ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బీహార్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. బీహార్‌లోని ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమానాశ్రయానికి వెళ్లనున్నారు.
దాదాపు 18 నెలల తర్వాత ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ కలిసి వేదికపై కనిపించనున్నారు. ప్రధాని మోదీతో పాటు సీఎం నితీశ్ కుమార్ ఔరంగాబాద్, బెగుసరాయ్‌లకు వెళ్లనున్నారు. గయ విమానాశ్రయం నుంచి నితీశ్ కుమార్ ముందుగా ప్రధాని మోదీతో కలిసి హెలికాప్టర్‌లో ఔరంగాబాద్‌కు బయలుదేరుతారు.
ఔరంగాబాద్‌లో రూ. 21,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రధానమంత్రి బెగుసరాయ్‌లో ర్యాలీలో ప్రసంగించనున్నారు. గ్యాస్‌కు సంబంధించిన రూ.1.48 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ బెగుసరాయ్‌లో ప్రారంభించనున్నారు. ఈ ఇద్దరు ప్రముఖులు చివరిసారిగా 2022, జూలై 12న శాసనసభ శతాబ్ది ఉత్సవాల్లో ఒకే వేదికపై కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment