గ్రీనరీలకన్నా సీనరీలే ఆరోగ్యం! | Living in a beautiful city is as good for you as living in the country, say experts | Sakshi
Sakshi News home page

గ్రీనరీలకన్నా సీనరీలే ఆరోగ్యం!

Published Tue, Dec 29 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

Living in a beautiful city is as good for you as living in the country, say experts

అందమైన నగరాల్లో నివసించడం గ్రామజీవనం కన్నా ఆరోగ్యకరం అంటున్నారు అధ్యయనకారులు. నగరాల్లో ఉండే ఓ మంచి సీనరీ... గ్రామాలు, పట్టణాల్లోని గ్రీనరీ (పచ్చదనం) కన్నా సానుకూల వాతావరణాన్ని సృష్టించడంతోపాటు... మానసిక, శారీరక శ్రేయస్సును మెరుగు పరిచేందుకు, ఉపయోగపడుతుందని చెప్తున్నారు.

గ్రామాలు, పట్టణాల్లోని నదులు, పచ్చదనం కన్నా...  నగరాల్లో అత్యంత సుందరమైన  సీనరీల్లో ఉండే గోధుమ, బూడిద, నీలం రంగులు...వ్యక్తి భావాలను ఆకట్టుకుంటాయని అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. థేమ్స్ నదిలో రవాణా జరిపే కార్గో ఓడలు, సెంయింట్ పాల్ కేథడ్రాల్ వ్యూ వంటివి... కొండలు, విస్తారమైన అడవుల్లో నడవటం కన్నా.. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు.

వార్విక్ బిజినెస్ స్కూల్ విద్యావేత్తల సర్వేలో భాగంగా  బ్రిటన్ కు చెందిన 212,000 చిత్రాలను చూపించి వాటిపై ప్రజలను రేటింగ్ చేయమని కోరారు. 2011 జనాభా  లెక్కల ప్రకారం ఆయా ప్రాంతాల్లో నివసించే 1.5 మిలియన్ల జనాభా వారి ఆరోగ్యం గురించి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీన్నిబట్టి  పరిశోధకులు అత్యంత సుందరమైన, అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే పచ్చని గ్రామాల్లో ఆరోగ్యం, అనందం అంతగా లేవని తేల్చారు. కేవలం ఓ పచ్చని ప్రాంతం.. సీనరీల్లో ఉండే మంచి అనుభూతిని, ఆనందాన్ని ప్రేరేపించడం లేదని తమ సర్వే ద్వారా తెలిసినట్లు బిజినెస్ స్కూల్ పీహెచ్ డి విద్యార్థి ఛనూకి తెలిపారు. వాతావరణంలోని అందాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంవల్ల ఉపయోగం ఉండదన్నారు. స్థానికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పట్టణాల్లో ప్రణాళికా బద్ధంగా పార్కులు, హౌసింగ్, రహదారులు వంటి నిర్మాణాలు చేపట్టాలని... పర్యావరణాన్ని అందంగా తీర్చి దిద్దడంవల్ల ఆరోగ్యంగా ఉండగల్గుతారని సర్వేలు సూచిస్తున్నట్లు తెలిపారు.

తాము జరిపిన సర్వే ద్వారా సీనరీలు ఆరోగ్యం మధ్య చూసిన సంబంధం, ప్రయోజనకర ప్రభావాలు... హరిత ప్రదేశాల్లో కనిపించడం లేదని బిజినెస్ స్కూల్ కు చెందిన బిహావియరల్ సైన్స్ ల్యాబ్ సహదర్శకుడు, అసోసియేట్ ప్రొఫెసర్ సూజీ మాట్  వెల్లడించారు. గతంలో మనం నమ్మే పచ్చదనం ఆరోగ్యానికి శ్రేయస్కరం అన్న నమ్మకాన్ని వదిలి... దైనందిన జీవితంలో పర్యావరణ ప్రాముఖ్యతకే ప్రాధాన్యతను ఇవ్వవచ్చని తమ సర్వే ఫలితాలద్వారా తెలుస్తోందంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement