పాట్నా: ఆయనో ఎంపీ.. కానీ, సినిమా రేంజ్‌లో దొంగల భరతం పట్టాడు. సినిమా లెవెల్‌లో ఎనిమిది కిలోమీటర్లు చేధించి తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో చైన్ స్నాచర్లను పట్టుకున్నారు. అనంతరం వారిని.. పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. ఔరంగాబాద్‌లోని బరున్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరిత కుమారి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తను చూసేందుకు జముహర్ మెడికల్ కాలేజీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆమెను పరామర్శించింది. అనంతరం.. సరిత తన భర్త రాజేష్ గుప్తాతో కలిసి బైక్‌పై ఇంటి వెళ్తోంది. అయితే, వారిని గమనించిన ముగ్గురు దొంగలు కొద్ది రోజులు దూరం బైక్‌ను ఫాలో చేసి దొంగలు సరిత మెడలో ఉన్న చైన్‌ను లాక్కుని పారిపోయారు.
ఇక, అదే సమయంలో కారులో అటుగా వెళ్తున్న ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ దొంగలను చూశారు. వెంటనే అప్రమత్తమై.. దొంగలు పారిపోతున్న వైపుగా వెళ్లమని కారును తిప్పమని డ్రైవర్‌కు సూచించారు. అలా దాదాపు 13 కిలోమీటర్లు ఎంపీ కారుతో.. దొంగలను వెంబడించారు. ఈ క్రమంలో కారు.. దొంగల దగ్గరుకు వెళ్లగానే.. వారు రెచ్చిపోయారు. వారి వద్ద ఉన్న గన్‌తో ఎంపీ సుశీల్‌కు గురిపెట్టి కాల్చేస్తామని బెదిరించే ప్రయత్నం చేశారు.
అయితే, దొంగలకు బెదిరింపులను ఎంపీ కొంచెం కూడా బెదరలేదు. అలాగే, వారిని వెంబడిస్తూ వెళ్లారు. కాగా, మధుపుర్ అనే గ్రామం వద్దకు వెళ్లగానే రోడ్డు పక్కనే ఉన్న బురదలో బైక్ స్కిడ్ అయి వారు కిందపడిపోయారు. ఆ వెంటనే ఎంపీ కారు ఆపారు. అది చూసిన ముగ్గురు దొంగలు వెంటనే లేచి పక్కనే ఉన్న పొలాల వైపు పరిగెత్తారు. దీంతో అప్రమత్తమైన ఎంపీ బాడీగార్డ్‌లు.. వారిని వెంబడిస్తూ పరిగెత్తారు. అనంతరం అరకిలోమీటర్ వరకు ఛేదించి దొంగలను పట్టుకున్నారు. అనంతరం, పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇక, నిందితులను టింకు కుమార్, ఆనంద్ కుమార్, ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. దొంగల వద్ద నుంచి బంగారం, మొబైల్ ఫోన్, ఫారిన్ గన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి
Comments
Please login to add a commentAdd a comment