Aurangabad
-
చెరువులో మునిగి ఎనిమిది మంది చిన్నారులు మృతి
పట్నా: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జీవితపుత్రిక పర్వదినం సందర్భంగా రెండు వేర్వేరు గ్రామాల్లోని చెరువులలో స్నానాలు చేస్తూ ఎనిమిది మంది చిన్నారులు నీట మునిగి మృతి చెందారు.ఔరంగాబాద్ జిల్లా పరిధిలోని మదన్‌పూర్ బ్లాక్‌లోని కుషాహా గ్రామంలోను, బరున్ బ్లాక్‌లోని ఇతత్ గ్రామంలోను చెరువులో స్నానం చేస్తూ చిన్నారులు మృతిచెందడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకాంత్ శాస్త్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ జీవితపుత్రిక పండుగ సందర్భంగా పుణ్యస్నానం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ చెరువులకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆయా చెరువుల వద్దకు వెళ్లి, బాధితులను బయటకు తీసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ -
ఏకశిలా నిర్మితమైన కైలాసాలయం
ఒకే రాతితో చెక్కిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి కైలాసాలయం. దీనిని కైలాసం అని కూడా అంటారు. కొండను పై నుంచి తొలిచి ఏకశిలతో నిర్మించిన ఈ అతి పెద్ద దేవాలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కనిపిస్తుంది. ఎల్లోరాలో ఉన్న గుహాలయాలలో ఇది ఒకటి. 276 అడుగుల పోడవు, 154 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 400,000 టన్నుల శిలలను వందల సంవత్సరాలుగా తవ్వించారని అంచనా. ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహాలయాలలో ఇది ఒకటి. ఆలయ గోడలపై లభించిన ఉలి జాడల ఆధారంగా మూడు రకాల ఉలులను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో మూడు అంతస్తులు కలిగి ఉంది. ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాలలో కైలాస దేవాలయం ఒకటి. ఇది 16వ గుహ. దీనిని 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు నిర్మించాడు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం. స్థలపురాణం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసేవరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. వెంటనే ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కోకసా అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చె΄్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుకుని వచ్చారు. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు.శిల్పరీతిఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు అంతస్తుల గోపురం ఉంది. ప్రవేశ ద్వారం వైపున శైవులు, వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం నుంచి రెండు అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి. ఉత్తరం, దక్షిణ ప్రాంగణంలోని రాయిల మీద పెద్ద ఏనుగు నిలుచుని ఘీంకరిస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రకూట రాజులు తమ గజ దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి, ఏనుగులను తమకు ఇష్టమైన జంతువులలో ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో గజ శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని సూచిస్తుంది. ప్రధాన ఆలయంలో లోపల గోడపైన కమలంపై ఆసీనురాలై ఉన్న గజలక్ష్మి ప్రతిమ దర్శనమిస్తుంది. ఆ ప్రతిమ వెనుక నాలుగు ఏనుగులు ఉన్నాయి. రెండు పెద్ద ఏనుగులలో ప్రతి ఒక్కటి పై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి పైన తొండంతో నీటిని అభిషేకిస్తున్నట్లు, రెండు చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుంచి కుండలను నింపుతున్నట్లు చిత్రీకరించబడ్డాయి. శిఖరం దాని కింద అంతస్తునుండి 96 అడుగుల ఎత్తులో ఉంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాళ గది ఉంది, ఇది ఒక పెద్ద సభ–మండపం (స్తంభాల హాలు) తో కలిసి ఉంటుంది. దీనికి పక్కల అర్ధమండపం, ముందు భాగంలో అగ్రమండపం ఉన్నాయి. నంది–మండపం, గోపురం, పూజా మందిర అగ్ర–మండ΄ానికి మధ్య ఉంది, మూడు భాగాలను ఏకరాతి దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణ మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాల వరుసలు ఉన్నాయి. కొండ పక్కన ఉన్న ప్రదక్షిణ మార్గ ఆలయ ్ర΄ాంగణంలో ఐదు వేరు వేరు దేవాలయాలు ఉన్నాయి, ఆలయ నిర్మాణంలో రెండు వేర్వేరు 45 అడుగుల ఎత్తయిన విజయ స్తంభాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజ స్తంభం వెనుక వెలుపలి గోడపై మహాభారతం, రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణమూర్తి త్రిమితీయ శిల్పం వలన ఈ ఆలయానికి ‘కైలాస‘ అని పేరు వచ్చింది. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. ఒక మండపం నుంచి మరొక మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం, స్థలం క్రమేపీ తగ్గుతూ ΄ోతుంది. వెలుతురు కూడా తగ్గిపోతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అనేక పర్యాయాలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. -
ఒకే వేదికపై పీఎం మోదీ, సీఎం నితీష్!
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బీహార్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. బీహార్‌లోని ఔరంగాబాద్, బెగుసరాయ్ జిల్లాల ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమానాశ్రయానికి వెళ్లనున్నారు. దాదాపు 18 నెలల తర్వాత ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ కలిసి వేదికపై కనిపించనున్నారు. ప్రధాని మోదీతో పాటు సీఎం నితీశ్ కుమార్ ఔరంగాబాద్, బెగుసరాయ్‌లకు వెళ్లనున్నారు. గయ విమానాశ్రయం నుంచి నితీశ్ కుమార్ ముందుగా ప్రధాని మోదీతో కలిసి హెలికాప్టర్లో ఔరంగాబాద్‌కు బయలుదేరుతారు. ఔరంగాబాద్‌లో రూ. 21,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రధానమంత్రి బెగుసరాయ్‌లో ర్యాలీలో ప్రసంగించనున్నారు. గ్యాస్‌కు సంబంధించిన రూ.1.48 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ బెగుసరాయ్‌లో ప్రారంభించనున్నారు. ఈ ఇద్దరు ప్రముఖులు చివరిసారిగా 2022, జూలై 12న శాసనసభ శతాబ్ది ఉత్సవాల్లో ఒకే వేదికపై కనిపించారు. -
‘సిటీ ఆఫ్ డోర్స్’ అంటే ఏమిటి? మనదేశంలోని ఆ నగరానికి ఎందుకంత ప్రత్యేకత?
మనం ఎప్పటికీ గుర్తుంచుకునే కథలు కొన్ని ఉంటాయి. అవి కాలక్రమేణా మరుగుపడుతుంటాయి. అయితే మన దేశ చరిత్రకు సంబంధించిన విషయం అయినప్పుడు దానిని తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాం. అలాంటి ఒక అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోని ఆ నగరంలోకి ప్రవేశించాలంటే ఎవరైనా 52 తలుపులు దాటాలి. ఈ నగరానికున్న చరిత్ర చాలా పురాతనమైనది. ఈ నగరంలో అసాధారణ రీతిలో తలుపులు ఉన్నాయి. ఇంతకీ ఆ నగరం ఎక్కడుందో, ఆ నగరానికి సంబంధించిన విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ‘సిటీ ఆఫ్ డోర్స్’ పేరుతో ప్రసిద్ధి ఇతర నగరాల కంటే భిన్నంగా ఉన్నప్పుడు ఆ నగరానికి ప్రత్యేకమైన పేరు ఏర్పడుతుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరాన్ని ‘తలుపుల నగరం’ అని అంటారు. ఈ నగరం తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది. ఈ నగరంలోకి ప్రవేశించాలంటే 52 తలుపులు దాటుకుంటూ రావాలి. ఈ సమాచారం ఔరంగాబాద్ జిల్లా ప్రభుత్వ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ నగరంలోని తలుపులు, వాటికి సంబంధించిన కథలు ఎంతో ప్రసిద్ధిపొందాయి. 500 సంవత్సరాల చరిత్ర ఔరంగాబాద్ నగర చరిత్రను పరిశీలిస్తే ఈ నగరం 500 సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఔరంగాబాద్‌లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియాన్ని చూడవచ్చు. దీనిలో శివాజీ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు కనిపిస్తాయి. అలాగే అప్పట్లో యుద్ధంలో ఉపయోగించిన 500 ఏళ్ల క్రితంనాటి దుస్తులు కూడా కనిపిస్తాయి. మొఘల్ పాలకుడు ఔరంగజేబు తన స్వహస్తాలతో రాసిన ఖురాన్ కాపీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ నగరం పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా భాసిల్లుతోంది ఔరంగాబాద్ మీదుగా వెళుతున్నవారు ఈ నగరాన్ని చూస్తే వినూత్న అనుభూతికి లోనవుతారు. నగరం అంతటా పురాతన తలుపులు కనిపిస్తాయి. ఇది ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది కూడా చదవండి: India vs Bharat: తెగ నవ్విస్తున్న మీమ్స్! -
చైన్ స్నాచర్ల అరాచకం.. సినిమా రేంజ్లో బీజేపీ ఎంపీ ఛేజింగ్..
పాట్నా: ఆయనో ఎంపీ.. కానీ, సినిమా రేంజ్లో దొంగల భరతం పట్టాడు. సినిమా లెవెల్లో ఎనిమిది కిలోమీటర్లు చేధించి తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో చైన్ స్నాచర్లను పట్టుకున్నారు. అనంతరం వారిని.. పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఔరంగాబాద్‌లోని బరున్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరిత కుమారి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తను చూసేందుకు జముహర్ మెడికల్ కాలేజీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆమెను పరామర్శించింది. అనంతరం.. సరిత తన భర్త రాజేష్ గుప్తాతో కలిసి బైక్‌పై ఇంటి వెళ్తోంది. అయితే, వారిని గమనించిన ముగ్గురు దొంగలు కొద్ది రోజులు దూరం బైక్‌ను ఫాలో చేసి దొంగలు సరిత మెడలో ఉన్న చైన్‌ను లాక్కుని పారిపోయారు. ఇక, అదే సమయంలో కారులో అటుగా వెళ్తున్న ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ దొంగలను చూశారు. వెంటనే అప్రమత్తమై.. దొంగలు పారిపోతున్న వైపుగా వెళ్లమని కారును తిప్పమని డ్రైవర్‌కు సూచించారు. అలా దాదాపు 13 కిలోమీటర్లు ఎంపీ కారుతో.. దొంగలను వెంబడించారు. ఈ క్రమంలో కారు.. దొంగల దగ్గరుకు వెళ్లగానే.. వారు రెచ్చిపోయారు. వారి వద్ద ఉన్న గన్‌తో ఎంపీ సుశీల్‌కు గురిపెట్టి కాల్చేస్తామని బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే, దొంగలకు బెదిరింపులను ఎంపీ కొంచెం కూడా బెదరలేదు. అలాగే, వారిని వెంబడిస్తూ వెళ్లారు. కాగా, మధుపుర్ అనే గ్రామం వద్దకు వెళ్లగానే రోడ్డు పక్కనే ఉన్న బురదలో బైక్ స్కిడ్ అయి వారు కిందపడిపోయారు. ఆ వెంటనే ఎంపీ కారు ఆపారు. అది చూసిన ముగ్గురు దొంగలు వెంటనే లేచి పక్కనే ఉన్న పొలాల వైపు పరిగెత్తారు. దీంతో అప్రమత్తమైన ఎంపీ బాడీగార్డ్లు.. వారిని వెంబడిస్తూ పరిగెత్తారు. అనంతరం అరకిలోమీటర్ వరకు ఛేదించి దొంగలను పట్టుకున్నారు. అనంతరం, పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇక, నిందితులను టింకు కుమార్, ఆనంద్ కుమార్, ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. దొంగల వద్ద నుంచి బంగారం, మొబైల్ ఫోన్, ఫారిన్ గన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి -
ప్రధాని క్షమాపణలు చెప్పాక పరిస్థితి మారిందా? అందుకే బీఆర్ఎస్ రంగంలోకి..
ముంబై: మహారాష్ట్రలో అనేక నదులు ప్రవహిస్తున్నా.. ఈ కరువు ఎందుకని ప్రశ్నించారు బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితా? అని విస్మయం వ్యక్తం చేశారు. దేశంలో సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని.. పేదలు మరింత పేదరికంలో కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ సోమవారం సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేసింది. కేసీఆర్ సమక్షంలో పలువురు మహారాష్ట్ర నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఔరంగాబాద్, అకోలాలో నీటి ఎద్దడి ఉందన్నారు. అదే తెలంగాణలో నీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి పట్టదా? ‘మన దేశంలో ఏం జరుగుతుందో అర్థకావడం లేదు. ప్రస్తుతం మన దేశం ముందున్న లక్ష్యం ఏమిటి?. నేను చెప్పే విషయాలను ఇక్కడే మర్చిపోకుండా.. మీ గ్రామాలకు, బస్తీలకు వెళ్లి చర్చించండి. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ఎంత త్వరగా మనం మేలుకుంటే అంత త్వరగా బాగుపడతా. 13 నెలలపాటు ఢిల్లీలో రైతులు నిరసన చేయాల్సి వచ్చింది. 770 మంది రైతులు చనిపోయినా కేంద్ర ప్రభుత్వానికి పట్టదా?. వ్యవసాయ చట్టాలు రద్దు అంటూ ప్రధాని క్షమాపణలు చెప్పాక పరిస్థితి మారిందా?. భయపడేది లేదు.. నీరు, కరెంట్ సమస్యల్ని కూడా కేంద్రం పరిష్కరించలేకపోయింది. నీటి ఎద్దడి పరిష్కారానికి నెహ్రూ హయాంలో కొంత ప్లానింగ్ జరిగింది. మనదేశంలో మార్పు రావాల్సిందే. ఎంతమంది ప్రధానులు మారినా, మన కష్టాలు మాత్రం పోలేదు. దేశంలో మార్పు తీసుకురావడానికే బీఆర్ఎస్ వచ్చింది. కులం, మతం ప్రాతిపదికన బీఆర్ఎస్ ఏర్పడలేదు. కొత్త పార్టీ వస్తే దానిపై ఎన్నో అపవాదులు సృష్టిస్తారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా, మేము భయపడేది లేదు. నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పర్మినెంట్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తగ్గిన ఆదరణ!.. వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనా? -
24న ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ సభ
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ నెల 24న బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ విస్తరణకు ప్రాధాన్యమిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే రెండు సభలను నిర్వహించగా.. తాజాగా మూడో సభ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేదిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన వివిధ పా ర్టీల నేతలు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్లో చేరుతున్నారు. బీజేపీ, శివసేనతోపాటు ఎన్సీపీ, శివసంగ్రామ్పార్టీ, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన తదితర పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ జాబితాలో ఉన్నారు. షెట్కారీ సంఘటన్ నేత శరద్ ప్రవీణ్జోషి, మాజీ ఎమ్మెల్యేలు శంకరన్న డోంగె, సంగీత థోంబర్తోపాటు వివిధ పా ర్టీల తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేతలు ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు. గ్రామ స్థాయిలో బలోపేతానికి ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం లక్ష్యంగా తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాలతోపాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై బీఆర్ఎస్ దృష్టి కేంద్రీకరిస్తోంది. ప్రధానంగా లాతూర్, నాందేడ్, యవత్మాల్, చంద్రాపూర్, షోలాపూర్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడ్, నాసిక్ జిల్లాలపై ఫోకస్ చేసింది. పా ర్టీలోకి చేరికలు కూడా ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే నాందేడ్‌లో ఫిబ్రవరి 5న బీఆర్ఎస్ తొలిసభను నిర్వహించగా.. మార్చి 6న కాంధార్–లోహలో రెండో సభ జరిగింది. తాజాగా ఔరంగాబాద్‌లో మూడో సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఏర్పాట్లు ప్రారంభమవుతాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తర్వాత షోలాపూర్‌లో.. ఔరంగాబాద్ తర్వాత మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం లేదా పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లో భాగమైన షోలాపూర్‌ను ఎంచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చేరికలను కొనసాగిస్తూనే క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటు ద్వారా.. పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీతోపాటు, బీఆర్ఎస్ రైతు విభాగం మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాణిక్ కదమ్ తదితరులు చేరికలు, పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మరోవైపు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ మహారాష్ట్ర నేతల చేరికలను సమన్వయం చేస్తున్నారు. అంకాస్ మైదానంలో బహిరంగ సభ ఔరంగాబాద్ సభకు సంబంధించి మహారాష్ట్రలోని కన్నడ్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శంకరన్న డోంగే, హర్షవర్ధన్ జాదవ్, సీనియర్ నాయకులు అభయ్ కైలాస్‌రావు పాటిల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభకు జన సమీకరణ, ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ఔరంగాబాద్ సభ జరుగుతున్నట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రకటించారు. -
కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఆ రెండు నగరాల పేరు మార్పు!
ముంబై: బీజేపీ అధికారంలో ఉన్న చోట పురాతన నగరాల పేర్ల మార్పు చేపట్టింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పట్టణాల, నగరాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలో రెండు ప్రముఖ నగరాల పేర్లను మార్చబోతోంది. అందుకు కేంద్రం ఆమోద ముద్ర కూడా వేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్‌గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ధృవీకరించారు. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దీనిపై ఫడ్నవిస్ స్పందిస్తూ.. తమ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లను మార్చాలనే డిమాండ్‌ను తొలిసారిగా శివసేన అధినేత బాల్ థాక్రే తెరపైకి తీసుకొచ్చారు. కొన్ని ఏళ్లుగా ఈ డిమాండ్ నడుస్తోంది. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే 2022లో తన ప్రభుత్వం కూలిపోయే ముందు తన చివరి క్యాబినెట్ సమావేశంలో ఈ పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పేర్ల మార్పుపై మహారాష్ట్ర క్యాబినెట్ 2022లో నిర్ణయాన్ని ఆమోదించింది కూడా. అయితే దాని ఆమోదం మాత్రం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. చదవండి: మార్క్స్ మెమోపై వాగ్వాదం.. ప్రిన్సిపాల్‌పై స్టూడెంట్ దాడిలో.. -
Bihar: నితీశ్ కుమార్‌పై దాడికి యత్నం!
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సోమవారం దాడికి యత్నం జరిగింది. ఔరంగాబాద్ జిల్లాలో సమాధాన్ యాత్ర సందర్బంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. విరిగిన కుర్చీ ముక్కను సీఎం నితీశ్‌పైకి విసిరేశాడు ఓ యువకుడు. అయితే టైంకి ఆయన ఆగిపోవడంతో.. అది పక్కన పడింది. వెంటనే అది గమనించిన ఆయన పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని రౌండప్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పరుగులు అందుకున్నాడు. ప్రజలతో ఆయన మమేకమై మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఓ యువకుడు ఈ దాడికి పాల్పడగా.. పారిపోయిన ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ఉల్లంఘనలకు గానూ అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడి యత్నానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. #WATCH | Bihar: A part of a broken chair was hurled towards Bihar CM Nitish Kumar during Samadhan Yatra in Aurangabad. pic.twitter.com/MqeR6MLnFR — ANI (@ANI) February 13, 2023 -
Pearl Culture: ముత్యాల సాగు.. ఏడాదికి 14 లక్షల నికరాదాయం
నీటి వనరులు పరిమితంగా ఉన్న మెట్ట ప్రాంతంలోనూ మంచినీటి చెరువుల్లో ముత్యాల పెంపకంతో మంచి ఆదాయం గడించవచ్చని మహారాష్ట్రలోని మరఠ్వాడా రైతులు నిరూపిస్తున్నారు. ఔరంగాబాద్ పరిసర ప్రాంతాల్లో గత 10–15 ఏళ్లుగా మంచినీటిలో ముత్యాల సాగు పుంజుకుంటున్నది. కరువు ప్రాంతం అయినప్పటికీ భువనేశ్వర్‌లోని కేంద్రీయ మంచినీటి ఆక్వాకల్చర్ పరిశోధనా సంస్థ (సిఫా) శాస్త్రవేత్తల పర్యవేక్షణలో శిక్షణ పొంది ఆధునిక మెలకువలు పాటిస్తూ ముత్యాల సాగు చేస్తుండటం విశేషం. కనీసం 4,500 మంది రైతులు ముత్యాల సాగు చేస్తున్నారని ఔరంగాబాద్‌కు చెందిన ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ చెబుతున్నారు. మంచి ఆదాయం వస్తుండటంతో మరఠ్వాడా ప్రాంతంలో ముత్యాల సాగు ఏటేటా విస్తరిస్తోంది. ఎఫ్.పి.ఓ. ద్వారా సమష్టి సేద్యం రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్.పి.ఓ.)ల ద్వారా కూడా రైతులు సమష్టిగా ముత్యాల సాగు చేపడుతున్నారు. ఒస్మానాబాద్ జిల్లా షహపూర్ గ్రామానికి చెందిన రైతు సంజయ్ పవార్ మరో 9 మంది రైతులతో కలిసి త్రివేణి పెరల్స్ అండ్ ఫిష్ ఫామ్ పేరిట ఎఫ్.పి.ఓ.ను నెలకొల్పారు. రెండేళ్ల క్రితం కరోనా కష్టాలను సైతం లెక్క చేయకుండా భువనేశ్వర్‌లో సిఫాకు వెళ్లి ముత్యాల పెంపకంలో శిక్షణ పొంది సాగు చేశారు. తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం పొందారు. సొంత పొలంలో 300 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతున రూ. 8.5 లక్షల పెట్టుబడితో 2020–21లో చెరువు తవ్వారు. నీరు ఇంకిపోకుండా అడుగున పాలిథిన్ షీట్ వేశారు. ఔరంగాబాద్‌లోని ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ దగ్గర నుంచి 25 వేల మంచినీటి ఆల్చిప్పలను ఒక్కొక్కటి రూ. 90 చొప్పున కొనుగోలు చేశారు. 2021 జూలైలో ఆల్చిప్పలను ఇనుప మెష్‌లో అమర్చి, చెరువు నీటిలో మునిగేలా తాళ్లతో లాగి గట్టుపై పోల్స్‌కు కట్టారు. చెరువులో నీరు ఆవిరైపోకుండా చెరువుపైన కూడా పాలిథిన్ షీట్ కలిపారు. చెరువు చుట్టూతా మెష్ వేశారు. ముత్యం ధర రూ. 400 చెరువు నీటిలో నాచును ఆహారంగా తీసుకుంటూ ఆల్చిప్ప పెరుగుతుంది. నాచు పెరగడం కోసం (నెలకో వెయ్యి చొప్పున రోజుకు కొన్ని) స్పైరులినా టాబ్లెట్లను వేశారు. ఆల్చిప్పను రెండుగా చీల్చి మధ్యలోకి చిన్నపాటి నమూనాను చొప్పిస్తే.. దాని చుట్టూ కొద్దినెలల్లో తెల్లటి పదార్థం పోగుపడి.. ముత్యంగా తయారవుతుంది. లోపలికి చొప్పించేది ఏ ఆకారంలో ఉంటే ముత్యం ఆ (ఉదా.. దేవతామూర్తి/ బియ్యపు గింజ/ గుండ్రటి చిరుధాన్యం) ఆకారంలో తయారవుతుంది. 2022 సెప్టెంబర్‌లో పది వేల ముత్యాలు వచ్చాయి. ముత్యం రూ. 400కి అమ్మారు. రూ. 40 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం వచ్చిందని సంజయ్ తెలిపారు. ‘ముత్యాల పెంపకం మరీ కష్టమేమీ కాదు, మెలకువలను పాటిస్తే చాల’ని రైతు గోవింద్ షిండే అన్నారు. (క్లిక్ చేయండి: చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!) -
భయంకర దృశ్యాలు.. డ్రైవర్ వేధింపులు.. కదులుతున్న ఆటో నుంచి దూకడంతో
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో భయంకర ఘటన వెలుగు చూసింది. రద్దీగా ఉండే రహదారిపై వేగంగా ఆటో నుంచి ఓ మైనర్ బాలిక అకస్మికంగా రోడ్డు మీదకు దూకింది. డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో.. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మైనర్ ఆటోలో నుంచి కిందకు దూకినట్లు తేలింది. ఈ ప్రమాదంలో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాలిక ఆటో నుంచి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన స్పందించి ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ రోడ్డు పక్కనున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో రద్దీగా ఉన్న రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ఆటోరిక్షా నుంచి రోడ్డుపై పడినట్లు కనిపిస్తోంది. వెంటనే బైక్‌పై వెళ్తున్న వ్యక్తి బాలికను రక్షించేందుకు వచ్చాడు. మిగతా వారిని సాయం చేయాలని కోరుతూ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. మరో వ్యక్తి తన షాపు నుంచి వాటర్ బాటిల్‌తో బయటకు వచ్చి బాధితురాలికి అందివ్వడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు డ్రైవర్ సయ్యద్ అక్బర్ హమీద్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు #WATCH #CCTV #Crime #BREAKING#Maharashtra In #Aurangabad auto driver #molested girl in moving auto,minor girl jumped from moving auto,#girlinjured After molesting the girl jumped from speeding #auto which was caught on CCTV #ACCIDENT pic.twitter.com/udGvgMgbry — Harish Deshmukh (@DeshmukhHarish9) November 16, 2022 -
గ్యాస్ సిలిండర్ పేలుడు.. పోలీసులు సహా 30 మందికి గాయాలు
పాట్నా: బిహార్ ఔరంగాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనంలో భారీ మంటలు చెలరేగాయి. వీటిని ఆర్పేందుకు వచ్చిన ఏడుగురు పోలీసులు సహా మొత్తం 30 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడియా గలి సమీపంలోని అతిచిన్న వీధిలో ఈ ఘటన జరగడంతో సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తాయి. ఛట్ పూజ సన్నాహాల్లో భాగంగా ఓ మహిళ ప్రసాదం తయారు చేస్తుండగా.. గ్యాస్ లీకై ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం క్షణాల్లోనే మంటలు భవనమంతా వ్యాపించాయి. చదవండి: కోర్టులో మహిళా లాయర్ల సిగపట్లు.. వీడియో వైరల్.. -
ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల డిష్యుం.. డిష్యుం
ఔరంగాబాద్: ఇద్దరు టీనేజర్లు.. ఒకే కుర్రాడిని ప్రేమించారు. కాదు.. కాదు.. ఆ కుర్రాడే ఒకరికి తెలియకుండా మరొకరిని మ్యానేజ్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి విషయం బయటపడేసరికి.. కుర్రాడి కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ఆ అమ్మాయిలు.. వాళ్లలో వాళ్లే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని బాహాబాహీకి దిగారు. మహారాష్ట్రలోని పయ్థాన్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిల్లో.. ఒక అమ్మాయి సదరు కుర్రాడితో కలిసి స్థానిక బస్టాండ్‌కు చేరుకుంది. ఆ సమయంలో మరో అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీళ్లిద్దరినీ గమనించి.. దగ్గరకు వచ్చి నిలదీసింది. విషయం తేలేసరికి.. ప్రియుడు తనవాడంటే తనవాడంటూ ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుని తన్నుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వీళ్లను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. లాభం లేకపోయింది. ఈ గ్యాప్‌లో ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయినా అదేం పట్టించుకోకుండా ఆ యువతులు ఫైటింగ్ కొనసాగించారు. ఈలోపు పోలీసులు వచ్చి.. ఇద్దరినీ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇప్పి పంపించారు. ఇదీ చదవండి: చిన్నారుల స్టెప్పులకు కేటీఆర్ ఫిదా -
బీజేపీ నేతలపై ఈడీ చర్యలు ఉంటాయా?.. చర్చనీయాంశంగా ఎన్సీపీ బ్యానర్!
