Black tea
-
జుట్టు రాలే సమస్యకు చక్కటి ఔషధం
నల్లని, ఒత్తైన కురులంటే ఎవరికిష్టం ఉండదు. అలాగే మొహం మీద ఎలాంటి మొటిమలు లేకుండా నిగనిగలాడే సౌందర్యం ప్రతి ఒక్కరూ కావాలనుకుంటారు. ఒత్తుగా, పొడుగైన జుట్టు ఉన్న అమ్మాయి కనిపిస్తే.. అబ్బా! నాకు అలాంటి జుట్టు ఉంటే బాగుండేదని అసూయ పడేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే ఈమధ్య కాలంలో పాటించే ఆహారపు అలవాట్లు, హెయిర్ ఆయిల్, షాంపూ, హెయిర్ కలర్ కారణంగా జుట్టు రాలే సమస్య సర్వ సాధారణంగా మారింది. మరీ ముఖ్యంగా టీనేజ్ యువతుల బాధలు వర్ణనాతీతం. జుట్టు ఊడే సమస్య ఇప్పుడు అబ్బాయిలకు కూడా సోకింది. జుట్టు పెరగడం కంటే ఉన్న జుట్టును కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. అమ్మాయిలు ఎక్కువ కేర్ తీసుకునే విషయాలలో చర్మం, జుట్టు ప్రధానమైనది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొన్ని నియమాలు పాటిస్తే తేలిగ్గా జుట్టును, చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇంట్లో మనకు దొరికే వస్తువులతోనే వీటిని సంరక్షించుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. జుట్టు సంరక్షణకు ముఖ్యమైనది బ్లాక్ టీ. దీంతో జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను అందిస్తోంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, వల్ల శరీరం నుంచి వ్యర్థ పదార్ధాలను తొలగిస్తుంది. అంతేగాక శరీరంలోని అంటు వ్యాధులతో పోరాడటానికి, వాటిని నయం చేయడానికి దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి సహకరిస్తుంది. జుట్టు రాలడమనే సమస్యతో బాధపడేవారికి, బ్లాక్ టీ ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది. బ్లాక్ టీ జుట్టు రాలడాన్ని నెమ్మదిగా తగ్గింది చివరికి దాన్ని ఆపగలదు. ఇందులో ఉన్న కెఫిన్.. జుట్టు రాలడానికి కారణమవుతున్న డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే బ్లాక్ టీ జుట్టుకు ఆరోగ్యకరమైన పెరుగుదలను అందిస్తుంది. కాఫీ లాగానే, బ్లాక్ టీతో జుట్టును కడగడం వల్ల కురులు మెరుస్తూ కనిపిస్తాయి. జుట్టుకు షాంపూ చేసిన తరువాత బ్లాక్ టీ నీళ్లతో వారానికి రెండుసార్లు కడగటం వల్ల మెరుగైన ఫలితాలను అందిస్తుంది. బ్లాక్ టీ వల్ల చర్మానికి ఉన్న ఉపయోగాలు. చర్మానికి గాయం అయినప్పుడు లేదా ఏదైనా గీరుకుపోతే బ్లాక్ టీ బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా కణజాలాలను పునరుత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. బ్లాక్ టీ ఈ ప్రక్రియను వేగవంతం చేయగలదని పరిశోధనలో తేలింది. కళ్ల కింద ఉబ్బినట్లు ఉండటం, నల్లటి వలయాలు వంటి సమస్యలతో బాధపడుతుంటే బ్లాక్ టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. కొంచెం దూదిని తీసుకుని బ్లాక్ టీలో కాసేపు నానబెట్టి 15 నిమిషాలపాటు కళ్ల కింద ఉంచడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. బ్లాక్ టీ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు 1. జుట్టు రాలడమనే సమస్యతో బాధపడేవారికి, బ్లాక్ టీ ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది. బ్లాక్ టీ జుట్టు రాలడాన్ని నెమ్మదిగా తగ్గింది చివరికి దాన్ని ఆపగలదు. ఇందులో ఉన్న కెఫిన్.. జుట్టు రాలడానికి కారణమవుతున్న డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. 2. బ్లాక్ టీ జుట్టుకు ఆరోగ్యకరమైన పెరుగుదలను అందిస్తుంది. కాఫీ లాగానే, బ్లాక్ టీతో జుట్టును కడగడం వల్ల కురులు మెరుస్తూ కనిపిస్తాయి. జుట్టుకు షాంపూ చేసిన తరువాత బ్లాక్ టీ నీళ్లతో వారానికి రెండు సార్లు కడగటం వల్ల మెరుగైన ఫలితాలను అందిస్తుంది. మరి బ్లాక్ టీ వల్ల చర్మానికి, జుట్టుకు ఇన్ని మంచి ఉపయోగాలు ఉన్నప్పుడూ ఆలస్యం చేయకుండా పాటించండి.. అందమైన చర్మాన్ని, ఒత్తైన, పొడవైన నల్లని కురులను మీ సొంతం చేసుకుండి.. -
లైఫ్ ఈజ్ బ్యూ'టీ'ఫుల్ & కలర్‌ఫుల్
మనం రోజూ తాగే టీకి ఒక ప్రత్యేకమైన రంగు ఉంటుంది. కాస్త పాలు ఎక్కువైతే తేలికపాటి రంగు, డికాక్షన్ ఎక్కువైతే ముదురు రంగు వస్తాయి. అంతేగాక... టీలలో మరికొన్ని రంగులు కూడా ఉంటాయి. అవి దేనివల్ల వస్తాయి... వాటి ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. వైట్ టీ : ఇది పాల పాళ్లుఎక్కువ కావడం వల్ల వచ్చే తేలిక పాటి రంగు కాదు. చాలా లేతగా ఉండే టీ-ఆకులతో తయారైన టీ-పౌడర్‌తో కాచే టీ వల్ల ఈ రంగు వస్తుంది. ఇది రొటీన్‌గా ఉండే రుచితో కాకుండా కాస్తంత పచ్చిగా ఉన్నట్లుంటుంది. అయితే ఇందులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ కాబట్టి అనేక క్యాన్సర్లను నివారిస్తుంది. సాధారణ టీ : మనం రోజూ తాగే చాయ్ ఇది. కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కోసారి అది రెండు కప్పులకు మించితే తొలుత చాలా ఎక్కువగా ఉత్తేజపరచి, ఆ తర్వాత నిస్తేజమయ్యేలా చేయవచ్చు. కానీ సాధారణంగా కాఫీ కంటే టీలో కెఫిన్ తక్కువ. అందుకే కాఫీ కంటే టీని ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. అయితే దీన్ని కూడా మరీ ఎక్కువగా తీసుకుంటే అది సాధారణ జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగించడం, పోషకాలు ఒంటికి పట్టకుండా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి టీ మరీ ఎక్కువగా తీసుకోవడం (రోజుకు ఐదు కప్పులకు మించి) తాగడం కూడా అంత మంచిది కాదు. బ్లాక్ టీ : సాధారణంగా పాలు కలపకుండా కేవడం డికాక్షన్ మాత్రమే తీసుకుంటే దాన్ని బ్లాక్ టీగా పరిగణిస్తారు. ఇది నలుపు రంగులో కాకుండా డికాక్షన్‌కు ఉండే సహజమైన మెరుపుతో ఉంటే మరీ మేలు చేస్తుంది. పశ్చిమాసియా, యూరప్‌కు చెందిన వారు ఈ చాయ్ ఎక్కువగా తాగుతుంటారు. ఇందులోని హెర్బల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే అంతగా అలవాటు లేనివారు బ్లాక్ టీని మరీ మితిమీరి తాగితే నిద్రలేమి, గుండెదడ, రక్తం వేగంగా ప్రవహించడం వంటి దుష్పరిణామలు సంభవించవచ్చు. అందుకే బ్లాక్ టీని కూడా పరిమితంగానే తాగాలి. గ్రీన్-టీ : ఇటీవల ఆరోగ్యం కోసం చాలామంది గ్రీన్-టీ తాగుతున్నారు. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్‌ను నివారిస్తాయి. అయితేకాదు... గుండెజబ్బుల నుంచి నివారణ కలుగుతుంది. కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. ఎపిగెల్లో కాటెచిన్-3 (ఈజీసీజీ) అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ఈ టీలోని మరీ ఎక్కువ చేదుదనాన్ని నివారించడం కోసం కొంతమంది తేనె కలుపుకుంటారు. దీన్ని చేదుగా తీసుకోవడమే మేలు. మరీ ఎక్కువ తేనె వల్ల రక్తంలో చక్కెరపాళ్లు మితిమీరవచ్చు. అయితే దీన్ని కూడా పరిమితంగా తాగితేనే మేలు. చాక్లెట్ టీ : ఇది కాస్త చాక్లెట్ రంగు మిళితమైనట్లు కనిపించడంతో పాటు చాక్లెట్ ఫ్లేవర్‌నూ కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్స్ వల్ల మన నరాలు ఉత్తేజితం కావడంతో పాటు ఇందులోని పాలీఫినాల్స్ ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అయితే చాక్లెట్ టీని షుగర్ వ్యాధిగ్రస్తులు అదేపనిగా తాగడం అంత మంచిది కాదు. మరీ ఎక్కువ చాక్లెట్ టీ వల్ల నరాలు మరీ ఎక్కువగా ఉత్తేజితం చెందితే నిద్రలేమి కూడా రావచ్చు. బ్రౌన్ టీ లేదా ఊలాంగ్ టీ : ఇది చాలా తక్కువ ప్రాసెస్ చేసిన గ్రీన్, బ్లాక్ టీల సమ్మేళనం. దీన్ని ఎక్కువగా చైనా, తైవాన్ దేశాలలో తాగుతుంటారు. ఊలాంగ్ టీలలో జాస్మిన్, కొబ్బరి, క్యారమెల్ వంటి ఇతర రకాలు కూడా ఇటీవల అందుబాటులోకి వస్తున్నాయి. జాయ్‌ను ఇచ్చే చాయ్‌లోని కొన్ని రంగులివి. - సుజాతా స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్ -
బ్లాక్ మ్యాజిక్
ఆరోగ్య సమస్యలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు ఇప్పుడంతా. అలా తయారైన కొత్త ఆహారప పదార్థాల లిస్టులోకి బ్లాక్ టీ కూడా చేరింది. ఈ మార్పు ఎంతో మంచిదంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. ఈ సంస్థ నిర్వహించిన ఓ పరిశోధనా ఫలితాలు బ్లాక్ టీ ప్రయోజనాల్ని బయటపెట్టాయి. అవేమిటంటే... బ్లాక్ టీ ‘కరొనరీ ఆర్టరీ డిస్ఫంక్షన్’ని తగ్గిస్తుందట. అందువల్ల గుండె జబ్బులతో బాధపడేవారు రోజూ కచ్చితంగా ఒక కప్పు బ్లాక్ టీ తాగటం మంచిదంటున్నారు. బ్లాక్ టీలో ఉండే రసాయనాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. వీటిలో విస్తారంగా ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, జీర్ణక్రియా వ్యవస్థకు హాని కలిగించే పదార్థాలతో పోరాడుతుందట. బ్లాక్ టీలో ఉండే టానిన్స్... డయేరియాను తగ్గిస్తాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వును కరిగిస్తుంది. ఫాటల్ అటాక్స్ బారిన పడకుండా రక్షిస్తుంది. రోజుకు మామూలు టీ తాగే వారితో పోలిస్తే బ్లాక్ టీ తాగేవారిలో గుండెనొప్పి వచ్చే అవకాశం 21 శాతం తక్కువ. ఆస్థమా రోగుల శ్వాసక్రియను మెరుగు పర్చడంలో బ్లాక్ టీ పెద్ద పాత్రే పోషిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి కోరలకు చిక్కకుండా బ్లాక్ టీ కాపాడుతుంది. బ్లాక్ టీ కొన్ని రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడుతుందని పరిశోధనలో తేటతెల్లమయ్యింది. ముఖ్యంగా ఇది తాగే మహిళల్లో ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటోందట. ఇందులో ఉండే పాలిఫినాల్స్ పేగులను ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడతాయి. అందువల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, పేగుల వ్యాధులు రాకుండా ఉంటాయి.దీనిలో ఉండే ఫైటోకెమికల్స్ ఎముకలను గట్టిపరుస్తాయి. జుట్టు కుదుళ్లు బలపడటానికి, చర్మం ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా బ్లాక్ టీ సహాయపడుతుంది.