నల్లని, ఒత్తైన కురులంటే ఎవరికిష్టం ఉండదు. అలాగే మొహం మీద ఎలాంటి మొటిమలు లేకుండా నిగనిగలాడే సౌందర్యం ప్రతి ఒక్కరూ కావాలనుకుంటారు. ఒత్తుగా, పొడుగైన జుట్టు ఉన్న అమ్మాయి కనిపిస్తే.. అబ్బా! నాకు అలాంటి జుట్టు ఉంటే బాగుండేదని అసూయ పడేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే ఈమధ్య కాలంలో పాటించే ఆహారపు అలవాట్లు, హెయిర్ ఆయిల్, షాంపూ, హెయిర్ కలర్ కారణంగా జుట్టు రాలే సమస్య సర్వ సాధారణంగా మారింది.
మరీ ముఖ్యంగా టీనేజ్ యువతుల బాధలు వర్ణనాతీతం. జుట్టు ఊడే సమస్య ఇప్పుడు అబ్బాయిలకు కూడా సోకింది. జుట్టు పెరగడం కంటే ఉన్న జుట్టును కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. అమ్మాయిలు ఎక్కువ కేర్ తీసుకునే విషయాలలో చర్మం, జుట్టు ప్రధానమైనది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొన్ని నియమాలు పాటిస్తే తేలిగ్గా జుట్టును, చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇంట్లో మనకు దొరికే వస్తువులతోనే వీటిని సంరక్షించుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
జుట్టు సంరక్షణకు ముఖ్యమైనది బ్లాక్ టీ. దీంతో జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను అందిస్తోంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, వల్ల శరీరం నుంచి వ్యర్థ పదార్ధాలను తొలగిస్తుంది. అంతేగాక శరీరంలోని అంటు వ్యాధులతో పోరాడటానికి, వాటిని నయం చేయడానికి దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి సహకరిస్తుంది.
జుట్టు రాలడమనే సమస్యతో బాధపడేవారికి, బ్లాక్ టీ ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది. బ్లాక్ టీ జుట్టు రాలడాన్ని నెమ్మదిగా తగ్గింది చివరికి దాన్ని ఆపగలదు. ఇందులో ఉన్న కెఫిన్.. జుట్టు రాలడానికి కారణమవుతున్న డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే బ్లాక్ టీ జుట్టుకు ఆరోగ్యకరమైన పెరుగుదలను అందిస్తుంది. కాఫీ లాగానే, బ్లాక్ టీతో జుట్టును కడగడం వల్ల కురులు మెరుస్తూ కనిపిస్తాయి. జుట్టుకు షాంపూ చేసిన తరువాత బ్లాక్ టీ నీళ్లతో వారానికి రెండుసార్లు కడగటం వల్ల మెరుగైన ఫలితాలను అందిస్తుంది.
బ్లాక్ టీ వల్ల చర్మానికి ఉన్న ఉపయోగాలు.
చర్మానికి గాయం అయినప్పుడు లేదా ఏదైనా గీరుకుపోతే బ్లాక్ టీ బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా కణజాలాలను పునరుత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. బ్లాక్ టీ ఈ ప్రక్రియను వేగవంతం చేయగలదని పరిశోధనలో తేలింది.
కళ్ల కింద ఉబ్బినట్లు ఉండటం, నల్లటి వలయాలు వంటి సమస్యలతో బాధపడుతుంటే బ్లాక్ టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. కొంచెం దూదిని తీసుకుని బ్లాక్ టీలో కాసేపు నానబెట్టి 15 నిమిషాలపాటు కళ్ల కింద ఉంచడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
బ్లాక్ టీ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు
1. జుట్టు రాలడమనే సమస్యతో బాధపడేవారికి, బ్లాక్ టీ ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది. బ్లాక్ టీ జుట్టు రాలడాన్ని నెమ్మదిగా తగ్గింది చివరికి దాన్ని ఆపగలదు. ఇందులో ఉన్న కెఫిన్.. జుట్టు రాలడానికి కారణమవుతున్న డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
2. బ్లాక్ టీ జుట్టుకు ఆరోగ్యకరమైన పెరుగుదలను అందిస్తుంది. కాఫీ లాగానే, బ్లాక్ టీతో జుట్టును కడగడం వల్ల కురులు మెరుస్తూ కనిపిస్తాయి. జుట్టుకు షాంపూ చేసిన తరువాత బ్లాక్ టీ నీళ్లతో వారానికి రెండు సార్లు కడగటం వల్ల మెరుగైన ఫలితాలను అందిస్తుంది. మరి బ్లాక్ టీ వల్ల చర్మానికి, జుట్టుకు ఇన్ని మంచి ఉపయోగాలు ఉన్నప్పుడూ ఆలస్యం చేయకుండా పాటించండి.. అందమైన చర్మాన్ని, ఒత్తైన, పొడవైన నల్లని కురులను మీ సొంతం చేసుకుండి..
Comments
Please login to add a commentAdd a comment