సాక్షి ముంబై: బీజేపీకి వ్యతిరేకంగా ఔరంగాబాదులో ఎన్సీపీ యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బ్యానర్ చర్చనీయాంశంగా మారింది. ‘బీజేపీ నాయకులపై ఈడీ, సీబీఐ, ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందా? ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారిపై ఇంతవరకు చర్యలు కొనసాగుతున్నాయా? ఒకవేళ చర్యలు కొనసాగుతున్నాయని తెలిస్తే వివరాలు చెప్పండి.. అక్షరాల ఒక లక్ష రూపాయలను గెలుపొందండి’ అంటూ ఔరంగాబాదు ఎన్సీపీ యూత్ కార్యదర్శి అక్షయ్ పాటిల్ బ్యానర్ కట్టాడు. ఈ బ్యానర్ సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తోంది. అందిన వివరాల మేరకు ఔరంగాబాదు ఎన్సీపీ యూత్ కార్యదర్శి అక్షయ్ పాటిల్ ఈ బ్యానర్‌ను ఔరంగాబాదులోని క్రాంతిచౌక్ పరిసరాల్లో ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజీపీలో చేరిన వారిపై ఎలాంటి చర్యలుండవని, కేవలం ఈడీ, సీబీఐల పేర్లతో బెదిరించి ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని వివరించేందుకే ఈ బ్యానర్ ఏర్పాటు చేశానని పాటిల్ చెప్పారు. చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? VIDEO: भाजपा नेत्यांवर 'ईडी'ची कारवाई झाल्याचे दाखवा, १ लाख मिळवा; औरंगाबादमध्ये बॅनर झळकले! pic.twitter.com/7OhpdbS7fz — Lokmat (@lokmat) August 1, 2022 -
ఔరంగాబాద్ పేరు మార్పు తప్పుడు నిర్ణయం: ఏఐఎంఐఎం
సాక్షి, ముంబై: ఔరంగాబాద్ పేరు మారుస్తూ మహా రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ తప్పుబట్టారు. అందుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ఔరంగాబాద్కో చరిత్ర ఉందని, దాన్నెవరూ చెరపలేరని అన్నారు. ఎంవీఏ నేతలు... ఛత్రపతి శంభాజీ మహరాజ్ పేరును తమ రాజకీయా ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు బాల్ కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉందన్న ఇంతియాజ్, నిర్ణయానికి వ్యతిరేకంగా అవసరమైతే తాము వీధుల్లోకొస్తామని స్పష్టం చేశారు. పేరు మార్చడానికి ముందు ఔరంగాబాద్‌ను అభివృద్ధి చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారని, కానీ అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఔరంగాబాద్ శివసేన, మహానవనిర్మాణ్ సేన, బీజే పీ నేతలు స్వాగతించారు. ఎలాంటి జాప్యం చేయకుండా కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమో దించాలని ఎమ్మెల్సీ అంబదాస్ అన్నారు. ఔరంగాబాద్ పేరు మార్చడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. తన తండ్రి బాల్ ఠాక్రే హామీ ఉద్ధవ్ నెరవేర్చారని, ఇక ఆమో దం విషయంలో బీజేపీ ఎంత చిత్తశుద్ధి చూపుతుందో తెలుస్తుందని అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయాన్ని ఇంకాస్త ముందు తీసుకు ని ఉంటే బాగుండేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అతుల్ అభిప్రాయపడ్డారు. చదవండి: ఎమ్మెల్యేలను వదులుకున్నారు.. ఎన్సీపీని వదలలేరా? -
శారీ బ్యాంక్!
ఒకసారి కట్టిన చీరను మరోసారి కట్టుకోవడానికి ఇష్టపడరు చాలా మంది. దీంతో కొత్త చీరలు కొనే కొద్దీ పాత చీరలు కుప్పలు కుప్పలుగా బీరువాల్లో్ల మూలుగుతుంటాయి. వాటిని ఏళ్ల తరబడి కట్టకుండా అలాగే ఉంచెయ్యడం వల్ల ఎలుకలు కొట్టి కొన్ని, చెదలు పట్టి ఇంకొన్నీ చిరిగిపోవడం, అసలు కట్టకుండా మడతల్లోనే ఉండడం వల్ల చీకిపోయి మసి బట్టకు కూడా పనికి రాకుండా పోతాయి. ఇలా వృథాగా పోతున్న చీరలను నిరుపేదలకు అందించి ఉపయోగకరంగా మారుస్తోంది ఆర్తి శ్యామల్ జోషి. ఔరంగాబాద్‌కు చెందిన డాక్టర్ ఆర్తి శ్యామల్ జోషి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తోంది. రోజూ కట్టుకునే చీరలు కాకుండా ఇంట్లో పాడైపోకుండా ఉన్న చీరలు చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుత ట్రెండ్‌కు అవి నప్పవని కట్టుకోకుండా నెలల తరబడి అలానే ఉంచేసింది. అవి చూసిన ప్రతిసారి వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తుండేది ఆర్తి. ఒకరోజు నిరుపేద మహిళలకు ఇవి ఇస్తే వారికి ఉపయోగపడతాయి కదా! అనిపించింది ఆర్తికి. అనుకున్న వెంటనే తన దగ్గర ఉన్న చీరలను పంచడం ప్రారంభించింది. చీరలు తీసుకున్న మహిళలు ఎంతో సంతోషంగా ఆమెకు కృతజ్ఞతలు చెప్పడంతో ఆర్తికి ప్రోత్సాహం లభించినట్లయింది. దీంతో ఇంట్లో తను కట్టని చీరలు మొత్తం పేదలకు ఇచ్చేసింది. ఆర్తి పనిచేసే చోట చక్కగా ఉన్న కొన్ని బట్టలు, చీరలు చెత్త డబ్బాలో వేయడం గమనించింది. ఇవన్నీ వృథాగా పోతున్నాయి. వీటిని కట్టుకునే నిరుపేదలకు ఇస్తే వేస్ట్ కావు కదా... అనిపించింది. దీంతో 2016లో ఆస్థాజనవికాస్ అనే ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ‘శారీబ్యాంక్’ను ఏర్పాటు చేసింది. ఈ బ్యాంక్ ద్వారా ఆసక్తి ఉన్న మహిళల దగ్గర నుంచి చీరలు సేకరించి ఇప్పటి దాకా పాతికవేలకు పైగా చీరలను పంచిపెట్టింది. చీరలు పంచిపెట్టడం గురించి తెలిసి చాలామంది మహిళలు ఇంట్లో మూలుగుతోన్న మంచి మంచి చీరలను బ్యాంక్‌కు తెచ్చి ఇచ్చేవారు. ఇలా అందరూ ఇచ్చిన చీరలేగాకుండా సోషల్ మీడియాలో శారీ బ్యాంక్ గురించి ప్రచారం కల్పించి ఇతర నగరాల నుంచి కూడా చీరలను సేకరించి పేదవారికి ఇస్తోంది. నిజంగా ప్రతి మహిళా ఇలా ఆలోచిస్తే, అటు పర్యావరణానికి హానీ కలగదు. అటు నిరుపేదలను ఆదుకున్న వారూ అవుతారు. -
భార్యకు చీర కట్టుకోవడం రాదని భర్త ఆత్మహత్య
సాక్షి ముంబై: ఇటీవల వింటున్న ఆత్మహత్యలు చూస్తే చాలా సిల్లీగా, కామెడిగా కనిపిస్తున్నాయి. ఆ కారణాలను వింటుంటే చిర్రెత్తుకొచ్చేలా ఉంటున్నాయి. మరీ అర్థంపర్థ లేని చిన్న చిన్న కష్టాలకు ఆత్మహత్యలకు వెళ్లిపోతున్నారు. చిన్నపిలలు దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే... మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో 24 ఏళ్ల వ్యక్తి ఆరునెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఆ మహిళ అతని కంటే ఆరేళ్లు పెద్దది. కానీ ఆమెకు చీర కట్టుకోవడం, మాట్లాడటం, నడవటం సరిగా రాదు. దీంతో అసంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పైగా సూసైడ్ నోట్లో తన భార్యకు చీరకట్టుకోవడం రాదనే చనిపోతున్నానని పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సార్ అర్జంట్ ఒక ఫోన్ కాల్’.. ఫోన్ దొంగ వెంటపడి రైలు కింద నుజ్జయిన పెద్దాయన -
లౌడ్‌స్పీకర్ల వివాదంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజ్ ఠాక్రేపై కేసు
ముంబై: ఔరంగాబాద్‌లో ఆదివారం ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్‌ఠాక్రే నిర్వహించిన బహిరంగ సభలో పోలీసులు విధించిన షరతుల్లో కొన్ని ఉల్లంఘించారనే అభియోగంపై మంగళవారం చీఫ్ రాజ్ ఠాక్రేపై కేసు నమోదైంది. రాజ్ ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఔరంగాబాద్ పోలీసులు నియమాల ఉల్లంఘన జరిగినట్లు నివేదిక రూపొందించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి, హోంమంత్రి, సంబంధత అధికారులతో జరిగిన సమావేశంలో ఆ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై ఆరా తీసిన తరువాత ఔరంగాబాద్‌లోని సిటీ చౌక్ పోలీసు స్టేషన్లో రాజ్‌పై కేసు నమోదు చేశారు. సభకు అనుమతిచ్చే ముందు పోలీసులు విధించిన మొత్తం 16 షరతుల్లో 12 షరతుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజ్‌తోపాటు సభకు అనుమతివ్వాలని దరఖాస్తు చేసుకున్న రాజీవ్ జవళేకర్పై కూడా కేసు నమోదు చేశారు. ఔరంగాబాద్‌లో కేసు నమోదైన విషయంపై రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే ఫోన్‌చేసి స్ధానిక ఎమ్మెన్నెస్ పదాధికారి రజీవ్ జవళేకర్తో చర్చించారు. చట్టం అందరి సమానంగా ఉండాలని, పోలీసులు సభకు అనుమతిచ్చే ముందు కేవలం 15 వేల మంది హాజరుకావాలని షరతులు విధించారని, అయితే రాజ్ ఠాక్రే రోడ్డుపై నడుస్తూ వెళుతుంటేనే 15 వేలకుపైగా జనాలు అనుసరిస్తారని, ఇలాంటి సందర్భంలో షరతులు ఉల్లంఘించారని కేసు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోనేత సందీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ తొలుత సభకు అనుమతివ్వకపోవడం, ఆ తరువాత సమయం దగ్గరపడగానే షరతులతో కూడిన అనుమతివ్వడం లాంటి సందర్భాలు గతంలో ఎదురు కాలేదన్నారు. పోలీసులపై ప్రభుత్వం కచ్చితంగా ఒత్తిడి తెచ్చిందని దీన్ని బట్టి స్పష్టమవుతోందన్నారు. కార్యకర్తలను భయపట్టేందుకే కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసు నమోదు చేసిన నిందితుల జాబితాలో రాజ్ ఠాక్రే పేరు మొదటి స్ధానంలో ఉంది. ఆ తరువాత రాజీవ్ జావళేకర్, నిర్వాహకులు, ఇతర పదాధికారుల పేర్లున్నాయి. స్ధానిక సిటీ చౌక్ పోలీసు ఇన్స్పెక్టర్ అశోక్ గిరీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డెన్మార్క్ ప్రధాని నివాసంలో మోదీ చర్చలు.. వీడియో వైరల్ నాన్ బెయిలబుల్ వారెంట్ మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరేపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 14 ఏళ్ల కిందటి కేసులో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా రాజ్ ఠాక్రే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై 2008లో ఆయనపై ఐపీసీ సెక్షన్ 109,117 కింది కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో రాజ్ ఠాక్రే కోర్టుకు హాజరు కాకపోవడంతో జూన్ 8లోపు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని సాంగ్లి జిల్లా షిరాలా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పేర్కొంది. అయితే 2012 కంటే ముందు నమోదైన రాజకీయ పరమైన కేసులన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసిందని ఎంఎన్ఎస్ నేత ఒకరు గుర్తు చేశారు. -
ఆఫీసుకు రోజూ గుర్రంపై వెళ్తున్న ఉద్యోగి..
-
ఆఫీసుకు రోజూ గుర్రంపై వెళ్తున్న ఉద్యోగి.. ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి వల్ల ఆంక్షల నేపథ్యంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో బైక్‌ను వినియోగించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ ఫార్మసీ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ప్రతిరోజూ గుర్రం మీద తన కార్యాలయానికి వెళ్తున్నాడు. ఔరంగాబాద్‌లో డీజిల్ ధర రూ.100కు కొన్ని పైసలు తక్కువగా ఉండగా, పెట్రోల్ ధర లీటర్‌కు రూ.115 దాటింది. ఆదివారం లీటర్ పెట్రోల్ ధర 50 పైసలు, లీటర్ డీజిల్ ధర 55 పైసలు పెరిగింది. ఈ నేపథ్యంలో షేక్ యూసుఫ్ తన బైక్‌ను పక్కనపెట్టి తన ఇంటి నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న తన కార్యాలయానికి గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తున్నాడు. అంతకుముందు లాక్డౌన్ సమయంలో ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు. ‘లాక్డౌన్ తర్వాత గ్యారేజీలు చాలాకాలం పాటు మూసివేసి ఉన్నాయి. దీంతో బైక్‌ను మెయింటెన్ చేయడం సమస్యగా మారింది. కాబట్టి నేను నా వాహనాన్ని పక్కనపెట్టి కతియావాడి గుర్రాన్ని కొనాలని నిర్ణయించుకున్నాను. రోజూ 30 కి.మీ. ప్రయాణం చేస్తా. పలు కుటుంబ ఫంక్షన్లకు కూడా గుర్రం మీదే వెళ్తా. అంతేకాదు గుర్రం మీద ప్రయాణ చేయడం బైక్ మీద వెళ్లడం కంటే చాలా చవక’ అని యూసుఫ్ చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రతి ఆదివారం ఈ రోడ్లకు సెలవు.. నేటి నుంచే అమలు! -
ప్రేమించి, పారిపోయి పెళ్లి.. అక్క తల నరికి సెల్ఫీ దిగిన తమ్ముడు
ముంబై: సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా ఇంకా కొందరు అనాగరికంగానే ప్రవర్తిస్తున్నారు. తమకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో రక్తం పంచుకొని పుట్టిన వారిపైనే జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రేమించి పారిపోయి పెళ్లిచేసుకుందనే ఆక్రోశంతో గర్భిణీ అయిన తోబుట్టువునే హతమర్చాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘోరానికి తల్లి కూడా సహకరించడం గమనార్హం. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఔరంగబాద్ జిల్లాకు 19 ఏళ్ల కీర్తి థోర్ అనే యువతి ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో వారిని ఎదురించి ఈ జూన్‌లో పారిపోయి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం గర్భవతి అయిన యువతి వైజాపూర్‌లో భర్తతో కలిసి జీవిస్తోంది. ఇటీవల తల్లి తన కూతురు ఇంటికి వచ్చి యోగక్షేమాలు తెలుసుకొని వెళ్లింది. ఈ ఆదివారం(డిసెంబర్5) మరోసారి తన మైనర్ కొడుకుని వెంట పెట్టుకొని కూతురు ఇంటికి వచ్చింది. అత్తగారితో కలిసి పొలంలో పని చేస్తున్న కీర్తి.. తన తల్లీ, తమ్ముడిని చూసి పొలంలో పని వదిలేసి ఆనందంతో పరుగెత్తుకొచ్చి వారిని పలకరించింది. ఇద్దరికీ నీళ్ళు ఇచ్చి, టీ చేయడానికి వంటింట్లోకి వెళ్లింది. చదవండి: రెండురోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు.. గుట్టుగా ఒకటి.. దర్జాగా మరొకటి ఆ సమయంలో అల్లుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అతను వేరే గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన తల్లి, తమ్ముడు కోసం కీర్తి తీ తయారు చేస్తుండగా .. అక్కపై వెనక నుంచి తమ్ముడు దాడి చేశాడు. తల్లి కూడా కీర్తి కాళ్లు అదిమి పట్టుకొని కొడుక్కి సాయం చేసింది. దీంతో తనవెంట తెచ్చుకున్న పదునైన కొడవలితో గర్భవతి అని కూడా కనికరం లేకుండా దారుణంగా తలను నరికివేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న కీర్తి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. అయితే వంటింట్లో పాత్రలు పడిపోతున్న శబ్దం విని అనారోగ్యంతో పడుకున్న నిద్రలేచిన మహిళ భర్త వంటగదిలోకి పరుగెత్తాడు. నిందితుడు తన బావను కూడా చంపడానికి ప్రయత్నించగా.. అతను తప్పించుకున్నాడు. తరువాత తెగిన కీర్తి తలతో ఆమె తమ్ముడు, తల్లి సెల్ఫీ తీసుకున్నారు. చేతులో తలను పట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చి చూపుతూ స్థానికులకు భయాందోళనలకు గురిచేశాడు. అనంతరం నిందితుడు తన తల్లితో కలిసి విర్గావ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. చదవండి: కూతురి తల నరికిన తండ్రి.. ఆపై -
మౌలిక సదుపాయాలు అధ్వానం
ముంబై: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. అందరికీ న్యాయం అందాలంటే, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కానీ మన కోర్టుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ ఒక ప్రణాళిక లేకుండా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌కు చెందిన భవనాలను శనివారం సీజేఐ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. న్యాయశాఖ మంత్రి ఎదుటే జస్టిస్ రమణ తన ఆవేదనంతా బయటపెట్టారు. దేశంలోని చాలా కోర్టుల్లో సరైన సదుపాయాలు లేవని, కొన్ని కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాలు ఉంటేనే న్యాయవ్యవస్థ బాగుంటుందని, న్యాయవ్యవస్థ సమర్థంగా పనిచేస్తే ఆర్థిక రంగం వృద్ధి చెందుతుందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. 2018లో సరైన సమయంలో తీర్పులు రాకపోవడం వల్ల దేశం వార్షిక జీడీపీలో 9% మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైనట్టుగా ఈ సందర్భంగా జస్టిస్ రమణ చెప్పారు. ఇప్పుడు తాను ప్రారంభించిన ఔరంగాబాద్ కోర్టు భవన నిర్మాణం 2011లో మొదలైందని, అది పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందంటే ప్రణాళికలో ఎన్ని లోపాలున్నాయో తెలుస్తోందని అన్నారు. కేవలం క్రిమినల్స్, బాధితులు మాత్రమే కోర్టు గుమ్మం తొక్కుతారన్న అభిప్రాయం ఇప్పటికీ సామాన్యుల్లో నెలకొని ఉందని.. చాలా మంది తాము అసలు కోర్టు ముఖం కూడా చూడలేదని గర్వంగా చెప్పుకుంటారన్న జస్టిస్ రమణ అలాంటి ఆలోచనల్ని రూపుమాపి అందరూ తమ హక్కుల సాధనకు కోర్టుకు వచ్చే పరిస్థితులు కల్పించాలన్నారు. ప్రజలు కోర్టుకు రావడానికి సంకోచపడే రోజులు పోవాలని, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉండడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. దృఢమైన న్యాయవ్యవస్థతో ప్రజాస్వామ్యం విజయవంతం: రిజిజు జస్టిస్ ఎన్.వి. రమణ మౌలిక సదుపాయాల అంశం గురించి ఆందోళన వ్యక్తం చేయడానికి ముందే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ప్రసంగంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే దృఢమైన న్యాయవ్యవస్థ ఉండాలన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9 వేల కోట్లు కేటాయిస్తూ గత మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ బడ్జెట్‌తో 4 వేల కోర్టు భవనాలు, న్యాయమూర్తులకు 4 వేల నివాసాలు కట్టించి ఇస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాయని రిజిజు చెప్పారు. కోర్టుల్లో పరిస్థితి ఇదీ..! కోర్టుల్లో మౌలికసదుపాయాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో జస్టిస్ రమణ గణాంకాలతో సహా వివరించారు. ‘‘దేశవ్యాప్తంగా 20,143 కోర్టు భవనాలు ఉన్నాయి. 16% కోర్టుల్లో కనీసం టాయిలెట్లు లేవు. 26% కోర్టుల్లో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ సదుపాయం లేదు. కేవలం 54% కోర్టుల్లోనే రక్షిత మంచినీరు లభిస్తోంది. 5% కోర్టుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. 32% కోర్టుల్లో రికార్డు రూములు విడిగా ఉన్నాయి. 51%కోర్టుల్లో మాత్రమే లైబ్రరీ సదుపాయం ఉంది. కేవలం 27% కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచా రణ చేయడానికి వీలుగా న్యాయమూర్తుల టేబుల్‌పై కంప్యూటర్లు ఉన్నాయి’’ అని తెలిపారు. -
‘దక్కన్ తాజ్ మహల్’ ఎవరు కట్టించారో తెలుసా?!
