గెహ్లార్కుగానీ ఎలాంటి సహాయ, సహకారాలు అందించలేదని నితీష్ కుమార్‌ను విమర్శించారు. దశరథ్ మాంఝీ దళితుడు కాకపోయినట్టయితే ఈ పాటికి ఆయనకు భారతరత్న అవార్డు కూడా వచ్చేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 22 శాతం ఉన్న దళిత ఓటర్లదే కీలక పాత్ర అవుతుందని అన్నారు. మాంఝీ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు మెహతా, హీరో, హీరోయిన్లు గెహ్లార్ గ్రామానికి వెళ్లి మాంఝీ కుమారుడికి 7.32 లక్షల రూపాయల పారితోషికాన్ని బహూకరించారు. -
ఓ మాంఝీ కోసం.. మరో మాంఝీ పోరాటం
ఎన్నికలు సమీపిస్తున్న బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు ఓ బాలీవుడ్ సినిమా చుట్టూ తిరుగుతున్నాయి. 22 ఏళ్లపాటు అకుంఠిత దీక్షతో అవిశ్రాంతంగా శ్రమించి స్వగ్రామానికి రోడ్డు వేసిన మహానుబావుడు, దళితుడు దశరథ్ మాంఝీ యథార్థ జీవితం ఆదారంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కేతన్ మెహతా తీసిన 'మాంఝీ: ది మౌంటేన్ మేన్' ఇక్కడి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆగస్టు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ, ఈ సినిమాకు వినోద పన్నును మినహాయించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను డిమాండ్ చేశారు. మాంఝీతో పలు దళిత సంఘాలు కూడా గొంతు కలుపుతున్నాయి. గతంలో ఆమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రంపై నితీష్ కుమార్ వినతి మేరకు నాటి ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ వినోద పన్ను రద్దు చేశారు. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు 'మౌంటేన్ మేన్' చిత్రంపై వినోద పన్ను రద్దు చేయాలని కోరుతున్నారు. 2007లో చనిపోయిన దశరథ్ మాంఝీకి భారతరత్న, నోబెల్ బహుమతి కూడా ఇవ్వాలని మాంఝీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. దశరథ్ మాంఝీ దళితుడు కావడం వల్ల భారత ప్రభుత్వం ఆయన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దశరథ్ మాంఝీ కుమారుడికి, ఇతర కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి ఆదుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, ఓ సినిమాను కూడా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు మాంఝీ ఎత్తు వేస్తున్నారని నితీష్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. గెహలౌర్ వ్యాలీకి చెందిన దశరథ్ మాంఝీ 1960 నుంచి 1982 వరకు దాదాపు 22 ఏళ్లపాటు ఒంటరిగా శ్రమించి ఎత్తైన పర్వతాన్ని తొలిచి 300 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రోడ్డు వేశారు. అందుకు ఆయన ఉపయోగించి ఆయుధాలు రెండే రెండు. ఒకటి సుత్తి, రెండు వులి. ప్రజలంతా పిచ్చివాడని వెక్కిరించినా పట్టించుకోకుండా సమీపంలోని వజీర్‌గంజ్‌కు రోడ్డేశారు. దీనివల్ల ఆయన గ్రామం నుంచి వజీర్‌గంజ్‌కు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన 75 కిలోమీటర్ల దూరం ఒక కిలోమీటరుకు తగ్గింది. ఆమీర్ ఖాన్ స్వయంగా ఆయన ఊరును సందర్శించి దశరథ్ మాంఝీకి నివాళులర్పించినప్పుడు మరోసారి ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. 'సత్యమేవ జయతే' టీవీ సీరియల్ ప్రారంభోత్సవానికి ముందు ఆమీర్ ఖాన్ అక్కడికెళ్లారు. -
ఇంతకీ అక్కడ రాముడెవరు?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడక ముందే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర నేతలు రామాయణంలోని పాత్రలతో పోలుస్తూ పరస్పరం దూషణల పర్వం మొదలుపెట్టారు. హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) పేరిట కొత్త పార్టీని పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీని ద్రోహి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రామాలయంలోని 'విభీషణుడి'తో పోల్చారు. రాముడికి అండగా నిలిచిన విభూషణుడిగా తనను అభివర్ణిస్తే స్వీకరించడానికి తనకేమీ అభ్యంతరం లేదన్న మాంఝీ, నితీష్‌ను మాత్రం 'రావణాసురుడు' అంటూ ఘాటుగా ఎదురుదాడికి దిగారు. అంతేకాకుండా 'బీహార్‌లో రావణ రాజ్యాన్ని తగులబెడతాం' అంటూ మరో చురకేశారు. కారణమేదైనా అన్నకు ద్రోహం చేసి పరుల పంచన చేరిన విభూషణుడు ద్రోహిగా ముద్రపడ్డారని, అందుకే పిల్లలెవరికీ తల్లిదండ్రులు విభూషణుడి పేరు పెట్టరంటూ మాంఝీ వ్యాఖ్యలను నితీష్ తిప్పికొట్టారు. 'మాంఝీ సంగతి సరే! 17 ఏళ్ల బీజేపీ బంధాన్ని వదిలేసి వెళ్లిన ఎన్డీయేలో విభూషణుడు ఎవరో చెప్పాలి?' అంటూ నితీష్‌ను సీనియర్ బీజేపీ నాయకుడు నంద్ కిషోర్ యాదవ్ నిలదీశారు. జనతా పరివార్ పేరిట ఇటీవల నితీష్‌తో చేతులు కలిపిన లాలు ప్రసాద్‌ను ఇటు బీజేపీ, అటు మాంఝీ పార్టీలు రావణాసురుడికి మరో సోదరుడైన 'కుంభకర్ణుడు'తో పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. రామాయణంలోని 'రాముడు' పాత్రతో మాత్రం తమకు తాము గానీ, మరొకరిని గానీ ఎవరూ పోల్చడం లేదు. బహుశా 'బీహార్ రాముడు' ఎవరో తేల్చాల్సిన బాధ్యతను అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లకు అప్పగించినట్టున్నారు. -
'బీజేపీతోనే నా అడుగు'
న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ బీజేపీతో జతకట్టారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని బీహార్‌లో గెలవనివ్వకూడదనే ఉద్దేశంతో బీహార్ సీఎం నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్, ములాయం, తాజాగా శరద్ పవార్ అంతా కలిసి జనతా పరివార్ ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇందుకోసం మహాదళిత నాయకుడు అయిన మాంఝీతో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు ముగిసిన అనంతరం మాంఝీ ఈ విషయాన్ని ప్రకటించారు. -
మాంఝీ ఇంట్లో మామిడిపళ్లకు పోలీసు కాపలా!
పట్నా: బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ నివాసం వద్ద ఉన్న వందలాది మామిడి చెట్లకు పండ్లను కోయకుండా ఉండేందుకు గాను నితీశ్ కుమార్ ప్రభుత్వం 24 మంది పోలీసులను నియమించిందని బుధవారం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా ఆరోపించింది. వీరిలో 8 మంది ఎస్ఐలు, 16 మంది కాన్స్టేబుళ్లు ఉన్నట్లు తెలిపింది. కాగా, బిహార్ సీఎంగా పదవి నుంచి దిగిపోయినా, మాంఝీ ఇంకా ఆ రాష్ట్ర సీఎం అధికారిక నివాసమైన 1, ఆన్నే మార్గ్ బంగ్లాలోనే ఉంటున్నారు. -
'తలుపులు తెరిచే ఉన్నాయి'
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ మాంఝీతో చేతులు కలిపే అవకాశముందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచనప్రాయంగా వెల్లడించారు. కొత్త భాగస్వాములను కలుపుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమతో చేతులు కలిపేందుకు ఇతర పార్టీలకు తలుపులు తెరిచే ఉన్నాయని, కొత్త భాగస్వాములను చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తమకు కీలకమని చెప్పారు. ఇప్పుడున్న కూటమితోనే బీహార్ ఎన్నికలకు వెళతారా, కొత్తవాళ్లను చేర్చుకుంటారా అన్న ప్రశ్నకు ఆయనీ విధంగా స్పందించారు. ఆర్జీడీ నుంచి బహిష్కృతుడైన ఎంపీ పప్పు యాదవ్ కూడా బీజేపీతో చేతులు కలుపుతారని ప్రచారం జరుగుతోంది. -
మాంఝీ సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ మాంఝీ రాబోయే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. హిందుస్థానీ అవామ్ మోర్చా (హామ్ ) పార్టీని స్థాపిస్తున్నట్టుగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాజీముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కుల వివక్ష చూపించి తనను అవమానించారన్నారు. తాను రాజీనామా చేసిన తరువాత ముఖ్యమంత్రి నివాసాన్ని పవిత్ర గంగాజలంతో కడిగించారంటూ మాంఝీ నితీశ్ పై విరుచుకుపడ్డారు. బీహార్ లో ఎస్పీ,ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. అంతేకాదు తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజ్ నగర్ లోని మాతా పరమేశ్వరి దేవాలయాన్ని సందర్శించి వెళ్లిన తరువాత కూడా దేవస్థానం యాజమాన్యం దేవస్థానాన్ని శుభ్రం చేయించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత తన పరిస్థితికి జేడీయూ లోని అగ్రకుల నాయకులే కారణమన్నారు. తాను దళితుడిని కాబట్టే తనకు అన్యాయం జరిగిందని మాంఝీ వాపోయారు. -
'దళితుణ్ని కాబట్టే బలిచేశారు'
అసెంబ్లీలో బలనిరూపణకు కొద్ది గంటల ముందు బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జీతన్ రాం మాంఝీ జేడీయూ అగ్రనాయకత్వం పై విరుచుకుపడ్డారు. మహాదళిత వర్గానికి చెందిన వాడినైనందునే తనను రాజకీయంగా బలిచేశారని జేడీయూపై దుమ్మెత్తి పోశారు. తనకు మద్దతు పలికేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలను జేడీయూ నాయకులు భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. నితిశ్ కుమార్ రిమోట్ కంట్రోల్ పాలనకు యత్నించారని, అందుకు నిరాకరించినందుకే తనపై కక్షగట్టారన్నారు. శుక్రవారం జరగాల్సిన బలపరీక్షకు తగిన ఏర్పాట్లు చేయకుండా స్పీకర్ ఉదయ్ నారాయణ్ కుట్రపూరితంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునే అవకాశం లేకపోవడంతో బలపరీక్షకు ముందే సీఎం పదవికి మాంఝీ రాజీనామా చేశారు. మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని చూస్తున్న నితీష్ కుమార్‌ను గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఆదివారం బీహార్ ముఖ్యమంత్రిగా నితిశ్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. -
ముందే చేతులెత్తేసిన మాంఝీ
-
'మంత్రి పదవి కావాలా.. ఇటు రండి'
బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు కావాలని ఆశించేవాళ్లంతా తన వద్దకు రావాలని ఓ బహిరంగ కార్యక్రమంలో ఆహ్వానం పలికారు. మరి కొన్నిగంటల్లో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న మాంఝీ ఈ వ్యాఖ్యలు చేయడం పలు విమర్శలకు దారి తీసింది. పాట్నాలోని ఎస్కే మెమోరియల్ హాల్లో మహాదళితులతో సమావేశమైన ఆయన ఈ మాటలన్నారు. మహాదళితుల గౌరవాన్ని కాపాడటమే తన లక్ష్యమని, తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఏమైనా చేస్తానని తెగేసి చెప్పారు. దీంతో బహిరంగంగా లంచం ఇస్తానని మాంఝీ అంటున్నారని విపక్షాలు విరుచుకుపడ్డాయి. విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై గుర్రుమన్నాయి. శుక్రవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న మాంఝీ సీఎంగా కొనసాగాలంటే 117 మందికి పైగా శాసన సభ్యుల మద్దతు అవసరం ఉంది. అందుకే ఆయన మంత్రిపదవులు ఎరవేసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. -
మాంఝీకి హైకోర్ట్ షాక్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. జేడీయూ కు చెందిన ఎనిమిది మంది రెబల్ అభ్యర్థుల ఓటు వేసే అవకాశాన్ని రద్దుచేస్తూ హైకోర్టు డబుల్ బెంచ్ ఆర్డర్ జారీ చేసింది. దీంతో ముఖ్యమంత్రి ఇరకాటంలో పడ్డట్టయింది. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవడానికి ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా సంభవించిన ఈ పరిణామం మాంఝీకి పెద్ద ఎదురు దెబ్బ. ఫిబ్రవరి 20న విశ్వాస పరీక్షను ఎదుర్కో బోతున్న తరుణంలో కోర్డు ఆర్డర్ గణనీయమైన ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే నితీష్, మాంఝీ ఇద్దరూ తమ బలాన్ని పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. -
ఇతరులతో అఫైర్లు తప్పు కాదు: మాంఝీ
బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం సమసిపోక ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. సమాజంలో మగాళ్లు వివాహేతర సంబంధాలు కొనసాగించడం సర్వ సాధారణమంటూ కొత్త వివాదానికి తెరతీశారు. భార్యలతో ఔటింగ్‌కు వెళ్లే మగవాళ్ల సంఖ్య 2-5 శాతానికి మించదని, 95 శాతం మంది మగవాళ్లు ఇతరుల భార్యలతో ఔటింగ్‌కు వెళ్లేందుకు ఇష్టపడతారని ఓ ఆంగ్ల పత్రిక గ్రూపుతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘గర్ల్ ఫ్రెండ్ ఉండడం తప్పుకాదు. మనం పాట్నాలోని ఎకో పార్కుకు వెళ్తే కనిపించే జంటలంతా పెళ్లికాని వారే కాదు. స్త్రీ, పురుషులు పెద్ద వాళ్లయితే వారి మధ్యనుండే సంబంధం పరస్పర సమ్మతితో కొనసాగేదే. ఇతరులతో అఫైర్లు ఉండడం తప్పేమీ కాదు. అది వారి వారి వ్యక్తిగత అంశం మాత్రమే’ అన్నారు. 2014 ఆగస్టులో.. పెళ్లయిన ఓ పోలీసు మహిళతో వ్యవహారం నడుపుతూ పట్టుబడిన తన కుమారుడి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ బీజేపీ నాయకులను కలుసుకునేందుకు ఢిల్లీ వచ్చిన సందర్భంగా మాంఝీ మీడియాతో మాట్లాడారు. బీహార్ ముఖ్యమంత్రిగా బలనిరూపణకు సిద్ధమైన నేపథ్యంలో ఆయన బీజేపీ నేతలను కలుసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన మొదటి సారి అధికారికంగా అంగీకరించారు. ఈ నెల 20వ తేదీన ఆయన రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ ఇటీవల ఢిల్లీకి తీసుకొచ్చిన 130 మంది ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తూ వారంగా ఎమ్మెల్యేలు కాదని, వారిలో 30 మంది వివిధ రాష్ట బోర్డులు, కమిషన్లకు చెందిన చైర్మన్లు ఉన్నారని ఆరోపించారు. జేడీ యూకు చెందిన 67 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ తనతోనే ఉన్నారని చెప్పారు. -
మాంఝీకి మద్దతు మహాపాపం
బీజేపీపై శివసేన మరోసారి ఎత్తిపొడుపు మాటలతో దాడికి దిగింది. బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి మద్దతిచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అది మహాపాపమని తీవ్రంగా వ్యాఖ్యానించింది. అదే జరిగితే రాజకీయాల్లో చీకటి శకానికి తీర్మానం చేసినట్లవుతుందని పేర్కొంది. సోమవారం ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఈ విషయం ప్రస్తావన చేసింది. "కమీషన్ తీసుకుంటానని బహిరంగంగా ప్రకటించిన వాళ్ల రాజకీయ ప్రయోజనాలకోసం ఇలాంటి పాపానికి పాల్పడవద్దు. మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయినా బీజేపీ మద్దతు పొందేందుకు మాంఝీ ప్రయత్నిస్తున్నారు. నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా మాంఝీ వ్యవహరించడాన్ని బీజేపీ సాధరణ అంశంగానే చూస్తోంది'' అని అందులో ప్రస్తావించింది. ప్రభుత్వానికి సంబంధించిన టెండర్ల విషయంలో దళితులకు, మహాదళితులకు రిజర్వేషన్లు కల్పించి మాంఝీ తన పరిమితులు దాటారని పేర్కొంది. -
విశ్వాసం నెగ్గుతాం.. రాష్ట్రపతి పాలన ఉండదు
తమ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ అన్నారు. తప్పుకుండా విశ్వాస పరీక్షలో నెగ్గితీరుతామని చెప్పారు. బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రపతి పాలనకు తాను ప్రయత్నిస్తున్నాని మాజీ సీఎం నితీష్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు. ఆయన అనవసరపు వదంతులతో పార్టీ ఎమ్మెల్యేలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. ఢిల్లీలో సోమవారం పలువురు కేంద్రమంత్రులను, బీహార్ గవర్నర్‌ను కలిసిన అనంతరం మాంఝీ మీడియాతో మాట్లాడారు. తమ సర్కారుకు మద్దతు ఇవ్వాలా.. లేదా అన్న విషయంలో బీజేపీ సొంతంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రపతి పాలన తీసుకురావాలన్న ఉద్దేశం తనకు లేదని, ఫిబ్రవరి 20న జరిగే విశ్వాస పరీక్షలో నెగ్గి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. తనకు మద్దతివ్వాల్సిందిగా అన్ని పార్టీలను కోరినట్లు చెప్పారు. నితీష్ వద్ద ఉన్న ఎమ్మెల్యేలంతా బోగస్ అన్నారు. -
అంతా మీవల్లే..!
- బిహార్ సంక్షోభానికి మీరే కారణం - గవర్నర్, బీజేపీపై జేడీయూ, - మిత్రపక్షాల ధ్వజం పట్నా: బిహార్‌లో జేడీయూ, దాని మిత్రపక్షాలు.. మాంఝీ సర్కారు, గవర్నర్‌పై విరుచుకుపడ్డాయి. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ యత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తాయి. మరికొద్ది రోజుల్లో గద్దె దిగబోయే సీఎం జితన్ రాం మాంఝీ.. రోజుకో ప్రజాకర్షక పథకం ప్రకటిస్తూ రాష్ట్రంపై ఆర్థిక భారం పెంచుతున్నారన్నాయి. గవర్నర్ తీరు, బీజేపీ నీచ రాజకీయాల వల్లే రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డాయి. ఆదివారమిక్కడ జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మాంఝీ సర్కారు బలం నిరూపించుకునేందుకు గవర్నర్ ఇంత సమయం ఇవ్వడం దారుణం. సీఎం విశ్వాస పరీక్షలో నెగ్గే వరకూ ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకోకుండా సీఎంను గవర్నర్ నిలువరించాలి’’ అని డిమాండ్ చేశారు. జేడీయూ నేత నితీశ్‌పై గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ చెప్పినట్లు ఆయన నడుచుకుంటున్నట్లు అర్థమవుతోందన్నారు. మెజారిటీ లేదని తెలుస్తున్నా మాంఝీ సర్కారును రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్జేడీ రాష్ట్ర చీఫ్ రామ్‌చంద్ర పూర్వే విమర్శించారు. మాంఝీ.. సర్కారు మైనారిటీలో పడ్డ తర్వాత వివిధ పథకాల పేరుతో రాష్ట్ర ఖజానాపై రూ.50 వేల కోట్ల భారం మోపారన్నారు. మహా దళితుడిని అయినందుకే అణగదొక్కాలని చూస్తున్నారంటూ మాంఝీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ కుమార్ చౌదరీ తప్పుపట్టారు. -
గవర్నర్ పై విరుచుకుపడ్డ జేడీయూ
పట్నా: బీహార్‌లో జేడీయూ, దాని మిత్రపక్షాలు.. మాంఝీ సర్కారు, గవర్నర్‌పై విరుచుకుపడ్డాయి. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీ యత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తాయి. మరికొద్ది రోజుల్లో గద్దె దిగబోయే ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ.. రోజుకో ప్రజాకర్షక పథకం ప్రకటిస్తూ రాష్ట్రంపై ఆర్థిక భారం పెంచుతున్నారని విమర్శలు గుప్పించాయి. గవర్నర్ తీరు, బీజేపీ నీచ రాజకీయాల వల్లే రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డాయి. జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మాంఝీ సర్కారు బలం నిరూపించుకునేందుకు గవర్నర్ ఇంత సమయం ఇవ్వడం దారుణం. రాజాంగబద్ధ హోదాలో ఉన్న గవర్నర్ బీజేపీ కనుస్నల్లో నడుచుకుంటున్నారు. మాంఝీ సర్కారు ఖజానాపై పెనుభారం మోపుతూ రోజుకో కొత్త పథకం ప్రకటిస్తున్న గవర్నర్ చోద్యం చూస్తున్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గే వరకూ ఎలాంటి విధాననపర నిర్ణయాలు తీసుకోకుండా సీఎంను గవర్నర్ నిలువరించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. -
సంచలన నిర్ణయాలు!
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రివర్గ ప్రత్యేక సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఓ వైపు రాష్ట్రంలో రాజకీయం సంక్షోభం వెంటాడుతున్నా మాంఝీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం నితీష్ కుమార్ మహాదళిత్ కేటగిరీలో నుంచి తొలగించిన పాశ్వాన్ కులాన్ని తిరిగి అదే కేటగిరిలో చేర్చాలనే ప్రతిపాదనకు మాంఝీ ఆమోదం తెలిపారు. గతంలో నితీష్ కుమార్ మహాదళిత్ కేటగిరిలోంచి తొలగించిన పాశ్వాన్ కులాన్ని మళ్లీ అదే కేటగిరిలో చేర్చుతూ నిర్ణయంచడం సంచలంనం కలిగించింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు వికాస్ మిత్రాను నియమించే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జర్నలిస్టులకు కూడా మాంఝీ వరాలు కురిపించారు. జర్నలిస్టుల పెన్షన్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిప్రకారం విలేకరులకు పదవీవిరమణ తర్వాత ప్రభుత్వం ప్రతినెలా 5000 రూపాయలు చెల్లించనుంది. జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు కూడా నెలకు 2500 రూపాయలు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లకు లబ్ధి చేకూరనుంది. -
బాక్సర్‌లా బరిలో దిగుతా!
విశ్వాస పరీక్షపై మాంఝీ వ్యాఖ్య పట్నా: గెలుపోటముల గురించి ఆలోచించకుండా ఒక మల్లయోధుడిలా విశ్వాస పరీక్ష అనే బరిలోకి దిగుతానని బిహార్ సీఎం జితన్ రావూంఝీ శుక్రవారం అన్నారు. ‘ప్రత్యర్థి ఎంత బలమైన వాడనే విషయాన్ని కానీ, గెలుపోటముల గురించి కానీ పట్టించుకోకుండా కుస్తీ పోటీలకు దిగే పహిల్వాన్లా బరిలో దిగుతాను. బడుగు వర్గాల సంక్షేమం కోసం పోరాడతానని అసెంబ్లీలో భావోద్వేగ ప్రసంగం చేస్తాను. నాతో ఏకీభవించేవారు కలసి రావాలంటాను. సరైన స్పందన రాకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తాను’ అని స్పష్టం చేశారు. ఒక్క బీజేపీ అనే కాకుండా, అన్ని పార్టీల్లోని ఎమ్మెల్యేల మద్దతు కోరతానన్నారు. కీలుబొమ్మలా వ్యవహరిస్తానని, చెప్పినట్లు వింటానని భావించి తనను వారసుడిగా ఎంచుకోవడం నితీశ్ చేసిన అతిపెద్ద పొరపాటు అని అన్నారు. ‘సీఎం అయిన మొదటి 2 నెలలు కీలుబొమ్మలానే వ్యవహరించాను. నా ఆత్మగౌరవం నన్ను ప్రశ్నించడం ప్రారంభించిన తరువాత స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించాను’ అన్నారు. కాగా, విశ్వాస పరీక్ష ముందు మాంఝీ తన మద్దతుదారైన రాజీవ్ రంజన్‌ను చీఫ్ విప్‌గా నియమించడం మరో వివాదానికి దారి తీసింది. ఆ చర్య నిబంధనలకు వ్యతిరేకమని ప్రస్తుత చీఫ్ విప్, నితీశ్ మద్దతుదారైన శ్రవణ్ పేర్కొంటుండగా, సభా నేతగా మాంఝీకి ఆ అధికారం ఉందని రాజీవ్ రంజన్ వాదిస్తున్నారు. రాజీవ్ రంజన్‌ను చీఫ్‌విప్‌గా నియమించాలని కోరుతూ మాంఝీ రాసిన లేఖపై స్పీకర్ ఇంతవరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. కాగా, జేడీయూని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు విజయ్ కుమార్ చౌధరి స్పీకర్‌కు రాశారు. మాంఝీని బహిష్కరిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుందని, ఏ పార్టీకీ చెందని సీఎంగా ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నారని, ఈ విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా తాము ఓటేయాలనుకుంటున్న దృష్ట్యా తమకు ప్రధాన విపక్ష హోదా ఇవ్వాలన్నారు. -
నితీష్‌కుమార్‌కు కోర్టు షాక్
జేడీ(యూ) నాయకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు పాట్నా హైకోర్టు షాకిచ్చింది. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆయన ఎన్నికపై స్టే విధించింది. దాంతో నితీష్ మద్దతుదారులు కంగుతిని, ఆ నిర్ణయాన్ని సవాలుచేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తన స్టేను ఉపసంహరించుకోవాలంటూ మాజీ మంత్రి, నితీష్ సన్నిహితుడు పీకే షాహి పిటిషన్ దాఖలు చేశారు. నితీష్ ఎన్నిక సరికాదంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీకి సన్నిహితుడిగా పేరొందిన రాజేశ్వర్ రాజ్ అనే ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలుచేయడంతో.. కోర్టు నితీష్ ఎన్నికపై స్టే ఇచ్చింది. దీనిపై ఈనెల 17న విచారణ జరుపుతామని చెప్పింది. పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అందులో నితీష్‌ను కొత్త నాయకుడిగా ప్రకటించడాన్ని రాజ్ కోర్టులో సవాలుచేశారు. శరద్ యాదవ్ నిర్ణయం అప్రజాస్వామికమని మాంఝీ కూడా మండిపడ్డారు. కాగా.. మాంఝీని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసినట్లు పార్టీ చీఫ్ విప్ శ్రవణ్ కుమార్ సోమవారమే చెప్పారు. -
మాంఝీపై వేటు వేసిన జేడీయూ
పాట్నా : ముఖ్యమంత్రి పీఠం దిగేందుకు ససేమిరా అంటున్న జితన్ రాం మాంఝీపై వేటు పడింది. జేడీయూ సోమవారం ఆయన్ని ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అసెంబ్లీలో బలం నిరూపించుకొని తీరుతానంటూ సవాలు విసిరిన మాంఠీ నిన్న ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. మరోవైపు జేడీయూ శాసనసభాపక్ష (ఎల్పీ) కొత్త నేతగా ఎన్నికైన నితీశ్ కుమార్ ...ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీని కలవనున్నారు. దాంతో గవర్నర్ నిర్ణయంపై ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా శనివారం తమ పదవులు వీడిన 20మంది మంత్రల రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝిని పార్టీ నుంచి బహిష్కరించి, జేడీయూ శాసనసభ పక్ష నాయకుడిగా నితీష్‌కుమార్‌ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. అయితే మంఝి రాజీనామా చేయకపోవడం, మెజార్టీ ఎమ్మెల్యేలు నితీష్‌కు మద్దతు తెలియజేస్తుండంతో బీహార్‌లో రాజకీయం సంక్షోభం ఏర్పడింది. -
'అధికారం లేకపోతే ఆయన బతకలేరు'
న్యూఢిల్లీ: రాజీనామా చేసే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝి స్పష్టం చేశారు. శాసనసభలో మెజారిటీ నిరూపించుకుంటానని దీమా వ్యక్తం చేశారు. ఒకవేళ మెజారిటీ నిరూపించుకోలేకపోతే ముఖ్యమంత్రి పీఠం వదులుకుంటానని చెప్పారు. ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... జేడీ(యూ) నేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం లేకపోతే నితీష్ కుమార్ బతకలేరంటూ ధ్వజమెత్తారు. -
నా పడవ మునగదు: మంఝి
న్యూఢిల్లీ: తన పడవ ఎన్నటికీ మునగబోదని ఉద్వాసనకు గురైన బీహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝి దీమా వ్యక్తం చేశారు. తన సీఎం పదవి ఊడిపోయినప్పటికీ ఆయన ధైర్యంగా కనిపించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఆదివారం ఆయన ఢిల్లీ వచ్చారు. సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రిని కలుస్తారు. బీహార్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై ప్రధానితో మంఝి చర్చించనున్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవితవ్యంపై విలేకరులు ప్రశ్నించగా.. 'మంఝి పడవ మునగబోదు' అంటు ఆయన సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ భేటీకి మంఝి హాజరుకావడాన్ని జేడీ(యూ) ఆమోదించలేదు. -
నితిశ్ కుమార్‌కే పట్టం!
-
నితీశ్ కుమార్‌కే పట్టం !
జేడీయూ శాసన సభా పక్ష నేతగా ఎన్నిక మద్దతు పలికిన 97 మంది ఎమ్మెల్యేలు, 37 మంది ఎమ్మెల్సీలు ఎల్పీ సమావేశం నిర్వహించి పంతం నెగ్గించుకున్న పార్టీ అసెంబ్లీ రద్దుకు మంఝి విఫలయత్నం.. కేబినెట్ భేటీలో రద్దును వ్యతిరేకించిన 20 మంది మంత్రులు.. అనంతరం రాజీనామా చేస్తూ గవర్నర్‌కు లేఖ వెనక్కి తగ్గని మంఝి.. మరో 15 మంది మంత్రుల బర్తరఫ్కు సిఫారసు ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైతే బీజేపీ మద్దతు: మంఝీ వర్గం పట్నా: బిహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝిని గద్దె దింపాలన్న పంతాన్ని జేడీయూ నెగ్గించుకుంది. ఎన్నికల ముంగిట మాజీ సీఎం నితీశ్ కుమార్ పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం హైడ్రామా మధ్య జేడీయూ శాసన సభాపక్ష(ఎల్పీ) నేతగా నితీశ్ ఎన్నికయ్యారు. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఎల్పీ సమావేశానికి పార్టీకి చెందిన మొత్తం 111 మంది ఎమ్మెల్యేలలో 97 మంది హాజరయ్యారు. శాసన మండలికి చెందిన 41 మంది సభ్యుల్లో 37 మంది హాజరయ్యారు. సీఎం మంఝి, ఆయనకు మద్దతుగా నిలిచిన ఎనిమిది మంది మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీకి గైర్హాజరయ్యారు. సమావేశంలో ఎల్పీ కొత్త నేతగా ఎమ్మెల్యే అరుణ్ మంఝి.. నితీశ్ పేరు ను ప్రతిపాదించారు. సభ్యులంతా అందుకు ఆమోదం తెలిపారు. అంతకుముందు పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన ఉద్వాసనకు రంగం సిద్ధమైందని తెలుసుకున్న మంఝి.. చివరి ప్రయత్నంగా అసెంబ్లీ రద్దు అస్త్రాన్ని ప్రయోగించాలని చూశారు. ఎల్పీ భేటీకి ముందు హడావుడిగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి 29 మంది మంత్రులు హాజరయ్యారు. మంఝి మద్దతుదారు అయిన నరేంద్ర సింగ్ అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే దీన్ని 20 మంది మంత్రులు (నితీశ్ మద్దతుదారులు) తిర స్కరించారు. 8 మంది మాత్రమే మంఝికి మద్దతుగా నిలిచారు. ఇద్దరు మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్ లలాన్, పీకే సాహిలను బర్తరఫ్ చేయాలంటూ శుక్రవారం సీఎం మంఝి చేసిన సిఫారసుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో వారిద్దరు కేబినెట్ భేటీ కి హాజరుకాలేదు. అసెంబ్లీ రద్దు ప్రతిపాదనను వ్యతిరేకించిన 20 మంత్రులు తమ సంతకాలతో ఓ లేఖను రాష్ట్రపతి ప్రణబ్‌తోపాటు గవర్నర్‌కు పంపారు. అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అందులో తెలిపారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీకి మరో లేఖ పంపారు. సోమవారం నితీశ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌కు శరద్ విజ్ఞప్తి చేయనున్నారు. సయోధ్య యత్నం విఫలం.. కేబినెట్ భేటీకి ముందు మంఝి, నితీశ్ మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరిగాయి. ఘర్షణ వాతావరణం లేకుండా గద్దె దిగాలంటూ శరద్ యాదవ్... మంఝిని ఒప్పించేందుకు యత్నించారు. కానీ అవేవీ ఫలితం ఇవ్వలేదు. పార్టీ సీనియర్ నేత, మంత్రి నరేంద్ర సింగ్.. నితీశ్, మంఝిల మధ్య భేటీకి చొరవ చూపించారు. ఉదయం 11 గంటలకు సింగ్... నితీశ్ ఇంటికెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం సీఎం ఇంటికి వెళ్లారు. తర్వాత సీఎంను, ఆయనకు మద్దతుగా నిలిచిన మరో ఇద్దరు మంత్రులను వెంటబెట్టుకొని నితీశ్ ఇంటికెళ్లారు. అక్కడ శరద్ సమక్షంలో 2 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు సాగించారు. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని యాదవ్ కోరగా.. మంఝి అందుకు నిరాకరించారు. దాంతో జేడీయూ... ఎల్పీ భేటీ ఏర్పాట్లలో మునిగిపోయింది. పూర్తి మెజారిటీ ఉంది.. నితీశ్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత నితీశ్ ఉల్లాసంగా కనిపించారు. తనకు మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారన్నారు. ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, అవసరమైతే ఎమ్మెల్యేలతో పరేడ్‌కు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శరద్.. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటారన్నారు. అంతకుముందు ఎల్పీ భేటీలో మాట్లాడుతూ... జేడీయూపై బీజేపీ చేస్తున్న నీచ రాజకీయాల నేపథ్యంలో ఈ సవాలును స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇకపై అందరికంటే ముందుండి బీజేపీపై పోరాడతానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ నితీశ్ కిందటేడాది మే 19న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, సీఎంగా మంఝి పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. మరో 15 మంది మంత్రుల బర్తరఫ్కు సిఫారసు పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు నితీశ్ వైపు మొగ్గినా.. మంఝి ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరో 15 మంది మంత్రుల(నితీశ్ వర్గం)ను బర్తరఫ్ చేయాల్సిందిగా గవర్నర్‌కు సిఫారసు చేశారు. ఆదివారం నీతి అయోగ్ భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ బయల్దేరే ముందు ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేశారు. మంఝి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తారని ఆయన మద్దతుదారు నరేంద్ర సింగ్ తెలిపారు. మంఝి ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైతే బీజేపీ సాయం కూడా తీసుకుంటామని ఆయన చెప్పడం గమనార్హం. ఢిల్లీ వెళ్లిన మంఝి ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. పార్టీకి ద్రోహం చేశారు: శరద్ యాదవ్ మంఝీ... అన్నం పెట్టిన చేయికే అన్యాయం చేశారని శరద్ మండిపడ్డారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలన్నింటి నీ నీరుగార్చారని దుయ్య బట్టారు. కల చెదిరి మళ్లీ సీఎంగా! 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే బిహార్‌లో జేడీయూ, ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నమైంది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంపై నితీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ఎన్నికల ముంగిట థర్డ్‌ఫ్రంట్ ఏర్పడితే కాంగ్రెసేతర లౌకిక కూటమికి నాయకుడిగా ఎదగాలని తాపత్రయపడ్డారు. థర్డ్‌ఫ్రంట్ తరఫున ప్రధాని రేసులో నిలవాలని ఉవ్విళ్లూరారు. ఇందులో భాగంగానే తరచూ మోదీపై విమర్శలకు దిగడంతో తనపై ‘లౌకికవాది’గా ముద్ర వేయించుకునే యత్నం చేశారు. ఇది చివరకు ఎన్డీఏ, జేడీయూ పొత్తు విచ్ఛిన్నానికి దారి తీసింది. ఎన్డీయే కన్వీనర్ పదవి నుంచి శరద్ యాదవ్ తప్పుకున్నారు. తర్వాత థర్డ్‌ఫ్రంట్ కలగానే మిగిలిపోవడం, నితిశ్ ‘ప్రధాని’ ఆశ కూడా నెరవేరకపోవడం, 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయ దుంధుబి మోగించడం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌లోని 40 స్థానాల్లో జేడీయూ కేవలం 2 లోక్‌సభ సీట్లకే పరిమితమైంది. మిత్రపక్షాలైన ఆర్జేడీ 4, కాంగ్రెస్ 2 స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ 22 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. దీంతో ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నితీశ్ 2014 మే 19న సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. తనకు నమ్మిన బంటైన మంఝిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. అయితే మంఝి మోదీని పొగడం, తరచూ పార్టీకి నష్టం కలిగించే ప్రకటనలు చేయడం ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఈ ఏడాది చివర్లో బిహార్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. మంఝిని ఇంకా కొనసాగిస్తే పార్టీకి నష్టం తప్పదన్న వాదనతో నితీశ్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బిహార్ అసెంబ్లీలో జేడీయూ బలం 111 కాగా శనివారం పార్టీ ఎల్పీ భేటీకి 97 మంది హాజరయ్యారు. 14 మంది దూరంగా ఉన్నారు. వీరిలో మంఝితో పాటు మరో 8 మంది ఆయనకు మద్దతు తెలిపిన మంత్రులు. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు. బీజేపీ ముందుకు వచ్చి మంఝికి మద్దతునిచ్చే పక్షంలో (87 బీజేపీ, మంఝి వర్గం 14) 101 మంది బలం ఉంటుంది. సాధారణ మెజారిటీకి 117 (10 స్థానాలు ఖాళీగా ఉన్నాయి) మంది మద్దతు అవసరం. అంటే మంఝికి మరో 16 మంది ఎమ్మెల్యేలు మద్దతివ్వాలి. నితీశ్‌కు 97 మంది జేడీయూ ఎమ్మెల్యేలతో పాటు ఆర్జేడీ (24), కాంగ్రెస్ (5), సీపీఐ (1) మద్దతుంది. అంటే మొత్తం నితీశ్‌కు 127 మంది ఎమ్మెల్యేల మద్దతున్నట్లు లెక్క. మంఝి మరో 16 మంది పైచిలుకు జేడీయూ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలిగితే... బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగవచ్చు. అలాంటి పరిణామాలే చోటుచేసుకుంటే మంఝి రాజీనామా చేయలేదు కాబట్టి... అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ అడగొచ్చు. అయితే 2015 అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకొని ఇప్పటికే విమర్శల పాలైన మంఝికి బీజేపీ మద్దతు ఇస్తుందా అనేది అసలు ప్రశ్న. -
జేడీయూ శాసనసభా పక్షనేతగా నితీష్ ఎన్నిక
పాట్నా: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీకి జేడీయూ షాక్ ఇచ్చింది. శనివారం ఆయన్ను జేడీయూ శాసనసభా పక్ష నేతగా తొలగించి.. ఆ బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అప్పగించింది. అంతకుముందు బీహార్ లో హైడ్రామా నడిచింది. ఏకంగా అసెంబ్లీని రద్దు చేస్తానంటూ హెచ్చరించిన మాంఝీ నానా హడావుడి సృష్టించారు. దీనిలో భాగంగా అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది నితీష్ మద్దతుదారులు దీన్ని వ్యతిరేకించడంతో ఆ సమావేశం రసాభాసగా మారింది. అటు తరువాత శరవేగంగా మారిన రాజకీయ పరిణామాలతో జేడీయూ అధినాయకత్వం అనుకున్నట్లుగానే మాంఝీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఊహించినట్లుగానే రామ్ మాంఝీని పార్టీ నుంచి జేడీయూ తొలగించింది. -
బీహార్ సీఎం ఝలక్ ఇచ్చారు!
పాట్నా: బీహార్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనతాదళ్ (జేడీ)యూ నాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్న బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఏకంగా అసెంబ్లీని రద్దు చేస్తానంటూ హెచ్చరించారు. దీనిలో భాగంగా శనివారం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి హడావుడి సృష్టించారు. అసెంబ్లీ రద్దు అంశాన్ని మంత్రిమండలి ముందుంచారు. అయితే చాలా మంది మంత్రులు దీన్ని వ్యతిరేకించారు. నితీశ్ కుమార్‌కు మద్దతుగా ఉన్న మంత్రులు కేబినెట్ సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మాంఝీని తొలగించిన తిరిగి నితీశ్ కుమార్‌ను సీఎం చేయాలని అధి నాయకత్వం భావిస్తున్న తరుణంలో రామ్ మాంఝీ మాత్రం మొండిగా వ్యవహరిస్తూ పార్టీలో అలజడి సృష్టిస్తున్నారు. ఇదిలా ఉండగా బీహార్‌లో ప్రజాస్వామ్యం గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలకు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సీఎం జితన్ రామ్ మాంఝీ బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం నటిస్తున్నారని జేడీయూ ప్రధాన కార్యదర్శి కేఎస్ త్యాగి మండిపడ్డారు. -
మంఝికి నేడు ఉద్వాసన!
పార్టీ ఎల్పీ భేటీలో నితీశ్‌కు పగ్గాలు! 20న తాను ఎల్పీ భేటీని నిర్వహిస్తానని మంఝి వెల్లడి ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు సిఫార్సు పట్నా: జేడీయూ నాయకత్వాన్ని ధిక్కరిస్తున్న బిహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. శనివారం జరిగే పార్టీ శాసనసభాపక్ష(ఎల్పీ) భేటీలో సీఎం పగ్గాలను సీనియర్ నేత నితీశ్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. నితీశ్, మంఝి వర్గాల మధ్య ఆధిపత్య పోరు శుక్రవారం తీవ్రమైంది. పార్టీ చీప్ శరద్ యాదవ్ శనివారం ఏర్పాటు చేసిన ఎల్పీ సమావేశం అనధికారికమని మంఝి ఆరోపించారు. అసెంబ్లీలో పార్టీ నేత హోదాలో తాను ఈ నెల 20న తన నివాసంలో ఎల్పీ భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు మంఝి శనివారం ఢిల్లీ వెళ్లనుండడంతో ఆ రోజు జరిగే ఎల్పీ భేటీకి గైర్హాజరు కానున్నారు. కాగా, శనివారం జరిగే అత్యవసర ఎల్పీ సమావేశానికి రావాలని మంఝి, నితీశ్ సహా 111 మంది ఎమ్మెల్యేలు, 41 మంది ఎమ్మెల్సీలకు శుక్రవారం నోటీసులు అందాయి. జేడీయూ రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షుడికి ఎల్పీ భేటీని ఏర్పాటు చేసే అధికారం ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. ‘సాయంత్రం 4 గంటల తర్వాత మంఝి జేడీయూ ఎల్పీ నేతగా ఉండర’ని అన్నారు. మంఝి వెళ్లనున్న ‘నీతి’ భేటీ గురించి విలేకర్లు ప్రస్తావించగా.. ఆయన సీఎం కానప్పుడు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. . పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు, కార్యకలాపాలకు పాల్పడుతున్న మంఝి, పార్టీ పెద్దలు మందలించినా మారలేదని, ఆయనను పదవి నుంచి తప్పించడం అవశ్యంగా మారిందని అన్నారు. 2010 ఎన్నికల్లో ప్రజలు నితీశ్‌కే పట్టం కట్టారని, మంఝి పదవి తాత్కాలికమేనని అన్నారు. ముంఝి ముంచేస్తున్న పార్టీ పడవను నితీశ్ కాపాడతారని పేర్కొన్నారు. నితీశ్‌కు తిరిగి సీఎం పదవి అప్పగించే యత్నానికి శరద్ యాదవ్‌తోపాటు ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు లాలూ, ములాయంల మద్దతు ఉందన్నారు. కాగా, త్యాగి యమదూత అని, ఆయనకు పిచ్చిపట్టిందని మంఝి ఆరోపించారు. నితీశ్ భీష్ముడి వంటి వారని, తను పేద ప్రజల సంక్షేమం గురించి మాట్లాడకుండా నితీశ్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాగా, మంఝి శనివారం అనూహ్యంగా అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేయొచ్చని జేడీయూ భయపడుతోంది. అందుకే మంఝి ప్రభుత్వం మైనారిటీలో పడిందని, ఆయన చేసే సిఫారసులను పరిగణనలోకి తీసుకోవద్దని కోరుతూ శరద్ యాదవ్ గవర్నర్‌ను ఓ లేఖలో కోరినట్లు సమాచారం. కాగా నితీశ్‌కు సన్నిహితులైన మంత్రులు రాజీవ్‌రంజన్, పీకే సాహీలు ప్రభుత్వ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని, వారిని కేబినెట్ తొలగించాలని మంఝి శుక్రవారం రాత్రి గవర్నర్‌కు సిఫారసు చేశారు. పార్టీ కార్యాలయం వద్ద ఘర్షణలు నితీశ్, మంఝి మద్దతుదారులు శుక్రవారం పట్నాలోని జేడీయూ కార్యాలయం వద్ద ఘర్షణలకు దిగారు. దళిత కార్యకర్తలు నితీశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, నితీశ్ మద్దతుదారులపై దాడి చేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర మంత్రులు బ్రిషేన్, నితీశ్ మిశ్రా తదితరులు సీఎం ఇంటికెళ్లి మద్దతు ప్రకటించారు. నితీశ్ నివాసం కూడా జేడీయూ దళిత సంఘం భేటీతో సందడిగా కనిపించింది. ఒత్తిళ్లకు తలొగ్గి సీఎం పదవి నుంచి తప్పుకోవద్దని మంఝికి కేంద్రమంత్రి పాశ్వాన్ సూచించారు. -
రాజీనామాకు ససేమిరా అంటున్న సీఎం!
-
రాజీనామాకు ససేమిరా అంటున్న మాంఝీ
పాట్నా : బీహార్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా జేడీ(యూ) పార్టీ నాయకత్వంపై ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్‌తో శనివారం ఎమ్మెల్యేల భేటీపై మాంఝీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన నేడు సమావేశం కానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు మాంఝీ యత్నిస్తున్నారు. అంతేకాకుండా సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మాంఝీ స్పష్టం చేశారు. మరోవైపు బీహార్ సీఎం మార్పుపై జేడీ (యూ)లో ముమ్మర కసరత్తు జరుగుతోంది. నితీష్ కుమార్ సీఎం పదవి చేపట్టేందుకు వీలుగా ప్రస్తుత సీఎం జితన్ రామ్ మాంఝీని పదవి నుంచి తప్పించనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నెల7న జేడీ(యూ) శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశం అనధికారకంగా జరుగుతోందని, తాను రాజీనామా చేసే అవకాశం లేదని మాంఝీ ఇప్పటికే ప్రకటించారు. -
'నా తర్వాత దళితుడికే సీఎం పదవి'
పాట్నా: తన తర్వాత ముఖ్యమంత్రి పదవిని దళితుడికే అప్పగించాలని బీహార్ సీఎం జితన్ రామ్ మంజీ అభిప్రాయపడ్డారు. తనకు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని పేర్కొన్నారు. పశ్చిమ చంపారన్ జిల్లాలో తరూ వర్గానికి చెందిన గిరిజనులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'మరోసారి ముఖ్యమంత్రి పదవికి నన్ను ఎంపిక చేయరని తెలుసు. దీనికి నాకేం బాధ లేదు. నా తర్వాత కూడా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే దళితుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా' అని మంజీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తొలగిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనీ విధంగా స్పందించారు. అయితే మంజీని తప్పించబోమని జేడీ(యూ) సీనియర్ నాయకుడు నితీష్ కుమార్ స్పష్టం చేశారు. -
మావోయిస్టుల వసూళ్లలో తప్పులేదు: సీఎం
బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ అంటేనే వివాదాల పుట్ట. తాజాగా ఆయన మావోయిస్టుల ను వెనకేసుకొచ్చి కొత్త వివాదం మూటగట్టుకున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ల నుంచి మావోయిస్టులు డబ్బు వసూలు చేయడంలో తప్పులేదని ఆయన చెప్పుకొచ్చారు. రోడ్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, ఇతర ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి మావోయిస్టులు డబ్బు వసూలు చేయడంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని మాంఝీ చెప్పారు. ముఖ్యమంత్రి ప్రతివారం తన ఇంట్లో నిర్వహించే జనతా దర్బార్ కార్యక్రమం అనంతరం ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ''మావోయిస్టులు విదేశీయులా? మావోయిస్టులుగా మారినవాళ్లు కూడా మన సమాజానికి చెందినవాళ్లే. అభివృద్ధి ద్వారా వాళ్లను మళ్లీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చు గానీ, తుపాకులతో బెదిరించలేం'' అని మాంఝీ అన్నారు. తాను మూడేళ్ల క్రితం నితిష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు కొందరు మావోయిస్టులు తన వద్దకు వచ్చారని, తమ వసూళ్లను సమర్థించాల్సిందిగా కోరారని కూడా చెప్పారు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కుమ్మక్కు అయిపోయి ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేస్తున్న విషయాన్ని వాళ్లే చెప్పారన్నారు. 3-4 లక్షల రూపాయల విలువచేసే పనులకు 11 లక్షలు తీసుకుంటున్నారని, పైగా వాటిలో నాణ్యత కూడా ఉండట్లేదని సీఎం మాంఝీ తెలిపారు. 7 లక్షల లాభం పొందుతున్న కాంట్రాక్టర్ల నుంచి మావోయిస్టులు లక్ష రూపాయలు వసూలు చేయడంలో తనకు ఏమాత్రం తప్పు కనిపించడం లేదన్నారు. -
బీహార్ సీఎంపై బూటు విసిరిన యువకుడు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంజీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు మంజీపైకి బూటు విసిరాడు. సోమవారం ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం 'జనత దర్భార్'లో పాల్గొన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. భద్రత సిబ్బంది వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. -
సీఎం పనితీరుపై మంత్రులకే సందేహం!
పాట్నా: వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా మారిని బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మంజి ఈసారి తన మంత్రి వర్గ సహచరులపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. తన పనితీరుపై కొందరు మంత్రులు సందేహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 'నేను టెస్టు క్రికెట్ ఆడుతున్నానని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు వన్డే ఆడుతున్నానని చెబుతున్నారు. ఇంకొందరు టీ-20 ఆడుతున్నానని కితాబిస్తున్నారు. ఎవరేమన్నా, ఏ ఫార్మాట్ అయినా నేను ఆడగలను. హామీలను నురవేర్చగలనని మంత్రులు అర్థం చేసుకుంటారు' అని మంజీ అన్నారు. -
'ఆ పొరపాట్లను బీహార్ లో పునరావృతం కానివ్వం'
పాట్నా:జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన పొరపాట్లను బీహార్ లో పునరావృతం కానివ్వమని సీఎం జితిన్ రామ్ మాంజీ స్పష్టం చేశారు.జార్ఖండ్ లో 81 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 42 సీట్లు కైవశం చేసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీనిపై మీడియాతో మాట్లాడిన రామ్ మాంజీ.. అక్కడ జరిగిన పొరపాట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ బీహార్ లో పునరావృతం కానివ్వమన్నారు. -
సీఎం గారూ...నోరు అదుపులో పెట్టుకోండి!
పాట్నా: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్న బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీకి సొంతపార్టీ జేడీ(యూ) కళ్లెం వేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు సూచించింది. అగౌరవపరిచే వ్యాఖ్యలు పార్టీ, నాయకులకు ఇబ్బందికరంగా ఉంటాయని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. పార్టీ కార్యకర్తల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. వివాస్పద వ్యాఖ్యలు చేయొద్దని మాంజీకి ఆయన సూచించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దని కోరారు. మాంజీని సీఎం పదవి నుంచి తప్పించే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించగా...దీనిపై జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ నిర్ణయం తీసుకుంటారని త్యాగి సమాధానమిచ్చారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుంటే బీహార్ కు చెందిన కేంద్ర మంత్రులను రాష్ట్రంలో అడుగుపెట్టనీయబోమని మాంజీ బుధవారం వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా ఆయన పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. -
బీహార్ సీఎంపై రెండు కేసులు నమోదు
పాట్నా: అగ్రవర్ణాల వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝిపై రెండు కేసులు నమోదు చేశారు. పశ్చిమ చంపరన్ జిల్లాలోని బెట్టియా కోర్టులో సంజయ్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి మాంఝిపై కేసు దాఖలు చేశారు. ఈ కేసును వచ్చే నెల 10న విచారించనున్నారు. ఇదే విషయంపై సమస్తపూర్ జిల్లాలోనూ విజయ్ మిశ్రా అనే కాంగ్రెస్ నాయకుడు మాంఝిపై మరో కేసు దాఖలు చేశారు. దళితులు, గిరిజనులే భారతీయులని, అగ్రకులస్తులు విదేశీయులని, ఆర్యుల సంతతి వారసులని మాంఝి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అగ్రవర్ణాల వాళ్లు విదేశాల నుంచి ఇక్కడికొచ్చారని మాంఝీ వ్యాఖ్యానించారు. దాంతో ఆయనపై బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించింది. -
అగ్రవర్ణాల వాళ్లంటే విదేశీయులు: బీహార్ సీఎం
బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ మరో వివాదానికి తెరదీశారు. అగ్రవర్ణాల వాళ్లంటే విదేశీయులని, ఆర్యుల సంతతి వారసులని వ్యాఖ్యానించారు. దాంతో ఆయనపై బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో కులపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించింది. అగ్రవర్ణాల వాళ్లు విదేశాల నుంచి ఇక్కడికొచ్చారని మాంఝీ వ్యాఖ్యానించారు. బెట్టాయ్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కేవలం గిరిజనులు, దళితులు మాత్రమే ఈ దేశం వాళ్లని ఆయన అన్నారు. వాళ్లకు చదువు సంధ్యలు నేర్పించి, రాజకీయ అవగాహన కల్పించాలని, బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో వాళ్లు కీలక పాత్ర పోషించేలా చూడాలని మాంఝీ చెప్పారు. అయితే, మాంఝీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సీఎం వ్యాఖ్యలను ఖండించారు. వాటివల్ల బీహార్‌లో కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టినట్లవుతోందని అన్నారు. -
అల్లుడే సీఎం వ్యక్తిగత సహాయకుడు..!
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జీతన్‌రామ్ మంజి వివాదంలో చిక్కుకున్నారు. మంజి తన అల్లుడు దేవేంద్ర కుమార్‌ను వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో దేవేంద్ర కుమార్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శికి పంపినట్టు కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి నిబంధనలను అతిక్రమిస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శించారు. -
చేతులు నరికేస్తా జాగ్రత్త.. ఓ సీఎం హెచ్చరిక
బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీకి ఎక్కడలేని కోపం వచ్చింది. ఆయనకు కోపం రాకపోతే విశేషం. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ పతాకశీర్షికలకు ఎక్కుతూనే ఉంటారు. ఈసారి.. వైద్యులు ఆయన ఆగ్రహానికి గురయ్యారు. పేద ప్రజల ప్రాణాలతో ఎవరైనా చెలగాటం ఆడుకున్నారో.. వాళ్ల చేతులు నరికేస్తానని సీఎం మాంఝీ హెచ్చరించారు. మోతీహారీలో ఓ సమావేశానికి హాజరై అక్కడ మాట్లాడుతుండగా ఆయనీ హెచ్చరిక చేశారు. పాట్నా వైద్యకళాశాల ఆస్పత్రికి ఇటీవల ఆయన వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. పాట్నాలో రావణ దహనం సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగి, అక్కడి క్షతగాత్రులు ఆస్పత్రికి వస్తే.. అక్కడ వైద్యులు లేరు, మందులు లేవు, పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా ఉంది. దాంతో సీఎం గారికి వైద్యుల మీద ఎక్కడలేని కోపం వచ్చి, సూపరింటెండెంట్‌ను పిలిస్తే.. ఆయన కూడా లేరు. ఆ విషయాలన్నింటినీ గుర్తుచేసుకున్నారో ఏమో గానీ.. ఇప్పుడు ఇలా చేతులు నరికేస్తానంటూ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన జీతన్ రాం మాంఝీ కారణంగా జేడీయూ తరచు తలపట్టుకోవాల్సి వస్తోంది. తాగడం తప్పుకాదని ఇంతకుముందు ఓసారి ఆయన అన్నారు. -
ఆస్పత్రి దుస్థితి చూసి.. సీఎం షాక్!
బీహార్ రాష్ట్రంలో ఇంకా అరాచక వ్యవస్థ రాజ్యమేలుతూనే ఉంది. ఈ విషయం సాక్షాత్తు ముఖ్యమంత్రి పరిశీలనలోనే తేలడంతో ఆయన అవాక్కయ్యారు. పాట్నా నగరంలో విజయదశమి రోజున తీవ్ర తొక్కిసలాట జరిగి 33 మంది మరణించినా.. ఇంకా అనేకమంది గాయపడినా, అక్కడ మాత్రం నిర్లక్ష్యం ఇంకా ఏమాత్రం వీడలేదు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ పాట్నా వైద్యకళాశాల ఆస్పత్రికి వెళ్లారు. కానీ, అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఒక్క డాక్టర్ కూడా లేకపోవడం చూసి ఆయన షాకయ్యారు. కనీసం మందులు కూడా లేకపోవడం, ఆ వార్డు మొత్తం అపరిశుభ్రంగా, చిరాగ్గా ఉండటంతో ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ''అక్కడ వైద్యులు లేరు. నేను తొక్కిసలాట బాధితులతోను, ఇతర రోగులతో కూడా మాట్లాడాను. అక్కడ వైద్యులు రాసిన మందుల్లో 82 శాతం అసలు అందుబాటులో లేవు. బయటనుంచి తెచ్చుకుంటున్నారు. కేవలం ఇంజెక్షన్లే ఇక్కడ ఇస్తున్నారు. వెంటనే సూపరింటెండెంట్‌ను పిలిచాను. కానీ ఆయన కూడా లేరు'' అని సీఎం మాంఝీ వాపోయారు. దుప్పట్లను నెలరోజులకోసారే మారుస్తున్నారని, అప్పుడప్పుడు మాత్రమే 15 రోజులకు మారుస్తున్నారని ఆయన చెప్పారు. నిబంధనలేవీ ఇక్కడ పాటించట్లేదని, బాత్రూంలు కూడా చాలా అసహ్యంగా ఉన్నాయని, అసలక్కడ నీళ్లు రావట్లేదని తెలిపారు. 45 రోజుల క్రితం అడ్మిట్ అయిన రోగులను కూడా డాక్టర్లు చూడట్లేదని, రెగ్యులర్ రౌండ్లకు కూడా రావట్లేదని అన్నారు. దీనిపై ఆలోచించి రేపే కఠిన చర్యలు తీసుకుంటానని మాంఝీ చెప్పారు. -
నేను వెళ్లానని.. ఆలయం ప్రక్షాళన: ఓ సీఎం ఆవేదన
ఆలయాల్లో వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని సాక్షాత్తు ఓ ముఖ్యమంత్రి వాపోయారు. తాను వెళ్లి వచ్చిన తర్వాత ఆ ఆలయాన్ని ప్రక్షాళన చేశారని ఆయన ఆరోపించారు. ఆయనెవరో కాదు.. బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ. ఆయన షెడ్యూలు కులాలకు చెందినవారు. గత ఆగస్టు నెలలో ఉప ఎన్నికల సందర్భంగా తాను మధుబనిలోని ఓ ఆలయానికి వెళ్లానని, ఆ తర్వాత వాళ్లు ఆ దేవాలయాన్ని కడిగి, ప్రక్షాళన చేసుకున్నారని మాంఝీ చెప్పారు. ఏదైనా అవసరం ఉంటే మాత్రం వాళ్లు తన కాళ్లు పట్టుకోడానికి కూడా వెనకాడరని, మరి ఆలయంలో మాత్రం ఇలా చేయడం ఏంటని అడిగారు. రాష్ట్ర మంత్రి ఒకరు తాను వెళ్లిన తర్వాత ఇలా జరగినట్లు చెప్పారన్నారు. పురాతన కాలంనాటి మనుధర్మాన్ని వాళ్లింకా పాటిస్తున్నారని తెలిపారు. -
'అందుకే ఆ పార్టీలతో జట్టు కట్టాం'
లండన్: బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా తమ రాష్ట్రంలో అభివృద్ధి పథంలోనే పయనిస్తోందని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ అన్నారు. కమలనాథులతో కటిఫ్ ప్రభావం తమ రాష్ట్రంపై అంతగా లేదని ఆయన తెలిపారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రసంగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాము జేడీ(యూ) ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత బీహార్ లో ఆర్థికాభివృద్ధి మందగించిందని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంజ్హీ అన్నారు. మతతత్వ శక్తులను ఎదుర్కొనేందుకే ఆర్జేడీ, కాంగ్రెస్, పార్టీలతో జేడీ(యూ) జట్టు కట్టిందని వివరించారు. -
బీహార్ సీఎం వివాదస్పద వ్యాఖ్యలు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ- బ్లాక్ మార్కెటింగ్ ను సమర్థిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చిన్నవ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ చేయడం నేరం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి వారిపై చర్యలేమీ తీసుకోబోమని కూడా చెప్పారు. తమ జీవనం కోసం, పిల్లలను బాగా చదివించుకోవడం కోసం చిన్న వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడతారని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి వారిపై తమ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోబోదని అన్నారు. మంజ్హీ వ్యాఖ్యలతో అక్కడే ఉన్న కేంద్ర వ్యవసాయ శాఖ రాధా మోహన్ సింగ్ అవాక్కయ్యారు. -
ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడే రావాలా?
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ- జార్ఖండ్ పర్యటపై బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీహార్ లో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో పొరుగున్న జార్ఖండ్ లో పర్యటనకు రావాలా అంటూ నిలదీశారు. జార్ఖండ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోడీ శ్రీకారం చుట్టడం, పలుచోట్ల ప్రసంగాలు చేయడంపై జితన్ రామ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని ప్రభావం ఉప ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మోడీ జార్ఖండ్ పర్యటనపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు. మోడీ ప్రభంజనం తగ్గిపోయిందన్నారు. బూటకపు హామీలతో సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. భవిష్యత్ లో మోడీ మ్యాజిక్ పనిచేయదని జితన్ రామ్ అన్నారు. -
గర్ల్ ఫ్రెండ్ లేనిది ఎవరికి:బీహార్ సీఎం
పాట్నా:ఓ మహిళ పోలీస్ ను లైంగిక వేధించిన ఘటనలో తన కుమారుడు పాత్ర ఉందన్న బీజేపీ ఆరోపణలను బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ తిప్పికొట్టారు. తన అధికారంతోనే కొడుకును తండ్రి తప్పించాడన్న బీజేపీ నేతలు విమర్శలను జితన్ మంజ్హీ తన దైన శైలిలో ఖండించారు. ' ఒక మహిళ పట్ల నా కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడనడానికి సాక్షాలే లేవు. ఆ విషయాన్ని హోటల్ సీసీ ఫుటేజే తేటతెల్లం చేసింది. ఇంక ఏ ఆధారాలున్నాయని బీజేపీ విమర్శలకు చేస్తుంది' అని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఎవరుంటున్నారని అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరికీ గర్ల్ ఫ్రెండ్ ఉండటం అనేది సర్వ సాధారణం అయ్యిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకూ కేసు నమోదు చేయకపోవడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందని తెలిపారు. తన అధికార బలంతో కొడుకును కాపాడుకునే యత్నం చేస్తున్నారని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. -
విశ్వాస పరీక్షలో నెగ్గిన జితన్ రామ్ మంజి
పాట్నా: బీహార్ లో జితన్ రామ్ మంజి నేతృత్వంలోని జేడీ(యూ) సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. విశ్వాస పరీక్ష సమయంలో శాసనసభ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. జేడీ(యూ) ప్రభుత్వానికి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. నితీష్ స్థానంలో జితన్ రామ్ మంజి ఈనెల 20న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. బీహార్ 32వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్ నేడు బలపరీక్షలో నెగ్గారు. -
మంజీ సర్కారుకు ఆర్జేడీ మద్దతు
సోనియాతో లాలూ భేటీ... బీజేపీతో పోరాడతానని బాస పాట్నా/న్యూఢిల్లీ: బీహార్‌లో జితన్‌రామ్ మంజీ నేతృత్వంలో ఏర్పడిన జేడీయూ కొత్త ప్రభుత్వానికి ఆర్జేడీ గురువారం మద్దతు ప్రకటించింది. ఇప్పటికే తగినంత మెజారిటీ ఉన్న జేడీయూ సర్కారు మనుగడకు తమ మద్దతు అవసరం కాకున్నా, తొలిసారిగా మహాదళిత వర్గానికి చెందిన మంజీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినందున జేడీయూ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నామని ఆర్జేడీ శాసనసభాపక్ష నేత అబ్దుల్బరీ సిద్దిఖీ గురువారం తెలిపారు. మతతత్వ శక్తులతో పోరాటంలో భాగంగానే మంజీ నేతృత్వంలోని జేడీయూ సర్కారుకు తాము మద్దతు ఇస్తున్నామని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ చెప్పారు. తాజా పరిణామాలతో బీహార్‌లో బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగనున్నట్లు సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో లాలూ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. సర్వశక్తులనూ ఒడ్డి బీజేపీతో పోరాటం సాగిస్తానని ఆయన సోనియాకు హామీ ఇచ్చారు. ‘ఇది తుపాను. ఎంతోకాలం ఉండదు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా సర్వశక్తులనూ ఒడ్డి పోరాటం సాగిస్తాం’ అని లాలూ అన్నారు. ఇందులో భాగంగానే బీహార్‌లోని జేడీయూ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. -
బీహార్ సీఎంగా మంజి ప్రమాణం
23న విశ్వాస పరీక్ష పాట్నా: బీహార్ 32వ ముఖ్యమంత్రిగా జితన్ రామ్ మంజి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. 17 మంత్రులతో పాటు సీఎంగా మంజితో గవర్నర్ డీవై పాటిల్ ఇక్కడి రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. 23న ఆయన అసెంబ్లీ విశ్వాసాన్ని పొందాలని గవర్నర్ ఈ సందర్భంగా సూచించారు. తాజాగా మంత్రి పదవులు చేపట్టిన వారందరూ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేబినెట్లో మంత్రులుగా పనిచేశారు. ఆ మంత్రివర్గంలో ఒక మహిళ ఉన్నారు. కూలీ బిడ్డ నుంచి సీఎం పీఠం వరకూ... మహాదళిత్ వర్గానికి చెందిన జితన్ రామ్ మంజి 1944 అక్టోబర్ 6న గయ జిల్లాలోని మహకార్ గ్రామంలో పుట్టారు. ఆయన తండ్రి రామ్‌జిత్ రామ్ వ్యవసాయ కూలి. జితన్కు చదువుకోవాలని కోరిక ఉన్నా భూస్వాముల ఒత్తిడితో చిన్నతనంలోనే తండ్రితో కలసి పొలంలో వెట్టిచాకిరీ చేయక తప్పేదికాదు. అయితే తండ్రి, భూస్వామి కొడుకు కోసం నియమించిన ట్యూటర్ సహాయంతో ఆయన బడికి వెళ్లకుండానే 7వ తరగతి పూర్తిచేశారు. ఆ తర్వాత హైస్కూల్లో చేరి చదువును కొనసాగించి చరిత్రలో డిగ్రీ పూర్తిచేశారు. 1968లో తపాలా శాఖలో గుమస్తా ఉద్యోగం పొందిన ఆయన, 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది ఫతేపూర్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రస్తుతం జెహానాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీనియర్ నేతకు కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీ (యూ) పార్టీల ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన అపార అనుభవం ఉంది. ఈ ఏడాది లోక్‌సభకు పోటీ చేసిన మంజి తన ఎన్నికల అఫిడవిట్లో స్థిరచరాస్తులు కేవలం రూ. 2.83 లక్షలుగా పేర్కొని తానెంత సామాన్యుడో చెప్పకనే చెప్పారు. రబ్బర్ స్టాంప్‌ను కాదు.. అంతకుముందు మాజీ సీఎం నితీశ్ కుమార్ చేతిలో కీలుబొమ్మ అనే విమర్శను మంజి తిప్పికొట్టారు. తనను రబ్బ ర్ స్టాంప్ అని చెప్పడం ద్వారా బీజేపీ తన దళిత వ్యతిరేకతను బయటపెట్టుకుంటోందని మంజి విమర్శించారు. అయితే నితీశ్ కుమార్ సూచనలు తీసుకోవడాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు. కాగా, జేడీయూ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ డీవై పాటిల్‌కు లేఖ రాసింది. దీంతో 239 సీట్ల అసెంబ్లీలో ప్రస్తుతం జేడీయూ ప్రభుత్వ బలం 124కు చేరింది. మరోపక్క బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఇద్దరు రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం 88కి పడిపోయింది.