రేపే బిహార్లో మొదటి దశ ఎన్నికలు
పాట్నా : బీహార్ శాసనసభకు మొదటి దశ పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. ఈ దశలో మొత్తం 10 జిల్లాల్లో 49 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 583 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ని ప్రారంభం అవుతుందని అడిషనల్ చీఫ్ ఎలక్ట్రోలర్ అఫీసర్ ఆర్ లక్ష్మణన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 1, 35, 72, 339 మంది ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించకోనున్నారని చెప్పారు.
అయితే అత్యధిక ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉందని... ఈ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ప్రదేశాల్లో సాయంత్రం 3.00 గంటలు, మరికొన్ని చోట్ల సాయంత్రం 4.00 గంటలకు పోలింగ్ ముగియనుందని చెప్పారు. మొదటి దశలో మొత్తం 54 మంది మహిళ అభ్యర్థులు బరిలో నిలిచారని లక్ష్మణ్ తెలిపారు.