
'అందుకే ఆ పార్టీలతో జట్టు కట్టాం'
బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా తమ రాష్ట్రంలో అభివృద్ధి పథంలోనే పయనిస్తోందని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ అన్నారు.
లండన్: బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా తమ రాష్ట్రంలో అభివృద్ధి పథంలోనే పయనిస్తోందని బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ అన్నారు. కమలనాథులతో కటిఫ్ ప్రభావం తమ రాష్ట్రంపై అంతగా లేదని ఆయన తెలిపారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రసంగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
తాము జేడీ(యూ) ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత బీహార్ లో ఆర్థికాభివృద్ధి మందగించిందని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంజ్హీ అన్నారు. మతతత్వ శక్తులను ఎదుర్కొనేందుకే ఆర్జేడీ, కాంగ్రెస్, పార్టీలతో జేడీ(యూ) జట్టు కట్టిందని వివరించారు.