city
-
వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్ : టాప్-5లో ముంబై, అయ్యో హైదరాబాద్!
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారం నగరం జాబితాలో వాణిజ్య రాజధాని టాప్ -5లో చోటు దక్కించుకుంది.ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్, టేస్ట్ అట్లాస్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన తాజా లిస్టును ప్రకటించింది. వాటిలో అనేక స్థానాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ముంబై నగరం టాప్ప్లేస్కి ఎగబాకగా హైదరాబాద్, 50వ స్థానానికి పడిపోయింది.ముంబై ప్రపంచంలో 5వ అత్యుత్తమ ఆహార నగరంగా నిలిచింది. టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ఫుడ్ గైడ్ వివిధ వర్గాలలో ర్యాంకింగ్‌లను విడుదల చేసింది."ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల" జాబితాలో ముంబై 5వ స్థానంలో నిలిచింది.తొలి నాలుగు స్థానాలకు ఇటలీలోని నగరాలు చోటు సంపాదించాయి. నేపుల్స్, మిలన్, బోలోగ్నా, ఫ్లోరెన్స్. ముంబై తర్వాత రోమ్, పారిస్, వియన్నా, టురిన్ , ఒసాకా టాప్ 10లో ఉన్న నగరాలుగా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఇతర భారతీయ నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి, వాటిలో మూడు ముంబైతో పాటు టాప్ 50లోకి వచ్చాయి. అమృత్సర్ 43వ స్థానంలో, న్యూఢిల్లీ 45వ స్థానంలో, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానంలో నిలిచాయి. కోల్‌కతా 71వ స్థానంలో ఉండగా, చెన్నై 75వ స్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) అలాగే టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల ర్యాంకింగ్‌ను కూడా ప్రకటించింది. భారత్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ మెరుగ్గానే ఉందని తెలిపింది. కాగా గత ఏడాది ఈ జాబితాలో ముంబై35, హైదరాబాద్ 39వ స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 56వ స్థానంలోనూ, చెన్నై, లక్నో 65, 92 స్థానాల్లోనూ నిలిచాయి. -
బందోబస్తు మధ్య ‘ఫ్యూచర్’ రోడ్డుకు సర్వే
కందుకూరు/ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చి తామెక్కడికి వెళ్లాలంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. భూములు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇస్తారు? ఎలా న్యాయం చేస్తారో చెప్పకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు సర్వే చేస్తుండగా.. కొంగరకలాన్‌లో కలెక్టరేట్ వెనక వైపు చేపట్టిన సర్వే పనులను అడ్డుకుని మహిళలు నిరసన తెలిపారు. రాజు అనే యువ రైతు తమ భూమి తీసుకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. 330 అడుగుల రహదారి రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అక్కడికి చేరుకునేలా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు 330 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదించింది. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం కొంగరకుర్దు, కందుకూరు మండలం లేమూరు, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లిలో రిజర్వు ఫారెస్ట్, పంజగూడ, మీర్ఖాన్పేటలో కలిపి మొత్తం 449.27 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది.ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం ఇటువైపు కందుకూరు మండలం రాచులూరుతోపాటు అటువైపు ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో అధికారులు ఏకకాలంలో సర్వే పనులు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, కందుకూరు తహసీల్దార్ గోపాల్, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు సీతారామ్, వెంకట్‌తోపాటు పోలీసుల బందోబస్తు నడుమ సర్వే నిర్వహించారు. అక్కడి రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంత పెద్ద రోడ్డు నిర్మిస్తే పొలాలు మొత్తం పోయి, రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. సమావేశం ఏర్పాటు చేసి తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు సర్వేను కొనసాగించారు. -
గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్.. 2000 మందికి ఉపాధి
అహ్మదాబాద్: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీ(గిఫ్ట్ సిటీ) గాంధీనగర్‌లో టెక్‌ఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ప్రారంభించనున్న ఈ సెంటర్‌ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్ల వ్యూహాత్మక కేంద్రంగా వినియోగించనున్నట్లు పేర్కొంది.ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) పరిశ్రమలకు సంబంధించిన క్లయింట్లకు ఆధునిక సాంకేతిక సొల్యూషన్లు సమకూర్చనున్నట్లు తెలియజేసింది. ప్రాథమికంగా ఈ సెంటర్లో 500 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనుంది. రానున్న మూడేళ్లలో ఈ సంఖ్యను 2,000కు పెంచనుంది.ప్రపంచస్థాయి కంపెనీలను ఆకట్టుకోవడంలో రాష్ట్రానికున్న పటిష్టతను గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్ కొత్త కేంద్రం ప్రతిబింబిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు, అభివృద్ధికి అత్యుత్తమ వాతావారణాన్ని కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. టెక్‌ఫిన్ సెంటర్ ద్వారా బీఎఫ్ఎస్ఐ క్లయింట్లకు డిజిటల్ పరివర్తనలో తోడ్పాటునివ్వనున్నట్లు కాగ్నిజెంట్ పేర్కొంది. -
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా 352 కి.మీ. మేర రూపు దిద్దుకోనున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు చేరుకొనేందుకు వీలుగా ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ ఆర్) నుంచి గ్రీన్‌ఫీల్డ్ రహదా రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ రోడ్లను నిర్మించనుంది.రావిర్యాల టు ఆమన్‌గల్ వయా ఫ్యూచర్ సిటీసుమారు 14 వేల ఎకరాల విస్తీ ర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవి ష్యత్తులో ఈ మార్గంలో వాహనా ల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్–13 రావిర్యాల నుంచి ఆర్ఆర్ఆర్ లో ని ఆమన్‌గల్ ఎగ్జిట్ నంబర్–13 వరకు 300 అడుగుల మేర గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనుంది. ఈ మార్గంమొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనుంది. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్డ్, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఫిరోజ్‌గూడ, కందుకూరులోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్, ముచ్లెర్ల, యాచారంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమన్‌గల్ మండలంలోని ఆమన్‌గల్, ఆకుతోటపల్లి గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది.916 ఎకరాల భూసమీకరణ..గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. ఇందులో 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూములు ఉండగా 7 కిలోమీటర్లలో 156 ఎకరాలు టీజీఐఐసీ భూములు, కిలోమీటరులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 25.5 కిలో మీటర్ల మేర పట్టా భూములు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ మీదుగా కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్–షాద్‌నగర్–సంగారెడ్డి మీదుగా 194 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండటం తెలిసిందే. -
వరదలో అల్లాడుతోన్న మహానగరాలు
-
కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!?
స్పెయిన్‌లోని అతి చిన్న నగరం ‘సిటీ ఆఫ్ ఫ్రియాస్’. స్పెయిన్‌కు వచ్చే పర్యాటకులు దీనిని పెద్దగా పట్టించుకోరు గాని, ఈ ఊరికి చాలా విశేషాలే ఉన్నాయి. పదో శతాబ్దికి చెందిన ఈ నగరంలో ఆనాటి రాజు రెండో జువాన్ నిర్మించిన రాతికోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మునిసిపాలిటీ నిర్వహణలో ఉన్న ఈ ఊరు సాంకేతికంగా పట్టణమే అయినా, పేరులో మాత్రం ‘సిటీ’ ఉండటంతో స్పెయిన్‌లోని అతి చిన్న నగరంగా గుర్తింపు పొందింది.చిన్నా చితకా పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా కార్లు విరివిగా తిరిగే పరిస్థితులు ఉన్నా, ఈ ఊర్లో మాత్రం కార్లు కనిపించవు. ఇక్కడి ప్రజలు తమ ఊరిలో కార్లను నిషేధించారు. అందువల్ల మోటారు శబ్దాల రొద లేకుండా ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊరి జనాభా దాదాపు మూడువందల మంది మాత్రమే! ఈ విశేషాలు తెలిసిన కొద్దిమంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ ఊళ్లోని పురాతనమైన ‘ఇగ్లేషియా డి సాన్ విన్సెంటె మార్టిర్’ కేథలిక్ చర్చి, ‘ఫ్యూంటే డి లాస్ తేజాస్’ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణలు.ఈ ఫౌంటెన్ నుంచి నీరు కిందకు పడేటప్పుడు సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఈ ఊళ్లో చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటళ్లు, సెలూన్లు, మాంసం కొట్లు, ఫ్యాన్సీ దుకాణాలు, బేకరీ, ఫార్మసీ దుకాణాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి ‘హోటల్ రూరల్ ఫ్రియాస్’ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. పురాతన యూరోపియన్ విశేషాలను తిలకించాలనుకునే పర్యాటకులు ఇక్కడ బస చేయవచ్చు. ఈ హోటల్లో బస చేయడానికి రోజుకు 79 పౌండ్లు (రూ.8,411) చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ యూరోపియన్ హోటళ్లతో పోల్చుకుంటే ఈ ధర తక్కువే!ఇవి చదవండి: అబ్బే! ప్రాణహాని ఉందని కాదు! -
సరిహద్దుల్లో పేలనున్న సిటీ తుపాకీ
సాక్షి, హైదరాబాద్: భారత సరిహద్దుల్లో కాపుకాసే ఆర్మీ జవాన్ల చేతిలో ‘సిటీ తుపాకీ’ పేలనుంది. ‘అస్మి’ పేరుతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీర్డీఓ) డిజైన్ చేసిన ఈ మొట్టమొదటి భారతీయ సబ్ మెషీన్‌గన్ తయారీ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ కోసం రూ.4.26 కోట్లతో 550 తుపాకులు తయా రు చేసి సరఫరా చేయనున్నారు. ఇజ్రాయెల్, జర్మనీల్లోని ఆయుధ కర్మాగారాలకు దీటుగా నగరానికి చెందిన ఓ చిన్న సంస్థ ఈ ప్రతి ష్టాత్మక కాంట్రాక్టు దక్కించుకోవడం గమనార్హం. ఈ తుపాకీని సరిహద్దు భద్రతా దళాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలూ వినియోగించనున్నాయి. ప్రముఖుల భద్రత కోసం వినియోగించడానికీ ‘అస్మి’ అనువుగా ఉంటుంది.ఉజీ, హెక్లర్లకు దీటుగా..⇒ పుణేలోని డీఆర్డీఓలో అంతర్భాగమైన అర్మా మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఆర్మీ సంయుక్తంగా ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పరిశోధనతో ‘అస్మి’ రూపుదిద్దుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ బన్సోద్ దీన్ని డిజైన్ చేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రమాణాలకు లోబడి, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేశారు. సంస్కృతంలో అస్మిత అంటే ధైర్యం, గర్వం (ప్రైడ్) అని అర్థం. దీన్ని సంక్షిప్తీకరించిన ప్రసాద్ ఈ తుపాకీకి ‘అస్మి’ అని పేరు పెట్టారు. అంతర్జాతీ యంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ తయారు చేసే ఉజీ, జర్మనీలో తయా రయ్యే హెక్లర్, కోచీ ఎంపీ–5 ఆయుధాలకు దీటుగా ‘అస్మి’ పని చేస్తుందని డీఆర్డీఓ ప్రకటించింది.అంతర్జాతీయ పోటీని తట్టుకుని..హైదరాబాద్‌లోని బాలానగర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ సంస్థ చిన్న పరిమాణంలో ఆయుధాలు తయారు చేస్తుంది. అయితే అంతర్జాతీయ పోటీని తట్టుకున్న ఈ సంస్థ ‘అస్మి’ తయారీ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పటికే పది చొప్పున తుపాకులు తయారు చేసి ఆర్మీతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), అసోం రైఫిల్స్‌కు అందించింది. నాణ్యతపై వాళ్లు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ 550 తుపాకుల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.ఈ ఏడాది సెప్టెంబర్ 28 నాటికి వీటిని అందించడానికి లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. మరోపక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి ఈ సంస్థకు పైలట్ ఆర్డర్ వచ్చింది. ‘అస్మి’ ఈ తరహాకు చెందిన ఇతర ఆయుధాల కంటే 10–15 శాతం తక్కువ బరువుతో ఉంటుంది. దీన్ని ఆపకుండా 2,400 రౌండ్ల వరకు కాల్చే అవకాశం ఉంది.‘అస్మి’ వివరాలివీ..పేరు: అస్మిస్వరూపం: సబ్ మెషీన్ గన్ ఖరీదు: ఒక్కోటి రూ.50 వేలుబరువు: 2.4 కేజీలుపొడవు: 382 మిల్లీమీటర్లుక్యాలిబర్: 9 X 19 ఎంఎంరేంజ్: 100 మీటర్లుమ్యాగ్జైన్: 32 తూటాలుసామర్థ్యం: నిమిషానికి 800 తూటాలుపరిశోధనకు పట్టిన సమయం: మూడేళ్ల లోపు -
జలసంద్రంగా మారిన హైదరాబాద్.. వాహనదారులకు చుక్కలు (ఫొటోలు)
-
2030 నాటికి ఏర్పాటు కానున్న మెగాసిటీలు ఇవే
1800లలో 10శాతం కంటే తక్కువ మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు. నేడు ప్రపంచ జనాభాలో 55 శాతంతో 4.3 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాలకు పెద్ద ఎత్తున వలసలు పెరగడం వల్ల 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్ని మెగాసిటీలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. న్యూయార్క్, టోక్యోలు 1950లలో తొలిసారిగా మెగా సిటీలుగా గుర్తింపు పొందాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా 32 మెగాసిటీలు ఉన్నాయి. యూఎన్ వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ (2018) డేటా ఆధారంగా 2030 నాటికి మెగాసిటీలుగా మారుతుందని అంచనా.తదుపరి మెగాసిటీలుఅమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, మధ్య ప్రాచ్య దేశాలతో సహా ఆదాయం అధిక సంఖ్యలో ఉన్న దేశాల జనాభాలో 80 శాతం పైగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే అందుకు విరుద్దంగా 2030 నాటికి తక్కువ ఆదాయ దేశాలు మెగాసిటీలుగా అవతరించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా మెగా సిటీల జాబితాలో పలు దేశాల్లోని నగరాలు ఇలా ఉన్నాయి. -
మహానగరాన్ని వణికిస్తున్న పిల్లి!
