Skin Problems
-
మనలాగే.. ఐస్మార్ట్ దర్పణం!
ముఖంపై ముడతలు, నల్ల మచ్చలను గుర్తిస్తుంది ఇంట్లో ఉండి కూడా మన చర్మం గురించి తెలుసుకోవచ్చు ప్రస్తుతం నగరంలో పెరుగుతున్న స్మార్ట్ మిర్రర్స్ వాడకం బ్యూటీ పార్లర్లలో అధునాతన మిర్రర్స్ వినియోగంచర్మ సౌందర్య సాధానాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. ఒకప్పుడు అమ్మాయిలకు మాత్రమే.. కానీ నేడు పురుషులు కూడా అందం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో సౌందర్య సాధానాల వాడకం విపరీతంగా పెరిగింది. 2023లో వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.135 కోట్లు. 2026 నాటికి రూ.230 కోట్లకు ఎగబాకనున్నదని నిపుణుల అంచనా. నగరాల్లో కాలుష్యం, ఎండ, దుమ్ము కారణంగా అనేక చర్మ సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి రక్షణకు చాలామంది మార్కెట్లో దొరికిన అనేక రకాల క్రీములు, జెల్స్, పౌడర్లు, సోప్‌లు, ఫేస్ వాష్‌లు వాడేస్తున్నారు. ఎలాంటి చర్మానికి ఎలాంటి సాధనాలు వాడాలనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. మరి మన చర్మం తత్వం ఎలా ఉందో తెలుసుకోవడం ఎలా..? అందుకే మన లాంటి వారి కోసమే నేనున్నా అంటూ వచ్చేసింది స్మార్ట్ మిర్రర్. ఇది మన చర్మ సమస్యలను ఇట్టే చెప్పేస్తుంది.. సాధారణ అద్దంలో చూసుకుంటే మన ముఖం ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ స్మార్ట్ మిర్రర్లో మాత్రం మన ముఖంలో ఉన్న లోపాలన్నీ కనిపిస్తాయన్న మాట. కళ్ల కింద నలుపు, నల్ల మచ్చలు, రంధ్రాలు, ముడతలు, గీతలు, మన చర్మం స్వభావం వంటి విషయాలు వెంటనే చెప్పేస్తుంది. మన ముఖంలో ఉన్న సమస్యలను కచ్చితత్వంతో పసిగట్టి మనకు విశ్లేషణ అందిస్తుంది. దీన్నిబట్టి మనం ఎలాంటి చికిత్స తీసుకోవాలనే అంచనాకు రావొచ్చు. ఇటీవల పలు బ్యూటీ పార్లర్స్‌లో కూడా దీని వాడకం విరివిగా పెరిగిపోయింది. సొంతంగానూ వాడుకోవచ్చు.. చాలా కంపెనీలు స్మార్ట్ మిర్రర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ట్యాబ్ పరిమాణంలో ఉండే ఈ స్మార్ట్ మిర్రర్ దాదాపు రెండున్నర కేజీల బరువు ఉంటుంది. దీనికి ఒక హెచ్డీ కెమెరా ఉంటుంది. దీని ముందు ముఖం పెట్టగానే కొన్ని ఫొటోలు తీస్తుంది. ఆ ఫొటోలను విశ్లేషించి మన చర్మం తత్వాన్ని చెప్పేస్తుంది. స్మార్ట్ ఫోన్ మాదిరిగానే మన వెంటే తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా వాడుకోవచ్చు. దీని ద్వారా మన చర్మంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే విషయాలను గుర్తించి, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాస్త జాగ్రత్త మరీ.. ఏదైనా పరికరంలో కెమెరాలు ఉన్నాయంటే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని వాడనప్పుడు మూసేసి ఉంచడం మంచిది. కాకపోతే కొన్ని స్మార్ట్ మిర్రర్స్ వాడకంలో లేనప్పుడు ఆటోమేటిక్‌గా బంద్ అయిపోతుంది. దీంతో కాస్త వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది. మనం స్మార్ట్ మిర్రర్‌గా వాడనప్పుడు కెమెరాలు క్లోజ్ అయిపోయి.. సాధారణ అద్దంలాగే వాడుకోవచ్చు. హైటెక్ మిర్రర్ కూడా.. ఇంట్లోనే కాకుండా బ్యూటీ పార్లర్స్‌లో కూడా ఎక్కువగా స్కిన్ అనలైజర్లను ఇటీవల వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ మిర్రర్ ఇచి్చన ఇన్పుట్స్ ఆధారంగా శరీర తత్వానికి తగ్గట్టు సౌందర్యసాధనాలను వాడుతున్నారు. ఎలాంటి మేకప్ వేస్తే వారి చర్మానికి సూట్ అవుతుందనే విషయంపై ఓ అవగాహనకు వచి్చ, వారికి అలాంటి ఉత్పత్తులనే వాడుతున్నారు.పూర్తిస్థాయి పరిష్కారం కాదు.. స్మార్ట్ మిర్రర్స్ ద్వారా ఆయిల్ స్కిన్, పొడి చర్మమా అని చర్మం తత్వం గురించి తెలుస్తుంది. స్కిన్ ఏజింగ్ ప్రాసెస్ మాత్రమే తెలుపుతుంది. ఎండ లేదా కాలుష్యానికి ఎంతగా ప్రభావితమైందో అర్థం అవుతుంది. వీటి ద్వారా చర్మాన్ని ఎలా కాపాడుకోవాలనే అంచనాకు రావొచ్చు. అయితే చర్మ సంబంధిత వ్యాధుల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వదు. వ్యాధి నిర్ధారణ విషయంలో స్మార్ట్ మిర్రర్స్‌ను నమ్ముకోవద్దు. అలాంటప్పుడు డెర్మటాలజిస్టును కలిసి చికిత్స తీసుకోవాలి. సొంత వైద్యం చేసుకుంటే మరిన్ని సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్ గంగా హరీశ్, డెర్మటాలజిస్టు, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ -
శీతకాలంలో వేదించే పొడిచర్మ సమస్యకు ఇది బెస్ట్ క్రీమ్!
శీతకాలంలో చర్మం పొడిబారి ఇబ్బంది పెడుతుంటుంది. కాళ్లు, చేతులు కూడా శీతకాలంలో పొడిబారినట్లు అయిపోయి పగళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. మార్కెట్లో లభించే ఎన్ని రకాల క్రీమ్‌లు రాసినా అంత ప్రయోజనం ఉండదు. దీనికి బెస్ట్ క్రీం ఆయుర్వేదంలో ఉంది. ఐదేవేల ఏళ్ల నాటి చరక సంహితలో ఆ క్రీమ్ గురించి సవివరంగా చెప్పారు. దీన్ని మంచి మాయిశ్చరైజింగ్ క్రీం అనే చెప్పాలి. ఇంతకీ ఏంటా క్రీమ్ అంటే.. దీని పేరు 'శత ధౌత ఘృత క్రీమ్'. ఏంటీ పేరు ఇలా ఉందనిపిస్తుందా?..ఆ పేరులో క్రీమ్ అంటే ఏంటో చెబుతుంది. శత అంటే వంద. ధౌత అంటే కడగడం. ఘృత అంటే నెయ్యిం. మొత్తం కలిపితే వందసార్లు కడిగిన నెయ్యి అని అర్థం. నెయ్యిని వందసార్లు కడగడం ఏంటీ?. ఇదేంక్రీం అని ముఖం చిట్లించకండి. ఇది చర్మ సౌందర్యానికి అద్భుతమైన క్రీమ్ అని నిపుణులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యానికే కాకుండా వృధ్యాప్య ఛాయలను కూడా తగ్గించి మంచి నిగారింపునిస్తుంది ఈ క్రీమ్. ఎందుకు నెయ్యిని ఇలా వందసార్లు కడగాలంటే..నేరుగా నెయ్యిని ముఖానికి అప్లై చేస్తే దానిలో ఉండే పీహెచ్ చర్మానికి అనుకూలంగా ఉండదు. అదే నెయ్యిని వందసార్లు నీటితో కడగితే దానిలో ఉండే పీహెచ్ స్థాయిలు తటస్థంగా మారిపోతాయి. అప్పుడూ ముఖానికి అప్లై చేస్తే చర్మంలోని లోతైన పొరల్లోకి చొచ్చుకుని పోయి మృతకణాలకు లేకుండా చేస్తుంది. పైగా ముఖం అత్యంత కోమలంగా ఉంటుంది. అంతేగాదు ఇది ఇరిటేషన్, సోరియస్, ఎగ్జిమా వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ క్రీమ్ చాల బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.ఐతే కొంచెం శ్రమతో కూడిన పని. ఈ క్రీం తయారీ కోసం మీకు కావల్సిందల్లా మంచి ఆవునెయ్యి, స్వచ్ఛమైన నీరు. నీటితో ఇలా వందసార్లు నెయ్యిని కడగటానికి సుమారు రెండు గంటల సమయం పడుతుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ఈ సహజసిద్ధమైన క్రీమ్‌ని తయారు చేసుకుని మీ మేనుని కాంతివంతంగా మార్చుకోండి!. అంతేకాదండోయ్! మార్కెట్లో కూడా లభిస్తుంది. (చదవండి: కళ్లకింద ముడతలు, నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చెక్‌పెట్టండి!) -
లూపస్ వ్యాధి మహిళలలో అధికం వాటిని మనం తొందరగా గుర్తించకపోతే జరిగేది ఇదే..
-
చంపుతున్న చలి.. గుండె జబ్బులున్నవారు వాకింగ్ చేస్తున్నారా!
తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దినదినం రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వణికించే చలి కారణంగా వ్యాధులు చుట్టుముట్టే అవకాశముంది. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులున్నవారికి ప్రమాదం పొంచి ఉంది. ఉదయం, రాత్రివేళలో బయటకు వెళ్తే చర్మం పొడి బారి బిగుసుగా మారనుంది. కాళ్ల మడిమలు, పాదాలు పగులుతాయి. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి అధిగవిుంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. చర్మ సంరక్షణ ఇలా.. చలికాలంలో శరీరానికి మాయిశ్చరైజర్లు తప్పనిసరి. క్రీమ్ టేస్ట్ మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. చలికి పెదాలు పగిలి రక్తం కారకుండా వ్యాజిలిన్, లిప్‌బామ్ రాసుకోవాలి. చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండేందుకు గ్లిజరిన్ సబ్బులు వాడాలి. స్నానానికి ముందు ఆలీవ్ ఆయిల్, కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఖర్చు తగ్గించుకోవాలనుకునేవారు ఇంట్లోనే అందుబాటులో ఉండే శనగపిండితో స్నానం చేయాలి. వివిధ పనుల కోసం బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా ఉన్ని దస్తులు ధరించాలి. బైక్‌పై వెళ్లేవారు మంకీ క్యాప్, కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌస్లు వాడాలి. ఎండకు వెళ్లాలనుకుంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. రాత్రివేళ నిద్రించే ముందు మోచేతులు, మోకాళ్లు పగలకుండా నూనె, లేపనం రాసుకుంటే మంచిది. థైరాయిడ్ తరహా సమస్యలున్నవారు పైజాగ్రత్తలతో పాటు ఇంట్లో సాక్స్‌లు ధరించడం మేలు. దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం ఉంటే ఇంటి వ ద్దనే విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. మధుమేహం, గుండెజబ్బులున్నవారు శరీరంపై గీతలు పడకుండా జాగ్రత్తపడాలి. చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. పాదాలు పగిలితే.. చలికాలంలో చాలామందికి పాదాలు పగులుతాయి. ఉప్పునీరు కలిసిన గోరు వెచ్చని నీటిలో పది నిమిషాల పాటు పాదాలు ఉంచాలి. ఆ తర్వాత సబ్బుతో శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్ రాయాలి. విటమిన్–ఈ క్రీమ్ రాస్తే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలు పాటించాలి. అస్తమా ఉంటే.. చలికాలంలో అస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను అందుబాటులో ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. గాలికి తిరగవద్దు. డాక్టర్ సలహా మేరకు మందులు, ఇన్హేలర్, నెబ్యులైజర్ లాంటివి వాడాలి. గుండె జబ్బులుంటే.. చలికాలంలో గుండెజబ్బులున్న వారు, గుండె ఆపరేషన్ చేయించుకున్నవారు వాకింగ్ చేయవద్దు. చలిలో ఎక్కువగా తిరిగితే రక్త నాళాలు సంకోచించి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్ ఉన్న వారు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఆహారంలో మార్పులు అవసరం చలికాలంలో సమతుల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా జామ, దానిమ్మ, బొప్పాయి, సంత్ర, అరటిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ‘సీ’ ఉన్న పండ్లు జలుబు, ఫ్లూ వంటి జబ్బుల నుంచి కాపాడుతాయి. మరీ పచ్చిగా ఉన్నవి, బాగా పండినవి కాకుండా మధ్యస్తంగా ఉన్న పండ్లు ఎంపిక చేసుకోవాలి. చలికాలంలో సహజంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, వంటివి త్వరగా వస్తాయి. ఆహారం అరుగుదల తక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. మనిషి శరీరానికి యాంటీ యాసిడ్స్ ఎంతో అవసరం. గుడ్లు, చేపల్లో ఇవి అధికంగా లభిస్తాయి. జింక్ ఉండే బాదం వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. రోగకారక క్రిములతో పోరాడే పెరుగును తీసుకోవడం ఉత్తమం. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. మార్కెట్లో లభిస్తున్న నల్లద్రాక్ష చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. వీటిలో విటమిన్ ఏ, బీ1, బీ2 ఉంటాయి. పిల్లల్లో కడుపునొప్పికి నివారణిగా పని చేస్తాయి. జాగ్రత్తలు తప్పనిసరి చలికాలంలో శరీరానికి వేడిచేసే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అల్కహాలి క్ పానీయాలను స్వీకరించొద్దు. పొడి దుస్తులను ధరించాలి. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా చూడాలి. సూర్యోదయం తర్వాతే జాగింగ్, వ్యా యామం చేయాలి. ఏదైన ఆరోగ్య సమ స్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – రత్నాకర్, జనరల్ ఫిజీషియన్, నిర్మల్ జిల్లా ఆస్పత్రి -
మీ వయసును బట్టి మీకు విటమిన్ ‘ఇ’ ఎంత కావాలో తెలుసా?
మన శరీరానికి కావల్సిన అనేక రకాల విటమిన్లలో విటమిన్ ఇ కూడా ఒకటి. ఇవి కొవ్వులో కరిగే విటమిన్. అంటే.. మనం తినే ఆహార పదార్థాల్లోని కొవ్వును ఉపయోగించుకుని శరీరం ఈ విటమిన్‌ను శోషించుకుంటుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సహజంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, గోధుమలు, బాదం, అవకాడో, పొద్దుతిరుగుడు గింజలు, సాల్మన్ చేపలు, మామిడి పండ్లు, కివీలు, పాలకూర, క్యాప్సికమ్ వంటి వాటి ద్వారా లభిస్తుంది. విటమిన్ ఇ చిన్న మొత్తాలలో అవసరం అయినప్పటికీ శరీరంలో అనేక శరీర విధులను నిర్వహించడానికి అవసరం. ఇది శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అనేక వ్యాధులను రాకుండా చూస్తుంది. విటమిన్ ఇ వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు. ఇది మూత్రపిండాల పనితీరును ప్రోత్సహిస్తుంది. అథెరోస్క్లెరోసిస్, ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ వంటి జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను నివారించడానికి సహాయపడుతుంది. కాగ్నిటివ్ ఫంక్షన్లను నిర్వహిస్తుంది. నరాల నష్టాన్ని నివారిస్తుంది. మంచి దష్టిని అందిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ►విటమిన్ ఇ పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ►విటమిన్ ఇ లోపం వల్ల మెదడు, నరాలు, వెన్నెముక, కండరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కండరాల నొప్పి, బలహీనత, కార్డియోమయోపతి లేదా గుండె కండరాల వ్యాధి, కండరాల క్షీణత, నవజాత శిశువులు తక్కువ బరువుతో పుట్టడం, కళ్లను పైకి కిందికి కదిలించడంలో ఇబ్బంది, హైపోర్ఫ్లెక్సియా లేదా కండరాల రిఫ్లెక్స్ ప్రతిస్పందన తగ్గడం, రాత్రి పూట దృష్టి లోపం (రేచీకటి), తిమ్మిరి లేదా జలదరింపు భావన వంటి సమస్యలు కూడా విటమిన్ ఇ లోపం వల్ల వస్తాయి. కనుక మన శరీరానికి విటమిన్ ఇ ని తరచూ అందేలా చూసుకుంటే ఆయా సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ►పొద్దుతిరుగుడు గింజలు, సోయాబీన్స్, వేరుశెనగ, పాలకూర, మామిడి పండ్లు, బ్రోకలీ, బాదం పప్పుల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తరచూ తింటే విటమిన్ ఇ లోపం రాకుండా చూసుకోవాలి. విటమిన్ ఇ ఎవరెవరికి ఎంత కావాలంటే ? ►వయస్సు 6 నుండి 12 నెలల వరకు: 4 మి.గ్రా. ►వయస్సు 1 నుండి 3 సంవత్సరాల వరకు : 6 మి.గ్రా. ►వయస్సు 4 నుండి 10 సంవత్సరాల వరకు : 7 మి.గ్రా. ►పెద్దలు, వృద్ధులకు: 10 మి.గ్రా. ►వైద్య పరిస్థితిని బట్టి విటమిన్ ఇ సప్లిమెంట్లను వాడవచ్చు. డాక్టర్‌ను సంప్రదించి వాటిని వాడుకోవాలి. -
Skin Problems: ట్యానింగ్.. అదేపనిగా సూర్యకాంతిలో ఉంటే మాత్రం ఇక అంతే!
మన మనుగడకు ఎండ ఎంతో అవసరం. కానీ అందులోని అల్ట్రా వయొలెట్ కిరణాలతో మాత్రం చర్మానికి హాని జరుగుతుంది, అలా ఇవి ఎప్పుడూ నివారించలేని ముప్పులా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. పైగా రాబోయేది వేసవి. ఈ సీజన్లో ఎండ తీవ్రత ఎక్కువయ్యేకొద్దీ అల్ట్రావయొలెట్ కిరణాల తాకిడి కూడా క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. వాటితో హాని ఎలా, ఎందుకు కలుగుతుందన్న విషయాలు తెలుసుకుందాం. అల్ట్రావయొలెట్ కిరణాలు సూర్యకాంతి నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. వీటిని సంక్షిప్తంగా యూవీ అంటారు. ఇందులో యూవీఏ, యూవీబీ, యూవీసీ అని మూడు రకాలు ఉంటాయి. సూర్యకాంతి తీవ్రంగా ఉన్నప్పుడు భూమి వాతావరణంలో యూవీఏ, యూవీబీ రెండూ ప్రవేశిస్తాయి. అవి మన చర్మానికి తగిలినప్పుడు కేవలం 5 శాతం మాత్రమే వెనకకు వెళ్తాయి. కొన్ని చెదిరిపోతాయి. చాలా భాగం చర్మంలోకి ఇంకి పోతాయి. చర్మంలోని ‘ఎపిడెర్మిస్’ పొరలో ఉండే డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ట్రిప్టోఫాన్, టైరోజిన్, మెలనిన్లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకిపోయేలా చేస్తాయి. తర్వాత అవి చర్మంలోని మరో పొర ‘డెర్మిస్’ను తాకుతాయి. ఈ క్రమంలో అల్ట్రావయెలెట్ కిరణాలు గ్రహించిన ప్రతి డీఎన్ఏలో ఎంతోకొంత మార్పు వస్తుంది. ఆ మార్పు తీవ్రమైనప్పుడు దుష్ప్రభావాలు కనిపిస్తాయి. దుష్ప్రభావాలివే... మామూలుగానైతే ఇంట్లో ఉన్నవారిపై అల్ట్రావయొలెట్ కిరణాల దుష్ప్రభావం ఉండదనుకుంటాం. బయటితో పోలిస్తే ఇన్‌డోర్‌లో తక్కువే అయినా... వాటి దుష్ప్రభావాలు ఎంతోకొంత ఉండనే ఉంటాయి. ఆకాశంలో మబ్బులు ఉన్నప్పుడు ‘యూవీ’ కిరణాల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. ఇళ్లలోని ట్యూబ్లైట్స్, ఎలక్ట్రిక్ బల్బుల నుంచి కూడా దాదాపు 5 శాతం వరకు రేడియేషన్ ఉంటుంది. అన్నట్టు... భూమధ్యరేఖ, ఉష్ణమండల ప్రాంతాల్లో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ అనుకుంటాం కదా. అది వాస్తవం కాదు. నిజానికి మంచుతో ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ. భూమధ్యరేఖ దగ్గర, అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ, వేసవి ముదురుతున్న కొద్దీ, వాతావరణంలో మబ్బులు లేకుండా నీలం రంగు ఆకాశం ఉన్నప్పుడూ వాటి తీవ్రత పెరుగుతుంది. వేర్వేరు ప్రదేశాల్లో అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రత... ∙మంచులో ... 85శాతం వరకూ; ∙ఇసుకలో ... 25శాతం; ∙మిలమిల మెరుస్తున్న నీళ్లలో: 5 శాతం... అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల మనకు... సన్ బర్న్స్ ∙సన్ ట్యానింగ్, చర్మం మందంగా మారడం, గోళ్లకు నష్టం కావడం, వాస్తవ వయసు కంటే పెద్దగా కనిపించడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. చర్మానికి జరిగే అనర్థాలు సన్‌బర్న్స్ గురించి చెప్పాలంటే... తొలుత అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం కణాల్లోని డీఎన్ఏ పై పడుతుంది. మొదట చర్మం వేడెక్కుతుంది. తర్వాత ఎర్రబారుతుంది. ఆరుబయటకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండ పడే చోట... అంటే... ముఖంపై, చేతులపై త్వరగా కనిపిస్తుంది. తెల్లటి చర్మం ఉన్నవారిలో సన్‌బర్న్స్ త్వరగా కనిపిస్తాయి. మన దేశవాసుల్లో సన్‌బర్న్స్ కాస్త తక్కువే. ట్యానింగ్ విషయానికి వస్తే.. సూర్యకాంతి తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగుమారిపోతుంది. అది కొద్ది నిమిషాల నుంచి కొద్ది గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ‘ఇమ్మీడియెట్ ట్యానింగ్’ అంటారు. ఇలా మారిన రంగు తాత్కాలికంగానే ఉంటుంది. కానీ అదేపనిగా సూర్యకాంతిలో ఉండేవారిలో రంగు మారే ప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగుతుంది. అలా మారింది కాస్తా... చాలాకాలం ఉంటుంది. దీన్నే ‘డిలేయ్డ్ ట్యానింగ్’ అంటారు. అటు తర్వాత అలా చాలాకాలం పాటు సూర్యకాంతికి అదేపనిగా ఎక్స్పోజ్ అయినవారిలో చర్మం మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘హైపర్ప్లేషియా’ అంటారు. తెల్లగా ఉన్నవారిలో ఈ ప్రభావం సుస్పష్టంగా కనిపిస్తుంది. చర్మంతో పాటు గోళ్లకు నష్టం జరుగుతుంది. అల్ట్రావయొలెట్ కిరణాలతో గోళ్లకు జరిగే అనర్థాన్ని వైద్యపరిభాషలో దీన్ని ‘ఒనైకోలైసిస్’ అంటారు. అన్నీ నష్టాలేనా? అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల అంతా అనర్థమేననీ, అవి పూర్తిగా ప్రమాదకరమేనని అనుకోడానికీ వీల్లేదు. కొన్ని విషయాలు/రంగాల్లో వాటితోనూ ఉపయోగాలు ఉంటాయి. ఉదాహరణకు... ∙విటమిన్ డి ఉత్పత్తికి : అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కాకపోతే అసలు విటమిన్–డి ఉత్పత్తే జరగదు. ఇది ఎముకల బలానికీ, వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికీ, అనేక జీవక్రియలకూ ఎంతగానో అవసరం. ఎముకల బలానికి అవసరమైన క్యాల్షియమ్ మెటబాలిజమ్, ఎముకల పెరుగుదలకూ, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికీ, ఇన్సులిన్ ఉత్పత్తికీ కొంతమేరకు అల్ట్రా వయొలెట్ కిరణాలు అవసరం. ∙కొన్ని చికిత్సల్లో : సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటివాటి చికిత్సలకు. ∙నవజాత శిశువులో : పుట్టుకామెర్లు (జాండీస్) తగ్గించడం కోసం కూడా ఉపయోగిస్తారు. -డాక్టర్ స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్ -
శరీరంపై మచ్చలు పోవాలంటే ఇలా చేయండి..
శరీరంపై మచ్చలు ఏర్పడటం చాలా సాధారణమైన సమస్యే అయినా... చూడ్డానికి ఇవి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. వీటినే శోభిమచ్చలు అంటుంటారు. కొద్దిమందిలో ఇవి తెల్లమచ్చల్లా, మరికొందరిలో కాస్తంత నల్లమచ్చలా కూడా కనిపిస్తుంటాయి. చాలామందిలో ఇవి ఎందుకు వస్తాయో ఇదమిత్థంగా తెలియకపోయినా... కొందరిలో ఫంగల్ ఇన్ఫెక్షన్గా ఇది కనిపిస్తుంది. వైద్యపరిభాషలో దీన్ని ‘టీనియా వెర్సికలర్’ అంటారు. ఇది పెద్ద వయసు వారిలోను, మధ్య వయస్సు వారిలోను ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్త్రీ, పురుష భేధం లేకుండా వచ్చి ఇబ్బందిపెట్టే ఈ సమస్య ఎందుకొస్తుంది, అధిగమించడం ఎలాగో తెలుసుకుందాం. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం సహజరంగును కోల్పోతుంది. ముదురు ఎరుపువర్ణంలో, లేత గోధుమవర్ణంలో, తెలుపు వర్ణంలో ఈ మచ్చలు వస్తుంటాయి. వీపు, భుజాలు, చేతులు, ఛాతీ, మెడ ప్రాంతాలలో కనిపిస్తాయి. చిన్నపిల్లలలో ఇలాంటి శోభి లక్షణాలు ముఖం మీద కనిపిస్తాయి. కొన్నిసందర్భాల్లో ఈ మచ్చలకు చుట్టూ ఓ అంచులాంటిది ఏర్పడుతుంది. ఈ మచ్చలున్న చోట ఒక్కోసారి విపరీతమైన దురద ఉండవచ్చు. అయితే శోభిమచ్చలు అంటువ్యాధి కాదు. వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు దాని ప్రభావం ఈ మచ్చల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ మచ్చల తీరూ, తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. చదవండి: Health Tips: ప్రతి రోజూ గంజి తాగారో.. కారణాలు స్పష్టమైన కారణాలు తెలియకపోయినా... చర్మం లోపల ఉండే మెలసీజియా ఫర్ఫర్ అనే ఫంగస్ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. ఈ ఫంగస్ చర్మం మీద ఉండే నూనెలను, మృతకణాలను ఆహారంగా తీసుకుంటుంది. దాదాపు మనందరి చర్మంలోనూ ఈ ఫంగస్ ఉన్నప్పటికీ కొంతమందిని మాత్రమే ఇబ్బందులకు గురి చేస్తుంది. చదవండి: Health Tips: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే.. ఎవరిలో ఎక్కువ...! ►పౌష్టికాహార లోపం ఉన్నవారిలో ►వ్యాధినిరోధకతశక్తి బాగా తక్కువగా ఉన్నవారిలో ►స్టెరాయిడ్ మందులు తీసుకునేవారిలో ►గర్భవతులలో ►హార్మోన్ల అసమతౌల్యత ఉన్నవారిలో... ►బాగా ఎక్కువగా చెమటలు పట్టడం, అధికవేడి కారణంగా; (ఇలాంటివారిలో ఈ మచ్చలున్నచోట దురదలూ రావచ్చు). ►జిడ్డు చర్మం ఉన్న వారిలో ►తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ►కొందరిలో ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ►తామరగా/ఇతర సమస్యలుగా పొరబడటం సాధారణం... కొందరు శోభిని చూసి తామర (రింగ్వార్మ్) గా భ్రమపడుతుంటారు. తామర వ్యాధి సోకిన భాగంలో మచ్చకు చుట్టూ అంచులు స్పష్టంగా కనపడతాయి. అలాగే దురద కూడా ఉంటుంది. వీటినే కొందరు విటిలిగో, పిటీరియాసిస్ ఆల్బా, సోరియాసిస్‌గా కూడా భ్రమపడుతుంటారు. అందువల్ల డెర్మటాలజిస్టులు కెఓహెచ్ పరీక్ష ద్వారా ఇది ఏ రకమైన చర్మవ్యాధి అనే విషయాన్ని నిర్ధారణ చేసి, తగిన చికిత్స సూచిస్తారు. నివారణ / జాగ్రత్తలు ►ఇది తేలిగ్గా నివారతమయ్యే సమస్య. ►చర్మాన్ని నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలి. ►మచ్చలు తొందరగా తగ్గిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, వ్యాయామం చేయడం వంటి చిన్నచిన్న చిట్కాలు పాటించడం వల్ల ఈ మచ్చలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ►చర్మం బాగా జిడ్డుగా ఉన్నప్పుడు... ఎప్పటికప్పుడు చర్మాన్ని శుభ్రం చేసుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అయితే మరీ పొడిగానూ ఉంచకూడదు. ►రీరం మీద నూనెగానీ, లేదా నూనెకు సంబంధించిన జిడ్డు పదార్థాలను కాని పూయకూడదు. ►బాగా బిగుతుగానూ, గాలిచొరకుండా ఉండే దుస్తులు ధరించకూడదు. ►ఇది మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి ఎక్కువ చెమట పట్టకుండా చూసుకుంటూ,S కెటొకోనటోల్ ఉండే పౌడర్‌ను కొన్ని నెలలు వాడటం మంచిది. చికిత్స ఈ సమస్య ఉన్నవారిందరకీ ఒకేలాంటి చికిత్స ఉండదు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్మవ్యాధి నిపుణులు చికిత్స సూచిస్తారు. వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, వ్యాధి సోకిన వ్యక్తి తాలూకు మెడికల్ హిస్టరీ... వంటి వాటిని ఆధారం చేసుకుని చికిత్స ఉంటుంది. ఫంగస్ చర్మపు పైపొర మీద ఉంటుంది కనుక, చర్మానికి పై పూతగా వాడే మందులు బాగా పనిచేస్తాయి. లూలిఫిన్ వంటి యాంటీ ఫంగల్ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని సుమారు పదిరోజుల పాటు రోజుకి ఒకసారి మచ్చలున్న చోట అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే క్లోట్రిమాజోల్, కెటొకెనజోల్ వంటి క్రీమ్స్‌ను రెండు వారాలపాటు రోజుకి రెండుసార్లు చొప్పున వాడవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటే, నోటితో తీసుకునే మందులను డెర్మటాలజిస్టు సలహా, సూచనల మేరకు తీసుకోవలసి ఉంటుంది. -
జుట్టు రాలే సమస్యకు చక్కటి ఔషధం
నల్లని, ఒత్తైన కురులంటే ఎవరికిష్టం ఉండదు. అలాగే మొహం మీద ఎలాంటి మొటిమలు లేకుండా నిగనిగలాడే సౌందర్యం ప్రతి ఒక్కరూ కావాలనుకుంటారు. ఒత్తుగా, పొడుగైన జుట్టు ఉన్న అమ్మాయి కనిపిస్తే.. అబ్బా! నాకు అలాంటి జుట్టు ఉంటే బాగుండేదని అసూయ పడేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే ఈమధ్య కాలంలో పాటించే ఆహారపు అలవాట్లు, హెయిర్ ఆయిల్, షాంపూ, హెయిర్ కలర్ కారణంగా జుట్టు రాలే సమస్య సర్వ సాధారణంగా మారింది. మరీ ముఖ్యంగా టీనేజ్ యువతుల బాధలు వర్ణనాతీతం. జుట్టు ఊడే సమస్య ఇప్పుడు అబ్బాయిలకు కూడా సోకింది. జుట్టు పెరగడం కంటే ఉన్న జుట్టును కాపాడుకోవడమే పెద్ద తలనొప్పిగా మారింది. అమ్మాయిలు ఎక్కువ కేర్ తీసుకునే విషయాలలో చర్మం, జుట్టు ప్రధానమైనది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొన్ని నియమాలు పాటిస్తే తేలిగ్గా జుట్టును, చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇంట్లో మనకు దొరికే వస్తువులతోనే వీటిని సంరక్షించుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. జుట్టు సంరక్షణకు ముఖ్యమైనది బ్లాక్ టీ. దీంతో జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను అందిస్తోంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, వల్ల శరీరం నుంచి వ్యర్థ పదార్ధాలను తొలగిస్తుంది. అంతేగాక శరీరంలోని అంటు వ్యాధులతో పోరాడటానికి, వాటిని నయం చేయడానికి దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి సహకరిస్తుంది. జుట్టు రాలడమనే సమస్యతో బాధపడేవారికి, బ్లాక్ టీ ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది. బ్లాక్ టీ జుట్టు రాలడాన్ని నెమ్మదిగా తగ్గింది చివరికి దాన్ని ఆపగలదు. ఇందులో ఉన్న కెఫిన్.. జుట్టు రాలడానికి కారణమవుతున్న డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అలాగే బ్లాక్ టీ జుట్టుకు ఆరోగ్యకరమైన పెరుగుదలను అందిస్తుంది. కాఫీ లాగానే, బ్లాక్ టీతో జుట్టును కడగడం వల్ల కురులు మెరుస్తూ కనిపిస్తాయి. జుట్టుకు షాంపూ చేసిన తరువాత బ్లాక్ టీ నీళ్లతో వారానికి రెండుసార్లు కడగటం వల్ల మెరుగైన ఫలితాలను అందిస్తుంది. బ్లాక్ టీ వల్ల చర్మానికి ఉన్న ఉపయోగాలు. చర్మానికి గాయం అయినప్పుడు లేదా ఏదైనా గీరుకుపోతే బ్లాక్ టీ బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా కణజాలాలను పునరుత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. బ్లాక్ టీ ఈ ప్రక్రియను వేగవంతం చేయగలదని పరిశోధనలో తేలింది. కళ్ల కింద ఉబ్బినట్లు ఉండటం, నల్లటి వలయాలు వంటి సమస్యలతో బాధపడుతుంటే బ్లాక్ టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. కొంచెం దూదిని తీసుకుని బ్లాక్ టీలో కాసేపు నానబెట్టి 15 నిమిషాలపాటు కళ్ల కింద ఉంచడం వల్ల నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. బ్లాక్ టీ వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు 1. జుట్టు రాలడమనే సమస్యతో బాధపడేవారికి, బ్లాక్ టీ ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది. బ్లాక్ టీ జుట్టు రాలడాన్ని నెమ్మదిగా తగ్గింది చివరికి దాన్ని ఆపగలదు. ఇందులో ఉన్న కెఫిన్.. జుట్టు రాలడానికి కారణమవుతున్న డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. 2. బ్లాక్ టీ జుట్టుకు ఆరోగ్యకరమైన పెరుగుదలను అందిస్తుంది. కాఫీ లాగానే, బ్లాక్ టీతో జుట్టును కడగడం వల్ల కురులు మెరుస్తూ కనిపిస్తాయి. జుట్టుకు షాంపూ చేసిన తరువాత బ్లాక్ టీ నీళ్లతో వారానికి రెండు సార్లు కడగటం వల్ల మెరుగైన ఫలితాలను అందిస్తుంది. మరి బ్లాక్ టీ వల్ల చర్మానికి, జుట్టుకు ఇన్ని మంచి ఉపయోగాలు ఉన్నప్పుడూ ఆలస్యం చేయకుండా పాటించండి.. అందమైన చర్మాన్ని, ఒత్తైన, పొడవైన నల్లని కురులను మీ సొంతం చేసుకుండి.. -
నలుగు వెలుగులు
స్నానం చేసే ముందు నలుగు పెట్టుకోవడం వల్ల చర్మం పొడిబారే సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చర్మసమస్యలూ దూరం అవుతాయి. నలుగు పిండి తయారుచేసే విధానం: పసుపు, ఆవపిండి, ఉలవ పిండి, మంచి గంధం, మారేడు పత్రాల పొడులను ఉపయోగించవచ్చు. వీటితో పాటు బియ్యపు పిండి, శనగపిండి గరుకుగా పొడి చేసి కలపాలి. ఈ పొడిలో నువ్వులనూనె కలపాలి. నలుగు పిండిమరీ తడిగా ఉండకూడదు. ఒంటికి పట్టించి, వ్యతిరేక దిశలో మర్ధనా చేయాలి. దీనివల్ల ఒంటికి అంటుకున్న మురికి, అవాంఛిత రోమాలు, మృతకణాలు తొలగిపోతాయి. చివర్లో కొంచెం నువ్వుల నూనె అద్దుకొని మేనికి రాసుకోవాలి. లేదంటే ఆవుపాల మీద మీగడ వాడుకోవచ్చు. వారానికి ఒకసారైనా ఒంటికి నలుగు పెట్టుకుంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. -
బ్యూటిప్స్
►వాతావరణంలో దుమ్మూ, ధూళి ఎక్కువై చర్మ సమస్యలు అధికంగా పెరిగిపోయాయి. ఎక్కువగా, చర్మంపై జిడ్డు పేరుకుపోవడం వలన మొటిమలు వస్తుంటాయి. ►మొటిమలు తగ్గించుకోవటానికి ఒక అరటి పండుని గుజ్జుగా చేసి ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసాన్ని కలపాలి. ►ఈ పేస్ట్‌ని ముఖం, మెడ భాగాల మీద రాసుకుని 20 నిముషాల పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►అరటిపండులో ఉండే విటమిన్ బి2,విటమిన్ బి6, విటమిన్ బి12 మీ చర్మం పొడి బారకుండా చేసి మృదువుగా ఉంచుతుంది. ►పుచ్చకాయ రసం మీ చర్మం పై ఉన్న జిడ్డుని తగ్గించి ఎక్కువ సేపు మీ ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. -
హెల్త్‌టిప్స్
► తులసి ఆకులను గ్రైండ్ చేసి ఒక టీ స్పూన్ మిశ్రమంలో అర టీ స్పూన్ తేనె కలిపి రోజుకొకసారి తీసుకోవాలి. ప్రతిరోజూ ఇలా తీసుకుంటుంటే చర్మం నిగారిస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ దరి చేరవు. ► తులసి రసాన్ని తలకు పట్టించి తలకు టవల్ చుట్టేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేస్తే పేలు పోతాయి. ఇలా వారానికి ఒకసారి వరుసగా ఐదారు వారాలపాటు చేస్తే సమస్య పూర్తిగా పోతుంది. ► తులసి రసం అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది. ఆకులను గ్రైండ్ చేసి తెల్లటి, నల్లటి మచ్చలున్న చోట రాసి ఆరిన తర్వాత కడగాలి. ఇలా రోజుకు నాలుగు సార్లు చేస్తుంటే రెండు వారాల్లో మచ్చలన్నీ చర్మంలో కలిసి పోతాయి. ► అర కప్పు టీ ఆకులు లేదా పొడిని అరలీటరు నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత వడపోసి గాలి దూరని సీసాలో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. కాలినగాయాలకు, అలసిన కళ్లకు ఇది చక్కటి చికిత్స. దీనిని దూదితో కాని అలాగే కాని చర్మం మీద రాస్తే సరిపోతుంది. ఎండ నుంచి వచ్చిన వెంటనే ఒకసారి చన్నీటితో ముఖాన్ని కడిగి ఈ ద్రవాన్ని రాస్తే సాంత్వన చేకూరుతుంది. -
వెచ్చటి చలి
పిల్లలు చలిని తట్టుకోలేరు. పసి పిల్లలు మరీనూ. వాళ్లకు ఏమేమి కష్టాలు వస్తాయో వాటికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో సాక్షి వివరిస్తోంది. దాంతో పాటు ఒక చిన్న రిక్వెస్ట్. మీ పిల్లలకు చలికాలం మీ వెచ్చటి ప్రేమ అందించండి. వెచ్చవెచ్చగా చలికాలాన్ని దాటేయండి. చలికాలం వచ్చిందంటే చాలు... పిల్లల మాట ఎలా ఉన్నా వాళ్ల తల్లిదండ్రులకు ఆందోళన ఎక్కువ. అందునా సహజంగానే పిల్లల చర్మం అంటే ఎంతో సున్నితం. మొదట పొడిబారుతుంది. ఆ తర్వాత పగుళ్లు. ఒక్కోసారి మడమలు చిట్లిపోయి కాళ్లు కింద పెట్టలేరు. ఇలా చర్మం పగలడాన్ని వైద్య పరిభాషలో అటోపిక్ డర్మటైటిస్ అని అంటారు. ఈ సీజన్లో నెల బాలలు మొదలుకొని దాదాపు కౌమారం వచ్చే వరకు అంటే... 14 ఏళ్ల లోపు పిల్లల్లో వచ్చే చర్మ సమస్యలు, వాటిని అధిగమించే మార్గాలు తెలుసుకుందాం. అటోపిక్ డర్మటైటిస్ అంటే... పిల్లల్లో తరచూ కనిపించే ఒక సాధారణ సమస్య. కొందరిలో అప్పటికప్పుడు కనిపించే ఈ సమస్య... మరికొందరిలో ఒక దీర్ఘవ్యాధిగా కూడా పరిణమిస్తుంటుంది. తొలుత చర్మం పొడిబారి, ఎర్రగా మారి దురదతో బాధిస్తుంటుంది. దాంతో పిల్లలు ఆ ప్రాంతంలో పదే పదే గీరుతుండటంతో చర్మం మందంగా మారుతుంది. ఇలా మందంగా మారడాన్ని ‘లెకైనిఫికేషన్’ అంటారు. ఇది జరిగాక దురద మరింతగా పెరుగుతుంది. మరింతగా గీరడం, దేనికైనా రాస్తుండటంతో చర్మం ఇంకా మందం అవుతుంది. ఇది ఒకదాని తర్వాత మరొకటిగా ఒక సైకిల్లా (ఇచ్ అండ్ స్క్రాచ్ సైకిల్) నడుస్తుంటుంది. లక్షణాలు: ►చర్మం పొడిబారి దురదలు వచ్చాక గుల్లలు, నీటి గుల్లలు కూడా ఏర్పడతాయి. ►ఎర్రబారిన ప్రాంతంలో చర్మం పొట్టుకట్టినట్లుగా అవుతుంది. ఆ తర్వాత చర్మం మందంగా (లెకైనిఫికేషన్) మారుతుంది. ►ఆ స్కిన్పైన ఏదో ఒక చోట పొట్టులేచినట్లుగా అయి, అక్కడ గాటు కూడా పడవచ్చు. ►తెట్టుకట్టినట్లుగా ఉన్న చర్మం పైపొర లేచిపోయినప్పుడు ఆ ప్రాంతంలో కాస్త ద్రవం ఊరుతున్నట్లుగా (ఊజింగ్) కనిపిస్తుంటుంది. ఈ దశలోనూ చికిత్స అందించకపోతే పిల్లల్లో లింఫ్‌నోడ్స్ వాచడం వంటి లక్షణాలు సైతం కనిపించవచ్చు. ఎందుకిలా జరుగుతుంది? మన చర్మంలోని సాగే గుణాన్ని నిలిపి ఉంచడంలో చర్మం పొరల్లోని తేమ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే బయటి వాతావరణంలో ఉన్న పొడిదనం కారణంగా ఈ సీజన్లో చర్మంలోని చెమ్మ క్రమంగా ఇగిరిపోతుంది. దాంతో చర్మం పొడిబారి ఎర్రబారుతుంది. (ఒక్కోసారి ఇది ‘ఇక్థియోసిస్ వల్గారిస్’, ‘కెరటోసిస్ పైలారిస్’ వంటి ఇతర చర్మ వ్యాధులతో కలిసి కూడా రావచ్చు.) ఆ తర్వాత మనం అలాగే నిర్లక్ష్యం చేస్తే ఇది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. మొదటి చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్) అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకు మొదటి దశలో చాలా తేలిగ్గా చికిత్స చేయవచ్చు. ఆ చికిత్స అందించే క్రమంలో వారి చర్మంపై పొడిదనాన్ని తగ్గించడానికి వైట్ పెట్రోలియమ్ జెల్లీ, లిక్విడ్ పారఫీన్ ఆయిల్ రావడం వంటివి చేస్తే చాలు... పగుళ్లు, దురద, పొడిదనం తగ్గుతాయి. దాంతో గీరుకోవడం, రుద్దుకోవడం తగ్గి రాత్రి బాగా నిద్రపడుతుంది. అలర్జీని ప్రేరేపించే అంశాలను నివారించడం ఈ పిల్లలకు వాడే సబ్బులు, డిటర్జెంట్లు... అలర్జీని ప్రేరేపిస్తున్నాయా అన్న అంశాలను గమనించి అలాంటి సందర్భాల్లో వాటికి ప్రత్యామ్నాయంగా వేరే సబ్బులను, డిటర్జెంట్లను మార్చాల్సి ఉంటుంది. ఘాటైన సబ్బులకు బదులు చాలా మైల్డ్‌గా ఉండే క్లెన్సెర్స్లో తడిగుడ్డను ముంచి ఒంటిని శుభ్రం చేయడం మంచిది. డర్మటైటిస్ ఉన్న పిల్లల్ని పెంపుడు జంతువుల నుంచి దూరంగా ఉంచాలి. అలర్జీ కలిగించే ఆహారాన్ని గుర్తించి, మార్పు చేయాలి. పూత మందులతో చికిత్స ఇలాంటి పిల్లలకు ఒళ్లు పొడిబారినప్పుడు లిక్విడ్ పారఫీన్, గ్లిజరిన్, మినరల్ ఆయిల్, స్క్వాలీన్ వంటివి (ఈ పూత మందులను ‘ఎమోలియెంట్స్’అంటారు) పూయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పిల్లలకు స్నానం చేయించిన వెంటనే ఎమోలియెంట్స్ పూయడం చాలా ముఖ్యమని గుర్తించండి. తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల్లో ఎమోలియెంట్స్ పూశాక వాటిపైన పూతమందుగా లభ్యమయ్యే స్టెరాయిడ్స్ (టాపికల్ స్టెరాయిడ్స్) కూడా పూయవచ్చు. ఎక్కువ రోజులు స్టెరాయిడ్స్ అవసరం పడకుండా ఉండటానికి టాపికల్ క్యాల్సిన్యూరిన్ ఇన్హిబిటర్ క్రీమ్ ఉపయోగించవచ్చు. చర్మం మందంగా మారిన పిల్లల్లో ‘ఇక్థైమాల్’ అనే పూతమందును ఉపయోగించడం వల్ల చర్మం మామూలుగా మారుతుంది. రెండోదశ చికిత్స తేలిగ్గా చేయదగిన మొదటి దశ చికిత్సతో ఫలితం లేనప్పుడు స్టెరాయిడ్ మోతాదును పెంచడం... అప్పటికీ గుణం కనిపించకపోతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాల్సి రావడం జరగవచ్చు. వెట్... ర్యాప్ టెక్నిక్ : అటోపిక్ డర్మటైటిస్ తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లల ‘వెట్ ర్యాప్ టెక్నిక్’ చికిత్స మంచి ఫలితాలను ఇస్తుంది. చర్మమంతా పగుళ్లు ఉన్న పిల్లలకు మొదట చర్మంపైన ఎమోలియెంట్స్ బాగా పూయాలి. ఆ తర్వాత ఒంటిపైన ఒక పొరలా బ్యాండేజ్ కట్టి, దాన్ని గోరువెచ్చని నీటితో తడపాలి. దానిపైన మరో పొర పొడి బ్యాండేజ్ వేయాలి. ఇలా వేసిన బ్యాండేజీని ప్రతి పన్నెండు గంటలకు ఒకమారు మార్చాలి. ► మూడో దశ చికిత్స (థర్డ్ లైన్ ట్రీట్మెంట్) ► తక్కువ మోతాదులో సైక్లోస్పోరిన్ థెరపీ. ► నోటిద్వారా కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం. ► అజాథ్రయోప్రిన్ వంటి నోటి ద్వారా తీసుకునే మందులను తీసుకోవాలి. థర్డ్ లైన్ ట్రీట్మెంట్ అంతా డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ► సాధారణంగా చికిత్స తర్వాత చాలా మంది పిల్లల్లో పరిస్థితి మెరుగవుతుంది. అయితే అలా మెరుగైన అదే పరిస్థితిని నిలకడగా ఉంచడం కోసం కొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. అవి... ఎమోలియెంట్స్‌ను కొనసాగించడం సమస్య తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న పిల్లల్లో తక్కువ శక్తితో ఉండే కార్టికో స్టెరాయిడ్ పూతమందులను నయమైన చోట రాయాలి. దీన్ని వీకెండర్ అప్రోచ్‌గా పేర్కొంటారు. దీనివల్ల అటోపిక్ డర్మటైటిస్ మాటిమాటికీ తిరగబెట్టడం తగ్గుతుంది. అప్పటికీ సమస్య తిరగబెడితే కార్టికోస్టెరాయిడ్ పూతమందులను కొద్ది రోజులు రోజూ రాసి ఆ తర్వాత వారానికి ఒక రోజు వారంలో ఒకరోజు వాడాలి. (వీకెండర్ అప్రోచ్ అవలంబించాలి). డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ చికిత్సా పద్ధతులను అవలంబించాలి. రోజుల పిల్లల నుంచి 12 నెలల వరకు... ప్రభావితమయ్యే భాగాలు: సాధారణంగా చర్మం ఎర్రబారడం ముఖంపై కనిపిస్తుంటుంది, గాని ఇది చర్మంపై శరీరంలోని ఏ భాగంలోనైనా కనిపించవచ్చు. పాకే పిల్లల్లో ఏమవుతుంది... పాకే ఈడు పిల్లల్లో సాధారణంగా వాళ్ల మోకాళ్లు నేలతో ఒరుసుకుపోతుంటాయి. దాంతో మోకాళ్ల భాగంలో ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది. ఇతర లక్షణాలిలా... చర్మంపై పగుళ్లు చాలా దురదగానూ నొప్పిగానూ ఉంటాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ఉద్వేగాలకు, తీవ్ర ఆందోళనకు లోనుకావడం. పేరెంట్స్ అటోపిక్ డర్మటైటిస్‌తో బాధపడుతూ ఉండేవారైతే వారి పిల్లల్లో డర్మటైటిస్ వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఏడాది నుంచి రెండేళ్ల పిల్లల్లో... వయసు పిల్లల్లో సాధారణంగా అటోపిక్ డర్మటైటిస్‌తో చర్మం ప్రభావితం కావడం - చర్మంలోని ముడుతలు పడే ప్రాంతాల్లో ఎక్కువ. అంటే... మోచేతులు, మోకాళ్ల వెనక భాగం, మెడ పక్కభాగాలు, ముంజేయి, పిడికిలి, మడమ వంటి ప్రాంతాల్లో అన్నమాట. ఈ పిల్లల్లో చర్మం ముడుత వద్ద ఒక గీతలా (స్కిన్లైన్) ఉన్నచోట్ల దురదపుట్టి అది పగుళ్లు బారుతున్నట్లవుతుంది. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో... ఈ వయసు పిల్లల్లో చర్మం చాలా పొడిగా ఉంటుంది. ఈ పొడిబారడం అన్నది మోకాళ్ల కింది చర్మంలో చాలా ఎక్కువ. అందుకే ఈ వయసు పిల్లల కాళ్లు... బయట ఆడి వచ్చినట్లుగా తెల్లగా పొడిబారిపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఈ వయసువారిలో ముఖం పెద్దగా పగలదు. కానీ... పెదవుల మూలలు చీరుకుపోయినట్లుగా ఉంటాయి. ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో... ఏడు కంటే తక్కువ వయసు ఉండే పిల్లలతో పోలిస్తే ఈ వయసు (7 నుంచి 14 ఏళ్ల) పిల్లలు కాస్తంత ఎక్కువ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటారు. అందుకే ఈ వయసుకు వచ్చేసరికి అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకు లక్షణాల్లో తీవ్రత ఒకింత తగ్గుతుంది. ఈ వయసు పిల్లల్లోనూ చర్మం పొడిబారుతుంది. ఆస్తమా అటాక్ వచ్చి శ్వాసతీసుకోవడం కష్టం కావచ్చు. రాత్రివేళ శ్వాససరిగా అందక సరైన నిద్ర ఉండదు. ముక్కు కారుతుంటుంది. ఈ సమస్యలతో పాటు కొందరిలో సైనుసైటిస్ కూడా ఉండవచ్చు. కొందరు పిల్లల్లో తరచూ చర్మంపై హెర్పిస్ సింప్లెక్స్ వంటి వైరల్; స్టెఫాలోకోకల్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. -
బ్యూటిప్స్
నీళ్లు తాగితేనే నిగారింపు... వర్షాకాలంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. రకరకాల చర్మసమస్యలు వస్తుంటాయి. ఉదరకోశ సమస్యలు, టైఫాయిడ్ వంటి రోగాలు, జలుబు, దగ్గు, ఆస్తమా వంటివి చర్మంపై ప్రభావం చూపుతాయి. మొటిమలు పెరుగుతాయి. ఈ కాలం ఆరోగ్యాన్నీ, తద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కష్టమే అయినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ పరిస్థితిని అదుపులో ఉంచవచ్చు. పొడి చర్మం వర్షాకాలంలో చల్లదనానికి పదే పదే మూత్రవిసర్జన సమస్యలుంటాయని చాలామంది నీళ్లను తాగడం తగ్గించేస్తారు.. కానీ, రోజులో కనీసం 10-12 గ్లాసుల నీళ్లు తాగితేనే శరీరంలో చేరిన విషపదార్థాలు విడుదలైపోతాయి, చర్మం నిగారిస్తుంది. ఆల్కహాల్ బేస్డ్ లోషన్లు, టోనర్స్ వాడకం తగ్గించడం మేలు. ఆల్కహాల్ వల్ల ఆ లోషన్లు సువాసనగా ఉంటాయి. కానీ, చర్మాన్ని త్వరగా పొడిబారేలా చేస్తాయి. జిడ్డు చర్మం: జిడ్డు పోవడానికి రోజుకు 3-4 సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే కాళ్లు, చేతులు కూడా! ముృతకణాలను తొలగించడానికి నేచురల్ ఫేసియల్ స్ట్క్రబ్స్ను వాడచ్చు. శనగపిండి, పాలు, తేనె వంటివి స్నానం చేయడానికి ఉపయోగించడం వల్ల చర్మం మెరుపు పెరుగుతుంది. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి పదే పదే సబ్బుల వాడకం కన్నా చల్లని నీళ్లకు బదులు గోరువెచ్చని నీళ్లను ఉపయోగిచడం వల్ల చర్మం నునుపు తగ్గదు. -
చర్మానికి చేటు కాలం
వింటర్ చలికాలం ప్రభావం నేరుగా చర్మంపైనే పడుతుంది. ఈ సీజన్లో బయటి తేమ తగ్గడంతో దాన్ని చర్మం నుంచి లాగేస్తుంటుంది వాతావరణం. ఫలితంగా చర్మం పొడిబారిపోతుంది. దాంతో అందరూ చర్మ సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఈ సీజన్లో మేనికి మేలు చేసే మార్గాలివే... టీనేజీ పిల్లల్లో తమ సౌందర్యం గురించి స్పృహ ఎక్కువ. ఈ సీజన్లో ఎండ తీవ్రత గురించి అంతగా ఆలోచించరు కాబట్టి పిల్లలు... అందునా ప్రధానంగా యుక్తవయస్కులోని వారు ఎండలో తిరగడమూ ఎక్కువే. చలిని సైతం లెక్క చేయకుండా రాత్రి పొద్దుపోయాకా ఆరుబయటకు వెళ్లడమూ మామూలే. వీళ్లు చేయాల్సినవి... * పొద్దుపోయాక రాత్రి చలిలో తిరిగేవారు వ్యాజిలేన్ రాసుకోవాలి. ఇక పగటి ఎండలోకి వెళ్లేవారు ట్యానింగ్‌ను, ఎండ అలర్జీలను (సన్ అలర్జీస్) నివారించడానికి సన్‌స్క్రీన్ లోషన్ వాడటం మంచిది. అయితే జిడ్డు చర్మం ఉన్న టీనేజ్ పిల్లలు నూనె లేని (ఆయిల్ ఫ్రీ) సన్‌స్క్రీన్స్ రాసుకోవాలి. అలాగే పొడి చర్మం ఉన్నవారు మాయిష్చరైజర్ ఎక్కువగా ఉండే ఆయిల్ బేస్ సన్‌స్క్రీన్స్ రాసుకోవాలి. * ఈ సీజన్లో ఎస్పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) 40-50 ఉన్న క్రీములు వాడటం మంచిది. ఈ క్రీమ్స్ వాడండి * ఈ సీజన్లో సాధారణంగా కోల్డ్ క్రీమ్స్ వాడటం పెరుగుతుంది. అయితే ఎలాంటి క్రీములు ఎంపిక చేసుకోవాలనే అంశం చాలామందిని అయోమయానికి గురిచేస్తుంది. కూల్ సీజన్లో కోల్డ్ క్రిమ్స్ ఎలా ఉండాలంటే... * ఈ సీజన్లో వాడాల్సిన కోల్డ్ క్రీమ్స్ సువాసనరహితంగా ఉండటం మంచిది. ఎంత వాసన తక్కువైతే చర్మంపై వాటి దుష్ర్పభావం అంతగా తగ్గుతుంది. * అవి అలర్జీ కలిగించనివి (హైపో అలర్జిక్ క్రీమ్‌లు) వాడాలి. అలర్జీ కలిగించే వాటితో మళ్లీ కొత్త సమస్య రావచ్చు. * సాధారణం క్రీమ్లలో మూల పదార్థం (బేస్)గా నీటిని వాడతారు. అదే ఆయింట్మెంట్ తయారీలో ప్రధాన పదార్థం (బేస్)గా నూనెను వాడతారు. అందుకే పొడిచర్మాలకి ఆయింట్మెంట్ ఫార్మేషన్ మంచిది. సాధారణ, జిడ్డు చర్మాలకి క్రీమ్ ఫార్మేషన్ మంచిది. ఇలా చేస్తే సరి! * స్నానానికి అరగంట ముందు ఒంటికి ఆలివ్ లేదా కొబ్బరి నూనె పట్టించాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బు వాడాలి. * స్నానం చేసి, కాస్త తడిగా ఉన్నప్పుడే డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ను రాయాలి. రోజుకు 3, 4 సార్లు ఈ క్రీమ్ రాయాలి. * చలికాలంలో వేడినీళ్లు మంచివని కొందరు అంటుంటారు. అయితే ఈ సీజన్లో వాతావరణం తేమను లాగేస్తుందన్న విషయం తెలిసిందే. వేడినీళ్లు కూడా ఇందుకు దోహదపడి ఇంకా పొడిబారుస్తాయి. కానీ చన్నీళ్లు ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే స్నానానికి వేడి వేడి నీళ్లకు బదులు గోరువెచ్చని నీటినే వాడాలి. * ఈ సీజన్లో చర్మానికి క్లెన్సర్లు వాడకూడదు. అవి మరింత పొడిబారేలా చేస్తాయి. పాదాలకూ, చేతులకూ కాటన్ గ్లౌజ్ వేసుకోవడం మంచిది. అది పగుళ్లను నివారిస్తుంది. * తలస్నానం చేయడానికి రెండు గంటల ముందర మాడుకు నూనె మసాజ్ చేసుకోవాలి. నూనె కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడిజుట్టు ఉన్నవారైతే షాంపూ తర్వాత తప్పనిసరిగా కండిషనర్ వాడాలి. * తడి జుట్టును ఆరబెట్టుకోడానిక డ్రైయర్ వాడకూడదు. ఎందుకంటే అది చర్మాన్ని మరింత పొడిబారుస్తుంది. క్రీమ్స్‌లో ఉండేవి సాఫ్ట్ పారఫిన్, పెట్రోలియమ్ జెల్లీ, అలోవీరా, గ్లిజరిన్, షీయా బటర్, స్టెరైల్ ఆల్కహాల్, ఐసోప్రొపైల్ పాల్మిటేట్, అవకాడో ఆయిల్, ప్రిమ్రోజ్ ఆయిల్, సార్బిటాల్, అల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్... ఇవి కోల్డ్ క్రీముల్లోని కంటెంట్స్. ఇవన్నీ పొడి చర్మాన్ని తేమగా ఉంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వాడటం మంచిదే. -
టీ బ్యాగ్స్... చర్మానికి మేలైన పోషణ...
చర్మసౌందర్యానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి అనుకుంటారు చాలా మంది. కానీ, సమయం లేదనో, తప్పనిసరి అనో హడావిడిగా పనులు ముగించేస్తుంటారు. ఆ తర్వాత తొందరపడ్డామే అనుకుని బాధపడుతుంటారు. చిన్నవే అయినా సౌందర్యపోషణలో తరచూ చేసే కొన్ని తప్పులను ఇలా సవరించుకోవచ్చు.. {Xన్ టీ తాగుదామని తెచ్చుకొని, నచ్చక ఆ బ్యాగ్స్‌ని పడేస్తుంటారా? టీ బ్యాగ్స్‌ని పడేయకుండా ఈ సారి వాటిలో కొన్నింటిని టబ్ నీళ్లలో వేసి, అందులో కాసేపు మీ పాదాలను ఉంచండి. పాదాలు రిలాక్స్ అవుతాయి. మురికి వదిలి, పై చర్మం నునుపుగా మారుతుంది.హెయిర్కలర్ని ఉపయోగిస్తున్నారా? అయితే ముందుగా ప్యాచ్‌టెస్ట్ చేసుకోండి. మీరు ఏ రంగైతే జుట్టుకు వేసుకోవాలనుకుంటున్నారో దానిని కొద్దిగా చెవి వెనుకభాగంలో రాసి చూడండి. 24 గంటల పాటు అలాగే వదిలేయండి. చర్మంపై దురద, దద్దుర్లు లేవంటే మరుసటి రోజు ఆ కలర్ ని నిరభ్యంతరంగా వాడవచ్చు. కలర్ వేసుకున్నాక చర్మసమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఇదో చిన్న టెక్నిక్. రోజులో ఎక్కువ గంటలు లిప్‌స్టిక్‌తో ఉండక తప్పనిసరా? అయితే, లిప్‌స్టిక్ తొలగించిన ప్రతీసారి స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌ని దూది ఉండతో తీసుకొని, పెదాలకు సున్నితంగా రాయండి. దీని వల్ల లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు పెదాల చర్మాన్ని దెబ్బతీయకుండా కాపాడుకోవచ్చు. మీ చర్మం మొటిమల వల్ల జిడ్డుగా, మరింత నల్లగా కనపడుతుందా? ఈ సమస్యకు విరుగుడుగా ఫేస్‌వాష్ నుంచి మేకప్ వరకు అన్నీ ఆయిల్ ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగించండి. అలాగే, ప్రతి రోజూ ఉదయాన్నే మగ్ గోరువెచ్చని నీటిలో మూడు - నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ముఖాన్ని శుభ్రపరచండి. చర్మం తరచూ పొడిబారుతోందా? ఆవనూనెను శరీరమర్దనలో ఉపయోగిస్తారు. చర్మం పగుళ్లు, పిగ్మెంటేషన్ వంటివి నివారిస్తుంది. వారానికి ఒకసారి ఆవనూనెతో ముఖాన్ని, దేహాన్ని మర్దన చేసుకుంటే ఒత్తిడి నుంచి రిలీఫ్ కలుగుతుంది. -
యవ్వనంలోనే వార్ధక్యం
డాక్టర్స్ కాలమ్ చెట్టునుంచి పండు వేరు పడగానే కొంతసేపు బాగానే ఉంటుంది. సమయం గడిచే కొద్దీ పండులో ముడతలు వస్తూంటాయి. దీనికి కారణం తేమ శాతం తగ్గిపోతూంటుంది. మనిషిలో కూడా అంతే. శరీరానికి గాలి ఎంత ముఖ్యమో నీరూ అంతే ముఖ్యం. తేమ తగ్గిపోతూంటే చర్మంపై ముడతల పడతాయి. యుక్త వయస్సులోనే వార్ధక్యం వస్తుంది. ఇలాంటి సమస్యలకు నగరం వేదికవుతోంది. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం మనిషిని ముప్ఫై ఏళ్లకే ముసలితనంలోకి నెట్టేస్తున్నాయి. దీనికి తోడు పనికొచ్చే తిండి తినకపోవడంతో నిండు యవ్వనులు కూడా కాలుష్యానికి అలసిపోయి ముసలితనాన్ని స్వీకరిస్తున్నారు. రకరకాల చర్మవ్యాధులకూ గురవుతున్నారు. మారిన జీవన పరిస్థితులే దీనికి కారణమంటున్నారు ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డా.కిరణ్‌కుమార్. కాసింత జాగ్రత్తలు పాటిస్తే వార్ధక్యాన్ని దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు ఆయన. చర్మసమస్యలకు ఇవే కారణాలు ► అపరిమిత వాయు కాలుష్యం పలు రకాల చర్మవ్యాధులకు కారణమవుతోంది ► ముఖ్యంగా చర్మం ముడతలు రావడానికి, బట్టతల రావడానికి హేతువు ► కాలుష్యం ప్రభావం ఒంటినిండా మచ్చలు రావడానికి దోహదపడుతోంది ► చాలామంది ముప్ఫై ఏళ్లకే వెంట్రుకలు కోల్పోతున్నారు ► రకరకాల చర్మ సమస్యలు ఎక్కువగా 15 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపువారే ఎదుర్కొంటున్నారు ► చాలామంది ఆఫీసులో ఏసీ గదుల్లో పనిచేస్తారు.. బయటికొస్తే ఎండలో తిరగాలి. ఒక్కసారిగా రెండు రకాల వాతావరణాలకు హార్మోన్లు తట్టుకోలేక పోతున్నాయి. దీంతో ఎక్కువ మంది చర్మ సమస్యలు ఎదుర్కుంటున్నారు ► పోషకాహారానికి దూరం కావడం వల్ల చర్మకాంతికి అవసరమైనవి దక్కకుండా పోతున్నాయి. ► చాలామందికి సమయానికి నిద్ర ఉండదు. నైట్ డ్యూటీలు చేస్తారు. పగలంతా నిద్రపోతారు. దీంతో పలు రకాల సమస్యలు వస్తున్నాయి. ► పైన పేర్కొన్న చాలా సమస్యలు వార్ధక్యానికి (ఎర్లీ ఏజింగ్) దారి తీస్తున్నాయి. ► చాలా మంది యువతీ యువకుల ముఖాలు కళావిహీనంగా తయారవుతున్నాయి యవ్వనం జాగ్రత్తలు ► సమయానికి నిద్ర, సమయానికి తిండి అనేది చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది ► కాలుష్యం బారినుంచి కొద్దిగా అయినా ఉపశమనం పొందాలంటే బయట తిరిగే సమయంలో ముఖానికి, తలకు కాస్త స్కార్ఫ్ తదితర దుస్తులు వాడటం మంచిది ► వీలైనన్ని నీళ్లు తాగడం ద్వారా చర్మ సంరక్షణను పెంపొందించుకోవచ్చు ► ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, వ్యాయామం వంటివి చేయడం వల్ల చర్మం వర్ఛస్సు బావుంటుంది ► వీలైనంతగా ఏ సీజన్లో లభించే పండ్లు ఆ సీజన్లో తింటే వార్ధక్యం నుంచి బయటపడవచ్చు. ► వీలైనంత వరకూ జంక్‌ఫుడ్‌ను తగ్గించి ఆకుకూరలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు లభిస్తాయి. ► నిల్వ ఉన్న ఆహారం తినకపోవడం మంచిది. బేకరీ ఫుడ్స్ తరచూ తినడం మంచిది కాదు ► ఒకే ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితుల్లో పనిచేయడం వలన చర్మ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. డా.కిరణ్‌కుమార్ చర్మవ్యాధి నిపుణుడు, ఈషా హాస్పిటల్ సోమాజిగూడ -
అంకురంలోనే అంకుశం!
