ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి టైటిల్ పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే ఫైనల్లో ఆమె రెండో సీడ్ ప్రార్థన తొంబరేతో తలపడుతుంది.
ఇక్కడి ఈఎంఎంటీసీ కోర్టుల్లో శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోరులో రాష్ట్రానికే చెందిన ఎనిమిదో సీడ్ నిధి చిలుములకు చుక్కెదురైంది. సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 400వ ర్యాంకర్ ప్రార్థన 7-6 (7/4), 6-2తో నిధిని ఓడించింది. గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ఏపీ అమ్మాయి తొలిసెట్‌లో పోరాడింది. దీంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది.
ఇందులో ప్రత్యర్థిదే పైచేయి అయింది. రెండో సెట్‌లో మాత్రం నిధి ఆశించిన మేర రాణించలేకపోయింది. మరో సెమీస్‌లో అన్‌సీడెడ్ సౌజన్య 6-4, 6-0తో ఆరో సీడ్ ప్రేరణ బాంబ్రీని కంగుతినిపించింది. ఆరంభంలో ప్రేరణ 3-1తో ఆధిక్యంలో నిలిచినప్పటికీ సౌజన్య పుంజుకొని ఆడటంతో ఆమె చతికిలబడింది. రెండో సెట్‌లో ఏ మాత్రం పోటీలేకుండానే సౌజన్య ముందంజ వేసింది. డబుల్స్ ఫైనల్లో ప్రార్థన-అంకిత రైనా జోడి 6-3, 6-3తో శ్వేత రాణా-రిషిక సుంకర ద్వయంపై గెలిచి టైటిల్ చేజిక్కించుకుంది.
తుది పోరుకు సౌజన్య, ప్రార్థన
Published Sat, Jan 11 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement
Advertisement