ఓ పిల్లి కారణంగా ఒక మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. జపాన్ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు. కాగా ఆ పిల్లి చివరిగా రసాయన కర్మాగారం నుండి బయటపడినట్లు భద్రతా ఫుటేజీలో కనిపించింది. ఒక కార్మికుడు ఆ పిల్లి పంజా గుర్తులను గమనించి, దానిని ఉన్నతాధికారులకు తెలిపాడు. ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరం. దానిని ముట్టుకున్నా లేదా పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి, తీవ్ర వ్యాధికి దారితీస్తుంది. ఫుకుయామా సిటీ హాల్లోని ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆ పిల్లి కోసం వెదకగా, ఇంకా దాని జాడ తెలియలేదన్నారు. అది సజీవంగా ఉందా లేదా అనేది కూడా సందేహాస్పదంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ అకిహిరో కొబయాషి మాట్లాడుతూ కర్మాగారంలో రసాయన వ్యాట్‌ను కప్పి ఉంచే షీట్ పాక్షికంగా చిరిగిపోయిందని తెలిపారు. దానిలో పిల్లి పడి, తరువాత ఎటో వెళ్లిపోయిందని, దానికోసం తమ సిబ్బంది వెదుకుతున్నారని చెప్పారు. స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన రసాయన ప్రమాద అంచనాలో నిపుణురాలు లిండా షెంక్ మాట్లాడుతూ సాధారణంగా పిల్లులు తమ బొచ్చును నాకుతుంటాయని, ఈ విధంగా చూస్తే ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయన్నాన్ని నాకి, చనిపోయివుంటుందన్నారు. -
వినువీధిలో మిలాన్ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ఆర్కే బీచ్‌లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్‌హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్‌లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. నేవీ బ్యాండ్‌తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్‌షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్‌భట్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్‌లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్‌లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్‌భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్‌లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్‌నకు.. ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి -
అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీరాముడు జగదానందకారకుడు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన రామ్‌లల్లా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన జరిగి వారం రోజులు దాటినా భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రామ్‌లల్లాను తనివితీరా దర్శించాలనే కోరిక అయోధ్యకు వచ్చే ప్రతీ ఒక్కరిలోనూ కనిపిస్తోంది. తీవ్రమైన చలి గజగజా వణికిస్తున్నా భక్తులు రామ్‌లల్లా దర్శనం కోసం బారులు తీరుతున్నారు. పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా యువత శ్రీరాముని దర్శించుకునేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తోంది. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం పలు సేవా సంస్థలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రామ్‌పథ్ తదితర మార్గాల నుంచి వస్తున్న భక్తుల కోసం ఉచిత భోజనశాలలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రామ్‌లల్లా సందర్శకుల కోసం నిర్మించిన టెంట్ సిటీని ప్రారంభించారు. దీనిలో 25 వేల మంది భక్తులు బస చేసేందుకు అవకాశం ఉంది. ఈ టెంట్ సిటీలోనూ ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. -
మహిళా భద్రతలో టాప్.... చెన్నై!
అవతార్ గ్రూప్ తాజగా మహిళా భద్రతకు పెద్దపీట వేసిన నగరాల జాబితాను టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా(టీసీడబ్ల్యూఐ) అనే సూచిక పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆ సూచీలో మహిళలకు ది బెస్ట్ సిటీగా చెన్నై నిలిచింది. దీన్ని వైవిధ్యం, సమానత్వం, భ్రదత అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. అంతేగాదు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ డేటా తోపాటు దాదాపు 12 వందల మంది మహిళల అభిప్రాయాలనే సేకరించి మరీ అవతార్ గ్రూప్ ఈ సూచీని రూపొందించింది. ఈ సర్వేలో రెండు కేటగిరీలలో తమిళనాడు నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. మిలియన్ ప్లస్ జనాభా విభాగంలో 49 నగరాలు, మిలయిన్కంటే తక్కువ జనాభా విభాగంలో 64 నగరాలు ఉన్నాయి. అయితే మిలియన్ ప్లస్ విభాగంలో చెన్నై టాప్ పొజిషన్లో ఉండగా, మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న విభాగంలో తిరుచిరాపల్లి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సర్వేలో దక్షిణాది రాష్ట్రలైన చెన్నై, బెంగళూరు, పూణె, ముంబై, హైదరాబాద్, నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో మన హైదరాబాద్ టాప్ 5 నగరాల్లో ఉండటం విశేషం. ఈ సర్వేని సిటీ ఇన్‌క్లూజన్ స్కోర్ (CIS), సామాజిక చేరిక స్కోర్ (SIS), ఇండస్ట్రియల్ ఇన్‌క్లూజన్ స్కోర్ (IIS) వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ అంశాలే కొలమానంగా బాహ్య సామాజిక వాతావరణం, సంస్థల్లో శ్రామిక క్తిని చేర్చడం, సర్వేల ద్వారా మహిళల అనుభవాలుతీసుకోవడం, ఫోకస్ గ్రూప్ చర్చలు(FGDs) తదితర వాటితో మహిళల అనుభవాలను అంచనా వేసి మరీ వెల్లడించింది అవతార్ గ్రూప్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..మహిళలపై నేరాలకు పేరుగాంచిన దేశ రాజధాని ఢిల్లీ 8వ ర్యాంక్‌తో మొదటి 10 స్థానాల్లో నిలవడం విశేషం. గతేడాది ఢిల్లీ ఈ సీఐఎస్ ర్యాంక్‌లో 14వ స్థానంలో ఉంది. కానీ భద్రత పరంగా ఎస్ఐఎస్ ర్యాంక్ ఎనిమిది స్థానాలు దిగజారి 27వ ర్యాంక్‌కు పరిమితమైంది. ఈమేరకు అవతార్ గ్రూప్ ఫౌండర్-ప్రెసిడెంట్ డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ..ఈ సూచిక దేశంలోని మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచేలా సమానత్వాన్ని తీసుకొచ్చేందుకు పిలుపునిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు..2027కల్లా భారతదేశం అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉంది అనేందుకు తమ డేటా నిలువెత్తు సాక్ష్యం అవుతుందన్నారు. అంతేగాదు 2025 నాటికి భారతదేశం దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి వర్క్‌ఫోర్స్‌లో మహిళ భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేస్తూ సంస్థల్లో మరింత వైవిధ్యాన్ని తీసుకొచ్చేలా సామాజిక సమానత్వంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని సౌందర్య రాజేష్ అన్నారు. (చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!) -
మెడ్‌టెక్ జోన్లో మెగా ఎక్స్పో సిటీ
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీ... భారత వైద్యరంగంలో ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్... ప్రపంచంలోనే మొదటి డేటా సెంటర్ ఏర్పాటు.. ఇలా వైద్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన విశాఖపట్నంలోని ఏపీ మెడ్ టెక్ జోన్ మరో రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఇండియా ఎక్స్పో సిటీ పేరుతో భారీ ఎగ్జిబిషన్ సెంటర్‌ను నిర్మించింది. కేవలం 150 రోజుల్లోనే లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఎగ్జిబిషన్ సెంటర్‌ను ఏర్పాటుచేసి రికార్డు సృష్టించింది. ఈ ఇండియా ఎక్స్పో సిటీని శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ తొలి రోజే 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ప్రారంభం కావడం విశేషం. ఇవీ ప్రత్యేకతలు... మెడ్‌టెక్ జోన్‌లోని ప్రగతి మైదాన్‌లో 1,03,951 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇండియా ఎక్స్పో సిటీ నిర్మాణ పనులు జూన్ 14న ప్రారంభించారు. శుక్రవారం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తం 5.40లక్షల పని గంటల్లో నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఎక్స్పో సిటీ నిర్మాణం కోసం 3,577 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 718 మెట్రిక్ టన్నుల స్టీల్ వినియోగించారు. రోజుకు 10వేల మంది సందర్శించేలా ఎక్స్పో సిటీని నిర్మించారు. లోపల భాగంలో ఒక్క కోలమ్ కూడా నిర్మించకుండా దీనిని పూర్తి చేయడం విశేషం. ఎక్స్పో సిటీలో నాలుగు కాన్ఫరెన్స్ హాల్స్, బోర్డ్‌రూమ్‌లు ఉన్నాయి. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిస్ప్లే షాప్స్ ఏర్పాటుచేసుకోవచ్చు. తొలి రోజే అంతర్జాతీయ సదస్సు ఇండియా ఎక్స్పో సిటీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజే అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్(ఏఏఎంఐ), గ్లోబల్ క్లినికల్ ఇంజినీరింగ్ అలయెన్స్(జీసీఈఏ) ఆధ్వర్యంలో 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ (ఐసీఈహెచ్‌టీఎంసీ) ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్న సదస్సులో కోవిడ్–19 అనంతర పరిణామాలతోపాటు వైద్య పరికరాల వినియోగం, అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలు, హెల్త్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై చర్చిస్తారు. అమెరికా, చైనా, వెనుజులా, మెక్సికో, స్కాట్లాండ్, బ్రెజిల్, స్పెయిన్, కొలంబియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాంగ్రెస్‌లో భాగంగానే 14 నుంచి 16వ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఫోరం సమావేశం కూడా మెట్‌టెక్ జోన్లో నిర్వహించనున్నట్లు ఏఏఎంఐ చీఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాబర్ట్ బరోస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 80కి పైగా దేశాలకు చెందిన జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. -
ఇజ్రాయెల్‌కు ధర్మశాలతో సంబంధం ఏమిటి?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైనికులు గాజా స్ట్రిప్‌నంతటినీ చుట్టుముట్టారు. ఈ యుద్ధ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సోదరులను ఇజ్రాయెల్ వెనక్కి రావాలంటూ పిలుపునిచ్చింది. దీంతో ఇప్పుడు భారతదేశ సందర్శనలో ఉన్న యూదులు తమ స్వదేశానికి తిరిగివెళుతున్నారు. ఫలితంగా మనదేశంలోని ఒక నగరం ఖాళీగా మారిపోతోంది. ఈ నగరం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఆ నగరం గురించి, ఇజ్రాయెల్‌తో ఆ నగరానికున్న అనుబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న నగరం.. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల. ఇజ్రాయెలీలు ఈ నగరంలోని ధర్మ్‌కోట్‌కు వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇజ్రాయెలీలు సమావేశమవుతారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ యువత ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చి, చాలా కాలం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఖబద్ హౌస్ కూడా ఉంది. దానిలో ఇజ్రాయెలీలు ప్రార్థనలు చేస్తారు. ఇజ్రాయెల్‌లోని ప్రతి ఒక్కరూ అంటే యువకులైనా, యువతులైనా సైన్యంలో తప్పనిసరిగా శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత చాలా మంది యువకులు హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రాంతానికి వచ్చి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఈసారి హమాస్ దాడి వారి విశ్రాంతికి అంతరాయం కలిగించింది. అనుకోని పరిస్థితుల్లో వారు తమ స్వదేశానికి తిరిగి వెళ్లవలసి వస్తోంది. భారతదేశానికి వచ్చే ఇజ్రాయెలీలు ధర్మ్‌కోట్‌తో పాటు, ఢిల్లీలోని పహర్‌గంజ్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లను కూడా సందర్శిస్తారు. ఇజ్రాయెలీల మతపరమైన స్థలాలు అంటే ఖబద్ హౌస్‌లు ఢిల్లీ, రాజస్థాన్‌లో ఉన్నాయి. ఇజ్రాయెలీలు అక్కడ ప్రార్థనలు చేస్తారు. యూదుల మత ప్రార్థనా స్థలాలు దాదాపు ప్రతి దేశంలో ఉన్నాయి. ఇక్కడ యూదులు బస చేస్తుంటారు. ఇది కూడా చదవండి: ఈవీఎంలోని బటన్లను రెండుసార్లు నొక్కితే ఏమవుతుంది? -
ఎస్క్లేటర్పై నిషేధమున్న నగరం ఏది? గణాంకాలు ఎందుకు బెంబేలెత్తిస్తున్నాయి?