తాజ్ మహల్లాగానే అనిపిస్తుంది. ఇది ఆగ్రా కాదు. చూస్తున్నది తాజ్ మహలూ కాదు. తాజ్‌మహల్ లాంటిదే కట్టాలన్న ఓ ప్రయత్నం.పేరు బీబీ కా మఖ్బారా. ఔరంగాబాద్‌లో ఉంది. అందుకే దక్కన్ తాజ్‌గా వాడుకలోకి వచ్చింది. బీబీ కా మఖ్బారాలో తాజ్ మహల్లో ఉండే తేజం కనిపించదు, కానీ నిర్మాణ నైపుణ్యంలో తాజ్‌మహల్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఔరంగజేబు భార్య దిల్రాస్ బానుబేగమ్ సమాధి నిర్మాణం ఇది. బాను బేగమ్ కొడుకు అజమ్ షా దగ్గరుండి కట్టించాడు. మొఘల్ ఆర్కిటెక్చర్ శైలిని ప్రతిబింబిస్తుంది, ప్రధాన భవనం ముందు పెద్ద కొలను, నాలుగు వైపులా విశాలమైన చార్బాగ్ కాన్సెప్ట్ తోటలు, పాలరాతి పూలలో పర్షియన్ లాలిత్యం ప్రతిదీ తాజ్‌మహల్‌ను పోలి ఉంటుంది. తలెత్తి ఓసారి పై కప్పును చూస్తే ఇక ఒక నిమిషం పాటు తల దించుకోలేం. తోటల నుంచి స్వచ్ఛమైన గాలి ధారాళంగా ప్రసరిస్తూ ఉన్న విశాలమైన వరండాలు, ఆర్చ్‌ల మధ్య తిరుగుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ ఇక్కడే బీబీ కా మఖ్బారా... మహారాష్ట్ర, ఔరంగాబాద్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగజేబు దక్కన్ కోసం పోరాడి పోరాడి దక్కన్‌లోనే మరణించాడు. బీబీ కా మఖ్బారాకు నలభై కిలోమీటర్ల దూరంలో ఖుల్దాబాద్‌లో అతడి సమాధి ఉంది. ఈ ట్రిప్‌లో శివాజీ మ్యూజియాన్ని కలుపుకోవచ్చు. ఆ మ్యూజియంలో శివాజీ ఆయుధాలు, నాణేల ప్రదర్శన ఆసక్తిగా ఉంటుంది. ఇవి కూడా చూడవచ్చు! 16 కిమీల దూరంలో దౌలతాబాద్ కోట 30 కి.మీల దూరంలో ఎల్లోరా గుహలు 50 కి.మీల దూరంలో పైథాన్ ఉంది. అక్కడి చేనేతకారులు నేసే చీరలను పైథానీ చీరలంటారు. మహిళల మనసు దోచే పైథానీ చీరలు గత దశాబ్దకాలంగా నడుస్తున్న ట్రెండ్. కాబట్టి ఒక్క చీరనైనా తెచ్చుకుంటే ఈ ట్రిప్‌కు గుర్తుగా ఉంటుంది. ధర పదివేల నుంచి మొదలవుతుంది. బస: ఔరంగాబాద్‌లో బస చేయవచ్చు. ఉత్తరాది, దక్షిణాది ఆహారం దొరుకుతుంది. – వాకా మంజులారెడ్డి చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు -
మరో మూడు నగరాల్లో బజాజ్ చేతక్ బుకింగ్స్ ఓపెన్
బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మరిన్ని నగరాల్లోకి వేగంగా తీసుకొనిరావడానికి ప్లాన్ చేసింది. మైసూరు, మంగళూరు, ఔరంగాబాద్ వంటి కొత్త నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ జూలై 22న ప్రారంభిస్తుంది. ఈ నగరాలకు చెందిన ఆసక్తి గల వినియోగదారులు ₹2,000 చెల్లించి ఈ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. గత వారమే నాగ్ పూర్ లో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 2021 ఏప్రిల్ లో బజాజ్ చెన్నై, హైదరాబాద్ నగరాలకు చేతక్ తీసుకొనివస్తున్నట్లు ప్రకటించింది. పూణేకు చెందిన ఆటోమేకర్ వచ్చే ఏడాది నాటికి 22 భారతీయ నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, అథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతుంది. ఇది 3.8 కిలోవాట్ మోటార్ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 3కేడబ్ల్యుఐపీ 67 లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ స్కూటర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో స్పోర్ట్ మోడ్, ఎకో మోడ్ అనే రెండు మోడ్స్ ఉన్నాయి. 5 ఆంపియర్ పవర్ సాకెట్ ద్వారా స్కూటర్ ని ఇంటి వద్ద ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్ బేస్డ్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫీచర్స్ ఉన్నాయి. బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. అర్బన్ ధర ₹1.42 లక్షలు కాగా, ప్రీమియం రిటైల్స్ ₹1.44 లక్షలు(ఎక్స్ షోరూమ్, పూణే). -
కోరలు చాస్తున్న బ్లాక్ ఫంగస్: 16 మంది మృతి
ఔరంగాబాద్: మహమ్మారి కరోనా వైరస్ బారిన పడిన వారిలో బ్లాక్ ఫంగస్ ఏర్పడి వారి ప్రాణాలను తీస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా కల్లోలం రేపుతుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్‌తో ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 201 మందికి ఆ ఫంగస్ రాగా వారిలో 16 మంది మృతి చెందడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఈ ఏడాదిలో కరోనా కేసులు పరిశీలించగా వారిలో 201 మందికి బ్లాక్ ఫంగస్ సోకిందని ఔరంగాబాద్ మున్సిపల్ అధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని అధికారులు ఓ నివేదికలో వివరించారు. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ నీతా పడాల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్లాక్ ఫంగస్ లక్షణాలు గుర్తించేందుకు కరోనా బాధితుల వివరాలు పరిశీలించాం. కరోనా బాధితుల్లో స్టెరాయిడ్స్ వాడిన వారు, మధుమేహులకు బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని మేం ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందం (ఈఎన్టీ, దంత, కంటి వైద్యులు) గుర్తించింది. బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించి వారికి ప్రత్యేక వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారికి కావాల్సిన మందులు కూడా అందుబాటులో ఉంచాం’ అని తెలిపారు. -
ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాల్ని కుక్కేశారు
ఔరంగాబాద్: లెక్కకు మించి కోవిడ్‌తో పౌరులు ప్రాణాలు కోల్పోతుండటంతో వారి తరలింపు సైతం సమస్యగా మారింది. దీంతో 22 మంది కోవిడ్ బాధితుల మృతదేహాలను ఒకే అంబులెన్స్‌లో కుక్కి తరలించిన దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. బీడ్ జిల్లాలోని అంబజోగాయ్‌లో స్వామి రామానంద్ తీర్థ గ్రామీణ ప్రభుత్వ వైద్య కళాశాల మార్చురీలో భద్రపరిచిన కోవిడ్ బాధితుల మృతదేహాలను శ్మశాన వాటికకు తరలించాల్సి ఉంది. దీంతో ఆదివారం 22 మృతదేహాలను ఒకేసారి ఒక్క అంబులెన్స్‌లో తరలించారు. ఈ ఘటనపై వైద్య కళాశాల డీన్ శివాజీ వివరణ ఇచ్చారు. ‘ఒకప్పడు మా వద్ద ఐదు అంబులెన్స్‌లు ఉండేవి. ఇప్పుడు రెండు ఉన్నాయి. దీంతో ఒక దాంట్లో 22 మృతదేహాలను, మరో దాంట్లో ఎనిమిది మృతదేహాలను ఇలా తరలించాల్సి దుస్థితి తలెత్తింది’ అని చెప్పారు. చదవండి: ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి -
కరోనా ఎఫెక్ట్.. అక్కడ మళ్లీ మొదలైన లాక్డౌన్
ఔరంగబాద్: కరోనా కేసుల సంఖ్య ఆకస్మికంగా పెరగడంతో మహరాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్డౌన్ విధించింది. కేసుల పెరుగుదల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. గత ఏడాది మాదిరిగా పలు జిల్లాల్లో కఠినమైన లాక్డౌన్ చర్యలను తిరిగి విధించవలసి వచ్చింది. దీంతో జిల్లాలోని ప్రాంతాల్లో నిర్మానుష్య పరిస్థితులు నెలకొన్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వారాంతాల్లో కూడా పూర్తి లాక్డౌన్ ను విధించాలని ఔరంగాబాద్ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.ప్రస్తుతం ఔరంగాబాద్ జిల్లాలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 57,755 నమోదవ్వగా, నిన్నటి వరకు 5,569 యాక్టివ్ కేసులు ఉన్నాయని జిల్లా అధికారులు వెల్లడించారు. మార్చి 15-21 వరకు నాగ్‌పూర్‌లో కూడా పూర్తి లాక్డౌన్ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించిన విషయం తెలిసిందే.ఏప్రిల్ 4 వరకు వారాంతపు రోజులలో కూడా జిల్లాలో పాక్షిక లాక్డౌన్ అమలుచేస్తామని జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, అత్యవసర సేవలు, కూరగాయలు, పండ్ల దుకాణాలు, పాల బూత్‌లు వంటి అవసరమైన సేవలు మాత్రమే తెరిచి ఉంటాయి. రాష్ట్రంలో శుక్రవారం వరుసగా మూడో రోజు ఈ ఏడాదిలో అత్యధికంగా 15,817 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసులు సంఖ్య 22,82,191 కు పెరిగింది, అయితే మరణాల సంఖ్య 56గా నమోదవడంతో ,మొత్తం కరోనా మరణాల సంఖ్య 52,723కు చేరింది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల పట్ల చాలా ఆందోళనగా ఉందన్నారు. ఇది తీవ్రమైన పరిణామంగా భావించాలని, కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలన్నారు. (చదవండి: అలా చేస్తే విమానం దిగాల్సిందే: డీజీసీఏ) Maharashtra: Complete lockdown imposed in Aurangabad on weekends, due to a rise in COVID19 cases The total number of COVID19 cases in Aurangabad district is 57,755 including 5,569 active cases, till yesterday. pic.twitter.com/ODXyEff1UW — ANI (@ANI) March 13, 2021 -
పాక్‌లో 18 ఏళ్ల జైలు; స్వర్గంలోకి వచ్చినట్టుంది
ఔరంగాబాద్ : తన భర్త తరపు బంధువుల్ని కలవడానికి పాకిస్తాన్ వెళ్లిన భారతీయ మహిళ హసీనాబేగం(65)కు 18ఏళ్ల తర్వాత ఎట్టకేలకు విముక్తి లభించింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పోలీసుల చొరవతో మంగళవారం ఆమె పాక్ జైలు నుంచి విడుదలై తన స్వస్థలానికి చేరుకుంది. ఈ నేపధ్యంలో ఉద్వేగానికి లోనైన ఆమె ''చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. నా దేశానికి తిరిగి రాగానే స్వర్గంలోకి వచ్చినట్లుంది' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. (పోలీసుల అప్రమత్తం: పంజాబ్, హర్యానాలో హై అలర్ట్) వివరాల ప్రకారం..ఔరంగబాద్‌కు చెందిన హసీనా బేగం అనే 65 ఏళ్ల మహిళ 18 ఏళ్ల క్రితం తన భర్త బంధువులను చూసేందుకు పాకిస్తాన్ వెళ్లింది. ఈ క్రమంలో పాస్‌పోర్టు పోగొట్టుకొని జైలు పాలయ్యారు. ఆమె అదృశ్యం అయినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇన్నేళ్లకు వారి కృషి ఫలించి హసీనాబేగం పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఔరంగాబాద్ పోలీసుల చొరవతో స్వదేశానికి తీసుకువచ్చిన హసీనాబేగం ఈ సందర్భంగా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వదేశానికి చేరుకోగానే ఆమె బంధువులు ఘన స్వాగతం పలికారు. (నాలుగేళ్ల అనంతరం చిన్నమ్మ విడుదల) -
మహారాష్ట్రలో పేర్ల మార్పు చిచ్చు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నగరాల పేర్ల మార్పు అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న మహావికాస్ ఆఘాడిలో కూడా పేర్ల మార్పు అంశం చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. ఔరంగాబాదు పేరును సంభాజీనగర్‌గా మార్చాలని శివసేన భావిస్తోంది. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేరు మార్పునకు వ్యతిరేకత తెలిపింది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ పేరు మార్చే అంశాన్ని శివసేన తెరమీదికి తీసుకువచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. అహ్మద్‌నగర్, పుణె నగరం పేర్లను కూడా మార్చాలన్న డిమాండు తాజాగా తెరపైకి వచ్చింది. అహ్మద్‌నగర్ పేరును అంబిక నగర్‌గా మార్చాలని షిర్డీ పార్లమెంటు సభ్యులు సదాశివ్ లోఖండేతో పాటు పలు హిందుత్వ సంస్థలు డిమాండు చేస్తున్నాయి. పుణె నగరం పేరును జీజావు పూర్‌గా మార్చాలని సంభాజీ బ్రిగేడ్ డిమాండ్ చేస్తోంది. చదవండి: చికెన్ లేదన్నాడని ఎంత పని చేశారు.. ఎమ్మెన్నెస్ ఆందోళన ఔరంగాబాదు పేరును సంభాజీనగర్‌గా మార్చాలని డిమాండు చేస్తూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. మూడు రోజులుగా నాసిక్, ఔరంగాబాద్, పాల్ఘర్లలో ఆందోళనలు చేపట్టింది. బస్సులపై ఔరంగాబాదు పేరు స్థానంలో ఛత్రపతి సంభాజీనగర్ బోర్డును ఏర్పాటు చేయడం ప్రారంభించింది. ఠాక్రే ప్రభుత్వానికి ముప్పు: సంజయ్ నిరుపమ్ ఔరంగాబాదు పేరును సంభాజీనగర్‌గా మార్చాలని పట్టుబడితే ఠాక్రే ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుందని కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది శివసేన ప్రభుత్వం కాదని, మూడు పార్టీల మహావికాస్ ఆఘాడి ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఇక ఔరంగాబాదు పేరు మార్పు శివసేన వ్యక్తిగత అజెండా అన్నారు. ఎన్నికల కోసమే: దేవేంద్ర ఫఢ్నవీస్ ఔరంగాబాద్ పేరు మార్పు అంశాన్ని ఎన్నికల కోసమే తెరపైకి తీసుకు వచ్చారని ప్రతిపక్ష బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. ఎన్నికలు పూర్తి కాగానే ఈ విషయాన్ని మర్చిపోతారన్నారు. ఔరంగాబాదు పేరును మార్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, రెవిన్యూ శాఖ మంత్రి బాలాసాహెబ్ థోరాత్ స్పష్టం చేశారు. పేరును మార్చినంత మాత్రాన ప్రజలకు ఒరిగేదేం లేదన్నారు. రాద్ధాంతం చేస్తున్నారు: అజిత్ పవార్ ఔరంగాబాదు పేరు మార్పు అంశంపై ఎన్సీపీ నేత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. ఈ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ కూటమిలో విబేధాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
కాంగ్రెస్-సేన: అగ్గిరాజేస్తున్న ఔరంగాబాద్
సాక్షి, ముంబై : మహారాష్ట్రంలోని మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఔరంగాబాద్ పేరు మార్చాలని అధికార శివసేన చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ఔరంగాబాద్ పేరు మార్చడానికి ఏదైనా ప్రతిపాదన వస్తే, తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మంత్రి బాలాసాహెబ్ థోరాట్ స్పష్టంచేశారు. స్థలాల పేర్లు మార్చడం శివసేన నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వ కామన్ మినిమం ప్రోగ్రామ్‌లో భాగం కాదని ఆయన తెలిపారు. పేర్లు మార్చినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని, సామాన్యుడి అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడదని, అందుకే కాంగ్రెస్‌కు పేర్ల మార్పుపై నమ్మకం లేదన్నారు. కాగా, ఔరంగాబాద్ పేరు మారుస్తున్నట్లు తనకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని థోరాట్ వెల్లడించారు. ఈ విషయంపై స్థానిక నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తుండగా.. పలువురు నేతలు మాత్రం మాటల యుద్ధానికి దిగుతున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం రాజుకుంటోంది. (ఈడీ ఆఫీసుకు బీజేపీ బ్యానర్.. వేడెక్కిన రాజకీయం) రెండు దశబ్ధాల కిందట ఔరంగాబాద్‌ను శంభాజీనగర్‌గా మర్చాలని శివసేన డిమాండ్‌చేసిన సంగతి తెలిసిందే. 1995 జూన్‌లో జరిగిన ఔరంగాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో సైతం ఈ ప్రతిపాదనను ఆమోదించారు, దీనిని హైకోర్టులో, తరువాత సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కార్పొరేటర్లు సవాలు చేశారు. శివసేనకు సోనియా లేఖపై ప్రశ్నించగా మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వ ఏర్పాటుకు సోనియాకూడా కారణమని థోరాట్ గుర్తుచేశారు. శరద్ పవార్ మాదిరిగానే, సోనియా గాంధీకి కూడా ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసే అధికారం ఉందని ఆయన అన్నారు. రాయడం జర్నలిస్టుల హక్కు.. ఇక సామ్నాలో కాంగ్రెస్ ఇపుడు బలహీనంగా ఉందని వార్తలు రావడంతో.. అలా రాయడం జర్నలిస్టుగా వారి హక్కు అని థోరాట్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే అలా మాట్లాడితే అది వేరే విషయం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలంగా ఉందని, గతంలో శాసనమండలి ఎన్నికలలో మేం దీనిని నిరూపించామని మంత్రి అన్నారు. ప్రతి పార్టీ సమస్యలను ఎదుర్కొంటుందని, కాని మాకు మళ్లీ బలంగా ఉండగల సామర్థ్యం ఉందని ఆయన అన్నారు. ఇక శాసనమండలికి నామినేట్ చేయబోయే 12 మంది సభ్యుల జాబితాపై విలేకరులు ప్రశ్నించగా త్వరలో పరిష్కారం లభిస్తుందని థోరాట్ బదులిచ్చారు. ఆయన కొంత సమయం తీసుకున్నారని, త్వరలో సంతకం చేసి ప్రతిపాదన అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
కిరాతకం: కుటుంబం గొంతు కోశారు!
సాక్షి, ముంబై: ఔరంగాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై నిద్రిస్తుండగానే దుండగులు కిరాతకంగా దాడిచేశారు. ఈ దాడిలో భార్య, భర్తలతోపాటు వారి తొమ్మిదేళ్ల కూతురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వారి ఆరేళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. మృతులను రాజు నివారే (శంభాజి) (35), అశ్వినీ నివారే, సాయలి నివారే (9)లుగా గుర్తించారు. గొంతు కోయడంతో ముగ్గురు మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటన జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేకేత్తించింది. పైఠన్ తాకాలూ పాత కావసన్ గ్రామంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. నిద్రలోనే.. పైఠన్ సమీపంలోని కవసన్ గ్రామంలో రాజు నివారే, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు. నివారే కుటుంబీకుల సన్నిహిత బంధువల పెళ్లి ఉండటంతో శుక్రవారం పెళ్లికి వెళ్లారు. అనంతరం ఇంటికి వచ్చి ఆలస్యంగా పడుకున్నారని తెలిసింది. పడుకున్న నివారే కుటుంబం సభ్యులపై శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి పదునైన ఆయుధాలతో దాడులు చేశారు. అత్యంత పాశవికంగా కుటుంబసభ్యుల గొంతు కోసి పరారయ్యారు. చదవండి: (రైతు ఇంట్లో ఐటీ దాడులు.. అపార సంపద) ఉదయం తలుపులు తీసి ఉండటం చూసి ఇరుగుపొరుగు వారు లోపలికి వెళ్లి చూడగా నివారే కుటుంబం రక్తం మడుగులో కన్పించింది. రాజు నివారేతోపాటు ఆయన భార్య అశ్వినీ, కూతురు సాయలీలు అప్పటికే మృతి చెందారు. మరోవైపు రాజు నివారే కుమారుడు సోహమ్(6) తీవ్ర గాయాలతో కనిపించాడు. సోహమ్‌ను ఘాటిలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. జిల్లా డిప్యూటీ సూపరిండెంట్, గోరక్ష్ భామరేలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యక్తిగత కక్షలతోనే దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
‘జాదూకీ జప్పీ’.. హ్యాట్సాఫ్ డాక్టర్!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి చెందిన యూరాలజిస్ట్ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి తల్లికి ఉచిత చికిత్స చేసినందుకు గానూ రాజకీయ నాయకులతో సహా వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. చికిత్స తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయే సమయంలో వృద్ధురాలిని పట్టుకుని కంటతడి పెట్టుకుంటూ ఓదార్చిన డాక్టర్ అల్తాఫ్ షేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర ప్రజా వ్యవహారాలశాఖ మంత్రి అశోక్ చవాన్.. డాక్టర్‌ను స్వయంగా పిలిపించుకొని ప్రశంసించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతూ తన దగ్గరికి వైద్యం కోసం వచ్చిన శాంతాబాయ్ సూరద్ అనే వృద్దురాలికి డాక్టర్ అల్తాఫ్ ఉచితంగా వైద్యం అందించారు. తన ఇద్దరు కుమారులను పొగొట్టుకుని నిరుపేదరాలిగా మారిన ఆమె కన్నీటిగాథ గురించి తెలుసుకుని డాక్టర్ అల్తాఫ్ కరిగిపోయారు. శాంతాబాయ్ ఇద్దరు కుమారుల్లో ఒకరు గుండెపోటు మరణించగా, మరొక కొడుకు ఏడు సంవత్సరాల క్రితం దేశం కోసం ప్రాణాలర్పించాడు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి ఆమెకు ఉచితంగా శస్త్రచికిత్స చేశారు డాక్టర్ అల్తాఫ్. ఆస్పత్రి నుంచి ఆమెను పంపించే సమయంలో డాక్టర్ అల్తాఫ్ భావోద్వేగానికి గురయ్యారు. శాంతాబాయ్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, కన్నీళ్లు తుడిచారు. ఈ వీడియో సోషల్ వైరల్ కావడంతో మంత్రి అశోక్ చవాన్ దృష్టిలో పడింది. డాక్టర్ అల్తాఫ్‌ను వ్యక్తిగతంగా పిలిపించుకొని ప్రశంసించారు. ఈ వీడియోను చూసినవారంతా ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సినిమాలోని ‘జాదూకీ జప్పీ’ సన్నివేశాలను గుర్తు చేసుకుంటున్నారు. డాక్టర్ అల్తాఫ్‌కు సలాం చెబుతున్నారు. -
బజాజ్ ఆటో ప్లాంట్‌లో కరోనా కలకలం
సాక్షి, ముంబై: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్‌కు చెందిన వలూజ్ ప్లాంట్‌లో 140 కరోనా కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. కరోనా బారిన పడి ఇప్పటివరకూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని సంస్థ ప్రకటించింది. అయితే కంపెనీ మూసివేత అంచనాలను కంపెనీ తోసిపుచ్చింది. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులలో 2 శాతం మందే ప్రభావితమయ్యారని అవసరమైన భద్రతా చర్యలతో ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు . జూన్ 6న మొదటి కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైందని బజాజ్ ఆటోఅధికారికంగా ప్రకటించింది. 8100 మందికి పైగా ఉన్న ఉద్యోగులలో ఎక్కువమందికి పాజిటివ్ రావడంతో దేశీయ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ ఔరంగాబాద్‌లోని వలూజ్ కర్మాగారంలో కార్యకలాపాలను మూసివేసిందన్న నివేదికలను సంస్థ ఖండించింది. హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఇతర అనారోగ్యాలు కూడా తోడవ్వడంతో దురదృష్టవశాత్తు ఇద్దరు ఉద్యోగులు చనిపోయారని బజాజ్ ఆటో లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ రవి కైరాన్ రామసామి వివరించారు. ప్రోటోకాల్ ప్రకారం పరీక్ష, కాంటాక్ట్ ట్రేసింగ్, సెల్ఫ్ క్వారంటైన్, పూర్తి పారిశుద్ధ్యం లాంటి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. బాధిత ఉద్యోగులకు వైద్య సహాయంతో సహా అన్ని సహకారాన్ని అందిస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు. కాగా బజాజ్ ఆటోకు చెందిన అతిపెద్ద తయారీ యూనిట్ వాలూజ్ ప్లాంట్ లో ప్రధానంగా ఎగుమతి కోసం మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు మొదటి దశ దేశ వ్యాప్త లాక్ డౌన్ ను క్రూరమైన చర్యగా రాజీవ్ బజాజ్ విమర్శించిన సంగతి తెలిసిందే. -
కుక్కను బైకుకు కట్టి, కి.మీ లాక్కెళ్లి..
ముంబై: మూగ జీవాలపై మనిషి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. కేరళలో గర్భిణీ ఏనుగు హత్యోదంతం, హిమాచల్ ప్రదేశ్‌లో ఆవు నోట్లో టపాసులు పేల్చి గాయపర్చిన ఘటనలు మరువకముందే మహారాష్ట్రలో మరో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔరంగాబాద్‌లో ఇద్దరు వ్యక్తులు కుక్క మెడకు గొలుసు కట్టి దాన్ని బైకుకు బిగించారు. ఆ తర్వాత కిలోమీటర్ దూరం వరకు దాన్ని బైకుపైనే లాక్కుపోయారు. మెడకు బిగుస్తున్న ఉచ్చుతోపాటు, రోడ్డుపై చర్మం గీసుకుపోతుండటంతో కుక్క బాధతో విలవిల్లాడిపోయింది. అయినప్పటికీ దాన్ని హింసిస్తూ ఆ క్రూర మనుషులు రాక్షసానందం పొందారు. (వారి ఆచూకీ చెబితే రూ.50 వేలు..) దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి అమానుష ఘటనే చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఓ శునకంపై విచక్షణారహితంగా దాడి చేశారు. దెబ్బలు తాళలేక అది అక్కడికక్కడే మరణించింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో బయటకు పొక్కడంతో స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. (ఆవుపైనా అమానుషత్వం) -
పసికందుకు తల్లి ప్రేమను దూరం చేసిన కరోనా
ఔరంగాబాద్ : కరోనా వైరస్..బంధాలను, బంధుత్వాలను దూరం చేస్తుంది. 30 ఏళ్ల మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజుల్లోనే కరోనాతో మృత్యువాత పడింది. ఈ ఘటన మహారాష్ర్టలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మే 28న మూత్రపిండాల సమస్యతో గర్భిణీ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అదే రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజున నిర్వహించిన పరీక్షలో మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అప్పటికే తీవ్ర ఆరోగ్య సమస్యలకు తోడు కరోనా కూడా సోకడంతో పరిస్థితి విషమించి మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే చిన్నారికి మాత్రం వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఔరంగాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య 1,834కు పెరగగా, గత 24 గంట్లోనే 65 కొత్త కేసులు నమోదయ్యాయి. (టిక్‌టాక్ స్టార్ పై కేసు నమోదు ) -
వీలైతే కొనండి, లేదా ఫ్రీగా తీసుకెళ్లండి
ఔరంగాబాద్: కొండంత చేసినా, గోరంత చేసినా సాయం విలువ మారదు. కరోనా విపత్తు వల్ల పూట గడవటమే కష్టంగా మారిన నిరుపేదల గురించి ఆలోచించిన ఓ కూరగాయల వ్యాపారి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. ఉచితంగా కూరగాయలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఔరంగాబాద్‌కు ఎందిన రాహుల్ లాబ్డే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల కంపెనీ జీతాలివ్వడం మానేసింది. దీంతో అతను తన తండ్రితో కలిసి కూరగాయాల వ్యాపారం చేస్తున్నాడు. ఓ రోజు అతని బండి దగ్గరకు ఓ వృద్ధురాలు వచ్చి రూ.5కు కూరగాయలివ్వమని అడిగింది. (ఆవు అంత్యక్రియలు: గుంపులుగా జనం) దీంతో విస్తుపోయిన లాబ్డే ఆమె దీన స్థితిని అర్థం చేసుకుని ఉచితంగా కూరగాయలిచ్చాడు. ఆ క్షణమే అతనిలో నిరుపేదలకు సాయం చేయాలన్న ఆలోచన మనసులో బలంగా నాటుకుంది. వెంటనే తన కూరగాయల బండికి ఒక బోర్డు తగిలించాడు. అందులో "వీలైతే కొనండి, లేదంటే ఉచితంగా తీసుకోండి" అని రాసి ఉంది. దీన్ని గమనించిన జనం కొందరు విడ్డూరంగా చూడగా మరికొందరు మాత్రం అతని నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.2 వేలు విలువ చేసే కూరగాయలను ఉచితంగా ఇచ్చాడు. దీని గురించి లాబ్డే మాట్లాడుతూ.. 'రోజు ముగిసే సరికి ఆకలితో ఎవరూ నిద్రించవద్ద'న్నదే తన కోరిక అని చెప్తూ మంచి మనసును చాటుకున్నాడు. (‘ఈ ఫోటోలకు అరెస్ట్ కాదు.. అవార్డు ఇవ్వాలి’) -
వలస కూలీల దుస్థితి జాతి క్షేమానికి ప్రమాదం
మన వలస కార్మికుల దుస్థితి యావత్ ప్రపంచానికీ తెలిసిపోయింది. ఇది అంతర్జాతీయంగా మన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. కానీ మన కేంద్ర ప్రభుత్వం సొంత డబ్బా వాయించుకుంటూ, తాను సాధిం చని విజయాల గురించి డప్పుకొట్టుకుంటూ ఉండటం మాత్రం ఆపలేదు. ఇటీవలే ప్రధాని ప్రకటించి, కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన పథకం ఒక వట్టి భ్రమగా మిగలడమే కాకుండా పేదల గాయాలపై మరింతగా పుండు రాసేలా ఉంది. ఇది తప్పుడు ప్యాకేజీ మాత్రమే కాదు.. వంచనాత్మకమైన పథకం కూడా. కేంద్ర ఆర్థిక మంత్రి ఎంత దయారాహిత్యంతో కనిపిం చారంటే ఉద్దీపనపై తొలి ప్రెస్ సమావేశంలో వలస కార్మికుల పేరెత్తడానికి కూడా ఆమెకు మనసొప్పలేదు. ఇక రెండో సమావేశంలో వారికి కాస్త బిచ్చం విసిరేశారు కానీ, రోడ్డు ప్రమాదాల్లో, రైలు పట్టాలపై వారి విషాద మరణాలకు కనీస సంతాపం ప్రకటించలేదు. తమకు అందుబాటులో ఉన్న ప్రతి రవాణా సాధనాన్ని పట్టుకుని ప్రయాణిస్తూ, అదీ సాధ్యం కానప్పుడు కాలినడకనే వందల మైళ్ల దూరం రహదారులపై నడుస్తూ వలస కార్మికులు పడుతున్న పాట్లను దేశవిభజన తర్వాత ఇంతవరకు దేశం ఎన్నడూ చూసి ఉండలేదు. వారి బాధలు చూస్తే హృదయాలు బద్దలవుతున్నాయి. వారి కడగండ్లు ఎంతమాత్రం జాతికి ఆమోదనీయం కాదు. వలస కార్మికుల పట్ల జరుగుతూన్న ఈ గందరగోళానికి భారత ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. కనీస ప్లాన్ కూడా లేకుండానే మార్చి 24న ఉన్నట్లుండి లాక్డౌన్ ప్రకటించడం కేంద్రం చేసిన మొదటి తప్పు. వైరస్ వ్యాప్తి చెందకుండా, వలస కార్మికులు ఎక్కడివారక్కడే బస చేసేలా కేంద్రం జాగ్రత్తలు పాటించాల్సి ఉండె. సంవత్సరానికి ఒకసారి సీజన్లో స్వస్థలాలకు వెళ్లే కూలీలకు మాత్రమే మినహాయింపునిచ్చి మిగిలిన అందరినీ ఉన్నచోటే ఉంచి సౌకర్యాలు అందించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. ఉన్నఫళాన లాక్డౌన్ ప్రకటించినప్పుడు వలస కార్మికులకు అంతవరకు పనిపాటలు కల్పించిన ఆరుకోట్ల సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూతపడతాయన్న ఎరుక కూడా కేంద్రానికి లేకుండా పోయింది. ఇవి కార్మికులకు, కూలీలకు పూర్తి వేతనం ఇవ్వలేవని గ్రహించకుండా హుకుం జారీ చేసినంత మాత్రాన పని జరగదని కేంద్రం గుర్తించాల్సి ఉండె. చివరకు తన నిర్ణయంలో తప్పును గ్రహించాక ప్రభుత్వం ఇక తప్పదని పూర్తివేతనంపై తన హుకుంను వెనక్కి తీసుకోవలసి వచ్చింది. వలస కార్మికులందరూ ఉన్నట్లుండి తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని నిర్ణయించుకోలేదు. ఇన్నాళ్లూ తాము దాచుకుని ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చయిన తర్వాత, ఇక అధికారుల నుంచి తమకు ఎలాంటి సహాయం లభించదని, ఆకలితో చావడం తప్ప తమకు ఏ మార్గమూ లేదని గ్రహించిన తర్వాతే వారు సొంత ఊరి బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు శక్తిమేరకు సహాయం చేశాయి కానీ అది ఏమాత్రం సరిపోలేదు. వలస కార్మికుల సహాయార్థం రాష్ట్రాలకు నిధులు, ఆహారధాన్యాలు పంపించడం కేంద్ర ప్రభుత్వ తొలి నిర్ణయంగా ఉండాలి. మార్చి నెలలో తదుపరి మాసాల్లో వలసకూలీల వేతనం పూర్తిగా వారికి అందేలా కేంద్రం తగు జాగ్రత్తలు చేపట్టాల్సి ఉండె. వారికి అవసరమైన రేషన్ సరుకులు, వైద్య సహాయం కూడా కేంద్రం కల్పించాల్సి ఉండె. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిలో ఏ ఒక్క అంశం పట్ల బాధ్యత పడలేదు. వలస కార్మికులను గాలికి వదిలేసింది. దీంతో వేలాది కార్మికులకు కాలినడకన ఊళ్ల బాట పట్టడం తప్ప మరోదారి లేకుండాపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీలు ఫక్తు రాజకీయ వ్యూహం పన్నుతూ మొత్తం తప్పును రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టేయడానికి చూస్తున్నాయి. ఉద్దీపన ప్యాకేజీని మొదట్లో రూ. 20 లక్షలకోట్లుగా ప్రకటించి తర్వాత రూ. 21 లక్షల కోట్లకు పెంచి చూపారు. కానీ ఇంత భారీ ప్యాకేజీలో వలస కార్మికులకు తక్షణ ఉపశమనం కలిగించే అంశమే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వలసకూలీల సమస్య పరిష్కార మార్గాలను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తలచి భావసారూప్యత కలిగిన కొద్దిమంది మిత్రులతో చర్చించాను. భారత ప్రభుత్వం ఇప్పుడైనా పారామిలటరీ బలగాలను రప్పించి వలస కార్మికుల తరలింపు బాధ్యతను అప్పగించి ఉంటే బాగుండేదని మేమంతా నిర్ధారణకు వచ్చాం. సైన్యాన్ని దింపి ఉంటే తక్షణం కొన్ని ప్రయోజనాలు నెరవేరేవి. అవేమిటంటే. సాయుధ బలగాలపై మన ప్రజలకు అపార విశ్వాసం ఉంది కనుక కూలీల తరలింపు క్రమశిక్షణతో జరిగేది. పైగా తనకున్న వనరులు, పౌర ప్రభుత్వాల వనరుల సహాయంతో సైన్యం.. రైళ్లతో సహా అన్ని రకాల రవాణా సాధనాలను కూలీల తరలింపునకు ఉపయోగిం చేది. కార్మికులకు తగిన ఆహారం, నీరు, వైద్య సహాయాన్ని సైన్యం క్రమబద్ధీకరించేది. వలస కూలీలను వీలైంత తక్కువ సమయంలో ఊళ్లకు చేర్చేది. నా ఉద్దేశంలో మన సైనిక బలగాలు ఈ మొత్తం కార్యక్రమాన్ని 48 గంటల్లోపే విజయవంతంగా పూర్తి చేసేవి. కోవిడ్‌పై పోరాడుతున్న వైద్య సిబ్బంది, తదితరుల గౌరవార్థం పూలు చల్లడానికి సైనిక బలగాలను ఉపయోగించాలన్న కేంద్ర ప్రభుత్వ యోచన సరైందే. కానీ వలస కూలీల సంక్షోభం విషయంలో కూడా సాయపడాల్సిందిగా కేంద్రం సైన్యాన్ని కోరి ఉండాల్సింది. కానీ నేనిక్కడ విచారంతోనే ఒక విషయాన్ని చెబుతున్నాను. గతంలో సంభవించిన అనేక సంక్షోభాలను భారత పాలనా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొంది. ప్రస్తుత సంక్షోభంలో అది విఫలమైందంటే, రాజకీయ మార్గదర్శకత్వ లేమి మాత్రమే దీనికి కారణం. అందుకే వలసకూలీల తరలింపులో సైన్యం సహాయం తీసుకోవలసిందిగా అనేక ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తూ భారత ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించాను. కొంతమంది మిత్రులతో, రాజకీయ పార్టీల సహచరులతో కలిసి మే 18న ఉదయం 11 గంటల నుంచి రాత్రివరకు రాజ్ ఘాట్ వద్ద ధర్నాలు చేశాము. కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా దీంట్లో పాల్గొన్నారు. కానీ కేంద్రం నుంచి స్పందన లేకపోగా 11 గంటల తర్వాత మమ్మల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకుపోయి తర్వాత వదిలేశారు. ధర్నా అలా ముగిసింది కానీ సమస్య అలాగే ఉండిపోయింది. నా భయం ఏమిటంటే ఓపిక నశించిన జనం ఆగ్రహావేశాలతో ఎలా స్పందిస్తారన్నదే. కార్మికుల్లో అశాంతిని ఇప్పటికే మనం చూశాం. ఇప్పటికైనా మన సమాజం మేలుకొని వలస కూలీల సమస్యను తక్షణం పరిష్కరించడానికి సైన్యం సహాయం తీసుకోవలసిందిగా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోతే, పరిస్థితి చేయిదాటిపోతుంది. అదే జరిగితే మనలో ఓ ఒక్కరం కూడా ఇళ్లలో సురక్షితంగా ఉండలేం. అందుకే ఇప్పటికైనా బయటకొచ్చి ఈ అంశంపై గళమెత్తాల్సిందిగా ప్రాధేయపడుతున్నాను. వ్యాసకర్త: యశ్వంత్ సిన్హా, బీజేపీ మాజీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక, రక్షణ మంత్రి -
రైలు పట్టాలపై పడుకోకుండా ఎలా ఆపగలం
న్యూఢిల్లీ: వలస కార్మికులను స్వస్థలాలకు నడిచి వెళ్లకుండా ఆపడం ఎవరికీ సాధ్యంకాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారికి పునరావాసం, ఉచిత రవాణా కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. కేవలం వార్తా పత్రికల క్లిప్పింగుల ఆధారంగా దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించలేమని కొట్టేసింది. వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశామని కేంద్రం కోర్టుకు తెలిపిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నడిచి వెళ్లేవాళ్లను ఎవరు మాత్రం ఆపగలరు? ఎలా వారికి నచ్చజెప్పగలరు? వాళ్లను రైలు పట్టాలపై పడుకోకుండా ఎలా ఆపగలం’’ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజయ్ కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. (కూలీలను చిదిమేసిన రైలు) వాదనలు వినిపిస్తున్న క్రమంలో పిటిషనర్, న్యాయవాది అలాఖ్ అలోక్ శ్రీవాస్తవ ఔరంగాబాద్‌లో 16 మంది వలస కార్మికులు రైలు పట్టాలపై మృత్యువాత పడిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన కోర్టు... ‘‘ ప్రతీ న్యాయవాది న్యూస్ పేపర్ చదివి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. మీరు ఆ క్లిప్పింగుల ఆధారంగానే మమ్మల్ని కూడా చర్యలు తీసుకోమంటున్నారు. ఆ ఘటన గురించి రాష్ట్రాన్ని మాట్లాడనివ్వండి. ఈ విషయంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకోగలదు? మీకు ప్రత్యేకంగా ఓ పాస్ ఇప్పిస్తాం. మీరే అక్కడికి వెళ్లి ప్రభుత్వ ఆదేశాలను అమలయ్యేలా చూడండి. వలస కార్మికులు నడిచి వెళ్లకుండా ఆపండి’’అని బదులిచ్చింది.(ఆ పదహారు కూలీల పదహారణాల ఆత్మనిర్భరత) అదే విధంగా ఒకరు నడిచి వెళ్లాలో లేదో పర్యవేక్షించడం కోర్టుకు సాధ్యం కాదని.. అందుకే ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని పేర్కొంది. కాగా లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు వెళ్తున్న దృశ్యాలు విస్తృతంగా బయటపడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు సడలించిన అనంతరం శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది నేటికీ నడిచి వెళ్తున్నారు. ఈ విషయం గురించి శ్రీవాస్తవ కోర్టును ఆశ్రయించగా... సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ... ‘‘కేంద్రం ఏర్పాట్లు చేసింది. అయినా కొంతమంది నడిచే వెళ్తున్నారు. వాళ్లంతా కాస్త ఓపిక పట్టాలి. వారి అవకాశం వచ్చేంత వరకు ఎదురుచూడాలి’’ అని పేర్కొన్నారు.(బడుగుజీవికి ‘బండె’డు కష్టాలు!) -
ఆ పదహారు కూలీల పదహారణాల ఆత్మనిర్భరత
హరిశ్చంద్రుడికి కరోనా రోగం సోకింది. వరుణుడిని ప్రార్థిస్తాడు. నీ కొడుకును బలి ఇస్తానంటే నీ రోగం కుదురుస్తానంటాడు వరుణుడు. సరేనంటాడు రాజు. రాజభవనం నుంచి కరోనా పోయింది. రాజు పుత్రవ్యామోహంలో పడి బలిమాట వాయిదా వేస్తుంటాడు. బలి ఇవ్వక తప్పని దశ వస్తుంది. రాజుగారి సలహాదారుడు మీరు పుత్రుడిని దత్తత తీసుకుని లేదా కొనుక్కుని కూడా బలి ఇవ్వవచ్చునని ఉపాయం చెబుతాడు. రాజు దండోరా వేస్తాడు. బలిచేసే వాడికి ఎవరైనా కొడుకిని దత్తత ఇస్తారా, అమ్ముతారా? కానీ, అజిగర్తుడనే పేదవాడు నాకు నూరు ఆవులిస్తే కొడుకునిస్తానంటాడు. అయితే పెద్దవాడంటే నాకు ప్రేమ అని తండ్రి, చిన్నవాడిని నేనివ్వను అని తల్లి అంటారు. మధ్య వాడు సునఃశ్యేపుడు. తల్లిదండ్రులకు అక్కరలేకపోయిన తరువాత బతకడమెందుకని బలిపశువైపోతాడు. అయితే యజ్ఞంచేసే ముని, బలిని నిర్వహించే ఉద్యోగి మనిషిని నరకలేమంటారు. మళ్లీ అజిగర్తుడు ముందుకొచ్చి ఇంకో వంద ఆవులిస్తే నేనే బలి ఇస్తానంటాడు. నాకెవరూ లేరు, నేనెవరిమీదా ఆధారపడలేను, ప్రేమించే తల్లిదండ్రులే వద్దనుకున్నారు, కాపాడే రాజే బలి కోరుతున్నాడు అని కుములుతున్న సమయంలో అప్పుడే అద్భుతమైన ఉపదేశం ఆకాశవాణిలో విన్నాడు సునఃశ్యేపుడు. ఎవ్వరిమీద ఆధారపడనప్పుడే కావలసింది ఆత్మనిర్భరత అన్న మాట మనసులో నాటుకుపోయింది. వలసకూలీల వలె పట్టాల మీద బలిపశువు కాకూడదనుకున్నాడు. కనీస బాధ్యత లేని తల్లిదండ్రులనుంచి, నియంతృత్వపు రాజు నుంచి, మాయమాటలు నమ్మి చప్పట్లు కొట్టే ప్రజల అజ్ఞానపు చీకట్ల నుంచి కాపాడే చైతన్య ఉషోదయాన్ని ప్రార్థిస్తూ గురువు విశ్వామిత్రుడు చెప్పినట్టు తానే వరుణుడిని ప్రార్థించాడు. వెంటనే వెలుగు విస్తరించింది. వరుణుడు రాజుతో నీవంటి వారి బలి నాకక్కరలేదన్నాడు. సునఃశ్యేపుడు తండ్రిని ఒక చూపు చూసి విశ్వామిత్రుడి వెంట ఎంతో ఆత్మనిర్భరతతో వెళ్లిపోతాడు. దిక్కులేకుండా సునఃశ్యేపుడి వంటి దుర్దశలో ఉన్నపుడు ఆత్మనిర్భరత అవసరం అన్నది ఈనాటి పాఠం. కరోనాను పట్టించుకోకుండా ముందుగా ట్రంప్ జిందాబాద్ అన్నాం, తరువాత పారాసిటమాల్ చాలదా అనుకున్నాం. తరువాత భయపడ్డాం, తాళాలు వేశాం. తాళాలు తప్రాలు వాయిస్తూ భజ నలు చేశాం. భౌతిక దూరం అంటూ కవితలు రాశాం. పై కథ చెప్పిన ఒక పురాణ నిపుణ రచయిత కవితాత్మకంగా ఇంకో మాట చెప్పాడు. 500 కరోనా కేసులున్నపుడు లాక్డౌన్, 5 వేల కేసులున్నపుడు చప్పట్లు, 10 వేల కేసుల సంబరానికి కరెంటు దీపాలు మలిపి, ఆ చీకటిలో కొవ్వొత్తులు వెలిగించడం, 40 వేల కేసుల సందర్భంలో ఆకాశం నుంచి పూలు కురిపించడం. 50 వేల కేసులుం డగా మద్యం దుకాణాలు బార్లా తెరిపించడం. 60 వేల కేసులకు చేరుకుంటుంటే రైళ్లు నడవడం చేసుకుంటున్నాం. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మనిర్భరత ప్రబోధించారు. కనిపించని కరోనా, కనిపించినా కదలలేని సామాన్యులు గందరగోళంలో పడిపోయారు. కేవలం నాలుగ్గంటల నోటీసిచ్చి అంతా 21 రోజుల దాకా బంద్ అంటే నలభై కోట్ల వలస కూలీలు తప్ప అంతా సంతోషించారు. రకరకాల వలస కూలీలకు ఇప్పుడు పని లేదు. పనిలేక తిండి లేదు. పోదామంటే రైలు లేదు, కోట్లాదిమంది నడక మొదలుపెట్టారు. ఎంత దూరం అని పట్టించుకోలేదు. ఒక తల్లి దారిలో ప్రసవించింది, వెంటనే నడకకు సిద్ధమైంది. ఒక తండ్రి పాపను భుజాన మోసుకుని బయలుదేరాడు. ఓ భర్త, చిన్న చక్రాల చట్రం మీద భార్యను, పసిపాపను ఓ మూటను పెట్టుకుని లాక్కుపోవడం మొదలుపెట్టాడు. చక్రాల సూట్‌కేస్ మీద సతిని కూచోబెట్టి మరో పతిదేవుడు తోసుకుపోతున్నాడు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఊరికి 30 కి.మీ. దూరంలో అలసిపోయి చనిపోయాడొకాయన. రైలు ఎక్కనీయకపోతే పట్టాల వెంట నడక ప్రారంభించి నడిచీ నడిచీ అలసిపోయి తెల్లవారుఝామున మూడు గంటల ప్రాంతంలో అక్కడికక్కడే పట్టాల మీద పడి నిద్రపోయారు. ప్యాసింజర్ రైళ్లు లేకపోయినా రైల్వే అధికారులు ఎంతో దేశభక్తితో గూడ్సు రైళ్లు నడుపుతారని వారు ఊహించలేకపోయారు. ఇంజిన్ డ్రైవర్ కర్తవ్య నిర్వహణ పరాయణుడై రైలు నడిపే డ్యూటీ చేశాడు. తీరా లక్షలాది కూలీలు ఊళ్లు చేరిన తరువాత, అన్ని పనుల లాక్ తెరిచారు. రెక్కాడించడానికి మళ్లీ వెళ్లాలా? ఎవ్వరిమీదా ఆధార పడకుండా సొంతంగా బతుకో చావో అనుకునే ఆ పదహారుమంది పదహార ణాల ఆత్మనిర్భరత అలవర్చుకోవాలా? నెత్తురుతో తడిసిన ఆ పట్టాలమీద ప్రగతి రైళ్లు పరుగెత్తి మన దేశాన్ని విశ్వాగ్రరాజ్యంగా మార్చేస్తాయా? స్క్రూలనుంచి ఇంజిన్ దాకా అంతా జపాన్ వారే చేసి మనకు అమ్మే బుల్లెట్ రైళ్లు ఈ పట్టాలమీదే నడుస్తాయా? నడిస్తే లోకల్ అనకండి, అది గ్లోకల్ అని తెలుసుకోండి. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
సహానుభూతి సైతం కరువైనచోట..!
ఔరంగాబాద్ సమీపంలో రైలుపట్టాల మీద పడుకుని నిద్రించి, గూడ్స్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 16 మంది వలస కార్మికుల ‘అవివేకం, మూర్ఖత్వం’ గురించి సోషల్ మీడియా గంగవెర్రులెత్తుతోంది. బాధితులనే నిందించడం అనేది సరికొత్త జాడ్యంలా తయారైన దేశంలో పట్టాల మీద తలలు చిధ్రమైపోయిన వారి పట్ల కాస్త కరుణ మనలో ఉంటుందని ఊహించలేం. ఉద్యోగాలు కోల్పోయి, అద్దె ఇళ్ల నుంచి ఉన్న çఫళాన ఖాళీ చేయాల్సి వచ్చి, కొద్దిపాటి రోటీలతో, భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు లేకుండా, మండిస్తున్న ఎండలో వీపులపై పిల్లలను మోసుకుంటూ సొంత వూళ్లకు వెళ్లడానికి బలవంతంగా నడవాల్సి వచ్చిన అమానుష పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారి ‘వివేకం’పై ఎవరు అంచనా వేయాలి? మే నెల 8న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని రైలు పట్టాలమీద పడుకుని నిద్రిస్తున్న 16 మంది వలస కార్మికుల జీవితాలను అటుగా వచ్చిన సరుకుల రైలు ఛిద్రంచేసి పడేసింది. ఈ విషాదం జరిగి అప్పుడే 6 రోజులు గడిచిపోయాయి. కానీ ఆ కుటుంబాలకు జరిగిన నష్టం గురించి ఇప్పటికీ నాలో ఆలోచనలు రగులుతూనే ఉన్నాయి. హృదయాన్ని రగిలిస్తున్నది వాస్తవంగా జరిగిన ప్రమాద ఘటనా లేక సోషల్ మీడియాలో ఈ ఘటనపై వస్తున్న స్పందనలా అన్నది నిర్ణయించుకోలేకపోతున్నాను. ఆ ఘటన పట్ల సోషల్ మీడియాలో వచ్చిన స్పందనల్లో కొన్ని. ‘ఇంత బాధ్యతారహితంగా వారు పట్టాలపై పడుకున్నారు, వాళ్లు తమకు తామే నిందించుకోవాలి. వాళ్లకు పిల్లలున్నారు. తమ పిల్లలను గురించి వారు ఎందుకు ఆలోచించలేదు? రైలుపట్టాలమీద ఎవరైనా పడుకుంటారా? పట్టాల పక్కన వాళ్లెందుకు పడుకోలేదు? వారు అంత మూర్ఖంగా ఎలా వ్యవహరించారు?’ సోషల్ మీడియాలో వచ్చిన ఈ తరహా స్పందనలు చూసి నేను అవాక్కయిపోలేదు. ఎందుకంటే బాధితులనే నిందించడం అనేది ఇప్పుడు ఒక సరికొత్త జాడ్యం. మన దేశంలో అత్యాచారం బారిన పడిన వారినే అవమానిస్తుంటారు. పేదల బాధలకు వారే కారణమని నిందిస్తుంటారు. ఈ నేపథ్యంలో గూడ్స్ రైలు కింద పడి చనిపోయిన వారి మరణాలకు ఆ మృతులనే తప్పుపట్టడం చూస్తుంటే ఆశ్చర్యం కలిగించదు. పేదలను ఉద్ధరించే బాధ్యతను తమకుతామే నెత్తిన వేసుకున్న ఈ పెద్దమనుషులు ఎంతో నైతిక నిష్టతో సూచిస్తున్నట్లుగా, రైలు పట్టాల మీద పడుకునే ఆ వివేకవంతులు ఎవరై ఉంటారు? నిజంగా ఇంకెవరు? వలస కార్మికులే. నిజానికి వారి వివేకం సరైందే. అలా పడుకోకుండా వారిని ఈ దేశంలో ఆదుకునేవారెవ్వరు? ఉన్నట్లుండి తమ ఉద్యోగాలనుంచి విసిరేయబడిన వారు, అద్దె ఇళ్లనుంచి ఉన్నఫళాన ఖాళీ చేయాల్సి వచ్చిన వారు, కొద్దిపాటి రోటీలతో, భవిష్యత్తుపై ఎలాంటి ఆశలు లేకుండా, మండిస్తున్న ఎండలో వీపులపై పిల్లలను మోసుకుంటూ సొంత వూళ్లకు వెళ్లడానికి బలవంతంగా నడవాల్సి వచ్చిన అమానుష పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారి వివేకం ఎలా ఉండాలి? జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో సాధారణ హేతువుకు కూడా తావు లేకుండా వారికి తగిలిన గాయాలు ఎంత ప్రభావం వేశాయో మనకు అర్థం కాకపోవచ్చు. నిలబడేందుకు కాస్త నీడలేక నడకబాట పట్టిన వలసకార్మికులు వీపులపై పోలీసుల లాఠీలు మోగుతున్నప్పుడు ఆ పాశవికతలో మనకు ఏదైనా విచక్షణా జ్ఞానం ఉన్నట్లు కనబడుతుందా? తిండీతిప్పలు కూడా సరిగా లేనిస్థితిలో వందలాది మైళ్ల దూరం నడుచుకుంటూ కండరాలు అలసిపోయిన స్థితిలో తాము పడుకున్న చోటికి రైలు వస్తుందని, తమ దేహాలను ఛిద్రం చేస్తుందనే స్పృహ వాళ్లలో ఉంటుందని ఆశించవచ్చా? లేక లాక్డౌన్ సమయంలో రైళ్లు నడవవు అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలను యథాతథంగా వారు దృష్టిలో పెట్టుకున్నారా? మనకు తెలిసిందల్లా ఒకటే. కాలినడకన నడిచి నడిచి వారెంత అలసిపోయి ఉన్నారంటే గూడ్స్ రైలు చేసే భారీ శబ్దం కానీ, రొదపెట్టే హారన్ కానీ వారిని నిద్ర లేపలేకపోయాయి. కరోనా కాదు.. లాక్ డౌన్ మరణాలు కరోనా వ్యాధి ప్రభావం కంటే లాక్ డౌన్ విధింపు కారణంగా గత శనివారం వరకు దేశవ్యాప్తంగా 378 మంది వలసకార్మికులు దయనీయ పరిస్థితుల్లో మరణించారని తాజా పరిశోధన చెబుతోంది. వీరిలో ఏ ఒక్కరికీ కరోనా వ్యాధి సోకలేదు. తమ స్వస్థలాలకు నడిచి పోతుం డగా రోడ్డు, రైలు ప్రమాదాలకు గురై 74 మంది వలస కార్మికులు గత 50 రోజులుగా మరణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణాను చెప్పాపెట్టకుండా రద్దు చేయడంతో వలసకార్మికులకు నడక ఒక్కటే ప్రయాణ సాధనంగా మారింది. మరణాల వారీగా చూస్తే ఆకలిదప్పులు, ఆర్థిక బాధలకు గురై 47 మంది చనిపోయారు. నడకలో అలసిపోయి, క్యూలలో నిలబడి తాళలేక చనిపోయినవారి సంఖ్య 26. పోలీసు పాశవికత్వం లేక రాజ్యహింస వల్ల 12 మంది చనిపోయారు. వైద్య సేవల లేమి, ముసలివారిని పట్టించుకోకపోవడంతో 40 మంది హరీమన్నారు. కరోనా సోకుతుందన్న భయంతో, ఒంటరితనంతో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య 83. ఆల్కహాల్ అందుబాటులో లేని సమస్యలతో చనిపోయిన, ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 46. నడిచిపోతుండగా రోడ్డు లేక రైలు ప్రమాదాల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 74. లాక్డౌన్ సంబంధిత నేరాల కారణంగా చనిపోయినవారు 14 మంది. ఎలాంటి వర్గీకరణల్లో ఇమడకుండా చనిపోయినవారు 41 మంది. ఆ మరునాడు ఉదయం, ఈ విషాద వార్త తెలియగానే బాధితులపై ఆగ్రహాన్ని, క్రోధాన్ని ప్రదర్శించడంలో ట్విట్టర్, ఫేస్ బుక్ పోటీలు పడ్డాయి. ఇది బాధితుల మూర్ఖత్వం తప్ప మరేమీ కాదట. అంటే మరణించిన తర్వాత కూడా వలసకార్మికులను అర్థం చేసుకున్నవారు, వారి పట్ల సానుభూతి, కరుణ చూపిన వారు ఈ దేశంలోనే లేకుండా పోయారన్నమాట. కనీసం మన ప్రధాని అయినా ఈ సందర్భంగా కాస్త సరైన విధంగా ప్రకటన చేశారు. ‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలుప్రమాద ఘటనలో వలసకార్మికులు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. దీనిపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. ఆయన పరిస్థితిని సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అవసరమైన సహాయం పూర్తిగా అందజేస్తాం’. గత ఆరేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ రికార్డును పరిశీలించండి. తన ప్రతిష్టను భంగపర్చుకోవడం తప్పితే ఆయన ఏ విషయం మీద అయినా తీవ్రంగా బాధపడుతున్నారంటే నమ్మడం కష్టమే. ఇతరుల బాధల పట్ల తీవ్ర విచారం కాదు కదా.. కాస్తంత సానుభూతి అయినా ఉన్నట్లయితే, ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆకలిదప్పులకు గురవుతున్న లక్షలాదిమందికి సహాయం అందించవలసిందిగా రక్షణ బలగాలను ఆదేశించి ఉండేవారు. లక్షలాది మంది అన్నార్తులకు ఉపశమనం కలిగించగల శక్తి, సామర్థ్యం సైన్యానికి మాత్రమే ఉన్నాయి మరి. ఆ పని చేసి ఉంటే గోడవున్ల కొద్దీ మగ్గుతున్న వరి, గోధుమ ధాన్యాన్ని బయటకు తీసి రేషన్ కార్డులున్నా లేకున్నా, అవసరమైన ప్రతి ఒక్కరికీ అందించేవారు. ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయి ఉన్న వలసకార్మికులను తరలించడానికి బస్సులు, ట్రక్కులు, చివరకు రైళ్లను కూడా రంగంలోకి దింపి ఉండేవారు. చివరకు ఆసుపత్రులపై పూలు చల్లడం కంటే మన వాయుసేన వలస కార్మికుల తరలింపులో మిన్నగా సేవలందించేది. అయినా మన పాలకులను మాత్రమే తప్పు పట్టి ప్రయోజనం ఏమిటి? బాధల పట్ల విచారం వ్యక్తం చేయడం కాదు కదా.. కనీసం పరితాపం కూడా ప్రదర్శించని ప్రజారాసుల మాటేమిటి? గత ఆరేళ్లుగా మనం చూస్తూ వస్తున్నదేమిటంటే, భారతీయ సమాజంలోని ఎగువ, మధ్య తరగతి వర్గాలలో బాధితుల పట్ల కనీస సహానుభూతి కూడా కరువైపోతుండటమే. అప్పుల్లో మునిగిపోయిన రైతు బాధ పట్ల స్పందించకపోవడంలో, దళితుల దురవస్థను అర్థం చేసుకోకపోవడంలో, ముస్లింలను సమాజం నుంచే బహిష్కరిస్తుండటాన్ని గుర్తించడానికి కూడా వెనుకాడటంలో, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) జాతీయ పౌర నమోదు (ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువ గళాలకు సంఘీభావం తెలుపడంలో మన అసమర్థత, అమానుషత్వం కొట్టొచ్చినట్లు ప్రతి సందర్భంల్లోనూ కనిపిస్తూనే వస్తోంది. ప్రముఖ మనస్తత్వ శాస్త్రజ్ఞుడు ఆల్ప్రెడ్ అడ్లర్ ఒక సందర్భంలో సహానుభూతి గురించి నిర్వచిస్తూ, మరొకరి కళ్లతో బాధను చూడటం, మరొకరి చెవులతో బాధను ఆలకించడం, మరొకరి హృదయంతో అనుభూతి చెందడమే సహానుభూతి అని పేర్కొన్నారు. కానీ ఇతరుల పట్ల అలాంటి సహానుభూతి ప్రదర్శించడానికి మనం ఎప్పుడో దూరమైపోయాం. బహుశా మనం మనుషులుగా ఎలా ఉండాలో, ఎలా స్పందించాలో భగవంతుడు భయానకరీతిలో నిర్దేశించినట్లుగా ఈ సాంక్రమిక వ్యాధి కానీ, లాక్డౌన్ కానీ ఇప్పుడు మనకు చక్కగానే బోధిస్తున్నాయి. బహుశా మనం మన నెట్‌ప్లిక్స్ సీరియల్స్ వీక్షణం నుంచి, సోషల్ మీడియాలో సొంత డబ్బా కొట్టుకోవడం నుంచి, వంటల ప్రదర్శన నుంచి దూరం జరిగినప్పుడే, మన చుట్టూ బాధలు పడుతున్న వారి గాథలను వినగలమనుకుంటాను. అప్పుడు మాత్రమే రైలుపట్టాల మీద తలపెట్టి నిద్రిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆ ‘మూర్ఖపు’ వలస కార్మికులపై మనం ఉచిత తీర్పులు ఇవ్వకుండా ఉండగలమేమో.. (ది వైర్ సౌజన్యంతో) వ్యాసకర్త: రోహిత్ కుమార్, విద్యావేత్త, పాజిటివ్ సైకాలజీ, సైకోమెట్రిక్స్ ఈ–మెయిల్ : letsempathize@gmail.com -
లాక్డౌన్ రాజ్యాంగ విరుద్ధం: ఒవైసీ
హైదరాబాద్: కరోనా మహమ్మారితో పోరాడటానికి ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌నే ఆయుధంగా భావిస్తున్న వేళ.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడం ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. ఆన్లైన్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన కరోనాపై పోరాటం అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. దేశ విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నిరోధక చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించడం చట్ట విరుద్ధమే కాక సమాఖ్య విధానానికి కూడా వ్యతిరేకం అన్నారు. లాక్డౌన్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు ఒవైసీ. లాక్డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒవైసీ తెలిపారు. కార్మికులు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఔరంగబాద్‌లో 16 మంది వలస కూలీలు మృత్యువాత పడిన సంఘటనను ఆయన గుర్తు చేశారు. ప్రజలంతా ఇంట్లోనే క్షేమంగా ఉండాలని కోరారు. క్వారంటైన్ మన మంచికే అని దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనా అనేది ఎవరికైనా రావచ్చని.. దానికి భయపడకుండా ఎవరికి వారే 8-10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండటం వల్ల తనతో పాటు.. తన కుటుంబ సభ్యులకు కూడా మేలు చేస్తుందని అన్నారు. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం, అధికారులతో పాటు ప్రజలు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
కూలీలను చిదిమేసిన రైలు
ఔరంగాబాద్: మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు పయనమయిన వలస కార్మికులను గూడ్స్ రైలు చిదిమేసింది. కాలినడకన రైలు పట్టాల వెంబడి నడిచి వెళ్తూ అలసిపోయి పట్టాలపై పడుకున్నవారిపై నుంచి శుక్రవారం తెల్లవారు జామున ఒక గూడ్స్ రైలు దూసుకెళ్లింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కర్మాడ్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టాలకు కొద్ది దూరంలో పడుకున్న ముగ్గురు ప్రాణాలు దక్కించుకున్నారు. మహారాష్ట్రలోని జల్నాలో ఉన్న ఒక స్టీలు ఫ్యాక్టరీలో పని చేసే మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులు గురువారం రాత్రి కాలినడకన సుమారు 150 కిలో మీటర్ల దూరంలోని సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. రైలు పట్టాల వెంబడి దాదాపు 40 కి.మీ.లు నడిచిన తరువాత ఔరంగాబాద్‌కు దగ్గరలో అలసిపోయి, ఆగిపోయారు. అక్కడే రైలు పట్టాలపై నిద్రించారు. ముగ్గురు మాత్రం పట్టాలకు కొద్ది దూరంలో పడుకున్నారు. తెల్లవారు జాము 5.15 గంటల ప్రాంతంలో ఒక గూడ్స్ రైలు వారిపై నుంచి దూసుకెళ్లింది. రైలు రావడాన్ని పట్టాలకు దూరంగా పడుకున్నవారు గుర్తించారు. పట్టాలపై పడుకున్నవారిని అప్రమత్తం చేసేందుకు గట్టిగా అరిచారు. కానీ, పట్టాలపై నిద్రిస్తున్నవారు ప్రమాదాన్ని గుర్తించేలోపే దుర్ఘటన జరిగిపోయింది. నాందేడ్ డివిజన్లోని బద్నాపూర్– కర్మాడ్ స్టేషన్ల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. చెల్లాచెదురుగా పడి ఉన్న వలస కూలీల మృతదేహాలు, వారి వస్తువులతో ఘటనాస్థలి భీతావహంగా మారింది. ఆ దృశ్యాలున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దూరంగా పట్టాలపై మనుషులున్నట్లు గుర్తించిన రైలు లోకోపైలట్.. హారన్ మోగిస్తూ, రైలు ఆపేందుకు విఫలయత్నం చేశాడని స్థానిక మీడియా పేర్కొంది. లాక్డౌన్ కారణంగా రైళ్లు నడవవన్న ధీమాతోనే వారు పట్టాలపై పడుకున్నారని బాధితులను ఉటంకిస్తూ వివరించింది. పోలీసులు ఆపకుండా ఉండేందుకే.. ఈ ఘటనపై రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది. కార్మికులు మహారాష్ట్రలోని జల్నా నుంచి మధ్యప్రదేశ్‌లోని భుసావల్‌కు వెళ్తున్నారని ఎస్పీ మోక్షద పాటిల్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా పోలీసులు తమను అడ్డుకోకుండా ఉండేందుకే వారు రోడ్డు మార్గాలను కాకుండా, పట్టాలను అనుసరించి ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసిందన్నారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున, మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. మానవ హక్కుల కమిషన్ నోటీసులు రైలు ప్రమాద ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా తీసుకుని మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, ఔరంగాబాద్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో కార్మికులకు అందిస్తున్న ఆహార, వసతి, ఇతర సౌకర్యాల వివరాలను కూడా తెలపాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ప్రముఖుల సంతాపం ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కార్మికుల మృతి తనను కలచివేసిందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘రైలు ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. ఆయన స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు’అని మోదీ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కార్మికులను సొంత ప్రాంతాలకు పంపించేందుకు మరిన్ని రైళ్లు కావాలని కేంద్రాన్ని కోరాం. త్వరలో ఆ ఏర్పాట్లు చేస్తాం’అని ఠాక్రే అభ్యర్థించారు. విపక్షాల విమర్శలు జాతి నిర్మాతలైన కార్మికులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు దేశమంతా సిగ్గుతో తలదించుకోవాలని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలని స్థానిక ఎంఐఎం ఎంపీ ఇమ్తియాజ్ జలీల్ విమర్శించారు. ఇందుకు కారణమైన ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. -
వ్యూహం లేక ఒరిగిన ‘వలస’ పక్షులు
లాక్డౌన్ ప్రకటించగానే వలస కార్మికుల బాధలు పట్టించుకోకుండా చేతులెత్తేశారు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు. వలస కార్మికుల కష్టం మీద వందల వేల కోట్లు సంపాదించిన వీళ్లకు కనీసం భోజనం పెట్టడానికి కూడా దయ రాలేదు. పోనీ నాలుగు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపడానికి కూడా వీరికి మనసొప్పలేదు. జాతీయ, ప్రాంతీయ మీడియాలో విపక్షాలు గోల పెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ హృదయం కొద్దిగా కరిగింది. శ్రామిక రైలు ప్రవేశపెట్టారు. కానీ దేశంలోని పదికోట్ల మంది వలస కార్మికులకు వారి గమ్యస్థానాలకు తరలించడానికి ఎన్ని రైళ్లు కావాలి, ఎన్ని రోజులు నడపాలి అనే ప్లాన్ లేకుండా ఆదరాబాదరాగా ప్రవేశపెట్టారు. ముందుచూపులేని విధానాల వల్ల దేశవ్యాప్తంగా అభివృద్ధి పనులు నిలిచిపోతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితిని చక్క దిద్దటానికి ప్రణాళిక ప్రకారం వ్యూహరచన చేయాలి. నెత్తిన మూట, సంకన పసిపాప, పక్కన నడిచే పిల్లలు, పైన భగభగ మండే ఎండ, కింద చెప్పులు లేని నడక, ఎండకు కాలిన కాళ్లకు బుగ్గలు, ఎండిన డొక్కలు, కంటినిండా నీరు, గుండెనిండా వేదన–గమ్యం లేని వందల వేల కిలోమీటర్లు నడక. ఇది దేశంలోని ఏ రోడ్డున చూసినా, ఏ మూలను చూసినా కనిపించిన వలస కార్మికుల హృదయ విదారక దృశ్యాలు. వీరి బాధను చూసి రాతి గుండెలు కూడా కరిగిపోతాయి. కానీ మన పాలకుల గుండెలు కరుగలేదు. ఇది కరోనా రక్కసి ప్రభావమని పాలకులు తప్పించుకుంటున్నారు. కానీ ఇది ఏలుతున్న వారి అసమర్ధత. అంతే కాదు పేద వర్గాల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని దొరతనం. సంపన్న వర్గాల పిల్లలు విదేశాలలో చిక్కుకుంటే ఆగమేఘాల మీద ప్రత్యేక విమానాలను పంపి తేవాలనుకునే ప్రభుత్వ నేతలకు వలస కార్మికులను గమ్యస్థానాలకు పంపాలని కానీ, భోజనం పెట్టాలని కానీ, ఉన్నచోటే కనీస సౌకర్యాలు కల్పించాలని కానీ ఆలోచన రాలేదు. (చదవండి: కూలీలను చిదిమేసిన రైలు) లాక్డౌన్ ప్రకటించిన మొదటి రోజే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఓటర్లకు నగదు పంపిణీ, రేషన్ సరుకులు ప్రకటించారు. వెంటనే వలస కార్మికులకు కూడా ఇదే ప్రభుత్వ సహాయాన్ని అందించాలని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం మొక్కుబడిగా వలస కార్మికులకు కూడా ఈ సదుపాయాలను కల్పిస్తామని ప్రకటించింది. కానీ ఆచరణలో అమలు కాలేదు. ఎందుకో తెలుసా వీరికి మీరు పనిచేసే రాష్ట్రాలలో ఓట్లు లేవు. ఓట్లు ఉంటే తప్ప సహాయం చేయరని తేలిపోయింది. పోనీ ఇన్ని రోజులు పని చేయించుకున్న యాజమాన్యాలు ఆదుకుంటాయా అంటే.. వాళ్లూ చేతులెత్తేశారు. దీనితో వలస కార్మికులు నాలుగు వారాలు అర్ధాకలితో నెట్టుకొచ్చారు. ఇక లాభం లేదని ఆకలి చావులకు భయపడి తమతమ గ్రామాలకు వెళ్లాలని బరువైన మనసుతో ఖాళీ గిన్నెలు, గ్లాసులు మూటకట్టుకొని బయలుదేరారు. అక్కడక్కడా ధైర్యం ఉన్న వలస కార్మికులు రవాణా సౌకర్యం కల్పించాలని నిరసన ప్రదర్శనలకు దిగితే, లాఠీ ఛార్జ్, బాష్పవాయు ప్రయోగం చేసి చెదరగొట్టారు. వలస కార్మికుల నడక కష్టాలు ఇంతా అంతా కాదు. కొందరు దారిలోనే ఆకలితో సొమ్మసిల్లి చనిపోతే, మరికొందరు ప్రమాదాలలో చనిపోయారు. ఇంకా చనిపోతున్నారు, కాలినడకన ఒక నిండు గర్భిణీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని తన సొంత ఊరు చేరడానికి ఇద్దరు పిల్లలతో వెళుతుంటే, మేడ్చల్ దాటగానే రోడ్డు పక్కనే చెట్ల కింద పండంటి పసిపాపను కన్నది. ఈ సంఘటన భారత జాతి ఆత్మను ప్రశ్నించింది. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆమెను నర్సాపూర్ ఆసుపత్రికి తరలించారు. వలస కార్మికుల బాధలు, కన్నీటి గాధను, మూగ రోదనను చూసి భారతమాత కన్నీళ్ళు పెట్టి ఉంటుంది. న్యాయ దేవత తన నిస్సహాయతను చూసి తలదించుకుని ఉంటుంది. జాతీయ రహదారుల వెంట జాతరలా వెళుతున్న వలస కార్మికుల బాధలు టీవీలలో, పత్రికలలో చూసి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమేనా అని ప్రపంచ దేశాలు ఆలోచనలో పడ్డాయి. అభివృద్ధి అంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల అభివృద్ధి కాదు. అందమైన బంగ్లాలు కాదు, ఫ్లైఓవర్ ఫ్లవర్ రోడ్లు కాదు. విమాన సౌకర్యాలు కాదు. రిలయన్స్ అంబానీ, ఆదాని, టాటా– బిర్లాల ఆస్తి సంపద పెరగడం కాదు. దేశంలో ప్రతి పౌరునికి కూడు గూడు ఉద్యోగం ఉపాధి కలిగిననాడు నిజమైన అభివృద్ధి. దేశ సంపద, అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరునికి దక్కిన రోజు.. అదే నిజ మైన అభివృద్ధి. అసలు ఈ వలస కార్మికులు ఎవరు? తాము పుట్టిన గడ్డపై ఉపాధి కరువై బతుకుతెరువు లేక పొట్ట చేత పట్టుకొని దేశం కాని దేశం వచ్చి, రక్తాన్ని చెమటగా మార్చి రాత్రింబవళ్లు పనిచేస్తున్న శ్రమజీవులు. బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న శ్రమజీవులు. మన రాష్ట్రం నుంచి కూడా బొంబాయి, పూణే, సూరత్, బెంగళూరుకు కూడా వెళ్లి వేలాది మంది పని చేస్తున్నారు. అలాగే ప్రపంచంలో కూడా ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, గల్ఫ్ దేశాలలో కూడా కోట్లాది మంది మన భారతీయులు ఉన్నారు. తెలంగాణలో అనధికార లెక్కల ప్రకారం 15 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని అంచనా. దేశంలో పది కోట్ల మంది వలస కార్మికులు పని చేస్తున్నట్టు లెక్కలు తెలుపుతున్నాయి. వలస కార్మికులు లేకుంటే మన రాష్ట్రంలో లేబర్ కొరత తీవ్రంగా ఉండేది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో భవన నిర్మాణ కార్మికులు మొత్తం వలస కార్మికులే. పెద్దపెద్ద అందమైన భవనాలు, అపార్ట్మెంట్లు కట్టినవారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఫ్లై ఓవర్స్ నిర్మించినది వీరే. జాతీయ రహదారులను రింగ్ రోడ్ లను తీర్చి దిద్దింది వీరే. మనం తినే సన్న బియ్యం, సన్ ఫ్లవర్ ఆయిల్ పండించడానికి నిర్మించిన కాళేశ్వరం దాని ఉప ప్రాజెక్టులు, కాలువలు, అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణ ప్రాజెక్టులు కాలువలు తవ్వింది, తవ్వుతున్నది, గంపలు పలుగు పారలు పట్టింది వలస కార్మికులే. (చదవండి: కార్మికులను తయారుచేద్దాం!) మనకు కాంతినిచ్చే లైట్లు, చల్లని ఎయిర్ కండిషనర్ మిషన్లు, కరెంటు ఉత్పత్తి చేసే పరికరాలు తయారు చేసే ప్రైవేట్ ఎలక్ట్రికల్ కంపెనీలలో రాత్రింబవళ్లు కష్ట పడేది వలస కార్మికులే. మన రోగాలను నయం చేసే మందులను తయారు చేసే ఫార్మసీ కంపెనీలలో పని చేసేది వలస కార్మికులే. అలాగే రైసు మిల్లుల్లో, సిమెంటు, ఐరన్, ప్లాస్టిక్ కంపెనీలలో పనిచేసే మెజారిటీ కార్మికులు వలస కార్మికులే. రక్తాన్ని చెమటగా మార్చి దేశాన్ని దేశ సంపదను సృష్టిస్తున్న సృష్టికర్తలు వీళ్లు. ప్రాజెక్టులు కట్టకుండానే కట్టినట్లు చెరువులో పూడికలు తీయకుండానే తీసినట్లు, రోడ్లు వేయకుండానే వేసినట్లు దొంగ బిల్లులు సృష్టించి కోట్లకు కోట్లు ధనాన్ని కొల్లగొట్టి లూటీ చేసిన స్కాం బాబులు ఈ కరోనా కష్టకాలంలో, ఇంద్ర భవనాలలో విందు వినోదాలలో తేలి ఆడుతున్నారు. లాక్డౌన్ ప్రకటించగానే వలస కార్మికుల బాధలు పట్టించుకోకుండా చేతులెత్తేశారు పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు. ఈ వలస కార్మికులకు పని లేదు, కాబట్టి జీతాలు లేవన్నారు. వీరికి జీతాలు ఇవ్వాలని, వీరిని ఆదుకోవాలని ప్రభుత్వం చేసిన ఉత్తుత్తి ప్రకటనలను ఈ బడాబాబులు లెక్కచేయలేదు. ఇంతవరకు వలస కార్మికుల కష్టం మీద వందల వేల కోట్లు సంపాదించిన పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు కనీసం భోజనం పెట్టడానికి కూడా దయ రాలేదు. పోనీ నాలుగు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపడానికి కూడా వీరికి కఠిన హృదయం కరగలేదు. జాతీయ, ప్రాంతీయ మీడియాలో విపక్షాలు గోల పెట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయం కొద్దిగా కరిగింది. శ్రామిక రైలు ప్రవేశపెట్టారు. అప్పటికే 60 శాతం మంది వలస కార్మికులు కాలినడక మధ్యలో ఉన్నారు. లక్షలాది మంది వలస కార్మికులకు ఈ శ్రామిక రైలు సరిపోదు. దేశంలోని పదికోట్ల మంది వలస కార్మికులకు వారి గమ్యస్థానాలకు తరలించడానికి ఎన్ని రైళ్లు కావాలి. ఎన్ని రోజులు నడపాలి అనే ప్లాన్ లేకుండా ఆదరాబాదరాగా విమర్శలను తప్పించుకోవడానికి నామమాత్రంగా ప్రవేశపెట్టారు. ప్లాన్ లేకుండా సింగిల్ స్టాప్ విధానం పెట్టడంతో అక్కడినుండి గమ్యస్థానాలు చేరడానికి ఒక్కొక్కరు 100 నుండి 200 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం కొనసాగించవలసి వస్తుంది. లాక్డౌన్ ప్రకటించినప్పుడే వలస కార్మికుల విషయంలో ప్రభుత్వ పెద్దలు మనసుపెట్టి ఆలోచన చేయలేదు. లాక్ డౌన్ దశలవారీగా తొలగించిన తర్వాత వలస కార్మికులను పంపడంలో ఏమైనా అర్థం ఉందా? ఎందుకంటే లాక్డౌన్ తరువాత, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత వలస కార్మికులు లేకపోతే అన్ని అభివృద్ధి పనులు ఆగిపోతాయి. 17 లక్షలమంది వలస కార్మికులు వెళ్లి పోతే తెలంగాణలోని వారి స్థానాలను ఎలా భర్తీ చేస్తారు? ప్రభుత్వం ముందు చూపుతో వలస కార్మికులను ఆదుకుంటే బాగుం డేది. ప్రభుత్వం వద్ద ఎఫ్‌సీఐ గోడౌన్లలో లక్షల టన్నుల ధాన్యాలు మురిగిపోతున్నాయి. వాటిని వలస కార్మికులకు ఇస్తే వారి ఆకలి బాధలు తీరేవి. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఉత్పత్తి రంగం కొనసాగేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సరి అయిన ప్రణాళిక లేక ఇప్పుడు ఎటూ కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం పరిస్థితిని చక్క దిద్దటానికి ప్రణాళిక ప్రకారం వ్యూహరచన చేయాలి. వ్యాసకర్త: ఆర్. కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
వలసజీవుల బలిదానం
సమాజంలో పుట్టుకొచ్చే ప్రతి సంక్షోభానికి మొదటగా బలయ్యేదీ, ఆ భారాన్ని చివరంటా మోయక తప్పని స్థితిలో పడేదీ అట్టడుగు నిరుపేద వర్గాలే. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనడానికి 45 రోజులక్రితం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ ప్రతిరోజూ దీన్ని నిరూపిస్తోంది. వలసజీవులు పడుతున్న ఈ కష్టాలకు మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్లో జల్నా–ఔరంగాబాద్‌ల మధ్య రైల్వే పట్టాలపై శుక్రవారం 17 మంది వలస కూలీలు మరణించిన ఉదంతం పరాకాష్ట అని చెప్పాలి. మహారాష్ట్రలోని జల్నా నుంచి 850 కిలోమీటర్ల దూరంలోని మధ్యప్రదేశ్‌లో వున్న తమ స్వస్థలానికి పోయేందుకు బయల్దేరిన ఈ వలసకూలీలంతా మార్గమధ్యంలో అలసి, విశ్రమించడానికి రైల్వే ట్రాక్‌ను ఎంచుకుని గాఢనిద్రలోకి జారుకున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఉదంతంలోనే మరో ఇద్దరు గాయపడ్డారని చెబుతున్నారు. మరో నలుగురు ఘటనాస్థలికి దూరంగా వుండటం వల్ల ప్రాణాలతో మిగిలారు. నలభై అయిదు రోజులుగా అర్ధాకలితోనో, పస్తులతోనో కాలంగడిపిన ఆ వలసకూలీలు తమ మరణానంతరమే తమ కుటుంబాలకు సాయపడగలిగారు. (చదవండి: కూలీలను చిదిమేసిన రైలు) చనిపోయిన కూలీల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటన వారి వారసులకు ఉన్నంతలో ఓదార్పు. ప్రధాన రహదారులపై నడుచుకుంటూ వెళ్తే చెక్‌పోస్టుల వద్ద పోలీసులు నిలువరించడం, వారిని తాత్కాలిక శిబిరాలకు తరలిస్తుండటం చూసి, ఆ అభాగ్యులంతా రైలు పట్టాలనే నమ్ముకుని వాటిపై నడుస్తున్నారు. అన్నిటితోపాటు రైళ్లు కూడా ఆగి పోయాయని అనుకోబట్టే ఈ పని చేస్తున్నారు. సరుకు రవాణా యథావిధిగా సాగుతోందన్న సమా చారం వారికి లేదు. సమాజంలో పలుకుబడివున్న వర్గాలకు చెందినవారు, అలాంటి వర్గాలకు సన్నిహితంగా మెలిగేవారు లాక్డౌన్ ప్రకటించాక కాస్త వెనకో ముందో తమ తమ స్వస్థలాలకు సులభంగా చేరగలిగారు. కానీ కేవలం పని దొరుకుతుందంటే ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా వెళ్లడం అలవాటైన వలసజీవులకు అటువంటి అవకాశం లేదు. స్వస్థలాల్లోనే ఎవరికీ కానివాళ్లు, తమది కానిచోట ఎంతటి నిస్సహాయస్థితిలో వుంటారో ఎవరికీ తెలియంది కాదు. కనుకనే లాక్డౌన్ ప్రకటించాక వారిలో చాలామందికి ఎటువంటి ఆసరా దొరకలేదు. ముందే మేల్కొన్నవారు ఎవరినీ నమ్ముకోకుండా, దేన్నీ విశ్వసించకుండా నడకదారి పట్టారు. అది తమ వల్ల కాదనుకున్నవారూ, నేతల మాటలు నమ్మినవారూ ఎక్కడివారక్కడే ఉండిపోయారు. అనంతరకాలంలో వారిలో చాలా మందికి జ్ఞానోదయమైంది. కనుకనే రహదారుల పొడవునా, పట్టాల మీదుగా నిత్యం నడుస్తున్న వారూ... చెట్ల కిందనో, మరొకచోటనో సేదతీరుతున్నవారూ ఇప్పటికీ కనబడుతూనేవున్నారు. వలస కూలీలను చేరేయడానికి రైళ్లు నడుస్తున్నాయని తెలిసినా అందుకోసం విధించిన నిబంధనలు, డాక్టర్ సర్టిఫికెట్ వగైరాల కోసం చేయి తడపలేక అనేకమంది నడకనే నమ్ముకుంటున్నారు. అయినా వివిధ రాష్ట్రాల నుంచి రైళ్లలో వెళ్లడానికి నమోదు చేయించుకుంటున్నవారి సంఖ్య చూస్తే గుండె గుభేలు మంటుంది. దేశవ్యాప్తంగా 20 లక్షలమంది రైలు ప్రయాణాలకు నమోదు చేసుకున్నారని అయిదారు రోజులక్రితం అధికారులు ప్రకటించారు. ఈసంఖ్య రోజురోజుకూ పెరుగుతూనేవుంది. దీనికి సమాంతరంగా నడకదారిన వెళ్లేవారు వెళ్తూనే వున్నారు. చంటిపిల్లలతో, వృద్ధులతో, గర్భిణిలతో... మోయలేని బరువులతో ఎందరెందరో నడుస్తూనే వున్నారు. సత్తువ సరిపోక, ఆకలిదప్పులు తీరక మార్గమధ్యంలో కొందరు మరణిస్తున్నారు. ఈ కష్టకాలంలో దాదాపు అన్ని రంగాలూ వలసజీవుల పట్ల చాలా నిర్దయగా ప్రవర్తించాయి. ఇన్నాళ్లుగా తమ సొంతం అనుకున్న నగరాలు కాస్తా నడిరోడ్డుపై నిలబెడుతుంటే ఆ వలసజీవులు విస్తుపోయారు. ఏ కొద్దిమంది రియల్ఎస్టేట్ వ్యాపారులో, పారిశ్రామికవేత్తలో మానవీయ దృక్ప థంతో వారిని ఉన్నచోటే వుంచి, రెండుపూటలా కడపునింపారు. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు కూడా రంగంలోకి దిగి ఆదుకుంటున్న ఉదంతాలు లేకపోలేదు. ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. కానీ వలసజీవుల సంఖ్య కోట్లలో వున్నప్పుడు ఇంతమాత్రమే చాలదు. వ్యక్తులుగా ఎవరికి వారు స్పందించగలిగితేనే ఏదోమేరకు మెరుగైన సాయం అందుతుంది. కానీ సాయం మాట అటుంచి వున్న గూడును ఖాళీ చేయించి పొమ్మనేవారు, చేయడానికి పనులు లేవు గనుక ఫ్యాక్టరీ ఆవరణ విడిచివెళ్లమనేవారు, పని ఆగిపోయింది గనుక నిర్మాణాలవుతున్నచోటులో వుండొద్దని హుకుం జారీచేసేవారు ఎక్కువయ్యారు. (చదవండి: 15 నుంచి ‘వందే భారత్’ రెండో విడత) ‘నన్ను కాదనుకున్న నగరంలో ఆకలితో చావడానికి సిద్ధంగా లేనని, అందుకే ఇంటిబాట పట్టాన’ని బిహార్ కార్మికుడొకరు ఆక్రోశించాడంటే ఈ నలభైరోజుల అనుభవం వారిపై ఎలాంటి ముద్ర వేసిందో అర్ధమవుతుంది. నిర్మాణరంగం పునఃప్రారంభానికి వలస కూలీలు అవసరం గనుక రైళ్లు రద్దు చేస్తున్నామని రెండురోజులక్రితం కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన వైనం కూడా వలసజీవులను అవమానించేదే. ఇన్నిరోజులుగా తిండితిప్పలు లేనప్పుడు పట్టించుకోనివారికి వలసజీవుల్ని బలవంతంగా ఆపే హక్కుంటుందా? వారి అవసరం నిజంగా వుందనుకుంటే అద నంగా చెల్లిస్తామని, ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తా మని ఒప్పించాలి. ఎందుకోగానీ చివరకు ఈ మతిమాలిన చర్యను కర్ణాటక వెనక్కి తీసుకుంది. కష్టాలతో నిండిన వర్తమానం నుంచి తప్పిం చుకోవాలని, కొద్దో గొప్పో మెరుగైన జీవితాన్ని అందుకోవాలని వలసజీవులు నిరంతం పరుగు లెడుతూవుంటారు. కానీ విపత్కర పరిస్థితులు ఏర్పడితే ఎవరూ తమను ఆదుకోరని వలసజీవులకు ఈ లాక్డౌన్ అర్ధం చేయించింది. ఇదంతా సజావుగా ముగిసి ప్రభుత్వాలు వారి జీవితాలకు భరోసా కలిగించే విధానాలను రూపొందించగలిగితే ఇప్పుడు మహారాష్ట్రలో రైలుపట్టాలపై అసువులుబాసిన వలసజీవుల ఆత్మలు శాంతిస్తాయి. -
ఔరంగాబాద్ రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశం
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు రైల్వేశాఖ తెలిపింది. పట్టాలపై జనాలు ఉండటాన్ని గమనించిన లోకో పైలట్.. రైలును నిలిపివేసేందుకు ప్రయత్నించారని కానీ ఆ ప్రయత్నం విఫలమైందని రైల్వేశాఖ వెల్లడించింది. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 16మంది మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కర్మద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔరంగాబాద్-జల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 6:30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. (మరో ప్రమాదం; ప్రధాని మోదీ ఆవేదన) మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. లాక్డౌన్ వల్ల జల్నాలోని ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేసే వలస కూలీలు మధ్యప్రదేశ్‌కు తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. జల్నా నుంచి భూస్వాల్ వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి రైలులో మధ్యప్రదేశ్ వెళ్లాలని వారు భావించారు. అయితే దాదాపు 45 కి.మీ దూరం నడిచాక వారు రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. -
రైలు ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఈ ఘటనపై హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రైలు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధను కలిగించిందని అమిత్ షా అన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్, ఇతర రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు చెప్పారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (చదవండి : రైలు ప్రమాదంలో 16 మంది వలస కూలీల మృతి) రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. ‘మహారాష్ట్రలో రైలు ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఇది చాలా విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని చెప్పారు. కాగా, ఔరంగాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 16మంది మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. (చదవండి : మరో ప్రమాదం; ప్రధాని మోదీ ఆవేదన) -
మరో ప్రమాదం; ప్రధాని మోదీ ఆవేదన
న్యూఢిల్లీ: విశాఖ గ్యాస్‌లీక్ ఘటన జరిగిన తర్వాతి రోజే దేశంలో మరో దుర్ఘటన చోటుచేసుకోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఔరంగాబాద్ రైలు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి చెందారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు రైల్వే మంత్రి తీసుకుంటున్నారని ట్విటర్లో ప్రధాని మోదీ వెల్లడించారు. ఔరంగాబాద్ ప్రమాదంపై రైల్వే మంత్రి పియూష్ గోయల్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాద కారణాలపై విచారణకు ఆదేశించినట్టు ట్విటర్లో పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో శుక్రవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటనలో 16 మంది మృతిచెందగా.. ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఔరంగాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దక్షిణమధ్య రైల్వే(ఎస్సీఆర్) పరిధిలోని నాందేడ్ డివిజన్లో ఔరాంగాబాద్-జాల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగిందని ఎస్సీఆర్ ముఖ్య సమాచార అధికారి తెలిపారు. ఔరాంగాబాద్ జిల్లా కర్మాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. మృతులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారని చెప్పారు. (నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిన రైలు) -
రైలు ప్రమాదంలో 16 మంది వలస కూలీల మృతి
ఔరంగాబాద్ : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 16మంది మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కర్మద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌరంగాబాద్-జల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 5.15 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. లాక్డౌన్ వల్ల జల్నాలోని ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేసే వలస కూలీలు మధ్యప్రదేశ్‌కు తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. జల్నా నుంచి భూస్వాల్ వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి రైలులో మధ్యప్రదేశ్ వెళ్లాలని వారు భావించారు. అయితే దాదాపు 45 కి.మీ దూరం నడిచాక వారు రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే పట్టాలపై జనాలు ఉండటాన్ని గమనించిన లోకో పైలట్.. రైలును నిలిపివేసేందుకు ప్రయత్నించారని కానీ ఆ ప్రయత్నం విఫలమైందని రైల్వేశాఖ వెల్లడించింది. -
నిర్భయ కేసు: 20న ఉరి; విడాకులు కోరిన అక్షయ్ భార్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరి నుంచి తప్పించుకునే మార్గాలు అన్నీ దాదాపుగా మూసుకుపోయాయి. ఈ సమయంలో నిర్భయ దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ భార్య పునీత విడాకులు కావాలంటూ మరో పిటిషన్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు మంగళవారం రోజున ఔరంగాబాద్ ప్యామిలీ కోర్టులో విడాకుల కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ‘‘అత్యాచారం కేసులో నా భర్తను దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారు. కానీ నా భర్త నిర్దోషి. రేప్ కేసులో ఉరితీసిన దోషి భార్యగా నేను ఉండాలనుకోవడం లేదు’’ అంటూ ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ మార్చి 19న విచారణకు రానుంది. ఈ విషయం గురించి పునీత తరఫు న్యాయవాది ముకేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘హిందూ వివాహ చట్టం 13(2)(11) ప్రకారం కొన్ని ప్రత్యేక కేసుల్లో విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్రత్యేక కేసుల్లో అత్యాచారం కూడా ఉంది. తన భర్త అత్యాచారం కేసులో దోషి అని తేలితే భార్య విడాకులు తీసుకోవచ్చు’’ అని ఆయన తెలిపారు. అయితే కొందరు న్యాయనిపుణులు ఆమె పిటిషన్‌ను విమర్శిస్తున్నారు. నేరం జరిగిన 8 ఏళ్ల తర్వాత, శిక్ష పడిన చాలా రోజుల తర్వాత విడాకుల పిటిషన్ వేస్తే కోర్టు అక్షయ్ కుమార్‌కు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అన్నారు. చదవండి: నేనప్పుడు అసలు ఢిల్లీలో లేను: నిర్భయ దోషి కాగా, నిర్భయ కేసులో నలుగురు దోషులకు మార్చి 20వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2012లో వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆరుగురు దోషుల్లో ఒకరు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. ప్రధాన దోషి రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముఖేశ్ సింగ్ తల్లి విజ్ఞప్తిని తిరస్కరించిన ఎన్హెచ్ఆర్సీ నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేశ్ సింగ్ తల్లి ఉరిశిక్ష అమలుపై జోక్యం చేసుకోవాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను తోసిపుచ్చినట్లు ఎన్హెచ్ఆర్సీ అధికారులు తెలిపారు. చదవండి: అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు -
అజహరుద్దీన్‌పై ఎఫ్ఐఆర్..
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌పై ఔరంగాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అజహరుద్దీన్‌తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదయినట్లు తెలుస్తోంది. అజహరుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు కలిసి తనను రూ. 20 లక్షల మేర మోసం చేశారని ఔరంగాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలు, ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై అజహరుద్దీన్ స్పందించారు. ఔరంగాబాద్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అర్థం లేనిదని ఖండించారు. తప్పుడు ఆరోపణలపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తన లీగల్ టీమ్‌తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అజహరుద్దీన్ పేర్కొన్నారు. -
బడి ఎగ్గొట్టి మరీ బాగుచేశారు
ఔరంగాబాద్: రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో మహారాష్ట్రలోని ఓ గ్రామానికి ఉన్న బస్సు సౌకర్యం రద్దయింది. దీంతో స్వయంగా విద్యార్థులే ఓ రోజు బడికి డుమ్మా కొట్టి రోడ్డు బాగుచేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఔరంగాబాద్ జిల్లా ధమన్‌గావ్‌రాజూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలివీ.. ధమన్‌గావ్‌రాజూర్‌కు 2019లో ముఖ్యమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద 18 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి, మధ్యలోనే వదిలేశారు. అయితే ధమన్‌గావ్‌రాజూర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దభాదీ గ్రామంలో స్కూలు ఉంది. ఆ స్కూల్లో ధమన్‌గావ్ రాజూర్ పిల్లలు చదువుకుంటున్నారు. అయితే రోడ్డు సరిగా లేక గతేడాది డిసెంబర్లో ఆ గ్రామానికి బస్సు సౌకర్యం నిలిచిపోయింది. దీంతో ధమన్గావ్రాజూర్ విద్యార్థులు స్కూలుకు నడిచి వెళ్తున్నారు. రోజుకు రెండు గంటలపాటు నడకతోనే వారికి సరిపోతోంది. దీంతో విద్యార్థులు ఈ నెల 10న స్కూలు మానేసి కిలోమీటర్ మేర రోడ్డును బాగుచేసుకున్నారు. ‘ఈ రోడ్డును పూర్తిస్థాయిలో మార్చి నాటికి సిద్ధం చేస్తాము’అని రోడ్డు కాంట్రాక్టర్ వైకే దేశ్‌ముఖ్ తెలిపారు. -
హంతకుడిని పట్టించిన గుండీ
ఔరంగాబాద్: చిన్న ఆధారమూ క్రిమినల్ కేసులో ఎంత కీలకంగా మారుతోందో చెప్పే ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఔరంగాబాద్‌లో బికన్ నిలోబ జాదవ్‌ను ఏడు నెలల క్రితం కొందరు హత్య చేశారు. ఘటనా స్థలంలో పోలీసులకు గుండీ మాత్రమే దొరికింది. గుండీ మీద రోప్లాస్ట్ స్టిచ్ అనే అక్షరాలు ఉండటంతో పోలీసులు ఆయా విక్రేతల నుంచి ఎవరెవరు చొక్కాలు కొనుగోలు చేశారో పరిశీలించారు. దాదాపు 10 వేల మంది వారి నుంచి చొక్కాలను కొనగా అందులో 246 మందికి నేరచరిత్ర ఉంది. అందులో హత్యకు నాలుగు రోజుల ముందు రగాడే అనే వ్యక్తి కత్తులను కొనుగోలు చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో మిగిలిన వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అజయ్ రగాడే, చేతన్ గైక్వాడ్, సందీప్ గైక్వాడ్‌లు ఈ హత్య చేసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. -
స్మారక నిర్మాణం కోసం చెట్లను నరకొద్దు: సీఎం
ముంబై: శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఔరంగబాద్‌లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం చెట్లను నరికివేయరాదని సోమవారం మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణానికి ఒక్క చెట్టును నరికివేయడానికి వీల్లేదని, చెట్లకు ఎటువంటి హాని తలపెట్టకుండానే ప్రతిపాదిత స్మారక నిర్మాణం చేపట్టనున్నట్లు ఈ మేరకు పార్టీ సీనియర్ నేత, ఔరంగబాద్ మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే ఒక ప్రకటనలో తెలిపారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం వెయ్యికి పైగా చెట్లు నరికివేతకు గురవుతున్నాయని ఆదివారం పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, మీడియా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంతో తాజాగా చెట్లను నరికి వేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే పర్యావరణానికి సంబంధించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. స్మారక నిర్మాణం కోసం ప్రియదర్శిని గార్డెన్లో చెట్లను నరికివేస్తామని సేన ఎన్నడు చెప్పలేదు. సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఆదివారం సాయంత్రం మౌఖిక ఆదేశాలు అందాయని.. ఉత్తర్వులను కచ్చితంగా పాటిస్తామని ఈ మేరకు ఖైరే పేర్కొన్నారు. ప్రియదర్శిని ఉద్యానవనంలో కనీసం 80 రకాల పక్షులు ఉన్నాయి. వాటిలో 52 భారత సంతతికి చెందగా మిగిలినవి విదేశీ పక్షులు. 35 రకాల సీతాకోక చిలుకలు, ఏడు రకాల పాములతో పాటు 80 రకాల కీటకాలతో పాటు సరిసృపాలకు నివాసంగా ఉంటూ ప్రధాన ఆక్సిజన్ వనరుగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఆదివారం శివసేనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
తొమ్మిదేళ్ల చిన్నారికి పెళ్లి!
ఔరంగాబాద్: డబ్బుకు ఆశపడి తొమ్మిదేళ్ల చిన్నారికి పెళ్లి చేయాలని చూసిన ఓ మహిళను ఔరంగాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా మజల్గావ్లో చోటు చేసుకుంది. ఆశామతి గోలప్ అనే మహిళ రూ. 30 వేల కోసం తన బిడ్డను, మిత్రురాలి కొడుక్కిచ్చి బాల్యవివాహం చేయడానికి నిశ్చయించింది. ఆదివారానికి పెళ్లి ముహూర్తం పెట్టుకోగా, స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు పెళ్లి వేదికకు చేరుకుని ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులపై బాల్య వివాహాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం
-
మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. గణనీయమైన స్థానాలు గెలుపొందనప్పటికీ.. మైనారిటీ ఓట్లను చీల్చడం ద్వారా పలు పార్టీల గెలుపోటములు శాసించగలిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. దాదాపు 44 స్థానాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడేవి. అటు హిందుత్వ కూటమిగా బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో మైనారిటీలు సహజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపేవారు. అయితే, ఈసారి మస్లిజ్ పార్టీ పెద్ద ఎత్తున స్థానాల్లో పోటీచేసి.. గట్టిగా ప్రచారం చేయడంతో కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది. కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న మైనారిటీ ఓట్లు చీలడం.. బీజేపీ-శివసేన కూటమికి వరంగా మారింది. దీంతో కాంగ్రెస్‌కు పట్టున్న కొన్ని స్థానాల్లోనూ బీజేపీ కూటమి సునాయసంగా గెలువగలిగింది. మహారాష్ట్రలోని మైనారిటీ ఓట్లను ఏకతాటిపైకి తేవడంలో ఆ పార్టీ విఫలమైన పరిస్థితి కనిపిస్తోంది. మైనారిటీ పార్టీగా పేరొందిన ఎంఐఎం పోటీ.. చాలాస్థానాల్లో కాంగ్రెస్ విజయ అవకాశాలకు గండికొట్టింది. మైనారిటీ ఓటర్లు మజ్లిస్ వైపు మొగ్గడం కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిలో రెండోస్థానానికి పడిపోయింది. గతంలో గెలుచుకున్న స్థానాలను కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఒకవైపు బీజేపీ-శివసేన కూటమి మరోసారి కంఫర్టబుట్ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోగా.. మరోవైపు మరాఠా కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 50కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ.. పర్వాలేదనిపించగా.. కాంగ్రెస్ మాత్రం 37 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఔరంగాబాద్‌లో సంచలనం ఔరంగాబాద్ నియోజకవర్గంలో సంచలన విజయం దిశగా ఎంఐఎం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతానికిపైగా ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి దక్కడం గమనార్హం. ఎన్నికల చరిత్రలోనే ఒక అభ్యర్థికి ఈస్థాయి ఓట్లు రావడం అనేది ఇదే తొలిసారి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్ నియోజకవర్గంలో రికార్డుస్థాయి మెజారిటీతో సంచలన విజయం దిశగా ఎంఐఎం సాగుతోంది. మరో నియోజకవర్గంలోనూ ఎంఐఎం బొటాబొటి మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతోంది. -
రాళ్లతో దాడిచేసి.. బీభత్సం సృష్టించారు!
ఔరంగాబాద్: శివసేన పార్టీ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాధవ్ ఇంటిపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు దాడి చేసి.. బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో కొందరు దుండగులు జాధవ్ ఇంటిపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో జాధవ్ ఇంటి కిటికీ అద్దాలు, కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌కు కూడా గాయాలయ్యాయి. దాడి సమయంలో జాధవ్ భార్య, వారి ఇద్దరు కొడుకులు ఇంట్లోనే ఉన్నారు. శివసేన పార్టీని వీడిన జాధవ్ తాజా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఔరంగాబాద్‌లోని కన్నడ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇటీవల ఓ ఎన్నికల సభలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేసినట్టు జాధవ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఠాక్రే పట్ల అభ్యంతర భాషను వాడుతూ ఆయన మాట్లాడినట్టు భావిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే జాధవ్ ఇంటిపై దాడి జరిగింది. ‘జై భవానీ, జై శివాజీ’ అనే నినాదాలుచేస్తూ దుండగులు తమ ఇంటిపై దాడి చేశారని జాధవ్ భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శివసేన సీనియర్ నాయకుడైన హర్షవర్థన్ జాధవ్ పార్టీ అధినాయకత్వం తీరు నచ్చక ఇటీవల పార్టీని వీడారు. కాంగ్రెస్ మాజీ మంత్రి అబ్దుల్ సత్తార్‌ను ఠాక్రే శివసేనలోకి తీసుకోవడం జాధవ్‌కు నచ్చలేదు. సత్తార్ శివసేన అభ్యర్థిగా శిలోద్ నుంచి పోటీ చేస్తున్నారు. -
రూ. 200 అప్పు తీర్చడం కోసం 30 ఏళ్ల తర్వాత
ముంబై : వేల కోట్ల రూపాయలు అప్పు చేసి... ఆ తర్వాత ఎంచక్కా దేశం దాటి పోతున్న ఈ రోజుల్లో చేసిన అప్పు తీర్చడం కోసం ఓ వ్యక్తి ఏకంగా కెన్యా నుంచి 30 ఏళ్ల తర్వాత ఇండియా రావడం నిజంగా గ్రేటే. ఆ వచ్చిన వ్యక్తి ఎంపీ కావడం ఇక్కడ విశేషం. వివరాలు.. 79 ఏళ్ల కాశీనాథ్ గావ్లీ ఇంటికి రెండు రోజుల క్రితం ఓ అనుకోని అతిథి వచ్చాడు. తన పేరు రిచర్డ్ టోంగ్ అని.. కెన్యా దేశ ఎంపీనని చెప్పాడు. 30 ఏళ్ల క్రితం కాశీనాథ్ తనకు రూ. 200 సాయం చేశాడని.. ఆ సొమ్మును తిరిగి చెల్లించడానికి వచ్చానన్నాడు. ఆశ్చర్యపోవడం కాశీనాథ్ వంతయ్యింది. ఈ విషయం గురించి రిచర్డ్ మాట్లాడుతూ.. ‘1985-89 కాలంలో నేను మేనేజ్మెంట్ కోర్సు చడవడం కోసం ఇండియా వచ్చాను. అప్పుడు నేను వాంఖేడ్‌నగర్ ప్రాంతంలో ఉండేవాడిని. కాశీనాథ్ గారి కుటుంబం కూడా అదే ప్రాంతంలో కిరాణ షాపు నడుపుతుండేవారు. ఆ సమయంలో ఓ సారి డబ్బులు లేక నేను ఇబ్బంది పడుతుంటే కాశీనాథ్ గారు నాకు రూ. 200 సాయం చేశారు. అప్పుడు ఆ అప్పును తిరిగి చెల్లించే పరిస్థితిలో నేను లేను. కానీ ఆయన సాయాన్ని మాత్రం మర్చిపోలేకపోయాను. ఎప్పటికైనా కాశీనాథ్ గారి రుణాన్ని తీర్చుకోవాలని.. ఆయనకు కృతజ్ఞత తెలపాలని మనసులోనే అనుకునే వాడిని. ఇప్పటికి నాకు కుదిరింది’ అన్నారు రిచర్డ్. ‘నన్ను చూసి కాశీనాథ్ గారు చాలా ఆశ్చర్యపోయారు. నా రాక పట్ల ఎంతో సంతోషం వెలిబుచ్చారు. భోజనం నిమిత్తం నేను హోటల్‌కి వెళ్లాలని భావించాను. కానీ అందుకు ఆయన ఒప్పుకోలేదు. వారితో పాటు కలిసి భోంచేసేలా నన్ను బలవంతపెట్టారని తెలిపారు రిచర్డ్. ప్రస్తుతం తాను కెన్యాలో ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను’ అన్నారు రిచర్డ్. తిరిగి వెళ్లేటప్పుడు కాశీనాథ్‌ను తమ దేశం రావాల్సిందిగా ఆహ్వానించారు రిచర్డ్. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. -
ఎవరికి జిందాబాద్?
ఔరంగజేబు పేరుతో ఏర్పడిన ఔరంగాబాద్ చారిత్రక నగరంలో విజయావకాశాన్ని చేజిక్కించుకునేందుకు చాలా ఏళ్లుగా ఇక్కడ వేళ్లూనుకున్న శివసేనతో కాంగ్రెస్ తలపడబోతోంది. పురాతన కట్టడాలైన అజంతా ఎల్లోరా గుహలు ఈ నగరం చుట్టుపక్కల వ్యాపించి ఉంటాయి. దేశ విదేశాల నుంచి సందర్శించడానికి వచ్చే టూరిస్టులతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ కళకళలాడుతుంటుంది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సందర్భంలో తప్ప దాదాపు అన్నిసార్లూ ఈ ప్రాంత ప్రజలు శివసేనకే పట్టం కట్టడం గమనార్హం. ఔరంగబాద్ లోక్‌సభ స్థానాన్ని 30 ఏళ్లుగా.. 1989 నుంచి శివసేన పార్టీ నిలబెట్టుకుంటూ వస్తోంది. 1998లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుతం ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది శివసేన సిట్టింగ్ ఎంపీ చంద్రకాంత్ బావూరావ్ ఖైరే. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ నితిన్ సురేష్‌పై లక్షా 62 వేల మెజారిటీతో చంద్రకాంత్ బావూరావ్ ఖైరే విజయం సాధించారు. ఈసారి సైతం శివసేన నుంచి ఆయనే బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఐదోసారీ బరిలో.. శివసేనకు బలమైన పునాదులున్న ఈ నియోజకవర్గంలో ఈసారి కూడా చంద్రకాంత్ బావూరావ్ ఖైరే గెలుపుని కైవసం చేసుకుంటే వరుసగా ఐదుసార్లు ఆయన విజయపరంపర కొనసాగినట్లవుతుంది. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు విజయఢంకా మోగించిన చంద్రకాంత్‌కు ఈసారి ప్రజలు పట్టం కడతారా అనేది వేచి చూడాల్సి ఉంది. చంద్రకాంత్ పశ్చిమ ఔరంగాబాద్ నుంచి 1990 లోనూ, 1995లోనూ రెండుసార్లు శాసనసభకు కూడా ఎన్నికయ్యారు. శివసేన ప్రభుత్వంలో మహారాష్ట్రలో 1995 నుంచి 1999 వరకు క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ జాంబాద్ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పార్లమెంటు స్థానానికి సుభాష్ జాంబాద్.. శివసేన అభ్యర్థి చంద్రకాంత్‌తో తలపడబోతున్నారు. గత ఎన్నికల్లో చంద్రకాంత్ ఖైరేకు 5,20,902 ఓట్లు వచ్చాయి. ఈయన ప్రత్యర్థి నితిన్ సురేష్ పాటిల్‌కి 3,58,902 వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి 37,419 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి ఈ స్థానం నుంచి కాంగెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న సుభాష్ మానిక్ చంద్ జాంబాద్‌కు మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. స్థానికంగా పలు సేవాకార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ ప్రజల నోళ్లలో నానుతోన్న సుభాష్ జాంబాద్ ఈసారి శివసేనకు గట్టిపోటీ ఇచ్చే బలమైన అభ్యర్థిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంఐఎం నుంచి పాత్రికేయుడు ఈసారి 23 ఏళ్ల పాత్రికేయ అనుభవం ఉన్న జర్నలిస్టు ఇంతియాజ్ జలీల్ ఔరంగాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఏఐఎంఐఎం తరఫున పోటీ చేస్తున్నారు. ఎన్డీ టీవీలో 12 ఏళ్లు, లోక్‌మత్‌లో 11 ఏళ్ల అనుభవం ఉన్న ఇంతియాజ్ జలీల్ 2014లోనే తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనే ఔరంగాబాద్ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. నిజానికి మహారాష్ట్రలోని ప్రకాశ్ అంబేడ్కర్ సారథ్యంలోని వంచిత్ బహుజన్ అఘాదీ పార్టీతో పొత్తుపెట్టుకొని ఔరంగాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని ఎంఐఎం తొలుత భావించింది. అయితే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఔరంగాబాద్ అభ్యర్థిగా ఇంతియాజ్ జలీల్‌ను ఎంపిక చేశారు. దళితుల్లోనూ, ముస్లిం మైనారిటీల్లోనూ మంచి వ్యక్తిగా ఔరంగాబాద్‌లో ఇంతియాజ్‌కు గుర్తింపు ఉంది. తస్లీమాను అడ్డుకుని.. ప్రపంచ ప్రఖ్యాత అజంతా ఎల్లోరా గుహలను సందర్శించేందుకు 2017లో మహారాష్ట్ర వచ్చిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ను ఎయిర్ పోర్టులోనే అడ్డుకోవడంలో ఎంఐఎం నాయకుడు ఇంతియాజ్ జలీల్ది కీలక పాత్ర. ఎయిర్‌పోర్టు బయట తస్లీమా నస్రీన్‌కి వ్యతిరేకంగా ఎంఐఎం నిరసనకు దిగడంతో పోలీసులే ఆమెను మహారాష్ట్ర నుంచి తిప్పి పంపించి వేశారు. మొత్తంగా ఓ పక్క హిందుత్వ శివసేన, మరోవైపు ఇస్లాం నేపథ్య ఎంఐఎం, ఇంకోపక్క పోటాపోటీగా దూసుకొస్తోన్న కాంగ్రెస్ మధ్య ఈసారి ఔరంగాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇంతియాజ్, చంద్రకాంత్, సుభాష్ జాంబాద్ -
సీటివ్వలేదని కుర్చీలెత్తుకెళ్లాడు..
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లు కోపాన్ని, అసంతృప్తిని తలోరకంగా వ్యక్తం చేస్తారు. కొందరు తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగితే, మరి కొందరు టికెట్ ఇచ్చే మరో పార్టీలోకి దూకేస్తారు. అయితే, మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ పార్టీ ఆఫీసులోని కుర్చీలను ఎత్తుకెళ్లిపోయి తన కోపాన్ని వినూత్నంగా వెల్లడించాడు. సిలోడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సత్తార్ ఔరంగాబాద్ లోక్‌సభ టికెట్ కోసం ప్రయత్నించాడు. అయితే, అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో కోపించిన సత్తార్ స్థానిక పార్టీ కార్యాలయం ‘గాంధీభవన్’లో ఉన్న 300 కుర్చీలను తన మద్దతుదారుల సాయంతో ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆ కుర్చీలన్నీ తనవేనని, టికెట్ ఇవ్వనందున తాను కాంగ్రెస్‌ను వదిలేస్తున్నానని చెప్పాడు. తాను పార్టీలో లేనప్పుడు తన కుర్చీలు ఎందుకుండాలని చెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయానని వివరణ ఇచ్చాడు. మిత్రపక్షమైన ఎన్సీపీతో కలిసి గాంధీభవన్‌లో సమావేశం జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సంగతి తెలిసిన సత్తార్ సమావేశానికి ముందే కుర్చీలన్నీ తీసుకెళ్లాడు. కుర్చీలు లేకపోవడంతో సమావేశాన్ని ఎన్సీపీ ఆఫీసుకు మార్చాల్సి వచ్చింది. అలా అని సత్తారేమీ తక్కువోడు కాదు. జిల్లాలో ఆయనకు పలుకుబడి బాగా ఉంది. పార్టీ నాయకులు మాత్రం సత్తార్‌కు ఏదో అవసరం వచ్చి కుర్చీలు తీసుకెళ్లాడని, టికెట్ ఇవ్వనందుకు ఆయనకేం కోపం లేదని సర్దిచెబుతున్నారు. -
‘మోదీ జాకెట్’కు గిరాకీ తగ్గింది
ఔరంగాబాద్: 2014 ఎన్నికల సందర్భంగా విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చిన మోదీ జాకెట్లకు ప్రస్తుతం గిరాకీ పూర్తిగా తగ్గిపోయిందని పలువురు వస్త్ర వ్యాపారులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ధరించే ఈ జాకెట్ హాఫ్ స్లీవ్‌తో ఉంటుంది. ‘మా దుకాణంలో ఒకప్పుడు రోజుకు సుమారు 35 జాకెట్లు అమ్ముడుపోయేవి. కానీ ఇప్పుడు వారానికి ఒకటి మాత్రమే అమ్ముతున్నామ’ని స్థానిక వస్త్ర వ్యాపారి ఒకరు చెప్పారు. మరో వ్యాపారి గుర్విందర్ సింగ్ మాట్లాడుతూ జీఎస్టీ, నోట్లరద్దు ప్రభావం ఇతర దుస్తులపై చూపిన విధంగానే ఈ జాకెట్ల అమ్మకాలపై కూడా పడిందని అన్నారు. గుల్మండి, తిలక్ పాత్, ఔరంగ్పురా, సరఫా, ఉస్మాపురా, సిడ్కో ప్రాంతాల్లోని పలువురు వస్త్ర వ్యాపారులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ‘మా దుకాణంలో రెడీమేడ్ వస్త్రాలతోపాటు ఈ జాకెట్లకు సంబంధించిన వస్త్రాన్ని కూడా నిల్వగా పెట్టుకున్నాం. గతేడాది నుంచి 10 జాకెట్ల కంటే ఎక్కువ అమ్మలేదు. దీనిపై నేను పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాను. కానీ ఎటువంటి లాభం లేద’ని వస్త్ర దుకాణ వ్యాపారి రాజేంద్ర భాస్కర్ చెప్పారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ప్రజలు ఎక్కువగా ఖాదీ, లెనిన్, కాటన్ షర్టులపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని, ఇలాంటి జాకెట్లు ఎవరూ కుట్టించుకోవడం లేదని స్థానికంగా టైలర్ దిలీప్ లోఖండే అన్నారు. -
మహీంద్రా సీఐఈ చేతికి ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్
న్యూఢిల్లీ: ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్ కంపెనీని(ఏఈఎల్) వాహన విడిభాగాల సంస్థ, మహీంద్రా సీఐఈ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌కు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని మహీంద్రా సీఐఈ వెల్లడించింది. ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్‌లో మొత్తం వాటాను రూ.876 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ సీఈఓ అండెర్ అరెనాజ తెలిపారు. ఈ కంపెనీ కొనుగోలుతో తాము అల్యూమినియం డై కాస్టింగ్ టెక్నాలజీ రంగంలోకి ప్రవేశిస్తామని చెప్పారాయన. వచ్చే నెల 10లోపు ఈ డీల్ పూర్తవ్వగలదని అంచనా. కాగా, ఎమ్‌సీఐఈ, సీఐఈలతో భాగస్వామ్యం తమ కంపెనీకి మంచి జోరునిస్తుందని ఏఈఎల్ సీఎండీ రిషి బగ్లా చెప్పారు. 1985లో ప్రారంభమైన ఔరంగాబాద్ ఎలక్ట్రికల్స్ కంపెనీ అల్యూమినియం డై–కాస్టింగ్ రంగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి ఔరంగాబాద్, పుణే, పంత్‌నగర్‌లలో ఐదు ప్లాంట్లున్నాయి. వీటిలో మొత్తం 3,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వార్షిక విక్రయాలు రూ.850 కోట్ల మేర ఉన్నాయి. ఇక స్పెయిన్‌కు చెందిన సీఐఈ ఆటోమోటివ్‌లో భాగమైన మహీంద్రా సీఐఈలో మహీంద్రా గ్రూప్‌నకు 11.5 శాతం వాటా ఉంది. -
‘భార్యాబాధితుల’ వెరైటీ నిరసన
ముంబై : దసరా పండుగ నాడు దేశ వ్యాప్తంగా రావణాసుర వధ జరగడం ఆనవాయితి. కానీ మహారాష్ట్రలో మాత్రం వెరైటీగా రావణాసురిడి సోదరి శూర్పనఖ బొమ్మను దహనం చేశారు. ఇది ఎక్కడి వింత ఆచారం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది ఆచారం కాదు.. భార్యల వల్ల పడుతున్న అగచాట్లను తెలియజేయడం కోసం ఇలా శూర్పనఖ దిష్టి బొమ్మను కాల్చారు. ఈ వెరైటీ సంఘటన ఔరంగాబాద్‌లోని కరోలి గ్రామంలో చోటు చేసుకుంది. ‘పత్ని పీడిత్ పురుష్ సంఘటన’(భార్య బాధితుల సంఘం) సభకు చెందిన సభ్యులు తమను వేధిస్తున్న భార్యల పట్ల నిరసన వ్యక్తం చేయడం కోసం ఈ పనికి పూనుకున్నారు. ఈ విషయం గురించి సదరు సంఘానికి చెందిన ఓ వ్యక్తి ‘మా భార్యలు మమ్మల్ని చాలా బాధపెడుతున్నారు. మన దేశంలో చట్టాలన్ని మహిళలకే అనుకూలంగా ఉన్నాయి. వీటిని అడ్డు పెట్టుకుని భార్యలు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము దీన్ని ఖండిస్తున్నాము. భార్యల వేధింపులకు గుర్తుగా మేము ఈ రోజు ఇలా శూర్పనఖ దిష్టి బొమ్మను దహనం చేశాము’ అని తెలిపారు. -
బీజేపీ నేతల చేతిలో చావుదెబ్బలు.. జైలుకు!
ఔరంగాబాద్ : మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించిన ఏఐఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ మటీన్ రషీద్‌ను ఏడాది పాటు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఔరంగాబాద్ పోలీసులు ఓ సంవత్సరం కాలం మటీన్‌ను జైలులో విచారించనున్నారు. ఏఐఎంఐఎం కార్పొరేటర్‌పై మహారాష్ట్ర చట్టం ఎంపీడీఏ-1981 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇటీవల వాజ్‌పేయి మరణానంతరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్ రాజు విద్యా సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఎంఐఎం సభ్యుడు సయ్యద్ మటీన్ వ్యతిరేకించారు. దీంతో రగిలిపోయిన బీజేపీ సభ్యులు ఆవేశంతో దాడికి దిగి సయ్యద్‌ను చితకబాదారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారి నుంచి సయ్యద్‌ను కాపాడి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. మటీన్‌పై దాడి చేసిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (‘వాజ్‌పేయికి నివాళి అర్పించను’.. రచ్చ రచ్చ!) అయితే గతంలోనూ జాతీయ గీతాన్ని ఆలపించడానికి మటీన్ నిరాకరించాడని.. ప్రస్తుతం వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించారని బీజేపీ కార్పొరేటర్లు తెలిపారు. మటీన్ తన చర్యల ద్వారా హిందూ-ముస్లిం మతాల విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం చేశారని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు సిటీ చౌక్ పోలీసులు మటీన్‌ను అరెస్ట్ చేసి హర్సల్ జైలుకు తరలించారు. మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పనులు చేస్తే ఎంపీడీఏ కింద ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాల్సి ఉంటుందని కమిషనర్ చిరంజీవ్ ప్రసాద్ వివరించారు. -
వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించడంతో..
-
‘వాజ్‌పేయికి నివాళి అర్పించను’.. రచ్చ రచ్చ!
సాక్షి, ముంబై, ఔరంగాబాద్ : మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాప తీర్మానంను వ్యతిరేకించిన ఓ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కార్పొరేటర్‌పై బీజేపీ కార్పొరేటర్లు దాడి చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో చోటుచేసుకుంది. వాజ్‌పేయి మృతికి సంతాపంగా మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులందరూ నివాళి అర్పించేందుకు శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాజ్‌పేయి మృతికి సంతాపం వ్యక్తం చేయాలని బీజేపీ కార్పొరేటర్ రాజు విద్యా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అతడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎంఐఎం సభ్యుడు సయ్యద్ మటీన్ వ్యతిరేకించారు. దీంతో రగిలిపోయిన బీజేపీ సభ్యులు ఒక్కసారిగి అతనిపై దాడికి దిగి సయ్యద్‌ను చితకబాదారు. వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తం కావడంతో వారి నుంచి సయ్యద్ తప్పించుకున్నారు. తీవ్ర గాయాలపాలైన మటీన్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై బీజేపీకి చెందిన ఓ నేత మాట్లాడుతూ... మాజీ ప్రధాని మృతికి సంతాపం వ్యక్తం చేయవల్సిందిగా తీర్మానం ప్రవేశపెడితే దానిని వ్యతిరేకించారని, గతంలో కూడా సభలో జాతీయ గీతం పాడటానికి అతను వ్యతిరేకించారని తెలిపారు. తమ సభ్యుడిపై దాడి చేశారన్న వార్తను తెలుసుకున్న స్థానిక ఎంఐఎం కార్యకర్తలు అక్కడున్న బీజేపీ నేతల కార్లను ధ్వంసం చేసి, కారు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. మటీన్‌పై దాడి చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
హింసాత్మకంగా మారిన రిజర్వేషన్ల ఉద్యమం
ముంబై : రిజర్వేషన్ల కోసం మరాఠా సామాజిక వర్గం చేపట్టిన ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠా క్రాంతి మోర్చా గత కొంత కాలంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం నిరసనల్లో పాల్గొన్న 28 ఏళ్ల రైతు కాకాసాహెబ్ శిండే గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ వర్గం నేతలు మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలిపునిచ్చారు. ఔరంగబాద్‌లో ఈ రోజు ఉదయం బంద్‌లో పాల్గొన్న ఓ నిరసనకారుడు కూడా ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ.. బ్రిడ్జిపై నుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరాఠా సామాజిక వర్గం తలపెట్టిన ఈ బంద్ ప్రభావం పశ్చిమ మహారాష్ట్రతో పాటు, ఔరంగబాద్, ఉస్మాన్‌బాద్, బీడ్, అహ్మాద్‌నగర్ ప్రాంతాల్లో అధికంగా ఉంది. నిరసనకారులు ఔరంగబాద్‌లో పలు వాహనాలపై దాడికి దిగారు. ఉస్మాన్‌బాద్‌లో ప్రభుత్వ కార్యాలయాల ముందు టైర్లను కాల్చివేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ క్షమాపణలు చెప్పేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని మరాఠా రిజర్వేషన్ల సమితి నేత రవీంద్ర పాటిల్ తెలిపారు. అవసరమైతే ముంబైలో తాము ఆందోళనలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఆందోళనలపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. నిరసనల్లో పాల్గొన్న రైతు ఆత్మహత్యకు పాల్పడటం బాధకరమని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఆందోళకారులను శాంతియుతంగా ఉండాలని కోరారు. కాగా ఫడ్నవీస్ ఆదివారం రోజున సోలాపూర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా అక్కడ కొందరు మరాఠా నాయకులు తనపై దాడి చేస్తారనే కారణంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై సీఎం క్షమాపణలు చెప్పాలంటూ మరాఠా సామాజిక వర్గం నేతలు ఆందోళనలు చేపట్టారు. -
కానిస్టేబుల్ కూతురిని రేప్ చేసిన డీసీపీ
ఔరంగాబాద్: మహిళకు రక్షణ కరువైన దేశంలో రక్షకభటుడే కీచకుడిగా మారిన వ్యవహారం ఇంకాస్త ఆందోళన కలిగిస్తున్నది. తన వద్ద పనిచేస్తోన్న కానిస్టేబుల్ కూతురికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ).. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎండీసీ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదైంది. దర్యాప్తు అధికారి డీసీపీ వినాయక్ ధక్నే తెలిపిన వివరాలివి... తీవ్రంగా హింసించాడు: ఔరంగాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న మహిళకు 23 ఏళ్ల కూతురుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్ శ్రీరామ్‌ను అభ్యర్థించిందా మహిళా కానిస్టేబుల్. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు. అంతటితో ఊరుకోకుండా నెలల తరబడి ఆమెను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అతని హింస తారాస్థాయికి చేరడంతో బాధితురాలు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డీసీపీ రాహుల్‌పై ఫిర్యాదు చేశారు. పోలీస్ శాఖలో కలకలం.. సెలవులో డీసీపీ: మహిళా కానిస్టేబుల్ కూతురిపైనే ఉన్నతాధికారి అకృత్యానికి పాల్పడటం మహారాష్ట్ర పోలీసు శాఖలో సంచలనం రేపింది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. ‘‘బాధితురాలి ఫిర్యాదుమేరకు ప్రాధమిక దర్యాప్తు అనంతరం డీసీపీ రాహుల్ శ్రీరామ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశాం. ప్రస్తుతం అతను సెలవుపై వెళ్లిపోయాడు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి, చార్జిషీటు దాఖలు చేస్తాం’’ అని దర్యాప్తు అధికారి వినాయక్ మీడియాకు తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. -
సంచలనం: మత ఘర్షణల్లో పోలీస్ సిబ్బంది
సాక్షి, ముంబై: ఔరంగబాద్ మత ఘర్షణలకు సంబంధించి సంచలన వీడియో ఫుటేజీ ఒకటి బయటికి పొక్కింది. ఘర్షణల్లో పాల్గొన్న కొందరికి పోలీసులు సాయం చేశారన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది. తమ కళ్ల ముందే వాహనాలను తగలబెడుతున్నా పోలీస్ సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవటం గమనార్హం. శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఆ ప్రాంతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. శనివారం వేకువ ఝామున నవాబుపుర ప్రాంతంలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఆ సమయంలో అల్లరి మూక, పోలీసు సిబ్బందితో కలిసి నడుచుకుంటూ వెళ్లింది. భారతీయ నర్సింగ్ హోం వద్దకు చేరుకోగానే పార్కింగ్‌లో ఉన్న వాహనాలపై అల్లరిమూక తమ ప్రతాపం చూపింది. కొందరు వాహనాలను ధ్వంసం చేసి ఆపై తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్లను పోసి తగలబెట్టారు. ఓ భవనంలోంచి ఓ వ్యక్తి కిటీకి గుండా ఈ ఘటనను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అయితే అల్లర్లు చెలరేగిన వెంటనే ఇంటర్నెట్ సేవలు నిలిపేయటంతో ఆ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం 9 నిమిషాల నిడివి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఘటనపై మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సిబ్బందిపై వేటు వేసి, అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించి. ఇక ఈ వీడియోపై అల్లర్లను పర్యవేక్షించిన అదనపు డీజీపీ బిపిన్ బిహారీ మాట్లాడారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుంది ఎవరైనా సరే ఉపేక్షించబోమని ఆయన అన్నారు. అల్లర్లకు కారణం.. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో గత కొన్నిరోజులుగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు కార్పొరేషన్ సిబ్బంది మోతీకరంజాలోని ఓ ప్రార్థనాలయంలో ఉన్న అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో వివాదం రాజుకుంది. తమ కనెక్షన్‌తో పాటు మరో వర్గానికి చెందిన ప్రార్థనాస్థలంలో ఉన్న అక్రమ నీటి కనెక్షన్‌ను కూడా తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేయడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో అల్లర్లు మోతీకరంజా నుంచి గాంధీనగర్, రాజా బజార్, షా గంజ్, సరఫా ప్రాంతాలకు విస్తరించాయి. రెచ్చిపోయిన ఆందోళనకారులు 100 దుకాణాలకు, 80 వాహనాలకు నిప్పుపెట్టారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(17)చనిపోగా, ఆందోళనకారులు మంట లు అంటించడంతో ఓ షాపులో 65 ఏళ్ల వృద్ధుడు దుర్మరణం చెందాడు. -
మత ఘర్షణల్లో ఇద్దరి మృతి
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ అల్లర్లను అదుపు చేసేందుకు 144 సెక్షన్‌ను విధించడంతో పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో గత కొన్నిరోజులుగా స్థానికులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు కార్పొరేషన్ సిబ్బంది మోతీకరంజాలోని ఓ ప్రార్థనాలయంలో ఉన్న అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో వివాదం రాజుకుందన్నారు. తమ కనెక్షన్‌తో పాటు మరో వర్గానికి చెందిన ప్రార్థనాస్థలంలో ఉన్న అక్రమ నీటి కనెక్షన్‌ను కూడా తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేయడంతో ఘర్షణ చెలరేగిందన్నారు. దీంతో అల్లర్లు మోతీకరంజా నుంచి గాంధీనగర్, రాజా బజార్, షా గంజ్, సరఫా ప్రాంతాలకు విస్తరించాయన్నారు. ఈ సందర్భంగా రెచ్చిపోయిన ఆందోళనకారులు 100 దుకాణాలకు, 80 వాహనాలకు నిప్పుపెట్టారని వెల్లడించారు. వీరిని అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(17)చనిపోగా, ఆందోళనకారులు మంట లు అంటించడంతో ఓ షాపులోని 65 ఏళ్ల వృద్ధుడు దుర్మరణం చెందాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ సహా 12 మంది పోలీసులు గాయపడినట్లు తెలిపారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 37 మంది నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు. -
రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 144 సెక్షన్
సాక్షి, ముంబై : రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఆ ప్రాంతం అతలకుతలమైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో శుక్రవారం రాత్రి(మే 11న) చోటుచేసుకుంది. వివరాలివి.. మాట మాట పెరిగి రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో షాపులు, కొన్ని వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని చక్కదిదే ప్రయత్నం చేశారు. అంతేకాక రెండు గ్రూపులపై టీయర్ గ్యాస్‌ను వదిలారు. సమస్య మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకు పోలీసులు సిటీ మొత్తం 144 సెక్షన్ విధించారు. ఈ ఘర్షణలో జరిగిన కాల్పులో ఓ మైనర్ బాలుడు చనిపోయినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి రెండు కమ్యూనిటీల మధ్య వివాదం నెలకొంది. దీంతో వందల మంది యువకులు రోడ్డుపైకి వచ్చి రాళ్ళను విసిరి గొడవకు పాల్పడ్డారు. కొంతమంది పోలీసులు కూడా ఈ ఘర్షణలో గాయపడినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ గొడవలో కాలిపోయిన షాపుల వారి తరపున కేసు వేయాలని అడ్వకేట్ ఖిజార్ పటేల్‌ను ఒవైసీ కోరారు. ఈ వివాదంలో నష్టపోయిన వారికి ఎంఐఎం ట్రస్ట్ తరఫున సాయం అందిస్తామని తెలిపారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని ఆయన కోరారు. -
బిల్లు చూసి షాక్.. ఆపై ఆత్మహత్య..!
సాక్షి, ముంబై : కరెంట్ బిల్లు ఓ వ్యాపారి ప్రాణాన్ని బలితీసుకుంది. రూ. 8లక్షల బిల్లు చూసిన ఆ చిరువ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఔరంగాబాద్‌లోని భరత్ నగర్లో చోటుచేసుకుంది. వివరాలివి.. జగన్నాథ్ సెల్కే(40) కూరగాయాల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ వ్యాపారి గత 20 సంవత్సరాలుగా రెండు గదుల షెడ్ తీసుకుని ఫ్యామిలీతో జీవనం సాగిస్తున్నాడు. ఏప్రిల్ నెలలో ఈ కుటుంబం 55,519 యూనిట్ల విద్యుత్ వినియోగించారని రూ. 8,64,781 బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసిన అతను తీవ్ర మనస్తాపనకు గురయ్యాడు. తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేకాక కరెంట్ బిల్లు అధికంగా రావడం వల్లనే చనిపోతున్నట్లు సూసైడ్ నోట్లో రాశారు. ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎంఎస్ఈడీసీఎల్) స్పందించింది. దీనికి ఓ సెక్షన్ ఇంజినీర్ నిర్లక్ష్యం కారణమని ఎంఎస్ఈడీసీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అతను మీటర్ రీడింగ్‌ను 6, 117.8 కేడబ్యూహెచ్ కాగా 61, 178 కేడబ్యూహెచ్గా కొట్టాడని తెలిపింది. అందుచేతనే రూ. 8, 64,781 బిల్లు వచ్చిందని ఓ ప్రకటనలో ఎంఎస్ఈడీసీఎల్ పేర్కొంది. ఈ ఘటనపై ఓ బిల్లింగ్ క్లర్కును సస్సెండ్ చేసినట్లు సమాచారం. జగన్నాథ్ ఇంట్లో మీటర్ పనిచేయనందుకు జనవరి 10న దాని స్థానంలో కొత్తమీటరు అమర్చినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. -
రాజాసింగ్‌కు తప్పిన పెను ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాజాసింగ్‌పై ఉద్దేశపూర్వకంగా దాడికి యత్నం జరిగినట్లు బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు. సభ ముగిసిన అనంతరం అర్ధరాత్రి ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 30 కిలోమీటర్లు ప్రయాణించగానే మార్గం మధ్యలో ఆయన కారును ఓ గుర్తుతెలియని వ్యక్తి లారీతో ఢీకొట్టాలని చూశాడు. అయితే రాజాసింగ్ కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. అదే సమయంలో ఎమ్మెల్యే కారు వెనకాలే వస్తున్న మరో కారును ఆ లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు లారీ క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ ప్రమాదానికి పథకం వేసి ఉండొచ్చునని ఆయన భావిస్తున్నారు. లారీతో తన కారును ఢీకొట్టాలని చూశారని ఆయన ఆరోపించారు. తన కారు డ్రైవర్ అప్రమత్తం కావడం వల్లే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని రాజాసింగ్ తెలిపారు. -
కొత్త జంటకు స్పెషల్ పాన్.. ఖరీదెంతంటే..?
సాక్షి,ఔరంగాబాద్:మహారాష్ర్టలోని ఔరంగాబాద్‌లో ఐదు దశాబ్ధాల చరిత్ర కలిగిన పాన్ షాప్‌లో 51 రకాల పాన్లున్నా ఒక పాన్ ధరమాత్రం రూ 5000 పలుకుతున్నా కస్టమర్లు దానికోసం బారులుతీరుతున్నారు. కోహినూర్ పాన్‌గా పేరొందిన ఈ కిళ్లీ ఆ షాప్‌కే హైలైట్ మరి. ఈ పాన్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ తారా పాన్ సెంటర్‌కు క్యూకడతారు. ఇండియా వయాగ్రాగా పేరొందిన కోహినూర్ పాన్ నవ దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఈ పాన్‌ను కిలో రూ 70 లక్షలు ధర పలికే స్పెషల్ కస్తూరి, కుంకుమపువ్వు (కిలోరూ 70,000), రోజ్(కిలో రూ 80,000) వంటి పదార్ధాలతో తయారుచేస్తారు. వీటితో పాటు పశ్చిమ బెంగాల్లో మాత్రమే లభ్యమయ్యే సువాసనలు వెదజల్లే ప్రత్యేక లిక్విడ్‌ను వాడతారు. ఇవేకాకుండా షాపు సిబ్బందికి కూడా తెలియని సీక్రెట్ పదార్ధాన్నీ ఈ పాన్ తయారీలో ఉపయోగిస్తారు. షాపు యజమాని మహ్మద్ సిద్ధిఖి, ఆయన తల్లికి మాత్రమే ఈ పదార్ధం తెలుసని చెబుతారు. సిద్ధిఖికి ఆయన తల్లి ఈ పాన్‌ను దానిలో కలిపే రహస్య పదార్ధం గురించి తెలిపిందని అంటారు. తాను పెళ్లయిన తర్వాతే ఈ పాన్‌ను అమ్మడం మొదలెట్టానని సిద్ధిఖి చెబుతారు. తాను వివాహం చేసుకున్నాక తన తల్లి ఈ పాన్‌ను తిని బాగుంటే దాన్ని విక్రయించాలని తనకు సూచించిందని చెప్పారు. అప్పటినుంచి ఈ పాన్‌ను తన షాపు మెనూలో చేర్చానన్నారు. క్రమేణా మౌత్‌టాక్‌తో పాన్ గురించి అందరికీ తెలిసింది. కొత్తగా పెళ్లయిన జంటలు కోహినూర్ పాన్‌ను కొనేందుకు షాపు ముందు క్యూ కడుతున్నారు. పాన్ ధర ఎక్కువగా ఉండటంతో తక్కువ ధరకు రూ 3000కే ఈ తరహా మరో పాన్‌ను సిద్ధిఖి అందుబాటులోకి తెచ్చారు. తారా పాన్ సెంటర్లో ఇప్పుడు లేడీస్ స్పెషల్ కోహినూర్ పాన్‌ను సిద్ధం చేశారు. కోహినూర్ పాన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసిన బాక్స్‌లో కస్టమర్‌కు అందించడమే కాకుండా దాంతో పాటు పెర్ఫ్యూమ్ను అందిస్తున్నారు. రోజూ 10,000 పాన్లు విక్రయించే ఈ షాపులో కోహినూర్ పాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. -
ఔరంగాబాద్‌లో అతి పెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
-
'నీ భార్యను అమ్మి.. మరుగుదొడ్డి కట్టు..'
పాట్నా: స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్(డీఎమ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన డీఎమ్ కన్వాల్ తనూజ్ గ్రామస్ధులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సూచించారు. మరుగుదొడ్డి లేకపోతే కలిగే నష్టాలను గురించి వారికి వివరించారు. ఇంతలో ఓ గ్రామస్ధుడు లేచి మరుగుదొడ్డి నిర్మించడానికి డబ్బు లేదని చెప్పాడు. దానికి స్పందించిన కన్వాల్.. డబ్బు లేకపోతే నీ భార్యను అమ్ముకోవాలని, ఆ డబ్బుతో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అందరికీ చెబుతున్నా వినండి.. మీ భార్యల గౌరవం కంటే కాపాడుకోవాలంటే మరుగుదొడ్డి తప్పక నిర్మించుకోవాలి. మీ భార్యల విలువ రూ.12 వేలు కన్నా తక్కువని అనుకుంటే మరుగుదొడ్డిని నిర్మించుకోవద్దు లేదా మరుగుదొడ్డి నిర్మించుకోండి' అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ముందుగా డబ్బు మంజూరు చేస్తే వాటిని వేరే అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని అన్నారు. దీంతో ఒక్కసారిగా సమావేశ స్ధలంలో గంభీర వాతావరణం ఏర్పడింది. డీఎమ్ పద్దతి సరిగా లేదంటూ గ్రామస్ధులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. -
టీచర్లను పబ్లిక్‌గా చితకబాదారు...
ఔరంగాబాద్ : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే విచక్షణ కోల్పోయి, విద్యార్థినులను వేధింపులకు గురి చేయడంతో స్థానిక శివసేన కార్యకర్తలు వారికి దేహశుద్ది చేశారు. ఔరంగాబాద్‌లో ఇద్దరు ఉపాధ్యాయులను పబ్లిక్‌గా చితకబాది అనంతరం పోలీసులకు అప్పగించారు. స్థానిక ఆకాష్ ఇనిస్టిట్యూట్‌లో ఈ సంఘటన జరిగింది. అక్కడ చదువుకుంటున్న విద్యార్ధినులతో... ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న శివసేన కార్యకర్తలు ఉపాధ్యాయుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఫ్యాకల్టీ తీరుకు ఇనిస్టిట్యూట్ మేనేజర్ వంతపాడటంతో ఆయన పైనా చేయిచేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లెక్చరర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
పట్నా: బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వివాహ వేడుకకు వెళ్తున్న వాహనం బోల్తా కొట్టిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఈ సంఘటన ఔరంగాబాద్ జిల్లాలోని కమా బిఘా సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు బోల్తా కొట్టడంతో అందులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 12 మందికి గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపడుతున్నారు. -
ఔరంగాబాద్ శ్రీమంతుడి వినూత్న కానుక
-
బాణాసంచా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
ఔరంగాబాద్ : మహారాష్ట్రాలోని ఔరంగాబాద్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి బాణాసంచా దుకాణాల్లో మంటలు రేగాయి. ఔరంగాబాద్‌లోని జడ్పీ మైదాన్‌లో దీపావళి సందర్భంగా బాణాసంచా స్టాల్స్ ఏర్పాటు చేశారు. పండుగకు వారం రోజుల ముందు నుంచి వ్యాపారులు ఈ స్టాల్స్ తెరుస్తారు. పెద్దఎత్తున బాణా సంచాను అదే మైదానంలో నిల్వ చేస్తారు. దీపావళి రెండు, మూడు రోజులు ఉందనగా వ్యాపారం ఊపందుకుంటుంది. అయితే ఇవాళ ఉదయం ఓ దుకాణంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మొత్తం స్టాల్స్‌కు వ్యాపించడంతో, వ్యాపారులు ప్రాణాలు దక్కించుకోవడం మినహా.. ఏమీ చేయలేని నిస్సహాయస్థితి నెలకొంది. జడ్పీ మైదానంలో పార్కింగ్‌లో ఉంచిన కార్లు, ఆటోలు, బైక్‌లు ఈ ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. కోట్ల రూపాయలు విలువ చేసే బాణాసంచా అగ్నికి ఆహుతైంది. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.