good
-
అనారోగ్యానికి ‘ఆహారం’ కావద్దు!
‘రుచికరంగా హాయిగా తినేసి పెందళాడే కన్నుమూస్తే మటుకు దేశానికి వచ్చిన నష్టమేంటి? భూమికి భారం తగ్గుతుంది కదా’ అంటూ కొందరు వితండవాదం చేస్తుంటారు. ఇక్కడ సమస్య త్వరగా కన్నుమూయడమా లేక చాలాకాలం పాటు జీవించడమా అని కాదు. ఉన్నన్నాళ్లూ ఎవరికీ భారం కాకుండా హాయిగా ఉండటం. ఆరోగ్యం బాగాలేక సుదీర్ఘకాలం మంచం పట్టి ఉండటమూ కోరుకునే అంశం కాదు, అలాగే పూర్తి ఫిట్నెస్తో ఉన్నవాళ్లు త్వరగా పోవడమూ అభిలాషణీయం కాదు. అందుకే ఉన్నన్నాళ్లూ ఆరోగ్యంగా, ఎవరికీ భారం కాకుండా, చురుగ్గా హాయిగా ఉండటం అన్నదే ఎవరికైనా కావాల్సింది. అందుకు మంచి ఆహారపు అలవాట్లు బాగా ఉపయోగపడతాయి. అదే చెడు ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం దెబ్బతిని మరణం రాకపోయినా మంచాన పడి నిరర్థకంగా ఉండాల్సి రావచ్చు. అందుకే మంచి ఆహారపు అలవాట్లు ఎల్లవేళలా మంచివే. చెడు ఈటింగ్ హ్యాబిట్స్ ఎప్పుడూ దూరంగా ఉండాల్సినవే. ఈ నేపథ్యంలో మంచి, చెడు ఆహారపు అలవాట్లపై కాస్తంత అవగాహన కోసం ఈ కథనం...మంచి ఆరోగ్యానికి మంచి ఆహారపు అలవాట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటివల్ల మంచి వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది. దాంతో అద్భుతమైన వ్యాధి నిరోధకత సమకూరుతుంది. దీని వల్ల కలిగే ఉపయోగాలు తక్షణం బయటకు కనిపించక΄ోవచ్చుగానీ... మంచి ఇమ్యూనిటీ వల్ల తప్పక మంచి జరుగుతుంది. గతంలో కోవిడ్ సమయంలో వైరస్ తీవ్రంగా ప్రభావం చూపినప్పటికీ వ్యాధి నిరోధక శక్తి పటిష్టంగా ఉన్నవారే బతికి బయటపడ్డారు. బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేసుకోకపోవడంఒకవేళ ఆహారపు అలవాట్లు బాగా లేకపోతే ఆ ప్రతికూల ప్రభావాలు వెంటనే కనిపిస్తాయి. ఇటీవల చాలామందిలో పొట్ట ఉబ్బరంగా ఉందనో, రాయిలా మారిందనో, తినగానే కడుపు ఉబ్బి΄ోయి, తేన్పులు వస్తూ, ఛాతీ మీద చాలా బరువుందనో అంటూ ఉండటం తరచూ చాలామందిలో కనిపించేదే. ఇవి ఆహారపు అలవాట్లలో తేడా వల్ల కనిపించే తొలి లక్షణాలు. మంచి ఆహారపు అలవాట్లతో కలిగే మేళ్లతో పాటు చెడు ఆహారపు అలవాట్లతో కలిగే దుష్ప్రభావాలను తెలుసుకుంటే చాలాకాలం పాటు పూర్తి ఆరోగ్యంతో, మంచి ఫిట్నెస్తో జీవించవచ్చు. ఈ సందర్భంగా ఆరోగ్యకరంగా జీవించడానికి మంచి ఆలవాట్లు ఏమిటో, అనారోగ్యం తెచ్చుకోవడానికి చెడు అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం...చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడంతినే ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా... తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం మంచిది. అంటే ఉదయపు టిఫిన్ (బ్రేక్ ఫాస్ట్), మధ్యాహ్న భోజనం (లంచ్),సాయంత్రపు పలహారం (ఈవినింగ్ శ్నాక్స్), రాత్రి భోజనం (సప్పర్/డిన్నర్) అంటూ ఇలా విభజించుకొని కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువసార.్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అంతగా భారం పడదు. పైగా ఇలా తినడం వల్ల దేహానికి అవసరమైన శక్తి (ఎనర్జీ) ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. కొందరు చాలా తక్కువసార్లు... ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటుంటారు. చాలా బిజీగా ఉండేవారు సమయం లేదనో లేదా తినే సమయంలో మరో పని పూర్తవుతుందనే భావన వల్లనో రెండు పూటలే తింటుంటారు. ఇలా తక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల పొట్ట ఉబ్బరంగా మారడం, పొట్ట రాయిలా గట్టిగా అనిపించడం, తినగానే పొట్ట ఉబ్బి΄ోయి ఎంతగానో అసౌకర్యంగా అనిపించడం (దీన్నే భుక్తాయాసం అని కూడా చెబుతుంటారు), తిన్నవెంటనే భోజనం ఛాతీకి అంటుకునే ఉన్నట్లు అనిపించడం లాంటి ఫీలింగ్, ఛాతీలో మంట, కడుపులో ఒకలాంటి నొప్పి, పుల్లటి తేన్పులు వంటి లక్షణాలు కనిపించడం మామూలే. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు ఇంటికి ఒక్కరైన ఉండటం ఈ రోజుల్లో చాలా సాధారణం. ఇక ఏయే వేళకు తినాల్సిన భోజనాన్ని ఆయా వేళల్లో తినడం, అలాగే రాత్రి భోజనాన్ని చాలా త్వరగా తినేయడంతోపాటు ఒకసారి రాత్రి భోజనం అయ్యాక మెలకువగా ఉన్న సమయంలో మళ్లీ మరేమీ తినకుండా జాగ్రత్త పడటం అవసరం. అలా కాకుండా రాత్రి భోజనం తర్వాత మెలకువగా ఉన్నప్పుడు తినడం వల్ల పొట్ట పెరిగి, అది రోగాల పుట్టగా పరిణమించడంతోపాటు కాస్మెటిక్గానూ బాగా కనిపించక΄ోవచ్చు. అన్ని పోషకాలూ లభ్యమయ్యే సమతుల ఆహారంతీసుకునే ఆహారంలో అన్ని రకాల ΄ోషకాలు ఉండాలన్నది ప్రధానం. అవేమీ లేని భోజనం చాలా పరిమాణంలో తిన్నా అది వృథాయే. అందుకే తక్షణ శక్తినిచ్చే పిండిపదార్థాలూ (కార్బోహైడ్రేట్లు), కణాలూ, కణజాలాలలను రిపేర్ చేసి, వాటిని పునర్నిర్మించే ్ర΄ోటీన్లు, దేహానికి అవసరమైన కొవ్వులతో΄ాటు, ఖనిజలవణాలూ, విటమిన్లు, మళ్లీ ఈ ΄ోషకాల్లోనూ ఎక్కువ మోతాదుల్లో అవసరమయ్యే మ్యాక్రో న్యూట్రియెంట్లు, తక్కువ మోతాదుల్లోనైనా తప్పనిసరిగా కావాల్సిన మైక్రో న్యూట్రియెంట్లు... ఇవన్నీ సమృద్ధిగా ఉండేలా మన భోజనం ఉండాలి. ఇలా అన్నీ సమ΄ాళ్లలో కలిగి ఉండే భోజనాన్ని ‘సమతులాహారం’ (బాలెన్స్డ్) అంటారు. ఇవన్నీ ఉండాలంటే భోజనంలో పిండిపదార్థాలనిచ్చే బియ్యం, గోధుమలు, ్ర΄ోటీన్లకోసం పప్పులు, మాంసాహారం, కొవ్వుల కోసం నూనెలతోపాటు ఆకుకూర.లు, కూర.గాయలు; విటమిన్లను సమకూరుస్తాయి తాజాపండ్లు తీసుకోవాలి. అయితే ఇక్కడ కొవ్వుల కోసం నూనెలు తీసుకునేప్పుడు వాటిని రుచి కోసం కాక దేహ అవసరాల కోసం మాత్రమే... అంటే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ల కోసం మాంసాహారం మీద ఆధారపడేవారు అంతగా ఆరోగ్యకరం కాని రెడ్ మీట్ (వేట మాసం) కంటే ఆరోగ్యకరమైన వైట్ మీట్ (చికెన్, చేపల వంటివి) తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడంమానవ శరీరరంలో 75 శాతం నీళ్లే ఉంటాయి. శరీరం ద్రవాలను కోల్పోవడాన్ని ‘డీ–హైడ్రేషన్’గా చెబుతారు. వేసవికాలంలో వడదెబ్బ వల్ల ఇలా దేహం ద్రవాలను కోల్పవడం జరిగి ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఇలాంటి అనర్థం జరగకుండా ఉండాలంటే ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ కనీసం మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగడం అవసరం. ఇక మెదడు నుంచి నరాల ద్వారా ఆయా దేహభాగాలకు అందాల్సిన ఆదేశాలన్నీ లవణాల వల్లనే జరుగుతుంది. ఆ లవణాలు అలా చేరవేయడానికి వీలుగా మారడానికి నీళ్లలో కరగడం వల్లనే జరుగుతుంది. అందుకే నీళ్లూ, లవణాలను కోల్పోకుండా ఉంటేనే మెదడునుంచి ఆయా అవయవాలకు అందాల్సిన ఆదేశాలు అందుతూ దేహం సక్రమంగా పనిచేస్తుంటుంది. అందుకే దేహం తాలూకు జీవక్రియలన్నింటికీ అవసరమైనన్ని నీళ్లు తాగుతుండటం అవసరం. మానవులు ఎన్ని నీళ్లు తాగాలనేదానికి ఓ కొండగుర్తు ఏమిటంటే... మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు మూత్రం పచ్చగా, బాగా గాఢంగా లేకుండా వీలైనంతగా నీళ్లలా ఉండాలి. మూత్రం అలా పచ్చగా, గాఢంగా ఉందంటే దేహంలో నీళ్లు తగ్గాయనడానికి నిదర్శనం. మూత్రం అలా ఉందంటే అలాంటప్పుడు తక్షణం శరీరానికి అవసరమైన నీళ్లు తాగాలని, అలా తాగడం ద్వారా దేహానికి అవసరమైనన్ని నీళ్లు (హైడ్రేషన్) సమకూర్చాలని అర్థం. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడంచాలామందిలో ఒక దురలవాటు ఉంటుంది. ఆహారం తీసుకునే సమయాన్ని ఆదా చేయడం కోసం ఉదయం తీసుకోవాల్సిన బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేసి నేరుగా మధ్యాహ్న భోజనం తీసుకుంటుంటారు. రోజువారీ వ్యవహారాలకు అవసర.మైన శక్తి అందడానికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మంచి అలవాటు అన్నది తెలిసిందే. అందుకే బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేయకూడదు. ఎక్కువ పరిమాణాన్ని తక్కువ సార్లు తినడంఎక్కువ పరిమాణంలో తక్కువసార్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అలా ఎక్కువ మోతాదుల్లో తక్కువ సార్లు తినడం వల్ల... కడుపులో ఆహారం లేని సమయంలోనూ ఆహారాన్ని అరిగించే ఆమ్లాలు జీర్ణవ్యవస్థ గోడలపైనా, పేగులపైన పనిచేయడంతో ఒక్కోసారి అది అల్సర్స్‌కు కారణం కావచ్చు. అటు తర్వాత ఆ అల్సర్స్ కారణంగా పేగులకు రంధ్రం పడటం వల్ల జీర్ణవ్యవస్థ / కడుపు / పేగుల్లోనే ఉండాల్సిన ఆహారం, జీర్ణ స్రావాలూ దేహ కుహరంలోకి ప్రవేశించడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. తగినన్ని మంచినీళ్లు తాగకపోవడంచాలామంది పనుల్లో పడిపోయి తాగాల్సినన్ని మంచినీళ్లు తాగరు. మరికొందరు ఆఫీసుల్లోని ఏసీ కారణంగా ఆ చల్లటి వాతావరణంలో ఉండటం వల్ల దాహం వేయక తగినన్ని నీళ్లు తాగరు. ఈ రెండు పరిణామాల్లోనూ ఆరోగ్యానికి చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు దేహానికి అవసరమైన నీళ్లు, లవణాలు అందక పిక్కలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్)తో పాటు కిడ్నీలో రాళ్లు రావడం వంటి అనర్థాలు చోటు చేసుకునే అవకాశముంది. అందుకే ప్రతిరోజూ ప్రతిఒక్కరూ దేహానికి అవసరమైనన్ని నీళ్లు తాగాలి. ఫాస్ట్ ఫుడ్ / జంక్‌ఫుడ్ తినడంఆధునిక జీవనశైలిలో పనివేళలూ, పనిగంటలూ పెరగడం, కొత్త తరహా పనులు, వృత్తుల వల్ల జీవితం ఉరుకులు పరుగులతో సాగడం వల్ల సమయం దొరకడం కష్టంగా మారింది. దాంతో మార్కెట్లో తేలికగా దొరకడంతో ΄ాటు అప్పటికప్పుడు తినగలిగే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం ఓ ట్రెండ్‌గా మారింది. నిజానికి చెడు అలవాట్లలో ఈ ఫాస్ట్‌ఫుడ్ / జంక్‌ఫుడ్ ముఖ్యమైనది. ఈ తరహా ఆహారంలో ఉండే రిఫైన్డ్∙పిండిపదార్థాల వల్ల డయాబెటిస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు... వీటికి తోడు చాలాకాలం నిల్వ ఉండటానికి వీలుగా (షెల్ఫ్‌లైఫ్‌ను పెంచడానికి) వీటిలో వాడే ప్రిజర్వేటివ్స్, అనారోగ్యకరమైన నూనెలు, అలాగే ఆహారపదార్థాల్ని ఆకర్షణీయంగా కనిపించేలా చేయడం కోసం వాడే రంగుల వల్ల ఇలాంటి జంక్ఫుడ్స్ అనేక రకాల క్యాన్సర్లకు కారణంగా మారుతున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. అందుకే వీలైనంతవరకు జంక్‌ఫుడ్‌ను తీసుకోక΄ోవడమే మంచిది. మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి అదికూడా చాలా పరిమితంగా వాటిని తీసుకోవాలి. మితిమీరి తీపిపదార్థాలు తినడంచాలామంది తీపిపదార్థాలనూ, మిఠాయిలను ఇష్టపడతారు. అయితే వీటిని మరీ మితిమీరి తినడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయి. తీపితో వచ్చే నష్టాలు తొలుత నోటిలో నుంచే మొదలవుతాయి. నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సూక్ష్మజీవులు పెర.గడం, వాటితో పళ్లు దెబ్బతినేలా లేదా పుచ్చి΄ోలాయే దంతక్షయం వంటి నష్టాలు సంభవిస్తాయి. మితిమీరి తీపిపదార్థాలు తినడం క్యాన్సర్‌కు ఒక కారణమంటూ చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది. ఇక కొంతమంది తమ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా టీ, కాఫీలు చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. రెండు లేదా మూడు కప్పుల పరిమితికి మించి కాఫీ, టీలు తాగడం తాగడం ఒకరకమైన నష్టాన్ని తెస్తే... అందులోని తీపి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చేటుగా పరిణమిస్తుంది. తినడానికి కనీసం అరగంట ముందు గానీ లేదా తిన్న అరగంట తర్వాత గానీ టీ తాగకూడదు. అలా టీ / కాఫీలు తాగితే తిన్న ఆహారంలోని ఐరన్ ఒంటికి పట్టదు. కూల్ బీవరేజెస్చాలామందికి కూల్డ్రింకులు, కోలా డ్రింకులు, శీతల ΄ానియాల వంటివి తాగుతుండటం అలవాటు. వీటిని తీసుకోవాల్సి వచ్చినా చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయక΄ోగా, కొన్ని అనర్థాలు కూడా తెచ్చిపెట్టే అవకాశముంది. పైగా వీటిలోని కెఫిన్ రాత్రి నిద్రపట్టకుండా చేసే అవకాశమున్నందున వీటిని రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు అస్సలు తీసుకోకూడదు. వీటివల్ల అసిడిటీ వంటి సమస్యలూ వచ్చే అవకాశముంది. వీటిలోని మితిమీరిన చక్కెరల వల్ల... డయాబెటిస్ మొదలుకొని అనేక సమస్యలు రావచ్చు. ఆల్కహాల్ అలవాటుతో అనర్థంఆల్కహాల్ ఆరోగ్యానికి చేటు తెచ్చే ప్రమాదకరమైన అలవాటు. దీనికి తోడు కొంతమంది ఆల్కహాల్‌తో పాటు కోలా డ్రింకులు కలుపుకుంటారు. దీంతో రెట్టింపు దుష్ఫలితాలు కలుగుతాయి. ఆల్కహాల్ వల్ల కడుపులోని లైనింగ్స్ దెబ్బతినడంతో పాటు అసిడిటీ, అల్సర్లు వస్తాయి. మద్యం అలవాటు లివర్‌ను దెబ్బతీసి, మొత్తం జీర్ణవ్యవస్థ పనితీరునే దెబ్బతీస్తుంది. ఇక ఆల్కహాల్ తాగే సమయంలో చాలామంది వేపుడు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. వాస్తవానికి వేపుళ్లు అంత మంచి ఆహారపు అలవాటు కానే కాదు. ఇలా ఎన్నో ఆరోగ్య అనర్థాలకు దారితీసే ఆల్కహాల్ అలవాటును పూర్తిగా వదిలేయాలి. చెడు ఆహారపు అలవాట్లివి... అంటే మంచి ఆహారపు అలవాట్లను అనుసరించక΄ోవడాన్ని చెడు ఆహారపు అలవాట్లుగా చెప్పవచ్చు. అంటే సమతులాహారం తీసుకోకపోవడం, వేళకు తినక΄ోవడం, తక్కువసార్లు ఎక్కువ పరిమాణంలో తినడం, తాజాపండ్లు తీసుకోక΄ోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం ఇవన్నీ ఆహారపరమైన చెడు అలవాట్లు. అయితే ఇవ్వాళ్టి మానవ జీవనశైలిలో ఇలాంటి చెడు ఆహారపు అలవాట్లు కాస్తంత ఎక్కువే. పైగా అవన్నీ ఇవ్వాళ్టి ఆహారపు ఫ్యాషన్లుగా కూడా కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశం. కొన్ని చెడు ఆహారపు అలవాట్లేమిటో చూద్దాం. -
‘అమ్మ’కు సుస్తీ చేస్తే? అమ్మ పనులు చేయడం వచ్చా?
ఇంట్లో ఎవరికైనా సుస్తీ చేస్తే అమ్మ వారికి సేవలు చేసి కోలుకునేలా చేస్తుంది. మరి అమ్మకు సుస్తీ చేస్తే? వంట ఎవరు చేయాలి?బాక్స్ ఎవరు కట్టాలి? అంట్ల పరిస్థితి ఏమిటి? అనారోగ్యం వల్ల ఆమెకు చిరాకు కలిగితే ఎలా వ్యవహరించాలి? ఎవరికి సుస్తీ చేసినా అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఏమీ కాదు. కానీ అమ్మకు సుస్తీ చేస్తే ఇంటికే సుస్తీ అవుతుంది. మరి మనకు అమ్మ పనులు ఎన్ని వచ్చు? ఒక్క అమ్మ అందరి పనులూ చేస్తుంది. అందరూ కలిసి అమ్మ పనులు చేయలేరా? ఇది చలికాలం. సుస్తీ చేసే కాలం. బద్దకం కాలం. ఏ త్రోట్ ఇన్ఫెక్షనో, జ్వరమో, ఒళ్లు నొప్పులో, నీరసమో, ఏమీ చేయాలనిపించని నిర్లిప్తతో, ముసుగు తన్ని విశ్రాంతి తీసుకోవాలనే తలంపుతో ఒక రోజంతా అమ్మను మంచం కదలనివ్వక పోతే అమ్మ ఎన్ని పనులు చేస్తుందో ఇంట్లోని సభ్యులకు అర్థమవుతుంది. ఆ పనులన్నీ అమ్మ కోసం ఇంటి సభ్యులు చేయగలరా? చేయాలి.ఎవరికి చిరాకు?సాధారణంగా అమ్మకు అనారోగ్యం వస్తే నాన్నకు చిరాకుగా అనిపిస్తుంది. మరి నాన్న ఆఫీసుకు వెళ్లాలి. ఏవేవో పనులుంటాయి. టైముకు అన్నీ జరిగి΄ోవాలి. అమ్మ మంచం మీద ఉంటే అవి జరగవు. అప్పుడు నాన్నకు చిరాకు వేస్తుంది. ‘లేచి పనుల్లో పడితే సుస్తీ అదే పోతుంది’ అని ఎఫ్.ఆర్.సి.ఎస్ లెవల్లో సూచన కూడా చేస్తాడు. అమ్మకు బాగా లేక΄ోతే పిల్లలు నాన్నకు చెప్పాల్సిన మొదటి సంగతి– లీవ్ పెట్టు నాన్నా... రోజూ వెళ్లే ఆఫీసేగా అని. తనకు బాగా లేకపోతే భర్త కన్సర్న్తో లీవ్ పెట్టాడు అనే భావన అమ్మకు సగం స్వస్థత ఇస్తుంది. ఆ తర్వాత నాన్న అమ్మతో చెప్పాల్సిన మాట ‘నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో’ అనే.పనులు పంచుకోవాలికొన్ని ఇళ్లల్లో తల్లిదండ్రులు పిల్లలకు ఆపిల్ పండు తొక్క తీయడం కూడా నేర్పరు. అలాంటి ఇళ్లలో ఇంకా కష్టం కాని కొద్దో గొప్పో పనులు చేసే పిల్లలు ఉంటే తండ్రి, పిల్లలు కలిసి ఏ మాత్రం శషభిషలు లేకుండా పనులు పంచుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ ఏమిటి? బ్రెడ్‌తో లాగించవచ్చు. మధ్యాహ్నం ఏమిటి? అన్నం కుక్కర్లో పడేసి, ఏదైనా ఊరగాయ, బాయిల్డ్ ఎగ్ కట్టుకుని వెళ్లవచ్చా? ఇల్లు సర్దే బాధ్యత ఒకరిది. పనిమనిషి ఉంటే ఆమె చేత అంట్లు తోమించి, ఉతికిన బట్టలు వైనం చేసే బాధ్యత ఒకరిది. ఈ పనులన్నీ అమ్మ తప్ప ఇంట్లో అందరూ చేయక పోతే ఆ ఇంట్లో అనవసర కోపాలు వస్తాయి. అవి గృహశాంతిని పోగొడతాయి. అసలే ఆరోగ్యం బాగలేకుండా ఉన్న అమ్మను అవి మరీ బాధ పెడతాయి. ఆమే ఓపిక చేసుకుని లేచి పని చేస్తే ఆరోగ్యం మరింత క్షీణించి లేని సమస్యలు వస్తాయి.అమ్మ పేరున మందు చీటిఏ ఇంటిలోనైనా అతి తక్కువ మందు చీటీలు ఉండేది అమ్మ పేరుతోనే. ఎందుకంటే సగం అనారోగ్యాలు ఆమె బయటకు చెప్పదు. ఒకవేళ చెప్పినా మెడికల్ షాప్ నుంచి తెచ్చి ఇవ్వడమే తప్ప హాస్పిటల్‌కు తీసుకువెళ్లడం తక్కువ. కాని అమ్మను కచ్చితంగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. డాక్టర్ సూచన ఆమెకు బలాన్ని ఇచ్చి లోపలి సందేహాలేవైనా ఉంటే పోగొడుతుంది. అమ్మ సరైన మందులతో తొందరగా కోలుకుంటుంది.అమ్మతో సమయంతనతో కాసింత సమయం గడపాలని అమ్మ కోరుకుంటుంది ఇలాంటప్పుడు. భర్త ఆమె దగ్గర కూచుని తీరిగ్గా కబుర్లు చెప్పవచ్చు. ఏవైనా జ్ఞాపకాలు నెమరు వేసుకోవచ్చు. మధ్య మధ్య ఆమెకు ఏదైనా సూప్ కాచి ఇచ్చి తోడుగా తనూ కాస్తంత తాగుతూ కూచుంటే అమ్మకు ఎందుకు బాగైపోదు..? పిల్లలు పాదాలు నొక్కుతూ కబుర్లు చెప్పవచ్చు. అమ్మ వర్కింగ్ విమన్ అయితే ఆఫీసుకు వెళ్లొద్దని ఇంకొన్నాళ్లు రెస్ట్ తీసుకోమని మారాం చేయొచ్చు. ఆ మారాం కూడా ఆమెకు మందే.కొంత ఖర్చు చేయాలిఅమ్మకు అనారోగ్యం అయితే అమ్మ వద్దు వద్దంటున్నా కొంత ఖర్చు చేయాలి. మంచి పండ్లు తేవాలి. వంట చేయలేని పరిస్థితి ఉంటే మంచిచోట నుంచి భోజనం తెచ్చుకోవాలి. మంచి హాస్పిటల్లో చూపించాలి. మందులు పూర్తి కోర్సు కొని వాడేలా చూడాలి. డాక్టర్లు పరీక్షలు ఏవైనా రాస్తే ఏం అక్కర్లేదు అని ఎగ్గొట్టకూడదు. అమ్మ కోసం కుటుంబం మొత్తం ప్రేమగా, సహనంగా, ఒళ్లు వొంచి పని చేసే విధంగా ఏ ఇంట్లో ఉండగలరో ఆ ఇంట్లో అమ్మ ఆరోగ్యంగా తిరుగుతుంది. తొందరగా కోలుకుంటుంది. ఇదీ చదవండి : తల్లి రైల్వే కూలీ.. బిడ్డకు పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం -
మానవీయ విలువలు వికసించాలి..
ఈనాడు సమాజంలో ఎటుచూసినా అమానవీయం, అరాచకం, అమానుషం రాజ్యమేలుతున్నాయి. మంచి, మర్యాద, మానవీయత మచ్చుకైనా కానరావడం లేదు. మనిషి మానవత్వాన్ని మరిచి మృగంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తమ పాత్రలో నీళ్ళు తాగాడని, పెళ్ళిలో గుర్రంపై ఊరేగాడని, తమ చెప్పుచేతల్లో ఉండకుండా తమతో సమానంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని బడుగులు, బలహీన వర్గా లపై దాడులు చేయడం, హింసించడం, చంపడం లాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి సంఘటనలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలకడం మానవ విలువల హననానికి పరాకాష్ట. ఆ స్థాయి వ్యక్తుల్లోనే విలువలు లుప్తం కావడం వల్ల సమాజంలో అసహనం, విద్వేష భావజాలం, కుల, మత రాజకీయాలు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ పెద్ద స్థాయిలో మానవీయ పరిమళ వికాసాన్నీ మనం చూశాం. కోవిడ్ సమయంలో ఇలాంటి అనేక దృశ్యాలు మన కంటబడ్డాయి. వలస కూలీల దుఃస్థితికి చలించి మానవతను చాటుకున్న అనేకమందిని మనం దర్శించాం. అనేకమంది మానవతావాదులు దేశ సరిహద్దుల్లో, అననుకూల పరిస్థితుల్లో సైనికుల రూపంలో అసాధారణ సేవలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవడం, ప్రకృతి విపత్తులు విరుచుకు పడినప్పుడు ఆపదల్లో చిక్కుకున్న ప్రజలను ఎంతో సాహసోపేతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అన్నిరకాల సహాయక చర్యల్లో పాల్గొనడం మనకు తెలిసిందే. ఇదే మానవత్వం!ఇవ్వాళ ఉగ్రవాదం రూపంలో, ప్రభుత్వాల నిరంకుశ విధానాల రూపంలో, మతం, కులం, జాతి, ప్రాంతీయ విభేదాల రూపంలో అనేక దేశాల్లో మానవత్వానికి తీరని హాని కలుగుతోంది. అడుగంటుతున్న మానవతా విలువలను పరిరక్షించి, మానవ హృదయాల్లో వాటిని మరలా పునః ప్రతిష్ఠించవలసిన అవసరం ఉంది. ఇందుకోసం అన్ని దేశాలూ నడుం బిగించాలి. – ఎమ్‌డి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ -
ఒదిగితేనే ఎదుగుదల
ఉరుకులు పరుగులతో ఉరవడిగా వచ్చి తనని చేరిన నదిని సముద్రుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ‘‘నీ ప్రవాహ వేగానికి మహావృక్షాలు విరిగి పడిపోతూ ఉంటాయి. ప్రబ్బలి మొక్కలు అలాగే ఉంటాయి. వాటిని నువ్వు ఏమీ చేయవా?’’ అని. నది ఈవిధంగా సమాధానం చెపుతుంది. ‘‘ప్రబ్బలి మొక్కలు వేగంగా ప్రవాహం వస్తుంటే ఎదురు నిలవక తలవంచి ఉంటాయి. ప్రవాహ వేగం తగ్గగానే యథాప్రకారం తలెత్తుతాయి. మహావృక్షాలు తలవంచవు’’ అని!నది చెప్పినది వృక్షాలకి సంబంధించినదే అయినా మనకి కూడా వర్తిస్తుంది. ఎగిరెగిరి పడినా, ఎదిరించి నిలిచినా, ఎదురొడ్డి నిలిచినా విరిగి పడటం జరుగుతుంది. పొగరు బోతు గొర్రె పొటేలు కొండని గెలవగలనని కుమ్మి తల చిట్లి నశించినట్టు అవుతుంది. తమకి శక్తి లేక పోయినా అహంకారంతో ఎదుటివారి శక్తి సామర్థ్యాలని తక్కువగా అంచనా వేసి దెబ్బతింటూ ఉంటారు మహావృక్షాల వంటి వారు. పైగా తమ నీడలో మరి ఏ మొక్కకి కూడా పెరిగే అవకాశం ఇవ్వరు. దానితో ఆపదలో ఆదుకునే వారు, తోడ్పడేవారు ఉండక కూలిపోక తప్పదు. తల ఎగరేసి, తల పొగరుతో ఉండక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు తలవంచటం, పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడు తలెత్తటం చేస్తారు తెలివిగలవారు గడ్డిపోచల లాగా. పెరుగుతున్న మొక్కకి ఏదైనా అడ్డు వస్తే, కొన్ని పక్కకి వంగి వెలుగు వచ్చే దారి చూసుకుని ఎదుగుతాయి. నిటారుగా మాత్రమే ఎదుగుతాము, వంగము అనుకున్న మొక్కలు గిడసబారతాయి. సముద్రంలో స్నానం చేయటానికి గాని, ఈత కొట్టటానికి గాని వెళ్ళేవారు అలకి అనుకూలంగా వెడతారు. అలతో పాటు లేచి పడతారు. అలకి వ్యతిరేక దిశగా ఈత కొడితే జరిగే అనర్థాలు అందరికీ తెలుసు. నదుల్లోనూ, కాలవల్లోనూ ఈతకి వెళ్ళేవారు ప్రవాహం ఎటువైపు ఉంటే అటే వెడతారు. వ్యతిరేక దిశలో వెడితే అది ఎదురీత. పడవలు కూడా ప్రవాహం వెళ్ళే దిశలో వేగంగా వెడతాయి. వ్యతిరేక దిశలో ప్రయాణం శ్రమతో కూడుకొని ఉంటుంది. పరిస్థితులని గమనించకుండా ఉండే ఈ ప్రవర్తనకి మనిషిలో ఉండే అహంకారమే కారణం. నా అంతటి వారు లేరు అనే గుణం. నన్ను ఎదిరించగల వారు లేరు అనే పొగరు. ఎదుటివారి సామర్థ్యాన్ని గుర్తించలేని గుడ్డితనం. ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అదిరిపాటుకి అంతూ దరీ ఉండవు. దీనినే ‘మదం’ అని కూడా అంటారు. విరగబాటుతనం ఉంటే ప్రవాహానికి ఎదురొడ్డిన మహావృక్షాల లాగా విరిగి పడటం తప్పదు. అంటే ఎప్పుడూ పరిస్థితులకి, అవతలి వారి ఇష్టానిష్టాలకి తల ఒగ్గి, వ్యక్తిత్వం అన్నది లేకుండా బతక వలసిందేనా? అన్న సందేహం రావటం సహజం. పరిస్థితులని మార్చగల శక్తిసామర్థ్యాలు ఉంటే మంచిదే. ఎప్పుడూ అట్లా ఉండటం అసంభవం. ప్రతికూలంగా ఉన్న సందర్భాలలో ఎట్లా ఉండాలి అన్నది కూడా తెలియాలి కదా! రోగాన్ని తగ్గించే అవకాశం లేకపోతే ఉపశమనం కలిగించాలి. అనుకూల వాతావరణం వచ్చేదాకా ఊరుకోవటం ఉత్తమం. ‘‘కొంచెముండు టెల్ల కొలది కాదు’’ అన్న వేమనని అనుసరించటం శ్రేయస్కరం. ఎదురీత నదిలోనే కాదు ఎక్కడైనా శ్రమతో కూడుకున్నదే. జీవితమనే ప్రవాహంలో కదిలే మనిషి అనుకూలమైన దిశలో సాగితే ప్రయాణం సుకరంగా ఉంటుంది. వ్యతిరేక దిశలో వెళ్ళటానికి ఎంతో శక్తిని వెచ్చించ వలసి ఉంటుంది. జీవితం సంఘర్షణ అవుతుంది. కొన్ని సందర్భాలలో ప్రవాహం ముందుకి తోస్తుంటే, తాను వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అంగుళం కూడా కదలక ఉన్న చోటనే నిలిచి పోవలసి రావచ్చు, నిలదొక్కుకోలేక కూలబడవచ్చు. అప్పుడు ప్రవాహంలో కొట్టుకు పోయే ప్రమాదం ఉంది. వీలు, వాలు చూసుకోవాలని పెద్దలు చెప్పేది అందుకే! -
మీ అమ్మాయికి చెప్పండి!
మీ ఇంట్లో, మీ పక్కింట్లో, ఎదురింట్లో, పొరుగింట్లో కూతుళ్లు ఉండే ఉంటారు. నవ్వుతూ తుళ్లుతూ స్కూళ్లకు వెళుతుంటారు. కొన్ని కళ్లు చూపులతోనూ, మరికొన్ని చేతలతోనూ ఆ నవ్వులను చిదిమేయడానికి పొంచి ఉంటాయి. ఆమెకు చెప్పండి ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ అంటే ఏమిటో...జాగ్రత్తగా ఎందుకు ఉండాలో. ‘మీ పక్కింట్లో, ఎదురింట్లో, పొరుగింట్లో, వెనకింట్లో ఉన్న అమ్మలు ఒక్కటవ్వండి. పరువు పరదాల మాటున పసిపిల్లలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయండి..’అని చెబుతున్నారు హైదరాబాద్ వాసులైన మమత, శైలజ, జయవర్ధని, పుష్పలత, లక్ష్మి. ఆడపిల్లల భవిత బాగుండాలంటే వారు ఈ రోజు సుర క్షితంగా ఉండాలి. చెడు చేతల బారిన పడకుండా ‘గుడ్ టచ్– బ్యాడ్ టచ్’ గురించి బడులు, మురికివాడలు, అపార్ట్మెంట్లు.. మొదలైన ప్రాంతాల్లో మమత, శైలజ, జయవర్ధిని, పుష్పలత, లక్ష్మి.. లు ‘అభయ భవిత’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వీరు చేసే ఈ అవగాహన కార్యక్రమం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా తెలుగు రాష్ట్రాలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోకీ తీసుకెళుతున్నామని తెలియజేశారు. పిల్లల భావాలను గ్రహించండి.. మూడు నుంచి పదేళ్లలోపు పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.‘ఆ పై వయసు పిల్లలు కూడా ఎదురు చెప్పలేని, ఎదుర్కోలేని స్థితిలో ఉన్నారని గమనిస్తున్నాం’ అంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. పిల్లల్లో ఆకలి తగ్గిపోవడం, ఎవరితో కలవకపోవడం, నిద్రలో ఉలిక్కిపడి లేవడం, ప్రతి విషయానికి చికాకు పడటం, చదువులో వెనకబడిపోవడం .. వంటి సమస్యలన్నీ చెడు స్పర్శకు గురైన పిల్లల్లో చూస్తుంటాం. ఈ ప్రభావం వారి భవిష్యత్తును దెబ్బతీయకుండా ఉండాలంటే పిల్లల్లో ఇలాంటి భావాలేమైనా ఉంటే వాటిని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. అబ్బాయిలనూ చెడు స్పర్శ సమస్య వెంటాడుతుంది. కాబట్టి, ఈ సమస్య అమ్మాయిలది మాత్రమే అని అనుకోవద్దు. పిల్లల ప్రవర్తనలో తేడాలు గమనించడం, నిపుణులు సాయం తీసుకోవడం సముచితం’ అని తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులుగా మీరేం చేయాలంటే.. ఎవరైనా అమ్మాయిల తలపై, వీపుపై తట్టడం .. వంటి స్పర్శ వారిపై చూపించే శ్రద్ధగానే అనిపిస్తుంది. కానీ, వారి శరీరంలోని ప్రైవేట్ పార్ట్‌లను తడమడం, తాకడం, కొట్టడం.. వంటివి పిల్లల భావాలపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే వారు స్పర్శించిన తీరు నచ్చకపోతే వెంటనే ‘నో’ చెప్పాలనే విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తే .. ∙అప్రమత్తంగా ఉండమని చెప్పండి ∙భద్రత కోసం ఏదైనా వస్తువును ఉపయోగించమనండి ∙ఎవరినైనా సాయం కోరమనండి ∙గట్టిగా అరవమనండి చెడు స్పర్శ వద్దే వద్దు అని చెప్పండి. ∙నిర్భయంగా ఉండమనండి ∙నీలో ఎంతో శక్తి ఉంది అది గ్రహించు అని చెప్పండి ∙సంఘటనను బట్టి వెంటనే ప్రతిఘటించమనండి ∙ఎలాంటి బాధ అయినా పంచుకోమని చెప్పండి. ఎవరికీ చెప్పుకోలేని సమస్య ఎదురైతే వెంటనే హెల్ప్‌లైన్ 1098 లేదా 100కు ఫోన్ చేయమనండి. – నిర్మలారెడ్డి బోర్డుపైన బొమ్మలు వేయించి పదేళ్లుగా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాను. పిల్లల ఆరోగ్యం గురించి, మహిళలకు స్కిల్ ట్రైనింగ్ చేస్తుండేవాళ్లం. ఇప్పుడు పిల్లలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పిస్తున్నాను. బళ్లారిలోని గవర్నమెంట్ స్కూల్లో ఇద్దరు అమ్మాయిలను నిలబెట్టి మిగతా అందరికీ అర్థమయ్యేలా వివరించాం. పిల్లల చేతనే బోర్డు మీద బాడీలో ఏయే పార్ట్స్ తాకితే బ్యాడ్ టచ్ అనే విషయాలను బొమ్మలు వేయించి, రాయించి తెలియజేశాను. ఈ కార్యక్రమంలో పిల్లలు వాళ్ల ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకోవడం, తాము ఎలా ప్రతిస్పందించాలో ఒకటొకటిగా చెబుతుంటే ఆనందంగా అనిపించింది. – పుష్పలత సమాచారం ఉన్నా అవగాహన లేదు బిజినెస్ ఉమన్‌గా నా పనులు చేసుకుంటూనే స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. కార్పొరేట్ స్కూళ్లలో మా ఫ్రెండ్ వాళ్లు స్టూడెంట్స్‌కు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక్కో కార్యక్రమానికి స్కూల్ నుంచి కొంత మొత్తం తీసుకుంటారు. కానీ, గవర్నమెంట్, ఇతర కాన్వెంట్ స్కూళ్లకు ఆ అవగాహన కల్పించేవారు తక్కువగా ఉన్నారు. మేము భవిత ప్రోగ్రామ్ ద్వారా ఉచితంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటీవల హన్మకొండ జిల్లా వంగరలోని స్కూల్ పిల్లలకు గుడ్‌టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పుడు చాలామంది దగ్గర ఉన్నప్పటికీ ఈ విషయంపై పిల్లలకు ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నారు అనేది తెలియడం లేదు. ఒకసారి చెప్పి వదిలేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సమస్యకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడూ ఇస్తూ ఉండాలి. – జయవర్ధని రక్షించుకోవాలనే ఆలోచన కలగాలి ఖమ్మంలో నా ఫ్రెండ్ డాక్టర్ ప్రశాంతితో కలిసి నిన్ననే ఒక స్కూల్ విద్యార్థులను కలిశాం. టీచర్‌గా, చైల్డ్ సైకాలజిస్ట్‌గా పిల్లలను ధైర్యవంతులను ఎలా చేయాలి అనే అంశాలపై చర్చించుకుంటూ ఉంటాం. పిల్లల మీద దాడులు జరిగినప్పుడు పెద్దలు ఆ విషయాలను బయటకు రానివ్వరు. ఎప్పుడో ఒకటో రెండో సంఘటనలు బయటకు వస్తాయి. ఈ కారణంగా చిన్నవయసులోనే పిల్లలు గర్భవతులు అవడం, ఆసుపత్రుల పాలవడం కూడా చూశాం. మేం చేసే ఈ కార్యక్రమం ద్వారా సమస్యను కొంతవరకైనా తగ్గించగలుగుతాం అనే ఆలోచనతో మొదలుపెట్టాం. కరోనాకు ముందు స్కూల్, కాలేజీలలో దాదాపు పదివేల మంది పిల్లలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి వివరించాం. ఇది పిల్లలున్న ప్రతి ఇంట్లో అవసరమైన టాపిక్. ఒక కథ లాగా చెప్పడం, తాము ఎవరి సమక్షంలో అయినా ఉన్నప్పుడు సురక్షితంగా అనిపించకపోతే గట్టిగా అరవడం, కొరకడం, నెట్టేయడం.. వంటివి చేయడం గురించి చెప్పాం. కరోనా టైమ్‌లో చాలామంది పిల్లలు ఈ విధానం వల్ల రక్షింపబడ్డారని వారి పేరెంట్స్ వచ్చి చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది. అనాథాశ్రమాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంటాం. తమని తాము ఎలా రక్షించుకోవాలనే ఆలోచనను పిల్లల్లో కలిగించడానికి వీలైనన్ని కాన్సెప్ట్స్ ఇస్తుంటాం. అభయ భవిత కార్యక్రమం ద్వారా వీలైనంత మందిమి గ్రూప్‌గా అవుతున్నాం. స్లమ్స్, ఇండ్లలోని వారిని కూడా కలుస్తున్నాం. తమ తమ ప్రాంతాల్లోనే ఉంటూ ఎవరైనా ఆడపిల్లల రక్షణ కోసం అవగాహన కల్పించవచ్చు. – ఏలూరి మమత పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి పోక్సో అండ్ పోష్ రెండూ సర్టిఫికేషన్ చేశాను. వీటిలో శిక్షణ తీసుకున్నాను. పిల్లలపై జరిగే అకృత్యాలు, దాడులకు సంబంధించిన చట్టాలు, ఎలా నియంత్రించవచ్చు... అనే దానిపై వర్క్ చేస్తుంటాను. మా ఫ్రెండ్ ఎన్జీవో నుంచి వాలంటీర్‌గా పిల్లలకు స్వీయరక్షణ కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్స్‌ను కలిసి, పిల్లలకు శిక్షణ తీసుకుంటూ ఉంటాను. ఇటీవల గోల్కొండ ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్లినప్పుడు 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి గురించి తెలిసింది. ఆ అమ్మాయి మొదట్లో చాలా చురుకుగా ఉండేది. ఇప్పుడు మానసికంగా చాలా దెబ్బతింది. తనతో మాట్లాడితే హాస్టల్లో లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసింది. ఎప్పుడూ ముభావంగా ఉండటం, సరిగా చదవకపోవడం, చిరాకు పడటం.. వంటివన్నీ ఉన్నాయి. లైంగిక వేధింపుల కారణంగా మానసికంగా దెబ్బతిన్న పిల్లలను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. – శైలజ యడవల్లి ఎదుర్కోవడానికి సిద్ధం చేయాలి మేం ఉంటున్న ఉప్పల్ ప్రాంతంలోనే ఉన్న కాన్వెంట్ స్కూల్‌కి వెళ్లి అక్కడి ప్రిన్సిపల్ అనుమతితో స్కూల్ అమ్మాయిలతో కలిసి, మాట్లాడాను. పిల్లల చేతనే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చిన్న చిన్న స్కిట్స్ చేయించాను. తోటి పిల్లల్లో ఎవరైనా ఎవ్వరితోనూ మాట్లాడకుండా, ముభావంగా ఉంటూ, సరిగ్గా చదవకుండా ఉన్నట్టు గమనిస్తే సమస్యను తెలుసుకుని టీచర్లకు తెలియజేయండి అని వివరించాను. పిల్లలు బాగా స్పందించారు. రెండు గంటలపాటు చేసిన ఈ కార్యక్రమంలో పిల్లలు ఆత్మరక్షణతో ప్రతిరోజూ ఎలా ఉండాలో, ఏదైనా చెడు సంఘటన జరుగబోతోందని అర్థమయిన వెంటనే ఎలా ఎదుర్కోవాలో వివరించాను. పదవతరగతి లోపు పిల్లలందరికీ ఎలాంటి చెడు సంఘటన ఎదురు కాకుండా ఉంటే ఆ తర్వాత వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకోగలరు. లేదంటే, వారి భవిష్యత్తుకు ప్రమాదం అవుతుంది. ఈ విషయం గుర్తించి అవగాహన కల్పిస్తున్నాను. – లక్ష్మి -
స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. మీ సర్టిఫికెట్లు అన్నీ ఇకపై,, 'అపార్' కార్డులోనే..
సాక్షి, నిర్మల్: ‘ఆధార్’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో ’వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తేనున్నారు. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యావనరులశాఖ తాజాగా ఆదేశించింది. అపార్ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్ సంఖ్యనే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ఇందులో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఈ అపార్ ఐడీ ప్రాముఖ్యతను వివరించాలని చెప్పింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత ఎప్పుడైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రయోజనం ఏమిటి? విద్యార్థి కేజీ నుంచి పీజీ వరకు చదివిన, చదువుతున్న సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. ఎల్కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతో పాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించబడి ఉంటుంది. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘చైల్డ్ ఇన్ఫో’ పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ అమలు చేయబోతున్న ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 1 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 26 కోట్ల మంది విద్యార్థులకు 12 అంకెలున్న సంఖ్యను కేటాయిస్తారు. ‘అపార్’ నిర్వహణ ఇలా.. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు ఈ బాధ్యతను అప్పగించింది. దీనికి చైర్మన్‌గా ఏఐసీటీఈ మాజీ చైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్షిప్స్, తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణ పత్రాలను భౌతికంగా కాకుండా డిజిటల్లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుందని ఏఐసీటీఈ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నమోదు ప్రక్రియ.. తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలో నమోదు ప్రక్రియ నిర్వహించబడుతుంది, వారు ఏ సమయంలోనైనా వారి సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే డేటాను పంచుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాఠశాలల ద్వారా ప్రతీ విద్యార్థిపై సేకరించిన డేటా జిల్లా సమాచార పోర్టల్‌లో నిల్వ చేయబడుతుంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దాదాపు 200కు పైగా ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ స్థాయిలో చైల్డ్ ఇన్ఫో ద్వారా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఐడీ నంబరు కేటాయించబడింది. కళాశాల స్థాయిలో మరో గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న అపార్ ఐడీ కార్డు ద్వారా మొత్తం ఒకే కార్డులో పూర్తి విద్య ప్రగతి, సమాచారం నిక్షిప్తమై అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సౌలభ్యం! విద్యార్థి తన విద్యాభ్యా స దశలో వివిధ రకాల ప్రాంతాల్లో అభ్యసిస్తా డు. వీటన్నింటిని ఒకే గొడుగు కిందికి తేవడం అనేది శుభ పరిణామం. ఈ అపార్ ఐడీ విధానం విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది. పదేపదే టీసీలు, బోనఫైడ్, పత్రాలు సేకరించడం వంటి సమస్యలు తీరుతాయి. విద్యార్థి ప్రగతి నైపుణ్యాలు ఒకేచోట నిక్షిప్తం చేయబడతాయి. – జిలకరి రాజేశ్వర్, తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, నిర్మల్ ప్రయోజనకరంగా ఉంటుంది విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏకీకృతంగా అపార్ కార్డు ద్వారా అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారం ఒకే ఐడీ నంబర్ ద్వారా నిక్షిప్తమై ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత వారి అనుమతితేనే విద్యాశాఖ ముందుకెళ్తుంది. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్ -
పిల్లలను మంచిగా పెంచడం ఎలా?
‘మా పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది సర్. ఉదయం లేచిన దగ్గర్నుంచీ మొబైల్ పట్టుకునే ఉంటారు. వాళ్లతో ఎలా డీల్ చేయాలో అర్థం కావడంలేదు.’ ‘మా పాపతో వేగలేకపోతున్నాం సర్. మొబైల్లో రైమ్స్ పెట్టకపోతే అన్నం కూడా తినదు’. ’‘మావాడు టాబ్‌తోనే ఉంటాడు. మనుషులతో అస్సలు మాట్లాడటం లేదు.’ కౌన్సెలింగ్ కోసం వచ్చిన చాలామంది తల్లిదండ్రులు ఇలా.. టెక్నాలజీ వల్ల తమ పిల్లలు ఎలా పక్కదారి పడుతున్నారో చెప్పుకుని బాధపడుతుంటారు. మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నామనేది కొట్టిపారేయలేని నిజం. వాటి నుంచి పిల్లల దృష్టిని మళ్లించడానికి పేరెంట్స్ పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఏమైనా చిట్కాలు దొరుకుతాయేమోనని యూట్యూబ్ ఓపెన్ చేస్తే.. అలవికాని చిట్కాలు కనిపిస్తాయి. కొందరు వాటిని నమ్మి, ఆచరించి, ఫలితాలు కనిపించక బాధపడుతుంటారు. ఈ సమస్యను తప్పించేందుకే ‘మంచి’ పిల్లలను పెంచడం ఎలా? అని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్టులు ఏళ్లుగా అధ్యయనం సాగిస్తున్నారు. ఎంత డిజిటల్ యుగంలో ఉన్నా, ఎంత టెక్నాలజీ ఉపయోగిస్తున్నా పిల్లలను పెంచే ప్రాథమిక అంశాలేమీ మారలేదు. పిల్లలు తమ లక్ష్యాలను సాధించాలని, ఆనందంగా జీవించాలనే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలాంటి పిల్లలను పెంచాలంటే కఠిన శిక్షలు అవసరంలేదనీ, ఖరీదైన కార్పొరేట్ స్కూళ్ల అవసరం అంతకన్నా లేదని, జస్ట్ ఆరు సూత్రాలను ఆచరిస్తే చాలని చెప్తున్నారు హార్వర్డ్ సైకాలజిస్టులు. ఆ ఆరు సూత్రాలేమిటో ఇప్పుడు, ఇక్కడ తెలుసుకుందాం. 1) మీ పిల్లలతో సమయం గడపండి ఇది అన్నింటికీ పునాది వంటిది. మీ పిల్లలతో క్రమం తప్పకుండా సమయాన్ని వెచ్చించండి. వారి గురించి, ప్రపంచం గురించి, వారు దానిని ఎలా చూస్తారు అనే విషయాల గురించి ఓపెన్–ఎండ్ ప్రశ్నలు అడగండి. వారి ప్రతిస్పందనలను చురుకుగా వినండి. దీనిద్వారా మరొక వ్యక్తి పట్ల ఎలా శ్రద్ధ కనబరచాలో వారికి చూపిస్తున్నారు. ఇంకా తనో ప్రత్యేక వ్యక్తి అని, తనదో ప్రత్యేక వ్యక్తిత్వమని గుర్తుచేస్తుంటారు. 2) ముఖ్యమైన విషయాలను గట్టిగా చెప్పండి గట్టిగా మాట్లాడితే పిల్లలు నొచ్చుకుంటారని చాలామంది పేరెంట్స్ ముఖ్యమైన విషయాలను కూడా నెమ్మదిగా, సున్నితంగా చెప్తుంటారు. దీంతో పిల్లలు వాటిని ఏమాత్రం పట్టించుకోరు. కాబట్టి ముఖ్యమైన విషయాలను గట్టిగా చెప్పాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, టీమ్ వర్క్‌లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారో టీచర్లు, కోచ్‌లను అడిగి తెలుసుకోమంటున్నారు. 3) ఎలా పరిష్కరించుకోవాలో నేర్పించండి ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎవరెవరు ప్రభావితమవుతారో, వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలో మీ పిల్లలకు అర్థమయ్యేలా వివరించండి. ఉదాహరణకు మీ పిల్లలు ఏదైనా గేమ్ లేదా టీమ్ యాక్టివిటీ నుంచి తప్పుకోవాలను కుంటే.. వారిపై అరిచి భయపెట్టకుండా, దానివల్ల ఏర్పడే పరిణామాలు వివరించండి. అసలు సమస్య మూలం ఎక్కడుందో గుర్తించి, టీమ్ పట్ల కమిట్మెంట్తో ఉండమని ప్రోత్సహించండి. 4) సహాయం చేయడం, కృతజ్ఞతతో ఉండటం నేర్పించండి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచే వ్యక్తులు ఉదారంగా, కరుణతో, సహాయకారులుగా, క్షమించే వారుగా ఉంటారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అలాంటి వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తోబుట్టువులకు సహాయం చేయమని పిల్లలను అడగండి. సహాయం చేసినప్పుడు థాంక్స్ చెప్పండి. తద్వారా వాళ్లు కూడా కృతజ్ఞతలు తెలపడం నేర్చుకుంటారు. అలాగే అసాధారణమైన దయను ప్రదర్శించినప్పుడు వారిని మెచ్చుకోండి. 5) విధ్వంసక భావోద్వేగాలను చెక్ చేయండి పిల్లల్లో కూడా కోపం, అవమానం, అసూయలాంటి నెగెటివ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను గుర్తించడం, వాటికి పేరు పెట్టడం, ప్రాసెస్ చేయడంలో సహాయం చేయడం, సురక్షితమైన కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ వైపు మార్గనిర్దేశం చేయడం చాలా అవసరమని తల్లిదండ్రులు గుర్తించాలి. అలాగే పిల్లల భద్రత దృష్ట్యా వారికి స్పష్టమైన, సహేతుకమైన సరిహద్దులను నిర్దేశించడమే కాకుండా, అవి వారికి అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యం. 6) బిగ్ పిక్చర్ చూపించండి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఇలా పిల్లల సర్కిల్ చాలా చిన్నది. ఆ సర్కిల్లోని వ్యక్తుల పట్లే వారు ప్రేమ, శ్రద్ధ, సానుభూతి చూపిస్తారు. అయితే ఆ సర్కిల్ వెలుపల ఉన్న వ్యక్తుల గురించి కూడా వారు శ్రద్ధ వహించేలా చేయడం అవసరం. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని, వారి సమస్యను వారి కోణంలో అర్థం చేసుకోవాలని ప్రోత్సహించడం ద్వారా, టీవీలో వచ్చే అలాంటి సంఘటనలను వివరించడం ద్వారా పిల్లల్లో సహానుభూతిని పెంచాలి. ఈ ఆరు సూత్రాలు పాటిస్తే ఒక శ్రద్ధగల, గౌరవప్రదమైన, నైతికత గల పిల్లలను పెంచడం సాధ్యమేనని, దీనికంటే ముఖ్యమైన పని మరేదీ లేదని హార్వర్డ్ సైకాలజిస్టులు చెప్తున్నారు. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: రైస్ వల్ల షుగర్ లెవల్స్ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
విద్యార్థులే ఊపిరిగా..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మందమతులేం కాదు, తెలివైన, చురుకైన వారు. విద్యార్థులే కాదు టీచర్లు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు’’ అంటోంది నేషనల్ గుడ్ టీచర్ అవార్డు గ్రహీత మాలతీ టీచర్. దేశవ్యాప్తంగా యాభైమంది ఈ అవార్డు అందుకోగా అందులో మాలతీ టీచర్ ఒకరు. తమిళనాడులోని సెంగోటై్టలో పుట్టి పెరిగిన మాలతి నల్లాసైతిరా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభాస్యం పూర్తిచేసింది. మనస్తత్వ, రసాయన శాస్త్రాల్లో మాస్టర్స్ చేసింది. రసాయనశాస్త్రంలో పీహెచ్డీ చేస్తూ టీచర్‌గా పనిచేస్తోంది. 2008లో తిరుపూర్ పెరుమతూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా చేరింది మాలతి. అక్కడ మూడేళ్లు పనిచేశాక బదిలీ అవ్వడంతో తెన్కాసి గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా వెళ్లింది. ఇక్కడ ఏడాది పనిచేశాక ప్రమోషన్ రావడంతో వీరకేరళంబుదూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పోస్టుగ్రాడ్యుయేట్ సైన్స్ టీచర్‌గా చేరింది. గత పదేళ్లుగా ఇదే స్కూల్లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తూ విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ వారి మనసులో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది. ఆటపాటలతో... పాఠాలు విద్యార్థులు సైన్స్సబ్జెక్టుని ఇష్టపడాలని మాలతి కోరిక. అందుకే ఎంతో కష్టమైన చాప్టర్లను సైతం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తోంది. విలువిద్య, తోలుబొమ్మలాట, పాటలు పాడడం, నృత్యం, కథలు చెప్పడం ద్వారా సైన్స్ పాఠాలను వివరిస్తోంది. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల ద్వారా బోధించింది. గ్రామాల్లో మొబైల్ ఫోన్స్ లేని అంధవిద్యార్థులకు సైతం ఆడియో పాఠాలను అందించింది. నూటపద్దెనిమిది మూలకాల పట్టికను సైతం కంఠస్థం చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి చక్కగా నేర్చుకునేందుకు సాయపడుతోంది. మేధో వైకల్యాలున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వీరు కూడా మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషిచేస్తోంది. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తోంది. ఇలా మాలతీ టీచర్ సాయంతో సైబుల్ ఇస్లాం అనే మేధోవైకల్య విద్యార్థి 25 సెకన్లలో 20 ద్రవాల పేర్లు టకటకా చెప్పి ‘చోళన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నాడు. ఇస్లాంకు మాలతీ ఆరునెలలపాటు శిక్షణ ఇచ్చింది. మహేశ్వరి, కరణ్, శక్తి ప్రభ వంటి విద్యార్థులు సైతం సెకన్ల వ్యవధిలో నూటపద్ధెనిమిది మూలకాల పీరియాడిక్ టేబుల్‌ను అప్పచెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్‌లో చోటు దక్కించుకున్నారు. అరవైశాతం మేధో వైకల్యం కారణంగా సరిగా మాట్లాడలేని వారితో సైతం మూలకాల పేర్లను కంఠస్థం చేయించి, గడగడా చెప్పించడం విశేషం. అవార్డులు రికార్డులు... విద్యార్థులను రికార్డుల బుక్‌లో చోటుదక్కించుకునేలా తయారు చేయడమేగాక మాలతీ కూడా కరోనా సమయంలో ఐదువందల రోజులు ఉచితంగా ఆన్లైన్ తరగతులు చెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్ లో చోటు దక్కించుకుంది. మాలతి కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం 2020–2021 సంవత్సరానికిగాను డాక్టర్ రాధాకృష్ణన్ అవార్డుతో సత్కరించింది. 2022లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇరవై ఆరుగంటలపాటు నిరంతరాయంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆరోతరగతి నుంచి పై తరగతులకు పాఠాలు బోధించే మాలతీ తనకు వచ్చిన నగదు బహుమతితో విద్యార్థులకు రోటోటిక్స్ కిట్స్ కొని ఇచ్చింది. గేమ్‌లకు బానిసలు కాకుండా... స్మార్ట్ఫోన్లు వచ్చాక విద్యార్థులంతా మొబైల్ గేమ్స్‌కు అంకితమైపోతున్నారు. వీరిని ఆడుకోనిస్తూనే పాఠాలు నేర్పించడానికి మాలతి క్విజ్గేమ్ వాయిస్ యాప్‌ను రూ΄÷ందించింది. ఈ యాప్‌ను స్టూడెంట్స్‌తోనే తయారు చేయించడం విశేషం. దీనిలో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో విద్యార్థుల పేర్లు, ఇంగ్లిష్‌లోని కష్టమైన పదాలను వెతుకుతూ నేర్చుకోవచ్చు. విద్యార్థులకు నేర్పిస్తోన్న పాఠాలను వారి తల్లిదండ్రులు చూసేలా యూట్యూబ్‌లో పోస్టుచేస్తూ వారి ఉన్నతికి కృషిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మాలతి టీచర్. ‘‘బోధనే నా శ్వాస, విద్యార్థులే నా ఊపిరి. డాక్టర్లు, టీచర్లకు రిటైర్మెంట్ ఉండదు. అధికారికంగా రిటైర్ అయినప్పటికీ ఆ తరువాత కూడా స్టూడెంట్స్ కోసం పనిచేస్తాను. నేను సైకాలజీ చదవడం వల్ల విద్యార్థుల్ని, వారి వైకల్యాలను అర్థం చేసుకుని పాఠాలు చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్క టీచర్ సైకాలజీ చదివితే మరింత చక్కగా బోధించగలుగుతారు. నేషనల్ గుడ్ టీచర్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను నేర్చుకుంటూ, విద్యార్థులకు నేర్పించడమే నా జీవితాశయం’’ అని మాలతీ టీచర్ చెబుతోంది. -
10 అనవసర విషయాలు.. వీటి జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం!