సాంకేతికత పరంగా ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో జపాన్ ఒకటి. అయితే ఈ దేశంలోని ఒక నగరంలోని జనం ఎస్క్‌లేటర్లపై నడవడంపై నిషేధం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎస్క్‌లేటర్లపై ఎవరైనా నడిస్తే చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. ఈ విషయం తెలిశాక ప్రజారోగ్యం దృష్ట్యా ఇలా చేసి ఉంటారని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే జనం మెట్లను ఎక్కువగా ఉపయోగించాలి. వారంతా ఫిట్‌గా ఉండాలనే ఆలోచనతో ఇలా చేసివుంటారని అనుకుంటారు. అయితే ఇలా అనుకోవడంలో అస్సలు నిజం లేదు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. జపాన్ టుడే తెలిపిన వివరాల ప్రకారం నగోయా నగరం ఈ చట్టాన్ని చేసింది. 2023, అక్టోబర్ 1 నుంచి ఇక్కడ ఎస్క్‌లేటర్లపై నడవడంపై నిషేధం విధించారు. ఎస్కలేటర్ల నుండి పడిపోకుండా జనాన్ని రక్షించడం, ఈ తరహా ప్రమాదాలను నివారించడమే దీని ఉద్దేశ్యం. జపాన్‌లో ఎస్క్‌లేటర్ వినియోగంలో ఒక నియమం ఉంది. ప్రజలు ఎస్క్‌లేటర్ల ఎడమ వైపున నిలబడాలి. తద్వారా జనం త్వరగా ఎక్కడానికి లేదా దిగడానికి కుడి వైపున ఉన్న మార్గం తెరిచి ఉంటుంది. ఎస్క్‌లేటర్లు వినియోగించేవారు భయాందోళనలకు గురైనపుడు ఇతరులను నెట్టడంలాంటివి జరుగుతుంటాయి. ఫలితంగా పలువురు గాయపడటం లాంటివి జరుగుతుంటాయి. వృద్ధులు, వికలాంగులను ఇలాంటి ప్రమాదాల నుండి రక్షించడానికి ఈ నియమం అమలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా నగోయా నగరంలో ఎస్క్‌లేటర్ల ప్రమాదాలు ఎక్కువయ్యాయి. జపాన్ ఎలివేటర్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2018-2019 సంవత్సరంలో 805 ఎస్క్‌లేటర్ల ప్రమాదాలు సంభవించాయి. ఎస్క్‌లేటర్ల దుర్వినియోగం కారణంగానే ఇలా జరిగినట్లు తేలింది. అప్పటి నుంచి అధికారులు ఎస్క్‌లేటర్ల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు 2021 అక్టోబర్‌లో సైతామా నగరంలో కూడా ఇలాంటి నిబంధనలను అమలు చేశారు. అయితే దానికి చట్టరూపమివ్వలేదు. తాజాగా ఎస్క్‌లేటర్ల వినియోగంపై నగోయా నగరం ఒక చట్టాన్ని రూపొందించింది. ఎస్కలేటర్ల వాడకం మానేయాలని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రధాన రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ప్రకటనల బోర్డులు ఏర్పాటుచేశారు. ఇది కూడా చదవండి: హర్దీప్ నిజ్జర్ హత్య వెనుక చైనా హస్తం? -
అదొక శాపగ్రస్త గ్రామం! అరవై ఏళ్లుగా మనుషులే లేని ఊరు
అరవై ఏళ్లుగా మనుషులు లేని ఊరు అదొక శాపగ్రస్త గ్రామం. అరవై ఏళ్లుగా ఆ ఊళ్లో మనుషులెవరూ ఉండటం లేదు. మధ్యయుగాల నాటి ఆ ఊరి పేరు క్రాకో. ఇటలీలోని బాజిలికా ప్రాంతంలో ఉందిది. కేవోన్ నది సమీపంలో ఎత్తయిన కొండ మీద దాదాపు పద్నాలుగు శతాబ్దాల కిందట కట్టుదిట్టంగా ఈ ఊరిని నిర్మించుకున్నారు. ఆనాటి రక్షణ అవసరాల కోసం దీనిని శత్రుదుర్భేద్యంగా రూపొందించుకున్నారు. కొండను తొలిచి ఊరిలోని ఇళ్లను, ప్రార్థన స్థలాలను పూర్తిగా రాళ్లతోనే నిర్మించుకున్నారు. కొన్నిచోట్ల గుహలలో కూడా ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు ఇది ‘కేవ్ సిటీ’గా పేరుపొందింది. రోమన్ చక్రవర్తి రెండో ఫ్రెడెరిక్ కాలంలో ఈ ఊరు వ్యూహాత్మక సైనిక స్థావరంగా ఉపయోగపడేది. తర్వాత పద్నాలుగో శతాబ్దిలో ప్లేగు మహమ్మారి విజృంభించడంతో ఈ ఊళ్లోని వందలాది మంది చనిపోయారు. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక ఉపద్రవం ముంచుకొస్తూనే ఉండటంతో జనాలు దీన్నొక శాపగ్రస్త గ్రామంగా భావించడం మొదలుపెట్టారు. బందిపోట్ల దాడుల్లో కొందరు ఊరి జనాలు హతమైపోయారు. కొండచరియలు కూలిన సంఘటనల్లో కొందరు మరణించారు. చివరిసారిగా 1963లో ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో ఊళ్లో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో మిగిలిన కొద్దిమంది జనాలు కూడా ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే, ఇప్పుడిది పర్యాటక ఆకర్షణగా మారింది. ఇటలీ వచ్చే పర్యాటకుల్లో పలువురు ఈ ఊరిని ఆసక్తిగా చూసి వెళుతుంటారు. (చదవండి: 128 ఏళ్ల నాటి మమ్మీకి అంత్యక్రియలు! అదికూడా అధికారిక.) -
చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాసాదం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాసాదం ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరు పొందింది. చైనాలోని మింగ్ వంశీయులు చేపట్టిన దీని నిర్మాణం 1406లో మొదలుపెడితే, 1420లో పూర్తయింది. హోంగ్వు చక్రవర్తి కొడుకు ఝుడి నాన్జింగ్ నుంచి బీజింగ్‌కు తన రాజధానిని మార్చుకున్నాక, బీజింగ్‌లో ఈ నిర్మాణం చేపట్టాడు. దాదాపు ఐదు శతాబ్దాల కాలం ఇది చైనా చక్రవర్తులకు రాచప్రాసాదంగా వర్ధిల్లింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. దాదాపు ఒక ఊరంత విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల ప్రాసాదంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో దీనిని 1987లోనే ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. (చదవండి: Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.!) -
అది ‘ఇత్తడి నగరం’ ఎందుకయ్యింది? నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి?
