Health Experts Reveal: Is Eating Peas Good For Hair Growth? - Sakshi
Sakshi News home page

వాటిని తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది!

Published Tue, Jun 13 2023 4:59 PM | Last Updated on Tue, Jun 13 2023 5:38 PM

Health Experts Reveals Eating Peas Good For Hair Growth - Sakshi

ఇటీవలకాలంలో అందర్నీ పట్టిపీడించే సమస్య జుట్టు రాలడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కుచ్చులు,కుచ్చులుగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ట్రీట్‌మెంట్‌ తీసుకున్న పెద్ద ప్రయోజనం కనిపించదు. అలాంటప్పుడూ మనం తీసుకునే ఆహారంలో దీన్ని చేరిస్తే ఆ సమస్య నుంచి కాస్త బయటపడగలమంటున్నారు ఆహార నిపుణులు. అందుకోసం ఏం చేయాలంటే..

మనం తినే ఆహారంలో బఠానీలు తీసుకుంటే జుట్టు రాలే సమస్య తుగ్గుతుందంటున్నారు నిపుణులు. ఈ మేరకు అమెరికాకు చెందిన న్యూట్రిషనల్‌ సైన్స్‌ బృందం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వాటిని మన దైనందిన జీవితంలో ఆహారంలో ఒక భాగంగా ఉపయోగించటం వల్ల జుట్టు రాలడం తుగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడించారు. ఈ బఠానీలలో తగిన మొత్తంలో బీ విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.

ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని వెల్లడించారు. కేవలం బఠానీలు మాత్రమే తీసుకుంటే సరిపోదని, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేలా అవసరమైన ప్రోటీన్లు అందించే సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలని తెలిపారు. వీటిల్లో విటమిన్‌ ఏ ఉంటుందని, అది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఒక భాగమని చెప్పారు. విటమిన్‌ ఏ ఉన్న ఇతర కూరగాయాల తోపాటు బఠానీలు తీసుకోవడం వల్ల జుట్టు మరింత ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. 

(చదవండి: రైతు బిడ్డగా ఓ వరుడి ఆలోచన..మండపానికి ఏకంగా 51 ట్రాక్టర్లతో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement