పట్నా: రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్.. ఈ మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో తాము మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జనతా దళ్ యునైటెట్(జేడీయూ)చెందిన లోక్‌సభ ఎంపీ సునీల్ కుమార్ పింటూ.. మోదీని ప్రశంసిస్తూ చేసిన స్లోగన్ వివాదాస్పదంగా మారింది.
ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ‘గెలుపు మోదీతో సాధ్యమవుతుంది’అనే బీజేపీ నేతలు, కార్యకర్తలు పలికే స్లోగన్‌ను ఆయన కూడా అంటూ మోదీని ప్రశంసించారు. దీంతో జేడియూ పార్టీ నేతలు పింటూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి, బీజేపీకి అనుకూలంగా ప్రశంసలు కురిపించినందుకు పింటూ.. లోక్ సభ సత్వానికి రాజీనామా చేయాలని జేడియూ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ డిమాండ్ చేశారు. పింటూ మోదీ పట్ల ప్రభావితం అయ్యారని అగ్రహించారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ, మోదీకి అనుకూలమైన స్లోగన్‌లు చేయటం సరికాదన్నారు . అతి తర్వరలో లోక్‌సభ సభ్యత్వ రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే పింటూ చేసిన మోదీ అనుకూల స్లోగన్‌పై బీజేపీ అధికార ప్రతినిధి కుంతల్ కృష్ణా స్పందిస్తూ.. పింటూ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని తెలిపారు.
గతేడాది జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకుని.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి.. తర్వాత ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.
ఇదికూడా చదవండి: ‘ఫ్యామిలీలో మరణం’ అయినా.. పార్టీ గెలుపు కోసం కృషి: మోదీ
Comments
Please login to add a commentAdd a comment