వేడెక్కుతున్న బిహార్ రాజకీయాలు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. తొలి దశలో 49 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వేగంగా మారుతున్న పరిణామాలతో బిహార్ రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. బిజేపీ కూటమి, దళిత నాయకులకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దళిత సీనియర్ నేత నరేంద్రసింగ్ కుమారుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే సుస్మిత్ సింగ్కు సీటు నిరాకరించడంతో కూటమిలో వివాదాలకు తెర లేచినట్లైంది.
పలు స్థానాల్లో బీజేపీ కూటమి విజయ అవకాశాలను దళిత నేతలు దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యవహారాలతో కూటమికి, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, ఎల్జేపీ నేత రామ్విలాస్ పాశ్వాన్ లకు మధ్య దూరం పెరిగిపోయింది. దళిత నేతలను శాంతింపజేయడంలో మాంఝీ పూర్తిగా విఫలమయ్యాడని తెలుస్తోంది. విజయాన్ని కైవసం చేసుకోవడానికి ప్రత్యర్ధి పార్టీలతో చేతులు కలపడానికి సైతం ఇరు వర్గాల నేతలు వెనకాడటం లేదని తెలుస్తోంది.