పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా మరోసారి పగ్గాలు చేపట్టబోతున్న నితీష్ కుమార్ చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకావడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయనకు బదులుగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడి ప్రమాణ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిసింది. తన సీఎం ప్రమాణకార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానిస్తూ నితిష్ కుమార్ ప్రధాని మోదీకి సందేశం పంపించిన విషయం తెలిసిందే.
కాగా, 20న జరుగుతున్న ఈ కార్యక్రమానికి పలువురు ఎన్డీయే సభ్యులు హాజరుకానున్నట్లు తెలిసింది. పంజాబ్ డిప్యూటీ ముఖ్యమంత్రి సుఖ్ బీర్ బాదల్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేల తరుపున సుభాష్ దేశాయ్, రామ్ దాస్ కడం కార్యక్రమానికి హాజరవుతున్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితిష్ కుమార్ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి. మరోపక్క, ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ హాజరవుతున్నట్లు స్పష్టం చేశారు.
నితీష్ కార్యక్రమానికి మోదీ 'నో'
Published Wed, Nov 18 2015 5:49 PM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM
Advertisement
Advertisement