![Tips For Prevention Of Hereditary Hair Fall And Baldness - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/6/Hair-Fall-And-Baldness.jpg.webp?itok=icUjZJyM)
ప్రతీకాత్మక చిత్రం
How To Control Hair Fall: ఇటీవలి కాలంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. దీని వెనుక వంశపారంపర్య కారణాలు ఉంటే దానిని నివారించడం కష్టం. అయితే బట్టతలను కొంతకాలం పాటు వాయిదా వేయచ్చు. కానీ ప్రతిసారీ ఈ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల మాత్రం రాదని తెలుసుకోవాలి. జుట్టు రాలడం లేదా బట్టతల రావడం అనేది మస్కులర్ డిస్ట్రోఫీ లాంటి జన్యుపరమైన సమస్య కాదని సైన్స్ చెబుతోంది.
దీనికి ప్రధాన కారణం శరీరంలో కొన్ని అవసరమైన మూలకాలు లేకపోవడమే. కానీ ఆ మూలకాల లోపం వంశపారంపర్యంగా ఉంటుంది. వారసత్వం అనేది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అయిన జన్యువులది మాత్రమే కాదు. బదులుగా కొన్నిసార్లు పోషకాల లోపం కూడా ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది.
చదవండి: అలర్జీలూ, ఆస్తమాలతో జాగ్రత్త!.. గుడ్లు, పల్లీలు, పచ్చళ్లు.. ఇంకా..
బయోటిన్
బయోటిన్ అనేది జుట్టుకు అవసరమైన మూలకం. ఇది లేకపోవడం వల్ల జుట్టు పలుచబడుతుంది. దీని లోపం వల్ల గోళ్లు కూడా విరిగిపోతాయి. కండరాల అలసట, బలహీనత, మైకం, కాళ్ళలో తిమ్మిరి వంటివి బయోటిన్ లోపం లక్షణాలు. ఇది శరీరానికి అవసరమైన మూలకం. కానీ జుట్టు, గోళ్లకు ఇది చాలా ముఖ్యమైనది.
రాగి
సాధారణంగా శరీరంలో రాగి లోపం ఉండదు. కానీ ఏదైనా కారణం వల్ల అది లోపిస్తే జుట్టు, గోళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా భారతదేశం వంటి దేశంలో శరీరంలో కాపర్ సమస్య ఉండదు. కాని ఇది లోపిస్తే మోకాలు, కీళ్లలో భరించలేని నొప్పి ఉంటుంది.
కొల్లాజెన్: కొల్లాజెన్ అనేది జుట్టు మూలాలను బలపరిచే మూలకం. ఇది జుట్టుని మందం చేస్తుంది. దీని లోపం వల్ల జుట్టు బలహీనపడుతుంది. ఎక్కువగా ఊడిపోతుంది.
చదవండి: సూపర్‌బగ్స్ పెనుప్రమాదం.. యాంటీ బయోటిక్ ఎప్పుడు వాడాలంటే
విటమిన్ బి6
జుట్టుకి విటమిన్ బి కాంప్లెక్స్ చాలా ముఖ్యం. దీని లోపం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. విటమిన్ బి 6 మన జుట్టు ఆరోగ్యానికి సంబంధించినది. ఈ విటమిన్ లోపం ఉన్నట్లయితే జుట్టు బలహీనంగా మారుతుంది. ఎక్కువగా ఊడిపోయి బట్టతల వస్తుంది. అందువల్ల ఒకసారి మంచి ట్రైకాలజిస్టును కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకుని ఏ కారణం వల్ల జుట్టు ఊడిపోతోందో తెలుసుకుని ఆ విటమిన్ లోపాన్ని పూరించడం ద్వారా జుట్టు రాలకుండా నివారించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment