ఆరుగురు చైన్‌ స్నాచర్లు అరెస్ట్‌ | six chain snatchers arrest | Sakshi
Sakshi News home page

ఆరుగురు చైన్‌ స్నాచర్లు అరెస్ట్‌

Published Tue, Sep 13 2016 2:03 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

జంగారెడ్డిగూడెం : ఆరుగురు చైన్‌ స్నాచర్లను అరెస్టు చేసినట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు.

జంగారెడ్డిగూడెం : ఆరుగురు చైన్‌ స్నాచర్లను అరెస్టు చేసినట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెంలో నాలుగు, ద్వారకాతిరుమల, అనంతపల్లి, లక్కవరం పోలీస్‌స్టేçÙన్ల పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన జంగారెడ్డిగూడెంకు చెందిన కోడూరి రవితేజ, కుర్రా సాయిబాబా, కోన శ్రీనివాస్, అడపా సాయిమణికంఠ, చాబత్తుల నాగరాజు, వేముల శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి సొత్తు రికవరీ చేయాల్సి ఉంది.  
చోరీ కేసులో ఒకరు..
ఒక ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎస్సై ఎ.ఆనందరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. స్థానిక ఉప్పలమెట్టపై నివశిస్తున్న పోస్టుమాస్టర్‌ మల్లిపెద్దిరాజు మార్చి 27న కుటుంబసభ్యులతో విశాఖ వెళ్లారు. వారం రోజుల తర్వాత తిరిగి రాగా తన ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించి పెద్దిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో శ్రీనివాసపురానికి చెందిన తానిగడప వెంకటేశ్వరరావును అరెస్టుచేసి రెండు బంగారు గాజులను పోలీసులు రికవరీ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement