chain snachers
-
ఎన్కౌంటర్లో స్నాచర్ హతం!
సాక్షి,చైన్నె: చైన్నెలో ఒక గంట వ్యవధిలో ఆరు చోట్ల చైన్లను స్నాచింగ్ చేసిన కేసులో ఓస్నాచర్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. హైదరాబాద్ విమానంలో ఒకడు.. ముంబై రైలులో మరొక స్నాచర్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మంగళవారం ఉదయం చైన్నెలో ఒక గంట వ్యవధిలో ఏడు చోట్ల చైన్ స్నాచింగ్ జరగడం విదితమే. ఈ స్నాచింగ్ అంతా ఒకే పంథాలో ఉండడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలించారు. చివరకు విమానాశ్రయంలోకి స్నాచర్ల పోలికలతో ఉన్న ఇద్దరు యువకులు వెళ్లడాన్ని గుర్తించారు. వీరు వేర్వేరుగా ముంబై, హైదరాబాద్ విమానాలలో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుసుకున్నారు. దీంతో విమానాలు రన్‌వే మీదున్న సమయంలో ఎయిర్ ట్రాఫిక్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఈ ఇద్దరినీ ముంబై, హైదరాబాద్ విమానాలలో అరెస్టు చేశారు. ఆ సమయంలో వీరిద్దరూ పోలీసులను, విమానాశ్రయ వర్గాలను తీవ్రంగా బెదిరించడం గమనార్హం.ఇద్దరు కాదు ముగ్గురుతొలుత తమకు పట్టుబడ్డ ఇద్దరిని రహస్య ప్రదేశంలో ఉంచి చైన్నె పోలీసులు విచారణ చేశారు. వీరిద్దరు మహారాష్ట్ర (మరాఠా) ముంబైకు చెందిన జాఫర్ గులాం హుస్సేన్ ఇరానీ, మిసం దస్మేష్ ఇరానీగా గుర్తించారు. వీరిలో జాఫర్ పేరు మోసిన స్నాచర్ అని తేలింది. ముంబైలో ఆరి తేరిన ఈ స్నాచర్ ఇటీవలే జైలు నుంచి వచ్చినట్టు విచారణలో వెలుగు చూసింది. అదే సమయంలో ఈ స్నాచింగ్‌లో మరొకడి హస్తం ఉందన్న సమాచారంతో పోలీసులు రైల్వే మార్గంలో వేట మొదలెట్టారు. ముంబై నుంచి విమానంలో తొలుత పట్టుబడ్డ ఇద్దరు సోమవారం చైన్నెకు రాగా, ఆదివారమే రోడ్డు మార్గంలో బెంగళూరు మీదుగా చైన్నెకు ద్విచక్ర వాహనంలో సల్మాన్ అనే స్నాచర్ వచ్చి ఉండటం వెలుగు చూసింది. ఈ ఇద్దరికీ బైక్ సిద్ధం చేసి పెట్టడం మొదలు, రూట్ మ్యాప్‌ను రెడీ చేసి ఇచ్చింది సల్మాన్ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంగళవారం ఉదయం స్నాచింగ్ చేసి ఇద్దరు స్నాచర్లు విమాన మార్గాన్ని ఎంచుకోగా, సల్మాన్ రైల్వే మార్గంలో ముంబై వెళ్లే పనిలో పడ్డారు. దీంతో రైల్వే పోలీసుల సహకారంతో వేట మొదలెట్టారు. పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో చైన్నె నుంచి విజయవాడ వెళ్లి అక్కడి నుంచి ముంబై వెళ్లడానికి నిర్ణయించిన సల్మాన్‌ను ఒంగోలులో అరెస్టు చేశారు. ఇతడిని చైన్నెకు తీసుకొచ్చారు.ఎన్కౌంటర్లో హతంపట్టుబడ్డ జాఫర్ గులాంను పోలీసులు మరింత లోతుగా సిద్ధమయ్యారు. స్నాచింగ్ అనంతరం ముగ్గురు నిందితులు తరమణి రైల్వే స్టేషన్ వద్ద కలిసినట్లు తేలింది. దీంతో అక్కడ సీన్ కన్స్ట్రక్షన్ కోసం బుధవారం వేకువ జామున ఆ రైల్వే స్టేషన్ సమీపంలోకి నిందితులను తీసుకెళ్లారు. అక్కడి వంతెన కింది భాగంలో మోటారు సైకిల్‌ను గుర్తించారు. ఈ సమయంలో ఆ మోటారు సైకిల్లో ఉన్న రివాల్వర్‌ను తీసుకుని పోలీసులపై జాఫర్ గురి పెట్టాడు. అతడ్ని పోలీసు అధికారి బుహారి లొంగిపోవాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. చివరకు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. దీంతో జాఫర్ సంఘటన స్థలంలోనే కుప్పకూలి మరణించారు. ఎన్కౌంటర్ సమాచారంతో ఉదయాన్నే కలకలం రేగింది. పోలీసు కమిషనర్ అరుణ్, ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులు, నిందితుడి మీదున్న కేసులు, అతడి నేర చరిత్ర గురించి కమిషనర్ మీడియాకు వివరించారు. జాఫర్‌పై 50కు పైగా కేసులు ఉన్నాయని, చైన్నె నగరంలో జరిగిన స్నాచింగ్ తర్వాత 100కు పైగా సీసీ కెమెరాలలోని దృశ్యాలను పరిశీలించి, వీరే నిందితులుగా నిర్ధారించినట్లు చెప్పారు. మిగిలిన ఇద్దరు నిందితులను విచారణ చేస్తున్నారు.. వీరి నుంచి స్నాచింగ్ చేసిన ఆరుకు పైగా చైన్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. చైన్నెలో ఎన్కౌంటర్ సమాచారంతో జాఫర్ కుటుంబానికి చెందిన మహిళలు పలువురు ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. అయితే, మగవాళ్లు ఎవ్వరూ రాకపోవడం గమనార్హం! -
ఒంటరి మహిళలే లక్ష్యంగా!
నిజామాబాద్: ఒంటరి మహిళలే లక్ష్యంగా జి ల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని ద్విచక్రవాహనాలపై వచ్చి గొలుసులు లాక్కెళ్తున్నారు. అంతేగాకుండా రద్దీ ఎక్కువగా ఉండే అంగడి లాంటి ప్రాంతాల్లో సైతం చైన్‌స్నాచర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని గొలుసులను సైతం చోరీ చేస్తున్నారు. అడ్రస్ అడగినట్లు వచ్చి చైన్ లాక్కొని పారిపోతున్నారు. ఇటీవల ఆర్మూర్‌లో ఓ మహిళ ఇంట్లో టీవీ చూస్తుండగా దొంగ ఇంట్లోకి చొరబడి బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. కరువైన నిఘా.. పోలీసులు నిఘా లోపించడంతో చైన్ స్నాచింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. సీసీ పుటేజీలను ఏర్పాటు చేసిన వాటి నిర్వహణ లేకపోవడంతో అవి సక్రమంగా పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిఘా పెంచి చైన్ స్నాచర్లను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ నెల 18న నిజామాబాద్‌లోని మహాలక్ష్మి కాలనీలో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ► పదిహేను రోజుల క్రితం ఆర్మూర్‌లోని కుమ్మరిగల్లీకి చెందిన మీనాక్షి స్కూటీపై వెళ్తుండగా వెనక నుంచి బైక్‌పై వచ్చిన వ్యక్తి ఆమె మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. ► రెండు నెలల క్రితం ఆర్మూర్‌లోని తిరుమల కాలనీలో స్కూటీపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల చైన్‌ను లాక్కెళ్లారు. అనుమానం వస్తే స్థానికులకు చెప్పాలి ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఎవరైన బైక్‌పై మెల్లగా వచ్చి అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానికంగా ఉండే వారికి విషయం చెప్పాలి. అప్రమత్తంగా ఉండటంతోపాటు డయల్ 100కు కాల్ చేయాలి. – కిరణ్‌కుమార్, ఏసీపీ, నిజామాబాద్ -
భాగ్యనగరంలో దొంగల బీభత్సం
-
చైన్ స్నాచర్ల అరాచకం.. సినిమా రేంజ్లో బీజేపీ ఎంపీ ఛేజింగ్..
పాట్నా: ఆయనో ఎంపీ.. కానీ, సినిమా రేంజ్లో దొంగల భరతం పట్టాడు. సినిమా లెవెల్లో ఎనిమిది కిలోమీటర్లు చేధించి తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో చైన్ స్నాచర్లను పట్టుకున్నారు. అనంతరం వారిని.. పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఔరంగాబాద్‌లోని బరున్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరిత కుమారి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తను చూసేందుకు జముహర్ మెడికల్ కాలేజీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆమెను పరామర్శించింది. అనంతరం.. సరిత తన భర్త రాజేష్ గుప్తాతో కలిసి బైక్‌పై ఇంటి వెళ్తోంది. అయితే, వారిని గమనించిన ముగ్గురు దొంగలు కొద్ది రోజులు దూరం బైక్‌ను ఫాలో చేసి దొంగలు సరిత మెడలో ఉన్న చైన్‌ను లాక్కుని పారిపోయారు. ఇక, అదే సమయంలో కారులో అటుగా వెళ్తున్న ఎంపీ సుశీల్ కుమార్ సింగ్ దొంగలను చూశారు. వెంటనే అప్రమత్తమై.. దొంగలు పారిపోతున్న వైపుగా వెళ్లమని కారును తిప్పమని డ్రైవర్‌కు సూచించారు. అలా దాదాపు 13 కిలోమీటర్లు ఎంపీ కారుతో.. దొంగలను వెంబడించారు. ఈ క్రమంలో కారు.. దొంగల దగ్గరుకు వెళ్లగానే.. వారు రెచ్చిపోయారు. వారి వద్ద ఉన్న గన్‌తో ఎంపీ సుశీల్‌కు గురిపెట్టి కాల్చేస్తామని బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే, దొంగలకు బెదిరింపులను ఎంపీ కొంచెం కూడా బెదరలేదు. అలాగే, వారిని వెంబడిస్తూ వెళ్లారు. కాగా, మధుపుర్ అనే గ్రామం వద్దకు వెళ్లగానే రోడ్డు పక్కనే ఉన్న బురదలో బైక్ స్కిడ్ అయి వారు కిందపడిపోయారు. ఆ వెంటనే ఎంపీ కారు ఆపారు. అది చూసిన ముగ్గురు దొంగలు వెంటనే లేచి పక్కనే ఉన్న పొలాల వైపు పరిగెత్తారు. దీంతో అప్రమత్తమైన ఎంపీ బాడీగార్డ్లు.. వారిని వెంబడిస్తూ పరిగెత్తారు. అనంతరం అరకిలోమీటర్ వరకు ఛేదించి దొంగలను పట్టుకున్నారు. అనంతరం, పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇక, నిందితులను టింకు కుమార్, ఆనంద్ కుమార్, ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. దొంగల వద్ద నుంచి బంగారం, మొబైల్ ఫోన్, ఫారిన్ గన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి -
చైన్ స్నాచింగ్, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు
-
చైన్ స్నాచింగ్, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు
సాక్షి, న్యూఢిల్లీ : మెడలో బంగారు గొలుసులతో ఆడవాళ్లు కనిపిస్తే.. చైన్ స్నాచింగ్‌లతో రెచ్చిపోయే కేటుగాళ్ల ఆగడాలకు చెక్ చెప్పే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తన మెడలో గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించిన యువకుడికి కూతురుతో కలిసి తగిన శాస్తి చేసిందో మహిళ. ఆగస్టు 30న ఢిల్లీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్లు పక్కన నిలుచొని ఉండగా, బైక్‌పై వచ్చిన దుండగుల్లో ఒకడు మహిళ మెడలోని చెయిన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతే శరవేగంగా స్పందించిన ఆమె (తల్లి) బైక్‌పై వెనక కూర్చుని ఉన్న అతగాణ్ని గుంజి నాలుగు తగిలించింది. దీనికి యువతి (కూతురు) కూడా తోడయ్యింది. ఇంతలో చుట్టుపక్కల వారు కూడా జత కూడడంతో అతగాడి ఆట కట్టింది. ఈ దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డయ్యాయి. మరోవైపు బైక్‌పై వున్న మరో యువకుడు పారిపోవడం కూడా కెమెరా కంటికి చిక్కింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసులు అదుపులో చైన్ స్నాచర్ గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్ : సైబరాబాద్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దుసుముక్క దస్తగిరి ఈ గ్యాంగ్‌కు లీడర్ అన్నారు. దొంగతనం చేసిన బైక్‌ల మీద తిరుగుతూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడటం ఈ గ్యాంగ్ ప్రత్యేకత అన్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని వీరు గొలుసు దొంగతనాలకు పాల్పడతారని తెలిపారు. వీరి మీద ఇప్పటికే ఐదు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 కేసులు నమోదు అయ్యాయన్నారు. నిందుతల దగ్గర నుంచి రూ. 4 లక్షల విలువ చేసే 86 గ్రాముల బంగారం.. 3 మోటర్ వెహికల్స్.. మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
పట్టపగలే రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
బెంగళూరు : పోలీసులు బందోబస్తు విధుల్లో తలమునకలై ఉండగా.. దొంగలు తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఒకే రోజు వేర్వేరు చోట్ల చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వివరాలు... దివంగత బీజేపీ క్రేంద మంత్రి అనంథ్ కుమార్ అంత్యక్రియల నిమిత్తం బెంగళూరు వెస్ట్ డివిజన్ పోలీసులు మంగళవారం ఆయన నివాసం వద్ద బందోబస్తు విధులు నిర్వహణలో మునిగిపోయారు. ఇదే అదునుగా భావించిన దొంగలు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బెంగళూరు వెస్ట్ డివిజన్లోని రాజరాజేశ్వరినగర్, గిరినగర్ ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెల్లారు. దొంగలను అడ్డుకునేందుకు ప్రతిఘటించిన మహిళలను నెట్టివేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దొంగలందరూ బైక్‌ల మీద వచ్చారని.. మొహం కనిపించకుండా కవర్ చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసలు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చైన్ స్నాచర్స్‌ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. -
బెంగళూరులో చైన్‌స్నాచర్ల దుర్మార్గం
-
జాగ్రత్త.. ముగ్గులోకి దించి ముంచేస్తారు
సాక్షి, హైదరాబాద్ : గ్రామాల్లోకంటే నగరాల్లో ముగ్గుల సందడి ఎక్కువైంది. తామంటే తామంటూ పోటీలు పడి వేస్తున్నారు. ఇక బహుమతులని చెబుతుండటంతో వారి ఆరాటానికి అంతే లేకుండా పోయింది. ముఖ్యంగా సంక్రాంతి కావడంతో నలుగురికి తమను తాము గొప్పగా పరిచయం చేసుకోవాలనే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు ముగ్గులేసేందుకు ముచ్చటపడుతున్నారు. ఈ పాయింట్‌ను దొంగలు క్యాచ్ చేసుకున్నారు. తమ బ్రెయిన్‌కు పదును పెట్టి, పోలీసుల కళ్లుగప్పి దర్జాగా దోపిడీలకు ప్రణాళిక రచించి వెంటనే అమల్లోకి తెచ్చారు. కాలనీల్లోకి వెళ్లి సంక్రాంతి సందర్భంగా తాము ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, గెలిచినవారికి పెద్ద పెద్ద బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించారు. వారి అసలు ప్లాన్ తెలియక ముచ్చటపడిన మగువలంతా అందంగా ముస్తాబై బయటకు రావడమే కాకుండా తమ నగలను కూడా నలుగురికి కనిపించేలా వేసుకొని ముగ్గులు వేసేందుకు రావడం మొదలైంది. అలా వచ్చి ముగ్గులో నిమగ్నమవగానే చైన్ స్నాచర్లను తమ చేతి వాటం చూపించడం మొదలుపెట్టారు. వరుసగా బైక్‌లపై వచ్చి వారి చైన్లు లాక్కెళ్లడం మొదలు పెట్టారు. ఇప్పుడు మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. -
శభాష్ పెద్దాయన
-
బాబోయ్ చైన్ స్నాచర్లు.. మహిళను పడేశారు
హైదరాబాద్: నగరంలో మరోసారి చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగడంతో.. ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి కిందపడటంతో.. మహిళతో పాటు ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మాజిద్‌పూర గ్రామానికి చెందిన ఆండాలు అనే మహిళ తన కుమారుడితో కలిసి బైక్‌పై నగరానికి వస్తుండగా.. మరో ద్విచక్రవాహనంపై వస్తున్న గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసును లాగారు. దీంతో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి కిందపడటంతో.. ఆండాలుతో పాటు ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ముగ్గురు చైన్‌స్నాచర్ల అరెస్ట్
దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు, ఫేస్బుక్ ధర్మవరం అర్బన్ : ధర్మవరం పట్టణంలోని కదిరిగేటు సమీపంలోని శివానగర్‌లో జూన్ 28న మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచర్లను ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ హరినాథ్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన షబరీ, ముద్దిరెడ్డిపల్లికి చెందిన నరేష్, నరసింహులు ఒంటరిగా ఉన్న మహిళల మెడలో బంగారు గొలుసులను లాక్కెళ్లేవారు. పట్టణంలో దొంగతనం చేసిన వారి వీడియోలు అక్కడేఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దొంగల ఫోటోలను కొందరు యువకులు ఫేస్బుక్, వాట్సాప్‌లలో పోస్ట్ చేస్తూ ఆచూకీ తెలపాలని కోరారు. ఆ దొంగలు ముద్దిరెడ్డిపల్లిలో మగ్గం నేస్తూ జీవిస్తున్నారని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పట్టణంలోని జీవనజ్యోతి పాఠశాల సమీపంలో బజాజ్ పల్సర్ ద్విచక్రవాహనంలో తిరుగుతున్న నరేష్, నరసింహులు, షబరీలను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ యువకులు చైన్ స్నాచర్లుగా మారారని, వారిపై గతంలో నాలుగు కేసులున్నాయని తెలిపారు. చైన్ స్నాచర్ల అరెస్టులో పట్టణ ఎస్ఐలు సురేష్, జయానాయక్, పోలీసులు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
కరీంనగర్: చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని రెండు వేర్వేరు చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లిలో ఆరుబయట నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెల తాడు లాక్కెళ్లారు. గ్రామానికి చెందిన గుజ్జ అరుణ వేసవి కాలం కావడంతో ఆరుబయట మంచంపై నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని 2 తులాల బంగారు తాళిబొట్టను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇదిలా ఉండగా.. మహబూబాబాద్ మండలం నడివాడకు చెందిన ఓ మహిళ మెడలో నుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు 4 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఆరుగురు చైన్ స్నాచర్లు అరెస్ట్
జంగారెడ్డిగూడెం : ఆరుగురు చైన్ స్నాచర్లను అరెస్టు చేసినట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెంలో నాలుగు, ద్వారకాతిరుమల, అనంతపల్లి, లక్కవరం పోలీస్‌స్టేçÙన్ల పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన జంగారెడ్డిగూడెంకు చెందిన కోడూరి రవితేజ, కుర్రా సాయిబాబా, కోన శ్రీనివాస్, అడపా సాయిమణికంఠ, చాబత్తుల నాగరాజు, వేముల శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సొత్తు రికవరీ చేయాల్సి ఉంది. చోరీ కేసులో ఒకరు.. ఒక ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. స్థానిక ఉప్పలమెట్టపై నివశిస్తున్న పోస్టుమాస్టర్ మల్లిపెద్దిరాజు మార్చి 27న కుటుంబసభ్యులతో విశాఖ వెళ్లారు. వారం రోజుల తర్వాత తిరిగి రాగా తన ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించి పెద్దిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో శ్రీనివాసపురానికి చెందిన తానిగడప వెంకటేశ్వరరావును అరెస్టుచేసి రెండు బంగారు గాజులను పోలీసులు రికవరీ చేశారు. -
'చైన్స్నాచర్లను ఖచ్చితంగా పట్టుకుంటాం'
-
సీసీ కెమెరాలో యాంటీస్నాచింగ్ టీమ్ కాల్పుల విజువల్స్
-
భాగ్యనగరాన్ని హడలెత్తిస్తున్న చైన్‌స్నాచర్లు
-
చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు
హైదరాబాద్: చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలను పోలీసులు అమలుపరుస్తున్నారు. సంచలన రీతిలో స్నాచింగ్ కు పాల్పడిన దుండగులపై కాల్పులు జరిపారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్ రాజధాని హోటల్ వద్ద సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. బైక్ పై దూసుకొచ్చిన దుండగులు.. ఒక మహిళ మెడలో బంగారు గొలుసు లాగేందుకు విఫలయత్నం చేసి పారిపోతుండగా యాంటీ స్నాచింగ్ టీమ్ సిబ్బంది వారిని వెంబడించారు. వాహనం ఆపాలని హెచ్చరించినప్పటికీ దుండగులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు రివాల్వర్ తీసి దుండగులపై కాల్పులు జరిపారు. చివరికి దుండగులు గాయపడకుండా తప్పించుకోగలిగారు. పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతంలో జనసమ్మర్థం అధికంగా ఉంటుంది. తుపాకి చప్పుడుతో అక్కడివారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు
-
హైదరాబాద్‌లో మహిళా దొంగల ముఠా హల్చల్
హైదరాబాద్ నగరంలో గురువారం మహిళా దొంగల ముఠా రెచ్చిపోయింది. వరుస దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంది. ప్రధానంగా ఆలయాలకు వచ్చే మహిళలను టార్గెట్ చేస్తూ ఈ ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడ్డారు. ముగ్గురు మహిళా సభ్యుల దొంగల ముఠా ఆగడాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఓ మహిళ మెడలోని గొలుసును అపహరించిన ముఠా.. అనంతరం అమీర్‌పేటలోని కనకదుర్గ ఆలయంలో పూర్ణ చంద్రావతి అనే మహిళ మెడలో నుంచి 2 తులాల గొలుసును, యూసుఫ్ గూడలో ఆటోలో ప్రయాణిస్తున్న కనకమ్మ అనే మహిళ వద్దనుంచి 5 తులాల బంగారు గొలుసును అపహరించారు. వరుస చోరీలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆ ముఠా కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
ఆ చైన్ స్నాచర్లు పట్టుబడ్డారు ఇలా..
నవాబుపేట: మహిళ మెడలో గొలుసు తెంపుకుని పోయేందుకు యత్నించిన వ్యక్తులు దొరికిపోయారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూ మళ్లీ పట్టుబడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం మైతాప్‌ఖాన్‌గూడ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం స్టేషన్ నాగులపల్లికి చెందిన రవి, అశోక్ బైక్‌పై వెళ్తూ మైతాప్‌ఖాన్‌గూడ సమీపంలో తెలుగు లలిత అనే మహిళ మెడలో గొలుసు లాక్కొని పోయేందుకు యత్నించగా ఆమె భర్త అశోక్ అప్రమత్తమై స్థానికుల సాయంతో వారిని పోలీసులకు అప్పగించాడు. స్థానికుల చేతిలో దెబ్బలు తిన్న నిందితులను పోలీసులు చికిత్స కోసం మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారి కళ్లుగప్పి పారిపోయాడు. మంగళవారం స్టేషన్లింగంపల్లిలో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
నగరంలో చెలరేగిన చైన్ స్నాచర్లు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి, సరూర్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం పోలీస్స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గురువారం ఒక్క రోజే నాలుగు చోట్ల మొత్తం 14 తులాల బంగారు గొలుసులు తెంపుకొని పోయారు. స్నాచింగ్‌లన్నీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 ప్రాంతంలోనే జరిగాయి. బ్లాక్ పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులే వీటన్నిటికీ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆగంతకుల వయస్సు 25 ఏళ్ళలోపే ఉంటుందని, ఒకరు క్యాప్ పెట్టుకుని ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఒక వ్యక్తి నేపాల్‌కు చెందిన వాడిలా జుట్టు పెంచి ఉన్నాడని తెలుస్తోంది. ఈ పోలికలు ఉన్నవారు కాలనీల్లో సంచరిస్తున్నట్లు గమనిస్తే సమాచారం ఇవ్వాలని సరూర్‌నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కృష్ణప్రసాద్ సూచించారు. చైతన్యపురి డీఎస్ఐ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీన్‌హిల్స్ కాలనీ రోడ్ నంబరు 3లో నివాసముండే శామ్యూల్ భార్య ఎంజీ కుసుమ (60) గురువారం సాయంత్రం ఇంటి సమీపంలోని బేకరీకి వెళ్లి వస్తుండగా పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాగారు. ఆమె ప్రతిఘటించటంతో ఒకటిన్నర తులాల గొలుసు దుండగులకు చిక్కింది. సరూర్‌నగర్ స్టేషన్ పరిధిలోని గాయత్రీనగర్‌కు చెందిన లలిత (65) చెరుకుతోట కాలనీలో నడిచి వెళ్తుండగా హుడా కాలనీ వద్ద ఎదురుగా బైకుపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు. వనస్థలిపురంలో పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైకోర్టు కాలనీకి చెందిన జయంతి రామజోజలక్ష్మీ (38) గురువారం మధ్యాహ్నం సుభద్రనగర్ వైపు నడిచి వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు నాలుగు తులాల పుస్తెలతాడు, రెండు తులాల నల్లపూసల గొలుసును లాక్కెళ్లారు. అదేవిధంగా, ఎల్బీనగర్ శివగంగకాలనీకి చెందిన కె.రమణమ్మ (40) మధ్యాహ్నం రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా బైకుపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. -
కరీంనగర్లో భారీ చోరీలు
కరీంనగర్ క్రైం: కరీంనగర్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకే రోజు వేర్వేరు చోట్ల బంగారం చోరీ చేశారు. వివరాలు.. నగరంలోని భాగ్యనగర్‌కు చెందిన చవోటి విజయవర్షిణి కిరాణా దుకాణం వద్దకు వెళ్లి పాలు తీసుకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. ఆమె మెడలోని 3 తులాల పుస్తెలతాడు తెంచుకుని పారిపోయాడు. విద్యానగర్‌కు చెందిన పెండ్యాల విద్యాగౌతమి (34) ఆలయానికి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని 5 తులాల పుస్తెలతాడు, నల్లపూసల దండ తెంపుకొని పారిపోయారు. అదే కాలనీలో ఉంటున్న కొమ్మ విజయ (45) కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సిగరెట్ అడిగాడు. అది ఇవ్వడానికి రాగా ఆమె మెడలోని మూడున్నర తులాల పుస్తెలతాడును తెంచుకుని పారిపోయాడు. ఆమె అరిచినా సమీపంలో ఎవరూ లేకపోవడంతో దొంగ తన బైక్‌పై పారిపోయాడు. ముగ్గురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టుటౌన్ సీఐ హరిప్రసాద్ తెలిపారు.