భారతదేశంలోని ప్రతి నగరానికి ఒక చరిత్ర ఉంది. కొన్ని కలల నగరం హోదాను కలిగి ఉoడగా, మరికొన్ని చరిత్రను సజీవంగా ఉంచడానికి కృషి చేస్తున్నాయి. భారతదేశంలోని ఒక నగరాన్ని ఇత్తడి నగరం అని అంటారు. ఆ నగరంలో జరిగే వ్యాపారం మనదేశంలోనే కాదు అమెరికా నుండి యూరప్ వరకు విస్తరించింది. ఆ నగరం గురించి, అక్కడి వ్యాపారం గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది మనదేశ ఘనతను తెలియజేస్తుంది. ఆ నగరానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ఇత్తడి నగరంగా ప్రసిద్ధి చెందిన నగరం పేరు మొరాదాబాద్. ఈ నగరం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ప్రభుత్వం ఈ నగరానికి బ్రాస్ సిటీ అనే పేరు పెట్టింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఒక ఉత్పత్తి పథకం కింద దీనికి ఈ పేరు వచ్చింది. ఈ నగరంలో తయారైన ఇత్తడి ఉత్పత్తులు భారతీయ సంస్కృతి, వైవిధ్యం, వారసత్వం, చరిత్రను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఇత్తడి వస్తువుల తయారీకి సంబంధించిన చిన్న పరిశ్రమలు, పెద్ద కర్మాగారాలు అనేకం ఉన్నాయి. హిందూ దేవుళ్లు, దేవతల బొమ్మలు మొదలుకొని మొఘల్ కాలం నాటి ఆకృతుల వరకు అన్నింటినీ ఇక్కడ ఇత్తడితో తయారుచేస్తారు. ఫలితంగా నగరంలో అనునిత్యం ఎక్కడచూసినా పాత్రల తయారీ శబ్ధాలు వినిపిస్తుంటాయి. అమెరికా నుండి యూరప్ వరకు.. బ్రాస్ సిటీలో తయారయ్యే ఉత్పత్తులు భారతదేశంలో విక్రయమవడమే కాకుండా అమెరికా, యూరప్ వంటి ఖండాలకు కూడా ఎగుమతి అవుతాయి. భారత్ నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో ఇత్తడి ఎగుమతి అవుతుంది. ఇక్కడి ఇత్తడి పరిశ్రమ టర్నోవర్ ఏటా రూ. 8,000 నుంచి 9,000 కోట్ల వరకూ ఉంటుంది. ది వైర్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఈ నగర జనాభాలో దాదాపు 47% మంది ముస్లింలు. ఇక్కడి ముస్లింలు ఇత్తడి పాత్రల తయారీలో ముందున్నారు. ప్రస్తుతం మొరాదాబాద్‌లో దాదాపు 4,000 మంది ఇత్తడి ఎగుమతిదారులు ఉన్నారు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది? -
‘సిటీ ఆఫ్ డోర్స్’ అంటే ఏమిటి? మనదేశంలోని ఆ నగరానికి ఎందుకంత ప్రత్యేకత?
మనం ఎప్పటికీ గుర్తుంచుకునే కథలు కొన్ని ఉంటాయి. అవి కాలక్రమేణా మరుగుపడుతుంటాయి. అయితే మన దేశ చరిత్రకు సంబంధించిన విషయం అయినప్పుడు దానిని తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాం. అలాంటి ఒక అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోని ఆ నగరంలోకి ప్రవేశించాలంటే ఎవరైనా 52 తలుపులు దాటాలి. ఈ నగరానికున్న చరిత్ర చాలా పురాతనమైనది. ఈ నగరంలో అసాధారణ రీతిలో తలుపులు ఉన్నాయి. ఇంతకీ ఆ నగరం ఎక్కడుందో, ఆ నగరానికి సంబంధించిన విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ‘సిటీ ఆఫ్ డోర్స్’ పేరుతో ప్రసిద్ధి ఇతర నగరాల కంటే భిన్నంగా ఉన్నప్పుడు ఆ నగరానికి ప్రత్యేకమైన పేరు ఏర్పడుతుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరాన్ని ‘తలుపుల నగరం’ అని అంటారు. ఈ నగరం తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది. ఈ నగరంలోకి ప్రవేశించాలంటే 52 తలుపులు దాటుకుంటూ రావాలి. ఈ సమాచారం ఔరంగాబాద్ జిల్లా ప్రభుత్వ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ నగరంలోని తలుపులు, వాటికి సంబంధించిన కథలు ఎంతో ప్రసిద్ధిపొందాయి. 500 సంవత్సరాల చరిత్ర ఔరంగాబాద్ నగర చరిత్రను పరిశీలిస్తే ఈ నగరం 500 సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఔరంగాబాద్‌లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియాన్ని చూడవచ్చు. దీనిలో శివాజీ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు కనిపిస్తాయి. అలాగే అప్పట్లో యుద్ధంలో ఉపయోగించిన 500 ఏళ్ల క్రితంనాటి దుస్తులు కూడా కనిపిస్తాయి. మొఘల్ పాలకుడు ఔరంగజేబు తన స్వహస్తాలతో రాసిన ఖురాన్ కాపీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ నగరం పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా భాసిల్లుతోంది ఔరంగాబాద్ మీదుగా వెళుతున్నవారు ఈ నగరాన్ని చూస్తే వినూత్న అనుభూతికి లోనవుతారు. నగరం అంతటా పురాతన తలుపులు కనిపిస్తాయి. ఇది ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది కూడా చదవండి: India vs Bharat: తెగ నవ్విస్తున్న మీమ్స్! -
సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3
న్యూయార్క్: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్‌లో సనాతన ధర్మంపై ఇలాంటి వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికాలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని కెంటకీలోని లూయిస్విల్లే నగర మేయర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. US city declares September 3 as Sanatana Dharma Day https://t.co/YCCgNFK5Q9 — IndiaToday (@IndiaToday) September 6, 2023 లూయిస్‌విల్లేలోని హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేకం వేడుకలో డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ అధికారిక ప్రకటనను అందరికి చదివి వినిపించారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 3న సనాతన ధర్మం రోజుగా జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు చిదానంద సరస్వతి, పరమార్థ నికేతన్ అధ్యక్షుడు రిషికేశ్, శ్రీశ్రీ రవిశంకర్, భగవతీ సరస్వతి, లెఫ్టినెంట్ గవర్నర్ జాక్వెలిన్ కోల్మన్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కైషా డోర్సీ, పలువురు ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: మరో వివాదం: ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు -
కొద్దిసేపటిలో హైదరాబాద్‌లో ఖగోళ అద్భుతం.. అస్సలు మిస్సవకండి!