మనిషి ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని పరిధులను కల్పించుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే లేని పోని సమస్యలు ఎదురవుతాయి. అవమానాలు కూడా ఎదురయ్యే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ 10 అనవసర విషయాలు మనిషికి ముప్పును తెచ్చిపెడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సమయం, శక్తి వృథా: మీకు అవసరం లేని చోటికి వెళ్లడం వలన లేదా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ విలువైన సమయం, శక్తి వృథా అవుతాయి. దీనికి బదులుగా మీ నైపుణ్యాలను అవసరమయ్యే విషయాలపైనే కేంద్రీకరించండి. తద్వారా మీ శక్తిసామర్థ్యాలు సద్వినియోగం అవుతాయి. 2. గుర్తింపునకు దూరం కావడం: మీరు అవసరం లేని చోటికి వెళ్లినప్పుడు, లేదా మీ సామర్థ్యాన్ని అనవసరం లేని విషయాలపై కేంద్రీకరించినప్పుడు మీకు తగిన గుర్తింపు, ప్రశంసలు అందకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీకు సహకారం అందకపోగా, మీ గుర్తింపు కూడా మరింత తగ్గే అవకాశం ఉంది. 3. ఇతరుల వ్యక్తిగతాల్లోకి తొంగిచూడటం: మీకు అవసరం లేనప్పుడు ఇతరుల వ్యక్తిగతాల్లోకి చొరబడకపోవడమే ఉత్తమం. ఇతరుల వ్యక్తిగతాలను గౌరవించండి. ఎదుటివారు మీ సహాయం కోసం ప్రత్యేకంగా అడగనంత వరకు వారి వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లకండి. 4. ఇతరుల సామర్థ్యాలను అణగదొక్కడం: మీరు ఉద్దేశ్యపూర్వకంగా ఇతరుల సామర్థ్యాలను అణగదొక్కే ప్రయత్నం చేయకండి. వారి నైపుణ్యాలపై నమ్మకం ఉంచండి. వారి బాధ్యతలను వారు స్వతంత్రంగా నిర్వహించేలా చూడండి. ఇందుకు అవసరమైతేనే సహకారం అందించండి 5. ఉనికికే ప్రమాదం: మీరు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకుని, ఇతరులు మీ ఉనికిపై ఆధారపడే భావాన్ని వారిలో కల్పించవద్దు. ఇది ఇతరుల ఎదుగుదలకు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే వారు తమ స్వంత నైపుణ్యాలను, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి బదులు మీపై ఆధారపడే స్వభావాన్ని ఏర్పరుచుకోవచ్చ. తద్వారా మీ ఉనికికే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. 6. లక్ష్యానికి దూరం కావడం: మీరు అవసరం లేని విషయాలలో అతిగా జోక్యం చేసుకుంటే మీ ఆసక్తులు, లక్ష్యాలకు దూరమై అన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం, మీకు నిజమైన ప్రయోజనాలను అందించగల ప్రయత్నాలను కొనసాగించడం ఎవరికైనా చాలా అవసరం. 7. అతిశయోక్తులకు దూరంగా ఉండటం: మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోవడం, వర్ణించుకోవడం వలన మీ అత్యవసరాలను, శ్రేయస్సును నిర్లక్ష్యం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన పనితీరు, జీవిత సమతుల్యతను కాపాడుకునేందుకు మనం ఏమిటో మనం తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. 8. వనరుల దుర్వినియోగం: మీరు మీ దగ్గరున్న వనరులను మీకు అవసరం లేని అంశాలపై మళ్లించినప్పుడు.. అది సమయం అయినా, డబ్బు అయినా వృథాకు దారితీస్తుంది. మీ దగ్గరున్న వనరులను ద్విగుణీకృతం చేసుకునేందుకు, వాటిని సమర్థవంతంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. 9. కార్యకలాపాలకు అంతరాయం: మీరు లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ కార్యకలాపాలకు, ఇతరుల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. మీరు కోరుకునే మార్పు, మెరుగుదల కోసం ఇప్పటికే ఉన్న ప్రక్రియలను కొనసాగించాలి. సంబంధిత ప్రోటోకాల్‌లను గౌరవించడం కూడా అవసరమే. 10. చివరికి మిగిలేది: మీరు అవసరం లేని విషయాల్లో తరచూ జోక్యం చేసుకోవడం వల్ల అది నిరాశకు దారితీస్తుంది. మీ ప్రయత్నాలను అనవసరమైన విషయాలపై పెట్టి, సమయం వృథా చేసుకోకుండా, విలువైన, అర్ధవంతమైన మార్పును కలిగించగల అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇది కూడా చదవండి: ‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు -
గుడ్ టచ్ బ్యాడ్ టచ్
దిక్కుల దివ్యగీతాలకు వారసులు, లోకపు భాగ్య విధాతలు పిల్లలు. పాపం పుణ్యం తెలియని ఈ పాపలకు ప్రమాదం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘బ్యాడ్ టచ్ గుడ్ టచ్’ గురించి పిల్లలకు సింపుల్ లాంగ్వేజ్‌లో, సులభంగా అర్థమయ్యేలా ఒక టీచర్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘షేర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్’ ‘ఈ వీడియోను ప్రతి స్కూల్లో పిల్లలకు చూపించాలి’... అంటూ నెటిజెన్స్ స్పందించారు. రోషన్ రాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.7 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. -
క్లైమాక్స్ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘ఖుషి’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘శాస్త్రాలు, సిద్ధాంతాలు వేరు కావొచ్చు. కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా మనం మనల్ని ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ‘ఖుషి’లో చెప్పం. క్లైమాక్స్ బాగుందని ప్రశంసలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్టే.. ఫెయిల్ అయిన చరిత్ర లేదు’’ అన్నారు. ‘‘షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘ఖుషి’ మంచి మూవీ కాబట్టి అవార్డులూ రావొచ్చు’’ అన్నారు నవీన్. ‘‘కథని నమ్మి ‘ఖుషి’ని నిర్మించాం. మా నమ్మకానికి తగ్గట్టు ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రాఫర్ మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. -
మంగళవారం మంచిదికాదా? ఎందుకు ఆ రోజు ఆ పనులు చేయరు!
మనలో చాలా మంది ఏ పని ప్రారంభించాలన్నా వారం, వర్జ్యం అనేవి చూసుకుంటారు. అలాగే చాలా మంది మంగళవారం గోర్లు, వెంట్రుకలు కత్తిరించుకోవడం అశుభంగా భావిస్తారు. దీని వెనుక కారణమేంటో తెలుసా? వారంలో అన్ని రోజులు తెరిచి ఉండే సెలూన్ షాప్‌లు మంగళవారం మాత్రం మూసి ఉంటాయి. ఆరోజున క్షౌరశాలలు నిర్వహించే నాయి బ్రాహ్మణులు అందరూ సెలవు దినంగా పాటిస్తారు. పైగా ఆ రోజు ఏ మంచి పని మొదలుపెట్టరు. ఎక్కడికీ వెళ్ళరు మరీ అర్జెంటు.. తప్పనిసరి ఐతే తప్ప. మంగళవారం మంచిదికాదన్న సంగతి ఎలా వచ్చింది..? ఎవరు చెప్పారు..? ఎంతవరకు నిజం..? చూద్దామా!. తమ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఉండే హిందువులు ఎవరూ కూడా మంగళవారం రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోరు. శరీరంపై అంగారక గ్రహ ప్రభావం మంగళవారాన్ని అంగారక గ్రహం రోజుగా (Mars Day) భావిస్తుంటారు. అంగారక గ్రహం అనేది ఎరుపు వర్ణానికి చిహ్నం. ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది. గ్రహ ప్రభావం వల్ల మంగళవారం రోజున ఆ వేడి మానవ శరీరంపై ప్రభావం చూపుతుందంటారు. ఆ రోజు శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. శరీరంపై గాట్లు పడే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు. కాబట్టి ఆ రోజున కటింగ్, షేవింగ్ లాంటివి చేసుకోవద్దని పెద్దలు చెప్పారు. జుట్టు కత్తిరించుకోడాన్ని ఆయుష్కర్మ అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పని చేయరాదు. ముందుగా గడ్డం, ఆపైన మీసం, ఆ తరువాత తలమీద ఉన్న జుట్టూ తీయించుకోవాలి. ఆపైన చేతిగోళ్లు, చివరగా కాలిగోళ్ళు తీయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరుసను అతిక్రమించరాదు. కొన్ని రోజులలో ఈ ఆయుష్కర్మ నిషిద్ధం. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య పౌర్ణమి తిధులు నిషిద్ధాలు. ప్రతినెలా వచ్చే సంక్రాంతి కూడా నిషిద్ధమే. వ్యతీపాత, విష్టి యోగ కరణాలలో, శ్రాద్ధ దినాలలో నిషిద్ధం. వ్రతదినాలైతే కూడా క్షవరము చేయించుకోరాదు. ఆయుష్కర్మ చేయించుకునే వారాన్ని బట్టి ఆయుష్షు పెరగడం కానీ తరగడం కానీ ఉంటుంది. శుక్ర వారమైతే పదకొండు నెలలు, బుధవారం అయితే ఐదు నెలలు, సోమవార అయితే ఎనిమిది నెలలు ఆయుష్షు పెరుగుతుంది. గురువారమైతే ఆయుష్షు పది నెలలు పెరుగుతుంది. ఆదివారం క్షవరము చేయించుకుంటే ఆయుష్షు నెల రోజులు తగ్గుతుంది. శనివారం అయితే ఏడు నెలలు తగ్గుతుంది. మంగళవారం అయితే ఎనిమిది నెలలు తగ్గుతుంది. పూర్వం షాపులు లేని రోజుల్లో ఇంటికి వచ్చే మంగలి పని చేసేవారు. (ఈ పదం వృత్తిరీత్యా వాడబడింది కానీ కులాన్ని సూచించేది కాదు.) ప్రతిరోజూ ఉద్యోగానికి వెడుతూ, గడ్డం, మీసం కావలసినంతగా కత్తిరించుకుని వెళ్లే అవసరం కూడా ఆ రోజుల్లో లేదు. మంగలి అతను వచ్చి క్షవరకర్మ చేసి వెళ్ళాక అతని భార్య వచ్చి ఇంట్లో వారిచ్చిన అన్నము, పదార్థాలు తీసుకుని వెళ్ళేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పంచాంగం చూసి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం చూసి క్షవరకర్మ చేయించుకునే పరిస్థితి లేదు. క్షవర కర్మ వృత్తిలో ఉన్నవారు కూడా షాపు తెరిచి అక్కడకు వచ్చిన వారికే ఆయుష్కర్మ చేస్తున్నారు. కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంచితే వారికి కిట్టదు. ఈ సూత్రాలలో చెప్పినవన్నీ పూర్తిగా వదిలివేయడానికి భారతీయులు ఇష్టపడరు అందుకే క్షవరం చేయించుకుంటే ఆయుష్షు ఎక్కువగా తరిగిపోయే మంగళవారాన్ని మాత్రమే సెలవు దినంగా స్వీకరించడం జరిగింది. తగాదలయ్యే అవకాశం ఎక్కువ.. అంగారక గ్రహ ప్రభావం కారణంగా మంగళవారం రోజున తగాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఇబ్బందుల్లో పడతారు. మంచి శకునాలు ఉండవు కాబట్టి ఆ రోజున ఏ కార్యం తలపెట్టినా అశుభంగా భావిస్తారు. దేవతలకు ఆ రోజు ప్రత్యేకం పూజలు, వ్రతాలకు ప్రత్యేకం ఇదే కాకుండా, మంగళవారం రోజున గోర్లు, జుట్టు కత్తిరించుకోకపోవడానికి మరో నమ్మకం కూడా ప్రాచుర్యంలో ఉంది. దుర్గాదేవి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఎక్కువగా మంగళవారాల్లోనే ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఆ రోజున దేవతలను పూజించడం వల్ల మంచి ఐశ్వర్యం, ధన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. అమ్మవార్లకు సంబంధించి మంగళవారం ప్రత్యేక దినంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేయరు. -
టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ గా అశ్విన్..!
-
అవి తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది!
ఇటీవలకాలంలో అందర్నీ పట్టిపీడించే సమస్య జుట్టు రాలడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కుచ్చులు,కుచ్చులుగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్న పెద్ద ప్రయోజనం కనిపించదు. అలాంటప్పుడూ మనం తీసుకునే ఆహారంలో దీన్ని చేరిస్తే ఆ సమస్య నుంచి కాస్త బయటపడగలమంటున్నారు ఆహార నిపుణులు. అందుకోసం ఏం చేయాలంటే.. మనం తినే ఆహారంలో బఠానీలు తీసుకుంటే జుట్టు రాలే సమస్య తుగ్గుతుందంటున్నారు నిపుణులు. ఈ మేరకు అమెరికాకు చెందిన న్యూట్రిషనల్ సైన్స్ బృందం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వాటిని మన దైనందిన జీవితంలో ఆహారంలో ఒక భాగంగా ఉపయోగించటం వల్ల జుట్టు రాలడం తుగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడించారు. ఈ బఠానీలలో తగిన మొత్తంలో బీ విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని వెల్లడించారు. కేవలం బఠానీలు మాత్రమే తీసుకుంటే సరిపోదని, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేలా అవసరమైన ప్రోటీన్లు అందించే సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలని తెలిపారు. వీటిల్లో విటమిన్ ఏ ఉంటుందని, అది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఒక భాగమని చెప్పారు. విటమిన్ ఏ ఉన్న ఇతర కూరగాయాల తోపాటు బఠానీలు తీసుకోవడం వల్ల జుట్టు మరింత ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. (చదవండి: రైతు బిడ్డగా ఓ వరుడి ఆలోచన..మండపానికి ఏకంగా 51 ట్రాక్టర్లతో..) -
బిల్డర్లకు రేటింగ్! రియల్టీలో విభజన రేఖ స్పష్టంగా ఉండాలి
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లలో మంచి, చెడు మధ్య విభజన రేఖ ఉండాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ జోషి అభిప్రాయపడ్డారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన నిధుల కోసం కస్టమర్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, బ్యాంకుల నుంచి పొందడానికి వీలుంటుందన్నారు. సీఐఐ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. రియల్ ఎస్టేట్‌లో ముఖ్యంగా ఇళ్ల ప్రాజెక్టులు ఎక్కువ శాతం కస్టమర్ల నిధులపైనే ఆధారపడి ఉంటున్నాయంటూ, ఈ విధానం మారాల్సి ఉందన్నారు. బిల్డర్ల గత పనితీరును మదించి రేటింగ్ ఇచ్చే విధంగా విశ్వసనీయమైన కార్యాచరణ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణం జాప్యం కావడానికి నగదు పరమైన సమస్యలు ఒక ప్రధాన కారణమన్నారు. చిన్న వర్తకులకు చెల్లింపులు చేసేందుకు కాంట్రాక్టులు కొన్ని నెలల సమయం తీసుకుంటున్నారనని పేర్కొంటూ.. చిన్న వర్తకులకు నేరుగా చెల్లింపులు చేసే వ్యవస్థను తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ‘‘రియల్ ఎస్టేట్ పరిశ్రమలో కేవలం కొన్ని చెత్త ప్రాజెక్టులు, కొందరు చెడు రుణ గ్రహీతల ఉండడం వల్ల పరిశ్రమ మొత్తం రుణాల పరంగా ప్రతికూలతలను చూస్తోంది. ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు!
ప్రతికూల పరిస్థితుల్లోనూ హాట్‌కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే.. పునాదుల్లోనే సగానికిపైగా అమ్మకాలు జరగాలంటే.. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏడాదిలో గృహ ప్రవేశం చేయాలంటే.. వీటన్నింటికీ ఒకే సమాధానం చిన్న ప్రాజెక్ట్‌లు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాజెక్ట్‌లు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్ట్‌లకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్‌లకు మరింత కలిసొచ్చే అంశం. సాక్షి, హైదరాబాద్: బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజె క్ట్ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్‌లు ప్రారంభించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్‌కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్‌లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా. ఏడాదిలో గృహప్రవేశం.. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్దిపాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్‌ల మార్కెట్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్‌లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. వసతులకు కొదవేంలేదు.. గతంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్‌ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్‌లతో పాటుగా స్విమ్మింగ్ పూల్, బేబీ, మదర్ కేర్ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లుంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్‌లో కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్‌వాసులందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. దీంతో ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. -
తిని.. పూడుస్తుంది!.. ‘గుడ్’ బ్యాక్టీరియా
సాక్షి, అనంతపురం: సిమెంట్ కాంక్రీట్‌ను పటిష్టంగా ఉంచడానికి మధ్యలో ఇనుప కడ్డీలను వినియోగిస్తారు. ఈ కడ్డీలు కాంక్రీట్‌కు అదనపు బలం చేకూర్చినా.. వాటివల్ల పగుళ్లు ఏర్పడతాయి. కాంక్రీట్ మిశ్రమాన్ని బట్టి కూడా చిన్నపాటి పగుళ్లు ఏర్పడుతుంటాయి. ఇందులోకి నీరు లేదా తేమ చేరి ఇనుప కడ్డీలు తుప్పు పట్టడం, పగుళ్లు పెరిగి పెచ్చులు ఊడిపోవడం వంటివి చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లోని గృహాల్లో ఉప్పునీటి ఆవిరి కారణంగా స్లాబ్‌లలో పగుళ్లు ఏర్పడతాయి. పగుళ్లతో వచ్చే సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం వివిధ రకాల విధానాలు అనుసరిస్తున్నారు. గ్రౌటింగ్, ఎఫ్ఆర్సీ ఫిల్లింగ్ విధానాలు ఉన్నా.. వీటివల్ల కలిగే ప్రయోజనం తాత్కాలికమే. పైగా ఈ విధానాలు అత్యధిక ఖర్చుతో కూడుకున్నవి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అనంతపురం జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్లు హెచ్.సుదర్శనరావు, వైశాలి జి.గోర్పడే వినూత్న పరిశోధనకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జేఎన్టీయూలో వివిధ విధానాలపై ఆరేళ్లపాటు పరిశోధనలు, ప్రయోగాలు జరిపి అత్యంత చౌకగా.. సుదీర్ఘకాలం మన్నికగా ఉండే ‘బ్యాక్టీరియల్ కాంక్రీట్’ విధానానికి రూపకల్పన చేశారు. వీరి పరిశోధన విజయవంతమై ఇండియన్ పేటెంట్ సైతం లభించింది. మిత్ర బ్యాక్టీరియాలతో సమస్యకు చెక్ పరిశోధనలో భాగంగా ప్రొఫెసర్లు ఎయిరోఫిలియస్, ప్లెక్సెస్, స్టార్టోౖస్పెరికాస్ అనే మూడు రకాల మిత్ర బ్యాక్టీరియాలను ఉపయోగించారు. విభిన్న ప్రాంతాల నుంచి మురికి నీటిని సేకరించి అందులో మట్టి కలిపారు. అందులోనే బ్యాక్టీరియాను అభివృద్ధి చేశారు. తక్కువ కాలంలోనే బ్యాక్టీరియా రెట్టింపు అవుతున్నట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాలు కాంక్రీట్‌లో ఉండే సీఎ‹Üహెచ్(కాల్షియం సిలికేట్ హైడ్రేట్) జెల్‌ను ఆహారంగా తీసుకుంటూ సుదీర్ఘకాలంపాటు బతికేస్తాయని గుర్తించారు. అక్కడ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కాల్షియం కార్బొనేట్ పగుళ్ల లోలోపలకి చొచ్చుకుంటూ వెళ్లి పగుళ్లను పూడుస్తాయి. కాంక్రీట్‌లో ఉన్న సీఎస్హెచ్ జెల్ తింటూ బ్యాక్టీరియా తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటూపోతుంది. కాంక్రీట్‌లో ఉండే ‘సీఎస్హెచ్ జెల్’ పూర్తిగా వినియోగం కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. కాబట్టి బ్యాక్టీరియా లోపల హాయిగా బతికేస్తుంది. మిత్ర బ్యాక్టీరియా కాబట్టి మానవాళికి హానికరం కాదు. రెండు పరిశోధనలు విజయవంతం ► కాంక్రీట్ మిశ్రమాన్ని స్లాబ్‌పై వేసే సమయంలోనే బ్యాక్టీరియాను కలిపారు. భవనం పటిష్టంగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం మన్నిక ఉంటుందని తేటతెల్లమైంది. ► కాగా, భవనాలకు పగుళ్లు వచ్చిన తర్వాత బ్యాక్టీరియాను ప్రవేశపెట్టి.. అభివృద్ధి చేయడం ద్వారా పగుళ్లను వాటితోనే భర్తీ చేశారు. తద్వారా పగుళ్లు పూడుకుపోవడంతోపాటు భవనం పటిష్టత పెరుగుతూ వచ్చింది. ► ఈ రెండు పరిశోధనలు విజయవంతం కావడంతో ప్రొఫెసర్లు హెచ్.సుదర్శనరావు, వైశాలి జి.గోర్పడే ‘మెథడ్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాంక్రీట్ విత్ సెల్ఫ్ హీలింగ్ ఎబిలిటీస్ అండ్ ప్రొడక్ట్స్ దేర్ ఆఫ్’ పేరిట సమర్పించిన అంశానికి పేటెంట్ దక్కింది. ఆరేళ్ల పరిశోధనల ఫలితమిది కాంక్రీట్‌లో పగుళ్లు ఏర్పడినా.. భవనం దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా బ్యాక్టీరియల్ కాంక్రీట్ విధానంపై సుదీర్ఘమైన పరిశోధనలు చేశాం. అత్యంత చౌకైన విధానం ఇది. మెరుగైన ఫలితం వస్తుంది. భవనాలు ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాం. ఇందుకు పేటెంట్ దక్కడం చాలా ఆనందంగా ఉంది. ఆరేళ్లపాటు చేసిన పరిశోధనకు ఫలితం దక్కింది. నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ట్ యూనివర్సిటీ వారు ఈ పరిశోధన వినియోగించడానికి జేఎన్టీయూ(ఏ)తో సంప్రదింపులు జరుపుతున్నారు. – ప్రొ. సుదర్శనరావు, ప్రొ.వైశాలి జి.గోర్పడే, సివిల్ ఇంజనీరింగ్ విభాగం, జేఎన్టీయూ అనంతపురం -
ఏది గుడ్.. ఏది బ్యాడ్?.. అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధుల కళ్లు పడుతున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసిన వారే దుశ్చర్యకు ఒడిగడుతున్నారు. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే, మన పిల్లలకు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్.. అన్నది చెప్పాలి. తాకకూడని చోట ఎవరైనా తడిమితే, భయపడకుండా ‘డోంట్ టచ్ మీ’ అని గట్టిగా అరవాలి.. అక్కడి నుంచి పరుగెత్తాలి.. ఎవరికైనా జరిగిన విషయాన్ని చెప్పాలి.. దీనిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. చదవండి: రేటు ఎంతైనా.. రుచి చూడాల్సిందే! బాలికలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. లైంగిక వేధింపులు, బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగేలా జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ, మహిళాభివృద్ధి శిశు, సంక్షేమం, ఫోరమ్ ఫర్ చైల్డ్ లైన్, పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రత్యేక నినాదాలతో అవగాహన ♦తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ‘అరవండి.. పరుగెత్తండి.. చెప్పండి’ (షౌట్.. రన్.. టెల్) నినాదాలతో ఆపదలో ఉన్న పిల్లలకు తెలిసే విధంగా ప్రచార పోస్టర్లను తయారు చేశారు. ♦వీటిని జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, ఎంపీడీఓ, తహసీల్దార్, గ్రామ, వార్డు సచివాలయాలు, వసతి గృహాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్, ప్రముఖ కూడళ్ల వద్ద శాశ్వతంగా ఉండేలా ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ♦ఆయా పోస్టర్లపై చైల్డ్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీస్ హైల్ప్ లైన్ 100 నంబర్లను ఉంచారు. ♦పాఠశాలలో నిర్వహించే అసెంబ్లీలో లైంగిక వేధింపులు, బాలల హక్కులపై చర్చించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ♦గుడ్, బ్యాడ్ టచ్ మధ్య వ్యత్యాసంపై ఎనిమిది నిమిషాల నిడివితో వీడియో క్లిప్ రూపొందించారు. ♦దీనిలో ఎవరైనా శరీర రహస్య భాగాలను తాకినా వెంటనే నిలువరించేందుకు వీలుగా బిగ్గరగా ‘అరవటం’.. వారి నుంచి సాధ్యమైనంత దూరంగా ‘పరుగెత్తడం’.. ♦తల్లిదండ్రులకు/పెద్దవారికి తెలిసేలా ‘చెప్పండి’ వంటి వాటితో అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన సదస్సులు.. జిల్లాలోని లా అండ్ ఆర్డర్ పోలీసులు, దిశ అధికారులు, చైల్డ్ లైన్ సహకారంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నివారించేందుకు వీలుగా ప్రజలకు అవగాహన కల్పించి, నేరాలను అరికట్టాలనే భావనతో ముందుకు వెళ్తున్నారు. పిల్లలకు గుడ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అన్న విషయాలను ఏ విధంగా చెప్పాలి. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాలు చేసిన వారిపై ఎటువంటి శిక్షలు ఉంటాయనే దానిపైన సదస్సుల్లో వివరిస్తున్నారు. బాలికలకు అవగాహన కల్పిస్తున్నాం.. లైంగిక వేధింపులు, బాలల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆపదలో ఉన్న పిల్లలకు తెలిసే విధంగా ప్రత్యేక పోస్టర్లను తయారు చేసి, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నాం. బ్యాడ్, గుడ్ టచ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసంపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. హెల్ప్‌లైన్ నంబర్లపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. – ఎస్. ఢిల్లీరావు, కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా బాలలపై నేరాలను అరికట్టే విధంగా చర్యలు జిల్లాలో బాలలపై జరుగుతున్న నేరాలను అరికట్టే విధంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఆపదలో ఉన్న వారు హెల్ప్ లైన్ నంబర్లు వినియోగించుకొనేలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. – టి.కె. రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా -
పెళ్లి సందడి.. కల్యాణ ఘడియలొచ్చేశాయి..
సాక్షి, అమరావతి బ్యూరో: కల్యాణ ఘడియలొచ్చేశాయి. ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి. దీంతో జిల్లాలోను, నగరంలోనూ చాలా ఇళ్లల్లో పెళ్లి సందడి షురూ కానుంది కొన్నాళ్లుగా కోవిడ్ భయంతో పలువురు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. తప్పనిసరి అయిన వారు మాత్రమే వివాహాలు జరిపించుకున్నారు. గత నవంబర్, డిసెంబర్ నెలల్లో కొన్ని ముహూర్తాలు ఉన్నప్పటికీ ఒమిక్రాన్ భయంతో వెనకడుగు వేశారు. ఇప్పుడు క్రమంగా కోవిడ్ తగ్గుముఖం పడుతుండడంతో పాటు శుభ ముహూర్తాలు ఆరంభం కావడంతో పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేటి నుంచే సందడి షురూ.. శనివారం నుంచి ఈనెల 16 వరకు 5, 6, 7, 10, 11, 12, 14, 16 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఈనెల 20 నుంచి మార్చి 23 వరకు గురు మౌఢ్యమి (మూఢం) ఉంటుంది. మౌఢ్యమి రోజులు అశుభంగా పరిగణించి పెళ్లిళ్లు, ఇళ్లకు శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాలు జరిపించరు. గురు మూఢం ముగిశాక కూడా మార్చి 23 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు మంచి ముహూర్తాలు లేవు. తిరిగి మళ్లీ ఏప్రిల్ 2 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలు కానున్నాయి. ఏప్రిల్‌లో 2, 3, 6, 7, 13, 15, 16, 20, 21, 23, 24 తేదీలు అంటే పదకొండు రోజుల పాటు పెళ్లిళ్లకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే మే నెలలో 4, 11, 12, 13, 15, 26 తేదీల్లో వివాహ సుముహూర్తాలున్నాయి. ముందు ముహూర్తాలకే ప్రాధాన్యం.. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి జనాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏ వేరియంట్ రూపంలో వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. వచ్చే రోజుల్లో కోవిడ్ పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయాందోళన అన్ని వర్గాల్లోనూ ఉంది. పైగా కొద్ది రోజుల నుంచి కోవిడ్ తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే కొన్నాళ్ల పాటు వేచి ఉండకుండా ముందుగా వచ్చే ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. తగ్గించుకుంటున్న పెళ్లి ఖర్చులు.. గతంలో పెళ్లిళ్లకు భారీగా ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా జరిపించేవారు. స్తోమతను బట్టి లక్షలు, కోట్ల రూపాయలను వెచ్చించే వారు. ఇదంతా కోవిడ్‌కు ముందు నాటి పరిస్థితి. కానీ ఇప్పుడా పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కరోనా భయంతో పాటు కోవిడ్ ఆంక్షలతో ఎంతటి స్థితిమంతులైనా ఆర్భాటాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. వివాహ వేడుకలకు పరిమితులు విధించడంతో మునుపటిలా వందలు, వేల మందిని ఆహా్వనించడం లేదు. పురోహితులకు డిమాండ్.. ఇక ఈ నెలలో కేవలం ఎనిఠిమిది రోజుల్లోనే పెళ్లి ముహూర్తాలుండడంతో పెళ్లి పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. విజయవాడలో దాదాపు 1500 మంది పురోహితులున్నారు. వివాహానికి స్థాయిని బట్టి పురోహితులు రూ.30–60 వేల వరకు తీసుకుంటారు. కల్యాణ మండపాలకు గిరాకీ.. మరోవైపు కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ కనిపిస్తోంది. పెళ్లిళ్లు రెండు, మూడు నెలల ముందుగానే నిశ్చయమవడంతో అప్పట్లోనే వీటిని బుక్ చేసుకున్నారు. దీంతో ఇప్పుడు విజయవాడ నగరంలోని వివాహ వేదికలు ఖాళీ లేకుండా పోయాయి. బెజవాడలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 16 కల్యాణ మండపాలున్నాయి. ప్రైవేటు ఫంక్షన్ హాళ్లు మరో 70 వరకు నడుస్తున్నాయి. ఈ నెలలో జరిగే పెళ్లిళ్లకు ఇవన్నీ దాదాపు బుక్ అయినట్టు చెబుతున్నారు. కొందరు ధనికులు పేరున్న హోటళ్లలో వివాహాలు జరిపించుకుంటున్నారు. విజయవాడలో వివిధ స్టార్ హోటళ్లలో 4,500 వరకు గదులుండగా వీటిలో సగటున 50 శాతానికి పైగా పెళ్లిళ్లకు బుక్ అయ్యాయి. నగరపాలక సంస్థ కల్యాణ మండపాలకు ఒక రోజు అద్దె రూ.10–15 వేలు, వీఎంసీ ఐవీ ప్యాలెస్ రూ.లక్ష ఉంది. ప్రైవేటు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. 50 శాతం ఆక్యుపెన్సీ.. కోవిడ్ భయంతో చాన్నాళ్లుగా వివాహ వేడుకలను తగ్గించుకున్నారు. దీంతో ఆతిథ్య రంగం బాగా నష్టపోయింది. కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతుండడం కాస్త ఊరట కలిగిస్తోంది. ఈ నెలలో మంచి ముహూర్తాలుండడంతో నగరంలోని హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ 50 శాతం వరకు పెరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం. – ముప్పవరపు మురళీకృష్ణ, మెంబర్, విజయవాడ హోటలీయర్స్ అసోసియేషన్ ఈ నెలలో మంచి ముహూర్తాలు.. మాఘమాసం (ఫిబ్రవరి)లో సెంటిమెంటుగా భావించి పెళ్లిళ్లు చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. ఈ నెలలో ఎనిమిది రోజులు మంచి ముహూర్తాలున్నాయి. అందువల్ల ఆయా తేదీల్లో వివాహాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. – కృష్ణశాస్త్రి, పురోహితుడు, విజయవాడ -
మానవులకు మంచి చేసే బ్యాక్టీరియా
-
మంచి మనుషులు
మనుషులు ఎమోషన్స్‌ని అదుపు చేసుకోవడం, బిలీఫ్స్ని చెక్కుచెదరనివ్వక పోవడం.. ఇలాంటి వాటి వల్లనే జీవితానికి ఇంత అందమేమో! అయితే మనుషుల్లో నిద్రపట్టనివ్వని వాళ్లు, నిజాల కుండల్ని బద్దలు కొట్టే వాళ్లు లేకపోతే జీవితంలోని ఆ అందాన్ని చిలికి పైకి తెచ్చేదెవరు? మనిషంటేనే మంచి. మన దేశంలోనైనా, మరో దేశంలోనైనా. ప్రకాశ్‌రాజ్ కూడా అన్నాడు కదా, ‘మనిషంటేనే మంచిరా..’ అని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో. ఒకవేళ లోకం నిండా చెడ్డవాళ్లు ఉండి, ఒకళ్లిద్దరు మంచివాళ్లు ఉన్నా చాలు లోకంలోని చెడును చెట్టులా కొట్టేయడానికి. చెట్టును కొట్టేయడం చెడు కదా! చెడే. చెట్టును కొట్టేయవలసిన టైమ్ వచ్చినప్పుడు కొట్టేయడం ‘మంచి చెడు’ అవుతుంది తప్ప, చెడు అవదు.లోకమంతటా మంచివాళ్లు ఉన్నప్పుడు డెస్క్ పక్కన డెస్క్‌లో, ఇళ్ల పక్కన ఇళ్లలో మంచివాళ్లు లేకుండా ఉంటారా? ఆఫీస్‌లో కొంతమంది మంచివాళ్లు ఉంటారు. పాపం, ఏం తోచక బల్లపై దరువులు వేస్తుంటారు. దరువు బోర్ కొట్టేస్తే చిటికెలు. పిల్లలు రేకు డబ్బాలను డబడబలాడిస్తూ ఒక్కరే ఏకాంతంలో ఎంటర్టైన్ అవుతుంటారు కదా, చలంగారు అన్నట్లు.. అలాగ. పక్కన డెస్క్‌లో పని జరుగుతుంటుందన్న ఆలోచన వాళ్లకు రావాలని రూలేం ఉంది?! ఇళ్ల పక్క ఇళ్లల్లోనైతే ఈ టైప్ ఆఫ్ ‘బాల్యం’లోని వాల్యూమ్ ఇంకొంచెం వైల్డ్‌గా ఉంటుంది. మూడో, నాలుగో ఇళ్ల్ల అవతలికి వినిపించేలా. భరించే మంచితనం ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నార్త్ కరొలీనాలో క్యాండైస్ మ్యారీ బెన్బో అనే మంచావిడ ఒకరు ఉన్నారు. ఆమె పక్కింట్లోనూ ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆ మంచి వ్యక్తి కొత్తగా వచ్చి చేరాడు. మ్యూజిక్ వీడియో ప్రొడ్యూసర్. పెద్ద శబ్దంతో అతడు ప్రొడ్యూస్ చేసే సంగీతానికి నెల రోజులుగా మ్యారీకి నిద్ర కరువైంది. కళ్ల కిందకు వలయాలు వచ్చేశాయి. అంతరాత్రప్పుడు వెళ్లి చెప్పలేదు. పగలు వెళ్లి చెప్పాలంటే ఉదయమే తలుపుకు తాళం వేసి ఉంటుంది. ఏం చేయాలి? యు.ఎస్.లో న్యూసెన్స్ కేస్ పెట్టడం తేలిక. ఆమె పెట్టదలచుకోలేదు. ఓ సాయంత్రం బయటికి వెళ్లింది. అరకిలో వెనీలా కేక్ బాక్స్‌తో తిరిగొచ్చింది. ఆ కేక్ బాక్స్‌ను తలుపులు మూసి ఉన్న మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఇంటి గడపపై పెట్టింది. బాక్స్‌తో పాటు చిన్న నోట్ కూడా. మర్నాడు ఉదయాన్నే ఆ వ్యక్తి వచ్చి మ్యారీ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. మ్యారీ బయటికి రాగానే ‘మీరేనా మ్యారీ’ అని, గుడ్మాణింగ్ చెప్పాడు. ‘సారీ’ కూడా చెప్పాడు. ‘ఇక మీదట మీ సౌండ్ స్లీప్‌ను నా మ్యూజిక్ సౌండ్ పాడు చెయ్యదు’ అని చిరునవ్వుతో భరోసా ఇచ్చాడు. వాళ్లిప్పుడు మంచి ఫ్రెండ్స్. ‘మీ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. డిసెంబర్ 15న మాత్రం వినసొంపు కాస్త టూ మచ్‌గా ఉంది’ అని రాసింది మ్యారీ ఆ నోట్లో. ఆ మనిషి వెంటనే అర్థం చేసుకున్నాడు. మనుషుల్లోని అమాయకత్వాన్ని పోగొట్టే మంచి మనుషులు కొందరుంటారు. అమాయకత్వాన్ని పోగొట్టడం మంచి పనే. లేకుంటే లోకంలోని అమాయకులు చాలా నష్టపోతారు. ‘ఇదా లోకం’ అని కుంగిపోతారు. అలా కుంగిపోకూడదనే.. ఇటీవల ఎన్నికలకు ముందు ఒక ముఖ్య నాయకుడు ఓటర్ల అమాయకత్వాన్ని పోగొట్టారు. ‘ఓడిపోతే నాకేం నష్టం లేదు. వెళ్లి ఫామ్‌హౌస్‌లో కూర్చుంటాను. మీకే నష్టం’ అన్నాడు. ఓటర్లు అమాయకత్వం పోగొట్టుకుని తమకు నష్టం జరక్కుండా ఆయనకు ఓటేశారు. క్రిస్మస్ రోజు డొనాల్డ్ ట్రంప్ అనే మరో మంచి మనిషి కూడా ఇలాగే ఓ చిన్నారి అమాయకత్వం పోగొట్టే పని చేశారు. హాలిడే ఈవెంట్లో పిల్లల ప్రశ్నలకు ఫోన్లో సమాధానాలు ఇస్తున్నప్పుడు సౌత్ కరోలినాలో ఉంటున్న కాల్మాన్ లాయిడ్ అనే చిన్నారి నుంచి ట్రంప్‌కు కాల్∙వచ్చింది. ‘‘క్రిస్మస్ను ఎలా జరుపుకున్నావ్ డియర్’’ అని ట్రంప్ అడిగారు. ‘‘చాలా బాగా సర్. నేను నా సిస్టర్స్ రాత్రి సెయింట్ నిక్ (శాంటాక్లాజ్) చర్చికి వెళ్లాం. ఐస్డ్ షుగర్ కుకీస్, మిల్క్ పెట్టివచ్చాం. తెల్లారే వెళ్లి చూస్తే అవి అక్కడ లేవు. శాంటాక్లాజ్ వాటిని తీసుకుని మా కోసం అక్కడున్న ఒక చెట్టు కింద కానులు పెట్టి ఉంచాడు. వాటిని తెచ్చుకున్నాం’’ అని సంతోషంగా చెప్పింది లాయిడ్. ‘‘నీ వయసెంత తల్లీ?’’ అని అడిగారు ట్రంప్. ‘‘ఏడేళ్లు’’ అని చెప్పింది. ‘‘నువ్వింకా శాంటాక్లాజ్‌ని నమ్ముతున్నావా.. ఏడేళ్లు వచ్చాక కూడా’’ అని అన్నారు ఆయన. ఆ పాప ‘లాంగ్ ఇన్ ద టూత్’ అని ట్రంప్ ఉద్దేశం. మనం అంటాం కదా, చాలా నిర్దయగా.. పెద్దదానివవుతున్నావ్ అని. ఆ విధంగా. ‘‘ఆర్యూ స్టిల్ ఎ బిలీవర్ ఇన్ శాంటా! బికాజ్ ఎట్ సెవెన్ ఇట్స్ మార్జినల్, రైట్?’’ అన్నారు ట్రంప్. ఆ పాప అప్పుడేం చెప్పలేదు. తర్వాత తల్లి సహాయం తీసుకుని ఇంటర్నెట్లోకి వీడియో అప్లోడ్ చేసి..‘ఎస్ సర్. నేను శాంటాను నమ్ముతున్నాను’ అని అందులో చెప్పింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవుతున్నప్పుడు ఎక్కడో ఒకచోట వాళ్ల అమాయకత్వంలోకి వాస్తవలోకం చొరబడడం ఎలాగైనా జరుగుతుంది. ట్రంప్ కాకపోతే, మరొకరు. ఏడేళ్లకు కాకపోతే మరో ఏడాదికి. ఎవరో ఒకరి వల్ల ఎప్పుడో ఒకసారి అమాయకత్వం తొలగిపోతుంది. తొలగిపోవడం మంచి విషయమే. తొలగిపోకపోతే? అదొక అందమైన విషయం.మనుషులు ఆ శబ్దసంగీతాన్ని భరించలేని ఆవిడలా ఎమోషన్స్‌ని అదుపు చేసుకోవడం, శాంటా లేడంటే నమ్మని ఈ చిన్నారిలా బిలీఫ్స్ని చెక్కుచెదరనివ్వక పోవడం.. ఇలాంటి వాటి వల్లనే జీవితానికి ఇంత అందమేమో! మనుషుల్లో నిద్రపట్టనివ్వని ఆ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌లా, నిజాల కుండల్ని బద్దలు కొట్టే డొనాల్డ్ ట్రంప్‌లా మంచివాళ్లే లేకపోతే జీవితంలోని ఈ అందాన్ని చిలికి పైకి తెచ్చేదెవరు?! ∙ -
మనసులో మంచి ఆలోచనలే ఉంటే...
మంచి పనులే చేస్తాం! మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు రుషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. కర్మకీలకం తెలిసిన రుషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. అందుకే ముందు మన మనసులోని చెడును, చెత్తను తొలగించేసుకుందాం.. అప్పుడు మనకు మంచి ఆలోచనలే తడతాయి. మంచి పనులే చేస్తాం. ఆటోమేటిగ్గా మంచే జరుగుతుంది. -
ఊరంతా ఊట బావులు
-
‘కుస్తీ’మే సవాల్
పట్టుబడితే.. పతకమే.. కూలీల కొడుకులు కుస్తీల్లో మేటి జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్న క్రీడాకారులు కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాçÜం, సాధించాలనే తపన ఉంటే ఏ రంగలోనైనా రాణించవచ్చు. దీనికి నిదర్శనమే ఈ రెజ్లర్లు(కుస్తీ క్రీడాకారులు) రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన వారైనా.. ఆటల్లో మాత్రం వీరు ఆణిముత్యాలు. కష్టపడటమే కాదు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, శిక్షణ ఇచ్చిన గురువుకు పేరు తెస్తూ.. జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు. – పిఠాపురం టౌన్ జాతీయస్థాయిలో రాణించాలి.. ఇతడి పేరు పెదపాటి వీరబాబు, ఊరు పిఠాపురం మండలం విరవాడ. కాకినాడ పీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. దిల్లీలోని జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలో పాల్గొని అండర్–19లో కాంస్యపతకం సాధించాడు. జార్ఖండ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. నంధ్యాల, మెదక్, చిత్తూరు, కాకినాడ, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో పలు పతకాలు సాధించాడు. జిల్లా స్థాయిలో అయితే ఏకంగా 40 పతకాలు అందుకున్నాడు. తన తల్లిదండ్రులు కూలీపనిచేస్తూ తనని చదివిస్తున్నారని జాతీయస్థాయిలో రాణించి మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులను సుఖపెట్టడమే తన ఆశయమని వీరబాబు చెప్పాడు. – పెదపాటి వీరబాబు ఇండియా క్యాంప్‌లో ఆడాలి.. రెజ్లింగ్‌లో జాతీయస్థాయి పోటీల్లో పతకం సాధించి ఇండియా క్యాంప్‌లో ఆడటమే తన ధ్యేయమని పిఠాపురం ఇందిరానగర్‌కు చెందిన దానం వినోద్‌కుమార్ తెలిపాడు. తండ్రి లేడు. తల్లిపోషణలో పెరుగుతున్న వినోద్‌కుమార్ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ ఓపె¯ŒS యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జాతీయస్థాయి కుస్తీపోటీల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. ఇతడి పోరాట పటిమను చూసి తెలంగాణ తరఫున ఆడితే అవకాశం ఇస్తామని అక్కడ అసోసియేష¯ŒS సభ్యులు కోరడం విశేషం. అయితే మన రాష్ట్రం తరఫునే పోటీల్లో పాల్గొని కోచ్‌కు మంచి పేరు తెస్తానని చెబుతున్నాడు. పంజాబ్‌లోని లుధియానా, ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో వినోద్‌కుమార్ తన ప్రతిభను చాటుకున్నాడు. రాష్ట్రస్థాయిలో విజయవాడ, చిత్తూరు, నెల్లూరు, అనకాపల్లి, గుంటూరులో జరిగిన పోటీల్లో బంగారుపతకంతో పాటు వివిధ పతకాలు సాధించాడు. – దానం వినోద్‌కుమార్ ప్రతిభచాటుతున్న క్రీడాకారులెందరో.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరుస్తున్న కుస్తీ క్రీడాకారులు ఎందరో పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. అందులో విరవాడకు చెందిన దారా అనిల్(17) కర్నూలు, గుంటూరు, అనంతపూర్, వైజాగ్‌లలో జరిగిన కుస్తీ పోటీల్లో పలు పతకాలు సాధించాడు. అదే గ్రామానికి చెందిన పల్లి సాయిబాబు(17) కర్నూల్, గుంటూరు, వైజాగ్, అనంతపురంలలో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించాడు. ఇతని సోదరుడు పల్లి నానిబాబు(15) విజయవాడ, కాకినాడలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రజిత, కాంస్య పతకాలు పొందాడు. వీరంతా కూలీ కుటుంబాలు నుంచి వచ్చినవారే. – దారా అనిల్, పల్లి సాయిబాబు, పల్లి నానిబాబు కోచ్ ప్రోత్సాహం వల్లే కోచ్ లక్ష్మణరావు ప్రోత్సాహం వల్లే కుస్తీపోటీల్లో ప్రతిభ చాటుకుంటున్నట్టు క్రీడాకారులు తెలిపారు. రెజ్లింగ్‌లో తలపడాలంటే మంచి ప్రోత్సాహం, ప్రత్యేకమైన మైదానం, పరికరాలు కావాలని తెలిపారు. కాకినాడలో రెజ్లింగ్ హాలు ఉన్నా రవాణాఖర్చులు లేకపోవడంతో సరైన మైదానంలో లేకపోయినా పిఠాపురంలోనే తర్ఫీదు పొందుతున్నట్టు తెలిపారు. కోచ్ ఆర్థికసాయం వల్లే ఈ స్థాయికి వచ్చినట్టు క్రీడాకారులు తెలిపారు. ప్రోత్సాహం కరువు రెజ్లింగ్ క్రీడకు ప్రోత్సాహం కరువైంది. క్రీడాకారుల కోసం పరితపించి వారిని తీర్చిదిద్దేవారు కరువయ్యారు. క్రీడల్లో విశేష ప్రతిభ ఉన్నవారికే పదవులు ఇవ్వాలి. అప్పుడే క్రీడాకారులకు న్యాయం జరుగుతుంది. పేరుకోసమే క్రీడలను నిర్వహించి తూతూమంత్రంగా చేతులుదులుపుకొనే సంప్రదాయం పోవాలి. కుస్తీపోటీలకు మంచి గుర్తింపు తెచ్చింది నెల్లూరు కాంతారావే. రాజమండ్రి, విజయవాడ, సామర్లకోట, తెలంగాణ జిల్లాల్లో కాంతారావు వల్లే కుస్తీ పోటీలకు ఊపు వచ్చింది. జిల్లాలో పిఠాపురం, రాజమండ్రి, మామిడికుదురు, కాకినాడ, సామర్లకోట, ఏలేశ్వరం, రావులపాలెం, ద్వారపూడిలలో రెజ్లింగ్ క్రీడాకారులు ఉన్నా.. పిఠాపురంలోనే వారి సంఖ్య అధికం. – లక్ష్మణరావు, కోచ్, జిల్లా రెజ్లింగ్ అసోసియేష¯ŒS కార్యదర్శి -
‘విరివిల్లుల’ కొలువు..కనువిందుకు నెలవు..
-
స్మార్ట్ ఫోన్ మంచికే!
వాషింగ్టన్: అతిగా ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు వాడకంతో పిల్లలు పాడవుతున్నారని పెద్దలు వాపోతుంటారు. అయితే వీటి వల్ల మేలు ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంటర్నెట్, ఫోన్లు తదితరాల వాడటంతో మంచి ఆహారపు అలవాట్లు అలవడటమే కాకుండా ధూమపానం, మద్య పానం వంటి వాటిని తగ్గించుకుంటారని తేలింది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ ఆధారిత ప్రోగ్రామ్‌ల వల్ల మంచి ఆహారం తీసుకోవడం, చురుకుగా ఉండటమే కాకుండా 3 నుంచి 12 నెలల్లో బరువు కూడా తగ్గుతుందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన అష్కాన్ అఫ్షిన్ పేర్కొన్నారు. దాదాపు 224 మంది ఆరోగ్యవంతమైన వారిపై 1990 నుంచి 2013 మధ్య కాలంలో జరిపిన అధ్యయనాలను సమీక్షించిన పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. -
పుష్కరాలకు ఆర్టీసీ సేవలు భేష్!
* పుష్కర నగర్ల నుంచి ఘాట్ల వరకు ఉచిత ప్రయాణం * 150 బస్సులను తిప్పుతున్న అధికారులు * ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ ఆర్ఎం * దూరప్రాంతాలకు సర్వీసుల పెంపు అమరావతి (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు భక్తులు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలకు 905 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు, మరో 500 బస్సులను అదనంగా అందుబాటులో ఉంచుకున్నారు. పుష్కరనగర్ల ఏర్పాటుతో బస్సులన్నీ సుమారు 2 లేదా 3కిలో మీటర్లు దూరంలోనే నిలిచిపోతున్నాయి. దీనిని గమనించిన ఏపీఎస్ ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పుష్కరనగర్ల నుంచి ప్రయాణికులు, భక్తులను ఘాట్ల వద్దకు ఉచితంగా దింపేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అమరావతిలోని పుష్కర నగర్ల నుంచి ఘాట్‌కు 60 బస్సులు, మంగళగిరి నుంచి ఎయిమ్స్, తాడేపల్లికి 30 బస్సులు, ఎయిమ్స్ నుంచి ఉండవల్లికి 15, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి 15, కేసీ కెనాల్ రైల్వేస్టేషన్ నుంచి తాడేపల్లి, ఉండవల్లికి 30 బస్సులను తిప్పుతున్నారు. భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దూరప్రాంతాలకు ప్రత్యేక బస్సులు... నిత్యం తిరిగే సర్వీసులతో పాటు బెంగళూరుకు 7, చెన్నైకి 9, హైదరాబాద్‌కు 25, తిరుపతికి 2 సర్వీసులతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు. విశాఖపట్నంలకు అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా పుష్కర స్పెషల్ టికెట్ ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వీటితో పాటుగా ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
భారజలం, విద్యుదుత్పత్తిలో మంచి ఫలితాలు
గౌతమీనగర్ కాలనీ (అశ్వాపురం) : 2015 – 16 సంవత్సరంలో భారజలం, విద్యుత్ ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించినట్టు భారజల కర్మాగారం జీఎం జితేంద్ర శ్రీవాత్సవ చెప్పారు. గౌతమీనగర్ కాలనీలోని స్వరఝరి కళాసంగమం ప్రాంగణంలో సోమవారం స్వాతంత్య్ర దిన వేడుకలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాల సాధనకు అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. సీఐఎస్ఎఫ్ భద్రతా దళాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కర్మాగారం డీజీఎంలు ఆర్కె.గుప్తా, అరుణ్ బోస్, సీఐఎస్ఎఫ్ చీఫ్ కమాండెంట్ ఎన్‌కె.ఝా, అణుశక్తి కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ వెంకన్న, వైస్ ప్రిన్సిపాల్ స్వర్ణరాణి తదితరులు పాల్గొన్నారు. -
ఘాట్లవద్ద అనువైన వాతావరణం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కష్ణా పుష్కరాలకు వచ్చిన ప్రతీ భక్తుడు మంచి వాతావరణంలో పుష్కర స్నానం చేసి వెళ్లడమే తమ లక్ష్యమని, ఆమేరకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పుష్కరాల నిర్వహణపై ఆర్డీఓలు, ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. పుష్కరాలలో భక్తుల రద్దీ, వారి ఆరోగ్యం, స్వచ్ఛత, పరిశుభ్రతలపై అధికారులు ఎక్కువ దష్టి కేంద్రీకరించాలని అన్నారు. పుష్కర విధుల్లో ఉన్న వారందరికీ భోజనం, వసతి, తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఈ విషయాల్లో రాజీ పడవద్దని చెప్పారు. తరచుగా పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు ప్రతిరోజు రాత్రి స్నానం ముగిశాక ఘాట్లు శుబ్రం చేయించాలన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల బ్రోచర్‌ను విడుదల చేశారు. జాయింట్ కలెక్టర్ ఎం.రాంకిషన్, ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, డీఆర్ఓ భాస్కర్, ఆర్డీఓలు, ప్రత్యేకాధికారులు ఉన్నారు. అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు పుష్కరాల నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు కలుగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశాన్ని నిర్వహించారు.విపత్తు పరిస్థితులలో అనుసరించాల్సిన విధానాలు, ముందస్తు చర్యలు తదితర అంశాలను చర్చించారు. జేసీ ఎం. రాంకిషన్, ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, డీఆర్ఓ భాస్కర్, డీఆర్డీఏ పీడీ మధుసూధన్‌నాయక్, డీఎంహెచ్ఎం డా.నాగారాం తదితరులు హాజరయ్యారు. -
ఎయిర్ ఇండియా సిబ్బందికి 'ఆకట్టుకునే' సూచనలు!
న్యూఢిల్లీః ఎయిర్ ఇండియాపై ఇటీవల అనేక విమర్శలు వినబడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సంస్థపై పడ్డ చెడు ముద్రను చెరిపే పనిలో నిమగ్నమయ్యారు. ముఖంపై నవ్వును చిందిస్తూ ప్రయాణీకులతో మర్యాద పూర్వకంగా ఎలా వ్యవహరించాలో ఎయిర్ లైన్స్ ఛీఫ్.. అశ్వనీ లొహానీ సిబ్బందికి వివరించారు. చిరునవ్వుతో కూడిన పలకరింపు ఓ మంచి లక్షణమని, అది సిబ్బంది అలవాటు చేసుకోవడం ఎంతైనా అవసరమని కొత్త సూచనలు చేశారు. విమానాల ఆలస్యం విషయంలో కాక్ పిట్, కేబిన్ క్రూ సిబ్బంది సంయమనం పాటిస్తూ... ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలని అశ్వనీ లొహానీ సిబ్బందికి సలహా ఇచ్చారు. చెక్ ఇన్ ఏజెంట్లు తప్పనిసరిగా ప్రయాణీకులకు అందుబాటులో ఉండాలని, వారి అనుమానాలను నివృత్తి చేస్తూ వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఎయిర్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా సిబ్బంది, సంస్థకు సంబంధించిన ఏజెన్సీల ప్రవర్తన అనుకూలంగా ఉండి, సమస్యను పరిష్కరించేట్టుగా ఉండాలని సూచించారు. ఎయిర్ ఇండియాలో ప్రయాణం ప్రయాణీకులకు 'మంచి' అనుభవం కావాలని, అందుకు సిబ్బంది సహకారం అవసరమని కోరారు. ముఖ్యంగా విమానాల ఆలస్యం విషయంలో సిబ్బందికి, ప్రయాణీకులకు మధ్య వివాదాలు తలెత్తడం ఇటీవలి కాలంలో తరచుగా ఎదురౌతున్న నేపథ్యంలో లొహానీ సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. కేబిన్ సిబ్బంది.. ప్రయాణీకులకు సంప్రదాయ బద్ధంగా నమస్కరించాలని, ప్రయాణీకులనుంచి అభినందనలు పొందే విధంగా ఉండాలని, ముఖంపై నవ్వుతో మర్యాద పూర్వక సంభాషణలను చేయాలని లొహానీ చెప్పారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయానికి, లేదా ఆలస్యం ఉన్నపుడు వెంటనే విమానాశ్రయ మనేజర్, స్టేషన్ మేనేజర్ ప్రయాణీకుల ముందు హాజరవ్వాలన్నారు. అంతేకాక వారితో మర్యాదపూర్వకంగా సంభాషించి, సమస్యను సులభంగా అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రయాణీకులకు అందించే ఆహారం నాణ్యత విషయంలోనూ శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు ఛెఫ్ తనిఖీలు నిర్వహిస్తుండాలని తెలిపారు. -
చెడులోనూ దాగి ఉన్న మంచి?
విశ్లేషణ ప్రజలు నీటికోసం అల్లాడుతున్నందున నాచు కలిసిన, మురికి నీళ్లు తీసు కొచ్చినా ఖర్చయిపోతాయి. తమకు రావాల్సిన వాటా నీటిని పొందన ప్పుడు దొరికే ప్రతి నీటి బిందువుకూ తనదైన లెక్క ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో బ్రాండెడ్ నీటి బాటిల్‌కు బ్లాక్ మార్కెట్ రేటు పలుకుతుంది. ప్రముఖ పాత్రికేయుడు, రచయిత పి. సాయినాథ్ 1999లో రచించిన ‘ఎవ్రీ బడీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్’ నిరంతరం సవరించి లేదా కొత్త పేరుతో ప్రచు రించదగిన విశిష్ట రచన. ఎందుకంటే భారత సమా జానికి సంబంధించిన ఘోరాతి ఘోరమైన రహస్యాల మేలిముసుగును ఆయన ఈ పుస్తకంలో విప్పి చెప్పినప్పటికీ ఈ దేశం తన మార్గాన్ని మార్చు కోవడం గురించి పాఠాలు నేర్చుకోలేదు. ఆ పుస్త కంలో వివరించిన వాటికంటే ఇంకా అన్వేషించ వలసిన అవమానకరమైన అంశాలు దేశంలో అనేకం ఉన్నాయి. గత బుధవారం వరకు మహా రాష్ట్రలో 29,600 గ్రామాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం వీటిలో ఒకటి. కరువు ప్రకటన అనేది నిబంధనలను క్రియా శీలం చేయవలసిన అవసరాన్ని ముందుకు తీసుకు వస్తుంది. అంతకంటే ముందు ప్రభుత్వం కేంద్ర నిధులకోసం ప్రయత్నించడంపై తన ఉద్దేశాన్ని సూచిస్తుంది. విచిత్రం ఏమిటంటే కరువు ఉపశమన చర్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దం పాటిస్తూ, ప్రభుత్వ భాగస్వామి అయిన శివసేనను కరువుపై గావుకేకలు వేయడానికి అనుమతిస్తోంది. వచ్చే ఎన్నికల్లో దీన్ని ప్రచారాంశంగా మలుచుకోవడానికి గానూ ప్రజల బాధలపట్ల ప్రతిపక్షం అనుసరించ వలసిన పద్ధతి ఇదేనా? తాగునీరు లేనప్పుడు, పంటలు పండన ప్పుడు, ప్రభుత్వం ఎందుకు వేచి ఉంటోందన్నది మాయగా ఉంది. ఉడిగిపోయిన పశువులను రైతులు కబేళాలకు అప్పగించకుండా నిషేధం విధిం చడం వల్ల వారిపై ఆర్థిక భారం మరింతగా పెరుగు తోంది. మూర్ఖులు మాత్రమే గ్రామీణ ఆర్థిక వ్యవ స్థను ఇలాంటి ప్రయత్నాలతో ఆటంకపర్చే విష యంలో విజ్ఞతను చూడగలరు. పాలనిచ్చే పశువులు కూడా పశుగ్రాసం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో గడ్డి లేక అవి కూడా వట్టిపోయాయి. డబ్బు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నీటి కొరత కోసం సంసిద్ధంగా ఉంటున్న ప్రైవేట్ రంగం సన్నాహక చర్యలతో కరువుపై ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటనను పోల్చి చూడండి. నీటి కొరత తీవ్రత గురించిన సమాచారం అందుకున్న వెంటనే ప్రైవేట్ యజమానులు ధరపెట్టి మరీ అమ్మడం కోసం కొత్త నీటి ట్యాంకర్లను కొనేశారు. ఒక్క థానే జిల్లాలోనే 500 కొత్త నీటి ట్యాంకర్లను నమోదు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం తనదైన పద్ధతుల్లో వ్యవహరిస్తూ పోయింది. ప్రైవేట్ ట్యాంకర్లు తీసుకొస్తున్న నీటి వనరుల మూలం గురించీ లేదా నీటి నాణ్యత గురించి పట్టిం చుకోవద్దు కానీ నీటి అమ్మకాల్లోని భారీ లాభాలను పెరిగిన ట్యాంకర్ల సంఖ్యే సూచిస్తోంది. ప్రజలు నీటికోసం అల్లాడుతున్నారు కాబట్టి నాచు కలిసిన, మురికి నీళ్లు తీసుకొచ్చినా అవి ఖర్చయిపోతాయి. తమకు రావలసిన వాటా నీటిని (అది కూడా వారి కనీస అవసరాలకంటే తక్కువే) పొందలేనప్పుడు దొరికే ప్రతి నీటి బిందువుకూ తనదైన లెక్క ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో బ్రాండెడ్ నీటి బాటిల్ బ్లాక్ మార్కెట్ రేట్లతో అమ్ముడవుతుంది. మరొక రోజు ఒక చిన్న రైల్వే రిజర్వాయర్ నుంచి నీటిని తోడుకుని వస్తున్న ఒక ట్యాంకర్ దొరికింది. ఆ నీటిని అమ్మితే ట్యాంకర్ యజమానికి రూ.800లు వస్తుంది. అంటే అమ్మిన ఈ ఉత్పత్తి చౌర్యానికి గురయిన ఉత్పత్తి అన్నమాట. ఇలాగే రైల్వే వ్యాగన్లు ప్రారంభంలో లాతూర్కు నీటిని తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రైవేట్ ట్యాంకర్ల వ్యాపారం దానిలోకి జొరబడాలని చూసింది. ఇలాంటి కార్యకలాపాలను ట్యాంకర్ మాఫియా అని పిలుస్తున్నారు. సంవత్సరాలుగా వీళ్లు నగ రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి చెందుతూ వస్తు న్నారు. పరిశ్రమ అవసరాలకోసం డబ్బు తీసుకుని మరీ అధికారులు ట్యాంకర్లలో నీటి పంపిణీ చేస్తున్న తతంగాన్ని ఇటీవలే టీవీలు స్ట్రింగ్ ఆపరేషన్ల ద్వారా చూపించాయి కూడా. ఉపాధితో అనుసంధానమై ఉంది కనుక పరిశ్ర మలకు నీటి సరఫరా అవసరమైనదే కానీ బీర్ తయారీదారులకు నీటి సరఫరాను తగ్గించవల సిందిగా కోర్టులు ప్రభుత్వానికి చెప్పవలసి వచ్చి ంది. నీటి ధరవరలను పోల్చి చెబుతూ మరాఠీ వార్తా పత్రిక లోక్‌సత్తా తెలిపిన వివరాలు దిగ్భ్రాం తి కలిగిస్తున్నాయి. కొన్ని చోట్ల, 13 లీటర్ల కుండ లేదా పాత్రలోని నీళ్లను ప్రైవేట్ నీటి వ్యాపారుల వద్ద కొంటే ఐదు రూపాయలు ఖర్చవుతోంది. కానీ మద్యపానీయ తయారీదారులు అదే నీటికి లీట ర్కు నాలుగు పైసల చొప్పున చెల్లిస్తున్నారు. లాతూర్‌లో 6 వేల లీటర్లు పట్టే ట్యాంకర్ నీటికి రూ.1,300ల వెల పలుకుతోంది. అంటే లీటర్‌కు 22 పైసలు అన్నమాట. ప్రభుత్వ ట్యాంకర్ నీటిని ఉచితంగా ఇచ్చినప్పటికీ దాని ఖరీదు మాత్రం లీటర్‌కు 30 పైసలు పడుతోంది. అందుకే నిర్దిష్టై మెన నీటి రంగం మరింత సమర్థవంతమైనదని ఇది తెలుపుతోంది. అయితే బేరసారాల్లో భాగంగా ప్రభుత్వం నీటి ప్రైవేటీకరణను అనుమ తించింది. మాఫియా కనుక రంగంలోకి దిగకపోతే, నీటి దాడులు జరిగే ప్రమాదం ఉంది. అంటే చెడులో కూడా మంచి అంశాలున్నాయన్నమాట. వింతైన విషయమే కావచ్చు కాని ఇది నిజం. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
అన్నదాతలకు తీపి కబురు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలకు ప్రస్తుతం పరిస్థితి సానుకూలంగా ఉందని, ఈ ఏడాది మంచి వానలు కురుస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రెండు సంవత్సరాల తరువాత, ఈ ఏడాది మంచి వానలు కురిసే అవకాశం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు తీపి కబురందించింది. నైరుతి రుతుపవనాల కారణంగా రెండేళ్ల వర్షాభావ పరిస్థితి నుంచి ఈ ఏడాది బయటపడే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ జూన్ ప్రారంభంలో ఖరీఫ్ సీజన్లో పంట విస్తీర్ణం, ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభన కె పట్నాయక్ రాష్ట్రాలకు సూచించారు. 2016-17 ఖరీఫ్ ఉద్యమంలో భాగంగా జరిగిన జాతీయ సదస్సులో పట్నాయక్ ప్రసంగించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయంపై ఏప్రిల్ 11 మరియు 12 న్యూఢిల్లీలో ఖరీఫ్ క్యాంపెయిన్ 2016 పేరుతో జాతీయ సదస్సు జరగనుంది. వర్షా భావ పరిస్థితుల కారణంగా గత రెండేళ్లకాలంగా దేశంలోని ఆహారధాన్యాల ఉత్పత్తి క్షీణిస్తూ వచ్చింది. 2014-15 పంట సంవత్సరం (జూలై-జూన్) ఆహార ధాన్యాల ఉత్పత్తి 252.02 మిలియన్ టన్నులు కాగా, మునుపటి సంవత్సరంలో రికార్డు 265.04 మిలియన్ టన్నుల నుంచి క్షీణించింది. 2015-16 పంట సంవత్సరానికి ఇది 253.16 మిలియన టన్నులకు కొద్దిగా పెరుగుతుందని అంచనా. వరుసగా రెండు సం.రాలుగా చెడు వర్షాకాలం దేశంలో రైతుల దుస్థితి నీటి కొరత దారితీసాయనీ, రైతులు,పంట వనరులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని పట్నాయక్ పేర్కొన్నారు. అటు గత రెండు సంవత్సరాల నాటి వర్షాభావ పరిస్థితులు, ఈ ఏడాది పునరావృతం అవకాశం లేదని గత ఫిబ్రవరి ఆర్థిక సర్వే తేల్చి చెప్పిందన్నారు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉండాలని పట్నాయక్ రాష్ట్రాలకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సమస్యనైనా పరిష్కరించేందుకు వీలుగా ఆకస్మిక ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. మరోవైపు రుతుపవనాల ఆగమనంపై వాతావరణ శాఖ అంచనాలు ఈ నెలాఖరుకు రానున్నాయి. -
కసబ్ మంచివాడో కాదో తెలియదు కానీ..
ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు... ఇటీవల అప్రూవర్‌గా మారిన పాక్ ఆమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణ రెండోరోజూ కొనసాగింది. శివసేన అధినేత బాలఠాక్రే హత్యకు ప్లాన్ చేశామని ప్రకటించి సంచలనం సృష్టించిన హెడ్లీ మరిన్ని వివరాలు వెల్లడించాడు. కసబ్ మంచివాడో కాదో తెలియదు గానీ.. అతను చేసిన పని ఎంతమాత్రం మంచిది కాదని వీడియో కాన్ఫరెన్స్ విచారణలో పేర్కొన్నాడు. 26 నవంబర్ దాడి ఘటనపై తాను ఇప్పటికే పశ్చాత్తాపం ప్రకటించానన్నాడు. ఆ పేలుళ్లలో భాగస్వామిగా నేరం చేశానని చెప్పాడు. కరాచీలోని లష్కరే తాయిబా కార్యాలయాన్ని తన జీవితంలో ఎప్పుడూ సందర్శించలేదని తెలిపాడు. 26/11 దాడుల తర్వాత కూడా భారత్‌పై దాడిచేసేందుకు తాను ప్రయత్నించానన్నాడు. కానీ ఈసారి అల్-కాయిదా సూచనలతో దాడి చేసేందుకు ప్రణాళిక రచించినా అది అమలుకాలేదని క్రాస్ ఎగ్జామినేషన్‌లో తెలిపాడు. మరోవైపు పాక్ ఐఎస్ఐ ముంబై దాడుల కోసం భారీగా నిధులు సమకూర్చినట్లు డేవిడ్ హెడ్లీ విచారణలో అంగీకరించాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వెల్లడించారు. -
రిటైరయ్యాకే చురుగ్గా ఉంటారు!
ఉద్యోగం చేసే వారికన్నా పదవీ విరమణ చేసినవారే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు పరిశోధకులు. రిటైర్మెంట్ తర్వాత ఎంతో చురుకుగా, ఉత్సాహంగా ఉండటం, హాయిగా నిద్రపోవడంతోపాటు, ధూమపానానికి దూరంగా ఉంటున్నారని తాజా అధ్యయనాల్లో కనుగొన్నారు. ఆస్ట్రేలియా ప్రజలపై చేసిన పరిశోధనల్లో ఈ సరికొత్త విషయాలను తెలుసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తుల జీవనశైలిపై ప్రత్యేక పరిశోధనలు జరిపారు. రిటైర్ అయిన వ్యక్తుల్లో శారీరక శ్రమ, ఆహార, నిద్ర అలవాట్లు, ప్రవర్తన, మద్య సేవనం వంటి అనేక విషయాల్లో పరిశోధనలు నిర్వహించినట్లు అధ్యయనవేత్త మెలోడీ డింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వ్యక్తులతో పోలిస్తే... రిటైర్ అయిన వారు విశ్రాంతి తీసుకునే సమయం తగ్గించుకొని, ఎక్కువ సమయం శ్రమించగల్గటం, ధూమపానానికి దూరంగా ఉండటంతోపాటు... శారీరకంగానూ, మానసికంగానూ ఎంతో చురుగ్గా ఉంటున్నట్లు గమనించారు. అంతేకాక ఎంతో ఆరోగ్యంగా కూడ ఉంటున్నట్లు అధ్యయనాల్లో తేలిందని డింగ్ చెప్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం వ్యక్తుల జీవనశైలిలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయని, చెడు అలవాట్లకు దూరంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవితం గడుపుతున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం వ్యక్తులు ఎంతో చురుగ్గా ఉండగల్గుతున్నారని, వారానికి 93 నిమిషాల శారీరక శ్రమ పెంచడంతోపాటు, బద్ధకంగా కూర్చునే సమయాన్ని 67 నిమిషాలు తగ్గించారని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. అంతేకాక నిద్రించే సమయం కూడ రోజుకు సుమారు 11 నిమిషాలు పెంచగలిగినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగినులు 50శాతం మంది రిటైర్మెంట్ తర్వాత ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు కనుగొన్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవనశైలిని ఆరోగ్యంగా మార్చుకునేందుకు కావలసిన సమయం దొరుకుతోందని, ఇది అన్ని తరహాల్లోనూ కీలకపాత్ర పోషించిందని డింగ్ తెలిపారు. అయితే ఈ సమయంలో మద్యపానం, కూరగాయలు, పండ్లు వాడకాల్లో పెద్దగా మార్పులు కనిపించలేదంటున్నారు. ఇదిలా ఉంటే... పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు, అధిక విద్యాస్థాయిలు కలిగినవారు మాత్రం కాస్త ఎక్కువ సమయం ఖాళీగా కూర్చుని సమయం గడుపుతున్నట్లు కనుగొన్నారు. రిటైర్మెంట్ గురించి ప్రజలు సానుకూలంగా ఆలోచించేందుకు ఈ తాజా పరిశోధన సహకరిస్తుందని డింగ్ చెప్తున్నారు. డాక్టర్లకైతే రిటైర్మెంట్ లైఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారి పేషెంట్లతో తీరిగ్గా మాట్లాడేందుకు సమయం దొరుకుతుందని ప్రివెంటివ్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనాల్లో ఆమె తెలిపారు. -
గ్రీనరీలకన్నా సీనరీలే ఆరోగ్యం!
అందమైన నగరాల్లో నివసించడం గ్రామజీవనం కన్నా ఆరోగ్యకరం అంటున్నారు అధ్యయనకారులు. నగరాల్లో ఉండే ఓ మంచి సీనరీ... గ్రామాలు, పట్టణాల్లోని గ్రీనరీ (పచ్చదనం) కన్నా సానుకూల వాతావరణాన్ని సృష్టించడంతోపాటు... మానసిక, శారీరక శ్రేయస్సును మెరుగు పరిచేందుకు, ఉపయోగపడుతుందని చెప్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని నదులు, పచ్చదనం కన్నా... నగరాల్లో అత్యంత సుందరమైన సీనరీల్లో ఉండే గోధుమ, బూడిద, నీలం రంగులు...వ్యక్తి భావాలను ఆకట్టుకుంటాయని అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. థేమ్స్ నదిలో రవాణా జరిపే కార్గో ఓడలు, సెంయింట్ పాల్ కేథడ్రాల్ వ్యూ వంటివి... కొండలు, విస్తారమైన అడవుల్లో నడవటం కన్నా.. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. వార్విక్ బిజినెస్ స్కూల్ విద్యావేత్తల సర్వేలో భాగంగా బ్రిటన్ కు చెందిన 212,000 చిత్రాలను చూపించి వాటిపై ప్రజలను రేటింగ్ చేయమని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా ప్రాంతాల్లో నివసించే 1.5 మిలియన్ల జనాభా వారి ఆరోగ్యం గురించి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీన్నిబట్టి పరిశోధకులు అత్యంత సుందరమైన, అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే పచ్చని గ్రామాల్లో ఆరోగ్యం, అనందం అంతగా లేవని తేల్చారు. కేవలం ఓ పచ్చని ప్రాంతం.. సీనరీల్లో ఉండే మంచి అనుభూతిని, ఆనందాన్ని ప్రేరేపించడం లేదని తమ సర్వే ద్వారా తెలిసినట్లు బిజినెస్ స్కూల్ పీహెచ్ డి విద్యార్థి ఛనూకి తెలిపారు. వాతావరణంలోని అందాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంవల్ల ఉపయోగం ఉండదన్నారు. స్థానికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పట్టణాల్లో ప్రణాళికా బద్ధంగా పార్కులు, హౌసింగ్, రహదారులు వంటి నిర్మాణాలు చేపట్టాలని... పర్యావరణాన్ని అందంగా తీర్చి దిద్దడంవల్ల ఆరోగ్యంగా ఉండగల్గుతారని సర్వేలు సూచిస్తున్నట్లు తెలిపారు. తాము జరిపిన సర్వే ద్వారా సీనరీలు ఆరోగ్యం మధ్య చూసిన సంబంధం, ప్రయోజనకర ప్రభావాలు... హరిత ప్రదేశాల్లో కనిపించడం లేదని బిజినెస్ స్కూల్ కు చెందిన బిహావియరల్ సైన్స్ ల్యాబ్ సహదర్శకుడు, అసోసియేట్ ప్రొఫెసర్ సూజీ మాట్ వెల్లడించారు. గతంలో మనం నమ్మే పచ్చదనం ఆరోగ్యానికి శ్రేయస్కరం అన్న నమ్మకాన్ని వదిలి... దైనందిన జీవితంలో పర్యావరణ ప్రాముఖ్యతకే ప్రాధాన్యతను ఇవ్వవచ్చని తమ సర్వే ఫలితాలద్వారా తెలుస్తోందంటున్నారు. -
పిల్లికూనని తీసేయకు!
న్యూయార్క్: ముద్దొచ్చే పిల్లి కూనల వీడియోలు చూడడం, ఆన్లైన్లో వాటి ఫొటోలను చూడడం ఇంకెంత మాత్రం ‘వేస్ట్ ఆఫ్ టైమ్’ కానే కాదు. వీటి వల్ల వీక్షకుల్లో శక్తి పెరగటమే కాకుండా మానసికోల్లాసం పెరుగుతుందట. దీన్ని పెట్ థెరపీ లేదా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే వైద్య ప్రక్రియగా పేర్కొనవచ్చని ‘కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్’ అనే పత్రిక తాజా సంచికలో వెల్లడించింది. 2014లో యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన రెండు లక్షల పిల్లి వీడియోలను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2600 కోట్ల సార్లు వీక్షించారని, సెలబ్రిటీ పిల్లులైన గ్రంపీ క్యాట్, లిల్బల్బ్లను కూడా సోషల్ మీడియాలో ఎక్కువ మంది చూశారని ఇంటర్నెట్ డేటా ఆధారంగా ఆ పత్రిక తేల్చి చెప్పింది. ఆన్లైన్ వీక్షణ వల్ల మానవ ప్రవర్తనపై కలిగే ప్రభావాల గురించి అధ్యయనం చేసే ఆ పత్రికకు ఎందుకు ఇంతమంది పిల్లి కూనల ఫొటోలు లేదా వీడియూలను చూస్తున్నారనే అనుమానం వచ్చింది. చూడడం వల్ల వారు ఎలా అనుభూతి చెందుతున్నారన్న కోణం నుంచి కూడా అధ్యయనం చేయాలని భావించి ‘స్నోబాల్’ టెక్నిక్ ద్వారా ఇంటర్నెట్ యూజర్స్‌కు ప్రశ్నావలిని పంపించి ఓ సర్వే నిర్వహించింది. పిల్లి వీడియోలను లేదా ఫొటోలను చూసినప్పుడు, అంతకుముందు, ఆ తర్వాత ఎలాంటి ఒత్తిడిలో ఉన్నారు? ఎలాంటి అనుభూతి పొందారు? ఆ తర్వాతి కార్యకలాపాల్లో ఉత్సాహం కనిపించిందా? లేదా ? లాంటి ప్రశ్నలతో ఈ సర్వేను నిర్వహించారు. ఈ ఆన్లైన్ సర్వేలో పాల్గొన్న వారిలో మెజారిటీ ప్రజల నుంచి ఒత్తిడి తగ్గిందని, మానిసికోల్లాసం పెరిగిందని, ఒంట్లో శక్తి పెరిగిందని, నిద్రమత్తు వదిలిందని, ఆ తర్వాత మరింత ఉత్సాహంగా అకాడమిక్ అధ్యయనం కొనసాగించామని సమాధానాలు వచ్చాయని, వాటిని విశ్లేషించి తమ అధ్యయన వివరాలు వెల్లడిస్తున్నామని ఇండియాన యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మైరిక్ తెలిపారు. 36 శాతం మంది తమకు పిల్లులంటే ఇష్టమని, 60 శాతం మంది తమకు పిల్లులూ, కుక్క పిల్లలు ఇష్టమని చెప్పారని ఆమె వివరించారు. పిల్లులు విషయంలో స్పందించిన వారిలో ఎక్కువ మంది పిల్లులు యజమానులు లేదా మాజీ యజమానులే ఉన్నారని చెప్పారు. అయితే సర్వేను కేవలం పది నిమిషాల్లో నిర్వహించడం, కేవలం ఏడువేల మంది మాత్రమే పాల్గొనడం, వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండడం సర్వే ప్రామాణికతను తగ్గిస్తోంది. -
రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య
-
ప్రముఖ నటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య
లాస్ ఏంజిల్స్:ప్రముఖ నటుడు,ఆస్కార్ అవార్డు గ్రహీత రాబిన్ విలియమ్స్(63) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విలియమ్స్ సోమవారం ఆత్మహత్య చేసుకుని తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని నిన్న మధ్యాహ్నం పోలీసులు ధృవీకరించారు. ఉత్తర కాలిఫోర్నియా కు సమీపంలో ఉన్న టిబురోన్ లోని తన ఇంట్లో విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు స్పష్టం చేశారు. అతను కొంతకాలంగా శ్వాస కోస సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో ఆ నటుడు మానసిక క్షోభకు గురయ్యేవాడని యూఎస్ మీడియా తెలిపింది. అమెరికన్ టీవీ సిరీస్ లోనూ, హాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకున్న విలియమ్స్ ఆకస్మిక మృతి యావత్తు సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. విలియమ్స్ నటించిన టీవీ షోల్లో 'మోర్క్ అండ్ మైండ్' అభిమానులు హృదయాల్లో మాత్రం చెరగని ముద్ర వేసింది. బుల్లి తెరలపై ప్రస్థానాన్ని మొదలుపెట్టిన విలియమ్స్ 1987 లో విడుదలైన 'గుడ్ మార్నింగ్ వియాత్నం', 1989లో 'డెడ్ పొయెట్స్ సొసైటీ', 1997 లో గుడ్ విల్ హంటింగ్ తదితర హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 'గుడ్ విల్ హంటింగ్' చిత్రానికి గాను ఉత్తమ సహాయనటుడి కేటగిరీలో అతని ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. -
ఆపదలోనూ అదృష్టం
ప్రాణాలు కాపాడిన ఎయిర్ బ్యాగ్‌లు వెంట్రుక వాసిలో తప్పిన పెను ప్రమాదం బాలరాజుకు తప్పిన ప్రాణాపాయం సీట్ల మధ్యన ఇరుక్కుని సతీష్‌వర్మ గాయాల పాలు నర్సీపట్నం : ఆపదలోనూ అదృష్టమంటే ఇదేనేమో. గిరిజన సంక్షేమ శాఖ మాజీ మంత్రి బాలరాజుకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ఆ కోవలోకే వస్తుందేమో. జరిగిన ప్రమాదం తీవ్రమైనదైనా, బాలరాజు, కాంగ్రెస్ నాయకుడు సతీష్ వర్మ గాయాలతో బయిటపడడం చూస్తే ఎవరికైనా ఇదే భావం కలుగుతుంది. కారులోని ఎయిర్ బ్యాగ్‌లు వారి ప్రాణాలు కాపాడడంతో కీలక పాత్ర పోషించగా, చెట్లను, కరెంటు స్తంభాన్ని ఢీకొనకుండా కారు కాస్త పక్కగా పోవడంతో కూడా పెను ప్రమాదం తప్పింది. ఓ సన్నిహితుడి వివాహానికి బుధవారం జంగారెడ్డి గూడెం వెళ్లిన బాలరాజు, డీసీసీ అధ్యక్షుడు సతీష్ వర్మ, ఇద్దరు గన్మెన్లతో కలిసి బాలరాజు కొత్తగా కొన్న మహీంద్రా కారులో రాత్రి తిరుగుపయనమయ్యారు. తెల్లవారు జామున మూడున్నర, నాలుగు గంటల మధ్య నాతవరం మండలం ములగపూడి, బెన్నవరంల మధ్య డ్రైవరు నిద్ర మత్తు కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు కుడిపక్కగా ఉన్న రెండు చెట్లను రాసుకుంటూ కారు దూసుకుపోయి నిలిచిపోయింది. సంఘటన జరిగిన వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎన్నికలు ముగిసిన తరువాత అధికార వాహనం అప్పగిం చిన బాలరాజు ఈ కొత్త కారు కొనుగోలు చేశా రు. ఈ కారు వల్లే ప్రాణాలు నిలిచాయని స్థాని కులు అంటున్నారు. ఈ ప్రాంతంలో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని చెప్పారు. స్పెషల్ వార్డులో చికిత్స విశాఖపట్నం, మెడికల్: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి బాలరాజు విశాఖలోని కేజీహెచ్‌లో మెన్స్ స్పెషల్వార్డులో చికిత్స పొందుతున్నారు. సతీష్‌వర్మ, మరో గన్‌మెన్ కూడా అక్కడే చికిత్స పొందుతున్నారు. బాలరాజుకు ముఖం కుడిభాగం, ఎడమ మోచేయి, మోకాలు భాగాల్లో చర్మం తెగిపోవడంతో సుమారు 100 వరకూ కుట్లు వేసినట్లు చికిత్స నందిస్తున్న ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ పి.వి.సుధాకర్ తెలిపారు. ముఖం భాగంలో ఫ్రాక్చర్లు కనపడలేదన్నారు. సతీష్ వర్మకు కాలు విరిగిపోవడంతో అత్యవసర ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స చేసినట్టు ఇన్చార్జి సూపరింటెండెంట్ బి.ఉదయ్‌కుమార్ తెలిపారు. మంత్రి గంటా పరామర్శ విశాఖపట్నం, మెడికల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలరాజును రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు ఎం. శ్రీనివాసరావు గురువారం రాత్రి పరామర్శించారు. ప్రమాదానికి గురైన సంఘటన వివరాలను బాలరాజును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని కేజీహెచ్ సీఎస్ఆర్ఎం ఓ బంగారయ్య, కేఎస్‌ఎల్‌జీ శాస్త్రిలను ఆదేశించారు. ప్రమాదానికి గురైన ఇద్దరు గన్మెన్లను కూడా పరామర్శించారు. బాలరాజును అరకు ఎంపీ కొత్తపల్లి గీత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు కొయ్యప్రసాదరెడ్డి, అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ నర్సింహారావు తదితరులు పరామర్శించారు. -
శీలమే మూలం!
సకల జీవుల పట్ల దయతో ఉండటం, ఎవరికీ ద్రోహం తలపెట్టకుండా, ఓపికున్నంత వరకు పరులకు మేలు చేయడం, ఎదుటివాడు తప్పు చేస్తే వాడు సిగ్గుపడేలా కాక తన దోషాన్ని చక్కదిద్దుకునేలా బోధించడం, అందరూ మెచ్చుకునేటట్లుగా మంచిగా ప్రవర్తించటం, పేరాశను విడిచిపెట్టడం శీలవంతుల లక్షణం. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయయాగం చేశాడు. అతని వైభవం చూసి అసూయపడి తండ్రి దగ్గరకు వెళ్లి తన దుగ్ధ వెళ్లబోసుకున్నాడు దుర్యోధనుడు. ‘‘నాయనా! నాకు మాత్రం తక్కువ ఐశ్వర్యం ఉందా? అయితే ధర్మరాజు నీకంటే ఎక్కువగా ప్రకాశించడానికి కారణం అతడు శీలవంతుడు కావడమే. శీలవంతులను లక్ష్మి వరిస్తుంది. కనుక నువ్వు కూడా శీలవంతుడవైతే సకల సంపదలూ పొందగలవు’’ అంటూ శీల సంపద గురించి దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడు ఒక కథ చెప్పాడు. ‘‘ప్రహ్లాదుడు రాక్షస కులశ్రేష్ఠుడు. సకల విద్యాపారంగతుడు. జనరంజకంగా పాలన చేయగల సమర్థుడు. ఇంద్రరాజ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఇంద్రుడిని అక్కడి నుంచి తరిమివేసి ధర్మయుక్తంగా పాలించసాగాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు తనకు ఇంద్రలోకాధిపత్యం మళ్లీ వచ్చే విధానం చెప్పవలసిందంటూ సురగురువైన బృహస్పతిని ప్రార్థించాడు. బృహస్పతి భార్గవుడిని అడగమన్నాడు. ఇంద్రుడు వెళ్లి భార్గవుడిని ఆశ్రయించాడు. అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతన్నే అడిగి తెలుసుకుని ఉపాయంగా ఆ శక్తిని అడిగి పుచ్చుకో’’ అని సలహా ఇచ్చాడు భార్గవుడు. ఇంద్రుడు విప్రుని వేషం ధరించి ప్రహ్లాదుడికి శిష్యుడై భక్తితో సేవలు చెయ్యడం ప్రారంభించాడు. చాలాకాలం గడిచింది. ప్రహ్లాదుడు ప్రసన్నమయ్యాడు. ‘‘నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు’’ అని అడిగాడు. ‘‘అయ్యా! మీకు త్రిలోకాధిపత్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది’’ అన్నాడు శచీపతి వినయంగా. ‘‘ఏముంది, నేను ఎప్పుడూ రాజుననే గర్వంతో ప్రవర్తించను. ఎవరినీ నొప్పించను. ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ మొదలైన దుర్గుణాలేవీ మనస్సులోకి రానివ్వను. ఎవరు ఏది అడిగినా లేదనకుండా, కాదనకుండా సంతోషపెడతాను. పురాకృత పుణ్యం వల్ల బ్రహ్మర్షులు మెచ్చుకునే శీలం ఉన్నది కనుక ఇంతటి మహోన్నత పదవి లభించింది నాకు’’ అన్నాడు ప్రహ్లాదుడు. ‘‘అయ్యా! మీరు నిజంగా మహాత్ములు. దానశీలురు. నాయందు దయ ఉంచి మీ శీల సంపదను నాకు ఇవ్వండి’’ అని ఇంద్రుడు ప్రహ్లాదుని దీనంగా యాచించాడు. ‘ఎంత దీనంగా అర్థిస్తున్నాడు’ అనుకుని ‘సరే’అన్నాడు ప్రహ్లాదుడు. ఇంద్రుడు పన్నిన పన్నాగంలో ప్రహ్లాదుడు చిక్కుకున్నాడు. ఆ తరువాత ప్రహ్లాదుని శరీరం నుంచి మహాతేజస్సుతో ఒక పురుషుడు బయటకు వచ్చాడు. ‘‘నువ్వెవరు’’ అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. ‘‘నేను శీలాన్ని. నువ్వు నన్ను ఆ విప్రుడికి దానం చేశావుగా, అతని దగ్గరకు వెళ్లిపోతున్నాను’’ అని వెనుతిరగకుండా వెళ్లిపోయాడు ఆ దివ్యపురుషుడు. ఆ వెనుకే ప్రహ్లాదుని శరీరం నుంచి సత్యం, రుజువర్తన, బలం కూడా మెల్లగా బయటకు వెలువడటం ప్రారంభించాయి. చివరగా అతిలోక సౌందర్యరాశి అయిన ఒక స్త్రీ అతని శరీరం నుంచి బయటకు వచ్చింది. ‘‘నువ్వెవరు తల్లీ?’’ అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు. ‘‘నేను లక్ష్మిని, బలం ఎక్కడుంటే అక్కడ ఉంటాను. వెళుతున్నాను’’ అంది లక్ష్మీదేవి. ‘‘అయ్యో తల్లీ! నన్ను విడిచి వెళుతున్నావా? ఇంతకూ అంత వినయంగా ఇన్నాళ్లూ నన్ను సేవించిన ఆ విప్రుడెవరు?’’ అని సిరిని అడిగాడు ప్రహ్లాదుడు. ‘‘అతను ఇంద్రుడు. నీ వైభవాన్ని ఎగరేసుకుపోవడం కోసం వచ్చాడు. నువ్వు అతని మాయలో పడి నీ శీలాన్ని అతనికి ధారపోశావు. శీలం వల్ల ధర్మం, ధర్మం వల్ల సత్యం, సత్యాన్ని అంటిపెట్టుకుని మంచి నడవడి, దానివల్ల బలం, బలాన్ని ఆశ్రయించి నేను ఉంటాం. కనుకనే అన్నింటి కీ ‘శీలమే మూలం’ అని చెప్తారు. నువ్వు శీలాన్ని పోగొట్టుకున్నావు కనుక నేను ఇక నీ దగ్గర ఉండటం అసంభవం’’ అని చెప్పి వెళ్లిపోయింది శ్రీదేవి. ‘‘కనుక, దుర్యోధనా, శీలవంతుడవై వర్థిల్లు’’ అని దుర్యోధనుడికి హితవు చెప్పాడు ధృతరాష్ర్టుడు. - శొంఠి విశ్వనాథం -
భలే మంచి వ్యాపారి ఈ బాల్కీ!
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఏడేళ్ల అబ్బాయి డబ్బు సంపాదనకు పూనుకొంటే... ఖాళీ సమయాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తే... ఎంతమంది తల్లిదండ్రులు ఒప్పుకొంటారు ఈ పనికి? అతడిని ప్రోత్సహిస్తారా? చదువును దృష్టిలో పెట్టుకొని లేదా ఇతర కారణాలతో అలాంటి పనులకు ఒప్పుకోకపోవచ్చు. సయీద్బాల్కీ తల్లిదండ్రులు మాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఏడేళ్ల వయసులోనే ఒకవైపు చదువుకొంటూ మరో పక్క డబ్బు సంపాదన మొదలుపెడితే... అతడు చిట్టి చేతులతో తెచ్చిన సొమ్మునుగాక... అతడిలో ఎదుగుతున్న వ్యాపారవేత్తను చూశారు ఆ తల్లిదండ్రులు. పాకిస్థాన్‌కి చెందిన 22 సంవత్సరాల సయీద్బాల్కీ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రముఖ యంగెస్ట్ ఎంటర్ప్రెన్యూర్లలో ఒకడు. బాల్కీ కుటుంబం పాకిస్థాన్‌లో ఉన్న రోజుల్లో ఈద్ సందర్భంగా గ్రీటింగ్ కార్డులను అమ్మడంతో కెరీర్ మొదలుపెట్టాడు బాల్కీ. తన తల్లి గ్రీటింగ్ కార్డులను కొనడానికి కొంత డబ్బు ఇచ్చేదని, ఆ డబ్బుతో కార్డులు కొని, వాటిని అమ్మి లాభాన్ని సంపాదించే వాడినని, అలా తన వ్యాపార జీవితం ఏడేళ్ల వయసులో లాభసాటిగా మొదలైందని చెబుతాడు బాల్కీ. అయితే బాల్కీలోని వ్యాపారవేత్త అంతటితో ఆగిపోలేదు. స్నాక్స్ తినడమంటే ఇష్టపడే వయసులో తన వీధిలోనే ఒక స్నాక్ షాప్‌ను ప్రారంభించి, లాభాలు ఆర్జించాడు. బాల్కీకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు వీరి కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. కొత్త దేశం, కొత్త ప్రాంతం, కొత్త ఊరు.. ఫ్రెండ్స్ అంతగా లేరు. ఈ సమయంలో తనకు కంప్యూటరే ప్రియనేస్తమైందనీ, అలాగే ‘మౌంటెన్ డ్యూ’ తాగడం వ్యసనంగా మారిందనీ, ఆ వ్యసనం కోసం సొంతంగా డబ్బు సంపాదించుకునే మార్గం అన్వేషించా ననీ, తన కజిన్ ద్వారా ‘డొమైన్ బిజినెస్’లోకి ప్రవేశించాననీ బాల్కీ చెబుతాడు. కజిన్ గెడైన్స్‌తో డొమైన్లు రిజిస్టర్ చేయించడంలో, అమ్మడంలో ప్రావీణ్యత సంపాదించాడు. క్రమంగా వెబ్డిజైన్పై పట్టు సాధించింది సొంతంగా ఫ్రీలాన్స్ వెబ్ డిజైన్ బిజినెస్‌ను ప్రారంభించి, వ్యక్తిగత ప్రతిభతో షైన్ అయ్యాడు. ఇతడు ప్రారంభించిన లిస్ట్ 25 అనే వెబ్సైట్ పాపులర్ అయ్యింది. పే పల్, క్విక్ సిల్వర్, కివ, వర్డ్ ప్రెస్, డోనర్స్ ఛాయిస్ కంపెనీ సీఈవోలతో పనిచేశానని, వారితో పనిచేయడం గొప్ప అనుభవమని బాల్కీ చెప్పాడు. ఇతడి విజయగాథ గురించి న్యూయార్క్‌టైమ్స్, బిజినెస్ ఇన్సైడర్, వైర్డ్ మ్యాగజీన్, యాహూ, అమెక్స్ ఓపెన్ ఫోరమ్ వంటి మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. తగిన అవకాశాలుంటే యువత రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు బాల్కీ. -
మొలాసిస్తో మోదం
చక్కెర ఉప ఉత్పత్తి అయిన మొలాసిస్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. మూడు నెలల వ్యవధిలో ధర రెట్టింపయింది. డిస్టలరీ యూనిట్లతో పాటు మొలాసిస్ అనుబంధ రంగాల్లో దీని వాడకం బాగాపెరగడంతో అమాంతం ధరలు ఆకాశాన్నంటాయి. దీని అమ్మకాలతో జిల్లాలోని నాలుగు సహకార చక్కెర కర్మాగారాలకు ఈ ఏడాది సుమారు రూ. 6 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. సుగర్స్ యాజమాన్యాల్లో ఉత్సాహం వెలువెత్తుతోంది. పంచదార ధర తగ్గిపోయిందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్న తరుణంలో మొలాసిస్ ధరలు భారీగా పెరగడం కలిసొచ్చింది. గత మూడేళ్లతో పోల్చుకుంటే భారీ మొత్తంలో లాభం రావడం ఇదే మొదటి సారి. చోడవరం, ఏటికొప్పాక, తాండవ,తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారాల్లో చోడవరం, ఏటికొప్పాక మిన హా మిగిలిన రెండు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. పంచదార ధర క్వింటా రూ.2950 లోపే అమ్ముడుపోవడంతో బాగా నష్టపోయాయి. బహిరంగ వేలంలో సీల్ టెండర్ల ద్వారా మొలాసిస్ అమ్మకాలతో మంచి ధర వచ్చింది. గతేడాది మెట్రిక్ టన్ను రూ.900లు ధర పలికిన మొలాసిస్ ఈ సీజన్ ప్రారంభంలో రూ.2100లకు,ఏప్రిల్ నాటికి రూ.3055 నుంచి 3150లకు విక్రయించారు. ఇప్పుడు రూ. 6వేలు పలుకుతోంది. గత సీజన్లో చోడవరం ఫ్యాక్టరీ 27,500మెట్రిక్ టన్నుల అమ్మకంతో రూ. 3.79కోట్లు మాత్రమే వస్తే, ఈ సీజన్లో 23,200 మెట్రిక్ టన్నుల విక్రయంతో రూ. 6.14 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే తక్కువ సరుకు అమ్మినప్పటికీ సుమారు రూ. 2.35కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. తాండవ 98,500 మెట్రిక్ టన్నులు అమ్మి రూ.1.15 కోట్లు, ఏటికొప్పాక 15,900 మెట్రిక్ టన్నుల అమ్మకంతో రూ.1.50కోట్లు ఆదాయం పొందింది. దీనివల్ల పంచదారపై నష్టపోయినప్పటికీ మొలాసిస్ ద్వారా కొంత ఊరట కలగడంతో ఫ్యాక్టరీలు ఊపిరిపీల్చుకున్నాయి. నాలుగు కర్మాగారాలు మొలాసిస్‌ను ఒడిశా, బొబ్బిలి(ఎన్సీఎస్),రాజాం(రాజ్యలక్ష్మి)లకు విక్రయిస్తున్నాయి. అయితే మొలాసిస్ నిల్వకు అవసరమైన ట్యాంకులు లేకపోవడం, ఉన్నవి కారిపోతుండటంతో ఎప్పటికప్పుడు అమ్మకాలతో ఫ్యాక్టరీలు నష్టపోతున్నాయి. నిల్వ ఉంచుకున్నవి లాభపడుతున్నాయి. వచ్చే సీజన్నాటికయినా సాంకేతిక సమస్యలను పరిష్కరించి పంచదార, మొలాసిస్ ఉత్పత్తిని పెంచితే అటు యాజమాన్యాలకు, ఇటు రైతులకు మేలు జరుగుతుందన్న వాదన వ్యక్తమవుతోంది.