మనం ఎప్పటికీ గుర్తుంచుకునే కథలు కొన్ని ఉంటాయి. అవి కాలక్రమేణా మరుగుపడుతుంటాయి. అయితే మన దేశ చరిత్రకు సంబంధించిన విషయం అయినప్పుడు దానిని తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాం. అలాంటి ఒక అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోని ఆ నగరంలోకి ప్రవేశించాలంటే ఎవరైనా 52 తలుపులు దాటాలి. ఈ నగరానికున్న చరిత్ర చాలా పురాతనమైనది. ఈ నగరంలో అసాధారణ రీతిలో తలుపులు ఉన్నాయి. ఇంతకీ ఆ నగరం ఎక్కడుందో, ఆ నగరానికి సంబంధించిన విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
‘సిటీ ఆఫ్ డోర్స్’ పేరుతో ప్రసిద్ధి
ఇతర నగరాల కంటే భిన్నంగా ఉన్నప్పుడు ఆ నగరానికి ప్రత్యేకమైన పేరు ఏర్పడుతుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరాన్ని ‘తలుపుల నగరం’ అని అంటారు. ఈ నగరం తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది. ఈ నగరంలోకి ప్రవేశించాలంటే 52 తలుపులు దాటుకుంటూ రావాలి. ఈ సమాచారం ఔరంగాబాద్ జిల్లా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఈ నగరంలోని తలుపులు, వాటికి సంబంధించిన కథలు ఎంతో ప్రసిద్ధిపొందాయి.
500 సంవత్సరాల చరిత్ర
ఔరంగాబాద్ నగర చరిత్రను పరిశీలిస్తే ఈ నగరం 500 సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఔరంగాబాద్‌లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియాన్ని చూడవచ్చు. దీనిలో శివాజీ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు కనిపిస్తాయి. అలాగే అప్పట్లో యుద్ధంలో ఉపయోగించిన 500 ఏళ్ల క్రితంనాటి దుస్తులు కూడా కనిపిస్తాయి. మొఘల్ పాలకుడు ఔరంగజేబు తన స్వహస్తాలతో రాసిన ఖురాన్ కాపీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ నగరం పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా భాసిల్లుతోంది ఔరంగాబాద్ మీదుగా వెళుతున్నవారు ఈ నగరాన్ని చూస్తే వినూత్న అనుభూతికి లోనవుతారు. నగరం అంతటా పురాతన తలుపులు కనిపిస్తాయి. ఇది ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇది కూడా చదవండి: India vs Bharat: తెగ నవ్విస్తున్న మీమ్స్!
Comments
Please login to add a commentAdd a comment