భూమి.. సూర్యుని చుట్టూ తిరుగుతూ, దాని చుట్టు అది తిరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అయితే ఈ నేపధ్యంలో కొన్ని విచిత్రమైన ఖగోళ సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు గ్రహణం సంభవిస్తుంది. ఇంకొన్నిసార్లు ఇతర ఖగోళ సంఘటనలు భూమి నుండి కనిపిస్తాయి. ఇప్పుడు భారతదేశం మరో సంఘటనకు సాక్షిగా నిలవబోతోంది. ఇది ఎంతో ఆశ్చర్యాన్ని గొలపనుంది. ఈ రోజు భారతదేశంలో షాడో డే ఆవిర్భవించనుంది. అంటే దీని అర్థం గురువారం(ఆగస్టు 3) భారతీయులు తమ నీడను తాము కాసేపు చూసుకోలేరు. ఇలా నీడ పడని కాలం ఎంతసేపు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనితో పాటు ఇది ఏ కారణం చేత జరుగుతుందో తెలుసుకుందాం. జీరో షాడో డే అంటే ఏమిటి? జీరో షాడో డే నాడు కొద్ది సమయం పాటు మన నీడ మనకు కనిపించదు. జీరో షాడో డే నాడు ఒక నిర్దిష్ట సమయంలో సూర్యుడు మన తలపైకి వచ్చే సమయంలో మన నీడ ఏర్పడదు. ఈ పరిస్థితినే జీరో షాడో అంటారు. ఇది ఆగస్ట్ 3, 2023న 12.23కి భారతదేశంలో సంభవించనుంది. దీని ప్రభావం హైదరాబాద్ సమీపంలో అధికంగా ఉంటుందని, ఇందుకోసం హైదరాబాద్‌లో కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీని వెనుక సైన్స్ ఇదే.. ఖగోళంలో సంభవించే ఈ దృగ్విషయం సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. భూమి తన అక్షంలో కొద్దిగా వంగి ఉంటుంది. ఈ వంపుతో భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఈ వంపు కారణంగా సూర్యకిరణాల కోణం ఏడాది పొడవునా మారుతూ ఉంటుంది. ఫలితంగా నీడ పొడవు, దిశ కూడా మారుతూ ఉంటుంది. దీనితో పాటు ఈ కోణం కారణంగా సూర్యుని వంపు కూడా మారుతూ ఉంటుంది. ఫలితంగా సూర్యుడు సరిగ్గా తలపైకి వచ్చినప్పుడు మన నీడ కనిపించదు. అయితే ఇది అక్షాంశంపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం దేశంలోని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో జీరో షాడో డే ప్రభావం ఉంటుంది హైదరాబాద్ అక్షాంశం 17.3850°N. గురువారం మధ్యాహ్నం 12.23 సమయంలో సూర్యుడి కోణం నిటారుగా ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్‌లో కొంత సమయం పాటు నీడ కనిపించదు. ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఫ్రీ ఫైర్ గేమ్‌తో పరిచయం ఏర్పడి.. -
అది దేశంలోనే అత్యంత చిన్న నగరం.. ఒకప్పుడు పారిస్‌తో పోల్చేవారు!
భారతదేశం పలు విభిన్నతలు, ప్రత్యేకతలు కలిగిన దేశం. దేశంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇవి మనదేశ ఘనతను చాటుతాయి. వీటికి ఆకర్షితులైన విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. మనదేశంలో మ్తొతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పలు నగరాలు ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత చిన్న నగరం కూడా ఉంది. ఆ నగరంలో జనసంఖ్య 2011లో 98,916 మాత్రమే. కోవిడ్ కారణంగా జనాభా గణన ఇటీవలి కాలంలో జరగలేదు. పంజాబ్‌లోని కపూర్థలా అందమైన చారిత్రక కట్టడాలకు, విశాలమైన రహదారులకు పేరొందింది. ఒకానొక సమయంలో దీనిని పంజాబ్ పారిస్ అని పిలిచేవారు. ఇక నగరాన్ని స్ణాపించిన నవాబ్ కపూర్ పేరిట ఈ ప్రాంతానికి కపూర్థలా అనే పేరు వచ్చింది. భారతీయ రైల్వోలతో ఈ నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది. రైల్వే బోగీలు ఇక్కడే తుదిమెరుగులు దిద్దుకుంటాయి. ఇక్కడి జగత్జీత్ ప్యాలెస్ ఒకప్పుడు కపూర్థలా రాజ్యానికి రాజైన మహారాజా జగత్జీత్ సింగ్‌కు నివాసంగా ఉండేది. ఇప్పుడు ఈ ప్యాలెస్‌లో సైనిక స్కూల్ నడుస్తోంది. ఈ మహల్‌ను1908లో నిర్మించారు. ఇక్కడి వాస్తకళ ఈ నాటికీ అందరినీ అలరిస్తుంటుంది. కపూర్థలా నగరానికి పంజాబ్‌లోని అన్ని పట్టణాల నుంచి రవాణా సదుపాయం ఉంది. అలాగే అమృత్‌సర్‌లోని విమానాశ్రయం నుంచి కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. జలంధర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా కపూర్థలాకు చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక.. -
సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే .!
సాధారణంగా వేసవి వచ్చేదంటే అమ్మో!.. ఉక్కపోతా అంటూ అరిచేస్తాం. ఏసీలు, కూలర్లు పెట్టేసి.. వేలల్లో కరెంట్ బిల్లులు కట్టేసి హమ్మయ్యా అనుకుంటాం. జేబు చిల్లు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం గానీ సహజసిద్ధంగా ఇంటిని ఎలా కూల్‌గా ఉంచుకోవచ్చో ఆలోచించం. ఎందకంటే ఎలాగో విద్యుత్ సౌకర్యం, డబ్బులు కట్టే సామర్థ్యం రెండు ఉన్నాయి. ఇక మరో ఆలోచన కాదు గదా!.. ఆ పదం వరకు కూడా వెళ్లం. కానీ ఈ ఎడారి దేశంలోని ఓ నగరం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవడమేగాక దాని వినూత్న ఆలోచన విధానంతో అందనంత ఎత్తులో ఉంది ఆ నగరం. వివరాల్లోకెళ్తే..ఇరాన్లో ఎడారి నగరమైన యాజ్డ్లో వేడి అలా ఇలా ఉండదు. తట్టుకోవడం చాల కష్టం, కనీస అవసరాలు ఉండవు. పైగా కావల్సినంత విద్యుత్ కూడా ఉండే అవకాశమే లేదు కూడా. అలాంటి ఆ ప్రాంతం అందుబాటులో ఉన్న వనరులతోటే అద్భుతాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా 2017లో యునెస్కోలో వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఇంతకీ ఆ నగరంలో అంత గొప్పగా ఏముందంటే..ఆ నగరంలో ఇళ్లన్ని ఎత్తులో ఉండి పైన చిమ్నీ లాంటి టవర్లు ఉంటాయి. వేడి గాలిని ఇంట్లోకి రాకుండా నిరోధించి, చల్లగా ఉండేలా చేస్తుంటాయి ఆ టవర్లు. ఒకరకంగా చెప్పాలంటే వాటిని 'సహజసిద్ధమైన ఏసీ'లని చెప్పొచ్చు. నివాసాలను చల్లబర్చడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. వీటిని విండ్ క్యాచర్లు అంటారు. ఇది మధ్యప్రాచ్యంలోని పర్షియన్ సామ్రాజ్య కాలం నాటి నిర్మాణంగా భావిస్తారు నిపుణులు. నిజానికి వేసవిలో అక్కడ సుమారు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీంతో శతాబ్దాలకు ముందే అప్పటి వాళ్లే ఇళ్లను కూల్‌గా ఉంచడానికి వీలుగా ఇలాంటి నిర్మాణంలో ఇళ్లను నిర్మించారు. ప్రజలు దాన్ని ఇప్పటకీ కొనసాగిస్తుండటం విశేషం. విద్యుత్ గురించి తెలియక మునుపే మా పూర్వికులు ఇలాంటి ఇళ్లను కనుగొన్నారు, దాన్నే మేము కొనసాగించడమే కాకుండా ఆ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం అని గర్వంగా ఇరాన్ పర్యాటక మంత్రిత్వ శాఖ డిప్యూటీ అబ్డోల్మాజిద్ షాకేరి చెబుతున్నారు. ఇక్కడ ఇళ్లపై ఉండే 'విండ్ క్యాచర్'(చల్లటి గాలిని ఇచ్చేవి) టవర్లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి. తమ పూర్వీకులు చెదపురుగుల గూడుని బేస్ చేసుకుని ఇలా ఇళ్లను నిర్మించినట్లు ఇరాన్ వాసులు చెబుతున్నారు. ఈ ఇళ్లు ఆధునిక సిమెంట్ భవనాలకు అత్యంత విరుద్ధం. ఇవి బంకమట్టి ఇటుకతో నిర్మించే శతాబ్దాల నాటి సంప్రదాయ రీతి కట్టడాల నిర్మాణం. ఇక్కడ ఇంకో అద్భుతమైన నిర్మాణం ఉంది. అది భూగర్భ జల వ్యవస్ధ. దీన్ని ఖానాట్స్ అని పిలుస్తారు. భూగర్భ బావులు, లేదా చిన్న కాలువలు అని చెప్పొచ్చు. అక్కడ ఇళ్లు వేడి ఎక్కకుండా ఉండటానికి ఇవి కూడా ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇరాన్లో ప్రస్తుతం 33వేల ఖానాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇరాన్ అధికారులు ఈ ఖానాట్స్లను ఎండిపోకుండా పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా దేశాలు ఇలాంటి ప్రకృతిసిద్ధంగా లభించే గాలిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే మంచి గాలి పీల్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే గాక వాతావరణంలో కార్బన్ స్థాయిలు తగ్గించినవాళ్లము అవుతాం కదా ఆలోచించండి!. (చదవండి: టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!) -
భూమిలో 285 అడుగుల లోతులో 'నగరం'.. 20 వేల మందిదాక..
ఇదొక పురాతన అధోలోక నగరం. ప్రస్తుత తుర్కియాలోని కపడోసియ ప్రాంతంలో ఉంది. భూమి లోపల 285 అడుగుల లోతున పదకొండు అంతస్తుల్లో ఉన్న ఈ నగరాన్ని తొలి పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించి ఉంటారని చరిత్రకారులు, పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. దీనిని క్రీస్తుపూర్వం 550 ప్రాంతంలో నిర్మించి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇందులో ఇరవైవేల మంది నివాసం ఉండేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. నూనె గానుగలు, మద్యం పీపాలను భద్రపరచుకునే గదులు, తిండి గింజలు భద్రపరచుకునే గదులు, ప్రార్థన మందిరాలు వంటివీ ఉన్నాయి. దీని లోపలికి గాలి, వెలుతురు ప్రసరించేందుకు వీలుగా 180 అడుగుల పొడవైన మార్గం ఉండటం విశేషం. తొలిసారిగా దీనిని విహార యాత్రకు వచ్చిన ఒక కుటుంబం 1963లో గుర్తించడంతో ఈ నగరం గురించి ఆధునిక ప్రపంచానికి తెలిసింది. తుర్కియాలో దీనికి ‘డెరింకుయు’ అని పేరు పెట్టారు. అంటే నేలమాళిగ నగరం అని అర్థం. (చదవండి: టీచరే బడిదొంగ... ఇరవై ఏళ్లుగా డుమ్మా!)