కొత్త కళలకు రెక్కలు తొడిగే వయసు టీనేజీది. ఈ వయసులో పరిసరాలపై గమనింపు ఎంతగా ఉంటుందో... తమ శరీరాన్ని అందంగా అలంకరించుకోవడంలో అంతే శ్రద్ధ ఉంటుంది. అయితే కొన్ని తెలిసి, కొన్ని తెలియక ఈ వయసులో అమ్మాయిలు, అబ్బాయిలు ఇబ్బందులు పడుతుంటారు. వాటిలో ప్రధానమైనవి చర్మ సౌందర్య సమస్యలు. చర్మం అంతర్గత అవయవాల ఆరోగ్యానికి అద్దంలాంటిది. చర్మం ఎంత నిగారింపుగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. సాధారణంగా 13 నుంచి 19 ఏళ్ల వయసులో పిల్లల్లో చర్మం నునుపుగా, బిగువుగా ఉంటుంది. కానీ, ఇటీవల ఈ వయసులోనూ చర్మసమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. వీరిలో ప్రధానంగా కనిపించే సమస్య మొటిమలు, యాక్నె (చర్మం పై పొరలలో గడ్డలుగా కనిపించడం). ఇవి ముఖం, మెడ, భుజాలు, వీపుపై భాగాలలో కనిపిస్తుంటాయి. అలాగే వదిలేస్తే మచ్చలు ఏర్పడతాయి. ఇవి యుక్తవయసులోనే కాదు ఒక్కోసారి జీవితాంతం వేధించవచ్చు. ఇవి గమనించండి... హార్మోన్లు... పిల్లలు యుక్తవయసుకు వచ్చేటప్పుడు వారి శరీరంలో రకరకాల మార్పులు జరుగుతుంటాయి. అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్, అమ్మాయిల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్లు కీలకమైనవి. ఈ స్రావాల అసమతౌల్యతల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ ప్రభావం మేనిపై పడుతుంది. నూనె గ్రంథుల నుంచి స్రావాలు అధికంగా వెలువడి, మొటిమలకు కారణమవుతుంటాయి. శుభ్రత లోపం... ఇంటా బయట రకరకాల కాలుష్య ప్రభావాలు చర్మం మీద పడుతుంటాయి. ఇలాంటప్పుడు సరైన శుభ్రత పాటించకపోయినా చర్మం నిగారింపు కోల్పోతుంది. చుండ్రు... ఈ వయసులో తలలో చుండ్రు అధికంగా గమనిస్తుంటాం. చుండ్రు భుజాలు, ముఖం, వీపు మీద పడటం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది మొటిమలకు కారణం అవుతుంది. మానసిక ఒత్తిడి.... ర్యాంకులు, మార్కులు, చదువు స్ట్రెస్‌తో పాటు నిద్రవేళలు సరిగా పాటించకపోవడం వల్ల ఈ వయసువారి హార్మోన్లలో తేడాలు వస్తున్నాయి. చర్మం పొడిబారడం, మలబద్ధకం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవీ మొటిమలు, యాక్నెకు కారణాలు అవుతాయి. జీవనశైలిలో తేడాలు... నేటి యాంత్రిక కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులు వాడటం పెరిగి, శరీరానికి తగినంత శ్రమ ఉండటం లేదు. దీని వల్ల హార్మోన్లలో తేడాలు వస్తున్నాయి. సమతుల ఆహారం తీసుకోకపోవడం, బేకరీ, నిల్వ పదార్థాలు తినడం ఈ వయసు పిల్లల్లో అధికం. ఆహార సమయాలలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ ఆరోగ్యంపై తద్వారా చర్మంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇవి పాటించండి...పిల్లలు వయసురీత్యా తమ విషయాలలో అశ్రద్ధ వహిస్తుంటారు. తల్లిదండ్రులే ఎదిగే వయసులో ఉన్న పిల్లల ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టాలి. ఫేస్‌వాష్ మేలు... అబ్బాయిలు, అమ్మాయిలు ... సబ్బులకు బదులుగా గ్లైకాలిక్ యాసిడ్, ఫాలిక్యులార్ యాసిడ్ వంటి ఔషధగుణాలు గల ఫేస్‌వాష్‌లను వాడాలి. మసాజ్‌లకు దూరం... యాక్నె, మొటిమల సమస్యలు ఉండటంతో చాలామంది మసాజ్‌లు చేయిస్తే ఫలితం ఉంటుందని భావిస్తారు. కానీ మసాజ్ వల్ల మొటిమలలోని పస్ ఇతర భాగాలకు చేరి, బ్యాక్టీరియా వృద్ధి చెంది, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకని మసాజ్‌లు, ఫేస్‌ప్యాక్‌లకు వీరు దూరంగా ఉండటం మేలు. క్రీములు వద్దే వద్దు... చర్మం రంగుతేలాలని చాలా మంది టీనేజ్ నుంచే ‘వెటైనింగ్ క్రీముల’ను వాడుతుంటారు. వీటి వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రకాల క్రీములు మొటిమలలోనికి చొచ్చుకుపోయి, దురద, దద్దుర్లకు కారణం అవుతాయి. రోజూ తలస్నానం... నిపుణులు సూచించిన యాంటీ డాండ్రఫ్ షాంపూతో రోజూ తలస్నానం చేయాలి. హెయిర్ స్టైల్స్‌కు వాడే జెల్స్, సీరమ్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. పైపై క్రీములతో మెరుగులు దిద్దడం కన్నా అంతర్గత ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. సమస్య ఉన్నవారు ఒకసారి నిపుణులను సంప్రదించి వదిలేయకుండా కనీసం 3-4 ఏళ్లపాటు వైద్యుల సలహాలను పాటిస్తూ ఉండాలి. ఇప్పటికే యాక్నె వల్ల మచ్చలు ఏర్పడిన వారికి విటమిన్ క్రీమ్స్, గ్లైకాలిక్ పీల్, డెర్మారోలర్.. వంటి వాటితో మచ్చలు, స్కార్స్ తగ్గించవచ్చు. - డా.షాను, చర్మ వైద్య నిపుణులు, కాయా స్కిన్ క్లినిక్ -
వేడుకలో... వెలుగు
వేడుక ఏదైనా నలుగురిలో ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు అతివలు.అందుకే డిజైనర్ దుస్తులు, అలంకరణ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.కొనుగోలులో ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటారు. తెలిసినవారిని సలహాలు అడుగుతుంటారు. అన్నీ సరిగ్గా ఉన్నా సరైన మేకప్ లేకపోతే వేడుకలో కళావిహీనంగా కనిపిస్తారు. అయితే ‘వేసవిలో మేకప్ చాలా కష్టం, ఎక్కువసేపు భరించలేం’ అనుకునేవారు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ముస్తాబైతే ఏ వేడుకలోనైనా వెలిగిపోవచ్చు. మేకప్‌కి ముందుగా: ఒక పాత్రలో మూడు టీ స్పూన్ల పాలు తీసుకొని, వేళ్లతో అద్దుకుంటూ ముఖంపై మృదువుగా మసాజ్ చేయాలి. జిడ్డు చర్మం గలవారు పాలలో సెనగపిండి కలిపి మసాజ్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకొని, మెత్తటి వస్త్రంతో తుడుచుకోవాలి. పొడిచర్మం గలవారు క్లెన్సింగ్ మిల్క్‌తో మసాజ్ చేసుకొని, శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మలినాలు తొలగిపోతాయి. నాణ్యమైన మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. మేకప్ ఇలా... ప్రైమర్: దీంట్లో ఫేస్, ఐ ప్రైమర్ విడివిడిగా ఉంటుంది. వీటిని ముఖానికి, కళ్ల కింద రాసుకోవాలి. ఫౌండేషన్: ఎస్.పి.ఎఫ్ లేని ఫౌండేషన్‌ను బ్రష్‌తో వేసుకోవాలి (వేసవి కదా అని ఎస్.పి.ఎఫ్ మేకప్‌కి ముందుగా వాడితే మేకప్ తెల్లటి ప్యాచ్‌లుగా కనిపిస్తుంది. ఫొటో ఫ్లాష్‌కి ముఖం మరింత తెల్లగా అనిపించడమే కాకుండా, ఫొటోలలో కూడా మేకప్ ప్యాచ్‌లుగా పడే అవకాశం ఉంది). కన్సీలర్: దీనిని కంటి కింది భాగంలో ఐ బ్రష్‌తో వేయాలి. కన్సీలర్కి ముందుగా ఎస్.పి.ఎఫ్ లోషన్ వాడకూడదు. బ్లష్: ఫౌండేషన్ ముఖమంతా సరిగ్గా బ్రష్‌తో వేశాక.. చెంపలు గులాబీల్లా మెరిసిపోవడానికి బ్లష్‌ను ఉపయోగించాలి. అలాగని బ్లష్ మరీ ఎక్కువగా ఉపయోగిస్తే ఎబ్బెట్టుగా కనిపిస్తారు. బ్రోంజర్: ఫొటోలలో మంచి లుక్‌తో ముఖారవిందం కనిపించాలంటే చీక్ బోన్స్ దగ్గర అంటే బుగ్గల పైభాగంలో, చుట్టూ ‘మ్యాట్ బ్రోంజర్’ వాడాలి. దీనివల్ల మేకప్ పగలు కూడా సహజమైన చర్మకాంతిలో కనిపిస్తుంది. ఇల్యుమినేటర్: చీక్ బోన్స్, ముక్కు, కళ్ల కింద, నుదురు, కణతలు... ఇలా ముఖంలో హైలైట్‌గా కనిపించే భాగాలపై లిక్విడ్ ఇల్యుమినేటర్ బ్రష్‌తో చేసుకోవాలి. కనుబొమలు: ఐ బ్రో పెన్సిల్ లేదా జెల్‌తో కనుబొమలను తీరుగా తీర్చిదిద్దుకోవాలి. ఐ షాడో: కనురెప్పల పైన లేత రంగులను షాడో బ్రష్‌తో తీర్చిదిద్దాలి. కనురెప్పలను ఒంపుగా వచ్చేలా ఐ లైనర్, మస్కారాలను ఉపయోగించాలి. పౌడర్: మేకప్ పూర్తయ్యాక టచప్ కోసం పౌడర్ని అద్దాలి. పెదవులు: లిప్ స్టెయిన్, లిప్ లైనర్, లిప్‌స్టిక్‌లతో పెదవులను అలంకరించాలి. చెక్: మేకప్ అంతా సరిగ్గా వచ్చిందా లేదా అని అద్దంలో చూసుకుంటూ, అదనంగా ఉన్న పౌడర్, ఫౌండేషన్‌ని బ్రష్‌తో తీసేయాలి. కళ్లు, పెదవుల మేకప్ తీరుగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. ఇలా వేసుకున్న మేకప్ 2 నుంచి 5 గంటల సేపు ఉంటుంది. మేకప్ కొన్ని గంటల పాటు డల్ కాకుండా ముఖం తాజాగా ఉండాలంటే మ్యాక్ స్ప్రే ఉపయోగించాలి.మేకప్ పూర్తయ్యాక ఆభరణాలను, కేశాలను, దుస్తులను నచ్చిన రీతిలో అలంకరించుకోవాలి. ఈ తరహా మేకప్ పెళ్లికూతురితో పాటు పెళ్లికి వెళ్లే అతివలకూ ఉపయోగ కరంగా ఉంటుంది. నోట్: గాడీ మేకప్ వల్ల వేసవి ఉక్కపోతలో చీకాకు కలగవచ్చు. అందుకని లైట్ మేకప్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలి. సన్‌స్క్రీన్ లోషన్ వాడేవారు... మేకప్ చేసుకునే ముందు అంటే గంట ముందు సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. సన్‌స్క్రీన్ వాడాలనుకునేవారు ఫౌండేషన్ క్రీమ్‌తో కలిపి 3-4 చుక్కలు మాత్రమే లోషన్‌ను ఉపయోగించాలి. జిడ్డు చర్మం గలవారు మేకప్‌కి ముందు రెండు చుక్కల సన్‌స్క్రీన్ లోషన్‌ని రాసుకోవచ్చు. వెంట తప్పనిసరి... మేకప్ చేసుకొని బయటకు వెళ్లేవారు ఫౌండేషన్‌ని కూడా వెంట తీసుకెళ్లడం మంచిది. వెళ్లిన చోట అవసరమైనప్పుడు కొద్దిగా టచప్ చేసుకోవచ్చు. ముఖంపై చమట, జిడ్డు చేరినప్పుడు క్లాత్‌ను ఉపయోగించకుండా టిష్యూ పేపర్‌తో అద్ది, తీసేయాలి. తరచూ మేకప్ వేసుకునేవారు... పెరుగు, సెనగపిండి కలిపి ముఖానికి మసాజ్ చేసుకొని, శుభ్రపరుచుకొని తర్వాత ఫ్రూట్ లేదా ముల్తానీ మిట్టితో ప్యాక్ వేసుకోవాలి. కలబంద (అలోవెరా) రసాన్ని ముఖానికి రాసి, మసాజ్ చేసి, శుభ్రపరుచుకొని, గుడ్డులోని తెల్లసొనతో ప్యాక్ వేసుకోవాలి. మేకప్ వల్ల వచ్చే చర్మ సమస్యలు, మొటిమలు తగ్గుతాయి. పసుపు, పాలు లేదా పసుపు, పెరుగు కలిపి ఏదైనా ఒక ప్యాక్‌ని ముఖానికి వేసుకోవాలి. - నిర్వహణ: నిర్మలారెడ్డి -
మేను హాయిలే ఇలా...
నల్లబడడం, మంటగా అనిపించడం, నిస్తేజంగా మారడం, మచ్చలు, మొటిమలు, పిగ్మేంటేషన్.. వంటివి వేసవిలో చర్మం ఎదుర్కొనే ప్రధాన సమస్యలు. మీరు వీటి నుంచి దూరంగా ఉండాలంటే దాడి చేసే వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలి. అమితమైన వేడికి తోడు అధికమైన గాలి కూడా ఈ కాలంలో చర్మాన్ని నిర్జీవం చేస్తుంది. ఫలితంగా సున్నితమైన చర్మం దెబ్బతిని, పై పొరలో మృతకణాలు ఏర్పడతాయి. స్వేదరంధ్రాలకు మృతకణాలు అడ్డుతగలడంతో అవి తగినంత సహజ నూనెలను విడుదల చేయలేవు. దీంతో చర్మం మరింత పొడిబారి త్వరగా ముడతలు పడుతుంది. ఇలాంటప్పుడే చర్మానికి సంరక్షణ అవసరం. మీది సాధారణ చర్మతత్త్వమా? మృతకణాలు టీ స్పూన్ ఓట్స్, టీ స్పూన్ బేకింగ్ సోడా, తగినంత నీళ్ళు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమంతో 2-3 నిమిషాలు ముఖాన్ని, మెడను, చేతులను మృదువుగా రుద్దాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చలికాలంలో చర్మంపై పొలుసులుగా చేరిన మృతకణాలు సులువుగా వదులుతాయి. ఈ మిశ్రమం అన్ని రకాల చర్మతత్త్వాలకు ఉపయోగపడుతుంది నిన్నమొన్నటి వరకు చలికి చర్మం పొడిబారకుండా చూసుకున్నాం. హమ్మయ్య! అనుకున్నామో లేదో... ఎండలు మొదలైపోయాయి... సూర్యుడు చండప్రచండంగా తన ప్రతాపం చూపించేస్తున్నాడు... ఆ వేడిని తట్టుకోలేక శరీరం త్వరగా అలసిపోతే... చర్మం జీవం కోల్పోతుంది... సాధారణంగా ఈ కాలం వేధించే సమస్యలు చర్మం దరిచేరకుండా చూసుకోవాలని... కాలాన్ని అను‘కూల్’గా మార్చుకోవాలనేవారి కోసమే ఈ సూచనలు మృదుత్వం టీ స్పూన్ శనగపిండి, టీ స్పూన్ నిమ్మరసం, 2-3 పుదీనా ఆకులు, పెరుగు, క్యారట్ తురుము కలిపి పేస్ట్ చేసిన మిశ్రమాన్ని చర్మానికి రాసి, వలయాకారంగా రుద్దుతూ మసాజ్ చేయాలి. ఇది చర్మంపై మలినాలను, పై మృతకణాలను తొలగిస్తుంది. ఫలితంగా చర్మం మృదువుగా అవుతుంది. తాజాదనం బొప్పాయిగుజ్జు, పైనాపిల్ గుజ్జు, ద్రాక్ష నూనె, పసుపు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మం తాజాగా కనిపిస్తుంది. మొటిమలు రెండు టేబుల్ స్పూన్ల దోసరసం, టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, గంధంపొడి, పుదీనా, తులసి ఆకులు కలిపి ముద్ద చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలలో పొడిబారిన సీబమ్ తొలగిపోతుంది. స్వేదరంధ్రాలు శుభ్రపడటం వల్ల ఇన్ఫెక్షన్కు కారణమైన బ్యాక్టీరియా నశించి, మొటిమల సమస్య తగ్గుతుంది. సహజమే మేలు వేసవిలో చర్మానికి బ్లీచింగ్, క్లెన్సింగ్, స్క్రబ్బింగ్ తప్పక అవసరం అవుతాయి. అయితే ఇందుకు రసాయన ఉత్పత్తులకు బదులు సహజసిద్ధమైన ఉత్పాదనల్ని ఎంచుకోవాలి. నోట్: అలోవెరా ఆకును తుంచి, దాన్నుంచి వచ్చిన రసానికి రోజ్‌వాటర్ కలిపి చర్మంపై మృదువుగా మసాజ్ చేస్తూ ఉంటే ఎండ కారణంగా నల్లబడిన చర్మానికి సహజకాంతి వస్తుంది. దురద, దద్దుర్లు వంటి సమస్యలు తగ్గుతాయి. మీది జిడ్డుచర్మమా? జిడ్డుచర్మం గలవారికి వేసవి మరింత పరీక్ష పెడుతుంది. చమట అధికమై బయటి దుమ్ము, ధూళి చేరి చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. నివారణకు... ఫేసియల్ బ్లీచ్: 4 టేబుల్స్పూన్ల పాలు, టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్స్పూన్ల నిమ్మరసం కలిపి చర్మం కమిలి నల్లబడిన చోట రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెరుగుతో క్లెన్సర్: 4 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల తేనె, 3 టేబుల్ సూన్ల నిమ్మరసం వేసి చిక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 2-3 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వేపతో నివారణ: వేప ఆకుల ముద్ద, నారింజ తొనల ముద్ద సమానపాళ్లలో తీసుకోవాలి. దీంట్లో చందనం, ముల్తానీమిట్టి, తేనె, నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. నారింజ రసం: టీ స్పూన్ నారింజ రసం, 3 టీ స్పూన్ల ఓట్స్, టీ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన లేదా పెరుగు ఓ టీ స్పూన్ కలిపి ముఖానికి పట్టించి, వలయాకారంగా 5 నిమిషాల సేపు స్క్రబ్ చేయాలి. తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. బియ్యప్పిండి: మూడు టీ స్పూన్ల బియ్యప్పిండి, చిటికెడు పసుపు, టీ స్పూన్ తేనె, దోస రసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. మేనికి కూడా ఇది మేలైన ప్యాక్. మీది పొడిచర్మమా? చలికాలంలో చర్మం పొరలలో ఏర్పడిన ఇతర సమస్యలు వేసవిలో బయటపడుతుంటాయి. అయితే జిడ్డు చర్మం కన్నా పొడిచర్మాన్ని వేసవిలో సులువుగా సంరక్షించుకోవచ్చు. ఎండ నుంచి రక్షణగా... పొడిచర్మం కాబట్టి ఎస్.పి.ఎఫ్ 30 గల మాయిశ్చరైజర్‌ను, సన్‌స్క్రీన్ లోషన్ ను ఉపయోగించడం మేలు. పెదవులపై చర్మం పొడిబారడం, పగుళ్ల సమస్యలకు నివారణగా ఎస్.పి.ఎఫ్ 30 ఉన్న లిప్‌బామ్‌ను ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత విటమిన్ ‘ఇ’ ఉన్న మాయిశ్చరైజర్‌ను వాడాలి. జీవకాంతికి ఎండాకాలంలో చర్మం పైపూతలకు కాకుండా లోపలి పొరలు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తపడాలి. పగటి పూట నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం సహజమైన నూనెలను విడుదల చేస్తుంది. శరీరబరువును బట్టి నీటిని సేవించాలి. ఉదా: మీ శరీర బరువు 50 కేజీలు అయితే, 5 లీటర్ల నీరు తాగాలి. మద్యం ఉత్పాదనలు వద్దు ఆల్కహాల్‌ని సౌందర్య ఉత్పాదనలలో సువాసనల కోసం ఉపయోగిస్తారు. పొడి చర్మం గలవారు ఆల్కహాల్ ఉత్పాదనలు వాడితే చర్మం మరింత పొడిబారుతుంది. ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు లేబుల్‌పై ఇచ్చిన జాబితాలో ‘ఆల్కహాల్’ లేనిది చూసి మాత్రమే కొనుగోలు చేయాలి. ఈత కొలనులలో కలిపే క్లోరిన్ వల్ల చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి. ఈత పూర్తయిన తర్వాత మరొకసారి మంచినీటితో స్నానం చేసి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఏసీ చల్లదనమా?! వేసవిలో చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్ల వాడకం ఎక్కువ. అయితే ఇవి ఉత్పత్తి చేసే చల్లని గాలులు చర్మంపై సహజసిద్ధమైన తేమను లాగేసి, పొడిబారుస్తాయి. మీ చర్మం సురక్షితంగా ఉండాలంటే గాలిలో తేమ తగ్గకుండా వారానికి ఒకసారి ఇంటిలో నీటిని స్ప్రే చేయాలి.