బిహార్‌కు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వలేం.. తేల్చిచెప్పిన కేంద్రం | No Special Status For Bihar Says Centre | Sakshi
Sakshi News home page

బిహార్‌కు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వలేం.. తేల్చిచెప్పిన కేంద్రం

Published Mon, Jul 22 2024 3:04 PM | Last Updated on Mon, Jul 22 2024 3:31 PM

No Special Status For Bihar Says Centre

సాక్షి,న్యూఢిల్లీ:  ఎన్డీయే కూటమిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న బిహార్‌ అధికార పార్టీ జేడీయూకి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని కేంద్రం పార్లమెంట్‌ వేదికగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని వైఎస్సార్‌సీపీ, బిహార్‌కు ప్రత్యేక హోదాపై ఆర్‌జేడీ, జేడీయూ, ఎల్‌జేపీ, అలాగే ఒడిశా కోసం బీజేడీ డిమాండ్‌ చేశాయి.

అయితే సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పార్లమెంట్‌లో స్పందించింది. 
 
ఈ సందర్భంగా బిహార్‌కు స్పెషల్‌ స్టేటస్‌పై కేంద్రం స్పందిస్తూ అధికారికంగా ఓ నోట్‌ను విడుదల చేసింది. అందులో లోక్‌సభలో బిహార్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి  లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

అందులో 2012లో ఇంటర్ మినిస్ట్రీ రియల్ గ్రూప్ బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించింది. అయితే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నిర్దేశించిన ప్రమాణాలలో బిహార్‌ అర్హత సాధించలేదని స్పష్టం చేసింది. దీంతో బిహార్‌కు ఇక ప్రత్యేక హోదా దక్కదేమోనన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.

ఇక పంజక్‌ చౌదరి.. లిఖిత పూర్వక సమాధానంలో ప్రత్యేక హోదా సాధించాలంటే కావాల్సిన అర్హతల గురించి ప్రస్తావించారు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రకారం స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలంటే..

👉పర్వత ప్రాంత రాష్ట్రం అయి ఉండాలి.
👉తక్కువ జనాభా,ఎక్కువ గిరిజన ప్రాంతాలు ఉండాలి.
👉అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండాలి 
👉ఆర్థిక మౌలిక వసతుల లేమి కలిగిన రాష్ట్రమై ఉండాలి 
👉అత్యల్ప ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు అర్హులని తెలిపింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement