గతవారం పఠారా ప్రాంతంలో జరిగిన మందుపాతర పేలుడుకు కారకులుగా భావిస్తున్న ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా వీరు ఆయుధాలతో సహా దొరికారు. వీరు ఐదుగురు వేర్వేరు జిల్లాల్లో పట్టుబడ్డారని, వారిద్ద ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఔరంగాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండట్ ఉపేంద్ర కుమార్ శర్మ తెలిపారు.
వారివద్ద నాటు స్టెన్ గన్, తొమ్మిది రౌండ్ల మందుగుండు, ఆరు ఉపయోగించిన మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. మందుపాతర పేలుడు సంఘటనకు సంబంధించి మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం గాలింపు చర్యలను వారు ముమ్మరం చేశారు.
బీహార్లో ఐదుగురు మావోయిస్టుల అరెస్టు
Published Mon, Oct 21 2013 3:31 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement