Hair Growth
-
సమస్యతో బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి..
ప్రతీరోజూ బిజీ బిజీగా గడుపుతున్న జీవితంలో మనం మన ఆరోగ్యాన్ని పట్టించుకోము. అందులో మన ముఖము, జుట్టుల గురించి అయితే అసలు ధ్యాసే ఉండదు. పలువురితో సాగుతున్న క్రమంలో వీటివలన ఎన్నో సమస్యలను ఎదుర్కుంటూ ఉంటాం. ఇతరులతో హేళనలను భరిస్తూ ఉంటాం. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా ఈ అద్భుతమైన బ్యూటీ టిప్స్ మీకోసమే..! పిగ్నెంటేషన్... కీరాతో కట్అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. దీనివల్ల ముఖంపైన ముడతలు, సన్నని చారలు వంటి సమస్యలు దూరం అవుతాయి. బార్లీతో మేని మిలమిల ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మిరియాలతో చుండ్రుకు చెక్! మిరియాలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు సైతం మిరియాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా చుండ్రు సమస్యను చాలా సులువుగా పోగొట్టే సత్తా మిరియాలకు ఉంది. ఇందుకోసం ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీజార్‌లో వేసి వీటితోపాటు టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్‌లో టేబుల్ స్పూన్ ఆవనూనె, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. దీంతో ఒక హెయిర్ టానిక్ రెడీ అవుతుంది. ఈ టానిక్‌ను మాడుకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత మైల్డ్‌షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రంగా ఉన్న చుండ్రు అయినా మాయం అవడంతోపాటు తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇవి చదవండి: మార్చి వచ్చింది.. బోండాం కొట్టు... -
సాల్మన్ చేపలు తింటున్నారా?,ఇందులోని విటమిన్ బి6 వల్ల జుట్టుకు..
అందం అంటే చర్య సౌందర్యం మాత్రమే కాదు.. జుట్టు సౌందర్యం కూడా. అందుకే అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కాస్త జుట్టు ఊడిపోతున్నా తెగ ఫీల్ అవుతుంటారు. ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లమ్. రకరకాల షాంపులు, ఆయుల్స్, పొల్యూషన్ వల్ల చాలామందిలో జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరి వెంట్రుకలు బాగా పెరిగి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీ డైట్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచిది అన్నది ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఖనిజాలను కోల్పోవడం. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి తదితర పోషకాల లోపం వల్ల జుట్టు బాగా రాలుతుంది. కాబట్టి ఇవి డైట్లో ఉండేలా చేసుకోవాలి. అందకు పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి.పాలకూరలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయ పడతాయి. పాలకూర జుట్టుకు సహజసిద్ధమైన కండిషనింగ్‌ను అందిస్తుంది. పాలకూరలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్ ఆహారంలో ప్రతిరోజూ నట్స్ తీసుకోవలి. బాదంపప్పు, పిస్తాపప్పు, కాజు మొదలైన డ్రైఫ్రూట్స్‌ని ప్రతిరోజూ డైట్లో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్ సహా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు, చర్మం ఆరోగ్యానికి గొప్పగా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజూ బాదం తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లను బలంగా, సిల్కీగా ఉండేలా చేస్తుంది. గుడ్లు కోడిగుడ్లలో ప్రొటీన్, విటమిన్ బి12, ఐరన్, జింక్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కురుల పెరుగుదలకు సహాయపడతాయి. గుడ్డు పచ్చసొనలో ఉండే.. విటమిన్ A,E, బయోటిన్, ఫోలేట్ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఓ గుడ్డు తినాలి. చేపల్లో ఒమెగా 3, ఒమెగా 6 తదితర ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ డి, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చూస్తాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. గుడ్డులోని జింక్, బయోటిన్ ఆరోగ్యవంతమైన జుట్టుకు తోడ్పడుతుంది. చేపలు సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా డెడ్ హెయిర్ సెల్స్‌ను తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. సాల్మన్, సార్డినెస్, మాకెరెల్ వంటివి ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉండే చేపలు. ఈ చేపల్లో ప్రొటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి6 కూడా అధికంగా లభిస్తాయి. వీటన్నింటిలో సాల్మన్ చేపలు మరీ ఆరోగ్యకరమైనవి. చిలగడదుంప జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతుంటే ఆహారంలో చిలగడదుంపను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ A లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి జుట్టు పెరుగుదలకు చిలగడదుంపను మీ డైట్లో ఉండేలా చూసుకోండి. బెర్రీలు బెర్రీలు ప్రతిరోజూ బెర్రీలను తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఎందుకంటే బెర్రీస్‌లో జుట్టుకు ఉపయోగపడే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ బెర్రీలను డైట్లో చేర్చుకోండి. పెరుగు పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి మెరుపును అందిస్తాయి. పెరుగును తినడమే కాకుండా ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యలను కంట్రోల్లో ఉంచుతుంది. చుండ్రుతో బాధపడుతున్న వాళ్లు వారానికి ఒకసారి పెరుగుతో ప్యాక్ వేసుకుంటే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది. -
అవి తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది!
ఇటీవలకాలంలో అందర్నీ పట్టిపీడించే సమస్య జుట్టు రాలడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కుచ్చులు,కుచ్చులుగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్న పెద్ద ప్రయోజనం కనిపించదు. అలాంటప్పుడూ మనం తీసుకునే ఆహారంలో దీన్ని చేరిస్తే ఆ సమస్య నుంచి కాస్త బయటపడగలమంటున్నారు ఆహార నిపుణులు. అందుకోసం ఏం చేయాలంటే.. మనం తినే ఆహారంలో బఠానీలు తీసుకుంటే జుట్టు రాలే సమస్య తుగ్గుతుందంటున్నారు నిపుణులు. ఈ మేరకు అమెరికాకు చెందిన న్యూట్రిషనల్ సైన్స్ బృందం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వాటిని మన దైనందిన జీవితంలో ఆహారంలో ఒక భాగంగా ఉపయోగించటం వల్ల జుట్టు రాలడం తుగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడించారు. ఈ బఠానీలలో తగిన మొత్తంలో బీ విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని వెల్లడించారు. కేవలం బఠానీలు మాత్రమే తీసుకుంటే సరిపోదని, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేలా అవసరమైన ప్రోటీన్లు అందించే సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలని తెలిపారు. వీటిల్లో విటమిన్ ఏ ఉంటుందని, అది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఒక భాగమని చెప్పారు. విటమిన్ ఏ ఉన్న ఇతర కూరగాయాల తోపాటు బఠానీలు తీసుకోవడం వల్ల జుట్టు మరింత ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. (చదవండి: రైతు బిడ్డగా ఓ వరుడి ఆలోచన..మండపానికి ఏకంగా 51 ట్రాక్టర్లతో..) -
ఈ విటమిన్ లోపిస్తే.. జుట్టు ఎక్కువగా ఊడి బట్టతల వస్తుంది!
How To Control Hair Fall: ఇటీవలి కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని వెనుక వంశపారంపర్య కారణాలు ఉంటే దానిని నివారించడం కష్టం. అయితే బట్టతలను కొంతకాలం పాటు వాయిదా వేయచ్చు. కానీ ప్రతిసారీ ఈ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల మాత్రం రాదని తెలుసుకోవాలి. జుట్టు రాలడం లేదా బట్టతల రావడం అనేది మస్కులర్ డిస్ట్రోఫీ లాంటి జన్యుపరమైన సమస్య కాదని సైన్స్ చెబుతోంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొన్ని అవసరమైన మూలకాలు లేకపోవడమే. కానీ ఆ మూలకాల లోపం వంశపారంపర్యంగా ఉంటుంది. వారసత్వం అనేది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అయిన జన్యువులది మాత్రమే కాదు. బదులుగా కొన్నిసార్లు పోషకాల లోపం కూడా ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది. చదవండి: అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా.. బయోటిన్ బయోటిన్ అనేది జుట్టుకు అవసరమైన మూలకం. ఇది లేకపోవడం వల్ల జుట్టు పలుచబడుతుంది. దీని లోపం వల్ల గోళ్లు కూడా విరిగిపోతాయి. కండరాల అలసట, బలహీనత, మైకం, కాళ్ళలో తిమ్మిరి వంటివి బయోటిన్ లోపం లక్షణాలు. ఇది శరీరానికి అవసరమైన మూలకం. కానీ జుట్టు, గోళ్లకు ఇది చాలా ముఖ్యమైనది. రాగి సాధారణంగా శరీరంలో రాగి లోపం ఉండదు. కానీ ఏదైనా కారణం వల్ల అది లోపిస్తే జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా భారతదేశం వంటి దేశంలో శరీరంలో కాపర్ సమస్య ఉండదు. కాని ఇది లోపిస్తే మోకాలు, కీళ్లలో భరించలేని నొప్పి ఉంటుంది. కొల్లాజెన్: కొల్లాజెన్ అనేది జుట్టు మూలాలను బలపరిచే మూలకం. ఇది జుట్టుని మందం చేస్తుంది. దీని లోపం వల్ల జుట్టు బలహీనపడుతుంది. ఎక్కువగా ఊడిపోతుంది. చదవండి: సూపర్‌బగ్స్ పెనుప్రమాదం.. యాంటీ బయోటిక్ ఎప్పుడు వాడాలంటే విటమిన్ బి6 జుట్టుకి విటమిన్ బి కాంప్లెక్స్ చాలా ముఖ్యం. దీని లోపం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. విటమిన్ బి 6 మన జుట్టు ఆరోగ్యానికి సంబంధించినది. ఈ విటమిన్ లోపం ఉన్నట్లయితే జుట్టు బలహీనంగా మారుతుంది. ఎక్కువగా ఊడిపోయి బట్టతల వస్తుంది. అందువల్ల ఒకసారి మంచి ట్రైకాలజిస్టును కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకుని ఏ కారణం వల్ల జుట్టు ఊడిపోతోందో తెలుసుకుని ఆ విటమిన్ లోపాన్ని పూరించడం ద్వారా జుట్టు రాలకుండా నివారించుకోవచ్చు. -
జుట్టు రాలే సమస్యకు చక్కటి ఔషధం
నల్లని, ఒత్తైన కురులంటే ఎవరికిష్టం ఉండదు. అలాగే మొహం మీద ఎలాంటి మొటిమలు లేకుండా నిగనిగలాడే సౌందర్యం ప్రతి ఒక్కరూ కావాలనుకుంటారు. ఒత్తుగా, పొడుగైన జుట్టు ఉన్న అమ్మాయి కనిపిస్తే.. అబ్బా! నాకు అలాంటి జుట్టు ఉంటే బాగుండేదని అసూయ పడేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే ఈమధ్య కాలంలో పాటించే ఆహారపు అలవాట్లు, హెయిర్ ఆయిల్, షాంపూ, హెయిర్ కలర్ కారణంగా జుట్టు రాలే సమస్య సర్వ సాధారణంగా మారింది. మరీ ముఖ్యంగా టీనేజ్ యువతుల బాధలు వర్ణనాతీతం. జుట్టు ఊడే సమస్య ఇప్పుడు అబ్బాయిలకు కూడా సోకింది. జుట్టు పెరగడం కంటే ఉన్న జుట్టును కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. అమ్మాయిలు ఎక్కువ కేర్ తీసుకునే విషయాలలో చర్మం, జుట్టు ప్రధానమైనది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొన్ని నియమాలు పాటిస్తే తేలిగ్గా జుట్టును, చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇంట్లో మనకు దొరికే వస్తువులతోనే వీటిని సంరక్షించుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. జుట్టు సంరక్షణకు ముఖ్యమైనది బ్లాక్ టీ. దీంతో జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను అందిస్తోంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, వల్ల శరీరం నుంచి వ్యర్థ పదార్ధాలను తొలగిస్తుంది. అంతేగాక శరీరంలోని అంటు వ్యాధులతో పోరాడటానికి, వాటిని నయం చేయడానికి దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి సహకరిస్తుంది. జుట్టు రాలడమనే సమస్యతో బాధపడేవారికి, బ్లాక్ టీ ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది. బ్లాక్ టీ జుట్టు రాలడాన్ని నెమ్మదిగా తగ్గింది చివరికి దాన్ని ఆపగలదు. ఇందులో ఉన్న కెఫిన్.. జుట్టు రాలడానికి కారణమవుతున్న డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే బ్లాక్ టీ జుట్టుకు ఆరోగ్యకరమైన పెరుగుదలను అందిస్తుంది. కాఫీ లాగానే, బ్లాక్ టీతో జుట్టును కడగడం వల్ల కురులు మెరుస్తూ కనిపిస్తాయి. జుట్టుకు షాంపూ చేసిన తరువాత బ్లాక్ టీ నీళ్లతో వారానికి రెండుసార్లు కడగటం వల్ల మెరుగైన ఫలితాలను అందిస్తుంది. బ్లాక్ టీ వల్ల చర్మానికి ఉన్న ఉపయోగాలు. చర్మానికి గాయం అయినప్పుడు లేదా ఏదైనా గీరుకుపోతే బ్లాక్ టీ బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా కణజాలాలను పునరుత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. బ్లాక్ టీ ఈ ప్రక్రియను వేగవంతం చేయగలదని పరిశోధనలో తేలింది. కళ్ల కింద ఉబ్బినట్లు ఉండటం, నల్లటి వలయాలు వంటి సమస్యలతో బాధపడుతుంటే బ్లాక్ టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. కొంచెం దూదిని తీసుకుని బ్లాక్ టీలో కాసేపు నానబెట్టి 15 నిమిషాలపాటు కళ్ల కింద ఉంచడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. బ్లాక్ టీ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు 1. జుట్టు రాలడమనే సమస్యతో బాధపడేవారికి, బ్లాక్ టీ ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది. బ్లాక్ టీ జుట్టు రాలడాన్ని నెమ్మదిగా తగ్గింది చివరికి దాన్ని ఆపగలదు. ఇందులో ఉన్న కెఫిన్.. జుట్టు రాలడానికి కారణమవుతున్న డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. 2. బ్లాక్ టీ జుట్టుకు ఆరోగ్యకరమైన పెరుగుదలను అందిస్తుంది. కాఫీ లాగానే, బ్లాక్ టీతో జుట్టును కడగడం వల్ల కురులు మెరుస్తూ కనిపిస్తాయి. జుట్టుకు షాంపూ చేసిన తరువాత బ్లాక్ టీ నీళ్లతో వారానికి రెండు సార్లు కడగటం వల్ల మెరుగైన ఫలితాలను అందిస్తుంది. మరి బ్లాక్ టీ వల్ల చర్మానికి, జుట్టుకు ఇన్ని మంచి ఉపయోగాలు ఉన్నప్పుడూ ఆలస్యం చేయకుండా పాటించండి.. అందమైన చర్మాన్ని, ఒత్తైన, పొడవైన నల్లని కురులను మీ సొంతం చేసుకుండి.. -
పరగడుపున కరివేపాకు నమిలారంటే..
కరివేపాకు తెలియని వారుండరు. ఏ వంటకాలలో అయినా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. ఆహారానికి అంత రుచిని అందిస్తున్న కరివేపాకును మాత్రం తినడానికి చాలామంది ఇష్టపడరు. ఇది కూరలో కనిపిస్తే అందరూ ఏరి పారేస్తారు. అయితే ఈ ఆకుల వల్ల వచ్చే లాభాలు తెలిస్తే మాత్రం చక్కగా నమిలేస్తారు. దీనిలో శరీరానికి కావాల్సిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ , బి విటమిన్, కెరోటీన్ పుష్కలంగా ఉంటాయి.. అంతే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తుంది. కరివేపాకును ఖాళీ కడుపుతో నమిలితే బరువు తగ్గడం, జుట్టు పెరగడం, జీర్జ వ్యవస్థ మెరుగు పడటం వటి అద్భుత ఫలితాలను పొందవచ్చు. కరివేపాకును చిన్న చిన్న మార్పులతో తీసుకుంటే మన రోజువారీ డైట్‌ను ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఉదయం పూట లేవగానే కొన్ని కరివేపాకును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మానవ శరీరంలోని అన్ని రకాల ఆరోగ్య ఫలితాలను అందిస్తోంది. కాకపోతే దీనికి కాస్తా అవగాహన ఉంటే చాలు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కరివేపాకు మీ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది. ఉదయం ఒక గ్లాస్ నీటిని తాగండి. కొన్ని నిమిషాల తర్వాత కొన్ని తాజా కరివేపాకులను నమలండి. ఆకులను సరిగ్గా నమలాలి. ఇలా చేసాకా కనీసం అరగంట తర్వాతే టిఫిన్ చేయాలి. అలాగే కరివేపాకు వేసి కాచిన నూనెని తలకి మర్ధన చేస్తే కురులు ఆరోగ్యంగా, నల్లగా మెరుస్తాయి. 2. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తీసుకోవడం ముఖ్యంగా జీర్ణ క్రియకు తోడ్పడుతుంది. ఇవి తినేటప్పుడు జీర్జ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. అలాగే పేగు కదలికకు. మలబద్దం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. 3. ఆనారోగ్య బారీ నుంచి తప్పిస్తోంది. ఉదయం పూట కరివేపాకు తీసుకోవడం వల్ల అనారోగ్యం, వాంతులను తగ్గించడానికి దోహదపడుతుంది. ఈ సమస్యలను రూపుమాపడంలో జీర్జక్రీయను మెరుగుపరుస్తుంది. 4. బరువు తగ్గడంలో దోహదం కరివేపాకు నమలడం వల్ల బరువు తగ్గించే అనేక అంశాలకు సహకరిస్తుంది. మంచి జీర్ణక్రీయ. కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది. కావున ఇక నంచి ‘కూరలో కరివేపాకులా తీసి పారేశారు’ అనే సామెతాలా.. ‘కరివేపాకే కదా’ అంటూ చిన్న చూపు చూడకుండా రోజూ ఏదో ఒక విధంగా కరివేపాకును ఉపయోగించండి. మరి ఇప్పటికైనా కూరల్లో కర్వేపాకును వేరేయకుండా.. ఎంచక్కా తినేసేయండి. -
బట్టతలకు కొత్త ఔషధాలు!
న్యూయార్క్: బట్టతల నివారణకు ఓ సరికొత్త ఔషధాలు సిద్ధమవుతున్నాయి. వెంట్రుకల పెరుగుదలను బాగా పెంచి బట్టతల రావడాన్ని నియంత్రించే ఈ ఔషధాలను అమెరికాకు చెందిన కొలంబియా వర్సిటీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్త ఏంజిలా క్రిస్టియానో నేతృత్వంలోని పరిశోధకులు రూపొందించారు. వెంట్రుకల పెరుగుదల నిలిచిపోయిన చోట చర్మంలో ఉండే వెంట్రుకల మూలాలలో ‘జానస్ కినాసే (జేఏకే)’ తరహాకు చెందిన ఎంజైమ్‌లు ఉంటాయని.. వీటిని నిరోధించినప్పుడు తిరిగి వెంట్రుకలు వేగంగా పెరుగుతున్నట్లుగా గుర్తించామని ఏంజిలా చెప్పారు. ఈ ఎంజైమ్‌లను నియంత్రించే ఔషధాలను అభివృద్ధి చేశామని.. వాటిని మనుషులపై ఇప్పటికే ప్రయోగించి చూడగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ ఔషధాలను నేరుగా చర్మంపై రాసుకుంటే సరిపోతుందన్నారు. పలు ఇతర వ్యాధుల బారిన పడినప్పుడు వెంట్రుకలు రాలిపోవడాన్ని ఈ మందులు నియంత్రిస్తాయన్నారు.