పట్నా: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జీవితపుత్రిక పర్వదినం సందర్భంగా రెండు వేర్వేరు గ్రామాల్లోని చెరువులలో స్నానాలు చేస్తూ ఎనిమిది మంది చిన్నారులు నీట మునిగి మృతి చెందారు.
ఔరంగాబాద్ జిల్లా పరిధిలోని మదన్‌పూర్ బ్లాక్‌లోని కుషాహా గ్రామంలోను, బరున్ బ్లాక్‌లోని ఇతత్ గ్రామంలోను చెరువులో స్నానం చేస్తూ చిన్నారులు మృతిచెందడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకాంత్ శాస్త్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ జీవితపుత్రిక పండుగ సందర్భంగా పుణ్యస్నానం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ చెరువులకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆయా చెరువుల వద్దకు వెళ్లి, బాధితులను బయటకు తీసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ
Comments
Please login to add a commentAdd a comment